త్రికూట పర్వత వర్ణన - సరోవరమునందు గజేంద్రుని జలక్రీడలు

The Trikuta Mountain & Gajendra Enter the Lake

bhagavatam

శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలోని ఈ ఘట్టం, పాలసముద్రం మధ్యన సువర్ణ శిఖరాలతో, దివ్యారణ్యాలతో, నదులతో విరాజిల్లే మహోన్నతమైన త్రికూట పర్వతాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది. ఆ పర్వత పాదాల వద్ద కలువపూలతో, పక్షిగానాలతో సుగంధభరితమైన ఒక విశాలమైన సరోవరం విలసిల్లుతూ ఉంటుంది. గజేంద్రుడు తన మందతో కలిసి ఆ సరోవరంలో ప్రవేశించి జలక్రీడలలో మునిగి, తనకు ముంచుకొస్తున్న మహాసంకటాన్ని గుర్తించకుండా ఆనందంగా విహరిస్తాడు.

This episode from Canto 8 of the Srimad Bhagavatham describes the magnificent Trikuta Mountain, a golden peak rising from the ocean of milk, adorned with forests, rivers, and celestial gardens that captivate all who behold it. At the foot of this sacred mountain lies a vast and enchanting lake, fragrant with lotus blossoms and filled with the songs of birds and the play of divine beings. The mighty elephant king Gajendra, surrounded by his herd, enters this beautiful lake to drink and revel in its cool, refreshing waters, unaware of the great trial that awaits him.

← Prev Next →
The Trikuta Mountain & Gajendra Enter the Lake bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః పృథ్వీరేణురణుః పయాంసి కణికాః ఫల్గుస్ఫుల్లింగో లఘుహు తేజోనిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్ర పితామహ ప్రభృతయః కీటాస్సమస్తాస్సురాః దృష్టే యత్ర శతావకో విజయతే భూమావధూతావధిహి పరబ్రహ్మ స్వరూపముగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథివి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు ఈ జగము నీటి తుంపర, తేజస్సు సూక్ష్మముగా అగ్నికణము, వాయువు నిశ్వాసము, ఆకాశము సన్నని చిన్న రంధ్రము, రుద్ర పితామహాది దేవతా కోటి సమస్తము క్షుద్ర కీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీద విరాజిల్లుచున్నది. నారాయణ మంత్రమును జపించినచో నిరతిశయమగు పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేసుకొని మిగిలిన తత్వముల పరిమితత్వమును అతని అతిశయమును అనుభవింపగలడు. ముకుందమాల. ప్రేయర్ 20. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధము రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ఉపోద్ఘాతంగా ఈ స్కంధంలో ఉండేటువంటి విషయాల గురించి మనము తెలుసుకున్నాం. ఇప్పుడు గజేంద్రుని యొక్క వృత్తాంతాన్ని ప్రారంభం చేసుకుందాం. గజేంద్ర మోక్ష వృత్తాంతమును మానవుడు నిత్యం అనుసంధానము చేసుకొనదగినది. మానవుడు అనగా మానవ శరీరముతో ఉన్న జీవుడు కర్మచే బంధింపబడి చాలా కాలము సంసారమని మడుగున పోరాడును. దానిని వాడు జయించలేడు. తాను గాని, తన వారు గాని, తమకు రక్షకులు గారు అనే జ్ఞానము ఎంతో కాలము గడిచిన తర్వాత కలుగును. జన్మాంతరములో చేసిన సుకృతం వలన. భగవానుడే రక్షకుడని భగవానుని వైపు మనస్సు మరలును. నీవే తప్ప వేరొకడు రక్షకుడు లేడని భగవాను శరణు పొందును. మనసారా ప్రార్థింపగానే భగవానుడే వచ్చి బంధమును తురించి మోక్షమును కలిగించును.

ఇది సకల జీవ సాధారణమైన గాథ. గజమే జీవుడు. మదించిన ఏనుగు వలె జీవుడు తన వారితో కలిసి భోగస్థానములలో భోగోపకరణములతో భోగమును అనుభవించుచుండును. ఆధ్యాత్మిక తాపము కలిగి దానిని వారించుట కొరకు ఏనుగు ఎండచే నోరెండి చెరువులో దిగినట్లు ఈ సంసారమున అనేక విషయములను అనుభవించుటకు ఉపక్రమించును. మనస్సు, ఇంద్రియములు ముసళ్ళ వంటివి. అవి మనను పట్టుకొనును. ఈ శరీరము నుండి జీవుని బయటకు రానివ్వక బంధించును. తన ప్రయత్నముచే తానీ ఆ బంధము నుండి విడువడవలెనని ప్రయత్నించును. తన వారెవరును రక్షించలేరు. జన్మాంతర సుకృతముచే నారాయణ నామము గుర్తునకు వచ్చును. భగవానుడే ఉపాయమని నమ్మి ప్రార్థించి వాని సుదర్శనముచే మొసలి వంటి మనస్సు ఇంద్రియములు ఖండింపబడగా జీవుడు మోక్షమునొందును. ఇది జీవ మోక్ష గాథ. ఇదియే గజేంద్ర మోక్ష కథ. అందుచే మన పెద్దలు నిద్ర లేవగానే గజేంద్ర మోక్ష గాథను తలంచుచు హరినామం స్మరింతురు. హరియే గజేంద్రుని మొసలి పట్టు నుండి విడిపించినాడు. మనస్సును సంసార బంధము నుండి విడిపించువాడును శ్రీ హరియే. క్షీర సముద్రములో ఒక ద్వీపము. ఆ ద్వీపమున త్రికూటమును పర్వతము గలదు. కొన్ని వేల మైళ్ళ ఎత్తు వెడల్పు కలది ఆ పర్వతం. మూడు శిఖరములు ఉండుటచే దానికి త్రికూటమని పేరు కలిగినది. బంగారు, వెండి, ఇనుము అనేటి మూడు లోహములతో ఏర్పడినవి ఆ మూడు శిఖరములు. మన శరీరముగాను మనకు చుట్టూను కనబడు సకల పదార్థములుగా కనపడునది ప్రకృతి. ఆ ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు గలది.

సత్వము తెలుపు, రజస్సు ఎరుపు, తమస్సు నలుపు రంగులుగా భావింపబడును. ఆ మూడు గుణములు మూడు శిఖరములు. ఆ మూడు శిఖరములతో కూడిన ప్రకృతియే ఈ పర్వతము. కళ్యాణ గుణములతో నిండిన భగవానుడే పాల సముద్రం. అందులోనే మధ్యలో ఉన్నది పర్వతము. వాడంతట వ్యాపించి ఉండును. పాలసముద్రం మధ్యలో ఉన్నది ఈ శిఖరములతో కూడిన పర్వతం. దీని ఎత్తు, పొడువు ఇంత అని తెలుసుకునుట శక్యము కాదు. ఆ పర్వతము చాలా సుందరం. ఆ పర్వతములో ఉన్న రత్నముల కాంతులు గైరికాది ధాతువుల కాంతులు ఎల్లదిక్కులా ప్రకాశింపబడుచుండును. రకరకములైన పొదలు, చెట్లు సెలయేళ్లతో నిండియుండును. చుట్టునున్న పాల సముద్రపు కెరటములు ఆ కొండ మొదలుకు ప్రాకుచుండును. గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు ఆ కొండ గుహలలో మత్తిల్లి నృత్య గీతములతో వినోదించుచుందురు. ఆ గుహలలో సింహములు వీరి పాటలకు ఎదురుగా గర్జించుచుండును. ఆ పర్వతమందు దేవోద్యానములు, నిర్మలోదకములు గల నదులు, సరస్సులు కూడా కలవు. దేవతా స్త్రీల స్నానములచే ఆ జలము పరిమళము గలదై ఉండును. ఆ పర్వతము యొక్క ఒక లోయలో వరుణుని ఋతుమతి అనడి ఉద్యానవనము ఉన్నది. ఉద్యానవనం ఉన్నది. అది దేవస్త్రీల విహార స్థానం. పుష్ప ఫల ద్రుమములతో నిండినది. మందారములు, పారిజాతములు, చూతములు, పనసలు మొదలగు వృక్షములు అనేకములందు కలవు. ఆ వనమధ్యమున విశాలముగు సరస్సు. బంగారు తామర పువ్వులు అందుండును. రకరకములైన తామరలు, కలువలు ఆ సరస్సును నిండి ఉండును. తుమ్మెదల జంకారములు, జలపక్షుల మధుర స్వనములు ఎడదెగక సాగుచుండును. దాని నిండా జలచరములగు మత్స్య కూర్మాదులు ఉండినవి. ఆ సరస్సులో చుట్టూ ఒడ్డుపై రకరకముల పూల తీగల చెట్లను అల్లిన అల్లి దట్టముగా ఉండెను.

ఆ అడవిలో చాలా ఆడ ఏనుగులతో కలిసి ఒక మగ ఏనుగు సంచరించుచు ఆ వనమును తన ఆవాసముగా కల్పించుకొని ఉండెను. ఆ గజేంద్రుని మదపు వాసనకు సింహములు, పెద్ద పులులు మొదల క్రూరపు జంతువులు కూడా దూర దూరముగా పోవుచుండెను. చిన్న జంతువులు ఆ నాగేంద్రుని అనుగ్రహముచే క్రూర మృగము భయము లేక హాయిగా సంచరించుచుండెను. ఒకనాడు వేసవి వేడికి తాపము కలిగి ఆ గజేంద్రుడు ఆడ ఏనుగులతో గున్న ఏనుగులతో కలిసి నీటిని త్రాగుటకై ఆ కొలనుకు వచ్చెను. ఆ నీరు నిర్మలము, అమృతం వలె భోగ్యము, పద్మ రాగములచే పరిమళము కలది అయి ఉండెను. ఆ గజేంద్రుడు ఆ సరస్సున ప్రవేశించి నీరు త్రాగి మునిగి తొండములో నీరు తీసి తన వారిపై జల్లుచు వారిచే త్రాగించుచు విహరించుచుండెను. గృహస్తుడు సంసారములో భోగములు తాను అనుభవించుచు తన వారిచే అనుభవింప చేయుచు తనకు అడ్డు లేదని ఉండునట్లే ఆ ఎనుగు కూడా రాబోవు దుఃఖమును గూర్చి ఆలోచింపక భగవన్ మాయచే భోగమే శాశ్వతమన్నట్లుండెను. ప్రారబ్ధ కర్మానుగుణముగా భగవత్ ప్రబోధితమై ఒక మొసలి వచ్చి ఆ గజేంద్రుని పాదమును పట్టుకొనెను. దాహం వేయుటచే కలిగిన బాధ తీరినది. ముసలిచే పీడ ప్రాప్తించినది. మనకు ఆధ్యాత్మికములగు అనగా శారీరక మానసిక దుఃఖములు తగ్గగానే ఇతర ప్రాణులచే అది భౌతిక దుఃఖములు కలుగుచుండును. గజేంద్రునకు అట్లే జరిగినది. గజేంద్రుడు బలశాలి. దాని ముందు మొసలి చిన్న నీటి పురుగు. దానిని విడిపించుకొనుట ఎంత అని గరేంద్రుడు ప్రయత్నించెను. తన బలమంతయు చూపెను. కానీ ప్రయోజనము లేకపోయెను. ఆర్తి పొందినది. ఆడ ఏనుగులు తన ప్రియుడైన గజేంద్రుడు పడు బాధను చూచి ఆ బాధ నుండి విడదేయలేకపోయినవి. మొరపెట్టుచు నిలిచినవి.

ఆపద నుండి బయలుపోవుటకు మనం ఇట్లే ప్రయత్నింతుము. మనంతట మనము ప్రయత్నింతుము. చేతకాక దైన్యము నొంది శోకించుచుందుము. చుట్టునున్న వారు చూచుచు శోకించుచుందురు. కానీ ఆపద మన ప్రయత్నము చేత గాని చుట్టునున్న వారి ప్రయత్నము చేత గాని తొలగునది కాదు. దైవానుగ్రహము చేతనే తొలగవలెనని రజస్తమస్సుల బలమున్నంత సేపు తోచదు. మొసలిని ఏనుగు వెలుపలికి లాగుచుండెను. లోపలికి మొసలి లాగుచుండెను. వెయ్యి సంవత్సరములు గడిచినను దేనికినీ విజయం లభింపలేదు. గజేంద్రునకు మనోబలము తగ్గినది. శరీర బలము తగ్గినది. కానీ మొసలికి బలము పెరుగుచున్నది. ప్రాణ సంకటము కలిగినది. ఇట్లే ప్రాణి తన ప్రయత్నము చేతనే తన దుఃఖముల నుండి తరించగలగని గలవనని ప్రయత్నించును. చివరకు సుకృత వశముచే భగవంతుని శరణు పొందవలెనని భావము కలుగును. గజేంద్రుడు కూడా చాలా కాలం ప్రయత్నించి విఫలుడై ఆ భగవాను రక్షకుడిగా భావించెను. భయంకరమైన కాలసర్పం వలె తీవ్రమైన వేగముతో మృత్యువు వెంటాడుచుండగా భయపడి పరిగెత్తుచు ఒకనాడు సర్వలోకేశ్వరుని చరణమును శరణముగా పొందును. అట్లు ప్రసన్నుడైన వానిని ఆ సర్వేశ్వరుడు తప్పక రక్షించును. మృత్యువు అతనికి భయపడి పారిపోవును. అట్టి వానిని నిన్ను శ్రమ పొందుదును ఆయన మనస్సులో నిశ్చయించుకొనెను. వెనుకటి జన్మమున ఇంద్రద్యుమ్న మహారాజుగా తానున్నప్పుడు అభ్యస్తమైన నారాయణ మంత్రం జపించెను. ఓం నమో భగవతే అని భగవానుడికి నమస్కారము చేసి ఇటు స్తుతింపనారంభించెను. చేతనా చేతనాత్మకమగు జగమునకు పరమ కారణమైన వానికి నమస్కారము. వానినే ధ్యానింతును అని కారణ తత్వమును ధ్యానించెను. మోక్షమును కోరువాడు. కారణమునే ధ్యానించవలెను అని కారణంతు ధ్యేయః అని చెబుచున్నది. ఆ కారణమును బ్రహ్మమని

ఆత్మ అని సత్ అని ఓం అని నారాయణ అని ధ్యానింతురు కానీ ఏ పేరును చెప్పక కారణమునే ధ్యానించున్నాడు గజేంద్రుడు యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరమస్ యోస్మాత్ పరస్మాత్ చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. సృష్టికి ముందు ఈ జగమంతయు యవ్వని యందు ఉన్నదో సూక్ష్మ చేతనా చేతనములతో గూడిన ఏ పరమాత్మ నుండి ఈ స్థూలమైన చేతనా చేతనాత్మకమైన జగం వచ్చినదో ఎవరిచే సృష్టింపబడి రక్షింపబడుచున్నదో ఎవడు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నవాడో ఎవడు అచేతనము కంటే పరుడైన జీవుని కంటే పరుడై పరాత్పరుడగుచున్నాడో ఎవడు తనంతట తాను ఉండగలవాడో వానిని ఉపాయముగా రక్షకుడుగా నమ్మియున్నాను. ఈ జగత్తు అంతయు సృష్టికి ముందు నామము రూపము లేకపోవుటచే పరమాత్మ కంటే వేరుగా గోచరించును. అదే మరల భగవానుని సంకల్ప రూపమగు మాయచే స్థూలముగా కనపడుతును. అతడు సకల పదార్థములను తానెరింగెడివాడు చూచెడివాడు అట్టి పరాత్మరుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థించాడు. ఆ తరువాత ఈ ప్రార్థనను ఇంకా అంతరార్థాన్ని తర్వాత జరిగినటువంటి భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. The earth is filled with rain, the sky is filled with clouds, the flowers are blooming, the light is fading, the sun is setting, the holes are becoming smaller, the sky is darkening, all the insects and demons are visible, where the hundred years of Vijayate bhumavadhutavadhihi, if one sees the supreme Brahman form, Narayana, then this earth is a subtle particle, this world is a drop of water, Radiance is subtly like a fire particle, air is breath, sky is a narrow small hole, Rudra, Pitamaha and other gods, a crore of deities, all are petty insects. The glory and limitations of that Supreme Being, Narayana, are shining on the horizons. If one chants the Narayana mantra, one can realize the infinite Supreme Brahman, experience the limitations of the remaining elements, and experience his greatness. Mukundamala. Prayer 20. Devotees of God, welcome to the second podcast of Srimad Bhagavata Tatva Deepika, the eighth book. Until now, as an introduction, we have learned about the topics in this book. Now, let's begin the story of Gajendra Let's do it. The story of Gajendra Moksha is something that man should constantly connect with. A human being, that is, a being with a human body, is bound by karma and struggles for a long time, fighting to be in the cycle of life. He can't win no matter what you plant. The knowledge that he or she is a protector will come after a long time. By good works done in the afterlife. The mind turns towards the Lord, because the Lord Himself is the Protector. You alone are the protector, there is no other savior, seek refuge in the Lord. As soon as one prays with faith, God himself comes and removes the bondage and grants liberation.

It is a universal story for all living beings. Gajamayee jivdu. Like a drunken elephant, the soul experiences pleasure with its companions, enjoying pleasures with pleasures. Having spiritual heat, to ward it off, like an elephant entering a pond through the sun, this world begins to experience many things. The mind and senses are like clay pots. They will catch us. This body binds the soul from which it is released. He tries to free himself from that bondage through his efforts. He cannot protect his people. Through the merit of good deeds in this life, the name of Narayana comes to mind. Believing that God is the only solution, praying, and with Sudarshana, the crocodile-like mind and senses are destroyed, the soul attains salvation. It is the story of life, salvation. It is the story of Gajendra Moksha. Therefore, as soon as our elders wake up, they remember the story of Gajendra Moksha and chant the name of Hari. Hari rescued Gajendra from the crocodile's grip. Sri Hari is the one who liberates the mind from worldly bonds. An Island In The Ocean Of Milk. On that island Trikutam is a mountain. The mountain is several thousand miles high and wide. It has three peaks and is called Trikuta. The three peaks are made of three metals namely gold, silver and iron. Nature is what we see around us, including our bodies. That nature has three qualities: Sattva, Rajas, and Tamas.

Sattva is white, Rajas is red, and Tamas is considered as black. The three virtues and the three peaks. This mountain is nature with three peaks. The ocean of milk is the Lord, who is endowed with auspicious qualities. In the middle of it all is the mountain. It will spread on its own. The mountain with these peaks is in the middle of the Palamūnku. Its height and length are not possible to know. The mountain is beautiful. The light of the gems in that mountain, the light of the gangirika and other metals, is shining in all directions. Various bushes and trees laden with flowers. The waves of the milky ocean surrounding the mountain are crashing at the base of the mountain. Gandharvas, Vidyadharas, and Kinnaras, intoxicated in the caves of that mountain, are enjoying themselves with dance and songs. In those caves, lions roar in front of their songs. That mountain has gardens, rivers with fresh water, and also lakes. By the bathing of the goddesses, that water will be fragrant. In a valley of that mountain, there is a garden called Varuna's Ritudamti It is there. There is a garden. It is the playground of the goddesses. Filled with flowers and fruits. Hibiscus, Parijata, Chutam, and jackfruit trees, among many others, are found. A wide lake in the middle of the forest. Golden lotuses are there. Different kinds of lotuses and water lilies fill the lake. The humming of bumblebees, the sweet songs of water birds, continue incessantly. It was full of aquatic animals like fish and kormas. The lake was surrounded by a thick cluster of various kinds of flower vines and trees on the banks.

In that forest, along with many female elephants, a male elephant roamed and made that forest its habitat. The smell of Gajendra's intoxication, along with lions, large tigers, and other ferocious animals, was spreading far and wide. Small animals, by the grace of that Nagendra, without fear, were happily roaming around the cruel beast. Once upon a time, due to the summer heat, Gajendra, feeling the heat, came to that pond with the female elephants and the pregnant elephants to drink water. That water is pure, enjoyable like nectar, and fragrant with the aroma of lotuses. That Gajendra entered that lake, drank the water, submerged himself, took water in his trunk, sprinkled it on his people, made them drink, and was frolicking. The householder, while enjoying pleasures in his family life, makes his wife enjoy them, and as if he has no obstacles, that elephant also, without thinking about the coming sorrow, seemed to have the illusion of God that pleasure is eternal. According to the karma of past deeds, being enlightened by the Lord, a crocodile came and took hold of the feet of that Gajendra. The pain caused by thirst It is over. The suffering of the old man has been overcome. As our spiritual, that is, physical and mental sufferings decrease, other beings experience physical sufferings. It happened to Gajendra. Gajendra was very strong. It was preceded by the small water beetle. Garendrudu tried how much to get rid of it. He showed his strength. But it was to no avail. The victim. The female elephants, seeing the suffering of their beloved Gajendra, could not bear the pain and were unable to get rid of it. They are standing with their mouths covered.

We keep trying to get out of the mess like this. We will try our best. We will suffer and grieve because of the lack of ability. Those who are around will watch and mourn. But calamity is not removed by our efforts or by the efforts of those around us. It does not seem that it can be removed only by divine grace, as long as there is strength in the Rajas and Tamas. The crocodile was pulling the elephant out. The crocodile was in fact pulling the boat under water. Even after a thousand years, no victory has been achieved for anything. Gajendra's mental strength has weakened. Weakness in the body. But the crocodile's strength is increasing. It was a life-threatening condition. Similarly, a creature, through its own efforts, tries to overcome its sorrows. Finally, by the grace of good deeds, one should have the feeling of seeking refuge in God. Gajendra also tried for a long time but failed and considered the Lord as his savior. Like a terrible serpent, death chases with great speed, being afraid and running, one day he will surrender to the feet of Sarvalokeshwar. Like that, the one who is pleased May the Lord of heaven protect us. Death itself would rather flee than be afraid of him. I will make you suffer for such a person. He has decided in his mind. In his previous birth, when he was Indradyumna Maharaja, he chanted the Narayana mantra that was forgotten. Om Namo Bhagavate, after offering salutations to the Lord, he began to praise. Salutations to the one who is the supreme cause of the world, which is the causal and cognitive. He meditated on the cause of the reason, that he would meditate. The one who seeks salvation. It says that one should meditate on the cause, that is, the cause is the object of meditation. That reason is Brahma

They meditate on the self, the truth, Om, and Narayana, but without saying any name, Gajendra meditates. Whatever this is, that is, this is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is Before creation, this entire universe exists in the form of a young one. From which supreme being, along with subtle consciousness and intellect, this gross, conscious, and intellectual world came into existence? By whom is it created and protected? Who is pervading all substances Who is there, more than the unconscious, more than the other being, more than the other, who is becoming the supreme, who can be alone, I trust him as a means, as a savior. This world, before creation, exists without name or form, therefore it appears different from the Supreme Being. That again appears in the form of the illusion, which is the form of the Lord's will. He who is the knower of all substances, the seer, may such a supreme being protect me, thus he prayed. After that, let's learn about this prayer and its deeper meaning in another podcast. Jai Shri Mannarayana. Asmad gurubhyo namah