శ్రీకృష్ణావతార ఆధ్యాత్మిక రహస్యం – దశమ స్కంధం పాడ్కాస్ట్ 3
Spiritual Symbolism of Krishna's Birth – Dasama Skandha Part 3
ఈ ప్రవచనంలో దశమ స్కంధంలోని ఆధ్యాత్మిక సంకేతాలు వివరించబడ్డాయి. వసుదేవుడు శరీరంలోని ఆత్మకు, దేవకి సాత్వికమైన నిశ్చయానికి, కంసుడు రాజసతామస అహంకార బుద్ధికి ప్రతీకలు. బలరాముడు ఆత్మస్వరూప జ్ఞానానికి, శ్రీకృష్ణుడు భగవద్జ్ఞానానికి సంకేతాలు; ఇవి రెండూ ముముక్షువుల సమూహమైన నంద వ్రజంలో వికసిస్తాయి. కంసునికి భయం, శిశుపాలునికి ద్వేషం, గోపికలకు కామం, పాండవులకు స్నేహం—ఏ తీవ్రమైన భావనైనా మనసును భగవన్మయం చేయగలదని నిరూపించబడింది.
This discourse explores the deep spiritual symbolism embedded in the tenth canto of Srimad Bhagavatam. Vasudeva represents the soul in the body, Devaki represents steadfast sattvic resolve, and Kamsa represents the ego-driven, rajasic-tamasic intellect that imprisons self-knowledge. Balarama symbolizes knowledge of the self (Atma swarupa jnana), while Krishna represents knowledge of the Supreme (Bhagavad jnana), both nurtured in the community of seekers (Nanda Vraja). The discourse concludes by explaining how intense focus on God—whether through fear (Kamsa), hatred (Shishupala), love (Gopis), or friendship (Pandavas)—leads to divine realization.
About this series
ఈ శ్రేణి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధాన్ని లోతుగా విశ్లేషిస్తుంది — శ్రీకృష్ణుని దివ్య జన్మ, లీలలు మరియు ప్రతి ఘట్టంలోని ఆధ్యాత్మిక తాత్పర్యాలను వివరిస్తుంది. కంసుని భీతి, వసుదేవుని వివేకం, దేవకీ గర్భంలో దేవతల స్తుతి మొదలైన విషయాలు తత్త్వ దీపిక దృష్టికోణంలో ప్రవచించబడ్డాయి. విశిష్టాద్వైత సంప్రదాయంలో ప్రవచనం.కామ్ ద్వారా అందించబడిన ఈ ప్రవచన శ్రేణి భక్తులకు అమూల్యమైన మార్గదర్శకం.
This series offers an in-depth exploration of the Dasama Skandha (Tenth Canto) of Srimad Bhagavatam, covering Krishna's divine birth, His leelas, and the profound spiritual symbolism behind each episode. Topics include Kansa's threat to Devaki, Vasudeva's wisdom, the devas' praise in the womb, and the mystical significance of Krishna's arrival. Presented in the Vishistadvaita tradition as part of the Tattva Deepika discourse series on Pravachanam.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః సత్కార పూర్వమార్యః ప్రయచ్ఛతి ఛన్నమర్థమర్ధిభ్యః యద్యపి నీచో యచ్ఛతి తత్కారణ వచ్చ జన వచ్చ సజ్జనుడు దరిచేరిన వారికి మర్యాదగా గుట్టుగా దానం ఇస్తాడు. దుల్వ మానిసి ఇవ్వడమే కష్టం. ఒకవేళ ఇచ్చిన ఏదో ప్రయోజనాన్ని ఆక్షేపించి మరి ఇస్తాడు. గోరంతలు కొండంతలు చేసి పెద్ద ఆర్భాటం చేసి మరి ఇస్తాడు. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక దశమ స్కంధం మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు దశమ స్కంధాన్ని ఉపయోగ ఉద్గాధం తెలుసుకొని దేవకి వసుదేవుల పరిణయమైన తర్వాత పుట్టినటువంటి పుత్రులను తను కంసుడు చంపటం తర్వాత బలభద్రుడు పుట్టడము తర్వాత ఎనిమిదో వాడి యొక్క గర్భంలో ఆవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత భాగాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఎనిమిదో బిడ్డగా తాను జన్మించవలెనని భగవానుడు సంకల్పించి వసుదేవుని మనసును తాను ఆవిషించెను. దీనిలో ఇమిడియున్న ఆధ్యాత్మిక రహస్యమును తెలుసుకుందాం. రథములో దేవకీ వసుదేవులు బయలుదేరుటతో కథ ప్రారంభమాయెను. మన శరీరమే ఒక రథం. ఈ రథమున దేవకీ వసుదేవులు సాత్వికమైన ధృతితో కూడిన ఆత్మ. శరీరమునున్న ఆత్మ వసుదేవుడనియు అతను అనుసరించి విడవకయుండెడి నిశ్చయమును దేవకి అనియు ఎరుంగవలెను. వసు శరీరమునుండెడివాడు. దేవ జ్ఞానము కలవాడు. ఆత్మ సాత్వికమగు ప్రకాశము కలిగి ఉండును. అందుచే అట్టి ధృతికి దేవకి ప్రకాశము కలది అని పేరు.
సాత్వికమైన నిశ్చయముతో కూడిన ఆత్మ యందు భగవానుడు ఆవేశించి అభివ్యక్తమగును. వసుదేవుని నుండి పుట్టినవాడు వాసుదేవుడు. మన ఆత్మ యందు భగవానుడు ఆవిర్భవించును. ఈ శరీరమనడి రథమును తమోగుణముచే ఆవిష్టమగు బుద్ధి రజోగుణ ప్రేరణచే స్వార్థముతో స్వతంత్ర బుద్ధితో నడిపించుచుండును. దీనిని కంసుడు అందురు. కంసుడు కాలనేమి. కాలము ఒక చక్రము. ఆ చక్రమునకు నేమి కామము అనగా కోరిక. అదే ఈ శరీరమును నడుపుచుండును. దానిని అంతమొందించుట మనవలన కాదు. అది రాజసమై తామసమై ఉన్ననాడు అసురమగును. అందుచే కంసుడు అసురుడు. వసుదేవుడు కంసుడు ఇరువురును క్షత్రుయులే కానీ అసురభాము ఆవేశించుటచే కంసుడు అసురుడాయెను. అతనికి అహంకారము, మమకారము అధికముగా నుండును. వేదము అశరీర వాణి కామజీవము భగవానుడు ఆవిర్భవించుటచే జరుగును అని చెప్పగానే కంసుడు ఉలికిపడును. వేదశాస్త్రములే అశరీరవాణి. అతను ఉరికిపడి దానిని అంతమొందింప ప్రయత్నించును. చివరికి బంధించును. దేవకీ వసుదేవులు చెరసాలలో బంధింపబడి ఉండిరి. మధురా నగరమే మనస్సు. మధించు శీలము గలది మధుర. అదియే మనస్సు. అది అసుర భావములచే తనలోని ఆత్మజ్ఞానమును బంధించి ఉంచును. అచట దేవకీ వసుదేవులకు ఆరుగురు జనించిన తరువాత ఏడవ గర్భమున శేషుడు జనించెను. ఈ శేషుడు ఆత్మ స్వరూప జ్ఞానం. ఆత్మ పరమాత్మ కొరకే ఉపయోగపడతగినది కానీ తన కొరకు తాను కాదు. పరునిచే నియమింపబడి పరుని కొరకే తాను ప్రవర్తించవలెను అను జ్ఞానము కలుగుట ఆత్మ స్వరూప జ్ఞానము కలుగుట. ఇది భగవత్ సంకల్పము చేయ కలుగును. ఆ భగవత్ సంకల్పమే యోగమాయ. అది మధురలో ఉండదు. నంద వ్రజమున పెరుగును. నంద వ్రజమే ముముక్షు కులము.
బంధమును వీడవలెనని కోరిక గలవారు ముముక్షువులు. వారికి నాయకుడు నందుడు అనగా భగవదానందముతో నిండి యుండెడి గురువు. అచట వారందరూ భగవత్ ప్రాప్తి కామిలు కాములు కనుక వారున్న ఊరు వ్రజము. కంసుని దుష్టతను సహింపలేని వారందరూ అచట తలదాచుకొందురు. కామముచే పరిపాలింపబడి మనసున కలిగెడి బాధను సహింపలేని వారు ముముక్షువులై నందుని వ్రజమున ఆశ్రయ పొంది ఉందురు. ఆత్మ సాక్షాత్కారమే బలరామ ఆవిర్భావం. బలరాముడు విజ్ఞాన బలధాముడు. ఆత్మ స్వరూప జ్ఞానం ముందు కలిగిన గాని భగవద్జ్ఞానము కలగనేరదు. ఇవి రెండును నందవ్రజముననే పెరుగును. ఇవే బలరామకృష్ణులు. ఆత్మ స్వరూప జ్ఞానమునకు బలరాముడు, భగవద్జ్ఞానమునకు శ్రీకృష్ణుడు మనకు ప్రతీకలుగా కనపడుచుందురు. లోకములో రజస్తమో గుణములు వ్యాపించి స్వతంత్ర బుద్ధి, స్వార్థ బుద్ధి పెరిగి కామమే పాలించునాడు. భగవానుడు తన సంకల్పముచే ఆత్మ స్వరూప జ్ఞానము గల మహాపురుషులుగా తానే అవతరించి తాను స్వయముగా మానవ శరీరముతో ఈ లోకమునకు దిగివచ్చును. ఈ శరీరమునకు అనర్థ హేతువులగు అవిద్యా కామ కర్మలను సపరివారముగా అంతమొందించి లోకమునకు మోక్ష మార్గము ఉపదేశించి ఇతరములేవియు ఉపాయములు కావని తానే ఉపాయమని ప్రదర్శించును. తన సౌందర్యముచే, లీలచే, గుణములచే ఆకర్షించి అందరూ తనతో ఆనందించునట్లు చేయును. ఇదియే అవతార ప్రయోజనం. జన్మలేని భగవానుడు అధర్మముచే నలుగురు పడుచున్న ఇక్కడే ఇప్పుడే దర్శనం వసంగకపోయినా రెప్పపాటు కాలము నిలవలేమని తలచు సాధువులకు తానే తన రూపముతో దిగివచ్చి దర్శనం వసంగును. స్వార్థ ప్రవృత్తితో, స్వతంత్ర స్ఫూర్తితో, దేహాత్మాభిమానముతో లోకమును పీడించెడి పాపులను దిద్దుపాటు చేయును. అదే సాధు రక్షణ.
దుష్ట శిక్షణ. భగవానుడు అనేక అవతారములను స్వీకరించెను అనగా జన్మించెను. అతనికి జన్మలు కర్మలచే కలిగినవి కావు. ఆశ్రితులను అనుగ్రహింపవలెనను సంకర్పముచే తాను కల్పించుకొనెనవి. అట్టి జన్మనెత్తి కొన్ని కర్మలు చేయును. ఆ కర్మలు మన కర్మలు వంటివి కావు. అవి లీలలు అనగా అనాయాసముగా ఏ ప్రయోజనము లేక చేసినవి. వానిలో రహస్యమును మనం ఎరింగినచో మనకు జన్మ కర్మ విముక్తి కలుగును. అవతారములన్నింటిలో రామకృష్ణావతారములు ముఖ్యమైనవి. శ్రీరాముడు మానవుడుగా నడిచినాడు. శ్రీకృష్ణుడు మానవునిలో అంతర్యామియై ఉన్న వాసుదేవ తత్వమును ప్రకాశింపచేసినాడు. ఇది పరిపూర్ణావతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయముగా భగవానుడు. సమస్త కళ్యాణ గుణములు కలవాడు. హీన గుణములు అంటని వాడు. అట్టివాడు మన ఈ మాంస చక్షువులతో చూచుటకు తగినట్లు దిగి వచ్చినాడు. ఈ అవతారమును భావించినా, ధ్యానించినా, గుణకీర్తనము చేసినా మన జన్మకు సార్ధకత కలుగును. అందుచే ఇక ముందు శ్రీకృష్ణావతారమును సేవింతుము. భగవానుడు వసుదేవుని మనస్సును ఆవేశించెను. దానితో వసుదేవుడు దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండెను. భగవానుని తేజస్సు వానిని చేరి ఉన్నది. ఆ వసుదేవుని అప్పుడు ఎవ్వరును తేరిపార చూడలేకుండా ఉండిరి. భగవదమస్యము అతని ద్వారా దేవకిలో ప్రవేశించెను. జగన్మంగళమగు ఆ అచ్యుతాంశమును వసుదేవుని మనసు నుండి దేవకి పొందెను. భగవానుడు సర్వ జగత్తు తన శరీరముగా కలవాడు. ఆత్మలకు ఆత్మ అయినవాడు సకల జగత్తునకు ఆనందము కలిగించువాడు. అతడు దేవకీ దేవి గర్భమున ప్రకాశించుచుండెను. చంద్రుడు తూర్పు దిక్కున కనపట్టిన నాడు ఆ దిక్కు ప్రకాశముతో ఉండినట్లు దేవకి సర్వ జగన్నివాసుడగు భగవానునకు తాను నివాసమై ప్రకాశవంతమై విరాజిల్లుచుండెను. చెరసాలలో బంధింపబడి ఉన్నది. ఆవరణ మధ్యమున పెరుగుచున్న అగ్నిశిఖ వలె ఆమె వెలుగుచుండెను.
వేద విరుద్ధ జ్ఞానము గల మూర్ఖుని యందు దోషరహితమగు ఉపనిషత్ వాని ప్రకాశించునట్లు ఆమె కంసుని చెరలో బంధింపబడి ఎవరికీ గోచరము కాకుండా వెలుగుచుండెను. కంసుడు ఒకనాడు చెరసాలకు వచ్చి ఆమెను చూచెను. ఆమె తేజస్సుచే భవనమంతయు ప్రకాశించుచుండెను. ఆమె పవిత్రముగు చిరునవ్వుతో ఆనందము కలది అయి ఉండెను. కంసుడు ఆమెను చూచి ఏమిది ఈమె మున్నెన్నడూ ఇట్టి తేజస్సుతో కనపడ్డలేదు. నా ప్రాణహరుడగు హరి ఈమె గర్భమున చేరి ఉండును. ఇప్పుడు ఏమి చేయవలెను? ఈమెను చంపెదనా? స్త్రీవధ మహా పాపము. అంతేకాదు గర్భవతి చెల్లెలు. ఈమెను చంపిన నా కీర్తియే మాసిపోవును. ఇది భగవానుని విచిత్ర లీల. చంపవలెననుకొనిన వానికి కూడా చంపుటకు సంశయమును కలిగించుచున్నాడు. ఆమెను చూడగానే అతని మనసు ధర్మ విచారణమున పడినది. గర్భవతిని చంపినవాడు జీవించి ఉన్నను చనిపోయినట్లే. అట్టి దేహాత్మాభిమానిని లోకమంతయు దూషించును. అంతేకాదు అతడు నరకమును పొందును. చంపుటకు సామర్థ్యము కలిగియు కంసుడు ఆ ప్రయత్నము నుండి విరమించెను. చంపుట మానిన నాడు గాని హరియందు వైరము మాత్రము తగ్గలేదు. అది సర్వకాలముల యందు సాగుచునే ఉండును. అది దైవలీల. దేవకిని చంపకుండునట్లును అతడు చనిపోవునట్లు స్వామి సంకల్పించెను. కూర్చుండినను, నిలచినను, పరున్నను, భోజనము చేయుచున్నను, తిరుగుచున్నను, నీరు త్రాగుచున్నను ఆ ఋషీకేశుని స్మరణయే సాగుచుండెను. సర్వ జగము హరిమయముగా ఉండెను. మన మనస్సు ఏదో ఒక విషయం ఆలోచింపక క్షణమైన నిలవదు. తలంపబడే వస్తువుల యందు సత్వము, రజస్సు, తమస్సు ఎల్లప్పుడూ ఉండును. అందు రజస్సు తమస్సు అంటును. తీవ్రమగు భావనతో సత్వమే కలిగిన భగవానుని స్మరించుటచే మనస్సు భగవన్మయమగును. తీవ్రమగు భావము అగ్ని వలె లక్క వంటి మనస్సును దర్వింపచేయును. మనస్సు లక్క వంటిది. కోపము, ద్వేషము, కామము, స్నేహము అను భావములు అగ్ని వలె మనస్సును ద్రవింపజేయును. కంసునకు కృష్ణుడు తనను చంపును అనడి భయము ఆవేశించి ఉన్నది. అది తీవ్రమై మనస్సును ద్రవింపజేసినది.
కరిగిన లక్కలో ముద్ర పడినట్లు శ్రీహరి అందు ముద్ర పడినాడు. అందుచే అతడేమి చేయుచున్నను మనసు శ్రీహరి రూపమునే తలంచుచుండును. ఈ స్థితి కలుగుటయే భగవదావిర్భావ హేతువు. స్మరింపబడిన వస్తువు భగవానుడు కావలెను. తీవ్రముగా భావించవలెను. ఆ భావనకు కంసునకు భయము కారణమాయెను. శిశుపాలునకు ద్వేషము కారణమాయెను. గోపికలకు కామము కారణమాయెను. పాండవులకు స్నేహము కారణమాయెను. ఏ భావననైనా నేమి మనసున కరిగించును చాలును. కంసుడు పుట్టబోవు శ్రీహరిని తలంచుచుండెను. దాని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Guru. The one who is worthy of respect, asks for alms from the needy. Even if he gives alms from his own pocket, the reason is that the person is a good person. He respectfully gives alms secretly to those who come near him. It's hard to get a duplicate. He will object to some of the benefits given and will give them. He makes them as small as a gorilla, as big as a mountain, and makes a big fuss. Devotees of God, welcome to the third podcast of Srimad Bhagavata Tatva Deepika, Dasham Skandam. Until now, after learning the use of the tenth canto, after Devaki and Vasudeva's marriage, Kamsa kills the sons who were born, then Balabhadra is born, then it happens to be in the womb of the eighth Vadi. Let's understand the deeper meaning of the following part. The Lord, desiring that he should be born as the eighth child, descended into the mind of Vasudeva. Let's understand the spiritual secret hidden in this. The story begins with the departure of Devaki and Vasudeva in a chariot. Our body is a chariot. In this chariot, Devaki and Vasudeva are gentle The soul with the power. The soul residing in the body is Vasudeva, and the determination to follow him without ceasing is Devaki, one should understand. Vasu is the embodiment of the body. The one who has divine knowledge. The soul shines with a gentle light. Therefore, such a courage is called the radiance of Devaki.
The Lord is revealed in the soul, filled with a pure determination. Vasudeva is the father of Vasudeva. The Lord Jesus Christ is one who is to be found in our own hearts. This body-moving chariot is driven by the intellect, which is obscured by the quality of ignorance, by the inspiration of the quality of passion, with selfishness, with independent intellect. Kansa will get it. Kamsa is dead. Time is a wheel. What is desire for that wheel? That is what drives this body. We cannot end it with our children. That which is in the Rajasic and Tamasic states becomes demonic. Therefore, Kamsa is an Asura. Vasudeva and Kamsa, both were Kshatriyas, but due to the demonic nature of the demon Bhāmu, Kamsa became a demon. He has excessive pride and attachment. The Vedas, the speech of the unmanifest, the life of desire, the manifestation of the Lord, as soon as it is said, Kamsa is startled. The Vedas are the incorporeal voice. He will try to end it by jumping. Finally, it will bind. Devaki and Vasudeva were imprisoned in the jail. Madhura is the city of my heart. Madhuchalam madhura. It's the mind. That is by the demonic feelings It locks the soul within. There, after six were born to Devaki and Vasudeva, Sheshudu was born in the seventh womb. This Sesha is the knowledge of the self. The soul is useful for the sake of the Supreme Soul, but not for itself. Having been appointed by the other, one should act for the sake of the other, to have that knowledge, to have the knowledge of the self. This is done by the will of God. The divine will is the yogic Maya. It's not available in Madurai. Nanda grows curd in the forest. Nanda Vraja is the lineage of the Mumukshu.
Those who desire to break the bond are Mumukshuvas. Their leader is Nandudu, meaning a guru filled with divine bliss. All those people there, desiring the attainment of God, are lustful, therefore the town they are in is Vraja. All those who cannot tolerate the wickedness of Kamsa will take refuge there. Those who are ruled by lust and cannot bear the suffering that arises in their minds, become Mumukshuvas, take refuge in the Vraja of Nandu, and remain. The manifestation of Balarama is the self-realization. Balarama is the lord of strength (Baladhama). Even if one has the knowledge of the self, one cannot attain the knowledge of the divine. These two grow only in Nandavraj. These are Balaramkrishna. Balarama is the symbol for self-realization, and Sri Krishna is the symbol for divine knowledge. In the world, when the qualities of Rajas and Tamas pervade, independent intellect and selfish intellect increase, and lust governs. The Lord, by His will, as great men with self-realized knowledge of the soul, may He descend into this world with a human body Himself. To this body, the causes of misfortune, ignorance, and karma, along with their entire family, are destroyed, and to the world He who preaches the path of liberation and demonstrates that he himself is the means, that no other means are. By her beauty, by her play, by her virtues, attracting everyone, she makes everyone enjoy with her. This is the purpose of incarnation. The unborn God, even if he does not appear here right now, even if he does not appear, the saints who think that even a blink of an eye cannot stand, he himself descends with his form and gives darshan. With selfish tendencies, with independent spirit, with body-consciousness, he corrects the sins that torment the world. That is the protection of the saints.
Wickedness. The Lord took many incarnations and was born. He is not born of karma. He created them with the intention that they should bless the dependent ones. Having taken such a birth, he performs certain actions. Those karmas are not like our karmas. Those are plays, meaning they were done without any purpose, effortlessly. If we understand the secret in it, we will be liberated from the cycle of birth and death. The incarnations of Rama are the most important of all incarnations. Lord Rama was a man. Sri Krishna illuminated the Vasudeva Tattva, which is inherent in man. It is the perfect embodiment of it. Krishna is God himself. Krishna is God in himself. One who is endowed with all aesthetic qualities. He who does not speak of his own faults. That person has come down to see us with these flesh-eye vision. Even if we consider this incarnation, meditate on it, or sing its praises, our birth will be fulfilled. Therefore, from now on, we will serve the incarnation of Lord Krishna. The Lord stormed Vasudeva's mind. With that, Vasudeva, with divine splendor It was shining. The radiance of the Lord reached him. At that time, no one could see Vasudeva. The Bhagavadamsa entered Devaki through him. Jaganmangalaamagu aa Achyutamshamunu Vasudeva manasuni nundi Devaki pondienu. The Lord of the Universe is the one who has the whole world as His body. He who is the soul to the souls, He who causes joy to all the world. He was shining in the womb of Devaki Devi. When the moon appeared in the east, Devaki, with the light of that direction, became the abode of the Lord, who is the resident of the entire world, and shone brightly. Imprisoned in the dungeon. She shone like a flame rising in the middle of the courtyard.
Like a Upanishad, which is flawless, shining in the prison of Kamsa, she was imprisoned and shining without being visible to anyone, like a Upanishad with knowledge contrary to the Vedas. Once, Kamsa came to the prison and saw her. Her radiance filled the entire building. She was full of joy, with a holy smile. Kamsudu, seeing her, said, "What is this? I have never seen a woman with such radiance before." My life-threatening Hari is in her womb. What should I do now? Shall we kill her? Killing a woman is a great sin. And the pregnant sister. My reputation will be tarnished if I kill her. This is the wondrous lore of the Divine. He is also causing doubt to kill the one who thought of killing. As soon as he saw her, his mind was filled with a religious inquiry. As a murderer of pregnant women, he is as much dead as if he had never lived. Such a body-ego-devotee will be hated by the world. Besides, he will go to hell. Kamsa, having the ability to kill, gave up that attempt. Even when the killing stopped, the enmity towards Hari did not diminish. That is for all time It continues in. It's God's will. The Lord willed that Devaki should not be killed and that he would die. Even while sitting, standing, lying down, eating, wandering, or drinking water, the remembrance of that sage continued. The whole world was filled with Hari. Our mind does not remain still for even a moment without thinking about something. In the objects that are considered, sattva, rajas, and tamas are always present. And the Rajasic and Tamasic tendencies. By remembering the Lord, who is filled with goodness and has intense feeling, the mind becomes filled with the Lord. A fierce emotion, like fire, can burn away the mind like wax. The mind is akin to Lacquer. Anger, hatred, lust, friendship, these feelings melt the mind like fire. Krishna is afraid and enraged that Kamsa will kill him. It was intense and soul-searching.
Srihari is sealed in the melted lac as if he were imprisoned. Therefore, whatever he does, his mind is always thinking of the form of Sri Hari. This state is the cause of the manifestation of the divine. The thing that is remembered is the Lord God. It should be taken seriously. Kansa was terrified by this thought. Hate is the reason for Shishupul. The cause of desire for Gopis. The Pandavas' friendship was the reason. Any feeling, whatever it may be, is enough to dissolve it in the mind. Kamsu was thinking of Srihari who was about to be born. We will learn about the next part in another podcast. Asmad Gurubhyo Namah. Jai Shri Mannarayana.