వానప్రస్థ సన్న్యాస విధులు - సకల కర్మల భగవదర్పణ విధానము

Rules for Renunciation & Offering Actions to Lord

bhagavatam

శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో వానప్రస్థ మరియు సన్న్యాస ఆశ్రమాల విధులు విస్తారంగా వివరించబడ్డాయి. సాంసారిక బంధాలను క్రమంగా త్యజించి, సర్వేశ్వరుడైన శ్రీహరిపై మనసు లగ్నం చేయవలసిన విధానం ఇందులో హృద్యంగా బోధించబడింది. సర్వ కర్మలను — శరీరంతో, మనసుతో, వాక్కుతో చేసే ప్రతి పనినీ — భగవంతునికి అర్పించే పద్ధతి మోక్షసాధనలో అత్యున్నత మార్గంగా నిరూపించబడింది.

In this sacred episode from Canto 7 of Srimad Bhagavatham, the rules and duties of Vanaprastha (forest-dwelling) and Sannyasa (renunciation) ashrams are beautifully expounded, guiding seekers toward the highest spiritual life. The episode reveals how one must progressively detach from worldly obligations and surrender entirely to the Supreme Lord Sri Hari. Most profoundly, the method of offering all actions — body, mind, speech, and deeds — unto the Lord is explained as the ultimate path to liberation.

← Prev
Rules for Renunciation & Offering Actions to Lord bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః హే లోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధేస్ చికిత్సామిమాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యామ్ యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్ పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం ఓ లోకులారా, చావు పుట్టుకలను వ్యాధికి యోగమెరంగి యాజ్ఞవల్క్యాదులగు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినుడు. వాడు కనుగొనిన మందు కృష్ణామృతము. దానిని సేవించిన ఈ వ్యాధి శాశ్వతముగా తొలగిపోవును. ఆ మందు ప్రకాశవంతము అద్వితీయము ఇట్టిదని చెప్పనలవి కానిదై వెలయుచుండును. ముకుందమాల ప్రేయర్ నెంబర్ 18. భగవంతులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తస్కంధము 15వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము, త్రిపుర దహన వృత్తాంతము, ప్రహ్లాద అవధూత సంవాదము, యుధిష్ఠిర నారద సంవాదంలోని నాలుగు ఆశ్రమ ధర్మాలు ఆ తరువాత నారదుడు ఇంకా వివరిస్తున్నటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా దానిలో ముందు భాగాన్ని తెలుసుకుందాం. శరీరము, ఇంద్రియములు మున్నగునవన్నియు పరమాత్మను పొందుటకు సాధనములుగా వసంగబడినవి. సంసార మార్గమున పయనించు జీవునకు ఆ విష్ణువునకు సంబంధించిన పరమ పదమే గమ్యస్థానం. దానిని చేరుటకు మార్గమున పయనించుటకు వసంగిన రథము శరీరము. ఇంద్రియములు ఆ రథమును నడిపెడి గుర్రములు. మనసు ఆ గుర్రములు కట్టిన కళ్ళెం.

శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇంద్రియములనిటి గుర్రములు పయనించు మార్గములు బుద్ధి సారధి. 10 విధములకు ప్రాణములు అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు ఐదు నాగ కూర్మ. ప్రకూర, దేవదత్త, ధనుంజేములు ఐదు. మొత్తము పది ప్రాణవాయువులు ఈ రథమునకు అక్షము వంటివి. అనగా రెండు చక్రములను కలుపు ఇరుసు. ధర్మము, అధర్మము ఆ బండిని నడుపు చక్రములు. దీనిలో కూర్చొని జీవుడు పయనించును. అతడు ఓం అనిటి ధనస్సును పట్టుకొని జీవుడను బాణమును పరమాత్మను గురిచేసి ప్రయోగించవలెను. రతికుడగు జీవుడు ఈ ప్రయాణమును సుఖముగా సాగించుటకు వీనినన్నిటిని తన వశమున ఉంచుకొనవలెను. రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము. అసూయ, మాయ, హింస, మాత్సర్యము, రజస్సు, క్రోధము, ప్రమాదము, ఆకలి, నిద్ర, అనునవి, ప్రయాణము సుఖముగా సాగకుండా చేసే ప్రతిబంధకములు. ఈ శరీరమును రథము ఎంతవరకు ప్రయాణము బాగుగా సాగించునో అంతవరకు దానిని ముక్తి సాధనముగా ఉపయోగించుకొనవలెను గానీ అదియే పరమార్థమని మొహంతో ఉండరాదు. సత్పురుషుల పాద సేవచే లభించిన పదునైన జ్ఞానమణుడి కత్తితో అచ్యుతుడే బలము గలవాడై శత్రువులను సంహరింపవలెను. చివరకు రథముతో ప్రయాణము చేసి స్వారాజ్యము పొంది సంతుష్టుడై ఈ శరీరమును వదలవలెను. అట్లుగాక పరాగు పడినచో ఇంద్రియములనిటి గుర్రములను అవివేకైన బుద్ధి అనిటి సారథి అను రథమును తప్పుదారి పట్టించి అనుభవించరాని విషయములని దొంగల పాలు చేయుదురు. ఆ దొంగలు బుద్ధినడి సారథి సహాయముతో ప్రయాణము చేయు జీవుని తమస్సుచే ఆవరింపబడిన మృత్యు భయ మృత్యు భయమును వసంగు సంసార కూపమున పడవేయుదురు.

వేదములలో చెప్పబడిన కర్మ ప్రవృత్తి రూపము, వేదములో చెప్పబడిన కర్మ ప్రవృత్తి రూపము, నివృత్తి రూపమును రెండు విధములుగా ఉండును. కోరికలతో ద్రవ్యముతో చేసేడి కర్మ ప్రవృత్తి. ఆ కర్మచే ఆయా లోకములకేగి మరల ఈ లోకమును వచ్చుచుందురు. కోరికలు లేక భగవదారాధన రూపముతో ఆత్మ, పరమాత్మ, జ్ఞానముతో భగవత్ సేవగా చేయు కర్మ నివృత్తి. ఆ నివృత్తి కర్మచే మోక్షము నొందును. వైదిక కర్మలు రెండు విధములు ఇష్టము పూర్తము అని. ఇష్టము హుతము ప్రహుతములని రెండు విధములు. వైశ్వదేవము హుతము బలిహరణము ప్రహుతము. ఇది ప్రవృత్తి అనేటి వైదిక కర్మ. అందు హింసతో కూడిన యజ్ఞములు అశాంతిని వసంగును. హింస లేక భగవదారాధన రూపముగా సాగినచో అది నివృత్తమనబడును. అది శాంతిను సంగును. దేవాలయ నిర్మాణము, తోటలు వేయుట, బావులు తవ్వించుట, సత్రములు ఏర్పరచుట మొదలగు వానిని పూర్తము అందురు. ప్రవృత్తి మార్గమున కోరికలతో కర్మలను ఆచరించువారు ధూమాది మార్గమున ఈ శరీరము నుండి వీడిన తరువాత పయనించి ఆయా లోకములు చేరి మరల జన్మను అందుచుందురు. జీవుడు శరీరమును వీడి విడలునప్పుడు ధూమ, రాత్రి, కృష్ణ పక్ష, దక్షిణాయన, పితృలోక, ఆకాశ, చంద్ర, దేవతా లోకమును అధిరోహించును. ఆయా లోకములు చేరి కర్మఫలం అనుభవించి మరల ఈ లోకమునకు వచ్చుతున్నప్పుడు చంద్ర స్థానము నుండి ఆకాశము, వాయువు, ధూమము, అభ్రము, మేఘము, వర్షము, ఔషధులు. అన్నము, రేతస్సు అని వాని ద్వారా స్త్రీ యొక్క గర్భమున చేరి మరల జన్మించును. జ్ఞానముతో ఇంద్రియ వ్యాపారమును భగవదారాధన రూపముగా ఆచరించి ముముక్షువై శరీరము నుండి బయలు వెళ్ళిన జీవుడు అర్చిరాది మార్గమున పై లోకములకు ఏగును. అగ్ని, సూర్య, దివస, శుక్ల పక్ష, ఉత్తరాయణ, అభిమాన దేవతా లోకములను అధిగమించి సంవత్సర, వాయు, సూర్య, చంద్ర, విద్యుత్.

వరుణ, ఇంద్ర, బ్రహ్మ లోకములను దాటి అతివాహుకులచే నడిమింపబడి భగవన్లోకమును చేరును. ఇవి రెండు మార్గములు. ధూమాది మార్గమున వెళ్ళిన వారు మరల వెనకకు వచ్చి జన్మింతురు. అర్చిరాది మార్గమున వెళ్ళిన వారు మరల వెనకకు రారు. ఈ విధముగా నారదుడు యుధిష్ఠునకు ధర్మము అన్నిటిని వివరించెను. గృహస్తుడై ఉన్నను శ్రీకృష్ణ సేవ చేతనే నీవు తప్పక తరించగలవని అతనికి చెప్పి భగవత్ సేవ చేయకాక భాగవత్ సేవ చేయ కూడా నేను మోక్షమును పొందితిని అని తన చరిత్రను నారదుడు యుధిష్ఠిరునకు ఇట్లు వివరించెను. గడిచిన బ్రహ్మకాలమున నేను గంధర్వుడను. నా పేరు ఉపబర్హనుడు. అందము, సౌకుమార్యము చూచిన వారి మనసును చూపును ఆనందింపచేయే శక్తి మంచి పరిమళము గల మాలికా చందనాది ధారణము నాకు ఉండెడివి. స్త్రీలు నన్ను ఎక్కువగా ప్రేమించేడివారు. నేను కూడా స్త్రీలోలతతో మదించి ఒంటిని. ఒకసారి భగవద్గుణానుభవం చేయుటకు దేవసత్రము చేయబడెను. అందు హరికథా గానమునకు గంధర్వులను అప్సరసలను ఆహ్వానించిరి. ఆ ఆహ్వానమును పురస్కరించుకొని స్త్రీలతో నేను కూడా వెళ్లి భగవద్గానము కాక ఇతర గానము చేయుచుంటిని. ప్రజాపతులు నేను చేసిన అపరాధమునకు శూద్రుడవై జన్మింతువు కాక అని శపించిరి. తరువాత నేను బ్రహ్మవేత్తల ఇంటిలో దాసిగా ఉండెడి ఒక ఆమెకు బుట్టనై బిడ్డనై పుట్టితిని. అచ్చటకు వచ్చిన బ్రాహ్మవేత్తలకు చాతుర్మాస్యమున శుశ్రుష చేసితిని. వారి అనుగ్రహముచే భగవత్ దర్శనం ఉంది బ్రహ్మపుత్రుడుగా మరల జన్మించితిని. కావున గృహస్థ ధర్మము సామాన్యమైనది కాదు. దాన్ని ఆచరించి సన్యాసులు పొందడి మోక్షమును పొందవచ్చును. ధర్మరాజా, ఈ లోకములో మీరు భాగ్యశాలులు. లోకమును పవిత్రము చేయు మునులను మునులు మిమ్ములను చేరుచుందురు. సాక్షాత్తు పరబ్రహ్మము మనుష్య రూపమున నిగూఢముగా మీ ఇంటనున్నాడు. ఆ పరబ్రహ్మమే మీ భావ శ్రీకృష్ణుడు మీకు మిత్రుడు. ప్రేమపాత్రుడు మిమ్ములను నిలబెట్టి నడిపించెడి ఆత్మ అతడే మహానుభావులు అనుభవింపగోరెడి ఆనంద స్వరూపుడు వాని రూపమును బ్రహ్మ రుద్రాదులు కూడా ఇట్టిదని గుర్తించలేరు అట్టివాడు మీచే ఆరాధింపబడినాడు అతడు మిమ్ములను అనుగ్రహించుకాక

అని ప్రార్థన. ధర్మరాజు సందేహమును తీర్చుచు నారదుడు ధర్మమును ఉపదేశించెను. దీనితోని మనకు సప్తస్కంధం పూర్తి అవుతుంది. మరలి మరలి మనము. అష్టమ స్కంధంలో తర్వాత కలుసుకుందాం. ఈ స్కంధంలో ముఖ్యంగా చివరి నాలుగైదు పాడ్కాస్ట్లో మనకు గృహస్థాశ్రమ ధర్మాన్ని విపులంగా మిశ్రేఖించారు. దీన్ని మళ్ళీ మనం విని మనం జీవితంలో కొంతైనా పాడించడానికి ప్రయత్నం చేయాలని ఆ చేయడానికి భగవత్ అనుగ్రహము. మీ సంకల్ప బలము ఆయన అనుగ్రహంచే ఉండి సార్ధకత పొందుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. O people, listen, I will cure the diseases of birth and death with the knowledge of Yoga. The sages, including Yajnavalkya, recite this mantra: 'Krishna, the imperishable, the only immortal, is pleased to drink this nectar. This nectar is the supreme medicine, which is known as Vitunate.' Nirvanamatyantikam O Lokukula, The treatment discovered by the sages, including Yajnavalkya, which is a combination of death and birth, is this. Listen. The medicine he discovered is Krishnamrutham. By consuming it, this disease will be permanently cured. That medicine is radiant, unique, and unlike anything else, it shines without needing to be described. Mukundamala Prayer Number 18. Oh Gods, welcome to the 15th podcast of Srimad Bhagavata Tattva Deepika Saptaskandam. Until now, Prahlada Charitamu, the story of Tripura Dahanam, Prahlada Avadhuta conversation, the four ashram dharmas in Yudhishthira Narada conversation, and then we are learning about the Grihasthashrama dharma that Narada is further explaining. And we'll learn about the front part of it. The body, senses, and so on, are all means to attain the Supreme Being They are bound. For the being who travels in the path of worldly life, the ultimate destination related to that Vishnu is the destination. The body is the chariot that is set in motion to reach it. The senses are the chariots which the mind draws to and fro. The bridle is the mind, and the reins are the emotions.

Sound, touch, form, taste, smell, senses, horses, paths traveled, intellect is the charioteer. For 10 types of life forces, namely Prana, Apana, Vyana, Udana, and Samana, five are Naga, Kurma. Prakoor, Devdutt, Dhanunjayam, five. All ten vital airs are like the axles to this chariot. That is, joining two wheels with a spike. Righteousness and unrighteousness are the wheels that drive the cart. The creature walks up to it. He should hold the bow called Om, aim the arrow at the soul, and fire it. The being who is a lover should keep all these things under his control in order to happily undertake this journey. Ragam, hatred, greed, sorrow, delusion, fear, arrogance, humility, insult. Jealousy, illusion, violence, envy, pride, anger, danger, hunger, sleep, and so on are obstacles that prevent travel from proceeding smoothly. This body, the chariot, to the extent that the journey goes well, to that extent it should be used as a means of salvation, but it should not be with the face that it is the ultimate goal. The sharp gem of knowledge obtained by serving the feet of the saints With a sword, Achyutudu, with strength, should be able to destroy the enemies. Finally, having traveled with the chariot, attained self-rule, and being satisfied, this body should be abandoned. If it is not like that, if the senses are like horses, and the foolish intellect is like the charioteer, they will mislead the chariot and make the things that should not be experienced like thieves. Those thieves, with the help of the charioteer of wisdom, pour down the fear of death, which is covered by the darkness of the living being, into the well of worldly suffering.

The karmic tendency described in the Vedas, the karmic tendency described in the Vedas, and the cessation tendency are of two types. The tendency of actions done with desires and money. By that karma, they go to those respective worlds and then come back to this world. Without desires, with the form of devotion to God, the soul, the Supreme Soul, with knowledge, the cessation of karma that serves God. That cessation of mental states leads to the realisation of the true nature of oneself. Vedic rituals are of two types, desirable and complete. Ishtamam, Hutamam, and Prahutamam are two types. Vaishvedaamu, Hutamu, Baliharanamu, Prahuthamu. This is a natural tendency, a Vedic ritual. And the sacrifices accompanied by violence will bring unrest. If it continues as a form of devotion to God without violence, it will be considered complete. It's a peaceful one. The construction of temples, planting gardens, digging wells, establishing rest houses, etc., are completed. Those who perform actions with desires in the path of inclination, after leaving this body in the path of smoke, travel and reach those worlds and are reborn again. When a living being leaves the body, smoke, night, Krishna Paksha, Dakshinayana, Pitruloka, Akasha, Chandra, and Devata Lokamu are ascended. When they reach this world after joining the respective worlds and experiencing the fruits of their actions, from the lunar position, the sky, air, smoke, wind, clouds, rain, and medicines. Food and semen, through him, enter the womb of a woman and are born again. By practicing the sensory activities with knowledge as the form of divine worship, and being a seeker, the being who departs from the body will ascend to higher worlds through the path of Archara. Agni, Surya, Divasa, Shukla Paksha, Uttarayana, surpassing the worlds of deities of affection, year, air, sun, moon, electricity.

Varuna, Indra, crossing the worlds of Brahma, being subdued by the Ativahukas, will reach the world of the Lord. These are the two modes. Those who go on the path of smoke will return and be reborn. Those who go on the Archaadi path will not return. In this way, Narada explained to Yudhisthira all the dharma. Even though he is a householder, he told him that you can surely be saved only by serving Sri Krishna, and without serving Bhagavat, even serving Bhagavat, I have attained salvation, and Narada explained his history to Yudhishthira in this way. During the Brahma Kalaya, I was a Gandharva. My name is Upabarhanu. Beauty, modesty, seeing, shows the mind, the power to make one happy, a garland with good fragrance, sandalwood, etc., I have. Women love me more. I too have been captivated by the feminine charm. Once, a divine assembly was held to experience the divine qualities. They invited Gandharvas and apsaras to the Harikatha recital. Taking that invitation, I also went with the women, not only singing devotional songs but also other songs I was doing. The people cursed me, saying that I would be born a Shudra because of the offense I had committed. After that, I was born to a woman who was a maidservant in the house of Brahmins. I performed the Chaturmasya rituals for the Brahmins who came there. By their grace, I have had a vision of the divine, and I have been reborn as a son of Brahma. Therefore, the duty of a householder is not ordinary. By practicing it, the monks can attain salvation. Dharmaraja, you are the lord of fortune in this world. The sages who purify the world will reach you. The Supreme Being himself is in the form of a human being, hidden in your house. The Supreme Brahman is your Bhagavan Sri Krishna, your friend. The beloved one, the soul that establishes and guides you, is the great one. The form of the one who experiences bliss is such that even Brahma, Rudra, and others cannot recognize it. Such is the one who is worshiped by you. He is you Anugrahaka

That's my prayer. Dharmaraja, resolving his doubts, Narada imparted Dharma. With this, our seven-petaled flower is complete. Again and again we. We will meet in the eighth book later. In this book, especially in the last four or five podcasts, they have elaborated on the Grihasthashrama Dharma. We should listen to this again and try to sing something in our lives. To do that, we need God's grace. Hoping that your willpower will be fulfilled by His grace, Jai Srimannarayana, salutations to all the Gurus