హిరణ్యకశిపుని త్రైలోక్య ఆధిపత్యము - దేవతల పరాజయము
Hiranyakasipu's Universal Conquest & Demigods' Defeat
ఈ ఎపిసోడ్లో, బ్రహ్మదేవుని వరబలంతో గర్వోన్నతుడైన హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించి సర్వాధిపత్యాన్ని చేజిక్కించుకున్న వృత్తాంతాన్ని శ్రీమద్భాగవతం మనకు వివరిస్తుంది. దేవతలు తమ స్థానాలను కోల్పోయి, స్వర్గలోకం నుండి వెళ్ళగొట్టబడి, అసురుని దాటికి తట్టుకోలేక భగవంతుని శరణు వేడుకుంటారు. ఎంత మహత్తరమైన అధికారమైనా శాశ్వతం కాదని, దైవన్యాయం తప్పక నెలకొంటుందని ఈ పవిత్ర ఘట్టం మనకు గుర్తు చేస్తుంది.
In this episode of the Srimad Bhagavatham, we explore the terrifying rise of Hiranyakasipu, who — emboldened by the boon granted by Lord Brahma — seizes dominion over the three worlds with unchecked power and pride. The demigods, stripped of their positions and driven from the heavens, are rendered helpless before his wrath and seek refuge in the Lord. This sacred episode reminds us that even the mightiest earthly power is temporary, and that divine justice, though it may tarry, never fails to arrive.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నాహం వందే తవ చరణయోర్ ద్వంద్వ మద్వంద్వ హేతోహో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదు తనులతా నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం ఓ కృష్ణా ద్వంద్వాతీత స్థితిని అందవలెనని కానీ కుంభీపాక నరకమును తప్పించుకొనవలెనని కానీ లావణ్యవతులగు అప్సరసలను స్వర్గములో అనుభవింపవలెనని కానీ నీ పాదారవిందములకు నమస్కరించుట లేదు. ఎట్టి దేహమును సంగినను సరే నాకు అభ్యంతరము లేదు. కానీ సర్వదా మనసులో నిన్నే స్మరించునట్టు చేయుమనియే నమస్కరించుచున్నాను. ముకుందమాల ఫిఫ్త్ ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధము మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత తన తల్లి మరదలకి ఒక హితోపదేశంగా బోధించి తను మళ్ళీ నారాయణుని వధించడానికి సరైనటువంటి వరము కోసమని బ్రహ్మ దగ్గరికి వెళ్లి తపస్సు చేస్తాడు. బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. అంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తపస్సు గురించి తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు భ్రమ గూర్చి తపస్సు చేయుటకు మందర పర్వతమునకు బయలుదేరినాడు. బొటన వేలిపై నిలిచినాడు. ఆకాశమునే చూచుచున్నాడు. బాహులను పైకెత్తి నిలిచినాడు. ఆహారమును మానినాడు. పరమ దారుణమైన తపస్సు చేయుచున్నాడు. ఇతడు తపస్సులో ఉన్నాడు కదా, మన జోలికి రాడని దేవతలందరూ వారి వారి స్థానములు చేరినారు.
తపస్సు తీవ్రత అధికమై అతని శిరస్సు నుండి అగ్ని బయలు వెడలింది. లోకమంతయు వ్యాపించినది. దేవతలు భయపడి బ్రహ్మలోకమునకు వెడలిరి. హిరణ్యకశిపునకు వరములు వసంగ పోయినచో లోకములే నశించునని విన్నవించిరి. అతడు తాను నిత్యముగా ఈ శరీరముతో ఉండవలెనని కోరుచున్నాడని విన్నవించింది. హిరణ్యకశిపునకు బ్రహ్మ దర్శనమిచ్చినాడు. హిరణ్యకశిపునకు శరీరముపై పుట్టలు బలిసి పొదలు పెరిగి ఉన్నవి. శరీరమంతయు చీమలు, పురుగులు కొరికి వేసినవి. చర్మము, మాంసము, కొవ్వు, రక్తము లేకుండా పోయినవి. అస్తిపంజరం మిగిలినది. బ్రహ్మ తన కమండలమున జలమును ప్రోక్షించినాడు. పైనున్న పొదలు తొలగి యధాపూర్వముగా హిరణ్యకశిపుడు లేచి నిలబడినాడు. ఆ బ్రహ్మను స్తోత్రము చేసినాడు. అతడే సర్వ జగత్ కారణమని అతని కంటే పరుడు లేడని భావించి స్తుతించినాడు. నీ వలన స్తుతించబడిన ఏ ప్రాణి వలనను నాకు మృత్యువు కలగరాదు. లోపల గాని వెలుపల గాని పగలు గాని రాత్రి గాని. ఆయుధముల చేత గాని ఇతర మారణ ఆయుధముల చేత గాని నాకు చావు రారాదు. భూమిపై గాని ఆకాశములో గాని చనిపోరాదు. నరులచే గాని, మృగములచే గాని, ప్రాణములున్న వానిచే గాని, ప్రాణము లేని వానిచే గాని నేను చావరాదు. సురులలో, అసురులలో, ఉరగములలో ఏ ఒక్కరు నన్ను జయించువారు కారాదు. శరీరధారులైన ప్రాణులందరును పాలించువాడను నేనొక్కడనే కావలెను. సర్వలోక పాలుర యొక్క మహిమ నాకు కావలెను. యోగులకు తపస్సు చేత యోగము చేత కలిగే సిద్దులన్నియు నాకు సిద్ధించవలెను అని కోరెను. బ్రహ్మ అన్ని వరములు వసంగెను. ఈ విధముగా హిరణ్యకశిపుడు లోకమును ఎదురులేని వాడై సర్వ సిద్ధిమంతుడు సర్వ నియామకుడవై నియామకుడవై బ్రహ్మచే సర్వ నియామకుడునై బ్రహ్మచే వరములను బడెసి తన రాజ్యమునకు తిరిగి వచ్చి దేవతలందరినీ మరల కొల్లగొట్టి వారి లోకములన్నిటినీ తనవిగా చేసుకుని శాసించుచున్నాడు.
హిరణ్యకశిపుడు తపస్సు చేత మృత్యురాహిత్యాన్ని సంపాదించుకొని లోకాలన్నిటినీ జయించి లోకమునంతయు తానే అధిపతిగా పరిపాలింపసాగినాడు. మృత్యువు లేకుండా చేసుకొనుట మంచిది. కానీ అతనికి భగవంతుడిపై ద్వేషము. అతనిని అంతమొందుచుటకే తాను జీవించి ఉండాలని భావించినాడు. సర్వలోకాశ్రయుడు శ్రీహరి. అతడు వ్యక్తి కాడు. అతడు లేనిదే ఏ వస్తువు ఉన్నది అనుటకు వీలు కాదు. ఆ తత్వమే జగద్రక్షణముకై ఒక రూపమును దాల్చి ఈ లోకమునకు వచ్చుచుండును. సర్వాంతర్యామియై సర్వలోకలక్షణము చేయును. తనకు ధారకముగు తత్వమును ద్వేషించుచు జీవించుటకు సంకల్పించరాదు. దానిని ప్రేమించుచు దాని ఆరాధనకై తాను జీవించుట కర్తవ్యం. హిరణ్యకశిపుడు విరుద్ధ ప్రవృత్తితో అంతర్యామి తత్వాన్ని ద్వేషించి బాహ్యమైన భౌతిక అభ్యుదయాన్ని మాత్రము సాధించి అనుభవింప యత్నించినాడు. ఇంద్రియములకు విషయానుభవముచే కలుగు తృప్తి శాంతి నుసంగదు. ఇంద్రియములను జయించి విషయములను అనుభవించుచున్నను అంతర్యామి అయిన శ్రీహరి తత్వాన్ని భావించినచో శాంతి లభించును. అందుచే ఆ అసురునికి మృత్యు జయము కలిగినను సర్వలోక విజయము లభించినను ఇంద్రియ జయము లేక శాంతి లభింపలేదు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా దేవతలు అతని రాజ్యముపై దండెత్తినారు. ఇంద్రుడు అతని రాజ్యమును ఆక్రమించి అతని భార్య లీలావతిని చెరపట్టి తీసుకొని పోవుచున్నాడు. నారదుడు చూచినాడు. అమోఘమగు ఆమె గర్భమందున్న పిండము యొక్క దివ్యత్వమును గుర్తించినాడు. అది తగదని ఇంద్రునకు హితము చెప్పి సంతానము కలుగు వరకు తన ఆశ్రయమున ఉంచినాడు. అప్పుడు ఆమెకు నారాయణ తత్వమును నారాయణ మంత్రమును ఉపదేశించినాడు. ఆమె కాలాంతరమున మరిచిపోయినను నారదుని అనుగ్రహముచే
మాతృగర్భము నుండి వెలికి వచ్చిన తరువాత కూడా ఆ శిశువు నారణ తత్వమును మరవలేదు. నారదులు ఉపదేశించిన నారణ తత్వము గర్భస్థముగు ఆ పిండమునకు సంక్రమించినది. జీవితములో గురు ఉపదేశం యొక్క ప్రాధాన్యము దీనిచే మనకు తెలియును. గర్భవతిగా ఉండగా ఆహారములో శరీర పోషణకు ఆవశ్యకముగు పదార్థములను తల్లి ఎట్లు నియమబద్ధముగా సేవించి గర్భమునకు అందించవలెనో అట్లే ఆత్మ సంస్కారమునకు అవశ్యకమగు జ్ఞానమును కూడా గర్భగతమగు పిండమునకు అందించవలెను. హిరణ్యకశిపునకు నలుగురు కుమారులు. అందు జ్యేష్ఠుడు నారదోపదిష్టమగు జ్ఞానముతో జన్మించిన ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు పెట్టుచున్న బాధలను సహింపలేక దేవతలందరూ బ్రహ్మతో కలిసి నారాయణుని శరణు పొందిరి. వారికి అశరీరమైన వాణి వినపడెను. ఓ దేవతలారా, మీకు శ్రేయము కలుగును. ఆ అసురుని దుర్మార్గతను శాంతింపచేయుదును. కాలమునకు నిరీక్షింపుడు. భౌతికమైన శక్తుల యందే ఆధారపడిన హిరణ్యకశిపుడు అతీంద్రియములగు ప్రజాశక్తులు కలిగి లోకహితమునకై ప్రవర్తించు దేవతలను బ్రాహ్మణులను, సత్పురుషులను ద్వేషించుచున్నాడు కావున తప్పక నశించును. ధర్మమును, ధర్మమునకు మూలమైన వేదమును ద్వేషించినవాడు నశించును. అతనికి ప్రహ్లాదుడను కుమారుడు కలుగును. అతడు నానా తత్వం అరంగినవాడు. అందుచే అతనికి ప్రతికూలమైన తత్వమే కనబడదు. అతడు ఎవరిని ద్వేషింపక దేనిని తనకై కోరిక అందరి యెదల సమభావముతో సర్వము నారణాత్మకముగా దర్శించుచు ప్రవర్తించును. అట్టి కుమారుని కూడా ఇతడు ద్వేషించును. అతనిని అంతమొందింప ప్రయత్నించును. అప్పుడు అతనిని నేను అంతమొందించును. ఇదే అసుర తత్వమునకు అసురత్వమునకు దేవత్వమునకు. గల భేదం. భగవానుడు సర్వ పదార్థములకు తాను ఆధారమై వెలుపల ఉండును. లోన వ్యాపించి వానిని ధరించి నియమించును. ప్రవర్తింపచేయును. నివర్తింపచేయును.
ఈ శక్తి గల తత్వమునకు నారాయణ అని పేరు. ఈ తత్వముని ఎరింగిన వారు లోకమున సర్వ పదార్థములలో నారాయణ తత్వమునే దర్శింతురు. కావున విశ్వమంతయు ఒకటిగానే కనిపించును. ఒకటి అనుకూలము, ఒకటి ప్రతికూలమని వారికి తోచదు. ఒకటి తనది, ఒకటి తనకు చెందనది అనిపించదు. ఒకటి తాను ప్రేమించదగినది, ఒకటి తాను ద్వేషింపదగినది అని వారు భావింపరు. ఆ తత్వమే దివ్యమైన రూపముతో సర్వోత్తమమైన గుణములతో కొందరికి దర్శనము వసంగుచుండును. కానీ ఆ రూపమును గుర్తింపగలవారు తక్కువగా ఉందురు. వానిని కూడా ఒక వ్యక్తిగా భావించి. తనని అందరికంటే అధికనుగా భావించుచు తనకంటే సర్వం వేరు అని భావించువాడు అసురుడు. అసురుడు. దీనికి కారణము నారాయణ తత్వము తెలియకపోవుట. ఆ తత్వమును తెలిసినవాడు కుమారుడు. ఆ తత్వమును ఎరుగనివాడు తండ్రి. తాను తన కొరకు తనదే అంతా అని భావించు హిరణ్యకశిపునకు అంతయు వాడే అంతయు వాని కొరకే అంతయు వానికి చెందినదే అని భావించు ప్రహ్లాదునకు సహజముగానే విరోధము ఏర్పడినది. ఆ తరువాత జనకథని మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. I salute your feet. The dual is the cause of the dual. Kumbhipaka is the guru. Hari is the destroyer of hell. Rama is the gentle one. Rama is the soft-bodied one. Even the one who tries to destroy is destroyed. I contemplate on you, O Rama, with my heart, in my abode. I contemplate on you, O Krishna I do not bow to your lotus feet, to attain a dual state, or to escape the hell of Kumbhipaka, or to experience the beautiful nymphs in heaven. I have no objection to any kind of body. But I always pray that you remember me in your heart. Mukundamala fifth prayer. Dear listeners, welcome to the third podcast of Srimad Bhagavata Tattva Deepika, Saptama Skandham. Until now, Hiranyakashipu, after Hiranyaksha died, taught his mother and grandmother a moral lesson and went to Brahma to perform penance for a suitable boon to kill Narayana again. He performs a penance to Brahma. That's what we know from what we have read so far. We will learn about that penance in the next part. Hiranyakashipu set out for Mandara mountain to perform penance regarding his illusion. He stood on his toe. He's staring off at the sky. He stood with his arms raised. He abstained from food. He is doing an extreme penance. He is in penance, right? All the gods have reached their respective places, saying that he will not come to us.
The intensity of his penance became so high that fire emerged from his head. It has spread all over the world. The gods were frightened and left for Brahma's world. They pleaded that if the boons for Hiranyakashipu were not granted, the worlds would be destroyed. He requested that he wishes to be with this body forever. Brahma appeared before Hiranyakashipu. Hiranyakashipu's body was covered with warts and bushes had grown. Ants and insects have bitten all over the body. Without skin, flesh, fat, and blood. The skeleton remains. Brahma sprinkled water from his kamandalam. Having cleared the bushes above, Hiranyakashipu stood up as before. He praised the Brahma. He praised him, considering that he is the cause of the entire universe and that there is no one superior to him. Death should not come to me from any creature praised by you. Inside or outside, day or night. I don't want to die by weapons or other deadly weapons. Do not die on the ground or in the sky. By men or by beasts Neither by the living nor by the dead. In the gods, in the demons, in the mountains, no one has conquered me. I alone am the one who rules all the creatures of flesh and spirit. I desire the glory of the Most High. He asked that all the siddhis (spiritual powers) that are attained by yogis through penance and yoga should be attained by me. Brahma received all the boons. In this way, Hiranyakashipu, being unparalleled in the world, became the master of all accomplishments, the master of all appointments, the master of all appointments by Brahma, received boons from Brahma, returned to his kingdom, and plundered all the gods again and their He is ruling, making all the worlds his.
Hiranyakashipu, through penance, attained immortality and conquered all the worlds, and began to rule the entire world as his own. It is better to avoid premature death. But he's angry at God. He felt that he should live only to see him die. Sri Hari is the lord of all. He is not a person. It is not possible to say what exists without him. That very principle assumes a form for the protection of the world and comes to this world. The omnipresent one is the cause of all that exists in the universe. One should not be determined to live hating the essence of dharma. It is necessary to live for its love and worship. Hiranyakashipu, with a contrary nature, hated the inner self and tried to achieve and experience only external material progress. The satisfaction and peace that the senses experience through sensory experiences is not enough. Even though one conquers the senses and experiences the objects, if one contemplates the essence of Srihari, who is the inner controller, peace is attained. Therefore, even though the demon attained victory over death, the whole world Even if victory is achieved, peace is not achieved without the conquest of the senses. While Hiranyakashipu was in penance, the Devas attacked his kingdom. Indra is invading his kingdom, abducting his wife Leelavati, and taking her away. Narada saw it. He recognized the divinity of the fetus in her womb. He advised Indra that it was not right and kept him under his protection until they had children. Then he imparted the essence of Narayana and the mantra of Narayana to her. Even though she forgot over time, by the grace of Narada
Even after being born from the mother's womb, that child did not forget the essence of nature. The essence of Narada's teachings, which is the essence of Narada, was transmitted to that fetus. The importance of the Guru's teachings in life is known to us through this. While pregnant, how should a mother systematically consume and provide the necessary substances for body nourishment in her diet, and similarly, how should she provide the necessary knowledge for self-refinement to the fetus in the womb? Hiranyakashipu had four sons. Prahlada was the son of Narada, born with the knowledge that he was born of Jyestha. Unable to bear the sufferings inflicted by Hiranyakashipu, all the gods, along with Brahma, sought refuge in Narayana. They heard a voice from the Spirit. Oh Gods, may you be blessed. I will pacify the demonic Asura. Wait for the season. Hiranyakashipu, who is dependent on physical powers, possesses supernatural powers, and hates gods, Brahmins, and virtuous people for the benefit of the world, will surely be destroyed. He who hates dharma and the Vedas, the source of dharma, will perish. He will have a son named Prahlada. He is a polymath. Therefore, he does not see any negative elements. He, without hating anyone, with equanimity towards everyone, sees everything as non-violent and acts accordingly. He also hates such a son. And try to kill him. Then I'll kill him for you. This is to the demonic nature, to the demonic character, to the divine character. The difference. The Lord is the support and the outside for all substances. He pervades and holds him, appoints him, and makes him act.
The principle of energy is called Narayana. Those who have understood this principle, in the world, in all substances, they see the Narayana principle. Therefore, the whole universe appears as one. They do not realize that one is positive and the other is negative. One does not own one, and one does not belong to one. They do not think that one is worth loving and one is not worth hating. That essence, with a divine form and supreme qualities, is appearing to some. But there are very few who can recognize that form. Thinking of him as a person. One who considers himself superior to all others and considers everything else separate from himself is an Asura. Asura. The reason for this is not knowing the essence of Narayana. The one who knows the principle is the son. He who does not know this is a father. He who thinks that everything is his own for himself, Hiranyakashipu, who thinks that everything belongs to him, and that everything belongs to him, Prahlada naturally developed animosity. After that, let's learn about Janakatha in another podcast. Jai Srimannarayana Asmat Gurubhyo Namah