హరిశ్చంద్ర, సగర చరిత్ర మరియు గంగావతరణ సూచన – నవమ స్కంధం భాగం 6

Harishchandra, Sagara & the Path to Ganga – Navama Skandha Part 6

ఈ ప్రవచనంలో సత్యసంధుడైన హరిశ్చంద్రుని కథ, వరుణునితో చేసిన నిబంధన మరియు సునశ్సేపుని పశువుగా పురుషమేధం చేసిన వృత్తాంతం వివరించబడింది. విషంతో జన్మించిన సగరుని చరిత్ర, అతని అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి తేజస్సుచే భస్మమైన సంఘటన వర్ణించబడింది. పెద్దలపై అపచారమే వారిని నాశనం చేస్తుందని, కపిలునకు కోపం లేదని స్పష్టం చేయబడింది. అంశుమంతుడు పాతాళంలో కపిలుని స్తుతించి గుర్రమును తెచ్చి అశ్వమేధం పూర్తి చేసిన విషయం చెప్పబడింది. చివరగా సగరపుత్రుల మోక్షానికి గంగాజలమే మార్గమని సూచిస్తూ గంగావతరణ కథ ముందు చెప్పబోతామని ముగించారు.

This discourse covers the story of Harishchandra, the truth-devoted son of Trishanku, including his vow to Varuna and the Purushamedha sacrifice involving Shunashepa. It then narrates the birth of Sagara, born with poison, and his transformation of various tribal peoples. The tale of Sagara's 60,000 sons being reduced to ashes by Kapila Maharshi's divine radiance is explained, emphasizing that it was their own transgression—not Kapila's anger—that destroyed them. Angshumanta's journey to the netherworld, his prayer to Kapila, and the retrieval of the sacrificial horse conclude the Sagara episode. The discourse ends with a preview of the upcoming Ganga Avatarana narrative.

About this series

ఈ శ్రేణిలో శ్రీమద్భాగవతం నవమ స్కంధంలోని వైవస్వత మను వంశం, సూర్యవంశం, చంద్రవంశం మరియు అంబరీష, హరిశ్చంద్ర వంటి మహాభక్తుల దివ్య గాథలు వివరించబడ్డాయి. సుకన్య, సౌభరి, పురూరవ-ఊర్వశి కథలు, గంగావతరణం మరియు శ్రీరాముని లీలలు కూడా చర్చించబడ్డాయి. ఈ ప్రవచనాలు తత్త్వదీపిక శ్రేణిలో భాగంగా తెలుగులో అందించబడ్డాయి.

This series explores the Ninth Canto (Navama Skandha) of Srimad Bhagavatam, covering the lineages and divine stories of Vaivasvata Manu, the Solar and Lunar dynasties, and great devotees like Ambarisha and Harishchandra. Episodes include the tales of Sukanya, Saubhari, Pururavas-Urvashi, the descent of Ganga, and Sri Rama's divine leelas. Delivered in Telugu as part of the Tatwa Deepika discourse series on Pravachanam.

← Prev Next →
Harishchandra, Sagara & the Path to Ganga – Navama Skandha Part 6

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః అవమానారణి మధితం దుర్వాయింధన వివర్తిత జ్వాలం సత్పురుషా కోపాగ్నిమ్ జ్ఞానాంబు ఘటై ప్రసమయంతి. కోపం అగ్ని వంటిది. అది అవమానమని అరణిని మధించగా పుడుతుంది. ఆ పుట్టిన కాస్త నెరసు ఎగసి మండటానికి చెడు మాటలనే కట్టెలు తోడ్పడతాయి. ఇంకేముంది? అంతా సెగలు, పొగలును తాను. ఎదురి అంతా కాలి బూడిది కావలసిందే కానీ మనిషి కాస్త మంచివాడైతే తెలివిన నీటిని కుండలతో కుమ్మరించి దాన్ని చల్లార్చి తాను కాలిపోకుండా ఎదురిన కాలనీయకుండా కాపాడుకోగలుగుతాడు. ఆర్యోక్తి 11. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక నవమ స్కంధము ఆరో పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు. మనం అంబరీష్ ఉపాఖ్యానము, సుకన్య చరిత్ర, ఇక్ష్వాక్ వంశ వర్ణనంలో సౌభరి చరిత్ర, మాంధాత, పురంజీయుల కథను తెలుసుకొని మనం హరిశ్చంద్ర కథని ఈరోజు తెలుసుకోబోతున్నాం. త్రిశంకు కుమారుడు హరిశ్చంద్రుడు సత్యసంధుడు. ఇతని సత్యసంధతను పరీక్షించుటకు వశిష్ట విశ్వామిత్రులకు చాలా కాలం వివాదం ఏర్పడెను. హరిశ్చంద్రుని గూర్చి వేరొక కథ కూడా తెలియుచున్నది. హరిశ్చంద్రుడు సంతానహీనుడు అందుకే దుఃఖించి నారదుని ఉపదేశంచే కుమారుని అనుగ్రహించమని వరుణుని శరణు పొందెను. ఆ వరుణునితో హరిశ్చంద్రుడు ఒక నిబంధనం ఏర్పరచుకొనెను. నాకు కుమారుడు కలిగినచో వానిని పశువుగా కల్పించి నీకు యజ్ఞము చేసెదను అని హరిశ్చంద్రుని కుమారుడు కలిగెను. వరుణుడు ఆ కుమారుని యాగమున తనకు పశువుగా ఇమ్మని కోరెను. 10 రోజుల పురుడు వెళ్ళినా కానీ పవిత్రుడు కాడు. అందుచే తర్వాత అతనిని వసంగదినని అనెను. వరుణుడు మరల వచ్చెను. యజ్ఞము చేయమనెను. దంతములు లేని పశువు యాగమునకు పనికిరాదు. దంతములు వచ్చిన తర్వాత చేయుదును అనెను.

వరుణుడు మరల వచ్చి దంతములు వచ్చినవి యాగము చేయుమనెను. దంతములు రాలిన పిమ్మట యజ్ఞమునకు తగినవాడగునని పలికెను. పండ్లు ఊడినను మరల రెండవసారి ఊడవలెను అప్పుడు యజ్ఞము చేసెదను అనెను. తర్వాత యుద్ధము చేయుటకు తగినవాడు కావలెను అప్పుడు యజ్ఞము చేసెదను అనెను. ఇట్లు పుత్రునియందు అనురాగముచే ఆడిన మాట తప్పుచుండెను. అతని కుమారుడు రోహితుడు తండ్రి వరుణుని వద్ద ప్రవర్తించుచున్న విధమును గుర్తించి తన ప్రాణములను కాపాడుకొందునని ధనస్సు దాల్చి అడవులకు పోయెను. కుమారుడు వెడలిపోవుట చూచి వరుణుడు ఆగ్రహించి తండ్రిని పట్టుకొనెను. దానితో హరిశ్చందునకు ఉదర వ్యాధి కలిగెను. ఆ వార్తను విని రోహితుడు తన గ్రామమునకు మరల రావాలని సిద్ధపడెను. కానీ ఇంద్రుడు వారించెను. నీవు నీ గ్రామమునకు వెడలవద్దు. లోకమున గల పుణ్య తీర్థ పుణ్య క్షేత్రములను పర్యటించుండుమని చెప్పెను. అతడట్లే భూపర్యటనము చేయుచుండెను. ఒక సంవత్సరము పరిణమము చేసి వెనకకు రాబోవుచుండగా ఇంద్రుడు మరల వారించెను. అట్లే ఐదు సంవత్సరములు వారించెను. హరిశ్చంద్రుడు వరుణునికి ఇచ్చిన మాట ప్రకారము పురుషుని పశువుగా చేసి పురుషమేధము చేయవలెను. దాని ఇట్లయను తండ్రి ఆచరించి సత్యనిష్టుడగునట్లు చేయవలెనని రోహితుడు తిరిగి వచ్చుచు అజగీర్తుడు అనేటి భార్గవ వంశమున జన్మించిన ఒక విపురు నుండి అతని మధ్య కుమారుడగు సునస్సేపుని పశుమేధమున పశువుగా వినియోగించుటకు కొనితెచ్చెను. తన కుమారుడు తెచ్చిన అతనిని పశువుగా నుంచి హరిశ్చంద్రుడు వరుణునకు పురుషమేధమును చేసెను. దానిచే అతని కలిగిన ఉదర వ్యాధి తొలగిపోయెను. ఆ పురుష మేధమున విశ్వామిత్రుడు హోతగా, మృగవంశజుడగు జమదగ్ని అధర్వ్యుడుగా, వశిష్టుడు బ్రహ్మగా, ఆయాస్యముని సామగానము చేయు ఉద్గాతగా ఉండిరి. ఋషుల సన్నిధిచే పవిత్రమైన ఆ యజ్ఞముచే ఇంద్రుడు సంతసించి హరిశ్చంద్రునకు బంగారు రథమును సంగెను. సునస్సేపుడు మంత్ర బలముచే వరుణాదుల అనుగ్రహం పొంది తాను చనిపోకుండా ఎట్లు నిలిచెనో ముందు తెలుసుకుందాము. హరిశ్చంద్రుడు సత్యమే బలముగా కలవాడు అని గుర్తించి విశ్వామిత్రుడు అతనికి ఆత్మ స్వరూప పరమాత్మ స్వరూప యధార్థ జ్ఞానము చెదరకుండునట్లు అనుగ్రహించెను.

అరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన జ్ఞానముచే ధ్యానము చేయుచు అజ్ఞానమును ధ్వంసము చేసుకుని స్వస్వరూప ఆవిర్భావమునొంది పరమానంద ధామమునొందెను. హరిశ్చంద్రుని సత్య వాక్య నిష్ట మన సంప్రదాయమున ఏనాటికిని మాయనిది. సత్య వాక్యమే అన్నిటికంటే బలమని అతను నిరూపించెను. వారి వంశమున బాహుకుడనో రాజు రాజ్యము పోయి భార్యతో అడవికి పోయెను. అచ్చటతడు పోగా అతని భార్య కూడా సాగను చేయవలెనని ప్రయత్నించెను. ఔర్వుడు అను ఋషి ఆమె గర్భవతిని ఎరిగి ఆమెను వారించెను. ఆమె సవతులు తమకు సంతానము లేకుండా ఆమెకు సంతానము కలుగుట ఓర్వలేక ఆమెకు అన్నముతో విషం పెట్టిరి. ఆ గర్భస్తుడైన పిల్లడు విషముచే చనిపోలేదు. విషముతోనే పుట్టినాడు. అందుచేతనని సగరుడు అని పిలుచుండిరి. గరము అనగా విషము. గరముతో కూడినవాడు సగరుడు. ఆ సగరుని వాడు చక్రవర్తి ఆయను. అతడు రాజ్యము చేయుచున్న రోజులలో తాలజంఘులు, యవనులు, శకులు, హైహైలు, బర్బరులు మొదలగు ఆటవిక జాతులు అతని అతని ఎదిరించిరి. ఔర్వుడను ఋషి ఆజ్ఞచే అతడు వారిని చంపలేదు. అందు కొందరిని వికీత వేషము గలవారినిగా చేసెను. కొందరికి తలలు జుబ్బోడిగా చేయించెను. కొందరికి గడ్డం మాత్రం ఉన్నట్లు చేసెను. కొందరిని జుట్టు విప్పుకొన్నట్లుగా చేసెను. కొందరికి సగము తల ముండనము చేసి కొనువారిగా, కొందరిని లోన వస్త్రము దాల్చని వారిగా, కొందరిని ఉత్తర్యము లేని వారిగా ఉండునట్లు చేసెను. ఈ విధముగా ఆయా జాతుల వారికి వేరు వేరు రూపములను వేషములు కల్పించిన వాడు సగరుడే. సగరునకు ఇద్దరు భార్యలు కేళిని, సుమతి. సుమతికి 60 వేల మంది కుమారులు వారు బలచారులు. సగరుడు అశ్వమేధ యాగము చేసి వదిలిన గుర్రమును ఇంద్రుడు అపహరించుకొని పోయెను. ఆ కుమారులు దాన్ని వెదుకుచు పోయి బల గర్వముచే భూమిని తవ్వుకొని లోని కేదికి వెదుకుచుండిరి. ఈశాన్య దుక్కున కపిలుడు తపస్సు చేయుచున్నాడు. ఇంద్రుడు ఆ గుర్రమును అచ్చట వదిలిపోయెను. తపస్సు చేసుకొనుచు కనులు మోసుకొని ఉన్న కపిలుని చూసి వీరు దొంగ అని భావించిరి.

60,000 మంది చంపుడు చంపుడుని కేకలు వేయుచు ఆయుధములు దాల్చి అతనిపై పడిరి. అతడు కనులు తెరిచెను. వెంటనే ఆ దివ్య తేజస్సు వారిని దహించెను. ఇంద్రుని వైపే మనసున్న సగరపుత్రులు కపిలని గుర్తింపలేక కపిలని యెడ అపచారము చేసిరి. పెద్దల విషయమున అపచారము చేసినచో వారికి శిక్షింపవలెనని కోరిక లేకపోయినను అపచారమే వారిని నాశనము చేయును. కపిలని కోపాగ్నిచే దహింపబడిరి అనుట తప్పు మాట. శుద్ధ సత్వరూపు స్వరూపుడగు కపిల శరీరమున తమోగుణముచే కలుగు కోపం ఎక్కడ ఉండును? భూమియందు ఉండవలసిన రజస్సు ఆకాశమున ఉండునా? ఉండదు. మనము కాలితో తొక్కితే పైకెగసి రజము ఆకాశమందు ఉన్నట్లు కనపడును. అట్లే పెద్దలేడు అపచారము చేసినచో ఆ అపచారమే నాశనమునర్పగా ఆ పెద్దల కోపము నాశనము చేసినట్లు అనిపించును. ఆ కపిల మహర్షి ముఖము నుండి సాంఖ్య శాస్త్రం బయలు వెళ్ళింది. అందు ప్రతిపాదింప పడినటువంటి తత్వజ్ఞానము సంసారమును సముద్రమున మునిగి ఉన్న సంసారుల మృత్యు భయమును తొలగించు నౌక వంటిది. అటి తత్వజ్ఞానికి తాను ఇతరులు అను భేదభావం ఉండదు కదా, అందుచే కపిలుడు దహింపలేదు. వారే తమ తప్పుచే తామే మడసిరి. మనము తప్పు చేసినా పెద్దలకు కోపం వచ్చును అనుకొనరాదు. వారికి కోపం రాదు. కానీ మహాపురుషుల యెడ చేసిన అపచారము నశింపచేయునని గుర్తించి తప్పు చేయక ఉండవలెనని దీనిచే మనం గ్రహింపవలెను. కేసిని కుమారుడు అసమంజసుడు. అతడు జన్మాంతరమున యోగి. యోగభ్రష్టుడై సగరుని కుమారుడుగా జన్మించెను. పూర్వజన్మ స్మరణం అతనికి ఉండెడిది. లోకముతో సంఘము లేకుండా చేసుకునవలెనని జ్ఞాతులందురు. తనను ద్వేషించినట్లు ఆడుచున్న పిల్లలను ఆ సరయు నదిలో పడవేయుచుండెను. ఇది మరి చదువుతాను. లోకముతో సంఘము లేకుండా చేసుకొనవలెనని జ్ఞాతులందరూ తనను ద్వేషించునట్లు ఆడుచున్న పిల్లలను ఆ సరయు నదిలో పడవేయుచుండెను.

దీనితో జనులకు అతనిపై కినుక కలిగి రాజుతో మొరబెట్టిరి. తండ్రి కుమారుడు అన్న ప్రేమను వదలి అతని రాజ్యము నుండి విడలిపొమ్మనెను. అప్పుడు అతడు తన యోగ ప్రభావముచే నదిలో పడవేసిన వారిని మరల తెచ్చి వారికి చూపి మీచే విడువబడుటకై ఇట్లు చేసితిని అని చెప్పి తాను రాజ్యమును వదిలిపోయెను. తిరిగి వచ్చిన పిల్లలను చూసుకొని అందరును ఆశ్చర్యపడిరి. సగర చక్రవర్తి కుమారుని వదిలినందుకు పశ్చాత్తాప్తుడయ్యెను. అసమంజసుని కుమారుడు వంశుమంతుడు గుర్రమును వెతుకుటకు బయలుదేరెను. పినతండ్రులు తవ్విన మార్గము గుండా పాతాళమునకేగి భస్మరాశి వద్ద గుర్రమును చూచెను. శ్రీ మహావిష్ణువు అవతారము కపిలును చూచెను. వినయముతో నమస్కరించి స్తోత్రము చేసెను. నీవు పరమాత్మవు, నీ యధార్త స్వరూపమును లోకమును లోకం ఎంత తపస్సు చేసినా తెలుసుకునలేదు. యోగులే ఎరంగలేని నీ మహిమను హిరణ్య గర్భునుచే సృష్టించబడిన మేము ఎట్లు ఎరంగగలము? మాకు దేహావయవములు మాత్రమే తెలియను కానీ లోనున్న తత్వము తెలియదు. సత్వరజస్తమో గుణములు ప్రధానముగా గల దేహధారులు శరీరమునే చూడగలరు కానీ శరీరములో ఉన్న జీవులోనున్న నిన్ను ఎరుంగలేరు. సనందాది మునుల చేతనే దర్శింపదగిన నీ తత్వమును మూఢుడనైనట్లు గుర్తింపగలను. నీవు ఈ లోకమునకు జ్ఞానమును ఉపదేశించుటకు దేహమును దాల్చి దిగి వచ్చిన పురాణ పురుషుడవు. నీ సంకల్పముచే సృష్టించబడిన గృహాదులయందు ఈ జీవుడు రాగద్వేషములను ఏర్పరచుకొని మోహముచే చెడిపోవుచున్నాడు. ఈనాడు నీ దర్శనముచే నా మోహము ఛేదింపబడినది. ఇట్లు స్తుతింపగా అనుగ్రహించి కపిల మహాముని అంశుమతునితో ఇట్లు అనెను. నాయనా, నీ తాతగారు వదిలిన గుర్రమును తీసుకుని వెడలుము. నీ తండ్రులు దహింపబడి ఉన్నారు. గంగాజలముతో వీరికి తర్పణము చేయుము. మరియొక జలము వీరికి పవిత్రతను కలిగించి మోక్షమును సంగలేదు. అంశుమతుడు అంశుమంతుడు కపిలునకు నమస్కరించి ప్రదక్షిణము చేసి గుర్రమును తీసుకొని పోయెను.

అశ్వమేధ యాగం సమాప్తమాయెను. సగరుడు అంశుమంతుని యందు రాజభారముంచి నిస్పృహుడై బంధమును విడి మోక్షమును పొందెను. ఇంతటితో సగను వృత్తాంతం మనము పూర్తి చేసుకున్నాం. దీనిలో ఇంక ముందు గంగా అవతారణం గురించి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. The one who removes the insult, the one who is like a fire extinguisher, the one who dispels the fire of anger, the one who dispels the fire of knowledge. Anger is like fire. It is born as a humiliation to the forest, to be drunk by Arani. The little bit of strength gained by birth, to fly and burn, bad words help. What else is there? He's covered himself with soot and smoke. The firewood needed to be burned, but if a person is a little good, he can pour the water of his mind into pots, cool it, and protect himself from burning and from the fire that is in front of him. Aarooki 11. Devotees of God, welcome to the sixth episode of Srimad Bhagavata Tatva Deepika Navam Skandham. Until now. We are going to learn about the story of Harishchandra today, after learning about the story of Soubhari, Mandhata, and Puranji in the Ambarisha legend, Sukanya Charitra, and Ikshvaku dynasty description. Trishanku's son was Harishchandra, known for his honesty. To test his truthfulness, a long dispute arose between Vasishta and Vishwamitra. There is also another story about Harishchandra. Harishchandra was childless, so he grieved and, through Narada's teachings, sought refuge in Varuna to bless him with a son. Harishchandra made a promise to Varuna. If I have a son, I will make him an animal and perform a Yagnya for you, said Harishchandra's son. Varuna asked that the son be offered to him as a sacrifice. Even though he has been circumcised for 10 days, he is not clean. And then he called him a henchman. The rain has returned. He told me to perform a yajna. Animals without teeth cannot be used in a sacrifice. He said that he would do it after the teeth came.

Varunudu came again and said that the teeth have come, perform the yagam. After the teeth fell out, he said that he would be suitable for the Yagnya. Even if the fruits fall, I will not pluck them again for the second time. Then I will perform the Yagnya (sacrifice), he said. Then he said that he would perform a yagna (sacrifice) when he was ready to fight. Thus, he was wrong in his words, due to his affection for his son. His son Rohit, recognizing the way his father Varuna was behaving, went to the forests wearing a bow so that he could save his lives. Seeing his son leaving, Varuna became angry and took his father. With that, Harishchandra developed a stomach ailment. Hearing the news, Rohit prepared to return to his village. But Indra refused. You shall not leave your town. He said to visit the holy places and pilgrimage sites in the world. He was doing a tour. After a year of progress, as it was about to go back, Indra again reprimanded. Similarly, he served for five years. According to the promise Harishchandra made to Varuna The male should be made into an animal and slaughtered. So that his father, practicing it, may become truthful, Rohitu, returning, from a Vipurudu born in the Bhargava dynasty called Ajagirtudu, to use his middle son, Sunassepu, as an animal in animal sacrifice Brought along. Harishchandra, having brought his son, made him a cattle and performed the male sacrifice to Varuna. It cured his stomach illness. In that male intellect, Vishwamitra was as Hota, Jamadagni, the descendant of the Mrigavamsha, was as Adhryya, Vasishta was as Brahma, and Ayasya was as Udgata, who sang the Samagana. Indra, pleased by the sacred Yagnya performed by the sages, granted Harishchandra a golden chariot. Let us first understand how he stood without dying by the grace of Varuna and others, by the power of the mantra. Harishchandra, recognizing that truth is the strength, Vishwamitra blessed him so that his true knowledge of the self and the supreme self would not be disturbed.

Arishchandra, practicing meditation with the knowledge imparted by Vishwamitra, destroyed ignorance, attained his true form, and reached the abode of supreme bliss. Harishchandra's devotion to truth and his tradition have remained unforgettable for all time. He proved that the truth is the strongest of all. In their lineage, Bahukudu, a king, went to the forest with his wife. After he left, his wife also tried to make him stay. Aurvudu, a sage, knowing that she was pregnant, forbade her. Her relatives, unable to bear that she had no children, poisoned her food. The unborn child died of poison. Born with a bad attitude. Therefore, they were called Sagarudu. Garamu means poison. The one with the garum is Sagar. That Sagar is the emperor. During the days he was ruling, the Talajhagu, Yavanas, Shakas, Haihayas, Barbaras, and other tribal communities opposed him. He was killed by Aurvadan, who was ordered by the sage, but he did not kill them. And made some of them to be like the wicked. Some people had their heads shaved. Some people were made to have a beard. Some of them made it look like they had their hair let down. Some were made half-headed and buyers, some were made without inner garments and those who do not wear, some were made without authority. In this way, Sagara is the one who created different forms and costumes for the various castes. Sagar has two wives, Keli and Sumati. Sumati had 60,000 sons who were strong men. Sagarudu performed the Ashwamedha Yaga and Indra stole the horse that was left behind. Those sons, searching for it, went and, out of pride, dug the earth and were searching for the inside. In the northeast corner, Kapila is doing penance. Indra left the horse there. Seeing Kapila carrying his eyes while doing penance, they thought he was a thief.

60,000 people, shouting 'kill, kill', armed, fell upon him. He blinked. Immediately, that divine light consumed them. The sons of Sagara, who had their minds set on Indra, could not recognize Kapila and committed an injustice against him. If one commits a crime against elders, even if there is no desire to punish them, the crime itself will destroy them. It is wrong to say that Kapila was burned by the fire of anger. Where is the anger caused by the quality of Tamas in the pure, Sattva-formed body of Kapila? Is the dust that should be on the earth in the sky? It is not. If we step on it, it will rise up and appear as if the dust is in the sky. Similarly, if elders commit a crime, that crime itself is destroyed, and the elders' anger seems to be destroyed. Sankhya Shastra emerged from the mouth of the sage Kapila. The knowledge of truth that is proposed is like a boat that removes the fear of death from the people who are drowning in the ocean of worldly life. That is why a knower of truth does not have any discrimination between himself and others, therefore Kapila did not burn him. They are theirs They themselves have made a mistake. We should not assume that elders will be angry if we make a mistake. They don't get angry easily. But we must understand from this that we should not make a mistake, realizing that the evil done to great men will be destroyed. Kasini's son is Asamanjasudu. He was a yogi in a previous life. Yoga was lost and he was born as the son of Sagara. He had a past life regret. They say that it is better to be without association with the world. He was throwing the children who were hating him into the Sarayu river. I will read it again. So that he may be without association with the world, all the disciples were throwing the children who were playing in such a way that they hated him into the Sarayu River.

With this, the people had a secret against him and cried out to the king. He forbade the love between father and son, and separated them from his kingdom. Then he, by the power of his yoga, brought back those who had been thrown into the river, showed them, and said, "I have done this so that you may be released by me," and he left the kingdom. Seeing the children who had returned, everyone was surprised. Sagara was saddened by the abandonment of his son. Vamshamanthu, the son of Asamanjasu, set out to search for the horse. Through the path dug by his uncles, he went to the underworld and saw a horse near the ashes. Sri Maha Vishnu saw Kapila as an avatar. He/She humbly greeted and praised. You are the Supreme Being, your true form is known to the world, no matter how much penance the world does. How can we, created by Hiranyagarbha, who is beyond the reach of yogis, be able to understand your glory? We only know the body parts, but we don't know the inner essence. Those who have the qualities of Sattva, Rajas, and Tamas as their main attributes can see the body, but those who are in the body You cannot be known to the beings in the universe. I can recognize your essence, which is worthy of being seen only by the Sanandadi sages, as if I am a fool. You are the ancient man who came down to earth to impart knowledge and teachings to this world. This being, created by your will, is perverted by attachment and aversion in the houses created by it, and is ruined by delusion. Today, my infatuation has been pierced by your sight. Thus, praising and blessing, Kapila Mahamuni said thus to Anusumathuni. Go find your grandfather's horse, son. Your fathers were burned. Offer them water from the Ganges. Another water, giving them purity, and not attaining salvation. Anshumatudu, Anshumantudu, after paying obeisance to Kapila, circumambulated and took the horse and went.

The Aswamedha Yagna was completed. Sagarudu, having taken on the burden of the kingdom, became free from bondage and attained liberation. With this, we have completed half of the story. In this, let's learn about the Ganga Avataran next. Jai Srimannarayana. Salutations to the Guru