కృష్ణావతార రహస్యం: వసుదేవుని యాత్ర మరియు తత్వ వివరణ
Krishna's Birth, Vasudeva's Journey & the Mystical Symbolism Explained
ఈ ప్రవచనంలో భగవానుడు దేవకీ వసుదేవులకు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చి, వారి పూర్వజన్మలను పృష్ణి-సుతపులుగా, అదితి-కశ్యపులుగా వివరించి మూడు జన్మల సంబంధాన్ని తెలిపాడు. వసుదేవుడు అర్ధరాత్రి కృష్ణుని శిరసున దాల్చి నడిచినప్పుడు గొలుసులు తెగడం, తలుపులు తెరుచుకోవడం, శేషుడు పడగ పట్టడం, యమున దారి ఇవ్వడం జీవుని కర్మబంధ విముక్తికి సంకేతాలు. కంసుడు కామ-రాజస-తామస స్వభావానికి, నందుడు గురువుకు, యశోద మంత్రానికి ప్రతీకలు. అర్ధరాత్రి వర్షాకాలంలో కృష్ణుని ఆవిర్భావం అజ్ఞానాంధకారంలో జ్ఞానప్రకాశం కలుగుటకు సంకేతమని వివరించబడింది.
This discourse covers Krishna's appearance to Devaki and Vasudeva in His four-armed form, revealing their past lives as Prishni-Sutapa and later Aditi-Kashyapa, explaining His three births among them. Vasudeva's midnight journey to Nanda's Vraja—with chains falling, doors opening, Shesha sheltering, and Yamuna parting—is interpreted as the soul's liberation through divine grace. Kamsa represents rajas and tamas binding the soul, while Nanda and Yashoda symbolize the Guru and the mantra through whom Krishna becomes accessible to all. The discourse concludes that Krishna's birth in darkness, rain, and midnight symbolizes the descent of divine knowledge into the ignorance of worldly existence.
About this series
ఈ శ్రేణి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధాన్ని లోతుగా విశ్లేషిస్తుంది — శ్రీకృష్ణుని దివ్య జన్మ, లీలలు మరియు ప్రతి ఘట్టంలోని ఆధ్యాత్మిక తాత్పర్యాలను వివరిస్తుంది. కంసుని భీతి, వసుదేవుని వివేకం, దేవకీ గర్భంలో దేవతల స్తుతి మొదలైన విషయాలు తత్త్వ దీపిక దృష్టికోణంలో ప్రవచించబడ్డాయి. విశిష్టాద్వైత సంప్రదాయంలో ప్రవచనం.కామ్ ద్వారా అందించబడిన ఈ ప్రవచన శ్రేణి భక్తులకు అమూల్యమైన మార్గదర్శకం.
This series offers an in-depth exploration of the Dasama Skandha (Tenth Canto) of Srimad Bhagavatam, covering Krishna's divine birth, His leelas, and the profound spiritual symbolism behind each episode. Topics include Kansa's threat to Devaki, Vasudeva's wisdom, the devas' praise in the womb, and the mystical significance of Krishna's arrival. Presented in the Vishistadvaita tradition as part of the Tattva Deepika discourse series on Pravachanam.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ఖ్యాతేపి కులే జాతః శ్రగ్వి వాగ్మీ సుదర్శనీయస్చ ఆర్త్యైర్గుణైర్వియుక్తః ఫలాశైవ పుష్పితో భవతి గొప్ప కులంలో పుట్టిన ఎన్ని అలంకారాలు చేసుకున్నా ఎంత మాటకారి అయినా చూడముచ్చటగా కనవచ్చినా మంచి గుణాలు కనుక లేకపోతే వాడు పూచిన మోదుగు లాగే ఉంటాడు. ఆర్యోక్తి 31. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. దశమ స్కంధము ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు కృష్ణుని యొక్క ఉపోద్ఘాతము, బ్రహ్మ రుద్రాదుల యొక్క స్తుతి, వసుదేవ దేవకి వసుదేవుల చెరసాలలో తరువాత కృష్ణుడు ఆవిర్భావము, ఆవిర్భావాన్ని చూచి వసుదేవుడు స్తుతి. దేవకి స్తుతి చేశారు. ఆ తర్వాత జరిగిన భాగాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. దేవకీ దేవి స్తుతింపగా భగవానుడు చెప్పుచున్నాడు. నీవు వెనక జన్మమున స్వయంభువ మన్వంతరమున పురుష్ణి అని పిలువబడేడి ఒక స్త్రీవి. ఈతడు సుతపుడు అను పేరు గల ప్రజాపతి. బ్రహ్మ మిమ్ములను ప్రజా సృష్టికై ఆదేశించినాడు. సంతతిని బడేయుటకు మీరు తీవ్రముగు తపమును ఎండుటాకులు గాలిని తిని పన్నెండు వేల దివ్య సంవత్సరములు చేసిరి. అప్పుడు నేను సంతసించి ఈ రూపముతోనే మీకు దర్శనము సంగితిని. మీ కోరికలు ఈడేర్చవలెనని వరము కోరుకొనుడు అని నేను అంటిని. అంతవరకు భౌతికములగు భోగములు ఎరుగని మీరు మోక్షమును కోరక నా వంటి కుమారుడు కావలెనని కోరిరి. నేను మూడు జన్మలలో మీకు కుమారుడే జన్మించుటకు అనుగ్రహించితిని. ఆ జన్మలో పృష్ణిగర్భుడు అను పేరుతో నీకు పుత్రుడనైతిని. తర్వాత జన్మమున మీరు అదితి కశ్యపులుగా జన్మించిరి. అప్పుడు నేను మీకు వామనుడు అను పేరుతో కుమారుడనైతిని. ఇది మూడవ జన్మ. నా రూపమును దర్శించిననే కానీ మీకు జన్మాంతర స్మరణము కలగదు. అందుకై నా రూపమును మీకు చూపితిని. బ్రహ్మను నేను మీకు పుత్రుడనైతిని. బ్రహ్మగా పుత్రుడుగా భావించి ప్రేమించి మీరు పరమగతిని పొందుడు అని చెప్పి.
మాట్లాడక దేవకీ వసుదేవులు చూచుండగానే ప్రాకృత బాలుడుగా మారినాడు. అంతకు మునుపే భగవానుడు తన నందవ్రజమునకు కొనిపోయి యశోద ప్రక్కన ఉంచి స్త్రీ శిశువును తెమ్మని వసుదేవునికి ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞను అనుసరించి వసుదేవుడు ఆ శిశువును పొత్తిళ్ళలో వేసి తలపై తాల్చి బయటకు నడిచెను. అతడు వచ్చుచుండగా అంతవరకు ఇనుప గొలుసులతో మేకులతో బంధింపబడిన పెద్ద తలుపులు తమంత తామే తెరుచుకొనినవి. సూర్యుడు ఉదయించుండగా చీకటి విచ్చిపోయినట్లు ఆవరణములన్నియు తమంత తాము విడిపోయినవి. వెలుపల ఉరుములతో వర్షం పడుచుండెను. శేషుడు తన పడగలతో ఆ బాలుని తడవకుండా అనుసరించుచుండెను. యముని సోదరియగు యమున వరదలతో నురుగులతో కెరటములతో పొర్లి పారుచుండెను. వసుదేవుడు భగవానుని వాక్యమును అనుసరించి యమునులో దిగెను. యమున దారి వదలెను. వసుదేవుడు నంద వ్రజమును చేరెను. అందరూ నిద్రపోవుచుండిరి. యశోద పాన్పుపై తన కుమారుని పరుండబెట్టి ఆమె కుమార్తెను తీసుకొని వసుదేవుడు మరలెను. దేవకి ప్రక్కన ఆ బాలికను పరుండ చేసెను. మునుపటి వలని సంఖ్యలను తన కాళ్ళకు తానే తగిల్చుకొనెను. తలుపులన్నియు వెనకటి వలనే మరల తమంత తామే మూసుకొనినవి. గడియలు పడినవి. వ్రజమును యశోద ఆమె పరివారం బిడ్డ కలిగినది అనునంతవరకే గుర్తించిరి గాని. యోగమాయా ప్రభావముచే ఆడ మగ అను భేదమును గుర్తింపకయే నిద్రపోయిరి. వసుదేవుడు తిరిగి వచ్చే వరకు మాయా ప్రభావముచే అందరును నిద్రపోయిరి. ఈ కథ అంతయు జీవయాత్రను వివరించును. భగవత్ ప్రాప్తికై జీవుడు మానవ శరీరం అందుచున్నాడు. కానీ రజస్తమో గుణములు మన మనస్సును భగవత్ అభిముఖం కాకుండా నిరోధించుచుండెను. భగవత్ అనుగ్రహముచే ఒకనాడు దాని నుండి బయలు వెళుటకు అవకాశం ఏర్పడును. మధురానగమున పాలకుడు కంసుడు. అతడు రాజసుడు, తామసుడు. తాను జీవించి ఉండుటయే కాంక్షించును. దైవమునైనను, తోబుట్టునైనను, పసికందులనైనను చంపి తన ప్రాణములను నిలుపుకొనుటయే పరమ ప్రయోజనముగా భావించుచుండెను. ఇది రాజసుల తామసుల మనస్థితి.
అట్టి మనస్సు ఆత్మను సాత్వికమైన ధృతిని తన వశమున ఉండునట్లు బంధించును. కంసుడు దేవకీ వసుదేవులను బంధించెను. వెనక జన్మములలో చేసిన సుకృత ఫలముగా ఆ బంధముని భగవానుడు వారికి దర్శనమసంగించెను. ఈశ్వరుని సౌహార్దము వెనక జన్మలలో చేసిన సుకృతము భగవత్ దర్శనమునకు హేతువులు. దేవకీ వసుదేవులు ఈ జన్మలో ఏమియు సాధన చేయలేదు. మూడు జన్మల వెనక చేసిన పుణ్య ఫలముగా స్వామి వారికి తన అచ్చమైన రూపమును దర్శింపచేసెను. భగవానుడు అనుగ్రహించి మనకు దర్శనము సంగ వలనే కానీ మనమై దర్శింపలేము. పరాత్పరుడు హరి సులభుడై సుతుడై దర్శనం వసంగినాడు. ఇది మానసికమైన సాక్షాత్కారం. అందరికూ కనపడునట్లు రాలేదు. దేవకి వసుదేవులకే కనపడినాడు, మాట్లాడినాడు. ఆ రూపమును ఉపసంహరించినాడు. కానిది స్థిరముగా నిలవదు. దానిని దర్శింపగానే కర్మబంధములు తమంత తామే వీడును. బ్రహ్మాది దేవతలు కూడా ఎవరి కంటే క్రింద వారో అట్టివాడు కనపడగానే అహంకార గ్రంథి ప్రదిలిపోవును. అన్ని సంశయములు తొలగిపోవును. తెగిపోవును. కర్మలు నశించిపోవును అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. హృదయ గ్రంథి తలుపుల వంటివి. దానికి బిగించిన గొలుసుల వంటిది కర్మ. దానిలో దూర్చిన మేకుల వంటివి సంశయములు. కృష్ణుని దర్శనము కాగానే వసుదేవునకు తలుపులు తెరుచుకొనినవి. గొలుసులు తెగినవి, మేకులు ఊడినవి. ఇది భక్తులకు. ఈ జన్మమునని ఈ శరీరములో ఉండగని భగవద్ అనుగ్రహముచే కలిగెడి మహా ఫలం. భగవద్ వాక్యములే శృతులు స్మృతులు వానిని నమ్మి నడవవలెను. భగవానుడు తనను తోడుచుకొని వెలికి నడవమని అనినాడు. అడ్డు ఉన్నదే ఎట్లు వెళ్ళుదును అని వసుదేవునకు సంశయం కలగలేదు.
భగవానుడు నడవమని నాడు నడిచినాడు. ప్రతిబంధకములు తమంత తామే తొలగిపోయినవి. వర్షము పడుచున్నది. మన హృదయాకాశమున అవివేకమైన మబ్బు పట్టి. అజ్ఞానమనెడి చీకటి, క్రమ్మి, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆదిదైవిక దుఃఖములనెడి వర్షము మనపై పడుచునే ఉండును. ఆ దుఃఖములు మనం ప్రయత్నించినను ఆగవు. వసుదేవుడు కృష్ణుని తన శిరసుపైన ఉంచుకొని నడుచుండగా కృష్ణుడిపై శేషుడు పడగలు పట్టి వర్షం పడకుండా వారించెను. వసుదేవునిపై కూడా చినుకు పడలేదు. మనం భగవానుని బుద్ధిలో నిలుపుకొని జీవితం నడుపుకొనినచో దుఃఖముననటి వర్షము మనకంటకుండా శేషుడే కాపాడును. మనకు ఎందుకు దుఃఖము కలుగుచున్నది? నేను నా కొరకు నా పనిని చేసుకొనుచున్నాను అనుకొనుట వలన అది వాస్తవము కాదు. వాడు వాని కొరికై వాని పనిని చేయించుకొనుచున్నాడు. ఈ భావము కలిగినచో దానిని శేషత్వ మందురు. అది కలిగిన వారికి దుఃఖములు అంటవు. మధురకు ప్రక్కనే యమున పారుచున్నది. యమున యముని సోదరి. వీరిద్దరూ సూర్యుని బిడ్డలు. వీరిద్దరూ నలుపే. యమున నలుపే. కాలము నియమించువాడు యముడు. కాల ప్రవాహము యమున. కాలము ఎప్పుడు కదులుచునే ఉండును. నది ఎప్పుడు సాగుచునే ఉండును. ఇవతలి ఒడ్డున మధుర, అవతలి ఒడ్డున వ్రజము. మధురను పాలించువాడు కంసుడు, వ్రజమును పాలించువాడు నందుడు. కంసుడు కామము అని తెలుసుకొంటిమి. అది పరిపాలించు దేశము సంసారి మండలం. వ్రజమును పాలించువాడు నందుడు గురువు. ఇతడు ఆనందించువాడు ఆనందమును సంగువాడు. అది ఏ ముముక్షు మండలం. అచ్చటగు కృష్ణుడు చేరవలెను. కంసుడు ఉన్నంత కాలము కృష్ణుడు మధురలో ఉండడు. కృష్ణుడు వచ్చి కంసుని చంపి మధురకు నాథుడగును. కామము ఉన్నంత కాలము భగవానుడు మన మనసును ప్రవేశించాడు. అతడు నంద యశోదుల వద్ద పెరుగుచుండును. కామము నశించిన తరువాత మనమున భగవానుడు ప్రవేశించి పాలించును. కాల ప్రభావమును తొలగించుకొనుటకు భగవంతుని వహించుటయే సాధనము. వసుదేవుడు కృష్ణుని తలపై దాల్చి నడిచినప్పుడు అతని ఆజ్ఞచే అతని కొరకు నడిచినప్పుడు.
యమున దారినిచ్చెను. కృష్ణుని కొరకు కృష్ణుని మాట నమ్మి నడిచిన వారికై కాలము తన ప్రభావమును చూపలేదు. భగవానుడు దిగి వచ్చుట మంత్రము ద్వారా. ఆ మంత్రమే భగవానునకు తల్లి, తండ్రి, గురువు. మంత్రము సమాధిలో ఒకడు సాక్షాత్కరించుకొనును. అతడు ఋషి. ఆ దురసించిన రూపమును అభివ్యక్తము చేయుచు కొన్ని అక్షరములు అతని నోటి నుండి వెలువడును. అదియే మంత్రము. అదియే ఛందస్సు. భగవాను దర్శించిన వాడు వసుదేవుడు. ప్రకాశింపచేసినది దేవకి. వీరిద్దరూ ఋషిచ్చందము. వీటిచే ప్రతిపాదింపబడిన దేవత శ్రీకృష్ణ భగవానుడు. ఇది సామాన్యులకు అందుటకు మంత్ర రూపముగా ఒక గురువును చేరెను. ఆ మంత్రము యశోద. గురువు నందుడు. ఆ నంద యశోదలు కృష్ణుని పెంచిన తల్లిదండ్రులు. ఇతట పెరిగి అందరివాడై అందరుకు అందినవాడు శ్రీకృష్ణుడు. ఈ రహస్యమును ప్రకాశింపచేయుటకు శ్రీకృష్ణుడుగా భగవానుడు ఆవిర్భవించినాడు. విద్యా ప్రదానము చేసిన అవతారము శ్రీకృష్ణావతారము. దివ్యమైన వెలుగునిచ్చును. అది అంధకార సమయముననే ప్రకాశించును. అదియే రాత్రి. శ్రీకృష్ణుడు ఆవిర్భవించుటలోని రహస్యం మన జన్మలు చీకటి రాత్రులు అందు అర్ధరాత్రమున వర్షాకాలమున మేఘావృతమైన కాలమున శ్రీకృష్ణుడు ఆవిర్భవించునాడు జ్ఞానప్రదాత కనుకని శ్రీకృష్ణుని జగద్గురువు అని కీర్తింతురు పరమై పరమైన తత్వం ఎంతటి జ్ఞానులకు కూడా అందని తత్వం గురువు మూలముగా మంత్రము ద్వారా ఈ లోకమున భగవాన్ని ప్రేమించడి వారలకు యోగ్యతను చూడక అందును ఇది ఏ కృష్ణావతార రహస్యం. బ్రహ్మాదులచే స్తుతింపబడినవాడు, చతుర్భుజములతో, శంఖ చక్రములతో, దేవకీ వసుదేవులచే చూడబడినవాడు, తన ప్రభావముచే బంధములను తొలగించినవాడు. ప్రవాహము అడ్డగించక దారి ఇచ్చినట్టు చేసినవాడు ఏమియు ఎరుగని బాలుడిగా యశోద ప్రక్కలో నందుని ఇంట పరుండినాడు. వసుదేవుడు బాలికను తీసుకొని వచ్చి మరల పాదముల గొలుసులను తానే తగిలించుకొనినాడు. ఈ శరీరమునే దర్శించియు శరీరమును వీడక సంసారమునున్న వారి దశ ఇది. వారు బంధమున ఉందురు కానీ ఇది వారికి బంధము కాదు. ఇట్టి రహస్యములు ఎనింటినో శ్రీకృష్ణావతార వృత్తాంతము మనకు తెలియజేయుచున్నది.
తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the gurus. Even though born in a famous family, he is skilled in speech, like Sudarshan, and devoid of qualities like Arya, he is adorned with fruits. Even if born in a great family, no matter how many decorations he makes, no matter how much he speaks, he is pleasing to see If he has good qualities, he is good; otherwise, he is like a withered jasmine. Aarooki 31. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the sixth podcast episode of Dasam Skandam. Until now, the introduction of Krishna, the praise of Brahma, Rudra, and others, Vasudeva Devaki, in the captivity of Vasudevas, then Krishna's appearance, seeing the appearance, Vasudeva praises. Praise be to God. We'll see the aftermath later. The Lord says as Devaki Devi is praised. You are a woman called Purushni, who was born in the Swayambhuva Manvantara in the previous birth. The name of the person who is called Sutapa is Prajapati. The Brahma ordered you to create mankind. To increase your progeny, you performed intense penance, eating dry leaves and air for twelve thousand divine years I did. Then I was pleased and had a vision of you in this form. I said that I wish to ask for a boon that your wishes may be fulfilled. Until then, you, who do not know the pleasures of the physical world, did not seek salvation, but desired to have a son like me. I have blessed you with a son for three lifetimes. In that birth, I gave birth to a son named Prushnigarbha. In your next birth, you shall be born as Aditi and Kashyapa. Then I, Vamanudu, became your son by the name of. It is the third birth. Only if you see my form, will you have the memory of my past life. That's why I showed you my form. I am Brahma's son. Considering him as Brahma, as a son, loving him, you will attain the supreme state, saying that.
Devaki and Vasudeva, without speaking, as they watched, he transformed into a child of Prakrita. Before that, the Lord took him to his Nandavrajam and placed him next to Yashoda, and ordered Vasudeva to bring a female child. Following that order, Vasudeva put the baby in his lap, placed his head on his palm, and walked out. As he was coming, the large doors, which had been bound with iron chains and nails, opened by themselves. As the sun rose, the darkness vanished, and all the enclosures separated on their own. Outside, it was raining heavily. Sheshudu followed the boy with his hood. Yamuna, the sister of Yama, was flowing with floods, foam, and waves. Vasudeva, following the words of the Lord, went down into the Yamuna. Yamuna agreed. Vasudeva reached Nanda's palace. Everyone was sleeping. Yashoda laid her son on a bed and Vasudeva brought his daughter. Devaki placed the girl aside. He clung to the numbers of the previous net. All the doors were closed again by themselves, just like before. The clocks have stopped. Yashoda and her family recognized Vrajam as having a child, but only to that extent. By the power of Yoga, they fell asleep without recognizing the difference between male and female. Until Vasudeva returned, everyone fell asleep due to the effect of Maya. This story describes a journey of life. For the attainment of the divine, the individual soul assumes a human body. But the qualities of Rajas are preventing our mind from being directed towards the divine. By the grace of God, one day there will be an opportunity to leave it. The ruler of Madhuranagam is Kamsa. He is Rajasuya and Tamasu. He desires to live. He considered it his ultimate purpose to kill even God, his own brother, and even infants, in order to preserve his own life. This is the state of mind of a king and his queens.
Such a mind binds the soul in a state of self-control and self-control. Kamsa imprisoned Devaki and Vasudeva. As a result of good deeds done in previous births, the Lord appeared to them and fulfilled their desires. The good deeds done in previous births behind the friendship of God are the reasons for the vision of God. Devaki and Vasudeva did not achieve anything in this birth. As a result of the merits earned over three lifetimes, she was able to see her true form before the Lord. God blessed us, but we cannot see him as he is. The Supreme Being, Hari, became easily accessible, and his son, the vision, was established. It is a mental realization. It's not like everyone can see it. Devaki saw Vasudeva, he spoke. He withdrew that form. But it does not last long. Upon seeing it, the karmic bonds will automatically be resolved. Even the Brahma and other gods, who are below everyone else, when such a person is seen, the knot of ego will burst forth. All doubts will be removed. They will be broken. Karmas will be destroyed, so the Upanishads say. Heart gland doors Like that. Karma is like a chain that is fastened to it. Doubt is like a stain that has been smeared on it. As soon as Krishna's darshan (divine appearance) happened, the doors opened for Vasudeva. The chains are gone, the nails are gone. This is for the devotees. The great fruit attained by the grace of God, which is not in this birth, in this body. The words of the Lord are the hymns and the smritis, one should walk by believing in them. The Lord said to walk with him. Vasudeva had no doubt that how he would go where there was an obstacle.
The Lord walked, as he had walked before. The obstacles have been removed on their own. The rains have been constant. Our hearts are clouded with foolishness. The darkness called ignorance, the rain of sorrows called spiritual, transcendental, and primordial sufferings keeps falling upon us. Those sorrows will not stop, even if we try. While Vasudeva was walking with Krishna on his head, Shesha held the umbrella over Krishna to prevent rain. Vasudeva was untouched either. If we keep God in our minds and lead our lives, Seshudu will protect us from the rain of sorrow. Why are we sad? Thinking that I am doing my work for myself is not true. He is getting his work done for his bite. If this feeling exists, it is called residual. Sorrows are not meant for those who have it. The Yamuna flows right beside Madhura. Yamuna is the sister of Yama. They are the children of the Sun. They are a match for each other. Yamuna nalupa. Yama is the god of time. The River Yamuna is a flowing river. What time is it It will keep moving. The river is always flowing. Madhura on one bank and Vraja on the other. Kamsa is the one who rules Madhura, and Nandu is the one who rules Vraja. We have come to know that Kamsa is lustful. That is the country that governs the world. The one who rules the Vraja is the Guru. He is the one who rejoices, the one who is filled with joy. It is Mumuksh Mandal. There is a Krishna temple there. As long as Kamsa is around, Krishna will not be in Mathura. Krishna will come and kill Kansa and become the ruler of Mathura. As long as there is desire, the Lord has entered our minds. He is growing up with Nanda and Yashoda. After lust is destroyed, the Lord enters and governs. The means to overcome the effects of time is to surrender to God. When Vasudeva walked on Krishna's head, when he walked for him by his order.
Yamuna gave way. For those who walked believing in Krishna's word for Krishna, time did not show its power. The Lord came down through the Urim and Marijah. The mantra itself is the mother, father, and guru of the Lord. The Mantram is the one who is awakened in the Samadhi. He is a sage. Expressing that form of evil, some letters will come out of his mouth. It's the mantra. It is Chandas. The one who had a vision of the deity was Vasudeva. It was Devaki who illuminated the world. Both of them are sages. The deity proposed by these is none other than Sri Krishna Bhagavan. This is a mantra form for the common people, and a guru joined them. The mantra is Yashodha. The Guru is Nandu. Nanda and Yashoda were Krishna's foster parents. He grew up and became everyone's, Sri Krishna. To reveal this secret, the Lord manifested as Sri Krishna. The incarnation that bestowed knowledge is the incarnation of Lord Krishna. Gives divine light. It shines in the dark. It's that night. The secret of Lord Krishna's manifestation is that our births are dark At night, in the early hours, during the rainy season, in a cloudy time, Srikrishna appears. Because Srikrishna is the giver of knowledge, they praise Srikrishna as the Jagadguru (world teacher). The supreme, the ultimate truth is such that even the most knowledgeable cannot attain it, that is the guru Through the root, through the mantra, in this world, those who do not love God, without seeing their worthiness, and this is the secret of Krishna's incarnation. He who is praised by Brahma and others, who is seen with four arms, conch and discus, by Devaki and Vasudeva, who has removed bonds by his power. He who made the flow give way without obstructing it, as if giving way, was a child unknown to Yashoda, lying next to Nandu's house. Vasudeva brought the girl and again attached the chains to his feet. This is the state of those who, even after seeing the body, do not leave the body and are in the cycle of worldly life. They are in bondage, but this is not bondage for them. These secrets, eighteen in number, tell us the story of Sri Krishna's incarnation.
We will learn about the next part in another podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.