హిరణ్యకశిపుని తపస్సు & అసుర దౌర్జన్యము (Parts 1-3)

Hiranyakasipu's Penance & Demonic Tyranny (Parts 1-3)

bhagavatam

ఈ ఎపిసోడ్‌లో, తన సోదరుడు హిరణ్యాక్షుని వధానంతరం హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని మెప్పించేందుకు అత్యంత కఠోరమైన తపస్సు ఆచరించిన వైనాన్ని శ్రీమద్భాగవతం ఆధారంగా వివరిస్తాము. అతని తపోశక్తికి మూడు లోకాలు వణికిపోగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి అపూర్వమైన వరాలను ప్రసాదించారు. ఆ వరబలంతో మదించిన హిరణ్యకశిపుడు దేవతలను, మునులను, సమస్త జీవులను హింసించుచూ మూడు లోకాలపై తన అసుర దౌర్జన్యాన్ని అవిరామంగా సాగించాడు.

In this episode of our Srimad Bhagavatham podcast, we explore the fierce austerities performed by Hiranyakasipu after the slaying of his brother Hiranyaksha, as the demon king undertakes intense penance to gain unprecedented power from Lord Brahma. We witness how his tapas shakes the very foundations of the universe, compelling the creator himself to appear and grant him fearsome boons. With his newfound invincibility, Hiranyakasipu unleashes terrible tyranny across all the three worlds, striking terror into the hearts of sages, gods, and innocent beings alike.

Next →
Hiranyakasipu's Penance & Demonic Tyranny (Parts 1-3) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వి భారనాశో ముకుందః ఓ దేవదేవా దేవకీనందనా నీకు జయము వృష్ణివంశ మంగళ దీపమా కృష్ణా నీకు జయము సుకుమార శరీరా మేఘశ్యామా నీకు జయము భూభార నాశక ముకుందా నీకు జయము జయము ముకుందమాల థర్డ్ శ్లోక భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం మొదటి పాడ్కాస్ట్ లో స్వాగతం ఇంతవరకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం ఆరు స్కంధాలని పూర్తి చేసుకున్నాం. ఆరు స్కంధాలలో భాగవతంలో మనం పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్న పరీక్షిత్ మహారాజు యొక్క జననము సుఖ మహర్షి యొక్క ఆగమనము విరాట్ పురుషుని యొక్క స్వరూపము సృష్టి కార్యము దశవిధ లక్షణాలు అష్టాంగ యోగము విదుర ఉద్ధవ సంవాదము, విదుర మైత్రేయ సంవాదము, వరాహ అవతారము, హిరణ్యాక్షిణి వధ, కర్ధమ ప్రజాపతి దేవహుతి వివాహము, కపిల గీత. దక్ష యజ్ఞము, ధ్రువ చరిత్ర, పృథ్ చక్రవర్తి వృత్తాంతము, పురంజనోపాఖ్యానము, ప్రియవ్రతుని వంశము, జడభరతుని వృత్తాంతము, భూమండలము సూర్యచంద్రుల గమనము, నరక లోకాల వర్ణనము. అజామిలోపాఖ్యానము, దక్ష ప్రజాపతి జన్మించటము, వృత్రాసుర వధ, నారాయణ కవచం యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మనం జరిగినటువంటి పూర్తి చేసుకున్నటువంటి ఆరు స్కంధాల్లో మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఏడవ స్కంధంలో మనం విశేషమైనటువంటి విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

పరీక్షిత్తు సుఖయోగింద్రుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. భగవంతుడు సర్వ భూతముల యెడ సముడు కదా. అందరి యెడల ఆయన ప్రేమ సమానమే కదా. అట్టిచో ఇంద్రుని రాజ్యము దైత్యులు అపహరించిరని ఇంద్రుని కొరకు దైత్యులను తాను చంపదగునా? తాను అవాప్త సమస్త కాముడు కదా? దేవతలకు తనకు చే దేవతలు తనకు చే ఉపకారం ఏమియు లేదు. అసురులు చేయు హానియు లేదు. అయినచో దేవతల పక్షం వహించుట రాక్షసులను చంపుట తగునా నారాయణునకు వైషమ్యము పక్షపాతము ఉండునా అని. శ్రీ శుఖ యోగేంద్రుడు చెప్తున్నాడు, మహారాజా, నీవు అడిగిన ప్రశ్న చాలా మంచిది. దీనికి సమాధానం ప్రహ్లాదుని చరిత్రయే. ఇది పరమ పూజ్యమైన పరమ పుణ్యమైన కథ. భగవంతుని మహత్వమును మనకు ఎరుంగించునది భాగవతుని చరిత్ర. ఇందుచే ప్రహ్లాదుని చరిత్రను తెలుసుకుందాం. దానికి ముందుగా ఈ జగత్తు యొక్క రహస్యమును భగవాను యొక్క స్వరూపమును చెప్పదని వినుము. భగవానుడు రాగద్వేషాది గుణములు లేనివాడు. రాగము, ద్వేషము కలుగుటకు సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు గల ప్రకృతి సంబంధము కారణము. ఈ ప్రకృతి సంబంధము కర్మలచే ఆత్మలు కలుగుచుండును. సత్వము, రజస్సు, తమస్సు గుణములు గల ప్రకృతి యొక్క రూపాంతరములే ఈ జగత్తులో మన కంటికి కనిపించు సకల పదార్థములు. మన శరీరములు కూడా అట్టివే. వీటన్నింటిలో జీవులు ఉండురు. ఆ జీవులకు ఏనాడు కర్మలతో సంబంధం ఏర్పడినదో తెలియదు. అది ఆనాది. ఆ అనాది అయిన కర్మ సంబంధముచే ఈ జీవులకు శరీరముతో సంబంధము కలిగి రజస్సు, తమస్సు కర్మానుగుణముగా హెచ్చుచు తగ్గుచు ఉండును. ఈ జీవులు ప్రకృతితో కూడి భగవానుని చదివింపబడుదురు. నియమింపబడుదురు. జీవులు ప్రకృతి కలిసిన దానిని జగత్తు అందుము. ఈ జగత్తు శరీరం వలె భగవానునికి లొంగి ఉండును.

ఆయన లేనిదే ఇది నిలువలేదు. ఆయనలోన వ్యాపించి ఉండును. పైనున్న జీవుల కర్మలను బట్టి శరీరములో సత్వము, రజస్సు, తమస్సు మారి మారి వృద్ధి పొందుట తగ్గుట జరుగుచుండును. సత్వగుణము వృద్ధి పొందినప్పుడు ధర్మమునకు సత్యమునకు విజయము కలుగుచుండును. ఆ సత్వగుణము హెచ్చుగా గల దేవతలు ఋషులు. జయమును ఉల్లాసమును పొందుచుందురు. రజోగుణము వృద్ధి పొంది సత్వగుణము తగ్గిన నాడు అసురులు వృద్ధి పొంది విజయమును సుఖమును అనుభవించుందురు. తమోగుణము వృద్ధి నొందినప్పుడు యక్షులు, రాక్షసులు విజయమును, ఆహ్లాదమును పొందుచుందురు. ఈ మూడు గుణములే ఒకదానిని ఒకటి బాధించుకొనుచు క్రిందు మీదు లగుచుండును. ఇట్లు ఇవి లేచుటకు తగ్గుటకు కర్మ కారణము. కాలము దీనికి సాయపడుచుండును. వీటన్నిటిని నిలబెట్టుచు సాగుచున్నట్లు చేయువాడు భగవానుడు. అతని ద్వేషము గాని, ప్రేమ గాని ఒక దానిని ఒకటి బాధించుకొనుటకు కారణములు కావు. అది ప్రకృతి స్వభావము, కాల పరిణామం. అవి స్వతంత్రముగా నిలువగలిగినవి కావు. కనుక లోపల భగవానుడు వాటికి ఆధారమై వానిలో వ్యాపించి ఉండును. మన శరీరములో చైతన్యము గల ఆత్మ ఉంటే శరీరము నిలుచును. ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉండును. కానీ శరీరము తనంతట తాను మారుచునే ఉండును. అది దాని స్వభావం. అట్లే భగవానుడు విశ్వమునకు అంతకు లోన వ్యాపించి ఉండును. దానిని ప్రవర్తింప చేయును. దానియందు కలుగు మార్పులు దాని స్వభావమును బట్టియు కర్మను అనుసరించియు కాలమును అనుసరించియు సాగుచుండును. ఇదే దేవతలకు రాక్షసులకు గల వైరుధ్యము. సత్వగుణము దేవతలకు, రజోగుణము అసురులకు అధికము. సత్వగుణము జయించి రజోగుణము తగ్గుట విశ్వమునకు శ్రేయము. కానీ ఒకప్పుడు కాల కర్మానుగుణముగా రజోగుణము వృద్ధి చెందును.

అప్పుడు సత్వగుణమును వృద్ధి పొందించి రజోగుణమును తగ్గించుట విశ్వమునకు హితం. కనుక భగవానుడు రజోగుణమును తగ్గించుట సత్వమును వృద్ధి పొందించుట చేయుచుండును. భగవానునికి పక్షపాతము గాని వైషమ్యము గాని లేవు. వాని వాని స్వభావమును అనుసరించి నడుచు వానిని లోక శ్రేయస్సుకు అనుగుణముగా మలచుటయే స్వామి లీల. ఆయనకు రజస్సు, తమస్సు అంటవు. రాగద్వేషములు ఉండవు. ఇవి నిలుచుటకు, సాగుటకు ఆయన సంకల్పమే కారణము. పూర్వము రాజసూయమున శ్రీకృష్ణ భగవాను నిందించుచున్న శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపినాడు. ఆ శరీరము నుండి దివ్యమైన కాంతితో వాని ఆత్మ శ్రీకృష్ణునిలో ప్రవేశించెను. దానిని చూచి ధర్మరాజు ఆశ్చర్యపడినాడు. నారదును ప్రశ్నించినాడు. వేరొక కోరిక లేక భగవంతునే ఆరాధించువారు పొందడి ఫలమును పొందినాడు శిశుపాలుడు. నిందించిన వానికి ఇంతటి ఫలమెట్లు సిద్ధించెను? పూర్వము వేనుడను రాజు కూడా ఇట్లే భగవంతుని నిందించినాడు. కానీ అతడు నరకమును పొందినాడు. శిశుపాలుడు అంతకన్నా ఘోరముగా నిందించినాడు. కానీ భీష్మాదులందరూ చూచుండగా కృష్ణులో చేరెను. ఏమి కారణము అని యుధిష్ఠిరుడు నారదుని ప్రశ్నింపగా నారదుడు ఈ విధంగా సమాధానం చెప్పినాడు. స్తోత్రము, నింద మొదలగునవి శరీరముకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. జీవుడు శరీరముతో చేరి ఉండును. ఆ శరీరమే తాను అని అభిమానించి ఆ నిందను స్తుతిని అజ్ఞానముచే తనవిగా భావించును. ఈ శరీరమునకు ఆత్మకు గల భేదమును గుర్తించలేడు. అందుచే శరీరమునకు కలిగిన దుఃఖములన్నియు తనవే అనుకొనుచుండును. శరీర సంబంధమును వదలి ఆ భగవానునితో సంబంధమునే భావించినప్పుడు ఈ ఆత్మకు శరీర సంబంధముచే కలుగు దుఃఖము అంటదు.

శరీర సంగమును వీడి భగవంతుని యందే మనసు నిలుపుటకు భక్తి ప్రధానమైన సాధనము. శిశుపాలునకు భక్తి లేదు కానీ భక్తిచే ఆరాధించబడు భగవానుని ద్వేషించినాడు, దూషించినాడు, సంతతము మరియు ఒక భావము అడ్డుపడకుండా అతనినే ప్రేమతో స్మరించకుండా స్మరించుట సాగినది. నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుట తనకున్న ద్వేషము కారణము, మాత్సర్యము కారణము అని కూడా తెలియని దశ ప్రాప్తించినది. ఈ దూషణములు శ్రీకృష్ణుకు బాధను కలిగించలేదు. అతనికి శరీరముతో తానొకడను భావము లేదు. కనుక శిశుపాలునకు శ్రీకృష్ణ స్మరణమే సాగినది. పట్టుదల పెరిగినది. భావన అతిశయించినది. ఎందుకు తాను దూషించుచున్నాడో కూడా మరిచినాడు. మనసు సంతతము కృష్ణుడినే స్మరించుటచే అతని ఆత్మ ఆనంద స్వరూపుడగు భగవంతునిలోని చేరినది. వేనుడను రాజు ద్వేషమును మరవలేదు. కృష్ణుని స్మరణ పరిపూర్ణముగా సాగక ద్వేషమే ప్రధానముగా సాగినది. అందుచే వాడు నరకమును పొందినాడు. మన మనసుకు ఎల్లప్పుడూ ఏదో ఒక వస్తువును స్మరించుట అలవాటు. స్మరింపబడు వస్తువును ఆశ్రయము అందురు. లోకములో ఉన్న వస్తువులన్నియు సత్వము, రజస్సు, తమస్సులతో నిండినవే. తలంచబడే విషయములలో ఏ గుణము అధికముగా ఉంటే ఆ గుణము మన మనస్సునకు సంక్రమించును. తలంచడానికి కారణం ఏదైనను తలంచబడే విషయము భగవంతుడైతే అతనిలో రజస్తమస్తులు లేని శుద్ధ సత్వమే ఉండును. కావున అదే మన మనస్సునకు సంక్రమించును. ఆ సత్వగుణము మనస్సునకు అంటిన జ్ఞానము, సుఖము, శాంతి కలుగును. శిశుపాలుడు. వైరము చేత తలంచినను శ్రీకృష్ణుని తలంచినాడు. ఎందుకు స్మరిస్తున్నాడో మరచి స్మరిస్తున్నాడు. కనుక శకుని సాన్నిధ్యం పొందెను. మనస్సునకు ఆశ్రయము శుభమైనది కావాలి. దాన్ని పరిపూర్ణమైన భావముతో స్మరించాలి. అట్టిచో స్మరించిన వాడు ఎట్టివాడైనను ఆ స్మరించే భగవానునే చేరుతాడు.

ఈ రహస్యమును తెలుసుకొని ఇక మనము ప్రహ్లాదుని చరిత్రను తెలుసుకుందాం. మనం దీన్ని తర్వాత పాడ్కాస్ట్ లో విందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. Victory, victory to the God, the son of Devaki. Victory, victory to Krishna, the light of the Vrishni dynasty. Victory, victory to the cloud-white one. The gentle-limbed one, victory, victory to the destroyer of the burden of the earth, Mukunda. Oh God of Gods, son of Devaki, victory to you, the Vrishni dynasty Mangala Deepama Krishna, victory to you, beautiful body, cloud-like one, victory to you, destroyer of the earth, Mukunda, victory to you, victory to Mukundamala, third verse, devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, seventh book, welcome in the first podcast Thus, with the grace of the Lord, we have completed six kandhas. In the six cantos of Bhagavatam, we have the question of King Parikshit. The birth of King Parikshit, the arrival of Sukha Maharshi, the form of the cosmic being, the creation of the universe, the ten characteristics, Ashtanga Yoga, Vidura, Uddhava Dialogue, Vidura Maitreya conversation, Varaha incarnation, Hiranyakshini killing, Kardama Prajapati Devahuti marriage, Kapila Gita. Daksha Yagnyamu, Dhruva Charitramu, Prithvichakra Vruttanthamu, Puranjanoopakhyanamu, Priyavrathuni Vamsamu, Jada Bharatuni Vruttanthamu, The Earth, the movement of the sun and moon, and the description of the hellish worlds. The story of Ajamila, the birth of Daksha Prajapati, the killing of Vritrasura, the importance of Narayana Kavacham, all of these we have completed in the six cantos that we have completed. Now, in the seventh book, let's learn what are the special things.

Parikshit is questioning Sukha Yogindra in this way. God is equal to all beings. He loved everyone equally. If so, for Indra, the demons have stolen the kingdom, can he kill the demons for Indra? Is he the one who is not bound by all desires? The gods have no help from him, the gods have no help from him. The harm done by demons is not done by them. Even if it is, is it right to take the side of the gods and kill the demons? Does Narayana have discrimination or partiality? Sri Shuka Yogendra said, Your question is very good, Maharaja. The answer lies in the story of Prahlada. This is a very, very sacred story. The story of the Bhagavata is what makes us realize the greatness of God. Therefore, let us know the history of Prahlada. Before that, listen to the secret of this world and the form of the Lord. The Lord is free from all modes of being and is therefore unborn and unborn. The cause of raga and dvesha (dislike) is the nature of nature, which has three qualities: sattva (goodness), rajas (passion), and tamas (ignorance). This nature is related to karmas, souls It happens. The transformed forms of nature, which have sattva, rajas, and tamas qualities, are all the substances that appear to our eyes in this world. We are the same. All of these have living things in them. It is not known when these beings first became associated with karmic consequences. It's been a long time. Due to the eternal karmic connection, these beings have a connection with the body, and according to the Rajasic and Tamasic karmic qualities, it increases and decreases. These beings, along with nature, are taught by God. They are appointed. The world is what is made up of the union of beings and nature. This world is like a body, surrendered to the Lord.

It's not the same without him. It will spread through him. Depending on the actions of the beings above, the sattva, rajas, and tamas in the body change and increase or decrease. When the quality of goodness increases, righteousness and truth gain victory. The gods and sages are endowed with sattva. They will receive victory and joy. When the quality of passion increases and the quality of goodness decreases, demons increase and experience victory and happiness. When the quality of darkness increases, Yakshas and Rakshasas attain victory and happiness. These three qualities are mutually causing each other harm, one upon the other. Thus, these are the reasons for their rise and fall, due to karma. Time will help with this. The Lord is the one who makes all these things stand firm and continues to do so. His hatred or love is not the reason for hurting each other. It is the nature of things, the law of Karma. They are not able to survive independently. Therefore, the Lord is within them, based on them, and pervades them. In our body, with consciousness The body can be sustained by the soul. The soul pervades the whole body. But the body keeps changing on its own. That is its nature. Similarly, the Lord pervades the universe. It will make it happen. The changes that occur in it are according to its nature, according to karma, and according to time. This is the conflict between the gods and the demons. Sattva Guna is for the gods, and Rajo Guna is for the demons. Conquering the quality of Sattva and reducing the quality of Rajas is beneficial for the universe. But once upon a time, due to the influence of time and karma, the quality of Rajas increases.

Then, by increasing the quality of goodness and reducing the quality of passion, it is beneficial to the universe. Therefore, the Lord reduces the Rajoguna (the quality of passion) and increases the Sattva (the quality of goodness). God has no partiality or partiality. To mold one who follows his nature according to the welfare of the world is the play of the Lord. He cannot be subjected to Rajasic and Tamasic influences. There's no raga and rage. It is His will that they may stand and be upheld. In the past, during the Rajasuya Yagna, Sri Krishna killed Shishupala, who was criticizing Sri Krishna. From that body, with divine light, his soul entered into Sri Krishna. Seeing that, Dharmaraja was surprised. Narada was questioned. Shishupala, who had no other desire but to worship God, obtained the fruit of the lotus. What is the reward for the one who is condemned? Once upon a time, there was a king named Venu who also blasphemed God in the same way. But he got the Hell Stopper. Shishupul was even more horribly condemned. But as Bhishma and all his men were watching, Krishna joined them. What is the reason When Yudhishthira asked Narada, Narada answered in this way. Praise, blame, etc., are related to the body but not to the soul. The living being is connected with the body. He who is attached to the body as his own, considering that condemnation and praise as his own, considers ignorance as his own. He cannot distinguish the difference between this body and the soul. Therefore, he considers all the sorrows that have befallen his body as his own. When one abandons bodily relationships and contemplates on that divinity, this soul does not suffer the pain caused by bodily relationships.

To abandon worldly attachments and focus the mind on God is the primary means of devotion. Shishupala had no devotion, but he hated and insulted the Lord who was worshiped through devotion, and he continued to remember him with love without obstructing his constant and one feeling. Constantly remembering Sri Krishna, the reason for his hatred, the reason for his jealousy, even knowing this, he attained a state. These abuses did not hurt Sri Krishna. He has no sense of being a body. Therefore, Shishupala's remembrance of Sri Krishna continued. Perseverance pays. Overdrive, I tell you. He also forgot why he was cursing. By constantly remembering Krishna, the soul merges into the blissful form of God. Venu did not forget the king's hatred. The remembrance of Krishna was not complete, but hatred prevailed. Therefore, he attained hell. It is our nature to cherish something or the other. They take refuge in the object of remembrance. All things in the world are made of sattva and rajas Filled with desires. Among the things that are considered, if any quality is more dominant, that quality will be transmitted to our mind. Whatever the reason for thinking, if the thing being thought of is God, then he will have pure Sattva without Rajas and Tamas. Therefore, it will be transmitted to our mind. That sattvaguna (quality of goodness) is knowledge, happiness, and peace that is attached to the mind. Shishupala. Even though he thought of enmity, he thought of Sri Krishna. Forget why he remembered. Therefore, he attained the proximity of Shakuni. The mind needs a safe haven. Remember it with all your heart. He who remembers such a person, no matter what he is, will reach the God who remembers.

Knowing this secret, let us now learn the history of Prahlada. We'll hear the rest of this in the podcast later. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.