క్షీరసాగర మథనం: దివ్య రత్నాల ఆవిర్భావం, మోహిని అవతారం మరియు అమృత తత్వ రహస్యం

Churning of the Cosmic Ocean: Emergence of Treasures, Mohini Avatar, and the Secret of Amrita

bhagavatam

ఈ ప్రవచనంలో అష్టమ స్కంధంలోని క్షీరసాగర మథన వృత్తాంతం కొనసాగింపుగా కామధేను, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభమణి, పారిజాతం, అప్సరసలు మరియు మహాలక్ష్మి ఆవిర్భావం వివరించబడింది, మరియు లక్ష్మీదేవి సర్వులలో దోషాలను పరిశీలించి దోషరహితుడైన శ్రీహరిని వరించిన వైనం చెప్పబడింది. తదనంతరం ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవించగా అసురులు దానిని అపహరించుటను, శ్రీహరి మోహిని రూపం ధరించి దేవతలకు మాత్రమే అమృతం పంచుటను, రాహువు శిరచ్ఛేదం జరిగిన ఘటనను వివరించారు. తాత్వికంగా, దేవతలకు అమృతం లభించుటకు కారణం వారి భగవత్ శరణాగతి అని, అసురులకు లభించకపోవుటకు కారణం శరణాగతి లేకపోవుటయేనని, మరియు భగవానుని ఆత్మగా గుర్తించి వానితో ఐక్యమగుటయే నిజమైన అమృతత్వమని ఈ ప్రవచనం బోధిస్తుంది.

This discourse covers the continuation of the Kshira Sagara Mathana (churning of the cosmic ocean) from the Eighth Skandha of Srimad Bhagavatam, describing the emergence of divine treasures including Kamadhenu, Ucchaishrava, Airavata, Kaustubha gem, Parijata, Apsaras, and Mahalakshmi, who ultimately chooses Lord Vishnu as her consort. The narrative then describes the emergence of Dhanvantari with the pot of amrita, the ensuing conflict between devas and asuras, and Lord Vishnu's assumption of the enchanting Mohini form to distribute amrita exclusively to the gods, along with the episode of Rahu being beheaded by Vishnu's Sudarshana Chakra. The deeper philosophical teaching reveals that the devas received amrita because of their surrender to Lord Vishnu (sharanagati), while the asuras did not, illustrating that true immortality lies in recognizing the Lord as the inner Self and dedicating all actions to Him.

← Prev Next →
Churning of the Cosmic Ocean: Emergence of Treasures, Mohini Avatar, and the Secret of Amrita bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపజిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీ కృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం ఓ జిహ్వా శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము జపింపుము అదియే జన్మకు సాఫల్యమును సొంగునది కామాది శత్రువులను భేదించుటలో ప్రధాన సాధనమా మంత్రం. సర్వోపనిషత్ వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి. జనన మరణములని సంసారము నుండి తరింపజేయగల మంత్రమది. రాశీభూతమైన అవిద్యాంధకారమును నశింపజేయు మంత్రము. ఆ మంత్రమే సర్వైశ్వర్యముల వసంగు జాలును. వ్యసనములనడి సర్పమును కాటు వేసినప్పుడు కాపాడగల మంత్రము కావున శ్రీకృష్ణ మంత్రమును జపింపుము జపింపుము. ముకుందమాల 24th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధము ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షము పూర్తి చేసుకుని క్షీర సాగర మథనంలో దేవతలు స్తుతించిన తర్వాత పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచి వారు మదించుండం మదిస్తున్నప్పుడు వచ్చినటువంటి హలాహలాన్ని తీసుకోవడానికి సదాశివుని ప్రార్థించడం. శివుడు వచ్చి ఆ హలాహలాని తను గ్రహించడం వరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. పరమశివుడు విషమును పానము చేసినాడు. దేవాసురుడు సంతోషించిరి. మరలా మద్దించుట ఆరంభించిరి. అప్పుడు కామధేనువు వెలువడెను. పాలు, పెరుగు, నేయి మొదలగు హోమ ద్రవ్యములు వసంగుటచే వైదిక కర్మలకు ఉపయోగించు. ఆ కామధేనువును ఋషులు యజ్ఞమున హవిస్సులను వసంగునని స్వీకరించిరి. తరువాత సముద్రము నుండి చంద్రుని వలె తెల్లగా నుండు. ఉచ్చైశ్రవము అనడి అశ్వము వెలువడెను. ఇంద్రునకు దానిపై కోరిక కలిగెను. కానీ దానిని దేనిని కోరవలదని ఈశ్వరుడు మునుపు ఉపదేశించుటచే ఆ కోరికను అభివ్యక్తము చేయలేదు.

తరువాత నాలుగు దంతములు గల తెల్లని ఐరావతం బయలు బలెను. తరువాత కౌస్తుభము అను మణి బయటకు వచ్చెను. శ్రీహరి తన ఉరమును అలంకరించుకొనవలెనని కోరెను. తరువాత కోరిన వారి కోరికలు నెరవేరిచ్చడి దేవలోకమునకి అలంకారముకు పారిజాతం బయలుదేరునను. తరువాత బంగారు ఆభరణములతో మనోహరమగు చూపులతో నడకతో దేవతల మనస్సులను హరించడి అప్సరసలు అవభిభ్రమించిరి. తరువాత భగవానునికే చెందదగిన లక్ష్మి ఆవిర్భవించినది. మెరుపు మెరిసినట్లు ఆమె కాంతి అన్ని దిక్కులకు ప్రకాశింపజేసెను. ఆమె సౌందర్యమునకు పరవశమై దేవ దానవులందరూ ఆమెను కోరిరి. మహేంద్రుడు అద్భుతమైన సింహాసనమును ఆమెకు కల్పించెను. ఆమె దానిపై ఆసీనురాలెను. గంగాది నదులు రూపుదాల్చినవై బంగారు కలశాలతో జలమును తెచ్చి ఆమె అభిషేకమునకై నిలిచినవి. భూమి అభిషేకోచితములగు సకల ఔషధులను తెచ్చెను. గోవులు పంచగవ్యములను సమకూర్చినవి. చైత్ర వైశాఖ మాసములు ఫలములను పుష్పములను తెచ్చినవి. ఋషులు యధావిధిగా ఆమె అభిషేకమునకు ఏర్పాటు చేసిరి. గంధర్వులు గానము చేసిరి. నటులు నాట్యమాడిరి. మేఘములు నానా విధ వాద్యములు మ్రోగించిరి. తామర పువ్వు చేతిలో దాల్చి కూర్చునిన మహాలక్ష్మిని దిగ్గజములు పూర్ణ కలశములతో అభిషేకించినవి. బ్రాహ్మణులు వేద సూక్తములు పఠించిరి. సముద్రుడు రెండు పచ్చని పట్టుచీరలను సమర్పించెను. వరుణుడు వైజయంతి మాలను, విశ్వకర్మ ఆభరణములను, సరస్వతి హారమును, బ్రహ్మ పద్మమును, నాగములు కుండలములను సమర్పించిరి. మంగళాయమమగు మహాలక్ష్మి తన చేతిలో మాలను ధరించి తనకు అభిమతమగు పురుషుని కంఠమున ఉంచుటకు సుకుమారముగా సుందరముగా నడుచుచు వచ్చుచుండెను. కళ్యాణ గుణములు కలవాడు, హేయ గుణములు లేనివాడు ఎవడని చూచుచు సాగుచుండెను. ఒక్కరొక్కరిలో ఒక్కొక్క దోషము కనపడుచున్నది. రుద్ధ దుర్వాసాదులకు తపస్సు ఉన్నది కానీ క్రోధము నిగ్రహించుకునే శక్తి లేదు. గురు శుక్రాదులకు జ్ఞానం ఉన్నది కానీ ఫలసంగం వదలలేదు. బ్రహ్మ అందరికంటే గొప్పవాడే కానీ అతనికి కామ విజయము లేదు. ఒకరిని ఆశ్రయించి ఐశ్వర్యమును పొందువారు ఇంద్రాదులు కావున ఈశ్వరులు కారు.

పరశురామాదులందు ధర్మమున్నది. కానీ దయ లేదు. శిబి మొదలగు వారి యందు త్యాగమున్నది. కానిది ముక్తి హేతువు కాదు. కార్త. వీర్యారుదులకు వీర్యమున్నది కానీ అది కాలవేగముచే పరిహరింపబడుతున్నది. కావున దోషము లేని వారు కనపడలేదు. మార్కండేయాదులకు చిరాయు ఉన్నది కానీ శీల మంగళము లేదు. కొందరిలో శీలము, మాంగల్యము ఉన్నను వారు చిరాయువులు కారు. రుద్రాదులకు చిరాయువు, శీలము ఉన్నవి కానీ వారు అమంగళకరమగు వేషభూషాదులు కలవారు. దోషములంటక సద్గుణములే పూర్ణముగా గల మంగళమూర్తి భగవానుడు ముకుందుడు. కానీ అతడు పరిపూర్ణుడు కనుక అతడు తనను ఆక్షేపించక ఆపేక్షింపక పోయినను తనను అపేక్షింపకపోయినను తానే భగవానుని వరించి అతని కంఠమున ఆ వనమాలనుంచెను. వాని అనుగ్రహమునకు ఎదురు చూచుచు సిగ్గుతో నవ్వుచు తన చూపులతో అతని వక్షస్థలమున నివాసము కలిగించెను. అచ్చట నుండి ఆమె కరుణాపూర్ణమగు తన చూపుతో మూడు లోకములను పోషించుచుండెను. లక్ష్మీదేవి శ్రీహరి వక్షమును అధిరోహించగానే బ్రహ్మరుద్ర దేవతలు స్తోత్రము చేసిరి. బ్రహ్మతో కూడి దేవతలందరూ మహాలక్ష్మిచే చూడబడిన వారై శీలాది గుణములను ఆనందమును పొందిరి. లక్ష్మిచే ఉపేక్షింపబడిన దైత్య దానవులు బలహీనులై, క్రియాశూన్యులై, లజ్జాహీనులై, మోహశీలులై ఉండిరి. తరువాత వరుణ దేవతా కన్యయగు సురకు అధిదేవతయగు కన్య ఆవిర్భవించినది. ఆ వారుణీ కన్యను అసురులు స్వీకరించిరి. అప్పుడు ఆ సముద్రము నుండి ధన్వంతరెను ఒక ఆయుర్వేద ద్రష్ట శ్రీ మహావిష్ణువు యొక్క అంశ సంభవుడగు మహాపురుషుడు వెలువడెను. అతడు అమృతముతో నిండిన కలశమును ధరించి వచ్చెను. దానిని చూచి బలవంతులగు అసురులు ఆ అమృత భాజనము తీసుకొని పోవుచుండిరి. దేవతలు దీనులై శ్రీహరిని శరణు పొందిరి. అప్పుడు శ్రీహరి

క్షేదము నొందకుడు మీ కార్యమును నెరవేర్చెదను. మీకు అమృతమును లభింప చేసెదను అని చెప్పి అంతర్ధానమాయెను. దేవతలకు రాక్షసులకు అమృతం కొరకు కలహమారంభమాయెను. నేను ముందు త్రాగవలెను. నేను ముందు తాగవలెను. నీవు కాదని ఒకరితో ఒకరు వివధించుకొనుట ఆరంభించిరి. సత్రయాగములో అనేకులు యజమానులుగా ఉందురు. వారికందరకూ ఫలము సమానముగా ఉండును. అట్లే అమృతమును సాధించుటలో దేవతలు, దానవులు కూడా సమముగా భాగమును స్వీకరించవలెను. కానీ బలవంతులు బలహీనులకు అడ్డగించి ఆ అమృతమును లావుకొన చూచుండిరి. సర్వోపాయ విధుడగు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువు గుర్తించుటకు శక్యముగాని పరమాద్భుతమగు స్త్రీ రూపమును ధరించెను. అందమైన శ్యామల దేహకాంతి సకలావయవ సౌందర్యము కలిగి ఉండెను. ఆమె కరుణాభరణములను దాల్చి ఉండెను. చెక్కిళ్ళు, నాసిక, ఆసనము ఆకర్షణములుగా ఉండెను. నూత్న యవ్వనముతో సమ్మోహనముగా ఉండెను. ఆమె మెల్లమెల్లగా వస్త్రమును జార్చుచు కాలి యందలు గల్లుమనుట అనునట్లు మధురమగు మందహాసముతో కనుబొమ్మల కదలికతో దైత్యుల మనస్సులను కామ పరవశము చేయుచు నడిచి వచ్చుచుండెను. అమృత పాత్రను అపహరించుకొని పోవుచున్నను అసరులు ఆమెను చూచి ఆశ్చర్యపడి నిశ్చేష్టులైరి. ఈమె రూపము, ఈమె కాంతి, ఈమె యవ్వనము ఇంతకుముందు ఎక్కడనూ చూడలేదు అని ఆమెను అనుసరించి చేరి ఇట్లు ప్రశ్నించిరి. ఓ పుండరీక దళాక్షి నీవెవ్వరవు, నీవెవ్వరి దానవు ఇంతవరకు నిన్నెవ్వరును స్పష్టించినట్లు లేదు. బ్రహ్మనిని సృష్టించి శరీరధారులకు సర్వేంద్రియ మనఃప్రీతిని కలిగించుటకు పంపియుండును. మేము ఈ అమృతము కొరకు కలహించుచున్నాము. మేము జ్ఞాతులము. బద్ధ వైరులము. మాకందరకు సుఖము కలుగునట్లు నీవు పంచిపెట్టుము. మాలో మాకు తేడా రాకుండా నీవే న్యాయముగా విభజింపుము అని అసురులు చెప్పగానే శ్రీహరి మోహిని రూపమున ఓ అసురులారా నేను కామినిని నన్ను మీరు నమ్ముచున్నారు. పండితులు స్వేచ్ఛా సంచారిణి అగు వనితను నమ్మరు. స్వేచ్ఛా ప్రవృత్తి గల కామినిలు తోడేళ్ల వంటి వారు. కలిసిన వారిని వదలి కొత్త వారికై ప్రాకులాడుచుందురు.

ఇట్లు మాట్లాడుచున్న మోహిని మాటలు విని వారు గట్టిగా నవ్వి ఆమె చేతికి అమృత భాండమును సంగిరి. ఆ మోహిని అమృత భాండమును ధరించి మందహాసముతో మీరు పంచమని కోరినాడు కనుక పంచి ఇచ్చెదను. కానీ అందు మంచి జరిగినను చెడు జరిగినను మీరు సమ్మతింపక తప్పదు అని చెప్పెను. దానిలో రహస్యం ఎరుగని అసురులు అట్లే అని సమ్మతించిరి. అందరూ స్నానము చేసి, ఉపవాసము చేసి, హోమము చేసి, గోవులను విప్రులకు సమర్పించి, బ్రాహ్మణ ఆశీస్సులను పొంది, పవిత్రముగు వస్త్రములు దాల్చి, తూర్పు ముఖముగా దర్భలపై దేవతలు, రాక్షసులు కూడా కూర్చుకొనిరి. కూర్చోనిరి. విశాలముగు శాలను మాల్యములతో దీపములతో అలంకరించిరి. అప్పుడు ఆ సుందరాంగి నడకలచే, చూపులచే, మాటలచే వారిని మోహపరచుచు అమృత భాండమును నడుమున చేర్చి పట్టుకొని వయ్యారముగా నడిచి వచ్చుండెను. అసురులు ఆమె రూపమునకు మోహము నొంది యుండిరి. మోహిని రూపమున ఉన్న శ్రీ మహావిష్ణువు అసుర జాతికి అమృతమిచ్చి స్థిరముగా నిలుపుట లోకమునకు అపకారమని భావించి దేవతలను రాక్షసులను వేరు వేరు పంక్తులుగా కూర్చుండునట్లు నియమించెను. భగవానుడు రాక్షసులకు దగ్గరగా నడుచుచు చూచుచు వారితో మాట్లాడుచుచు దూరముగానున్న దేవతలకు అమృతంలో సంగుచుండెను. అసురులు ఆమె సౌందర్యమును విలాసమునకు వశపడి ఏమియు మాట్లాడలేక ఉండిరి. అప్పుడు రాహువు దేవతా రూపమును స్వీకరించి దేవతల పంక్తిలో చేరి అమృతమును తాగెను. చంద్ర సూర్యులు దానిని గుర్తించి మోహినికి సూచించిరి. వెంటనే కత్తి వలె వాడి అయిన చక్రముతో రాహువు శిరస్సును ఛేదించెను. మొండెము కింద పడెను. శిరస్సు మాత్రము అమృత స్పర్శచే అమరత్వమును పొందెను. బ్రహ్మ ఆ శిరమును రాహు అను ఒక గ్రహముగా అమర్చెను. చంద్ర సూర్యులు చేసిన అపకారమునకు రాహువు ప్రతీకారముగా పూర్ణిమ అమావాస్యలలో గ్రహించుచుండును. అమృతము దేవతలందరుకు వసంగి రాక్షసులందరూ చూచుచుండగా శ్రీహరి మరల తన రూపము నొందెను. ఈ అమృత మథన వృత్తాంతముచే గ్రహింపదగిన విషయము సుఖయోగింద్రుడు రెండు శ్లోకములతో వివరించినాడు.

దేవతలకు అసురులకు ఫలములో భేదము కలిగినది. దేవతలకు అమృతము లభించినది. అసురులకు లభించలేదు. దీనికి కారణం ఏమి? ఇద్దరును ఒకే దేశమున ఒకే కాలమున ఒకే మందర పరముతో మధించినారు. ఇద్దరును అమృతమును ఫలముగా పొందవలెని మధించినారు. కానీ ఫలము దేవతలకు సిద్ధించినది. అసురులకు సిద్ధించలేదు. కారణము దేవతలు భగవత్ శరణారవింద శరణాగతి చేసిన వారు అగుటయే. అసురులు శరణాగతి చేయలేదు. కనుక వారికి ఫలము సిద్ధించలేదు. భేదభావం కలిగి ఉండుట అసురత్వం. అభేదభావం కలిగి ఉండుట దేవత్వం. భగవానుడు అంతటను వ్యాపించి ఉండును. అతడు లేని పదార్థము లేదు. అందుచే ఎవరు దేని కొరకు ఏ పనిని చేసినను చేయువాడు భగవానుడే, చేయు పని భగవానునిదే, సాధించిన ఫలము భగవత్ ప్రీతి కొరకే అని ఎరింగిన వారికి భగవానుడే ఫలమును సాధించి తాను అందించును. ఈ జ్ఞానము లభించుటయే అమృతం పొందుట. తన భార్యా బిడ్డలు మొదలగు వారి కొరకు తన ధనముతో తాను పనిచేసి ఆయా సుఖములను ఆయా ఫలమును సాధించుచున్నామని భావించువారు అసురులు. వీరికి స్థిరమగు ఆనందము లభింపదు. దుఃఖమే కలుగుచుండును. అదియే అమృతము లభించకపోవుట. కొంతమందికి పువ్వులు, కొందరికి ఆకులు, కొందరికి కాయలు, కొందరికి ఫలములు కావలని కోరికలు ఉండును. ఏది కావలసినను చెట్టు మొదట నీరు పోయవలెను. పోసిన నాడు అన్నియు లభించును. అట్లే మనకు ఏది లభించవలెను భగవానుని కంటే వేరు లేదు కనుక వానిని ఆరాధించిన వారికి ఫలము లభించును. వానిని ఆరాధించని వారికి శ్రమ, దుఃఖము మిగులును. భగవానుని ప్రతిపాదించునదే వేదము, అది సముద్రం వంటిది. అగాధము అనంతము. మనకు అవశ్యకములగు సకల పదార్థములను దానిని మధించిన పొందవచ్చును. మధించుటకు ప్రజ్ఞాశక్తులు ఎంత ఆవశ్యకమో భౌతికమైన బలము కూడా అంత అవసరమే. అందు ప్రజాశక్తిచే లౌకికములు, అల్పసారములు, లోకోపద్రవములగు పదార్థములు పొందుటకై ఆర్తి పడరాదు. ముందే భగవాను శరణు పొంది వాని సాయముతో సకల ఫలములకు సాధించుటకు ఉపక్రమింపవలెను. అమృతము సాధించుట యందే పూనికను కలిగి ఉండవలెను. దీనిని భగవద్గీత వ్యవసాయాత్మిక బుద్ధి అని పేర్కొనెను.

మన శరీరముతో ఏ కర్మ చేయునప్పుడు చేయుచున్నను వానికన్నిటికీ ఫలం భగవత్ ప్రాప్తియే. ఇదే అమృతము. ఆత్మయగు భగవానుని వదలి తాను దూరమై ఉండుటయే మరణము. వానిని ఆత్మగా గుర్తించి వానితో కూడా తాముండుటయే అమృతత్వం. దీని సాధించుటకే మానవులమై జన్మించినాము. ఈ మానవ శరీరములో దేవతలు అసురులు కూడా ఉన్నారు. వానిని భగవద్గీత 16వ అధ్యాయం వివరించినది. అందు దైవత్వమును స్థిరము చేసుకుని అసురత్వమును అంతమొందించుకొనవలెను. ఇది కేవలము మన ప్రయత్నముచే జరగదు. భగవంతుని సహాయముతోనే సాధింపబడును. ఈ విషయము తెలిపేదే అమృతత్వ సాధన రహస్యము. ఈ అమృత మథన వృత్తాంతమున ప్రకాశింపచేయబడినది. ఇంతటితో క్షీరసాగర మథనము మనకు పూర్తయింది. ఇది కొంత. భాగాన్ని పూర్తి చేసుకోవాలని సమయం ఎక్కువగా తీసుకున్నాం. దీన్ని మరొకసారి విని దీని తత్వార్ధాన్ని కూడా అందరూ గ్రహించాలని ప్రార్థిస్తూ మరల మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. The one mantra that destroys enemies, the mantra that is worshiped by all the Upanishads, the mantra that is the savior of the world, the mantra that is consecrated by the departure of the dark association, the mantra that is the only mantra of all prosperity, the mantra that destroys the thorns of addiction, on the tongue, Sri Chant the Krishna mantra, chant it constantly, it is the mantra that fulfills birth. Oh tongue, always chant the Sri Krishna mantra, chant it, it is the main means of achieving birth. The mantra is the main tool in distinguishing the enemies of desire. The Vedas and the Mantras are worshipped. It is a mantra that can help you get rid of the cycle of birth and death. The mantra destroys the darkness of ignorance that is accumulated. That mantra is the source of all prosperity. When a snake bites due to addiction, chant the Sri Krishna mantra, chant it. Mukundamala 24th Prayer. Devotees of God, welcome to the sixth podcast of Srimad Bhagavata Tattva Deepika, the eighth book. Until now, after completing Gajendra Mokshamu and praising the gods in the churning of the ocean of milk, they placed the mountain in the ocean of milk To take the hallucination that came while being tormented, praying to Sadashiva. We have learned that Shiva came and consumed that Halahala poison. Let's move on to the next part. Parameshwara drank the poison. The gods and demons rejoiced. They started to reconcile. Then arose Kamadhenu. Milk, yogurt, ghee, and other homa substances are used for Vedic rituals. The sages accepted the Kamadhenu as the offering in the yajna. Then, from the sea, like the moon, it is white. Uccha-shrava-m is the Uccha-shrava-na-dhi. Indra desired it. But because God had previously instructed that it should not be desired, that desire was not expressed.

Then the white Airavata with four tusks came out and Balu the strong one. Then the gem Kaustubh came out. Srihari wished to adorn his chest. After that, may the desires of those who asked be fulfilled, and may the Parijatham (a type of flower) be sent to the heavenly abode. Then, with golden ornaments, with beautiful eyes, with a walk, they captivated the minds of the gods. Then, Lakshmi, who is worthy of being devoted to God, appeared. Her light shone in all directions, like a flash of lightning. All the gods and demons desired her beauty. Mahendra provided her with a wonderful throne. She lay there, exhausted. The Ganges and other rivers took shape, bringing water with golden vessels, and stood for her anointing. He brought all the medicines that were considered auspicious for the earth's consecration. The cows are the ones who collect the Panchagavya. The months of Chaitra and Vaisakha brought forth fruits and flowers. The sages, as usual, made arrangements for her abhisheka. The Gandharvas came singing. The actors are dancing. The clouds and various musical instruments sounded. The great lakshmi, seated on a lotus flower, was anointed by the eminent ones with full kalashas. The Brahmins recited the Veda hymns. The sea god offered two green silk sarees. Varunudu offered the Vaijayanti garland, Vishwakarma's ornaments, Saraswati garland, Brahma Padma, and Nagas Kundalas. The auspicious Mahalakshmi, wearing a garland in her hand, was walking gracefully and beautifully to place it on the neck of the man she liked. He was observing and continuing to see who was virtuous and who was not virtuous. Each person has their own flaws. Rudra Durvasa had the power of penance but lacked self-control. Guru Shukrahadhikaranam Gnanam Vadanante Phalasamgam Vadanante. Brahma is the greatest of all, but he has no conquest of lust. Those who depend on others to attain wealth are not Indra and others, therefore they are not Gods.

Parashurama is the god of righteousness. "But there is no mercy. There is sacrifice in Shibi and others. But that is not the cause of liberation. For those who are weak, there is strength, but it is being overcome by the speed of time. Therefore, those without fault were not found. Markandeya has a short life but has no good character. In some people, even though they have chastity and marital fidelity, they do not live long. Rudra and others have long life and good character, but they have inauspicious attire and appearance. Mukunda, the auspicious form of God, is full of virtues and is without faults. But because he is perfect, even if he does not despise or expect him, even if he does not expect him, he himself, having become God, placed that garland on his throat. Looking forward to his grace, laughing with shyness, she made her abode in his chest with her eyes. From there, with her compassionate gaze, she nourished the three worlds. As soon as Goddess Lakshmi mounted Sri Hari's chest, the Brahma-Rudra gods praised. All the gods, along with Brahma, were seen by Mahalakshmi They attained virtuous qualities and happiness. The demon giants, neglected by Lakshmi, were weak, inactive, shameless, and deluded. Then, the god Varuna's daughter, the goddess of the ocean, the goddess of the ocean, manifested. The demon accepted the virgin. Then, from that ocean, Dhanvantari, an Ayurvedic seer, a great man who was an incarnation of Sri Maha Vishnu, emerged. He came with a pot filled with nectar. Seeing that, the mighty demons took that nectar and were going. The gods, being humble, sought refuge in Srihari. Then Srihari

I will accomplish your work, so that you will not be afflicted. He said that he would give you nectar and disappeared. A war broke out between the gods and the demons for the nectar of immortality. I have to drink first. I have to drink. You started to argue with each other, saying no. In Satrapen, many are the owners. The fruit shall be the same for all. Similarly, in achieving immortality, gods and demons should also equally receive their share. But the strong prevented the weak, and they were watching that nectar thickly. The supreme God, the Lord of all, Sri Maha Vishnu, assumed a form that was impossible to recognize, a supremely wonderful female form. The beautiful Shyamala had a radiant body and beautiful limbs. She was wearing a garland of mercy. The cheeks, nose, and posture were attractive. He was full of youthful exuberance. She was slowly unraveling the cloth, as if to make the soles of her feet clatter, with a sweet smile, with the movement of her eyebrows, and with the lustful ecstasy of the demons, she was walking. Amrutha Even though they were abducting the vessel, the spirits were surprised and stunned to see her. Her beauty, her radiance, her youth, I have never seen anywhere before, so following her, they joined and questioned thus. Oh Pundarika Dalakshi, who are you? Who are you to me? Until now, no one has clarified it. Brahma creates and sends the embodied beings to provide sensory pleasure. We're fighting over this nectar. We are relatives. Wires. Share with us so that we may be filled with sustenance. As the demons said, "You divide us fairly without any difference between us," Srihari, in the form of Mohini, said, "O demons, I am a Kamini (a woman of desire), and you believe in me." The pundits do not believe the woman who is a free wanderer. The libertine is like a wolf in pursuit of prey. Those who have met, leaving them behind, they are yearning for new ones.

Hearing the words of Mohini speaking thus, they laughed loudly and placed the pot of nectar in her hand. Oh Mohini, having taken the pot of nectar, with a smile, since you asked to distribute it, I will distribute it. But he said that you must agree whether good or bad happens. The demons, who did not know the secret, agreed to remain so. Everyone bathed, fasted, performed homa, offered cows to the Brahmins, received Brahmin blessings, wore sacred clothes, and the gods and demons sat on the darbha grass facing east. They sat down. They decorated a large shawl with garlands and lamps. Then, by the beauty of her gait, by her looks, by her words, captivating them, she would hold the pot of nectar on her waist and walk gracefully. The demons were fascinated by her form. Sri Maha Vishnu, who was in the form of Mohini, gave nectar to the demon race and, considering it a misfortune to keep them stable, appointed the gods and demons to sit in separate lines. Bhagavan He was close to the demons, walking, watching, and talking to them, and he was immersed in nectar for the gods who were far away. The demons, captivated by her beauty and charm, were unable to speak. Then Rahu took the form of a deity, joined the line of gods, and drank the nectar. The moon and sun noticed it and pointed it out to Mohini. Immediately, with a sword-like weapon, Rahu severed his head. The head fell down. The head alone, by the touch of nectar, attained immortality. Brahma placed that head as a planet called Rahu. Rahu, in retaliation for the misdeeds done by the moon and sun, consumes the full moon and new moon. While Amrutham was being consumed by all the gods and demons, Srihari regained his form. The matter that can be understood from the story of the churning of the nectar is explained by Sukha Yogindra with two verses.

There was a difference in the fruits between the gods and the asuras. Amrit was obtained by the gods. The demons lost. What is the cause for this? Both of them, in the same country, at the same time, with the same Mandara mountain, were churned. Both of them desired to attain immortality and the fruit of nectar. But the fruit was prepared for the gods. Unready, the Asuras are unstoppable. The reason is that the gods are those who have surrendered to the Lord. The Asuras did not surrender. Therefore, the fruit was not prepared for them. Discrimination is demonic. The state of being one with the divine is divinity itself. The Lord abides in all things. There is no substance that he does not possess. Therefore, whoever does any work for anything, the doer is God, the work done is God's, the fruit achieved is for the pleasure of God, to those who have understood this, God himself achieves the fruit and gives it. This knowledge is the nectar of wisdom. Those who think that they are working with their wealth for their wife, children, and others, and achieving those pleasures and those fruits, are Asuras. They will not find lasting happiness. Grief is inevitable. That itself is nectar Not being available. Some people want flowers, some want leaves, some want fruits, and some want fruits. Whatever you need, first water the tree. Everything is available when poured. Similarly, whatever we attain is not different from God, therefore, those who worship Him will receive the fruit. For those who do not worship him, hardship and sorrow will remain. The Vedas are the offerings to the Lord, and they are like the ocean. The abyss is infinite. We can obtain all the necessary materials by grinding it. Just as intelligence is necessary for acquiring knowledge, physical strength is equally important. Therefore, one should not be eager to obtain worldly things, petty things, and material things that cause worldly distress through the power of the people. Having taken refuge in God beforehand, one should proceed to achieve all fruits with his help. One should be determined to achieve immortality. This is what the Bhagavad Gita calls agricultural wisdom.

Whatever karma we perform with our body, whatever we are doing, the fruit of all of them is the attainment of God. It's nectar. Forgetting the Lord, who is the soul, and remaining distant is death. Recognizing him as the soul and being with him is immortality. We were born as humans to achieve this. The human body contains a host of gods as well as demons. The Bhagavad Gita, chapter 16, describes him. Therefore, by establishing divinity and eliminating demonic tendencies. This is not something that we can achieve through our efforts. It is done only with the help of God. This matter reveals the secret of achieving immortality. This nectar churning story is illuminated. With this, the churning of the ocean of milk is completed for us. It's a bit. We took too much time to complete the section. Listening to this once again, praying that everyone understands its essence, let's meet again in another podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus