సనాతన వర్ణాశ్రమ ధర్మ నిరూపణ (Parts 13-15)
Instructions on Sanatana Varnasrama Dharma (Parts 13-15)
శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి యుధిష్ఠిరునికి సనాతన వర్ణాశ్రమ ధర్మముల గురించి చేసిన దివ్యోపదేశాలను ఈ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. చతుర్వర్ణాలకు మరియు చతురాశ్రమాలకు నిర్దేశించబడిన కర్తవ్యాలు, నియమాలు, మరియు ఆచారాలను శాస్త్రీయంగా విశ్లేషించడం జరిగింది. భగవద్భక్తితో మరియు నిష్కామ భావంతో స్వధర్మాన్ని ఆచరించడం వలన ఆత్మ క్రమంగా మోక్షమార్గం వైపు పయనిస్తుందని ఈ ఉపదేశాలు స్పష్టం చేస్తున్నాయి. సనాతన ధర్మం కేవలం సాంఘిక వ్యవస్థ మాత్రమే కాక, ప్రతి జీవుని భగవంతుని వైపు నడిపించే దివ్య మార్గమని ఈ పవిత్ర వచనాలు తెలియజేస్తున్నాయి.
In this episode of our Srimad Bhagavatham podcast, we continue the sacred discourse from Canto 7, where Narada Muni elaborates on the eternal principles of Varnasrama Dharma as revealed to Yudhishthira. The teachings illuminate the duties and disciplines prescribed for each of the four varnas and four ashramas, forming the timeless foundation of a righteous and spiritually fulfilling life. Special emphasis is placed on how adherence to one's prescribed duties, performed with devotion and detachment, leads the soul progressively toward liberation. These profound instructions remind us that Sanatana Dharma is not merely a social order but a divine framework designed to elevate every individual toward God-realization.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మా శ్రౌషం శ్రావ్య బంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యాన జాతం మా స్మార్షం మాధవత్వామపి భువనపతే చేతసాపన్హువానాన్ మా భూవం తత్సపర్యాద్వ్యతికర రహితో జన్మ జన్మాంతరేపి ఏ జగన్నాథా మాధవా నీ పాదారవిందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనులను కంటితో చూడను. చెవికింపైన బంధము కలదైనను నీ చరిత్రము తప్ప వేరొక కథా సందర్భమును చెవితో వినను మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను నేను స్మరింపను జన్మ జన్మాంతరములందును నీ కైంకర్యము లేని మనుగడను కలిగియుండను. ముకుందమాల 16th ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం. 13వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము, తిరుపుర దహన వృత్తాంతము, యుధిష్ఠిర నారద సంవాదంలో నుంచి మన నాలుగు వర్ణాశ్రమ ధర్మాల యొక్క వివరాలు తరువాత. ప్రహ్లాదుడు ఒక అవధూతతో కలిసినప్పుడు తను ప్రశ్న అడుగుతాడు. మీ శరీరం ఇంత బలంగా ఎలా ఉంది? ఎంత బలంగా ఉండడానికి మీకు కారణం ఏంటి అని అడుగుతాడు. దాని తర్వాత అవధూత జవాబు ఇస్తున్నారు అని తెలుసుకుందాం. ప్రహ్లాదుడు ఇట్లు అడగగా ఆ అవధూత ఇట్లు పలికెను. ఓ అసుర శ్రేష్టా, నీకు అన్నియును తెలియును. వ్యాపారము చేయుటకు, మానుటకు కారణమేమో నీకు తెలియును. నీ హృదయమున భక్తితో నారాయణుని సేవించుతున్నావు.
జ్ఞానము అజ్ఞానమును దూరము చేయుచున్నది. అయినను నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను. నీతో మాట్లాడుట నన్ను పవిత్రుడిగా చేయును. నేను నింపుటకు వీలుగాని కోరికలను నెరవేర్చుకొనుటకు అనేకములైన కర్మలను చేసినాను. అనేక శరీరములతో జన్మించినాను. దైవవశమున ఈ మనుష్య జన్మను పొందినాను. ముందు ముందు మంచి జన్మములకైనను నీచ జన్మలకైనను ఈ మనుష్య జన్మమే ద్వారం. ఈ జన్మ స్వర్గమును మోక్షమును కూడా వసుంగగలదు. కానీ దాంపత్య సుఖమును అనుభవించుచు దుఃఖములను తొలగించుకొనుటకు అనేక కర్మలను చేయుచు కొంతకాలము వర్తించితిని కానీ సుఖము కొరకు చేసిన కర్మము వలన కూడా దుఃఖమే కలుగుట చూచి. కర్మల నుండి విరమించితిని. సుఖమన్నది పై నుండి వచ్చునది కాదు. ఆత్మ స్వరూపమే సుఖము. సమస్తమైన వ్యాపారములను విరమించుటచే ఆత్మ స్వరూపం గుర్తింప వీలగును. ఆ ఆత్మ స్వరూపమును మరచి దేహముతో ఏకమై శరీర సుఖములకు మనుషులు ప్రయత్నించుచున్నారు. చెరువులో నీరు ఉండినను దానిపై నాచు గడ్డి మొలచి కప్పి ఉండుటచే నీరు లేదనుకొని ఎండమావులలో నీటి కొరకు పరిగెత్తు వారి వలె. తనలోనే ఉండు సుఖరూపమగు ఆత్మ స్వరూపమును మరచి విషయానుభవముచే సుఖము కలుగునని సకల వ్యాపారములు చేయుచుందురు. ఎంత కష్టపడి సంపాదించినను ధనము, భోగములు, ఆధ్యాత్మికాది దుఃఖములు తొలగని నాడు శాంతిని కలిగింపవు. లోభము చేయి, ఇంద్రియ జయము లేక ధనవంతులు పరిడి బాధలు చూడుము. వారికి రాత్రి వేళ నిద్ర పట్టదు. తన చుట్టూ ఉన్న వారిని శంకించును ఉందుదురు. రాజుల వలన, దొంగల వలన, శత్రువుల వలన, తన వారి వలన, పశువుల వలన, పక్షుల వలన, యాచకుల వలన భయపడుచుందురు.
కాలము గడుచున్న కొలది తానే ఒకరికిచ్చి తాను అనుభవించి ఖర్చు చేయుదునని తన వలన కూడా తనకు భయమేర్పడుచుండును. ఆ ధనమే ప్రాణముగా వారికి ఉండును. ప్రాణములందు ధనమునందు ఆశ గలవారికి కేవలం భయమే కాదు, శోకము, మోహము, క్రోధము, రాగము, చేతకానితనము, శ్రమ కూడా కలుగుచుండును. తేనెటీగ, కొండచిలువ మనకు వైరాగ్యమును, సంతృష్టిని నేర్పుచున్నవి. తేనెటీగ ఎంతో శ్రమించి సంపాదించిన తేనె తాను అనుభవించుటకు ఉపయోగపడక ఇతరుల పాలగుచున్నది. దాన్ని చూచిన నాడు మన ఆర్జన కూడా అంతే కదా అని వైరాగ్యము కలుగును. ఎచ్చటకు కదలక ఏ వ్యాపారము చేయక పరుండి ఉండిన కొండ చిలువకు శరీర పోషణకు తగిన ఆహారము తనంత తాను లభించుచున్నది. దానికే పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు. ఆ ఇంటిని చూచి నేను వైరాగ్యమును నిర్వ్యాపారతను నేర్చుకొంటిని. ఏది లభించినా దానితోనే హాయిగా బ్రతుకుచున్నాను. లభింపకపోయినను ధైర్యముతో పరుండి కాలము గడుపుచున్నాను. ఈ శరీరము పరిపుష్టముగా ఉండుటకు సంతుష్టియే కారణము. కొద్దిగా లభించినను, అధికముగా లభించినను, మంచి పదార్థము లభించినను, చెడు పదార్థము లభించినను, రుచి గలది లభించినను, రుచి లేనిది లభించినను, శ్రద్ధతో పెట్టినది తిన్నను, నిందించి పెట్టినది తిన్నను, భేదము లేక తినుచుండుట అలవాటు చేసుకునినాను. ధరించుటకు నారబట్ట అయినను, పట్టుబట్ట అయినను ఏది లభించిన అదియే చాలునని ధరించి సంతృష్టి నొందితిని. ఒకప్పుడు నేలపైన పరుండినను ఆకులు రాయి మన్ను కల ప్రదేశముల్లో పరున్నను పట్టు పాన్పై మేడపై పరున్నను సంతృష్టితో జీవించితిని. ఒకప్పుడు స్నానము చేసి చందనము పూసుకున్నను మాలలు వేసుకొని అలంకరించుకున్నను దిగంబరుడుగా ఉన్నను ఏనుగులతో గుర్రములతో సంచరించినను ఒంటరిగా ఉన్నను సంతృష్టిగా ఉండుట నా మనసునకు అలవాడినది.
స్తుతించుట, నిందించుట లోక స్వభావం. వారు ఒకనాడు స్తుతింతురు, ఒకనాడు నిందింతురు. వారిని నేను తిరిగి నిందించలేదు, స్తుతించలేదు. వారికి శ్రేయస్సు కలగవలెననియు భగవంతుని యందు మనస్సు నిలపవలెననియు కోరుచుండెడి వాడెను. లోకములో మనము చూచెడి మనుషులలో వస్తువులలో వేరు వేరు జాతుల వారు వేరు వేరు రూపములలో కనిపించుచుందురు. వారిని చూచినప్పుడు అవి మనస్సులో నిలవక హోమము చేసిన ద్రవ్యము భస్మమగునట్లు మనస్సులో లయమగుట నెరవలెను. చిత్తమును మనసునందు, మనస్సును దాని కారణమగు సాత్విక అహంకారమునందు, దానిని మూల ప్రకృతి యందును లయమగుటను అనుసంధానము చేయవలెను. అనగా ఏది చూచినను ఆ రూపము గాని ఆ స్వభావము గాని మనస్సున కంటకుండా పోవనెను. తరువాత తన స్వరూపమును తాను అనుభవించుచు తనలో ఆత్మగానున్న పరమాత్మను ధ్యానించుచు దానినే మననము చేయుచు శరీర పోషణకై చేయు ప్రయత్నములను విరమించి ఉండుటను నేను అలవరచుకుంటిని. ఇది లోకమునకు విరుద్ధముగా కనిపించును. ఇది పరమ రహస్యం. తత్వ దర్శనము చేయు వారికి ఇది చాలా అనుకూలం. నీవు భగవత్పరుడవు కనుక నీకు బయలుపరిచితిని. ఇట్లు అవధూత వివరించినటువంటి సన్యాసాశ్రమ స్థితిని విని ప్రహ్లాదుడు సంతుష్టుడై పూజించి తన రాజ్యమునకు మరలి వెళ్లెను. యుధిష్ఠిరుడు ఈ ధర్మములన్నిటిని విని గృహస్తులు సంసారమునందే మూఢులై ప్రవర్తించుందురు కదా వారికి ఇట్టి జ్ఞానము కలుగుటకు అవకాశం ఉన్నదా చెప్పుడని కోరెను. అప్పుడు నారదుడు గృహస్థాశ్రమ ధర్మములు ఇట్లు చెప్పసాగెను. గృహస్థాశ్రమమును ఉన్నవారు తాము చేయవలసిన సర్వ కర్మములను వాసుదేవార్పణముగా చేయుచునే ఉండవలెను. గృహస్తుడు సంధ్యోపాసనము దేవతారాధనము, పితృ దేవతారాధనము, అధ్యయనము, అదితి సపర్య తన చుట్టునుండ భూతములను ఆదరించుట తప్పక చేయవలెను.
తాను చేయు కర్మల యందు తాను చేయుచున్నాను అని భావనను వదిలి ఆ చేయు కర్మ తనది తన కొరకును భావమును వదిలివేయవలెను. గృహస్తుడు వ్యర్థ ప్రసంగములతో కాలమును గడపక భగవత్ కథలను సాత్వికుల వలన శ్రద్ధతో వినుచుండవలెను. తాను ఇంటిలో అందరితో కలిసి ఉన్నను సత్పురుష సాంగత్యం వలన వారియందు మోహము తగ్గించుకొనుచు కొనుచుండవలెను. స్వప్నములో అనుభవించిన కల నుండి లేవగానే వాటియందు మమకారము తగ్గునట్లే సంసారములో ఉన్నను దేహమునందు గేహమునందు అనురాగము కలవారి వలె ప్రవర్తించుచున్నను రాగము లేక ఉండవలెను. తన బిడ్డలు బంధువులు ఏది కోరినను ఏది పలికినను వారి వారి కర్మానుసారముగా అవి జరుగుచుండును. కావున దాని తాను వాటికై వివాద పడక అంగీకరించుచుండవలెను. భగవానుడు కర్మానుగుణముగా ఎంత ధనమును భోగమును కల్పించునో అంత మాత్రమును అనుభవించుండవలెనే కానీ అది అంతయు తనదని ప్రాకులాడరాదు. ఇప్పుడు తినుటకు సరిపడినంత మాత్రమే తనది అనుకొనవలెనే గానీ దాచుకొని ఉన్నదంతయు తనదని భావించుటకు మానవలెను. తన శరీర ధారణకు తగినంత మాత్రమే తనదిగా భావింపక ఎక్కువ తనదిగా భావించువాడు దొంగ అగును. తన ఇంటి పరిసరములో ఉన్న ప్రాణులు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు. రాకెడి జంతువులు, పక్షులు, ఈగలు మొదలగునవి మనకు శత్రువులు కావు. అవి కూడా మన పిల్లల వలె ఆస్తిలో కొంత భాగమును తినుటకు పుట్టినవి అని భావించి వాటిని క్రూర బుద్ధితో చూడకుండా ఉండవలెను. కష్టపడి ధర్మమును, అర్థమును, కామమును అర్జించే ప్రయత్నము చేయరాదు. దయవశమున దేశ కాలానుగుణముగా లభించిన వాటితో ధర్మార్థ కామములను ఆర్జింపవలెను. కుక్కలను, పాపాత్ములను, నీచ జాతుల వారిని చూచినప్పుడు వారి ఎడ తక్కువ చూపు కలిగి ఉండరాదు. వారికి కూడా తన శక్తిని అనుసరించి అన్నాదులు వసంగవలెను.
ఇంకా మనకు ప్రహ్లాదులు చెప్పేటువంటి అంటే ఇంకా నారదుడు గృహస్థాస ధర్మంలో చెప్తున్న విషయాల్ని మనము తెలుసుకుందాం. ముందు కొంత భాగం తెలుసుకున్నాం యుధిష్ఠిర నార సంవాదం నుంచి తరువాత ప్రహ్లాదుడు. అడిగిన ప్రశ్నకు అవధూత్ ఇచ్చినటువంటి జవాబు తెలుసుకున్నాం. మళ్ళీ కొన్ని గృహస్థాస ధర్మంలో ఉన్నటువంటి విషయాలని మనం తెలుసుకుంటున్నాం. దీని తర్వాత భాగాన్ని మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమనారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Madraksham, even a moment of sin is due to devotion. Padabje, the bond of listening to your story is unbreakable. We do not accept any other story than this, O Lord of the Universe. May your glory be upon us, O Lord of the Universe Oh Jagannatha, Madhava, who is free from the qualities of being different, even after many births, I do not see with my eyes those virtuous people who do not maintain devotion even for a moment at your lotus feet. Even if I have a bond of kinship, I will not listen to any other story context except your story. I will not remember those who do not accept your existence mentally. I will have a life without your service in every birth. Mukundamala 16th Prayer. Oh, devotees of the Lord, the seventh book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 13. Until now, the story of Prahlada, the story of Tirupura Dahana, and the details of our four Varnaashrama Dharmas from the Yudhishthira Narada conversation, then. Prahlada, when he met an Avadhuta, he would ask questions. How come your body's so strong? What is the reason for your being so strong He will ask. After that, let's find out if Avadhuta is answering. When Prahlada asked thus, the Avadhuta replied thus. Oh, best of demons, you know everything. You know the reason for my coming and going. You are serving Narayana with devotion in your heart.
Knowledge dispels ignorance. However, I will answer the question you asked. Talking to you makes me feel holy. I have performed many actions to fulfill desires that are not possible to fulfill. Born with multiple bodies. I have been chosen by the Lord for this earthly life. In the future, whether it is a good birth or a bad birth, this human birth is the gateway. This birth can also lead to heaven and salvation. But I have spent some time doing many deeds to experience marital happiness and to get rid of sorrows, but seeing that sorrow also comes from the deeds done for happiness. I've freed myself from karmas. Happiness doesn't come from above. The Self is bliss. By ceasing all business, one can recognize the nature of the self. Forgetting the form of the soul, united with the body, people are trying for bodily pleasures. Even though there is water in the pond, because moss and grass have sprouted and covered it, they run in search of water in the sun, like those who run for water. Be within yourself Forgetting the form of the soul that is in the form of happiness, they do all kinds of business thinking that happiness is obtained by experience. No matter how hard you work, you will not find peace until you have overcome worldly pleasures, spiritual sorrows, and other sufferings. Do not be greedy, without the conquest of the senses, see the troubles of the rich. They fight with each other at night. He will doubt those around him. They are afraid of kings, thieves, enemies, their own people, animals, and beggars.
As time passes, he himself gives to someone, experiences it, and spends it, and even from himself, fear arises. Money is their life. For those who have hope in life and wealth, there is not only fear, but also sorrow, delusion, anger, affection, incompetence, and suffering. The honeybee and the python teach us detachment and contentment. The honeybee, having earned honey with so much hard work, is being exploited by others instead of being used for its own consumption. When we see that, we feel that our earnings are also the same, and we feel detachment. The mountain lizard, which does not move anywhere, does not do any business, and remains still, gets enough food for its body nourishment by itself. It doesn't require much physical effort. Seeing that house, I learned detachment and practicality. I am living happily with whatever I have. Even though I didn't get it, I am spending my time with courage. Satisfaction is the reason for this body to be nourished. Even if it is obtained in small quantities, even if it is obtained in large quantities, even if good things are obtained, even if bad things are obtained Even if I get something tasty, even if I get something tasteless, even if I eat what I have put with care, even if I eat what I have put with disdain, I have made it a habit to eat without distinction. Even if it is a cloth made of cotton or a cloth made of silk, whatever is available, I am satisfied to wear it. Once, even though I was lying on the ground, even though I was lying in places with leaves, stones, and soil, even though I was lying on a wooden platform, I lived with satisfaction. Once upon a time, even after bathing, applying sandalwood paste, wearing garlands, and adorning oneself, being naked, riding elephants and horses, being alone, being content, that was my mind's habit.
Praise and blame are the nature of the world. They will be honoured one day and blamed another. I have not condemned or praised them. He wished that they may have prosperity and that they may have their minds fixed on God. In the world, among the people we see, in things, different races appear in different forms. When you see them, they should not remain in your mind, but as the offering made is reduced to ashes, so should the mind be dissolved. The mind should be connected to the heart, the heart to its cause, the Sattvic ego, and to the root nature. That is, whatever is seen, that form or nature, does not escape the mind. Then, experiencing his form, meditating on the Supreme Soul within him as the soul, and remembering that, I have adopted the practice of ceasing the efforts made for the nourishment of the body. This would be contrary to the world. It's the ultimate secret. This is very conducive to those who are doing philosophical discourses. For thou art a god, and thy revelation is good. Thus, hearing about the state of renunciation described by Avadhuta, Prahlada was pleased, worshiped, and returned to his kingdom. Yudhishthira, having heard all these dharmas, asked if there was a chance for householders to become foolish in their worldly affairs and behave accordingly. Then Narada began to tell the duties of a householder. Those who are in the household stage should continue to perform all their duties as an offering to Vasudeva. The householder should perform evening prayers, worship of deities, worship of ancestors, study, and service to the fire. Apart from that, he must perform the service to the spirits around him.
One should abandon the feeling that one is doing the actions, and one should abandon the feeling that the action is one's own and for oneself. The householder should not waste time with useless speeches, but should listen to the stories of the Lord with devotion from the virtuous. He, being with everyone in the house, should reduce and keep buying the infatuation in them by the company of good people. As soon as one wakes up from a dream, the affection towards them decreases. Even while in the world, even while acting like those who have affection for the body and home, one should be without affection. His children, relatives, whatever he wishes or says, it will happen according to their respective karmas. Therefore, it should accept without arguing about them. The Lord, according to karma, should only experience as much wealth and pleasure as He creates, but He should not claim that it is entirely His. Now, one should consider only what is sufficient for one's consumption as one's own, but one should not consider everything that is hidden as one's own. He who considers himself more than enough for his body maintenance A thief, perhaps. The animals, camels, donkeys, monkeys, and mice that are in and around his house. Rocky animals, birds, flies, etc., are not our enemies. They too, like our children, are born to eat a portion of the property, and considering them as such, we should not look at them with cruelty. One should not try to earn righteousness, wealth, and desire through hard work. By the grace of God, one should earn righteousness, wealth, and desires according to the times and place. When you see dogs, sinners, and those of low birth, you should not have a low view of them. Even to them, following his power, Anandi Vasagavale.
And let us know the things that Prahlada tells us, that is, let us know the things that Narada is telling in the Grihastha Sasthra Dharma. We learned some part before, from Yudhishthira's conversation with Nara, then Prahlada. We have understood the answer given by Avadhoot to the question asked. Again, we are learning about some things that are in the householder's dharma. We'll learn about the next part in another podcast. Jai Shrimanarayana Asmat Gurubhyo Namaha