దేవకీ గర్భస్థ శ్రీహరిని దేవతలు స్తుతించుట – దశమ స్కంధం భాగం 4

Devas Praise Krishna in Devaki's Womb – Dasama Skandha Part 4

బ్రహ్మాది దేవతలు నారదాది ఋషులతో కలిసి కారాగారంలో ప్రవేశించి దేవకీ గర్భమున వసించిన శ్రీహరిని స్తోత్రం చేశారు. భగవానుని సత్యస్వరూపుడు, త్రిసత్యుడు, విశ్వ వృక్షమునకు ఏకైక ఆధారముగా కీర్తించారు. జీవాత్మ పరమాత్మలు ఆ వృక్షంలో రెండు పక్షులుగా నివసిస్తున్నారని వివరించారు. భగవంతుని పాదమే సంసార సముద్రమును దాటుటకు నౌకగా, భక్తులను రక్షించే సాధనముగా చెప్పారు. చివరగా దేవకీదేవిని ధన్యురాలిగా కొనియాడి, కంసుని సంహరించుటకు భగవానుడు జన్మించబోవుచున్నాడని ప్రకటించారు.

Brahma and other devas, along with sages like Narada, enter the prison to glorify the Lord residing in Devaki's womb. They praise Him as Satya-svarupa, the cosmic tree of existence, and the sole refuge for crossing the ocean of samsara. The devas describe the universe as His body, with jiva and Paramatma as two birds dwelling within. They affirm that His divine form, though transcendent, is taken up for the benefit of devotees and the destruction of evil, and that those who surrender to His lotus feet never fall back into rebirth.

About this series

ఈ శ్రేణి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధాన్ని లోతుగా విశ్లేషిస్తుంది — శ్రీకృష్ణుని దివ్య జన్మ, లీలలు మరియు ప్రతి ఘట్టంలోని ఆధ్యాత్మిక తాత్పర్యాలను వివరిస్తుంది. కంసుని భీతి, వసుదేవుని వివేకం, దేవకీ గర్భంలో దేవతల స్తుతి మొదలైన విషయాలు తత్త్వ దీపిక దృష్టికోణంలో ప్రవచించబడ్డాయి. విశిష్టాద్వైత సంప్రదాయంలో ప్రవచనం.కామ్ ద్వారా అందించబడిన ఈ ప్రవచన శ్రేణి భక్తులకు అమూల్యమైన మార్గదర్శకం.

This series offers an in-depth exploration of the Dasama Skandha (Tenth Canto) of Srimad Bhagavatam, covering Krishna's divine birth, His leelas, and the profound spiritual symbolism behind each episode. Topics include Kansa's threat to Devaki, Vasudeva's wisdom, the devas' praise in the womb, and the mystical significance of Krishna's arrival. Presented in the Vishistadvaita tradition as part of the Tattva Deepika discourse series on Pravachanam.

← Prev Next →
Devas Praise Krishna in Devaki's Womb – Dasama Skandha Part 4

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శీలం శౌచం శాంతిహి దాక్షిణ్యం మధురతా కులే జన్మ నవిరాజంతే సర్వాణ్యర్థ విహీనస్య పురుషస్య ధనం లేని వానికి శీలం, శౌచము, శాంతి, దాక్షిణ్యము, మాధుర్యము, సత్కుల జన్మ ఇట్లాంటి గుణాలు ఎన్ని ఉన్నా అవి రాణించవు. ఆర్యోక్తి 29. భవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక దశమ స్కంధం నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు కృష్ణ జననం గురించి ఉపోద్ఘాతమును వసుదేవుడు దేవకియుల వివాహము తరువాత బలభద్రుడు వరకు జన్మించినటువంటి కథ వృత్తాంతాన్ని కృష్ణుడు జననము విషయంలో అంతరార్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. దేవకీ దేవి గర్భమున సాక్షాత్ శ్రీహరి వసించి ఉన్నాడని ఎరింగిన బ్రహ్మాది దేవతలు నారదాది ఋషులతో చెరసాలలోకి వచ్చిరి. నమస్కరించి స్తోత్రము చేయుచుండిరి. ఈ విశేషమును గమనింపుడు. కృష్ణుడు పుట్టిన తరువాత మానవుడిగా నటించును. అందరూ మానవుడని భావింతురు. కానీ ఎరుకగలవారు భగవానునిగా గుర్తించి స్తుతింతురు. చెరసాలలో ఉన్నది దేవకి. దేవకి గర్భములోనున్నవాడు భగవానుడు. కంసుడు దేవకిని బంధించినాడు. దేవతలు బంధమును నుండ అవసరము లేదు. కానీ చెరసాలకు వచ్చినారు. అన్ని అడ్డములున్నను లోన ప్రవేశించగలవారులు. మరల వెలుపలకు ఏగగలవారు దేవతలు. గర్భములోనున్నవాడు దేవతల ప్రార్థనచే అవతరించునున్న భగవానుడని ఎరింగిన దేవతలు వచ్చి కృతజ్ఞతతో ఇట్లు స్తోత్రము చేయుచున్నారు.

స్వామి, నీవు సత్యవ్రతుడవు. ఆడిన మాటను పాలించుచు వాడవు. నీవు సత్యపరుడవు. చేతనా చేతనముల యొక్క కలయికచే ఏర్పడిన జగత్తుకు ఆవలి వాడవు. ప్రకృతి, పురుషుడు, కాలము అనే మూడును సత్యములే. ఈ మూడును నీ నియమనముచే నీచే ధరింపబడి నీ కొరకు ప్రవర్తించును. కావున నీవు త్రిసత్యుడవు. అంతేకాదు సత్యము అనబడు ఈ చేతనా చేతనాత్మకమగు సత్యమైన పరమ పదమున ఉండువాడవు నీవు. సత్యము అనబడు జీవుల కంటే కూడా సత్యమైన వాడవు. జీవుడు జ్ఞాన సంకోచ వికాసములు కలవాడగును. కానీ నీవు అట్టి మార్పుకు కూడా అందకుండా ఉందువు. కావున నీవు సత్యమును సత్యమై ఉంటివి. నీవు వృత సత్యములు రెండును రెండు నేత్రములుగా కలవాడవు. ఆదిత్యుడు సత్యము, చంద్రుడు వృతము. ఆ రెండును నేత్రములుగా కలవాడవు. ఆచరింపదగిన పుణ్య కర్మ వృతము. నోటితో పలుకునది సత్యము. ఆ రెండింటినీ ప్రవర్తింప చేయువాడవు నీవు. నీవు సత్యాత్మకుడవు. నీ స్వరూపము ఏ వికారమును అంటదు. నీ స్వభావము కూడా వికారమును అందదు. ప్రకృతి స్వరూపముచే మార్పు చెందును. కర్మ వశముచే జీవుల యొక్క స్వభావం మార్పు చెందును. కానీ నీవు స్వరూపమున స్వభావమున కూడా మార్పు లేకుందువు. కావున నీవు సత్యాత్మకుడవు. నిన్నే మేము ఉపాయముగా మనసును నమ్మి ఉన్నవారము. బ్రహ్మాదులు స్వామిని స్తోత్రము చేయుచు విశ్వరూపుడగు భగవానుని ఒక వృక్షముగా భావించుచున్నారు. భగవానుడు ఆది వృక్షం. ఆ వృక్షమునకు పరబ్రహ్మము ఒక్కటే ఆధారము కావున అది ఏకాయనము. జగము సుఖము, దుఃఖము అను రెండు ఫలములు అనుభవించుచుండును. కావున ఈ వృక్షము ద్విఫలము. ఇది త్రిమూలము. సత్తరజస్తమో గుణములు మూడును ఈ జగమునకు మూలము. ఈ వృక్షమున నాలుగు రసములు ఉండును. ధర్మ, అర్ధ, కామ మోక్షములు. ఆస్వాదింపబడు రసములు కావున ఈ వృక్షము చతురసము. దీనికి ఊడలు ఐదు. అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. కావున ఈ వృక్షము పంచశిఫము. ఇది షడాత్మ. ఇందు ఆరు భాగములు ఉన్నవి. అవి మనసు, జ్ఞానేంద్రియములు ఐదు.

ఈ వృక్షము సప్తత్వక్కు ఏడు పొరల చర్మము గలది. ఇవే సప్త ధాతువులు. మన శరీరములో చర్మము, కొవ్వు, మాంసము, రక్తము, మేధస్సు, మజ్జ. అస్తి, శుక్లము అనునవి ఈ ఏడు ధాతువులు. ఈ వృక్షము అష్టవిటపము అనగా ఎనిమిది శాఖలు గలది. రెండు చేతులు, రెండు పాదములు, శిరస్సు, కంఠము, వక్షము, జఠరము అనునవి శరీరమునకు ఎనిమిది శాఖలు. ఆ వృక్షము నవాక్షము అనగా తొమ్మిది తొరలు కలది. అవే మన ఇంద్రియములు. చెవులు రెండు, కళ్ళు రెండు, ముక్కు కన్నములు రెండు, నోరు ఒకటి, మూత్ర ద్వారము, మల ద్వారము అనే తొమ్మిది రంధ్రములు కలది శరీరం. ఈ వృక్షము దశచ్ఛదము. 10 ఆకులు కలది. శరీరంలో సంచరించు వాయువులు 10. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అని పది వాయువులు శరీరములో భిన్న భిన్న స్థానములలో ఉండి భిన్న భిన్న వ్యాపారములు చేయుచుండును. విశ్వమునంతోను ఒక్క చెట్టుగా భావించిన అదంతయు భగవాని శరీరమే కావున అతడే ఈ వృక్షం. ఈ వృక్షమునందు రెండు పక్షులు ఉన్నవి. ఆ రెండు పక్షులు జీవాత్మ పరమాత్మలు. ఇట్టి వృక్షము అనాదిగా సాగుచున్న శరీరము. దీనిలో జీవాత్మ పరమాత్మలు ఉండును. దీనికి ఆశ్రయం అనగా పాదు పరబ్రహ్మమే కనుక స్వామి. నీవే ఈ విశ్వ శరీర వృక్షమునకు ఒకే ఒక పాదుగా అంటే ఆధారముగా వంటివి. ఈ కనబడుచున్న జగత్తునకు నీవే కారణం వేరొక కారణము లేదు. ఇదంతయు ఒకప్పుడు నీయందే అణిగి ఉండును. నీవే దీనిని అనుగ్రహంచే రక్షించువాడవు. నీ మాయచే మోహితమైన మనసు కలవారలు జ్ఞానం లేరి వారరే జీవుడు నీకంటే వేరుగా నుండునని భావింతురు కానీ ఆ జీవుడు నీకు శరీరభూతుడే.

నీవే ఆత్మగా కల జీవుడు నీకంటే వేరుగా నుండ చాలడు. నీవే జ్ఞాన స్వరూపుడగు జీవుని యందు ఆత్మగా వ్యాపించి ఉందు. ఈ చరాచరమగు లోకము యొక్క క్షేమము కొరకు అనేక రూపములు దాల్చి అవతరించుచుందువు. నీ శరీరములు శుద్ధ సత్వమయములు. సత్పురుషులకు అవి సుఖము కలిగించునవి. దుష్టులకు అమంగళమును కలిగించినవి. నీ రూపమే ధ్యానములో దర్శింపదగినది. మనసును నీయందు నిలుపుట ఆచార్యునిచే ఎరింగి కొందరు శుద్ధ సత్వమయమగు నీ దివ్య మంగళ విగ్రహమును ధ్యానించి తరింతురు. జ్ఞానులగు గురువులు సంసార సముద్రమును దాటుటకు నీ పాదమునే పడవగా తమ వారికి అందింతురు. దానిని పొందిన వారు దూడాగును. దాటినంత సుఖముగా సంసార సముద్రమును దాటుదురు. నీ పాదమే ఈ సంసార సాగర తరణమునకు నౌక. దాటు ఒక శక్యము గాని. ఈ సాగరమును మహాపురుషులెందరో నీ పాద నౌక ఎక్కి దాటినారు. వారు దాటిన తరువాత తర్వాతి వారు దాటుటకు దానిని ఆ రేవులో ఉంచి వెలలినారు. పుండరీకాక్ష నీ యందు మనసు నిలవని అహంకారులు కొందరుందురు. వారికి నీ యందు భక్తి నిలవదు. వారి బుద్ధులు రాజస తామసములు. వారు తమ కర్మల చేతనే తరింతుమని భావింతురు. వరుణాశ్రమ ఆచారములను పాటించి అతి కష్టమున సుకృత విశేషముచే బ్రహ్మణాది జన్మలు పొందియు నీ పాదారవిందములను సేవింపని వారై. మరల క్రిందకు పడుచుందురు. నీ పాద భక్తి కలవారు ఎప్పుడును కిందకు జారరు అనగా జన్మింపరు. వారి మనసు నీయందే లగ్నమై యుండును వారు నిన్నే ప్రేమింతురు. వారిని రక్షించు బాధ్యత నీవే వహింతువు వారు. ఈ సంసారంలో జీవించి ఉన్నప్పుడు కూడా నీ ధ్యానమును విఘ్నములు ఏర్పడకుండా నీవే కాపాడుచుందువు. వారు నిన్నే పొందుచుందురు. ఈ లోకములో అసురులను చంపుటకు నీవు దిగి రానవసరం లేదు. నీ సంకల్పమే లోకమును కాపాడును. కానీ నిన్ను ప్రేమించి ధ్యానించెడి వారికి రూపమును దర్శింప చేయవలెనని. దానిని వారు చూచి మనసున నిలుపుకొనగలుగుదురని నీవు అంతరించుచు అవతరించుచుందువు. ఈ జగద్రక్షణమునకు రజస్తమస్సులు కలయికలేని శుద్ధ సత్వమయమగు శరీరమును దాల్చి ఉందువు.

ఆ రూపమే శరీరులకు శ్రేయస్సు కలిగించు సాధనము. నీ రూపమును దర్శించి అదియే ఆరాధింప తగినదని గుర్తించి కొందరు యజ్ఞాదులను నిర్వహింతురు. కొందరు తపస్సు చేయుదురు. కొందరు ఆ రూపమునే యోగముచే మనసును నిలుపుకొనుచుందురు. నీవు ఎట్టి రూపమును స్వీకరింపనిచో ఆరాధింపతగిన వాడెవడో తెలియక ఎట్టి రూపమును ధ్యానింపతగినదో తెలియక యోగులు, జ్ఞానులు, భక్తులు, తపశ్శాలులు చెడిపోదురు. నీవు లోకానుగ్రహమునకై రూపమును స్వీకరించి దర్శనమును సంగుదువు. నీవు రూపమును కలవాడవైనను గుణములు కర్మలు కలవాడవైనను అవి ఇతరుల రూపము వంటివి. గుణకర్మము లాంటివి కావు. అందుకే ఉపనిషత్తులు ఇట్టిదని చెప్పుటకు వీలు కానిది, గ్రహించుటకు శక్యము కానిది. ఇట్టి కర్మ కలది, ఇట్టి గుణము కలదని చెప్పుటకు వీలు కానిదని అదేస్యము, అగ్రాహ్యము, అరూపము, నిర్గుణము, నిష్క్రియము అనుచున్నది. కానీ నీ గుణములు లేవని, రూపము లేదని చెప్పలేదు. వైదిక కర్మలను ఆచరించునప్పుడు కానీ, లౌకిక కర్మలను ఆచరించుచున్నప్పుడు కానీ. ఎల్లవేళలా నీ మంగళకరమగు నామములను రూపమును చెప్పెడివారు దొరికినచో వినుచు వినడివారు దొరికినచో చెప్పుచు తనంత తానే స్మరించుకొనుచు జీవించువాడు మరల జన్మనొందడు. స్వామి, శ్రీహరి, ఆశ్రితార్థి హరి, మా అదృష్టముచే నీవు భూమిపై అడుగడబోవుచున్నావు. నీ పాద చిహ్నానువచే చెన్నితమైన ఈ భూమిని మేము ఇంకా చూడగలము. నీవు జన్మించుట ఏమి స్వామి? జన్మలేని నీకు జన్మయా అది నీకొక వినోదం. ఈ జగత్తునకు ఏ మాయచే ఉత్పత్తి మొదలగు వికారములు కలుగుచున్నవో ఆ మాయకు ఆశ్రయమైన వాడవు నీవు. అట్టి నీ పుట్టుకకు. ఆ మాయ కారణము కాదా? ఆ మాయకు భయపడిన వారి భయమును తీర్చువాడవు నీవు. వెనుక నీవు మత్స్య, అశ్వ, కూర్మ, వరాహ, రుసింహ, హంస, రాజ రూపములలో అవతరించితివి.

ఈనాడు భూభారమును తొలగించుటకు యదువంశును జన్మించుచున్నావు. అమ్మా దేవకి, నీవెంత ధన్యురాలవమ్మా, సాక్షాత్తు భగవానుడు నీ గర్భమున ఉన్నాడు. తన మృత్యువును తానే కోరుకొనుచున్న కంసును నుండి నీవు భయపడవలసిన అవసరం లేదు. యదువులను కాపావుటకు కంసుని సంహరించుటకు నీకు కుమారుడుగా భగవానుడు జన్మించబోవుచున్నాడు. ఇట్టు బ్రహ్మ రుద్రాదులు. తో కూడినటువంటి దేవతలందరూ భగవాను స్తోత్రం చేసి ఆజ్ఞ తీసుకొని మరల తమ స్థానానికి వెళ్లారు. దాని తర్వాత భాగాన్ని మనము తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Character, cleanliness, peace, and compassion are born in the lineage of the one who lacks wealth. For the one who lacks wealth, character, cleanliness, peace, compassion, sweetness, Even if a person has many good qualities like goodness, they will not shine. Aarooki 29. Dear devotees, welcome to the fourth podcast of Srimad Bhagavata Tatva Deepika, Dasham Skandam. Until now, we have learned the inner meaning of Krishna's birth, the introduction about Krishna's birth, the story of Krishna being born after the marriage of Vasudeva and Devaki, and the story of Balabhadra being born. Now, let's move on to the next part. The Brahma and other gods, knowing that Sri Hari himself resided in the womb of Devaki Devi, came to the prison with Narada and other sages. They were praying and praising. Pay attention to this special. Krishna will then act as a human for a while after his birth. Everybody thinks they are human. But those who are aware recognize and praise the Lord. Devaki is in jail. The Lord is the one who is in the womb of Devaki. Kansa has imprisoned Devaki. The gods do not need to be bound. But they've come to the prison. Those who have all the obstacles can enter within. The gods are the last to lose sight of the outside world. The gods who knew that the one in the womb is the God who is incarnated by the prayer of the gods, came and are praising thus with gratitude.

Swami, you are truthful. You keep your word. You're truthful. The world is the opposite of the combination of consciousness. Nature, man, and time are all truths. These three are appointed by your rule, and act for you. So you're a triplet. Not only that, you are the one who resides in the truth, which is called truth, which is cognitive, the supreme state. You are truer than the truthful creatures. The living being will have knowledge, contraction, and expansion. But you are not able to come to such a change. Therefore, you are truthful and truthful. You are the one who has two eyes, both of which are truths. The Sun is truth, the Moon is truthfulness. You are the combination of those two eyes. A virtuous deed worthy of being practiced. The truth is, is that the mouth is the place where it is spoken. You are the one who makes both of them function. You are the truth. Your form does not show any distortion. Your nature also does not accept distortion. It changes according to the nature of the form. Due to the influence of karma, the nature of living beings changes. But you The form and nature of the self are not changeable. So You Are The Satyasatham. We have been trusting our minds with a trick since yesterday. The Brahmins, while praising the Lord, consider the Lord, who is the embodiment of the universe, as a tree. The Lord is the tree of life. That tree has only one basis, the Supreme Being, therefore it is one. The world experiences two fruits, happiness and sorrow. Therefore, this tree is bifolium. It's the Trinity. The qualities of Sattva, Rajas, and Tamas are the root of this world. This tree has four sap. The four noble goals of life – dharma, artha, kama and moksha. Because they are enjoyed as rasas, this tree is chaturasam. It has five wings. They are sound, touch, form, taste and smell. Therefore, this tree is a five-leafed tree. It is Shadatva. It has six parts. They are mind and five senses.

This tree has seven layers of skin. These are the seven dhatus. In our body, skin, fat, flesh, blood, intellect, and marrow. Asthi, Shukla, and these seven are the elements. This tree is called Ashtavitapa, meaning it has eight branches. Two hands, two feet, head, throat, chest, stomach, etc., are the eight limbs of the body. The tree is Navaksham, meaning it has nine layers. They are our senses. Ears two, eyes two, nose and eyes two, mouth one, urinary opening, anal opening, the body has nine holes. This tree is a deciduous tree. It has 10 leaves. The 10 airs that travel in the body. Prana, Apana, Vyana, Udana, Samana. Nagamu, Kurmamu, Kakaramu, Devadattamu, Dhananjayamu, these ten winds, residing in different places in the body, perform different functions. Considering the universe as one tree, all of that is the body of God, therefore he is this tree. There are two birds in this tree. Both those birds are spirit beings. This tree since time immemorial The living body. It contains the living and the spiritual. The refuge for this is the Supreme Brahman, therefore, Swami. You are the only support, that is, the foundation, for this universal body tree. You are the reason for this visible world, there is no other reason. All of this was once contained within you. You are the one protecting it by grace. Those who have a mind deluded by your illusion, those who lack knowledge, think that the living being is different from you, but that living being is a body-consciousness to you.

You are the soul, the being, the one who is different from you. You are the one who is pervading as the soul in the being who is the embodiment of knowledge. For the welfare of this moving and unmoving world, you take many forms and incarnate. Your bodies are pure and pure-hearted. They are pleasures for the virtuous. Those who have caused misfortune to the wicked. You are the one I visualize in my meditations. To keep the mind in you, some people, having been initiated by the teacher, meditate on your pure, virtuous, divine auspicious form and cross over. The wise gurus, to cross the ocean of worldly existence, offer their feet as a boat to their disciples. Those who received it are the calves. They cross the ocean of life with ease. Your feet are the boat to cross this ocean of life. It's a force to be reckoned with. Many great men have crossed this ocean by boarding your ship. After they crossed, they placed it in the harbor for the next ones to cross. Some people have ego that their minds are not fixed on you, Pundarikaksha. They do not have devotion to you. Their Buddhas are Rajasic and Tamasic. They say that they are suffering because of their own actions They think. Following the Varunashrama rituals, having attained Brahmanadi births through great hardship and special merit, they are unable to serve your lotus feet. They fall down again. Those who have devotion to your feet will never fall down, meaning they will not be born. Their hearts are fixed on you, and they love you. You are responsible for protecting them. Even while living in this world, you protect your meditation from obstacles. They receive it yesterday. In this world, you don't need to descend to kill the demons. Your will is the one that protects the world. But to those who love and meditate on you, to show them the form. They will see it and be able to keep it in their hearts, and you will be destroyed and incarnate. For this worldly protection, you will have a pure, virtuous body without the combination of Rajas and Tamas.

That form is the means by which the body is blessed with prosperity. Having seen your form, recognizing that it is worthy of worship, some perform sacrifices. Some people do penance. Some people control their minds through yoga. If you do not accept any form, without knowing who is worthy of worship, without knowing what form is worth meditating on, the yogis, the wise, the devotees, and the ascetics will be ruined. You accept the form and vision for the welfare of the world. Even though you have form, even though you have qualities and actions, they are like the form of others. They are not like karmas. Therefore, it is not possible to say that the Upanishads are like this, it is not possible to understand. It is impossible to say that it has such karma, such qualities, it is not possible to say, it is inaccessible, formless, without attributes, inactive. But you have not said that you do not have the qualities or the form. When performing Vedic rituals or when performing worldly rituals. Whenever, those who tell your auspicious names and forms, listen He who, when found, tells others, and lives remembering himself, will not be born again. Swami, Srihari, the dependent Hari, by our good fortune, you are going to ask on earth. We can still see this earth, which is so vast because of your footprints. What is it, Swami, that you were born? Bornless, you are born, that is your entertainment. You are the one who is the refuge for that illusion, which is the cause of all the distortions that occur in this world. To your birth. Is that not the reason for the illusion? You are the one who fulfills the desires of those who are afraid of that illusion. Behind you, you incarnated in the forms of fish, horse, tortoise, boar, lion, swan, and king.

Today, you are born to remove the burden of the earth, the Yadava dynasty. Mother Devaki, how blessed you are, Mother, the Lord himself is in your womb. You need not fear Kamsa, who is seeking his own death. To protect the Yadus, to kill Kamsa, the Lord is going to be born as your son. Like this, Brahma, Rudra, etc. All the gods who were with him, praised the Lord, took his command, and went back to their respective places. We will learn about the next part. Jai Srimannarayana. Salutations to the Gurus