యయాతి చరిత్ర: విషయ భోగముల నిరర్థకత (స్కంధం 9, భాగం 10)

Yayati's Story: The Futility of Sensual Pleasures (Canto 9, Ep 10)

ఈ భాగంలో చంద్రవంశమున యయాతి చరిత్ర వివరించబడింది. దేవయాని, శర్మిష్ఠలతో వివాహం, శుక్రాచార్యుని శాపం, పురువు నుండి యవ్వనం పొందడం వంటి సంఘటనలు వర్ణించబడ్డాయి. వెయ్యి సంవత్సరాలు విషయ భోగాలు అనుభవించినా తృప్తి కలగలేదని యయాతి గుర్తించాడు. పొట్టేలు కథ ద్వారా కోరికలు అనుభవించినంత మాత్రాన తీరవని, పెరుగుతూనే ఉంటాయని బోధించాడు. చివరకు యయాతి పురువుకు యవ్వనం తిరిగిచ్చి వనమునకేగి వాసుదేవుని యందు మనసు నిలిపి మోక్షమును పొందాడు.

This episode narrates the story of Yayati from the Chandravamsha, covering his marriages to Devayani and Sharmishtha, and the curse of old age placed on him by Shukracharya. Yayati borrows youth from his son Puru to enjoy worldly pleasures for a thousand years, yet remains unsatisfied. He ultimately realizes through a parable of a ram that sensual desires only grow with indulgence and can never be quenched. Renouncing all attachments, he returns Puru's youth, crowns him king, and retires to the forest to meditate on Vasudeva. Devayani too attains liberation by recognizing the transient nature of worldly bonds.

About this series

ఈ శ్రేణిలో శ్రీమద్భాగవతం నవమ స్కంధంలోని వైవస్వత మను వంశం, సూర్యవంశం, చంద్రవంశం మరియు అంబరీష, హరిశ్చంద్ర వంటి మహాభక్తుల దివ్య గాథలు వివరించబడ్డాయి. సుకన్య, సౌభరి, పురూరవ-ఊర్వశి కథలు, గంగావతరణం మరియు శ్రీరాముని లీలలు కూడా చర్చించబడ్డాయి. ఈ ప్రవచనాలు తత్త్వదీపిక శ్రేణిలో భాగంగా తెలుగులో అందించబడ్డాయి.

This series explores the Ninth Canto (Navama Skandha) of Srimad Bhagavatam, covering the lineages and divine stories of Vaivasvata Manu, the Solar and Lunar dynasties, and great devotees like Ambarisha and Harishchandra. Episodes include the tales of Sukanya, Saubhari, Pururavas-Urvashi, the descent of Ganga, and Sri Rama's divine leelas. Delivered in Telugu as part of the Tatwa Deepika discourse series on Pravachanam.

← Prev Next →
Yayati's Story: The Futility of Sensual Pleasures (Canto 9, Ep 10)

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః దివసకరః కిలతీక్ష్ణో దివసకరాత్ పావకో మహాతీక్ష్ణః దివసకర పావకాభ్యాం దుర్జన వచనాని తీక్ష్ణాణి సూర్యుడు చాలా తీక్ష్ణంగా ఉంటాడు. ఇంకా తీక్ష్ణంగా ఉంటుంది అగ్ని. ఆ సూర్యుని కంటే ఈ అగ్ని కంటే కూడా తీక్షణంగా ఉంటాయి దుర్జనుల పలుకులు. ఆర్యోక్తి 15th. భగద్వందులారా శ్రీమద్భాగవత తత్వదీపిక నవమ స్కంధము 10వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు అంబరీశ్వర పాఖ్యానము, సుకన్య చరిత్ర, ఇక్ష్వాక్ వంశ చరిత్రము, చంద్రవంశ చరిత్ర, కొంత భాగము, పరశురాముని యొక్క చరిత్ర. పూర్తి చేసుకొని మనం ఇప్పుడు యయాతి చరిత్రలో అడుగు పెడుతున్నాం. శ్రద్ధగా లక్కిద్దాం. ఆ వంశమున అంటే ఆ చంద్రవంశమున నహుషునకు ఆరుగురు కుమారులు కలిగిరి. అందు యయాతి తండ్రి తరువాత రాజాయెను. అతడు దేవయాని, శర్మిష్ట అను ఇద్దరు భార్యలతో రాజ్యమును పాలించెను. దానవ రాజగు వృషపర్వునకు పురోహితుడు శుక్రాచార్యుడు. వృషభర్వుని కుమార్తె శర్మిష్ట. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఒకనాడు శర్మిష్ట దేవయానితో కలిసి వెయ్యి మంది చెలికత్తెలతో ఉద్యానవనమునకేగి జలక్రీడకు సరస్సున దిగెను. చీరలు ఒడ్డున ఉంచిరి. ఆ సమయమున పరమశివుడు పార్వతితో వృషభ వాహనమును అధిరోహించి ఏగుచుండగా సిగ్గుతో తొందర తొందరగా ఒడ్డుకు వచ్చి వస్త్రములు ధరించిరి. శర్మిష్ట తొందరలో పొరపాటున దేవయాని చీర తనదనుకొని ధరించెను. దేవయాని ఆగ్రహించి బ్రాహ్మణి కన్య ధరించు వస్త్రమును నీవు ధరించుట నగదు. యజ్ఞమున పురోడాశమును శునకము స్పృశించినట్లుగా నా చీరను స్పృశించి అపవిత్రము చేసితివి. మా వంశము శ్రేష్టమైనది. నా తండ్రి శుక్రునకు మీ తండ్రి శిష్యుడు. అతడు అసురుడు.

నా వస్త్రమును అపవిత్రము చేసితివి అని నిందుంచుట విని శర్మిష్ట ఓర్వలేక భోజనము లేక మా ఇంట చేరిన మీకింతటి అహంకారమా అని కోపగించుకొని ఆమె వస్త్రమును లావుకొని దేవయానిని నూతిలో పడద్రోసి చెరులతో ఇంటికేగెను. ఏయాతి వేటకై వచ్చి దప్పిక చేయ నీటి కొరకు ఆ నూతి వద్దకు వచ్చెను. నూతిలో ఆమెను చూచి తన ఉత్తరీయమును ఆమెకు ధరించుటకిచ్చి తన చేతిని ఆలంబనముగా ఇచ్చి ఆమెను వెలికి తీసెను. ఆమె రాజా అనుకొనకుండా నీవు నా ప్రాణిని పాణిని గ్రహించితివి కనుక మరొకరు నా పాణిని గ్రహించుటకు సమ్మతించారు దైవము నీ పాణిగ్రహణమును లభింపచేసినది నేను బ్రాహ్మణ కన్యక కన్యకనైనను నీవే నన్ను స్వీకరించవలెను అని ప్రార్థించెను కచుడు ఇచ్చిన శాపము కూడా అప్పుడు జ్ఞాపకం వచ్చెను. బృహస్పతి కుమారుడు కచుడు. దేవతలకు శుక్రుని నుండి మృత సంజీవిని విద్యను గ్రహించుట గ్రహించుటకు అతడు శుక్రుని శిష్యులలో చేరి ఉండెను. తాను దేవగురువు కుమారుడనని తెలియకుండా రహస్యముగా ఉండి ఆ విద్యను గ్రహించెను. అప్పుడు దేవయాని కచుని భర్తగా వరించెను. నువ్వు గురుపుత్రివి నేను స్వీకరింపరాదని అతడు తిరస్కరించెను. దేవయాని కోపం వచ్చి నీ విద్య ఫలింపకుండు గాక అని శపించెను. అతడు బ్రాహ్మణుడు నీకు భర్త కాకుండు గాక అని ప్రతిశ్రాపించెను. ఆ శాపమును బట్టి దేవయాని క్షత్రియుడగు యయాతిని భర్తగా కోరినది. దైవోపహతమగు ఆ సంబంధమును అశాస్త్రీయమని ఎరింగియు యయాతి అంగీకరించెను. యయాతి వెడలిపోయిన తరువాత శర్మిష్ట పలికిన దుర్వాక్యములను దేవయాని తన తండ్రికి ఎరింగించెను. శుక్రాచార్యుడు కోపగించి పౌరోహిత్యమును వదిలి తన కుమార్తెతో పట్టణమును వదిలిపోయెను. వృషపర్వుడు ఈ విషయమును ఎరింగి గురువు పాదములపై పడి ప్రార్థించెను. అప్పుడు శుక్రుడు కోపము తగ్గి నా కుమార్తె కోరినట్లు నీవు నడిచినచో పురోహితుడుగా ఉందును అని చెప్పెను. అట్లే అని రాజు అంగీకరించెను.

దేవయాని తనకు దాసిగా శర్మిష్ట తన భర్తృ గృహమునకు రావలని కోరెను. తన తండ్రికి ఆపద కలుగునని శర్మిష్ట అంగీకరించెను. శుక్రాచార్యుడు తన కుమార్తెను యయాతికి వసంగెను. శుక్రాచార్యుడు యయాతితో నీవెన్నడును శర్మిష్టను ప్రేమించరాదు అని శాసించెను. ఒకనాడు ఋతుకాలమున శర్మిష్ట సంతానార్థిని అయి యయాతిని ప్రార్థించెను. అతడు శుక్రుని ఆదేశము స్మరించియు సంతానార్థినియై ఋతుమతి అయిన స్త్రీ అతను తనను అర్ధించిన నాడు కాదనుట కర్తవ్యము కాదని శర్మిష్ట కోరికను తీర్చెను. దేవయాని గర్భవతి అయి యదు, తుర్వసు అని ఇద్దరు కుమారులను కనెను. శర్మిష్ట గర్భవతియై దృహ్యువు, అనువు, పురువు అను ముగ్గురు కుమారులను కనెను. దేవయాని శర్మిష్టకు సంతతి కలిగినని విని క్రోధముతో తండ్రి వద్ద కేగెను. యాతి ఆమెను ఎంతో బ్రతిమాలెను. కానీ ఆమె మనసు శాంతి నొందలేదు. తండ్రితో చెప్పెను. తండ్రి శుక్రాచార్యుడు కోపముతో కామ పరవసురవైతివి కనుక నీకు ముసలితనం వచ్చుగాక అని శపించెను. అప్పుడు యయాతి కామ పరితృప్తి లేనివాడై శుక్రుని ప్రార్థించెను. అప్పుడు శుక్రుడు నీ ముసలితనము స్వీకరించి ఎవరైనాను వారి యవ్వనమునిచ్చినా నీవు దానిని పొందవచ్చును అనెను. అప్పుడు యయాతి తన కుమారులను వారి వయస్సునిమ్మని అడిగెను. అప్పుడు యదువు విషేసుఖమును అనుభవించుటకు అవకాశం ఉండియు కోరి ముసలితనం పొంది నేనుండజాలను అని తిరస్కరించెను. తుర్వసు, దుర్హ్యువు, అనువు అను ముగ్గురు కుమారులు కూడా వార్ధక్యమును పొందుటకు తిరస్కరించిరి. వయసులో చిన్నవాడైనను గుణములో పెద్దవాడగు పురువును తండ్రి అడిగెను. అప్పుడు పురువు ఇట్లనెను. తండ్రి చేసిన ఉపకారము ఏ ప్రత్యేక ఉపకారము చేసి తీర్చును గలము? మనసులోనున్న కోరికనైనను ఎరింగి చేసిన కొడుకు ఉత్తముడు. తండ్రి చెప్పిన దానిని చేసిన కొడుకు మధ్యముడు. తండ్రి చెప్పినను అశ్రద్ధచే చేయనంగీకరించిన కొడుకు అధముడు. నీ ఆజ్ఞను తప్పక పాలింతును అని తండ్రి ముసలితనమును తాను స్వీకరించి తన యవ్వనమును అతనికిచ్చెను. యయాతి యువకుడై ప్రజలను తండ్రి వలె పాలించుచు విషయ భోగమును అనుభవించుచు గడుపుచుండెను.

దేవయాని కూడా అతనికి అనుగుణముగా అనుగుణముగా ప్రవర్తించుచు ప్రీతిపాత్రురాలై ఉండెను. యయాతి యజ్ఞ పురుషుడగు భగవానుని యజ్ఞములచే ఆరాధించుండెను. సర్వగుణాశ్రయుడగు వాసుదేవుని హృదయమున నిలుపుకొని భగవంతుని ఆరాధన చేయుచు కాలము గడిపెను. ఈ విధముగా వెయ్యి సంవత్సరములు ఇంద్రియ భోగములు అనుభవించియు అతడు తృప్తి నొందక ఉండెను. ఈ విధముగా ఉండి ఒకనాడు తాను చేయుచున్న తప్పిదమునకు పశ్చాత్తాపము నొంది దేవయానితో ఇట్లు పలికెను. నా వంటి విషయలోలుడగు ఒకని చరితమును చెప్పెదని వినుము. ఇట్టి నడువని ఇట్టి నడువడిని జితేంద్రులు విని జాలిపడుదురు. ఒక ఒకానొక వనమున ఒక పొట్టేలు కలదు. అది అడవిలో తిరుగుచు నూతిలో పడిన ఒక ఆడు పొట్టేలను చూచెను. దానిని ఆ నూతి నుండి ఉద్ధరించవలెనని కామపరవశి అయి ప్రయత్నించెను. తన కొమ్ముతో ఆ నూతిని గట్టు మన్నును తొలచి దారి ఏర్పరిచెను. ఆడు పొట్టేలు వెలకి వచ్చి దానినే భర్తగా వరించెను. ఆ పొట్టేలు తన భార్యతో విహరించుచుండుట చూచి మిగిలినవన్నియు తమ తమ మగవారిని ప్రేమించినవి. పొట్టేలు అనేకమంది ఆడువారికి కామ ప్రకోపమును కలిగించువాడై తనను తాను గుర్తించక జీవించుచుండెను. ఒక దానితో రమించుచున్న ఆ పొట్టేలును చూచి మరొక ఆడపొట్టోలి పొట్టేలు సహింపలేక చంచలమగు ప్రేమగల ఆ ప్రియుని వదిలిపోసాగెను. స్త్రీల మనసును అనుసరించి పోయెడి ప్రవృత్తి గల ఈ మగపొట్టేలు కూడా దాని వెంట పడిపోయెను. ఆమె ఆగ్రహం తగ్గలేదు. ఒక జంతువు ఈ ఆడుపొట్టేలు బాధను చూచి ఓర్వలేక మగపొట్టేలు యొక్క భోగానుభవ శక్తిని తొలగించెను. ఆ పొట్టేలు ప్రార్థనపై ఆ శక్తిని మరల ప్రసాదించెను. కానీ ఆ పొట్టేలు ఆ నూతిలో లభించిన పొట్టేలుతో ఎంత కాలం అనుభవించినను తృప్తి తీరక మోహ పరవశ అయి ఉండెను. నా కథ దీనికి సరిగా సరిపడినదా? నేను చాలా అవివేకిని. మీ అందరి ప్రేమకు, మీ విలాసములకు వశపడి నా ఆత్మ నశించిపోవుచున్నదని గుర్తింపలేక చెడిపోవుచున్నాను. కోరికలు పెరుగుచున్న మనుజునకు స్త్రీలు, పశువులు.

బంగారము మొదలగనివి ఎంత సమృద్ధిగా లభించుచున్నను ఇంకను పొందవలెనని కోరిక కలుగునే కానీ తృప్తి కలగదు. కోరికలు అనుభవించుటచే తీరునవి కావు. ఎన్నటినీ అనుభవించినను ఇంకను పెరుగుచుండునెవు గాని చల్లారవు. ప్రజ్వరిల్లుచున్న అగ్నిహోత్రమున నెయ్యి పోసి చల్లార్చవలెనని ప్రయత్నించుట ఎంత అవివేకమో! కోరికలను అనుభవించి తీర్చుకొనవలెను అని కోరుట అంత అవివేకము. సర్వభూతములయందు రాగద్వేషము లేని సమభావము గలవానికి సర్వత్ర సుఖమే లభించును. బుద్ధిహీనుడు వదలలేనిది విషయ తృష్ణ. అది శరీరము జీర్ణించినను జీర్ణించదు. దుఃఖమునకు ఆటపట్టు. తన క్షేమమును కోరుకొనువాడు తృష్ణను విడువవలెను. స్త్రీ భోగము ఎంత అనుభవించినను తీరునది కాదు. ఇంద్రియములు చాలా బలమైనవి బలమైనవి. ఎంత జ్ఞానము కలవాడినైనను పడత్రోయగలవు. అందుచే తల్లి, చెల్లెలు, కూతురు అని కూడా ధైర్యముగా అనుటకు అవకాశం లేదు. కావున వారితో కూడా ఏకాంతముగా విహరింపరాదు. దేవయాని నేను వెయ్యి సంవత్సరములు విషయమును అనుభవించితిని కానీ ఇంకను కోరికలు లేచుతూనే ఉన్నవి కావున నేను ఈ విషయలోభమును వదలి పరబ్రహ్మమునందు మనసును నిలిపి ద్వంద్వాతితుడనై మృగములతో సమముగా అడవిలో నొందును. కానీ వాస్తవమునకు అనుభవించు భోగములు భోగములు కావు. పై లోకములలో సుఖములు కూడా అట్టివే. అవి వినాశ హేతువులని గుర్తించి వదలి ఆత్మ దర్శనమునకు ప్రయత్నించవలెను. ఇట్లు వివేకము కలవాడై కుమారుడగు పురువునకు అతని వయసునిచ్చి తన ముసలితనమును తాను స్వీకరించి సంఘరిహితుడై ఉండెను. పురువును సకల మండలాధిపతిగా నిలిపి పెద్దవారిని నలుగురిని అతనికి వశపరులై వశవర్తులై ఆయా దిక్కులు పాలించు వారినిగా నియమించి యయాతి వనమునకేగెను. ఆ వనమున దేహమునందు దేహ సంబంధుల యందు సంఘమును వీడి సత్వ రజస్తమో గుణములచే కలుగు వికారములు లేనివాడై పరబ్రహ్మమగు వాసుదేవుని యందు మనస్సు నిలిపి భాగవత గదిని పొందినవాడాయను.

దేవయాని యయాతి చెప్పిన కథను తన కథగా నిరింగి స్త్రీ పురుషుల అన్యోన్య ప్రేమలు అనర్థ హేతువులని గుర్తించినది. చలివేంద్రము దగ్గర జలార్ధులు కలిసినట్లే భగవత్ అధీనముగా అందరము కలుచుందము అని ఎరింగి స్వప్నములో విషయములను అనుభవించి. లేవగానే వదిలినట్లు ఇంతకాలం అనుభవించిన విషయములపై సంఘమును వీడి కృష్ణుని యందే మనస్సు నిలిపి శరిరమును వీడెను. ఈ విధంగా యాది చరిత్ర కామ భోగములచే అనర్థములు పాలగుచున్న సంసారులకు ఉపదేశపరమైనది. ఎంత కాలం అనుభవించినను అనర్థమునే కలిగించునని తృప్తి తీరనివి ఎప్పటికైనను వదలవలసినవి విషయ భోగములు. భోగములు లేవని వాటిని ఆర్జించి వానిని అనుభవించుటకు తగిన శక్తి లేదని కూడగట్టుకొని సతత సతమగుచుందుమే గానీ అవి అనర్థ హేతువులని గుర్తించి వదలవలెనని కోరిక ఎంత కాలమునకు గానీ కలగదు. అనుభవించుట అనర్థము వదులుట క్షేమకరము. ఇంతటితో యాది చరిత్రము పూర్తయింది. దీని తర్వాత మనము దుష్ఠంత చరిత్ర ఇంకా మిగతా భాగాలు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. The sun is very hot during the day, but the sun is very hot. The sun is very hot, but it is very hot with the words of the wicked. The sun is very hot. The fire is at a higher flame. The words of the wicked are brighter than the sun. Aarogyam 15th. Oh, devotees, welcome to the 10th podcast of the Srimad Bhagavata Tatvadipika, the ninth book. Until now, the Ambarisha story, the Sukanya story, the Ikshvaku dynasty story, the Chandravamsa story, some part, the story of Parashurama. Having completed it, we are now stepping into the history of Yayati. Let's focus. In that lineage, that is, in that Chandravamsha, Nahusha had six sons. Yayati's son became king after his father. He ruled the kingdom with two wives, Devayani and Sharmishta. The purohita (priest) for Vrishaparva was Shukracharya. Sharmishta, the daughter of Vrishabharvana. Devayani was the daughter of Shukracharya. Once upon a time, Sharmishta, along with Devayani, with a thousand maids He went to the garden and went into the lake for water sports. The sarees are kept on the banks. At that time, as Parameshwara was ascending the bull vehicle with Parvati, he came to the shore quickly with shyness and wore clothes. Sharmishta, in a hurry, mistakenly assumed that Devayani's saree was hers and wore it. Devayani, angered, said, "The garment worn by the Brahmin maiden is yours to wear as cash." Like touching the sacred offering and dog during a Yagnya, you have defiled my saree by touching it. Our lineage is noble. My father is a disciple of your father. He is a demon.

Hearing that you defiled my garment, Sharmishta, unable to bear it, said, "Without food, you have come to our house? Is this your arrogance?" Angrily, she lifted her garment, threw Devayani into the well, and went home with the water. He came to the well to quench his thirst for food and water. Seeing her in the boat, he gave her his upper garment to wear, gave his hand as support, and pulled her out. Without assuming that she is a king, you have accepted my life and body, therefore, another person agreed to accept my body. God has made your acceptance of my body possible. I am a Brahmin maiden. You should accept me as your own Kachudu's curse also came to mind. Kachhu was the son of Brihaspati. To the gods, to acquire the knowledge of Mruta Sanjeevani from Shukra, he joined Shukra's disciples. He secretly remained without knowing that he was the son of the god guru and understood that knowledge. Then, Devayani chose Kachi as her husband. You are the daughter of Guru, I am He refused to accept it. Devayani, in anger, cursed that your knowledge should not bear fruit. He is a Brahmin, may he not be your husband, thus he cursed. Because of that curse, Devayani desired Yayati, a Kshatriya, as her husband. Yayati, having heard that the relationship was unnatural, accepted that it was divinely ordained. After Yayati left, Devayani made her father listen to the bad words spoken by Sharmishta. Shukracharya got angry, left his priesthood, and left the town with his daughter. Vrishaparvudu, falling at the feet of the guru, prayed about this matter. Then Venus, having cooled his anger, said that if you walked as my daughter wished, you would be a priest. The king agreed to the same.

Devayani wanted Sharmishta to come to her husband's house as a servant. Sharmistha agreed that her father would be in danger. Shukracharya brought his daughter to Yayati. Shukracharya ordered Yayati that he should never love Sharmishta. Once upon a time, during the seasons, Sharmishta, desiring children, prayed to Yayati. He, remembering Shukra's order, being a woman of the season, a woman who is in her period, when he asked her, Sharmishta fulfilled her wish, saying that it is not a duty to say no. Devayani became pregnant and gave birth to two sons, Yadu and Turvasu. Sharmishta became pregnant and gave birth to three sons: Druhyu, Anu, and Puru. Hearing that Devayani had a child with Sharmishta, he angrily went to his father. Yatayi begged her very much. But her heart was not at peace. He told his father. Father Shukracharya, in anger, cursed, saying, "Because you are driven by lust, may you become old." Then Yayati, not satisfied with lust, prayed to Shukra. Then Venus, your old age Accepting, whoever it may be, even if they give their youth, you can obtain it, he said. Then Yayati asked his sons their age. Then Yadu, having the opportunity to experience the pleasure of poison, refused, saying that he did not want to be old. Tuvasu, Durhyuvu, and Anuvu, these three sons also refused to undergo old age. Even though he was young in age, the father asked the son who was older in character. Then the old man said this. What special favor can we repay for the favor that the father has done? The son who fulfilled the desire in his heart is the best. The son who did what his father said was the middleman. The son who disobeyed his father, even though he was told, is a lowly person. I will surely obey your command, said the father, accepting his old age, and giving him his youth. Yayati, being a young man, ruled the people like a father, enjoyed worldly pleasures, and lived.

Devayani also behaved according to him, being pleasing. Yayati worshiped the God as a Yajna Purusha. Having placed Vasudeva, the embodiment of all virtues, in his heart, he spent his time worshipping the Lord. In this way, even after experiencing sensual pleasures for a thousand years, he remained without satisfaction. Having been in this manner, one day, repenting for the mistake he was making, he spoke thus to Devayani. Listen, I will tell you the story of a person like me, who is a wise man. Those who do not walk like this, those who do not walk like this, Jitendrulu, hearing this, feel pity. In a certain forest, there lives a tortoise. It was in the forest, wandering, that it saw a goat that had fallen into a well. He tried desperately to get it out of the well. With his horn, he cleared the mud and made a path. The ram came to the field and accepted her as his wife. Seeing the ram frolicking with his wife, all the others loved their respective husbands. Many people's stomachs are filled with lust He was a fighter, living without recognizing himself. Seeing that ram, who was enjoying himself with one, another woman, unable to bear the ram, left that loving beloved who was fickle and affectionate. Following the instinct of following the hearts of women, this male goat also followed it. Her anger hasn't subsided. A male animal, unable to bear the suffering of the female, removed the male's sexual experience. The ram gave back the power to the prayer. But that ram, even after experiencing the ram found in that well for so long, was not satisfied and remained ecstatic with infatuation. Does my story fit this? I am so clumsy. I am perishing, unable to recognize that my soul is being destroyed by being subjected to all your love and your luxuries. For the man who is growing lustful, women and animals.

Even though gold and other such things are abundantly available, if there is a desire to obtain more, but no satisfaction, then there is no satisfaction. Desires are not things to be experienced. Even after experiencing so much, it still grows, but it doesn't cool down. How foolish it is to try to extinguish a blazing fire by pouring ghee on it! It is foolish to wish to experience and fulfill desires. He who is without attachment and aversion in all beings, will attain happiness everywhere. The thirst for knowledge is something that cannot be given up by a fool. It is not digested by the body. A Play for Grief. He who desires his own good must renounce thirst. Women's enjoyment is not enough to describe. The senses are very powerful. Even if you are very knowledgeable, you can be defeated. Therefore, there is no opportunity to even think of them as mother, sister, or daughter with courage. Therefore, one should not wander alone with them. Devayani, I have experienced the matter for a thousand years, but still, desires are arising. Therefore, I have abandoned this worldly pleasures Having fixed the mind on the Supreme Brahman, becoming detached, one attains the forest, equal to the animals. But in reality, the pleasures experienced are not pleasures. The pleasures of the upper world are also the same. Recognizing them as the causes of destruction, one should abandon them and strive for self-realization. Thus, being wise, he gave his son the inheritance, accepting his old age, and remained unmarried. Having appointed Puru as the head of all the provinces, he appointed four elders as his subordinates, as his vassals, and as those who ruled over the respective directions, and Yayati went to the forest. Having left the community in that forest, in the body, among the body's relatives, and being without the distortions caused by the qualities of Sattva, Rajas, and Tamas, he, having fixed his mind on the Supreme Brahman, Vasudeva, attained the Bhagavata Gadhi.

Devayani, recognizing the story told by Yayati as her own, identified the mutual love between men and women as the cause of misfortune. Like the water-drinkers meeting near Chalvendram, we all unite under the control of God, thus experiencing the matters in the dream of Eringi. As soon as he got up, he left the community, focusing his mind on Krishna, and gave up his body, as if he had left it for so long. In this way, the history of the past, through lust and sensual pleasures, is instructive for those who are suffering misfortunes. Even after experiencing for a long time, things that cause misfortune, things that do not satisfy, things that must be left behind at any time, are worldly pleasures. Even if there are no pleasures, even if one does not have the strength to earn them and enjoy them, even if one accumulates them and keeps repeating them, one will not have the desire to recognize them as the cause of misfortune and abandon them. Experiencing suffering is bad, letting go is good. With this, the history of Yadi is complete. After this, we will learn about the history of evil and other parts. Jai Srimannarayana. Salutations to the Asmadgurus