కృష్ణావిర్భావం: వసుదేవ దేవకీ స్తుతులు (దశమ స్కంధం 5)
Krishna's Divine Birth: Vasudeva & Devaki's Prayers (Dasama Skandha 5)
అర్ధరాత్రి కృష్ణుడు జన్మించిన సమయంలో గ్రహతారలు శాంతించడం, నదులు నిర్మలమవడం, తామరలు వికసించడం వంటి శుభ సూచనలు వర్ణించబడ్డాయి. వసుదేవుడు శంఖ చక్ర గద పద్మాలు ధరించిన చతుర్భుజ విష్ణురూపంలో బాలుని దర్శించి ఆశ్చర్యపడి స్తోత్రం చేశాడు. కృష్ణుడు ప్రకృతికి అతీతుడైన పరమ పురుషుడని, జగత్తును సృష్టించి రక్షించి లయం చేయువాడని వసుదేవుడు స్తుతించాడు. దేవకి కూడా కృష్ణుని త్రిగుణాతీతుడు, స్వయంప్రకాశుడు, సర్వ జగత్కారణభూతుడని స్తుతించి, కంసుని భయంతో దివ్యరూపాన్ని ఉపసంహరించుకొమ్మని ప్రార్థించింది.
This discourse covers the auspicious cosmic signs accompanying Krishna's birth at midnight, including calm planets, blooming lotuses, and fragrant breezes. Vasudeva witnesses the newborn child appearing as the four-armed Vishnu with conch, discus, mace, and lotus, and offers a profound prayer recognizing Him as the transcendent Purusha beyond Prakriti. Devaki then prays to Krishna, describing His nature as beyond the three gunas, self-luminous, and the ultimate cause of all creation and dissolution. Both parents implore Krishna to conceal His divine form to protect Him from Kamsa's wrath. The session concludes with these two prayers and the divine appearance of Krishna.
About this series
ఈ శ్రేణి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధాన్ని లోతుగా విశ్లేషిస్తుంది — శ్రీకృష్ణుని దివ్య జన్మ, లీలలు మరియు ప్రతి ఘట్టంలోని ఆధ్యాత్మిక తాత్పర్యాలను వివరిస్తుంది. కంసుని భీతి, వసుదేవుని వివేకం, దేవకీ గర్భంలో దేవతల స్తుతి మొదలైన విషయాలు తత్త్వ దీపిక దృష్టికోణంలో ప్రవచించబడ్డాయి. విశిష్టాద్వైత సంప్రదాయంలో ప్రవచనం.కామ్ ద్వారా అందించబడిన ఈ ప్రవచన శ్రేణి భక్తులకు అమూల్యమైన మార్గదర్శకం.
This series offers an in-depth exploration of the Dasama Skandha (Tenth Canto) of Srimad Bhagavatam, covering Krishna's divine birth, His leelas, and the profound spiritual symbolism behind each episode. Topics include Kansa's threat to Devaki, Vasudeva's wisdom, the devas' praise in the womb, and the mystical significance of Krishna's arrival. Presented in the Vishistadvaita tradition as part of the Tattva Deepika discourse series on Pravachanam.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః మనోవా దర్పోవా విజ్ఞానం విక్రమః సుబుద్ధిర్వా సర్వం ప్రణశ్యతి సమం విభవహీనస్య పురుషస్య అభిమానం కానీ, గర్వం కానీ, విజ్ఞానం కానీ, విక్రమం కానీ, కడకు మంచి బుద్ధే కానీ ఈ అన్నీ ధనం పోవటంతోనే తాము పోతాయి. అవి ఉన్నా ధనమంటూ లేకపోతే అవి లేనట్టే. ఆర్యోక్తి 30th. భగవద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. దశమ స్కంధం ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు శ్రీకృష్ణుని యొక్క ఉపోద్ఘాతము, దేవకి వసుదేవుల యొక్క వివాహము తరువాత ఏడుగురు జనించడము తరువాత వారిని చెరసాలో బంధించడము చెరసాలో వచ్చి దేవతలందరూ బ్రహ్మ రుద్రాదులందరూ కూడా వచ్చి స్తుతించి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ తర్వాత భాగం ఇవాళ మనం తెలుసుకుందాం. జన్మలేని భగవానుడు జన్మించు సమయం ఆసన్నమైనది. అదియే ఆ కాలమునకు మంగళము కలిగించునది. అప్పుడు గ్రహములు తారకలు ప్రశాంతమై ఉన్నవి. బ్రహ్మ దేవతగా కల నక్షత్రము రోహిణి తటస్థించినది. దిక్కులన్నియు నిర్మలముగా నున్నవి. నక్షత్రములు ప్రకాశించుచున్నవి. భూమండలమంతయు మంగళ భూయిష్టమై ఉన్నది. పురములు, గ్రామములు. పల్లెలు శుభకరములుగా ఉన్నవి. నదులలో నీరు నిర్మలమై ఉండెను. చెరువులలో తామరలు వికసించి ఉండెను. పక్షులు తుమ్మెదలు ఆనందముతో ధని చేయుచున్నవి. వాయువు ధూళి లేక వేచుచుండెను. పవిత్రమగు వాసనలు తెచ్చుచుండెను. బ్రాహ్మణులు హోమముచే అగ్నిహోత్రములు శాంతములై ప్రజ్వరిల్లుచున్నవి.
దేవతల సాధువుల మనస్సులు ప్రసన్నములై ఉండెను. అర్ధరాత్రి సమయం చీకటి అంతటా వ్యాపించి ఉన్నది. మేఘములు సముద్రమును మెల్లగా గర్జించుచున్నవి. అట్టి సమయమున దేవతా స్వరూపిణియగు దేవకీ దేవి యందు తూర్పు దిక్కున చంద్రుడు ఆవిర్భవించినట్లు సర్వ గుణాశ్రయుడగు విష్ణువు ఆవిర్భవించెను. విష్ణువు అంతటను వ్యాపించి ఉండును. అందుచే అతను పుట్టుట చంద్రుడు అంతకు ముందును ఒక సమయమున ఒకచోట కనిపించుట ఎట్లో? అట్లే ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు దేవకీ దేవి నుండి దర్శనము సంగెను. అంతేగాని లేనివాడు పుట్టుట కాదు. అందుకై విష్ణువు ఆవిర్భవించెను అనినారు. ఆ పుట్టిన బాలకుని వసుదేవుడు చూచెను. అతడు ఆశ్చర్యకరమైన రూపముతో ఉండెను. బాలుడు కనపడుచుండెను. కానీ పుండరీకాక్షుడు చతుర్భుజములు కలవాడు శంఖ చక్ర గద పద్మములు నాలుగు చేతులతో దాల్చి ఉన్నవాడు. వక్షమున శ్రీవత్సము అనేటి పుట్టుమచ్చ గలవాడు కంఠమున కౌస్తుభమని ప్రకాశించుచున్నవాడు కనపట్టెను. నీరు నిండిన నల్లని మేఘం వంటి కాంతి గల దివ్య దేహముపై పీతాంబరమును దాల్చి ఉండెను. అనర్ఘమగు వైడూర్యమును పొదిగిన కిరీటము కుండలములు దాల్చి యుండెను. కేశములు ఆ కుండల కాంతులచే ప్రకాశించుచుండెను. మొలనూలు, అంగదములు, కంకణములు మొదలగు ఆభరణములతో ప్రకాశించుచుండెను. ఆ లక్షణములను చూచిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా తోచుచుండెను. కానీ బాలుడుగా కనపట్టుచుండెను. అదొక వింత సన్నివేశం. విష్ణువా కుమారుడా వసుదేవునకు తోచలేదు. దేవకి కుమారుడుగా కలిగిన నాడు కనుక పుత్రుడే. కానీ రూపము చూచిన శ్రీహరి ఆశ్చర్యపడినాడు. కనులు పెద్దవిగా చేసుకుని చూచినాడు. కృష్ణుడు పుట్టిన ఆనందములో బ్రాహ్మణులకు కొన్ని వేల గోవులను ఇచ్చెదనని అనుకొని నీరు ముట్టినాడు. కానీ అప్పుడు ఇచ్చుటకు అతనికి అవకాశం లేదు. అతడు పరమ పురుషుడే అని నిశ్చయించుకున్నాడు. సాష్టాంగముగా నమస్కరించి లేచి నిలిచి దోసిలి పట్టి నమస్కరించుచున్నాడు.
అతని కాంతిచే పురిటిల్లు అంతయు వెలుగుతూ నుండెను. భయము కలుగుట లేదు, ఆనందమే కలుగుచున్నది. వసుదేవుడు ఇట్లు స్తోత్రము చేయుట ఆరంభించెను. నీవు ప్రకృతికి పరుడవగు పురుషుడుగా ఉపనిషత్తులలో ప్రసిద్ధుడైన పరమ పురుషుడవు. కేవలము జ్ఞానము, ఆనందము, స్వరూపము కలవాడవు. సర్వ సాక్షివి అట్టి నీవే సృష్టికి ముందు కారణముగా ఉండి నీ శరీరముగా నీకంటే వేరుగా ఎరుంగరాని సత్వరజస్తమో గుణములు గల ప్రకృతిచే జగత్తును సృష్టించి జీవుని ద్వారా దానిలో ప్రవేశించి ధరించుచుంటివి. జగత్తులో ప్రవేశించినను దానికి కలిగెడి మార్పులు నీకు అంటకుండుటచే ప్రవేశించినట్లే ఉందువు. ఆకాశాది స్థూల భూతములు తమ కలయికచే ఏర్పడిన జగమును ప్రవేశించి ఉన్నను మరల వాని కంటే వేరుగా కనపడుతున్నట్లు నీవే జగత్తులో ప్రవేశించి. వేరుగా కనపడుచుందువు. పుట్టిన తరువాత వాటిలో చేరి ఉండియు అంతకుముందు ఉండడి వాడవు నీవు. ఈ విధముగా సత్తరజస్తమో గుణముల కూడికతోనున్న ప్రకృతిలో ఉండియు దాని చేత నీవు ఆవరింపబడవు. నీవు అంతను వ్యాపించి ఉండుటచే నీకు ఇది లోపలి భాగము ఇది వెలుపలి భాగము అని పేర్కొనుటకు శక్యము కాదు. ఈ జగత్తు నీ నుండి బయలు వెడలుచున్నది. నీచే ధరింపబడి నియమింపబడి రక్షింపబడుచున్నది. నీలోనే లయమగుచున్నది. ఈ లోకమును రక్షించుట కొరకు నీ సంకల్పముచే నీవే రజస్తమస్సులతో కలియని శుద్ధమగు విగ్రహమును ధరించి యుందువు. ఈ జగత్తును సృష్టించుటకు రజోగుణం ప్రధానముగా గల శరీరముతో ఉన్న చతుర్ముఖుడు అను జీవుని అధిష్టించి రజోగుణమయమగు శరీరమును ధరించి యుందువు. అట్లే ఈ జగత్తును సంహరించుటకు తమోగుణము అధికముగాగల శరీరములోనున్న రుద్రుడు అను జీవుని అధిష్టించి తమోగుణమయమగు శరీరమును ధరించి యుందువు. ఇప్పుడు ఈ లోకములో రాజులను పేరుతో అసురులు వ్యాపించి ఉండుట చూచి వారిని సంహరించి లోకమును రక్షింపదలచి నా ఇంట నా కుమారుడుగా అవతరించితివి.
కానీ ఈ అసభ్యుడు నీకంటే ముందుగా పుట్టిన వారిని చంపినాడు. ఇంకా నీవు పుట్టినావని అతని భటులు చెప్పగానే నిన్ను చంపుటకు కూడా ఖడ్గము దాల్చి వచ్చును. అందుచే స్వామి ఈ రూపమును మరుగుపరచుము అని ప్రార్థించెను. వసుదేవుడు ప్రార్థించిన తరువాత దేవకి మహాపురుష లక్షణములతో ప్రకాశించుచున్న కుమారును చూచి కంసుని వలన భయము గలదై పవిత్రమగు చిరునవ్వుతో స్వామిని ఇట్లు స్తుతించెను. నీ రూపము ప్రకృతి వలె ఈ ఇంద్రియములకు గోచరముగున్నది కాదు. సకల జగత్తుకు కారణమైనది. సత్తరజస్తమో గుణములు లేనిది. వృద్ధి క్షయము లేనిది. స్వయం ప్రకాశము. శోక మోహాది వికారములు లేనిది. పుణ్య పాప రూప కర్మ లేనిది. అన్ని కాలములయందు సంకోచము లేక ప్రకాశించును. జ్ఞానము కలది. స్వరూపముచే గుణములచే నిరతిశయము గల మహత్వము కలది. రెండు పదార్థముల కాలము గడిచి మహాభూతములన్నియు లయమైన నాడు రెండు పరార్థముల కాలము గడిచి మహాభూతములన్నియు లయమైన నాడు ప్రకృతి పురుషుడు వ్యక్త రూపమును వీడి నీతో ఒకటిగా చేరిన నాడు మిగిలి ఉండడివాడవు నీవే కదా, నీవు అవ్యక్త బంధువు. కాలము నీ శరీరము. అది నీకంటే వేరుగా కనుపోవుటకు ఆరంభించుట సృష్టికి ఆరంభము. నీవు ఈ జగత్తును సృష్టించుటకు సంకల్పించినది మొదలు కదలిక కదలికనే కాలము అందురు. దానిలో నిమిషము అల్పాంశం. వత్సరము అధికాంశము. అట్లు ప్రకృతి పురుషులను కాలము నీ నుండి వేరుగా గుర్తించుటకు వీలు కాకుండా నీతోనే చేర్చుకొని ఉన్న సర్వ జగత్ కారణభూతుడవు నీవు. మర్త్యుడు మృత్యువను కాలసర్పమునకు భయపడి తప్పించుకొనవలెని పరుగులెడుచుండును. ఎక్కడికేగినను ఏ రూపములోనునను ఆ భయం వెంటాడుట తప్పదు. అనుకొనకుండా ఒకనాడు నీ పాద పద్మములను చేరిన ధన్యుడు ఆ భయము తొలగి స్వస్థతనొందును. మృత్యువు వానిని వదలి వెనుతిరిగిపోవును.
ఉగ్రసేనుని కుమారుడు కంసుడు పరమ క్రూరుడు. వాని వలన మేము భీతినొందియున్నాము. నీవు నీ భృత్యుల భయమును తొలగించువాడవు. కనుక మౌఖిక కనుక మాకిక భయం ఉండదు కానీ ఈ రూపము యోగులకు ధ్యానములో గోచరించదగ్గది దీనిని ఈ మాంస చక్షువులకు గోచరము నుగునట్లు చేయకుము. నీవు నాకు పుట్టినట్లు ఈ పాపాత్ములకు తెలియరాదు. నీ కొరకు నేను కంసునికై భయపడుతున్నాను. హే విశ్వాత్మకా, నీ అలౌకికమైన రూపమును ఉపసంహరించుకొనుము. శంఖ చక్ర గదా పద్మములను దాల్చిన చతుర్భుజములతో కనపడవలదు. దీన్ని ఉపసంహరింపుము. ప్రభు ఈ విశ్వమునంతను ప్రళయమున నీ శరీరములో విశాలముగా ఉంచుకొనగలిగిన నీవు నా గర్భమున ఇమిడి ఉండుట విడంబరం. ఇంతటితో దేవకి స్తుతి, వసుదేవుని యొక్క స్తుతి, కృష్ణావిర్భావం మనం తెలుసుకున్నాం. దీని తర్వాత భాగాన్ని మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Whether it is the mind, pride, knowledge, or valor, all are destroyed by the one who is without equanimity and power. But, whether it is ego, pride, knowledge, or valor, Finally, it's good sense, but all this wealth is going away, so they are going away. They are like money if you have it or they are nothing. Aarohi 30th. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the fifth podcast episode of Dasam Skandham. Upon the occasion of Sri Krishna, until now, After the marriage of Devaki and Vasudeva, after the birth of seven, after imprisoning them in Cheras, all the gods, including Brahma and Rudra, come and praise and leave. Again, the next part, today we Let's find out. The time for the unborn God to be born has come. That itself is auspicious for that time. At that time, the planets and stars were at peace. The star Rohini is associated with the god Brahma. All around is pure. Stars are shining. The whole earth is full of auspiciousness. Towns, Villages. The villages are auspicious. The rivers were crystal clear. Lotuses bloomed on the lakes. Birds and bees are making a joyful noise. The air was filled with dust. The sacred fragrances. The Brahmins are burning with a sense of peace through the homam and homas.
The minds of the gods and sages were filled with joy. The midnight darkness has fallen over the town. The clouds thunder softly. At that time, as the moon appeared in the east direction in the form of a goddess, the all-graceful Vishnu appeared. Vishnu is pervasive. Therefore, how did he appear at one place at one time before the moon was born? Similarly, Vishnu, who is always present everywhere, received a vision from Devaki Devi. It's not that he is not there. Therefore, Vishnu appeared, they said. Vasudeva saw the child who was born. He looked as if he had come from another world. A boy appeared. But Pundarikakshudu is four-armed, holding a conch, disc, mace, and lotus in four hands. He appeared to be one with a birthmark called Srivatsa on his chest and one with Kaustubha jewel shining on his neck. He was wearing a yellow robe on his divine body, which was as radiant as a black cloud filled with water. Indefinable She was wearing a crown studded with cat's eye and earrings. The hair was shining with the light of the pots. He was shining with ornaments like bangles, bracelets, and necklaces. Seeing those characteristics, it seemed as if it were the direct Lord Mahavishnu. But he was still a boy. That's a strange case. Vishnu’s son, Vasudeva, couldn’t bear it. Devaki's son was born as a son. But seeing the form, Srihari was surprised. He looked with wide eyes. In the joy of Krishna's birth, he thought he would give thousands of cows to the Brahmins and drank the water. But at that time, he did not have the opportunity to give. He concluded that he had found the Supreme Being. He prostrated himself, stood up, and prostrated himself again, holding his palms together in a gesture of reverence.
His light illuminated the entire city. Fear is not there, only joy is there. Vasudeva began to sing praises. You are the supreme being, the one who is famous in the Upanishads, as a man who is beyond nature. You are only knowledge, bliss, and form. You are the all-witnessing one, being the cause before creation, and having qualities like earth, water, fire, and air, which are beyond your understanding, you created the world through nature, and through the living being, you enter into it and wear it. Even though you enter the world, the changes that occur to it are as if you have entered it. Even though the gross elements of the sky and earth have entered the world formed by their union, you yourself enter the world as if appearing different from him. You look different. After being born, you were among them, and before that, you were not. In this way, even if you are in nature with the combination of the qualities of Sattarajastamo, you will not be surrounded by it. Because you are spread out, this is your inner part, this is your outer part It is not possible to mention. This world is emerging from you. It is being worn by you, appointed, and protected. It's within you. To save this world, by your will, you will wear a pure idol that is not mixed with impurities. To create this world, you are seated on the four-faced being with a body dominated by the quality of passion, having assumed the body that is full of passion. Similarly, to destroy this world, you assume the form of Rudra, who is in the body with the predominance of Tamoguna, and wear the Tamoguna-filled body. Now, seeing that demons are spreading in the name of kings in this world, you came as my son in my house, intending to destroy them and save the world.
But this uncivilized man killed those who were born before you. And as soon as his soldiers said that you were born, he came with a sword to kill you. Therefore, the Lord prayed, "Hide this form." After Vasudeva prayed, Devaki, seeing her son shining with the characteristics of a great man, was afraid of Kamsa and praised the Lord with a pure smile. Your form, like nature, is not visible to these senses. The cause of the whole universe. Sattarajasthamo is without qualities. Growth without decay. Self-illuminating. Free from the disturbances of sorrow and delusion. Punya is the karma of meritorious deeds. All times will be bright without any hesitation. The Knower. It is of infinite greatness, by its form and by its qualities. When the time of two substances passed and all the great beings were dissolved, when the time of two purposes passed and all the great beings were dissolved, when the nature and the man left their manifest form and joined you as one, you are the one who remained, aren't you You are a silent relative. Time is your body. That The beginning of creation is the beginning of your being different from yourself. From the time you decided to create this world, time is the movement, the movement itself. It's a tiny bit of a minute. Percent. Thus, nature, the male, is unable to distinguish itself from time, and you are the cause of the entire universe, united with you. A mortal, fearing death, is running to escape the serpent of time. Wherever you go, in whatever form, that fear will not leave you. Without expecting, one day, the one who reached your lotus feet, that fear will be removed and he will receive healing. Death will come and turn him away.
Kamsa, the son of Ugrasena, was extremely cruel. We are terrified of him. You are the remover of the fear of servants. Therefore, because of the oral, therefore, there is no fear, but this form is visible to the yogis in meditation. Do not make it visible to these flesh-eyed ones. These sinners do not know that you were born to me. For your own safety, I'm afraid to go to Kansa. Oh spirit of the universe, withdraw your supernatural form. One should not be seen with four arms, holding conch, disc, mace and lotus. Dismiss it. Lord, it is glorious that you, who can keep the entire universe in your body in the deluge, is contained in my womb. With this, we have learned the praise of Devaki, the praise of Vasudeva, and the manifestation of Krishna. We'll learn about the next part in another podcast. Jai Srimannarayana. Salutations to the Guru