నిమి శాపం, చంద్రవంశ ఆవిర్భావం మరియు పురూరవ-ఊర్వశి కథ

Nimi's Curse, Lunar Dynasty Origins & Pururavas-Urvashi Tale

ఈ ప్రవచనంలో నిమి రాజు వశిష్టుని అనుమతి లేకుండా యజ్ఞం చేయడంతో శాపానికి గురై విదేహుడైన కథ వివరించబడింది; నిమి శరీరాన్ని మధించగా జనకుడు జన్మించి మిథిలా నగరాన్ని స్థాపించాడు. తరువాత చంద్రవంశ ఆవిర్భావం వర్ణించబడింది — బ్రహ్మ నుండి అత్రి, అత్రి నేత్రముల నుండి చంద్రుడు జన్మించాడు; చంద్రుడు బృహస్పతి భార్య తారను అపహరించడంతో దేవాసుర యుద్ధం జరిగి తారకు బుధుడు జన్మించాడు. బుధుని కుమారుడు పురూరవుడు ఊర్వశితో కలిసి జీవించిన కథ, గంధర్వుల మాయతో ఆమె అంతర్ధానమైన సంఘటన, మరియు పురూరవుడు అరణులతో అగ్నిని మధించి యజ్ఞేశుడగు శ్రీహరిని ఆరాధించిన విషయాలు వివరించబడ్డాయి.

This discourse covers the story of King Nimi, who was cursed by Vasishtha to become bodiless (Videha) after performing a yajna without waiting for him; from Nimi's churned body arose Janaka, founder of Mithila. The session then transitions to the Lunar dynasty, tracing its origin from Brahma through Atri to the Moon god Chandra, whose abduction of Brihaspati's wife Tara caused a great war between gods and demons. The birth of Budha from Tara and Chandra is described, followed by the romantic tale of Pururavas and the celestial nymph Urvashi, including her conditions, the gandharvas' trick, and their eventual separation. Urvashi's sharp words about the fickleness of women and Pururavas's subsequent discovery of fire through churning with two arani sticks are also narrated.

About this series

ఈ శ్రేణిలో శ్రీమద్భాగవతం నవమ స్కంధంలోని వైవస్వత మను వంశం, సూర్యవంశం, చంద్రవంశం మరియు అంబరీష, హరిశ్చంద్ర వంటి మహాభక్తుల దివ్య గాథలు వివరించబడ్డాయి. సుకన్య, సౌభరి, పురూరవ-ఊర్వశి కథలు, గంగావతరణం మరియు శ్రీరాముని లీలలు కూడా చర్చించబడ్డాయి. ఈ ప్రవచనాలు తత్త్వదీపిక శ్రేణిలో భాగంగా తెలుగులో అందించబడ్డాయి.

This series explores the Ninth Canto (Navama Skandha) of Srimad Bhagavatam, covering the lineages and divine stories of Vaivasvata Manu, the Solar and Lunar dynasties, and great devotees like Ambarisha and Harishchandra. Episodes include the tales of Sukanya, Saubhari, Pururavas-Urvashi, the descent of Ganga, and Sri Rama's divine leelas. Delivered in Telugu as part of the Tatwa Deepika discourse series on Pravachanam.

← Prev Next →
Nimi's Curse, Lunar Dynasty Origins & Pururavas-Urvashi Tale

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః న తథారిపూర్ణ శస్త్రం నాగ్నిర్న విషం న దారుణో వ్యాధిహి పరితాపయతి చ పురుషం యథా కటుక భాషిణీ వాణి. శత్రువులు కానీ, శస్త్రాలు కానీ, నిప్పు కానీ, తిరుగులేని రోగం కానీ కటువైన మాటలు మనిషిని బాధించినట్టు బాధించలేవు. ఆర్యోక్తి 13th. భగత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక నవమ స్కంధము ఎనిమిదో పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు సుకన్య చరిత్ర, అంబరీష పాఖ్యానం, సత్యహరిచంద్ర చరిత్ర ఇక్ష్వాకు వంశంలో భాగంగా, సగరుడి యొక్క చరిత్ర, ఖట్వాంగుడు చరిత్ర, తరువాత సంపూర్ణంగా, సంగ్రహంగా. రాముల శ్రీరామ అవతార చరిత్ర పూర్తి చేసుకుని మనం ముందు భాగం వెళుతున్నాం. ఇక్ష్వాకు కుమారుడు నిమి ఒకప్పుడు సత్రయాగం ప్రారంభించి వశిష్టుని ఋత్విక్కుగా వరించెను. అంతకంటే ముందుగానే ఇంద్రుడు వశిష్టుని ఋత్విక్కుగా వరించుటచే ఇంద్రుని యాగము చేయించి వచ్చువరకు నిరీక్షింపుము అని చెప్పి ఇంద్రుని యాగము పూర్తి చేయించెను. అంతలో నిమి జీవితము చంచలమైనది వశిష్టుడు వచ్చే వరకు వేచి ఉండిన జీవించి ఉందునో లేదో అని మరికొందరు ఋత్విక్కులచే యజ్ఞము చేయించుకొనెను. నా ఆజ్ఞను మీరి నీవే తెలివైన వాడనని అహంకారముతో యజ్ఞము చేయించితివి కనుక నీ దేహము పోయి విదేహుడు అవుదువు గాక అని వశిష్టుడు నిమిని శపించెను. నిమి కూడా గురువునకు ప్రతిష్టాపం ఇచ్చెను. ఆ ప్రతిష్టాపముచే వశిష్టుడు కూడా విదేహుడాయెను. నిమి తన దేహమును వీడెను. వశిష్టుడు ఊర్వశిని చూచి రేతస్ఖలనము జరిగిన మిత్రావరణులకు కుమారుడుగా జన్మించెను. ముని శ్రేష్టులు నిమి శరీరమును పరిమళ ద్రవ్యములు చేర్చిన తైలములో నుంచి సత్రయాగమునకు వచ్చిన దేవతలను మీరు అనుగ్రహించి ఈ నిమి యొక్క శరీరమును మరల జీవించునట్లు చేయుము ఈ దేహం మరల జీవించుగాక అని ప్రార్థించిరి.

కానీ నిమి మరల దేహముతో ఉండుటకు అంగీకరించలేదు. దేహం ఎప్పుడైనను వీడిపోవునదే కనుక. దానితో సంబంధమును మునులు కాంక్షింపరు. శరీర సంబంధము దుఃఖమును, మోహమును కలిగించునది. అట్టి దేహము నాకు వలదనెను. అప్పుడు దేవతలు నిమిదేహము లేనివాడై సూక్ష్మ దేహముతో నుండుగాక. రెప్పలు విప్పుట ముడుచుటలో అతడు గుర్తింపబడును గాక అని నిమికి దేహ సంబంధము లేకుండా చేసిరి. రాజు లేక లోకము చెడునని మహర్షులు నిమి దేహమును మధించిరి. దాని నుండి కుమారుడు కలిగెను. ఆ కుమారునకు విచిత్రముగా జన్మించినాడు కనుక జనకుడు అనియు మధించుడు జన్మించినాడు కనుక మిథిలుడు అనియు జీవుడు లేని దేహము నుండి జన్మించినాడు కనుక విదేహుడు అనియు పేర్లు కలిగెను. అతడు నిర్మించిన పట్టణము మిథిల అను పేరుతో వ్యవహరింపబడెను. ఈ విధముగా నిమి వంశము మహా జ్ఞానులతో సాగినది. వారందరూ గృహస్తులై ఉండియు ఆధ్యాత్మిక విద్య యందు ఆరితేరిన వారై ఉండిరి. ఇంతవరకు సూర్యవంశం వర్ణింపబడినది. ఇక చంద్రవంశను వర్ణించుచున్నారు. సహస్ర శిరస్సులు గల అనిరుద్ధ రూపియగు పరమపురుషుని నాభి యందు జగత్పద్మము ఆవిర్భవించినది. దాని యందు చతుర్ముఖుడు ఆవిర్భవించెను. అతని కుమారుడు అత్రి. ఆ అత్రి నేత్రముల నుండి చంద్రుడు జన్మించినాడు. అతనికి విప్రులపై, ఔషధులపై, నీటిలో పుట్టు పుష్పములపై ఆధిపత్యము కల్పించబడెను. ఆ సోముడు మూడు లోకములను జయించి రాజసూయము చేసి బలదర్పముతో బృహస్పతి భార్య తారను బలాత్కరముగా హరించెను. దేవగురువు సోముని తన భార్యను తనకు వసంగుమని చాలాసార్లు ప్రార్థించెను. కానీ సోముడు తారను వదలలేదు. దానితో దేవతలకు దానవులకు వైరం ఏర్పడెను. బృహస్పతి పైనున్న పగచే శుక్రాచార్యుడు సోముని పక్షం వహించెను.

ఇంద్రుడు దేవగణములతో గురువును ఆశ్రయించెను. అప్పుడు దేవాసురులకు తార కారణముగా యుద్ధము జరిగెను. అప్పుడు అంగీరసులు ప్రార్థింపగా బ్రహ్మ తారను మరల బృహస్పతి కోసంగమని సోమునకు చెప్పెను. కానీ ఆ సమయమునకు తార గర్భవతి అయి ఉన్నది. అప్పుడు బృహస్పతి గర్భమును విడిచి రమ్మనెను. సిగ్గుపడి సంతానమును వదలివేసెను. కానీ ఆ కుమారుని సోముడు బృహస్పతి కూడా తమ తమ కుమారునిగా అభిమానించి వివాదపడిరి. ఋషులు ఆ కుమారుడికి కుమారుడు ఎవరికి చెందినాడో చెప్పమని ఆమెను కోరిరి. ఆమె సిగ్గుచే చెప్పజాలకపోయెను. కుమారుడు కూడా నేను ఎవరి కుమారుడను అని తల్లిని అడిగెను. ఆమె సిగ్గుచే చెప్పక ఊరకుండెను. బ్రహ్మ రహస్యముగా ఆమెను పిలిచి ఓదారించి కుమారుడు ఎవరికి చెందినాడో చెప్పమనెను. ఆమె మెల్లగా చంద్రుడికే చెందినాడని చెప్పెను. అప్పుడు చంద్రుడు ఆ కుమారుని స్వీకరించెను. బ్రహ్మ వానికి బుధుడు అని నామకరణము చేసెను. బుధునకు ఇళ అను భార్య యందు పురూరవుడు జన్మించెను. ఆ పురూరవుని రూపమును గుణములను విని ఊర్వశి దేవలోకము నుండి వచ్చి పురూరవుని చేరెను. మిత్రావరుణుల శాపముచే ఆమె మనుష్య భావమును పొందెను. పురురవుడు ఆమెను చూచి సౌందర్యమునకు పరవశించి స్వాగతము నాతో కలిసి ఉండుము శాశ్వతముగా ఆనందమును అనుభవింతము నీ వంటి సౌందర్య రాశిని చూచి ఎవరి మనసు దృష్టి ఆకర్షింపబడవు అనెను అప్పుడు ఊర్వశి సుందరా నీ రూపమును చూచి ఎవరు వేరొక రూపమును కాంక్షింపగలరు ఈ రెండు పొట్టేళ్ళను నేను పుత్రులతో సమానముగా ప్రేమించుచున్నాను వాని నీ వద్ద న్యాసముగా ఉంచెదను వాని నీవు కాపాడుచుండవలెను వీనిని నీవు కాపాడుచున్నంత కాలము నీతోనే రమించుచుందును. నీవెన్నడూను నగ్నముగా నా కంట పడరాదు. నగ్నముగా నా కంట పడినచో నిన్ను వదిలి వెళ్ళెదను. ఇట్లు చెప్పిన మాటలను సమ్మతించి పురూరవుడు ఆమెతో కలిసి ఆనందించుచుండెను. దేవలోకము నుండి దిగి వచ్చి మనుజ రూపమున పురూరవుతో ఆమె వివరించుచుండెను. ఆనందముతో చాలా సంవత్సరములు గడిచెను.

ఇంద్రుడు భూలోకము నుండి ఊర్వశిని తెచ్చుటకు గంధర్వులను పంపెను. ఊర్వశి లేని దేవ సభ శోభించుట లేదని ఎటులైనను ఊర్వశిని తేవలెనని గంధర్వును ఆజ్ఞాపింపగా వారు గాఢాంధకారము ఆవరించిన ఒక అర్ధరాత్రి సమయమున వచ్చి పురువని వద్ద వద్ద ఊర్వశి న్యాసముగా ఉంచిన పొట్టేలు రెండింటినీ మాయతో అపహరించిరి. పొట్టేళ్ళు అరిచినవి. ఆ అరుపును విని ఊర్వశి వీరుడు అనుకొనుచున్న నపుంసకుడగు ఈ నాథునిచే నేను మోసపోతిని. ఇతన్ని నమ్మి నేను చెడిపోతిని. రాత్రి వేళ భయపడి బయలు పడలేక పరుండిన ఆ ఈ పిరికి పంద నా బిడ్డను కాపాడలేకపోయినాడు. నన్ను విడిచిపెట్టుము. నన్ను స్పృశింపకుము అని ఊర్వశి పలికెను. పలుకులు ములుకుల వలె సోకగా ఆమెతో భోగమును అనుభవించుచున్న పురూరవుడు అర్ధరాత్రమున వస్త్రము లేదని గుర్తింపక కోపముతో వెలుపలికి వచ్చెను. అతడు కత్తి పట్టుకొని వెలుపలికి రాగానే ఆమె కూడా వెలుపలికి వచ్చెను. మెరుపు మరిసెను. నగ్నముగా ఉన్న పురురవుని చూచెను. గంధర్వులు పొట్టేళ్ళను వదిలిపోయిరి. ఊర్వశి అంతర్ధానమాయెను. పురురవుడు ఆమెను కానక విరహ శోకముతో అడవుల పడి పరువులెత్తెను. అప్పుడు ఊర్వశి అతనితో ఇట్లు పలికెను. నీవు ప్రతిజ్ఞను నిలుపుకొనలేకపోతివి. ధైర్యముతోనుండుము. స్త్రీలతో చెలిమి అస్థిరము. తోడేళ్లతో చెలిమి చేసుకునెను సంతతము. వాని వలన కలుగు ఉపద్రవమును శంకించుచునే ఉండునట్లు స్త్రీలతో మెలగవలెను. స్త్రీలకు జాలి ఉండదు. వారి స్వభావము క్రూరము. క్షమాగుణము తక్కువ. సాహసమైన కార్యములకు జంకరు. సల్పమైన నిమిత్తముచే కూడా తనను ప్రేమించిన భర్తనైనను సోదరునైనను విడుచుటకు ఆలోచింపరు. చంపుటకు కూడా జంకరు. పురుషులను మరిగిన స్త్రీలు స్వేచ్ఛా ప్రవృత్తికి అలవడిన స్త్రీలు కృత్రిమముగా స్నేహమును నటింతురు. వారిని వదలి క్రొత్తవారిని చేరుచుందురు. సంవత్సరమునకు ఒక రాత్రి నాతో కలిసి యుందువు. అప్పుడు మనకు సంతానము కలుగును అనెను. అప్పుడు ఆమె గర్భవతిగా నున్నట్లు అతడు గుర్తించెను. సంవత్సరాంతమున ఆమె కుమారుని తీసుకుని మరల వచ్చెను.

పురూరవుడు ఆమెతో ఒక రాత్రి సుఖముగా ఉండెను. ఆమె నీవీ గంధర్వులను స్తుతింపుము. వారు మా లోకమునకు చేరెడి సాధనము చెప్పెదరు అనెను. ఊర్వశి చెప్పిన ప్రకారము అతడు గంధర్వులను స్తుతించెను. వారు అతనికి అగ్నిస్థాలిని వసంగిరి. దానిని ఊర్వశి ప్రాప్తి సాధనముగా వారు వసంగిరి. కానీ పురూరవుడు దాని గుర్తించలేక ఆ వనముననే వదిలి ఇంటికి వెళ్లలెను. తరువాత త్రేతాయుగ ప్రారంభమున పురూరవుని మనసున వేదము ప్రాదుర్భవించెను. అతడు అగ్నిస్థాలి వదిలిన వదిలిన చోటికి ఏగెను. అప్పుడు జమ్మి చెట్టు నుండి పుట్టిన రావి చెట్టును చూచి తన మనసున భాసించిన వేదములచే ఆ శమీ గర్భయగు అశ్వత్థముచే అరుణులను రెండింటినీ నిర్మించెను. ఆ రెండు అరణులతో మధన మంత్రమును ఉచ్చరించుచు మధించుట ఆరంభించెను. అడుగు అరణిని ఊర్వశిగా, పై అరణిని పురూరవరిగా భావించెను. వాని మధ్యలో సంతతిని భావించెను. ఈ విధముగా ధ్యానము చేయుచు మధించగా వాని నుండి అగ్ని పుట్టినది. ఆ అగ్ని పురూరవునకు పుణ్యలోకములను కలిగించునది అగుటచే పుత్రుడిగా భావించెను. ఆ అగ్ని యందు ఊర్వశి లోకమును కోరుచు యజ్ఞేశుడగు శ్రీహరిని ఆరాధించెను. ఇంతవరకు మనం పురూరవుడు నిమి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. చంద్రవంశం యొక్క వృత్తాంతం కూడా కొంత భాగం చదువుకున్నాం. ముందు వెళ్లి వేరే అవతారాల యొక్క విషయాలు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Not only that, but also the complete weapon, the poison of the snake, and the terrible disease, which afflicts man, just as a sharp-tongued woman. Enemies, weapons, fire, or an incurable disease cannot hurt a person as much as bitter words do. Aarooki 13th. Devotees of Bhagavat, welcome to the eighth episode of the ninth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, Sukanya Charitra, Ambarisha Pakhyanam, Satyaharichandra Charitra, as part of the Ikshvaku dynasty, the history of Sagarudu, the history of Khatvangudu, then completely, in summary. We are moving forward after completing the story of Rama's incarnation as Sri Rama. Ikshvaku's son Nimi once started a Satrajit Yaga and became a Ritviks to Vasishta. Before that, Indra, having chosen Vasishta as the priest, said, "Wait until Indra's Yagam is completed," and had Indra's Yagam completed. Meanwhile, Nimi's life is unstable. Will it live or not until Vasishta arrives And some others had a yajna performed by the ritvik. Because you, who disobeyed my command and, with arrogance, performed the Yagnya (sacrificial ritual), your body will be destroyed and you will become Videhu (a form of reincarnation), so Vasishta cursed Nini. Nimi also gave the consecration to the Guru. Vashishta too was pleased with the consecration. Nimi gave up his body. Vasishta, seeing Urvashi, was born as a son to the friends who had experienced semen ejaculation. The best of sages prayed, "Grant the gods who came to the Satrai Yagam from the oil mixed with perfumes to the body of this Nimi, and make this body live again. May this body live again," they prayed.

But Nimi did not agree to be with the body again. The body is mortal, after all. The Munis do not desire any association with it. The body is the source of sorrow and delusion. Such a body is not for me, he said. Then the gods, being without a body, may be with a subtle body. May he be recognized in the opening and closing of the eyelids, so that he may be distinguished, and they made without any bodily connection. The sages, believing that without a king, the world would be ruined, consumed the body. From it, a son was born. Because he was born strangely to that son, he was named Janakudu, and because he was born Madhuchududu, he was named Mithiludu, and because he was born from a body without life, he was named Videhudu. The city he built was called Mithila. In this way, the Nimi dynasty continued with great scholars. They were all householders, skilled in spiritual knowledge. Up to this point, the solar dynasty has been described. Now describing the Chandravansa. The lotus of the universe is in the navel of the Supreme Being, the embodiment of Aniruddha, who has a thousand heads It manifested. In it, the four-faced one manifested. His son was Atri. The moon was born from the lotus-like eyes of Atri. He was given dominion over the vipra, the aushira, and the mrugachha. That Somudu, having conquered three worlds, performed Rajasuyam and, with strength, forcibly abducted Brihaspati's wife, Tara. The divine sage Somu prayed to his wife many times to be his wife. But Somudu refused to let Tara. With that, enmity arose between the gods and the demons. Shukracharya, who was angry with Brihaspati, sided with Somu.

Indra took refuge in the Guru along with the celestials. Then, a war broke out between the Devas and the Asuras because of the star. Then Angiras prayed, and Brahma told Somu again for Brihaspati. But at that time, Tara was pregnant. Then Brihaspati told him to leave his womb. Ashamed, she bared her breasts. But Somudu and Brihaspati also admired and quarreled as their own sons. The sages asked her to tell who was the son of whom. She was too shy to say anything. The son also asked his mother who her son was. She was shy and didn't want to talk. Brahma secretly called her, consoled her, and asked her to tell who her son belonged to. She said that he slowly became attached to the moon. Then the moon accepted the son. Brahma named the son Budha. Pururava was born to Ila, the wife of Budhuna. Hearing the form and qualities of that Pururava, Urvashi came from the heavens and reached Pururava. Mitravarunila By the curse, she was transformed into a man. Pururava, seeing her, was fascinated by her beauty and said, "Welcome, be with me, we will experience eternal bliss. Whose mind will not be attracted by seeing a beauty like you?" Then Urvasi Sundara, seeing your form Who can desire another form? I love these two rams equally with my sons. I will keep them with you as a gift. You must protect them. As long as you protect them, they will enjoy with you. You never got naked and touched me. If I see you naked, I will leave you. Pooruravudu, agreeing with what was said, was enjoying himself with her. She descended from the heavens and, in the form of a human, was explaining to Pururava. Many years passed in joyful moments.

Indra sent the Gandharvas to bring Urvashi from the earthly world. When the gods' assembly was not adorned without Urvasi, the Gandharvas were ordered to bring Urvasi. They came at a midnight time covered in deep darkness and with the potter's belly placed near Puruva, both the potter's belly and the pot They kidnapped. The stomachs have writen. Hearing that cry, Urvasi, thinking that the hero was a eunuch, I was deceived by this lord. I was so scared of him. At night, being afraid, unable to go out, that cowardly fellow could not save his child. Let me go. Urvashi told him not to touch her. As the words spread like rumors, Pururava, who was enjoying a meal with her, came out in anger, not realizing that he had no clothes in the middle of the night. As soon as he came out holding a knife, she also came out. The lightning flashed. He saw the naked Pururava. The Gandharvas had left their goats. Urvashi disappears. Pururavudu, not seeing her, fell into the forest with the grief of separation His honor was at stake. Then Urvasi spoke to him thus. You have failed to keep your promise. Be brave. Friendship with women is unstable. He made a covenant with the wolves forever. One should behave with women in such a way that one does not doubt the calamity caused by him. Women can't be hypocrites. Their nature is cruel. Kindness is less. Of adventure. Even for a trivial cause, do not hesitate to abandon your husband or brother who loves you. They don't even bother to kill. Women who are intoxicated by men, women who are accustomed to free behavior, artificially pretend to be friends. They will leave the old ones and reach the new ones. One night a year, you'll be with me. Then we will have children, he said. Then he discovered that she was pregnant. At the end of the year, she brought her son back.

Pururava spent the night with her. Praise be to God, the celestial Gandharvas. They will tell the means to reach our world, he said. As Urvashi had said, he praised the Gandharvas. They called him Agnisthalini Vamsigari. They called it the attainment of Urvasi. But Pururava, unable to recognize it, left the forest and went home. Then, at the beginning of the Treta Yuga, the Vedas manifested in Pururava's mind. He went to the place where Agnisthali had left. Then, seeing the banyan tree born from the Jammi tree, he built both the Arunis from the Ashwatthamu, which was the Vedas that shone in his mind. With those two forests, he began to chant the mantra, chanting. He considered the lower forest as Urvashi and the upper forest as Pururavi. He considered the offspring in between. In this way, while meditating and chanting, fire was born from him. That fire, being the one that bestows sacred worlds upon Pururava, was considered as his son. In that fire, Urvashi, desiring the world He worshipped the divine Sri Hara, who is identified with Yagneshwara. Until now, we have learned the story of Pururavudu Nimi. We also read a part of the Chandravansh story. Let's go ahead and learn about the different avatars. Jai Srimannarayana Asmat Gurubhyo Namaha