వామన అవతారం: వామనుని జన్మ మరియు బలి యజ్ఞ సందర్శనం

Vamana Avatar: Birth of Vamana and His Visit to Bali's Yagna

bhagavatam

అదితి పన్నెండు రోజులు పయోవ్రతమును ఆచరించగా భగవానుడు ప్రత్యక్షమై తాను ఆమె కుమారుడుగా జన్మించి దేవతలను కాపాడుతానని వరమిచ్చెను. భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రమున వామనుడు చతుర్భుజుడై జన్మించి, మహర్షులు ఉపనయన సంస్కారమును నిర్వహించిరి. వామనుడు నర్మదా నది ఉత్తర తీరమున బలి నిర్వహిస్తున్న అశ్వమేధ యాగమునకు వెళ్ళగా, బలి భక్తితో పాద ప్రక్షాళన చేసి ఏదైనా కోరుకొమ్మని అడిగెను. వామనుడు కేవలం మూడు అడుగుల భూమి మాత్రమే కోరి, అదే సమయంలో ఇంద్రియ నిగ్రహము లేనివానికి సమస్త సంపదలు లభించినా తృప్తి కలగదని, సంతోషమే ముక్తికి హేతువని బోధించెను.

This discourse covers the story of Aditi performing the Payovrata for 12 days, after which Lord Vishnu appeared and promised to be born as her son Vamana to protect the Devas. Vamana was born on Bhadrapada Shudda Dwadashi (Shravana Dwadashi) with divine splendor, and sages performed his upanayana ceremony with gifts from celestial beings. Vamana then proceeded to Bali's ashwamedha yagna on the northern banks of the Narmada, where Bali welcomed him with great reverence and offered to grant any wish. When Vamana asked for only three paces of land, Bali was puzzled, but Vamana responded with a profound teaching that no amount of wealth can satisfy uncontrolled senses, and contentment alone leads to liberation.

← Prev Next →
Vamana Avatar: Birth of Vamana and His Visit to Bali's Yagna bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపూర్వాంఛితం పాపినోపి ఆనః పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. పాపాత్ములైనను శ్రీమన్నారాయణుని నామమును ఉచ్చరించి తమ కోరికలను ఈడేర్చుకొనిరి కదా అయ్యో నా వాక్కు ఆ నామమును ముందు ఉచ్చరించినది కాదు. అందులకే నాకు ఈ జన్మము ఈ గర్భవాసము మున్నగు దుఃఖములు సంభవించినవి. ముకుందమాల 27th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధం తొమ్మిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షణము, క్షీరసాగర మథనము పూర్తి చేసుకొని. మనం వామన అవతారంలో ప్రవేశించాం. వామన అవతారంలో బలి చక్రవర్తి యొక్క ప్రభావానికి భయపడి ఇంద్రుడు అందరూ కూడా వెళ్లి దాక్కున్న తర్వాత కశ్యపుడిని అదితి ప్రార్థించి పయోవ్రతాన్ని చేయటాని కోసం విషయాలు తెలుసుకుంది. ఆ పైవ్రతం విషయాన్ని తను తెలిసి చెప్పిన తర్వాత జరిగిన భాగను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కశ్యపుడు చెప్పిన నియమములు అనుసరించి అదితి 12 రోజులు ఈ వ్రతమును శ్రద్ధతో ఆచరించెను. భగవానుడు ఆమెకు ప్రత్యక్షమాయెను. అదితి స్వామిని దర్శించి ఆనంద భాష్పములతో కనులు నిండి మాట రాక స్తోత్రము చేయలేక చూచుతూ నిలిచినదాయను. కొంతసేపటికి మెల్లగా ప్రీతితో స్వామిని స్తోత్రము చేయగా సంతుష్టుడై అదితి కోరికను ఈ విధముగా అనుగ్రహించెను. ఓ దేవీ! నీ కోరిక నేను ఎరుంగుదును. ఇప్పుడు ఆ రాక్షసులను జయించుట శక్యము కాదు. ఇప్పుడు వారికి కాలం అనుకూలముగా ఉన్నది. ఈశ్వరానుగ్రహము, బ్రాహ్మణానుగ్రహము వారిపై ఉన్నది. అందుచే వారిపై పరాక్రమించుట మంచిది కాదు. నీవు నన్ను ఆరాధించితివి. నా ఆరాధనను వ్యర్థము కారాదు. అందుచే నీవు చేసిన పయోవ్రతమునకు సంతుష్టుడనై నేనే కుమారుడనై అవతరించి ఇంద్రాదులకు నీ కుమారులను

ఇంద్రాదులకు నీ కుమారులను కాపాడుదును. నీ భర్తయుగు కశ్యప ప్రజాపతి అనుగ్రహముతో గర్భవతి అగుదువు. అప్పుడు నేను నీ గర్భమున నా అంశముచే ఆవేశించి నీ కుమారుననే పుట్టెదను. ఇది దేవ రహస్యం. ఎవ్వరికినీ తెలియనియ్యకుము. ఫలప్రదమగును. ఇట్లు చెప్పి భగవానుడు అంతర్ధానమాయెను. తరువాత అదితి కశ్యపానుగ్రహముచే గర్భమును ధరించెను. ఆ గర్భమున భగవానుడు ప్రవేశించెను. భగవాను అధిష్టించి ఉన్నాడని గ్రహించి హిరణ్య గర్భాదులు ఆమెను చేరి గర్భస్తుడగు భగవానుని స్తోత్రము చేసిరి. బ్రహ్మాదులచే స్తుతించబడిన భగవానుడు అదితియందు చతుర్భుజములతో అవతరించెను. పీతాంబరధారియై శంఖ చక్ర గదాధారియై పుండరీకాక్షుడై వక్షమున శ్రీవత్సము వనమాల కంఠమున కౌస్తుభము కలవాడై ఆవిర్భవించెను. ఆవిర్భావ కాలమున దిక్కులు జలాశయములు ప్రసన్నమాయెను. ప్రజలందరూ హర్ష పరవసులోయిరి. శ్రవణ ద్వాదశి అని ప్రసిద్ధి చెందిన భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రమునందు అభిజిత్ ముహూర్తమున శ్రీహరి జన్మించెను. ఆ దినమును విజయ అని వ్యవహరింతురు. అప్సరసలు నృత్యము చేసిరి, గంధర్వులు గానము చేసిరి, అదితి ఆశ్రయముపై పుష్ప వర్షము కురిసెను. అదితి తన గర్భ సంభవుడైన పరమ పురుషుని చూచి ఆశ్చర్యపడెను. ఆశ్చర్యకరమగు తన దివ్య సంకల్పముచే దివ్య మంగళ విగ్రహముతో జన్మించిన స్వామిని చూచి ప్రజాపతి జయ జయ అని పలికెను. ఈ విధముగా ఆవిర్భవించిన భగవానుడు అదితి కశ్యపులు చూచుండగానే వామన రూపమున వటు వేషమును స్వీకరించెను. అప్పుడు ఆ వామనుడగు వటువునకు మహర్షులు సంస్కారమును గావించి ఉపనయనమును వనర్చిరి. సవిత అతనికి సావిత్రుని ఉపదేశించెను. బృహస్పతి యజ్ఞోపవితును వసంగెను. కశ్యపుడు మేఖలను వసంగెను. భూమి కృష్ణాజినమును, సోముడు దండమును, తల్లి అదితి కౌపీనమును, ద్విలోకము ఛత్రమును, వేదగర్భుడు కమండలమును, సప్తఋషులు దర్భలను, సరస్వతి అక్షమాలను.

కుబేరుడు భిక్షపాత్రను వసంగిరి. సాక్షాత్ పార్వతి భిక్షను వసంగెను. ఆ వామ్మునుడు బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశించుచు బ్రహ్మర్షుల యొక్క సహజమున తేజస్సుతో విరాజిల్లుచుండెను. అగ్నిహోత్రమును ఆరాధించెను. పురోహితులు బృగులచే బలి అశ్వమేధ యాగమును చేయుచున్నాడని విని వామనుడు అచరికి కేగవలెన బయలుదేరెను. అతడు నడుచున్నప్పుడు అడుగడుగునా భారమునకు భూమి వంగుచుండెను. నర్మదా నది ఉత్తర తీరమున బృగుగచ్చము అనడి క్షేత్రమున బలి యజ్ఞము సాగుచుండెను. వామనుడు అచరికేగెను. పృత్విక్కులు వచ్చుచున్న వామనుని దూరము నుండి చూచి సూర్యుడు ఉదయించున్నాడా అనుకొనిది. ఆ వామనునిచే తేజస్సుచే యజమానుడగు బలి తేజస్సు పృత్విక్కులగు భృగువుల తేజస్సు కూడా తగ్గిపోయెను. సూర్యుడా, అగ్నియా లేక సనత్కుమారుడా వచ్చుచున్నాడని అనుకొనుచుండిరి. భగవానుడు వామన రూపమున దండమును, కమండలమును, ఛత్రమును దాల్చి యజ్ఞ వాటమున ప్రవేశించెను. మౌన్జి మేఖల దాల్చి పైన ఉపవీతమును అజినమును దాల్చి వచ్చుచున్న ఆ బ్రహ్మచారి వామనుని చూచి శిష్యులతో కూడా భృగులు లేచి ఎదురేగిరి. బలి సుందరుడు మనోహరుడనగు వామనునకు ఆసనము సమర్పించెను. స్వాగతము చెప్పెదను. పాద ప్రక్షాళన వనర్చెను. ఆ జలమును సకల పాప హరణమని మంగళకరమని తన శిరస్సున ప్రోక్షించుకొనెను. మహాదేవుడకు పరమశివుడు స్వామి పాదము నుండి వెలబడిన గంగాజలమును భక్తితో శిరమును దాల్చెను కదా. ఇట్లు ఆరాధించి బలి ఈ విధముగా పలుకుచున్నాడు. బ్రాహ్మణోత్తమ, స్వాగతము, నమస్కారము. నేను నీకు మీకు ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు. బ్రహ్మర్షుల యొక్క తపస్సు రూపు దాల్చి నన్ను అనుగ్రహించుటకు వచ్చినదని భావించుచున్నాను. మా పితరులు తృప్తినొందిరి. మీ రాకచే మా కులము పవిత్రమైనది. నేను చేయు యజ్ఞము మీ రాకచే సఫలమైనది. అగ్నులు యధావిధిగా ఆరాధింపబడినవి. మా దేశమంతయు మీ పాద ప్రక్షాళన జలముచే పవిత్రమైనది. మీరు ఏది కోరినా దానిని వసంగు వాడను. భూమి గాని. ధేనువు గాని, మృష్టాన్నము గాని, గ్రామము గాని, బంగారము గాని, గుర్రములు గాని, ఏనుగులు గాని, ప్రమదలు గాని ఏది మీకు కావాలని దానిని కోరుడు. నేను తప్పక వసంగ గలవాడను.

బలి పలికిన ధర్మబద్ధముగా వాక్యం వాక్కును విని వామనుడు సంతోషించిట్లు పలికెను. ఓ రాజా, నీవు చెప్పిన మాట సత్యము, ధర్మయుక్తము, మీ వంశమునకు తగినది. కీర్తికరము. పరలోక సాధనముగు ధర్మమును ఆర్జించుటలో మీ పితామహుడు ప్రహ్లాదుడే ప్రమాణము. మీ వంశములో సాత్వికుడు కాని పురుషుడు లేడు. మీ వంశమున బ్రాహ్మణునకు ఇచ్చెదనని మాట వసంగి మరలెడు లోభులు లేరు. యాచకుడు అడిగిన నాడు కాదనక ఇచ్చువాడు మీరు. యుద్ధమునకు జంకని వారు మీ వారు. మీ వంశమును హిరణ్యాక్షుడు ఒంటరిగా గదదాల్చి ఎదిరించు వీరునకై లోకమునంతను కలేచూచెను. ఎవ్వరిను కనపడటక భూమిని చుట్టి చుట్టి సముద్రంలోనికి పోయెను. దాని కష్టముతో చాలా కష్టముతో విష్ణువు వరాహ రూపమున అతని జయించెను. హిరణ్యాక్షిని వధ విని హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువును చంపుటకు శూలపాణి అయిన విష్ణులోకమునకేగెను. అప్పుడు మాయావ్యగు విష్ణువు నేచట నేనచటకేగెదనను వీడు వెంటాడును కావున వీని హృదయమున దూరి ఉండెదనని సూక్ష్మ దేహముతో ప్రాణవాయువులో చేరి అతని శరీరమునే ప్రవేశించి ఉండెను. హిరణ్యకశిపుడు విష్ణులోకమంతయు వెతికి విష్ణువును కానక కోపము గలవాడై భూమిని, ఆకాశమును, జలోకమును, దిక్కులను, సముద్రమును అన్నిటినీ కలయ వెతికెను. ఇతడను విష్ణువు కానరాలేదు. భయపడి ఎచ్చటికో విష్ణువు పారిపోయినాడని అతడు భావించి మరి వెనకకు రాడు, నశించినాడు, ఇంకా చనిపోయిన వానిపై పగపూనరాదని వెనకకు మరిల్లినాడు. ప్రహ్లాదుని కుమారుడు నీ తండ్రి మహాదాత. బ్రాహ్మణ రూపమును దాల్చి వచ్చి యాచించిన దేవతలకు వారు బ్రాహ్మణులు కారిని దేవతలను ఎరంగియు తన ఆయువును దానమిచ్చినాడు. ఈ విధముగా మీ పూర్వులు యుద్ధమున, దానమున, ధర్మాచరణమున ప్రసిద్ధి పడిసినారు. వారి వంశమున ఆ గుణములన్నిటితో కూడి ఉన్నవాడవు నీవు. నీవు కోరిన వారి కోరికలు తీరుచుటలో అగ్రేసరుడవని విని వచ్చితిని. నా పాదముతో మూడు అడుగుల నేల నాకు ఉసంగము. అంతకంటే వేరొకటి నేను కోరను. కావలసిన దానికంటే అధికము కోరుట పాపము. మాకు మూడు అడుగులు భూమియే చాలు. ఇట్లు వామనుడు పలకగా బలి ఇట్లు అనుచుండెను. ఓ బ్రాహ్మణ కుమారా నీవు బా

అరుడవు గాని నీ మాటలు పెద్దలు పలికేడి మాటలుగా కనపడుచున్నవి. కానీ నీ ఆలోచన అజ్ఞానముతో నిండినదిగా కనపడుచున్నది. స్వార్థము నీకు తెలియదు. లోకేశ్వరుడగు నన్ను నీ మాటలతో సంతోషపరిచి మూడడుగులు కావలెనుట ఎంత తెలివి తక్కువ? నన్ను యాచించి మరొకని వద్దకు యాచకుడివై వెళ్ళుట నాకు సమ్మతము కాదు. బలి మాటలు విని వామను ఇట్లు చెబుచున్నాడు. ఇంద్రియములు విషయములను ఎంత అనుభవించినను చాలును అనవు. ఇంద్రియములను జయించలేని వానికి లోకంలోని సకల విషయములు సమకూడినను ఆశ తీరదు. మూడు అడుగులతో ఆశ తీరని వానికి ద్వీపమంతా వసంగినను తృప్తి కలగదు. విషయాశ నిండినది. సప్త ద్వీపమును పరిపాలించిన పృథు, గయాది, భూపాలులు రాజ్యమును అనుభవించియు కోరికలు నెరవేర్చుకొని ఆశకు అంతమును పొందలేకపోయిరి. ఎంత లభించినా అంతతో అంతతోనే సంతుష్టి నొందు వాడు సుఖముగా నుండును. ఇంద్రియములను జయింపలేక ఎంత వచ్చినను సంతుష్టి నొందని వాడు ఎన్నడును సుఖము నొందడు. అర్థమును, కామమును ఆర్జించి సంతుష్టి నొందని వాడు ఈ సంసారమును మరల మరల పుట్టుచు చనిపోవుచు బాధలు నొందుచుండును. లభించినంతలో సంతుష్టి నొందిన వాడు ముక్తిని పొందును. సంతోషమే ముక్తికి హేతువు. అందుచే మూడడుగుల భూమి నాకు. చాలు, ఎంతవరకు అవసరమో అంతవరకే ఆర్జించినవాడు సుఖమునొందును. అని చెప్పాడు. తరువాత విషయంలో ఏం జరుగుతుందో మరొక భాగంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Gurus. Srimannam, having spoken, Narayanakhyam, by whom is it propitiated? Even the sinner is liberated. By that, by the one who was previously engaged in speech, is attained the sorrow of being born in the womb. Even though they were sinners, they uttered the name of Srimannarayana and fulfilled their desires, didn't they? Alas, my word did not utter that name first. Therefore, I have experienced sorrows such as this birth and this pregnancy. Mukundamala 27th Prayer. Devotees of God, welcome to the ninth podcast of the eighth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, Gajendra Mokshanam and the churning of the ocean of milk are completed. We are in the vamana avatar. In the Vamana incarnation, fearing the influence of Bali Chakravarti, Indra and everyone went and hid. After that, Aditi prayed to Kashyapa and inquired about the details to perform the Prayavrata. After he informed about the vow, we are now going to learn about the incident that happened. Following the rules told by Kasyapa, Aditi performed this ritual with devotion for 12 days He practiced. God appeared to her. Having seen Aditi Swamy, with tears of joy, his eyes filled, unable to praise with words, he stood watching. After some time, slowly and with love, as she praised the Lord, she was pleased and granted Aditi's wish in this way. Oh, God! I will fulfill your wish. Now, it is not possible to conquer those demons. Now the time is favorable for them. The blessings of the Lord and the blessings of the Brahmins are upon them. Therefore, it is not good to attack them. You worshipped me. May my worship be in vain. Therefore, being pleased with the virtuous deeds you have done, I myself have incarnated as a son and given your sons to Indra and others

I will protect your sons for Indra. You will become pregnant with the grace of your husband, Kashyapa Prajapati. Then I will be born to you as your son, by my part in your womb. This is the secret of God. Do not let anyone know. It will be fruitful. Saying this, the Lord disappeared. Aditi then bore Kashyapa by his grace. The Lord came down to the womb. Realizing that the Lord is seated, Hiranyagarbha and others approached her and praised the Lord who is the womb. The Lord, praised by Brahma, incarnated as a four-armed deity in Aditi. Wearing a yellow garment, holding a conch, disc, and mace, with a lotus-like face, with a Srivatsa on his chest, and a Kaustubha garland around his neck, he appeared. During the time of its origin, the directions and reservoirs were pleased. The people are overjoyed. Shravana Dwadasi, which is famous, Bhadrapada Shuddha Dwadasi, in the Shravana Nakshatra, in the Abhijit Muhurta, Sri Hari was born. The day is celebrated as Vijaya. The apsaras danced, the gandharvas sang, A rain of flowers showered down on Aditi's abode. Aditi was surprised to see the Supreme Being who was the father of her womb. Seeing the Lord who was born with a divine auspicious idol by his wonderful divine will, Prajapati exclaimed, "Victory, victory!" The Lord who manifested in this way, Aditi and Kashyapa, while watching, assumed the form of Vamana and took the guise of a Brahmin. Then, the sages performed the rituals and the Upanayana ceremony for that Vamana-like young man. Savitri taught him. Brihaspati has been enthroned. Kashyapa installed the mahekas. The earth is Krishna's cloth, Somudu is the staff, the mother is Aditi's loincloth, the world is the canopy, the Vedagarbhudu is the kamandala, the seven sages are the darbha grass, and the Saraswati is the akshamaalam.

Kubera gave the alms-pot to Vasangiri. Parvati herself came to the beggar woman. That Vammanudu, shining with the brilliance of Brahma's glory, was adorned with the natural radiance of Brahma's sages. He worshipped the fire. Hearing that the priests were performing a sacrificial horse-owning Yaga, Vamana set out to challenge Acharya. As he walked, the earth bent under the weight at every step. On the northern bank of the Narmada River, in the Brihugachchamu-adikshetra, the sacrifice of Bali was going on. Vamana was unstoppable. The earthlings, seeing Vamana coming from a distance, wondered if the sun had risen. The radiance of Bali, who was the lord by the light of Vamana, and the radiance of Bhrigu, who was the light of the earth, both diminished. They thought that Surya, Agni, or Sanatkumara were coming. The Lord, in the form of Vamana, entered the sacrificial fire pit, bearing a staff, a kamandala, and a canopy. Seeing that Brahmachari Vaman, who was wearing a loincloth and a sacred thread on his shoulder, and was coming, the Bhrigus also rose up with their disciples and went to meet him. Bali Sundarudu The beautiful Vamana offered a seat. I'll welcome you. Washing of the feet. He washed his head with that water, which was said to be the destroyer of all sins and auspicious. To Mahadeva, Parameshwara, the Ganges water that emerged from the feet of the Swami, he bowed his head with devotion, didn't he? Thus, worshiping and sacrificing, he speaks in this manner. Welcome, sir, and greetings. I command what is to be done for you. I believe that the penance of the Brahmarshis has manifested and come to bless me. Our forefathers were satisfied. "Your coming is a blessing, my people. My sacrifice is successful because of your arrival. The fire was worshipped as usual. Holy is the water that washes the feet of our country. I will use whatever you ask for. The earth. Whether it is a cow, or a sweet dish, or a village, or gold, or horses, or elephants, or mares, whatever you want, ask for it. I'm a bachelor.

Having sacrificed, in a righteous manner, hearing the word, Vamanudu rejoiced and spoke. Oh king, what you have said is true, righteous, and befitting your lineage. It is glorious. Your father Prahlada is the standard in earning the righteousness that is the means to the afterlife. There is no man in your lineage who is not tame. There are no more greedy people who say that they will give it to a Brahmin in your lineage. You are the one who gave without hesitating when the beggar asked for it. Those who do not dare to fight are your people. Hiranyaksha alone, with his mace, opposed your lineage. The whole world watched in amazement. Without anyone seeing, he circled the earth and went into the sea. With that difficulty, with great difficulty, Vishnu conquered him in the form of a boar. Hearing the killing of Hiranyaksha, Hiranyakashipu went to Vishnuloka, where Vishnu was the one who wielded the trident, to kill Sri Maha Vishnu. Then, Vishnu, who is the illusion, said, "I will go wherever I want," and he chased him. Therefore, he entered his heart, saying that he would be in his subtle body, and he entered his body. Hiranyakashipu, the entire world of Vishnu Having searched and not found Vishnu, he became angry and searched the earth, the sky, the water, the directions, and the ocean, searching everywhere. He is not identified with Vishnu. Fearing, he thought that Vishnu had run away somewhere, and he did not come back, he was destroyed, and he did not come back thinking that he should not take revenge on the one who had died. Your father, Prahlada, was a great donor. Having assumed the form of a Brahmin, he came and begged the gods, saying that they were Brahmins, and that he had given his life to the gods. In this way, your ancestors became famous in war, charity, and righteous conduct. You are the one with all those qualities in your lineage. I have come to hear that you are a great person in fulfilling the wishes of those who ask for it. Three feet of ground is not enough for my foot. Nothing else I'd ask for. Pride of Conceit is a sin. "A three-foot space is more than enough for us! Thus, when Vamana spoke, Bali was saying so. Oh Brahmin boy, you

Even though you are speaking, your words seem like the words spoken by elders. But your thoughts seem to be full of ignorance. You don't know what selfish is. How foolish is it to be pleased with my words, who am the lord of the world, and to want three steps? I do not agree to go to another person as a beggar after begging me. Hearing the words of sacrifice, Vamana said thus. The senses do not say that they are enough to experience the objects. For one who cannot conquer the senses, even if all things in the world are gathered, his desire will not be satisfied. For one who has not yet found peace with three steps, even if the island is inhabited, he will not be satisfied. Overflowing with substance. Prithu, Gaya, and Bhupalu, who ruled the seven islands, having enjoyed the kingdom, fulfilled their desires, but could not find the end of hope. He who is content with what he has, will be happy. He who cannot conquer the senses, no matter how much he comes, will never find happiness. He who does not attain understanding and desire and is not satisfied, this world is born again and again, dies, suffers pain. One who is content with what he has will attain liberation. Contentment is the key to freedom. "Three feet of land for me. Enough! He who has earned only as much as he needs will be happy. He said so. We will learn more about what happens next in another part. Jai Srimannarayana and salutations to the Ashmadguru.