హిరణ్యకశిపుని ఆగ్రహము - బాలునిపై వివిధ వధోపాయముల ప్రయోగము
The Enraged King Attempts Various Ways to Kill Prahlada
శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, పుత్రుడైన ప్రహ్లాదుని విష్ణుభక్తికి క్రోధోన్మత్తుడైన హిరణ్యకశిపుడు అతనిని నానావిధములైన మరణవేదనలకు గురిచేయుటకు పూనుకొనుచున్నాడు. విషసర్పములు, మత్తగజములు, పర్వతశిఖరముల నుండి పతనము వంటి అనేక క్రూరోపాయములను రాక్షసరాజు ప్రయోగించినను, బాల ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహముచే నిర్భయముగా అన్నింటినీ అధిగమించుచున్నాడు. ప్రతి పరీక్షలోనూ దైవకృప అతనిని రక్షించుచుండుట చూసి హిరణ్యకశిపుని ఆగ్రహము మరింత ప్రజ్వలించుచున్నది. నిశ్చలమైన భక్తికి భగవంతుని అభయహస్తము సదా తోడుగా ఉండును అను సత్యమును ఈ ఘట్టము మనకు స్పష్టముగా ఉద్బోధించుచున్నది.
In this profound episode from Canto 7 of the Srimad Bhagavatham, the demon king Hiranyakashipu, consumed by rage at his son Prahlada's unwavering devotion to Lord Vishnu, resolves to destroy the young boy through every means at his disposal. He orders his servants to cast Prahlada before venomous serpents, hurl him from mountain peaks, crush him beneath mighty elephants, and subject him to countless other torments. Yet through the boundless grace of Lord Vishnu, Prahlada emerges unharmed from every trial, his devotion only deepening with each miraculous deliverance. This episode stands as a timeless testament to the truth that no earthly power can overcome the divine protection granted to a pure and steadfast devotee.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విషతు మానస రాజ హంసః ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే కృష్ణా, మరణ సమయమున స్మరింతునని అంటిని గాని ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడినప్పుడు నీ స్మరణ కలుగునో కలగదో. కావున ఇప్పుడే నా మానస రాజహంసము. విరోధులెవ్వరూ చేరలేని వజ్ర పంజరం వలెనుండు నీ పాదపద్మం మధ్యమున చేరుగాక. ముకుందమాల ప్రేయర్ ఎయిత్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక సప్తమ స్కంధం. ఆరో పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఆ గురువులు చెప్పినటువంటి విషయాన్ని తను పక్కకు పెట్టి నారాయణ తత్వాన్ని నేర్చుకుంటున్నాడని వివిధ రకాలుగా శిక్షలు వేయించడం జరుగుతుంది. ఆ శిక్షలు వేసినా కూడా తనకి ఎలాంటి ప్రభావము కలగదు అనేటువంటి దాని తత్వార్ధాన్ని తెలుసుకున్నాం. మళ్ళీ గురువులు ఆయనకి గృహస్థ ధర్మాన్ని ధర్మార్థ కామాల విశిష్టాన్ని కూడా చెప్పేస్తారు చెప్తారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురువులు పాఠములను చెప్పి ఇంటి పనులకై వెళ్ళిన సమయం చూచి ప్రహ్లాదుడు తన తోడి బాలకులను పిలిచి వారికి భాగవత ధర్మములను ఉపదేశించుటకు ఆరంభించినాడు. మనము చిన్న వయసున ఉన్నాము. ఇప్పటి నుండియు మనకు భావధర్మము ఎలా అనకుడు. చిన్నతనమునని మనము భావత ధర్మములను తెలుసుకొని ఆచరించవలెను.
ఈ మనుష్య జన్మ దుర్లభము. ఎట్లో లభించినది. దీనిచే మనము ఎంతో సాధించవచ్చును. కానీ ఇది శాశ్వతము కాదు. ఈ శరీరముతో భోగములను అనుభవించవచ్చును. ఇంద్రియములను తృప్తిపరచవచ్చును. భగవంతుని శవింపవచ్చును. ఆత్మశాంతిని ఆర్జించవచ్చును. ఇంద్రియములను తృప్తిపరచుకొనుచు భోగమును అనుభవించుట సులభము. దుఃఖము మన ప్రయత్నం లేకుండా ఎట్లు వచ్చుచున్నదో సుఖము కూడా అట్లే వచ్చును. దానికై ప్రయాసపడనవసరం లేదు. ఆయుఃకాలము దానికే ఖర్చు చేయుట వ్యర్థము. భగవత్పాద సేవనమునకు ప్రయత్నించిన శాశ్వతముగా క్షెమ్మును పొందుదుము. ఈ మానవ శరీరము అంతము కాకముందు ఆత్మక్షేమమునకు ప్రయత్నించవలెను. మానవుడు బ్రతికిన నిండుగా నూరేళ్ళు బ్రతుకును. ఇంద్రియ జయము లేని వారికి అందు సగము కాలము నిద్రలో గడిచిపోవును. ఏమి ఎరుగని బాల్యము, కౌమారము ఈ రెండిటిలో ఆటలతో 20 ఏళ్ళు గడిచిపోవును. ముసలితనం వచ్చి దేహము స్వాధీనము కాక 20 ఏళ్ళు గడిచిపోవును. మిగిలినది పది సంవత్సరములో ఎంత అనుభవించినను తీరని కామము ఇంటియందు ఇల్లాలి యందు పిల్లల యందు బంధువుల యందు విడవరాని మోహము మనసును పట్టి విడువవు. వీటన్నిటికంటే మించినది ధనాశ. ధనము కొరకు ప్రాణములైనను విడువ సిద్ధపడును. సేవకుడు, వర్తకులు, దొంగలు ప్రాణములైనను వదిలి డబ్బును ఆర్జించుట అందరికీ తెలిసినదే. మనసు ప్రియురాలి రహస్య భోగములను, పిల్లల ముద్దు మాటలను, దీనులైన తల్లిదండ్రులను, మనోహరములగు భవనములను, ధనార్జనమునకు ఉపయోగించు వృత్తులను తలంచుచు కాలమును గడుపును. పట్టులో బంధింపబడిన పురుగు బయటకు వచ్చుటకు దారి లేక పట్టుకాయలోనే ఉన్నట్లు కామభోగములు జిహ్వారసములు అనుభవించుచు తలంచుచు ఎంత కాలము జీవితమును గడుపుచున్నను వాని యందు విరక్తి కలగదు.
తన ఆయువంతయు తన శరీరము, తన కుటుంబము వీని పోషణమునకై వినియోగపడుచుండును. శారీరకమైన రోగములు, మానసికమైన వేదనలు, బంధువుల వలన, జంతువుల వలన కలుగు ఉపద్రవములు. తుఫానులు, వరదలు వలన కలుగు బాధలనే తప్ప తన ఆత్మను గూర్చి గానీ, భగవానుని గూర్చి గానీ తలంచుటకు మనసు ప్రయత్నించదు. ఇవి అన్నియు దోషములని తెలిసిన వారు కూడా ఇంద్రియములను పశపరచుకొనలేక కోరికలు చల్లారక కుటుంబ భారముతో శ్రమపడి చనిపోదురు. మరల జన్మింతురు. అంతే గాని స్త్రీ పురుషుల అన్యోన్య ఆకర్షణకు వశము కాకుండా ధనముపై లోభమునకు లొంగక మనసును అరికట్టలేరు. అందుచే కంటితో, చెవితో, ముక్కుతో, నాలుకతో, చర్మముతో అనుభవించే విషయాలను అవసరమైనంత మేరకు కాక సంఘముతో వదలలేక అనుభవింతురు. దానిని మానవలెను. అన్ని పదార్థములలో వెలుపల లోపల వ్యాపించిన నారణ తత్వమును గుర్తింపవలెను. బాహ్యమైన వస్తువులను భోగ సాధనములుగా కాక నారణాత్మకముగా భావించి సంఘమును వీడి బంధమును వదిలించుకొనవలెను. ఆ తత్వమును ప్రేమించుట ఎరుంగుట కష్టసాధ్యము కాదు. శరీరమును శరీరమునకు చెందిన వానిని ప్రేమించునది తన కొరికే కదా తన కొరికే కదా అన్నిటికంటే తాను తనకు ఎక్కువ ప్రియమై ఉండును కదా. అది ఆత్మ కనబడునది కాదు. అది శరీరము కాదు. ఇంద్రియములు కావు. శరీరం ఉన్నంత కాలము ఉండునది ఆత్మ. అది లేనిచో ప్రేమించుట అసహజం. ఆ ఆత్మయే నారాయణుడు కావున వానిని ప్రేమించుటలో కష్టమేమున్నది? శరీరములు, జగత్తులోని సర్వ పదార్థములు, వానిలోని జీవులు కనపడుతున్నదంతయు వాని సంకల్పము చేతనే నిలుచున్నది. మరలా లయమగుచున్నది. అందుచే దీనిని ఎరింగిన వాడు ఏ వస్తువును చూచినను ఏ వస్తువును అనుభవించినను లోనున్న నారాయణుడు గుర్తుకు వచ్చుచునే ఉండును కదా ఈ గుర్తింపు కలుగుటకు ఆచార్యుల ఉపదేశము సాధనము.
దీనిని మనం తెలుసుకునేనచు కనిపించు సర్వభూతములందును దయ కలుగును. అన్నియు తనకు అనుకూలములే కావున వానిని ద్వేషింపడు బాధింపడు. మన నడివడిలో సర్వభూత దయాగుణము, సర్వభూత సౌహార్దము కలిగిన నాడు ఆ నారాయణుడు సంతోషించును. మన అసుర భావము తొలగిపోవును. ఈ ఎరుక లేక ఆచరించు ధర్మము గాని అర్ధార్జనము గాని కామ భోగములు గాని దండనీతి శాస్త్రములు గాని సత్యమును ఎరుంగుటకు సాయపడక వ్యర్థములే అగును. అంతర్యామగు వాసుదేవునిచే నియమింపబడునవే వాని కొరకు వినియోగిపడినవే సర్వ పదార్థములు సర్వ భావములు అని ఎరిగి తాను చేయు పనిని తన రక్షణను దానియందు ఉంచుటయే సకల వేద రహస్యం. ఈ జ్ఞానమును నరునకు సఖుడగు నారాయణుడు నారదునకు ఉపదేశించెను. వాని నుండి తరువాతి వారలకు క్రమముగా వచ్చెను. వేరొక ప్రయోజనము కోరక భగవత్ పాదారవింద సేవనమే తాను చేయు సకల వ్యాపారములకు ఫలముగా భావించు మహా భాగవతుల సేవ చేతనే ఈ జ్ఞానము లభించును. ఈ భాగవత ధర్మము పూర్వము నేను నారదుని వలన వింటిని. నా తల్లి గర్భమున ఉండగానే నారదుడు నాకు ఉపదేశించెను. వాని అనుగ్రహముచే నాకు ఇప్పటికిని మరుపు రాలేదు. దీనిని తెలుసుకొనవలెను. శ్రద్ధ ఉన్నచో బాలులకు స్త్రీలకు కూడా ఈ జ్ఞానము సిద్ధించును. దేహము, ఆత్మ అను రెండిటి యొక్క స్వభావమును మనం బాగా గుర్తించవలెను. ఆత్మ కనబడదు, దేహము కనబడును. ఈ రెండును కలిసి ఉండును. అందుచే మనం వేరుగా గుర్తించలేము. పుట్టినది. ఉన్నది, పెరుగుచున్నది, మారుచున్నది, తరుగుచున్నది, నశించునది. ఈ ఆరు మార్పులు చెందెడిది శరీరము. వీటిని భావ వికారములందురు. కనిపించి ప్రతి పదార్థమునకు ఈ ఆరు వికారములు కలుగును. ఈశ్వరుని రూపమే అయిన ఈ అయిన కాలమే ఈ మార్పులు కలిగించుచుండును.
ఈ స్వభావము గల దేహము కంటే ఆత్మ వేరుగా ఉండును. అది అంతటా వ్యాపించి ఉండును. అందుచే నిత్యము అందురు. మూడు కాలములందుండును. పుట్టుట. పెరుగుట మొదలగు మార్పులు లేనిది ఆత్మ. అందుచే అవ్యయము అందురు. దానికి ప్రకృతితో సంబంధం సహజముగా లేదు. కనుక రాగద్వేషములు ఉండవు. అది అత్యంత సూక్ష్మమైనది. అందుచే అది అన్నింటిలో వ్యాపించి ఉండును. కానీ దానిలో ఏదీయు వ్యాపించి ఉండదు. అనేక శరీరములలో వేరువేరుగా ఉండే ఆత్మలు అన్నియు ఒకే ఆకారము గలవి. జ్ఞానము గలది ఆత్మ. తనంత తనను తానే ఎరుంగ కలిగినది ఆత్మ. దేహేంద్రియములు ఉండుటకు అదే ఆధారం. అవి ప్రవర్తించుటకు అదే కారణం. దానికి దేనితోనూ సంగమం సంగము లేదు. ఈ లక్షణములు కలిగిన ఆత్మ దేహము కంటే వేరు స్వభావము కలిగి దేహము కంటే వేరై దేహములో ఉండును. నేను అని వ్యవహరింపబడున్నది ఆ ఆత్మయే. మనము గుర్తింపలేక ఈ దేహముని నేను అనుకొనుచున్నాము. ఈ దేహమునకు చెందిన వానిని నావి అని అనుకొనుచున్నాము. బంగారు ఖనిజము నుండి శుద్ధి యోగములచే బంగారమును వేరు చేసినట్లు యోగముచే దేహముతో కలిసి ఉన్న ఆత్మను వేరు చేసి గుర్తించవలెను. అప్పుడు స్వరూపము తెలియును. బ్రహ్మ ప్రాప్తి కలుగును. ఈ విధంగా ప్రహ్లాదుడు భావధర్మాన్ని శిష్యులకు అంటే తనతో పాటు ఉన్న వారితో పోజిస్తాడు. తరువాత ఇంకా కొన్ని విషయాలు మనకు చెప్తాడు. మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Gurus. Krishna, your lotus feet are the end of the lotus-like hood. I am the first one to be troubled by the mind, like a swan. At the time of the journey of life, Kapha, Vata, Pitta, and the obstruction of the throat, how can I remember you, Krishna I said I would remember at the time of death, but at that time, when the throat is blocked by phlegm and bile, whether you remember or not. Therefore, right now, my mind is a swan of the kingdom. May your lotus feet reach the middle, like a diamond cage where no enemies can enter. Mukundamala Prayer Eighth. Devotees, Srimad Bhagavata Tattvadipika, Saptama Skandam. Welcome to the sixth podcast. Until now, Hiranyakashipu, setting aside the matter told by those gurus, is being punished in various ways for learning the essence of Narayana. Even if punishments are given, we have understood the philosophical meaning of how it will not have any effect on him. Again, the gurus will tell him about the duties of a householder, the distinction of dharma, artha, and kama. Let us proceed with the narrative that unfolds next. Teachers lessons Having said this, seeing the time for going to household chores, Prahlada called his companions and began to teach them the Bhagavata Dharma. We are still young. From now on, how will we have the feeling of Dharma? We should understand and practice the dharmas that we have in our childhood.
This human birth is rare. Obtained from . We can achieve so much with this. But it is not permanent. With this body, one can experience pleasures. The senses can be pleased. God's corpse. And can find peace of mind. It is easy to satisfy the senses and experience pleasure. Sorrow comes without our effort, just as happiness does. No need for that. It is a waste of time. Those who strive for the service of the Lord's feet will surely attain salvation. Before this human body ends, one should strive for the well-being of the soul. A human being lives a full life of a hundred years. For those who do not conquer the senses, half of their time is spent in sleep. In childhood and adolescence, 20 years are spent playing. Old age comes and the body is not under control, 20 years pass by. What remains in the remaining ten years, no matter how much experience one has, is an unquenchable desire for the house, for the wife, for the children, for the relatives, an insatiable infatuation that captures the mind You are not leaving. Greed is greater than all of these. For the sake of money, one is ready to give up even their life. It is known to everyone that servants, traders, and thieves, even if it means their lives, earn money. The mind spends time thinking about the secret pleasures of the beloved, the sweet words of children, the humble parents, the beautiful buildings, and the professions used for earning money. The insect trapped in a web, having no way to come out, remains trapped in the web, experiencing sensual pleasures and taste, thinking and contemplating, no matter how long he spends his life, he does not feel detached from it.
His life, his body, and his family are being used for their sustenance. Physical ailments, mental anguish, calamities caused by relatives, and animals. Except for the suffering caused by storms and floods, the mind does not try to think about its own soul or about God. Even those who know that these are all faults, unable to control their senses, do not die of suffering with family burdens due to their desires cooling down. You'll be reincarnated. But without being subject to the mutual attraction of men and women, without succumbing to greed on money, they cannot control the mind. Therefore, they experience things that are experienced with the eyes, ears, nose, tongue, and skin, not as much as needed, but without abandoning the community. It's human. All substances must be identified as having a penetrating nature, both inside and outside. External objects should be considered as non-desirable means of enjoyment, and one should leave the association and get rid of the bondage. It is not difficult to love and understand that principle. The one who loves the body belongs to the body Isn't it true that she is the most beloved of all? It is not a ghost. It is not the body. The senses are not. The soul is something that exists as long as the body does. It is impossible to love without it. Since the soul itself is Narayana, what is difficult in loving him? The bodies, all the substances in the world, and all the creatures within them, are all sustained by His will. It's getting rhythmic again. Therefore, the one who has realized this, whenever he sees any object, whenever he experiences any object, the Narayana within will surely be remembered, right? To attain this recognition, the teachings of the Acharyas and the practice are essential.
We should know this, and we should have mercy on all beings. Since everything is not favorable to him, he does not hate or hurt him. In our conduct, when there is compassion for all beings and harmony among all beings, that Narayana will be pleased. We will be free from demonic tendencies. Without this awareness, the dharma (righteous conduct) practiced, or the wealth earned, or the pleasures of lust, or the punitive laws, do not help in understanding the truth; they are all in vain. All substances and all emotions are used for him, who is appointed by the inner Vasudeva, knowing that, keeping his work and his protection in it is the secret of all the Vedas. This knowledge was imparted to Narada by Narayana, who is the friend of mankind. From him, it came gradually to the next generations. Without seeking any other benefit, considering the service to the lotus feet of the Lord as the fruit of all his endeavors, this knowledge is attained only through the service of the great devotees. I heard about this Bhagavata Dharma from Narada in the past. Narada preached to me when I was in my mother's womb. By his grace, I still remember It didn't come. This must be known. If there is attention, this knowledge will be attained by boys and girls as well. We must properly recognize the nature of both the body and the soul. The soul is not visible, the body is. These two are together. Therefore, we cannot distinguish separately. Born, existing, growing, changing, decreasing, perishing. These six changes are the body. These are called emotional distortions. It is seen that every substance has these six transformations. This is the time, which is the form of God, which is the time, which is the time, which is causing these changes.
The soul is different from the body which has this nature. It's all over. Therefore, they are always there. It exists in three periods. The soul is one without changes like birth and growth. Therefore, it is called indeclinable. It has no natural connection to nature. Thus, there will be no hatred or jealousy. It is the most delicate. Therefore, it pervades everything. But none of that is evident. All souls that are different in many bodies are of the same form. The Spirit of Wisdom is the Spirit of Reason. The soul is that which is aware of itself. It is the basis of the existence of the body and the senses. That is the reason why they behave like that. It has no contact with anything. The soul with these characteristics has a different nature than the body, and exists separately from the body. It is the spirit that is being addressed as "I". We are considering this body as I cannot recognize it. We consider the one who belongs to this body as a servant. Just as gold is separated from ore by purification and refining, similarly, the soul that is united with the body is separated by yoga It should be identified. Then the form will be known. And the attainment of Brahman. In this way, Prahlada poses the Bhavadharma to his disciples, that is, to those who are with him. He then goes on to tell us a few more things. We can discuss this further on another podcast. Jai Srimannarayana. Salutations to the Gurus