నారద ఉపదేశము & గర్భస్థ శిశు సాధన (Parts 7-9)

Narada's Teachings & Instruction in the Womb (Parts 7-9)

bhagavatam

శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధంలోని ఈ భాగంలో, మహర్షి నారదుడు భక్తి మార్గాన్ని మరియు ధర్మ జీవన రహస్యాలను అత్యంత గంభీరంగా బోధిస్తారు. గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు నారదుని ఉపదేశాలను గ్రహించిన అద్భుతమైన వృత్తాంతాన్ని కూడా ఈ ఎపిసోడ్‌లో వివరిస్తారు. జన్మకు పూర్వమే భక్తి జ్ఞానాన్ని అందుకున్న ప్రహ్లాదుని చరిత్ర, భగవంతుని కృప కాలం మరియు స్థానం అనే పరిమితులను అధిగమిస్తుందని స్పష్టంగా చాటుతుంది.

In this episode of Srimad Bhagavatham Canto 7, the great sage Narada imparts profound spiritual wisdom, revealing the path of devotion and righteous living to earnest seekers. We also explore the remarkable account of Prahlada receiving divine instruction while still in his mother's womb, absorbing Narada's teachings on bhakti even before birth. These episodes together illustrate that true spiritual knowledge transcends all boundaries of time, place, and circumstance, and that the Lord's grace can reach a sincere soul at any stage of life.

← Prev Next →
Narada's Teachings & Instruction in the Womb (Parts 7-9) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృంద వందితం నారదాది మునీశ్వరులచే శవింపబడుచుండు వానిని పరాత్పరుని నందగోప కుమారుని నవ్వు రాజిల్లెడి మోము వానిని కృష్ణుని ఎల్లప్పుడూ నేను ధ్యానించుచుందును. కుందమాల నైన్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తస్కంధం. ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఆ పైన ప్రహ్లాదుడిని రకరకాలుగా బాదించటం తరువాత ఆయన తత్వాన్ని బోధించటం. తిరిగి శిష్యులు అంటే గురువులు ఆయనకు గృహస్థ ధర్మాన్ని బోధించడం ఆ తరువాత ప్రహ్లాదుడు తనతో పాటు ఉన్న శిష్యులకు భావధర్మాన్ని బోధిస్తున్నాడు. దానిలో తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు శవిద్దాం. దేహము ఆత్మలను విడదీసుకునుటకు కొన్ని ఉపాయములు చెప్పుదును. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, అహంకారము, బుద్ధి అన్నవి ఎనిమిది. సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు కలవి అయి ఉండును. కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు, పంచప్రాణములు, బుద్ధి అను పదునారిటి యొక్క సంఘాతం శరీరము. వానితో కర్మ వశమున చేరి ఉండువాడు జీవుడు. ఆ జీవుడు ప్రతి శరీరమున వేరు వేరుగా ఉండును. ఈ శరీరములు కదలునవి జంగమములు కదలనివి స్థావరములు అని రెండు విధములుగా ఉండును. ఆ రెండింటిలో జీవుడు ఉండును. ఆ జీవుడే ఆత్మ, ఆ ఆత్మనే నేను అందుము. వానిని విమర్శించి వివేకముతో గుర్తించవలెను. నేను తెలుసుకొనుచున్నాను, కోరుచున్నాను.

అని వాడుట వలనను నేను మేలుకొనినాను, కలగనినాను, గాఢనిద్ర పొందినాను అనుట వలనను అవి ఆత్మకు చెందినవి కావు. బుద్ధి యొక్క వ్యాపారములని గుర్తించవలెను. నా బుద్ధి నా మనస్సు అందుము. కనుక బుద్ధి మనస్సు నేను కంటే వేరని గుర్తించవలెను. ఈ ఉపాయముచే దేహము యొక్క స్వభావమును గుర్తించుచు జీవితమును సాగించుచు సత్వరజస్తమో గుణముల యొక్క ప్రవాహమును అరికట్టగలము. దానిచే పరతత్వముపై ప్రీతి కలుగును. భగవంతుని యెడల ప్రేమ వాని పరిచర్యయందు ప్రీతి కలిగినచో ఈ రాజస తామస భావముల ప్రకోపము తగ్గును. దానికి గురు సుశ్రూష చేయవలెను. సత్పురుషులతో సహవాసము చేయవలెను. భగవానుని ఆరాధించవలెను. భగవత్ కథలను శ్రద్ధతో వినవలెను. భగవాని గుణములను లీలలను కీర్తించుచుండవలెను. వాని మూర్తులను అభిషేకాదులతో పోజించుచుండవలెను. సర్వేశ్వరుడు భగవానుడు. సర్వ భూతములందు ఉన్నాడని గుర్తించి. సర్వ భూతములకు శక్తి కొలది వానికి కావలసినవి సమకూర్చుచు తృప్తి పరుచుండవలెను. ఈ విధంగా భగవల్లీలా శ్రవణముతో ఆనంద పరవశమైన జీవితమును గడుపువాడు కర్మ బంధములను వీడి. భగవత్ భావనచే తాను భగవత్ సాయుధ్యమును పొందును. దుఃఖమైన సంసార చక్రమును శిథిలము చేయుటకు ఆనందమయమైన ధామమును చేరుటకు లోనున్న ఈశ్వరుని భజించుట కంటే వేరొక మార్గము లేదు. భగవదుపాసనము అతి సులభము. అందరికీ అంతరాత్మయై ఉండువాడు భగవానుడు. అతడు మనలోనే ఉన్నాడు. వానిని ఎరింగి భజించిన కలిగెడు సుఖము శాశ్వతము. ధనము, భార్య, పశువులు, బిడ్డలు, ఇల్లు, భూమి, ఏనుగులు, గుర్రములు మొదలగు మన మార్జించు అర్ధకామములు క్షణభంగములు భంగురములు.

ఆ ఆర్జించుటలో క్లేశము ఎక్కువ. అవి స్థిరముగా ఉండవు. దుఃఖమునే కలిగించును. దుఃఖము పోవలెననియు సుఖము నందవలెనియు కొన్ని కర్మలను చేయు సంకల్పింతుము. కానీ అవి దుఃఖమునే వసంగుచున్నవి. దుఃఖమును తొలగించుట లేదు. కారణము దాని వెనకనున్న కామము అనగా కోరిక. కోరికతో కాక భగవాని ఆరాధనగా ఆ కర్మలను ఆచరించినప్పుడు అవి మనకు సుఖమును ప్రసాదించును. మనము కోరిన సుఖములన్నియు శరీరము కొరకే ఆత్మ కొరకు కాదు. ఆ శరీరం స్థిరమైనది కాదు, నశించునది. నశించిన తరువాత ఏ కుక్కలకు, నక్కలకు భుజించుటకు యోగ్యమగుచున్నది. మన శరీరమే మన సుఖము కొరకు వినియోగపడని నాడు బిడ్డలు, భార్య, రాజ్యములు, భోగములు మన సుఖమునకు సాయపడనని అగునా? కావున నేను అని భావించడి శరీరము సుఖమును కలిగింపదు. నావి అనుకొనుడివి కూడా సుఖములకు సాధనములు కావు. కాబట్టి ఓ బాలకులారా స్వార్థమును గూర్చి ఆలోచింపుడు. స్వార్థమనగా నా కొరకు నేను ఏమి చేయుచున్నాను అని విచారింపుడు. నేను అన్నది ఆత్మ. దాని కొరకు మనం ఏమియు ప్రయత్నించుట లేదు. కర్మలను చేయుచున్నాము. ఆ కర్మలచే మరల నేను నాది అని మోహము కలిగించు శరీరమును పొందుచున్నాము. ఈ విధముగా కోరికతో కర్మలను ఆచరించుట. కోరికలు తీరక దుఃఖముని అనుభవించుట, ఆ కర్మల వలన మరల జన్మించుట, మరల అట్లే కర్మలను చేయుట అనేటి చక్రమును సాగించుచున్నాము. కావున చేసిడి కర్మలన్నియు ఆర్జించు ధర్మ కామములన్నియు సర్వాత్ముడే వ్యాపించి ఉన్న శ్రీహరిచే నియమింపబడి శ్రీహరి కొరకే చేయుచున్నామని కోరిక లేక ప్రేమతో చేయుడు.

ఈ లోకములో ఏది మనము ప్రియమైనది అనుకున్నను అది భగవంతుని సంకల్పము చేతనే ప్రియమగుచున్నది. కావున వాడే మనకు ప్రియుడు. మనము ఏ శరీరముతో ఉన్నను, ఏ వర్ణములో ఉన్నను, ఎట్టి నడువడి కలిగినను, ఎంతటి పాండిత్యమున్నను, లోనున్న వానిని గుర్తింపని జీవితము సుఖప్రదము కాదు. వానిని గుర్తించుటకు ప్రేమించుటకు పాండిత్యము, యజ్ఞములు, దానములు సాధనములు కావు. నిర్మలమైన ప్రేమ, భక్తి ఉండవలెను. ఆ అంతరమైన భగవత్ తత్వమును ఎరుంగి ప్రేమించిన నాడు అన్ని ఆత్మల యందు సమభావము ఏర్పడును. సర్వభూతములకు భగవానుడే ఆత్మాని ఎరుంగుటచే సర్వత్ర దయ సౌహార్దము కలుగును. ఇది మనము మన కొరకు సంపాదించుకొనవలసిన పురుషార్థము. ఇదే స్వార్థము. ఇది లేనిదే ఎన్ని ఉన్నను వ్యర్థమే. మనము సంపాదించవలసినది ఏకాంత భక్తిర్ గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం గోవిందుని యందు ఏకాంత భక్తి అనగా అంతటను వానినే దర్శించుట. ప్రహ్లాదుడు చేసిన ఉపదేశముతో పిల్లలందరూ గురువులు చెప్పే పాఠములు పనికిమాలినవని గుర్తించి గ్రహించుట మానిరి. గురువులు హిరణ్యకశ్యపునితో ఈ విషయమునంతయు విషయమునంతను నివేదించిరి. ఉత్కటమైన కోపముతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని పిలిపించెను. దుర్వినీతా, బుద్ధిహీనుడా, నా ఆజ్ఞను తిరస్కరించుచున్న నిన్ను ఇప్పుడే యమలోకమునకు పంపుచున్నాను. నా కోపమునకు మూడు లోకములు వణుకుచుండగా నీవింత భయపడకు కారణమేమి? ఎవరి ఎండ చూచుకొని? నీవిట్లు ఎదిరించుచున్నావు అని పలికినాడు తండ్రి. ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రి.

నీకును లోకములోనున్న బలశాలులకు అందరకును బలము ఎవడో వాడే నాకు బలము. ఈ లోకములో స్థావరములు జంగములు. జంగమములు, పరులైన బ్రహ్మాదులు, అంతకు క్రిందు వారైన ఇంద్రాదులు కూడా అతని అధీనమునే కదులుచున్నారు, నిలుచున్నారు. అతడే వారికి బలము. తండ్రీ, ఈ అసుర భావమును విడిచిపెట్టుము. మనసే మనకు శత్రువులు, మిత్రులు అని భావమును సృష్టించున్నది. మనసు కంటే వేరొక శత్రువు లేదు. తప్పు దారిన పోవు మనసును జయింపలేని నాడు లోకమంతయు ప్రతికూలమే. మనసును సమభావమున నిలుపుకొనుటయే భగవంతుని ఆరాధనం. లోనున్న మనస్సును, ఇంద్రియములను జయింపక ఈ లోకములన్నిటినీ నేను జయించితిని అనుకొనుట అవివేకం. మనస్సును వశపరుచుకొనిన సమత్వ బుద్ధి గల సాధువునకు శత్రువులే ఉండరు. ప్రహ్లాదుడు ఇట్లు చెప్పగానే హిరణ్యకశిపుడు తీవ్రమైన రోషముతో వణుకుచుండెను. చనిపోయే ముందు దురదృష్టవంతులకు ప్రలాపములు వచ్చుండును. అట్లే హిరణ్యకశిపుడు నాకంటే ఈ లోకమున నియమించువాడు ఎవరొకడు ఉన్నాడా? వాడు అంతటా ఉన్నాడా? ఉంటే ఈ స్తంభమునందు కూడా ఉండునా? ఉన్నచో నిన్ను కాపాడగలడేమో చూతము. ఈ స్తంభము నుండి వాడు వచ్చి నిన్ను కాపాడినచో సరే, లేనిచో ఇదిగో ఈ కత్తితో నీ శిరస్సును త్రుంచెదను అని తన ఆసనము నుండి లేచి. కత్తి ఒక చేతితో పట్టుకొని పిడికిలితో సభలో ఉన్న ఒక స్తంభమును చరిచెను. వెంటనే అతి భీషణమగు ధ్వని వెలువడెను. అండకటాహం భద్ర బ్రద్దలాయను. ఆ ధనిని బ్రహ్మాదులు వారి లోకములో విని లయమగుచున్న వేమో అని భీతిల్లిరి. తన సభ నుండి బయలుదేరిన ఈ ధ్వనిని హిరణ్యకశిపుడు విని ఆ ధనికి కారణమేమో ఎరుంగలేక ఆశ్చర్యముతో నిలిచి ఉండెను. రాక్షసులందురు బెదబెదలాడుచుండిరి. ఆ తరువాత చెప్పినటువంటి విషయాన్ని మనం తరువాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. I contemplate Hari (Lord Vishnu) eternally. The lotus-like face of Nanda, the son of Gopa, the supreme being, is worshiped by the group of sages, Narada, and other sages. He who is being killed by Narada and other sages, the supreme being, the son of Nanda, the son of Gopa, laugh I always meditate on that beautiful face of Krishna. Kundamala ninth prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Saptaskandam. Welcome to the seventh podcast. Until now, the conversation that took place between Hiranyakashipu and Prahlada, and then torturing Prahlada in various ways, and then teaching him the essence. Again, the disciples, meaning the gurus, are teaching him the Grihastha Dharma (householder's duties). After that, Prahlada is teaching the Bhavadharma (emotional duties) to the disciples who are with him. We will explore the rest in the next part. I will tell you some ways to separate the body and soul. Earth, water, fire, air, sky, mind, ego, intellect, these are eight. It is composed of three qualities, namely sattva, rajas, and tamas. The five motor organs are: The five senses, the five vital energies, and the intellect are the combination of these ten things that constitute the body. The one who is attached to karma is a living being. That creature is different in every body. These bodies are movable, and the immovable ones are stationary, in two ways. The two would have been alive. The individual is the soul and the individual is me. He should be criticized and identified with wisdom. I'm coming to it, I'm coming to it.

And because of that, whether I am awake, whether I am asleep, whether I am in a deep sleep, because of that, they do not belong to the soul. The business of the intellect must be identified. I will give my heart and soul. Therefore, the intellect and mind should recognize that I am different from myself. By this method, recognizing the nature of the body, continuing life, we can control the flow of the three qualities: Sattva, Rajas, and Tamas. It leads to a love for the supreme reality. If there is love for God and devotion in his service, the aggravation of these Rajasic and Tamasic emotions will decrease. One should serve guru. One must associate with good people. One must surrender to the Lord. Listen with all your attention to the stories of the Lord. One should praise the virtues and divine play of God. They should be worshipped with abhishekam (sacred bath). The Almighty God. Recognizing that he is present in all beings. According to the strength of all beings, one should provide what they need and be content. In this way, one who lives a joyful life with the listening to the Lord's words, leaving behind the bonds of karma. By the feeling of God, he He will attain the state of being one with the divine. There is no other way to destroy the sorrowful cycle of life, to reach the blissful abode, than to worship God. Devotion to God is very easy. The Lord is near to all who are near to his heart. He's still with us. The happiness attained by worshiping him as a giver is eternal. Wealth, wife, cattle, children, house, land, elephants, horses, etc., our means of acquisition, desires, moments, and things.

The effort required to earn is very high. They are not stable. It's sad. I resolve to perform certain actions so that sorrow may go away and happiness may come. But they are only bringing sorrow. There is no getting rid of the sorrow. The reason is the desire behind it, that is, the wish. When we perform those actions as worship of God without desire, they bestow happiness upon us. All the pleasures we desire are for the body, not for the soul. The body is not permanent, it is perishable. After being destroyed, it is worthy of being shared by dogs and foxes. When our body itself is not used for our happiness, will children, wives, kingdoms, and pleasures not help our happiness? Therefore, I thought that the body does not bring happiness. Even if you assume, they are not the means to happiness. Therefore, O children, think about selfishness. Selfishness means contemplating what I am doing for myself. What I said is the soul. We are not trying anything for that. We are doing karmas. By those karmas, again I have attachment to myself We are gaining the body. In this way, performing actions with desire. To experience sorrow without fulfilling desires, to be born again because of those karmas, and to continue doing karmas again in the same way, we are following this cycle. Therefore, having done all the deeds, having earned all the righteous desires, being appointed by Srihari, who is pervading in all beings, we are doing it for Srihari, do it with desire or love.

Whatever we consider dear in this world, it is only by the will of God that it becomes dear. Therefore, he is our beloved. No matter what body we have, what color we are, what kind of walk we have, no matter how much scholarship we have, a life that does not recognize the one within is not pleasant. Scholarship, sacrifices, charity, and practices are not the means to recognize and love him. Pure love and devotion is expected. When one understands and loves the infinite divine essence, equanimity is established in all souls. By knowing that the Lord is the soul of all beings, there will be compassion and harmony everywhere. This is the effort we must earn for ourselves. That is jealousy. It is useless to have it without it. What we must earn is solitary devotion to Govinda. At that moment, solitary devotion to Govinda means seeing him everywhere. With the teachings of Prahlada, all the children realized that the lessons taught by the gurus were useless and stopped learning them. The gurus, with Hiranyakashipu, this entire matter, this entire matter They submitted. With intense anger, Hiranyakashipu summoned Prahlada. Durvinita, you are foolish, I am sending you to Yama's world right now, rejecting my command. While the three worlds tremble because of my anger, what is the reason that you are not so afraid? Whose sun is watching? The father said, "You are resisting." Prahlada is saying, Father.

To you and to all the mighty ones in the world, strength is given to me. In this world, there are stable and unstable things. The moving and the immovable, the Brahma and others, and even Indra and others below, are moving and standing under his control. He is the strength. Father, abandon this demonic feeling. The mind creates the feeling that we have enemies and friends. There's no enemy better than the enemy within. When the mind goes on the wrong path and cannot be controlled, the whole world becomes adverse. Controlling the mind and keeping it in equilibrium is the worship of God. It is foolish to think that I have conquered all these worlds without subduing the mind and senses that are in the loan. A sage with equanimity, who has conquered his mind, has no enemies. As soon as Prahlada said this, Hiranyakashipu, with intense anger, trembled. Before dying, the unfortunate ones will have cries. Similarly, is there anyone in this world besides me who is appointed by Hiranyakashipu? He's all over the place. If it is there, is it also in this pillar? Let's see if he can save you. This pillar If he comes and saves you, fine, otherwise, here, with this sword, I will cut off your head, saying this, he rose from his seat. He held the knife in one hand and struck a pillar in the assembly with the hilt. Immediately, a very terrible sound was emitted. The egg is not safe, it is broken. They were afraid, wondering what was causing the sound of the Brahma's and others' world to be destroyed. Hiranyakashipu, upon hearing this sound emanating from his assembly, was astonished and stood still, unable to understand the cause of that sound. The demons are fighting among themselves. We will learn about what was said afterwards in the podcast later. Jai Srimannarayana. Salutations to the Gurus