సముద్ర మథనం – కూర్మావతారం, హాలాహల విషం మరియు శివుని త్యాగం

Samudra Manthan – The Churning of the Ocean, Halahala Poison, and Shiva's Sacrifice

bhagavatam

ఈ ప్రవచనంలో అష్టమ స్కంధంలోని సముద్ర మథన కథ కొనసాగింపు వివరించబడింది. దేవతలు మరియు అసురులు కలిసి మందర పర్వతాన్ని పెకిలించి మథించుటకు ప్రయత్నించగా, శ్రీహరి కూర్మ రూపంలో పర్వతానికి ఆధారమై, దేవతలు, అసురులు, వాసుకి అందరిలో ఆవేశించి ఆరు విధాలుగా మథనాన్ని నడిపించాడు. సముద్రం నుండి హాలాహల విషం వెలువడగా మూడు లోకాలూ భయపడి పరమశివుని శరణు వేడాయి. శివుడు పార్వతికి విషమును మ్రింగుటకు కారణం వివరించి, సర్వాత్మ స్వరూపుడగు శ్రీహరి సంతోషం కోసం ప్రజలను కాపాడుటే తన ధర్మమని చెప్పి విషమును భక్షించాడు. ఆ విషం శివుని కంఠాన్ని నీలంగా మార్చి అది ఆభరణంగా ప్రకాశించింది; చేతి నుండి జారిన విషం తేళ్ళు, పాములు మొదలైన విషజంతువులుగా మారింది.

This discourse covers the continuation of the Samudra Manthan (churning of the cosmic ocean) from the Eighth Skandha of Srimad Bhagavatam. It describes how the devas and asuras jointly uprooted Mount Mandara, how Lord Vishnu took the Kurma (tortoise) avatar to support the mountain, and how He simultaneously empowered all participants from within. When the terrible Halahala poison emerged from the ocean threatening all three worlds, the gods and people sought refuge in Lord Shiva, who, out of compassion and devotion to Vishnu, consumed the poison to protect creation. The poison left a blue mark on Shiva's throat, which became an ornament, and whatever dripped from his hand gave rise to venomous creatures like scorpions and snakes.

← Prev Next →
Samudra Manthan – The Churning of the Ocean, Halahala Poison, and Shiva's Sacrifice bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః భక్తాపాయ భుజంగ గారుడ మణిహి త్రైలోక్య రక్షామణిహి గోపీలోచన చాతకాంబుద మణిహి సౌందర్య ముద్రామణిహి యః కాంతామణి రుక్మిణీ ఘనకుచ ద్వంద్వైక భూషామణిహి శ్రేయో దేవ శిఖామణిర్దిశతినో గోపాల చూడామణిహి దేవతా శిఖామణి, గోపాల చూడామణి మనకు శ్రేయస్సు నొసంగు గాక. దేవతాంతరముల కంటే గోపాలుడగు శ్రీకృష్ణ దేవుడు శ్రేయస్సు నొసంగుటిలో సులభుడు. అతడు కాంతామణియగు రుక్మిణీ దేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషాణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణీ. వారిద్దరూ మణి మణిప్రభల వలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణి మనోవల్లభుడే మనకు శ్రేయప్రదుడు. అట్లా ఆమెకు అలంకారముగా నుడుటచే అతడు సౌందర్య ముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువు అని నిరూపించుటకు ఆ కృష్ణ సౌందర్య ముద్ర పడవలెను. ఆ అందమును చూచి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణ మేఘమునే సేవించుచుందురు. ఆ మేఘము కేవలము చాతకములనే కాదు మూడు లోకములను తప్ప మూడు లోకములను తన కృపాశక్తిచే రక్షించుమని. ఈ రక్షామణి మూడు లోకములను రక్షించినదే అయినను భక్తుల పట్ల గారుడమణియై వారికి కలుగు అపాయములని భుజంగములను దరిచేరకుండా తొలగించును. ముకుందమాల 23rd ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధం ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం క్షీర క్షీరసాగర మథనంలో కొంత భాగాన్ని తెలుసుకున్నాం. దేవతలందరూ కూడా దేవతలు ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు అందరూ కలిసి విష్ణుదేవుని స్తుతించడం. ఆ స్తుతించిన తర్వాత విష్ణుదేవుడు వారికి ప్రణాళిక ఏమిటో చెప్పి పంపిస్తాడు.

ఆ తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ, రుద్రుడు దేవతలతో తమ తమ స్థానాలకు వెళ్లారు. యుద్ధ ప్రయత్నములు మానిరి. యుద్ధమునకు విముఖులుగా ఉన్న వారిని చంపవలెదని తన సేనానాయకులను బలి ఆజ్ఞాపించెను. బలి దేవతలతో సంధి చేసుకొనుటకు సిద్ధపడెను. ఇంద్రుడు అందరము కలిసి సముద్రమును మధించి అమృతమును సాధింతుమని చెప్పి వారితో మైత్రి చేసుకొనెను. సముద్ర మధనమునకు సన్నద్ధులైరి. మధించుటకు బలము గల రాక్షసులు దేవతలు కలిసి మందరమును పెకిలించిరి. కొంత దూరం మోసిరి. ఇంద్రుడు, బలి మొదలగు ఉభయ పక్షముల వారు మోయలేక కూలపడిరి. పర్వతము క్రింద పడి కొందరు చూర్ణమైరి. కాళ్ళు చేతులు విరిగినవి. అందరూ నిరుత్సాహులైరి. దానిని ఎరింగి గరుడ ధ్వజుడు అచరకు వేయించేసెను. తన చల్లని చూపుతో వారినందరినీ బ్రతికించెను. వ్రణములు మానునట్లు చేసెను. భగవానుడు ఒక చేతితో ఆ పర్వతమును ఎత్తి గరుడుని పైనుంచి సముద్రము వద్దకు వచ్చి తెచ్చి తానే ఆ పర్వతమును సముద్రములో దింపి గరుత్మంతుని వెనకకు పంపెను. సర్వవ్యాపకమగు భగవత్శక్తి అందరియందు ఉండును. అందరిలోనూ భగవానుడితో సమానమగు సర్వజ్ఞత్వము. సర్వశక్తిత్వము కూడా ఉండును. కానీ కర్మవశముచే మాయ దానిని సంకోచింపచేయును. అప్పుడు శరీరముతో తానేకమై నేను వేరు, వాడు వేరు అను భావం ఏర్పడును. అట్టి భావము కలవారు దేవతలు, అసురులు. స్వతంత్రుడము కామని భగవత్ పరతంత్రమని గుర్తుంచుకొనవలెను. అప్పుడు దేవాసురులు అమృతములో భాగమిచ్చెదమని వాసుకుని ఆహ్వానించిరి. ఆ వాసుకుని మందరమునకు త్రాడుగా చుట్టిరి. శ్రీహరి దేవతల పక్షమున ఉండెను. దేవతలు ముందుగా ఆ వాసుకి ముఖం వైపు పట్టుకొనిరి. రాక్షసులు అందరి రహస్యమును ఎరుంగలేక తోకను పట్టుకొనుట చిన్నతనమని భావించిరి.

వేదాధ్యయమున సంపన్నులము జన్మచే ప్రసిద్ధులమగు మేము తోకను పట్టుకొనము అని తిరస్కరించిరి. రాక్షసుల అహంకారం ఎరింగినవాడు కనుక శ్రీహరి అట్లు చేసెను. తమకు ఆపద కలిగినను అహంకారమును అసురులు వదలలేరు. దేవతలు తోకను పట్టుకొనిరి. రాక్షసులు తలను పట్టుకొనిరి. సముద్రమును మధించుట ఆరంభించిరి. పర్వతము బయట బరువుకు ప్రక్కకు ఒరిగి పోవుచుండెను. అప్పుడు రాక్షసులు, దేవతలు కూడా దైవము తోడుపడక పోవుటచే పౌరుషము ఫలించుట లేదని దిగులు పొందిరి. దాన్ని చూచి శ్రీహరి అనంత వీర్యము కలవాడు కనుక సత్య సంకల్పుడు కనుక తానే తన సంకల్పముచే అద్భుత కూర్మ రూపమును దాల్చి కొండ కడుగున ఆధారమై నిలిచి కొండను ఎత్తెను. కేవలము పౌరుషము ఫలమును సాధించుటకు చాలదు. దైవము కూడా తోడ్పడవలెను. దేవాసురులు బలశాలురే కానీ కొండను ప్రక్కకూరకుండా నిలిపి చిలుకకపోయిరి. అప్పుడు దైవము తోడ్పడెను. లక్ష యోజనముల విస్తారము గల తన వీపుపై ఆ కూర్మము పర్వతమును ధరించెను. ఆ అధికచ్చపము అనంత బలశక్తి సంపన్నమగుటచే ఆ కొండ తిరుగుటచే కలిగెడు రాపిడిచే ఏమియు శ్రమ నొందలేదు. ఈ విధంగా పర్వతము అడుగున తాబేలుగా ఉండియు అసురులకు దేవతలకు బలము స్థిరముగా నిలుపుటకు వారిలో నుండియు బలమును వృద్ధి పంచుచుండెను. వాసుకిలో ఆవేశించి నలుగుడచే నలుగుడుచే దాని శరీరము లొంగిపోకుండా చేసెను. పర్వతమునకు పైన ఒక చేతితో పట్టుకొని పర్వతం పైభాగము ఊగకుండా చేసెను. ఇట్లు శ్రీహరి అడుగున కూర్మమై దేవతలకు ముందు స్వయముగా తానుండి దేవతలలో ఆవేశించి రాక్షసులలో ఆవేశించి వాసుకిలో ఆవేశించి కొండను ఒక చేతి పైన పట్టుకొని ఆరు విధములుగా సముద్ర మథనము చేయించుచుండెను. కొంతసేపు శ్రీహరి దేవతలలో చేరి మధించుటకు సిద్ధపడలేదు. ఒడ్డున ఉండి చూచెను. ఎంత మధించినను ఆ పాము నుండి అగ్నిశికలు వెలువడినట్లు విషము నిండిన శ్వాసలు వెడలుచు పొగలు గ్రమ్ముచున్నవే కానీ అమృతము ఆవిర్భవించలేదు. అప్పుడు హరి స్వయముగా తాను కూడా మధించునకు సిద్ధపడెను.

మధించుచున్న స్వామి సౌందర్యమును దర్శింతము. మేఘశ్యాముడు బంగారు రంగు పీతాంబరమును దాల్చినాడు. కంఠమున మేఘములో మెరుపు వలె ప్రకాశించు ఆభరణములు ఆకాశమునంటుచున్న కిరీటముతో కూడిన శిరస్సు. ఇటు నటు ఊగుచున్న వనమాల ఎర్రని నేత్రములు కల స్వామి జగత్తునకు అభయము సంగు తన బాహువులతో ఆ వాసుకుని పట్టుకొని మదించుచున్నప్పుడు పర్వతమునకు ప్రక్కన వేరొక పర్వతం నిలిచినదా అనునట్లు ఉన్నది. ఆ సముద్రము నుండి హాలాహలమను పేరుగల దుస్సహమగు విషం వెలికి వచ్చెను. సముద్రమునందలి మత్స్య మకరాది జలచరములన్నియు కలత చెందెను. ఆ విషమునకు ప్రతీకారము ఏమియు కానరాలేదు. అన్ని దిక్కులకు సెగలు క్రక్కుచు వాపించుచున్న విషమును చూచి మూడు లోకములలోని ప్రజలు లోకపాలురు కూడా సదాశివుని శరణు పొందిరి. దేవదేవా సర్వభూతాంతరాత్మా భూతభావన మూడు లోకములు దహించెడి ఈ విషము నుండి శరణు పొందిన మమ్ము కాపాడుము. సకల జగత్తుకు బంధ మోక్షములు వసంగు వాడవు నీవే కదా! త్రిగుణాత్మకము మాయచే ఈ జగత్తును సృష్టించుచు రక్షించుచు లయమునరుచున్నావు. నీవే పరబ్రహ్మము. అనేక శక్తులతో కూడిన జగదీశ్వరుడవు నీవు. శబ్ద ప్రమాణము చేతనే ఎరింగదగిన వాడవు నీవు. జగత్కారణమైన వాడవు నీవు. ప్రాణములు, ఇంద్రియములు, భూతములు నీవాత్మగా ఉండుట చేతనే నిలచి ఉన్నవి. కాలము, క్రతువు, సత్యము, వృతము, ధర్మము నీ రూపములే. అకార ఉకార మకారాత్మకముగా ప్రణవము నిన్నే ప్రతిపాదించుచున్నది. లోకమున సకల పదార్థములు నీ రూపము. గాయత్రి మొదలగు ఛందస్సులు నీ సప్త ధాతువులు. వేదమయా వేద చోదితమగు ధర్మము నీ హృదయము. పంచ ఉపనిషత్తులు తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశాన అనడి నీ ముఖములు ఆ ముఖము నుండి వెలువడినవి 38 మంత్రములు సప్రకాశమగు శివ అను పేరు గల నీ స్వరూపమే శాశ్వతం శివమచ్యుతం అని ప్రసిద్ధమైన పరమాత్మ తత్వం.

అధర్మము యొక్క కెరటములు వంటివగు దంభలోభాదులు నీ నీడ వంటివి. సచ్చరజస్తమస్సులు నీ నేత్రత్రయము. గాయత్రి మొదలగు ఛందోమయమైన వేద స్వరూపము నీ రూపు. నీ చూపు పరంజ్యోతి స్వరూపమగు నీ స్వరూపము త్రిమూర్తులకు ఆవలిది. అదియే బ్రహ్మ, పరమాత్మ, పరంజ్యోతి, నారాయణ అని పిలువబడు కారణతత్వం. సత్యము, నిత్యము. జగత్ సర్వ జగత్ కారణమగు తత్వము నీవే. అదియే బ్రహ్మను తన రూపముగా కలిగి, రుద్రుని తన రూపముగా కలిగి, ఇంద్రుని తన రూపముగా కలిగి కనపడుచుండును. అందుచే కనిపించు రూపముగాక కారణమైన తత్వమును వీని ద్వారా దేవతలు ప్రార్థించుచున్నారు. లోకము లోకమునంతకు సుఖమును కలిగించుటచే శివుడు అనబడు శరీరమును స్వీకరించి ఆ జీవునులో జీవనులోను పరతత్వము దర్శనము సంగినది. దానిని ఎరంగిన దేవతలు లోక సుఖమునకై పరమశివుని ప్రార్థించిరి. ఇప్పుడు అప్పుడు పరమశివుడు ప్రజలకు కలిగిన బాధను చూచి కృపచే చాలా బాధపడి పార్వతితో ఇట్లు పనెను. భగవాని క్షీర సముద్ర మథనం వలన కాలకూట విషము వెలువడినది. దానిచే ఈ ప్రజలకు కలిగిన ఉపద్రవము చూడుడు. అది వారి ప్రాణములను తీయుచున్నది. వారు భయపడి తల్లడిల్లుచున్నారు. వారికి నేను అభయవసంగ వలెను. సామర్థ్యము కలవాడు దీనులను కాపాడవలెను. సత్పురుషులు క్షణభంగురములగు తన ప్రాణములను వదిలి అయినను ప్రాణులను కాపాడుదురు. భగవన్ మాయచే ప్రాణులు ఒకరిపై ఒకరు పగపెట్టుకొని ఉందురు. కానీ వారందరి యందును పరమాత్మ వ్యాపించి యుండును. అందుచే బాధింపబడు వారిని కృపతో కాపాడిన నాడు సర్వాత్మ స్వరూపుడగు శ్రీహరి సంతోషించును. ఆ శ్రీహరి సంతృష్టి చెందిన నాడు సకల చరాచరములతో నేను కూడా సంతృష్టి కలవాడనగుదును. అందుచే వీరికి ఆపద తొలగి సంతోషం కలుగుట నా సంతోషం. దానికై విషమును మ్రింగెదెను. నాకు ప్రజలకు సుఖమగు గాక అని సర్వమంగళతో చెప్పి. ఆమెను అనుమతింపచేసి విషమును ఆరగించుటకు సిద్ధపడెను. శివుని ప్రభావం ఎరిగినదగుటచే ఆమె అంగీకరించెను. అంతటను వ్యాపించి ఉండు ఆ హాలాహల విషమును తన శక్తిచే ఒకచోట చేర్చి తన అరచేతిలో నిలుచునంత మాత్రము చేసెను.

దానిని భక్షించెను. ఆ విషము మహా మహిమానితుడగు మహాదేవునిపై కూడా తన ప్రభావమును చూపి తన కంఠమును నీలముగా ఉనర్చెను. పరమశివునికి కంఠమున కలిగిన ఆ నల్లధనము ఆభరణముగా ప్రకాశించెను. లోకులకు కలిగిన బాధను తొలగించుటకై తాము ఆ బాధను అనుభవించువారు మహాత్ములు. వారు అనుభవించు ఆ దుఃఖము విశ్వాంతరీయామగు పరమ పురుషునకు సమారాధనం. శంభువు చేసిన ఆ మహోపకారమును విని ప్రజలు పార్వతి, బ్రహ్మ, వైకుంఠుడు కూడా ప్రశంసించిరి. అరచేతితో ఆ విషము పరమశివుడు నోటిలో పోసుకొనుచున్నప్పుడు జారిన విషమును గ్రహించి తేళ్ళు, పాములు, విష ఔషధులు లోకమున ఉపద్రవకరములై నిలిచిరి. దీని తర్వాత జరిగిన భాగాన్ని మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Bhaktapaya Bhujanga Garuda Mani, the protector of the three worlds, the jewel of the Gopis' eyes, the jewel of the lotus-like eyes, the ornament of beauty, the jewel of the lotus-like eyes, the jewel of the auspicious crown of Rukmini, the thousand-faced one Gopala Chodamanihi Devata Shikhamani, May Gopala Choodamani bring us prosperity. Among the gods, Srikrishna, the Gopala, is the easiest to please. He is the unique and unparalleled ornament for the beautiful Rukmini Devi, who is like a jewel of light. Rukmini is the manifestation of Lakshmi. They both do not leave each other like the gems of Mani. Therefore, that Rukmini, the mind's own, is the best for us. Thus, by dressing her up as a bride, he is a jewel of beauty. In the world, to prove that this is a beautiful object, those are the Krishna beauty marks. Seeing that beauty, the Gopis, being ecstatic, serve that Krishna cloud with the light of their eyes. That cloud is not only for the clouds but also for the three worlds, except for the three worlds, protect the three worlds by His power of grace. This Raksha Mantra protects the three worlds Being the giver of boons to devotees, he removes the dangers that befall them without approaching the serpents. Mukundamala 23rd Prayer. Dear listeners, welcome to the fifth podcast of Srimad Bhagavata Tattva Deepika, Ashtama Skandam. So far, we have learned some part of the churning of the ocean of milk. All the gods, including Indra, Brahma, and Rudra, together praised Vishnu. After the praise, Lord Vishnu tells them what the plan is and sends them off.

We will proceed with the rest of the process. Brahma and Rudra went to their respective places with the gods. The war effort ceased. He ordered his commanders to kill those who were against the war. He prepared to make peace with the gods. Indra, along with everyone, churned the ocean and said that they would achieve nectar, and he made friends with them. Ready for the end of the ocean. The demons and gods, having the strength to fight, together uprooted the Mandara mountain. Some distance. Indra, Bali, and other both sides could not bear it and collapsed. Some people fell down the mountain and were crushed. Hands and feet broken. Everyone was disappointed. Garuda, the hunter, had made it fall on the Achyuta. With her cool eyes she warmed them all. Healed the sores. The God lifted that mountain with one hand and brought it from above Garuda to the sea, and after bringing it, he himself lowered that mountain into the sea and sent Garuda back. The omnipresent divine power resides in everyone. Among everyone The all-knowing nature of God. Almighty power. But due to karma, Maya makes it hesitate. Then, with the body, becoming one, the feeling arises that I am separate and he is separate. Those who have such a feeling are gods and demons. Remember that independence is not a command, but a divine principle. Then the demons invited Vasuki to give them a share of the nectar. They wrapped Vasuki around Mandara mountain as a rope. Srihari was on the side of the gods. The gods first held out their hands to Vasuki. The demons, unable to understand the secret of everyone, considered it childish to hold on to their tails.

We, who are rich in Vedic learning and are famous by birth, refused to hold the tail. Because he was the one who conquered the pride of the demons, Srihari did so. Even if they face danger, the demons cannot leave their ego. The gods held the tail. The demons grabbed the head. The sea began to churn. The mountain was tilting to the side due to the weight outside. Then the demons and gods, not being helped by God, were worried that their valor would not bear fruit. Seeing that, Srihari, being endowed with infinite energy, being determined, he himself, by his determination, assumed the wonderful form of a tortoise, stood at the foot of the mountain, and lifted the mountain. It is not enough to just achieve masculinity and its fruits. May the Lord also be with us. The gods and demons were strong, but they stopped the mountain from falling and saved it. Then the Lord was with them. He wore the tortoise and the mountain on his back, which was spread over a hundred thousand yojanas. Because that high-speed force is endowed with infinite strength and power, and because of the friction caused by the turning of that mountain, no suffering was felt. In this way, the mountain Being like a tortoise at the bottom, it was constantly providing strength to the demons and gods, and also increasing their strength from within. Vasuki, in a fit of rage, made the snake bend over, preventing its body from collapsing. He held the top of the mountain with one hand and made the mountain's upper part not shake. Thus, becoming a tortoise at the feet of Srihari, he himself stood before the gods, provoked the gods, provoked the demons, provoked Vasuki, and holding the mountain on one hand, he was making the ocean churn in six ways. For some time, Srihari did not join the deities and was not ready to join. I was watching from the shore. Even after much churning, like embers emerging from a snake, the poisonous breaths are emitting smoke, but nectar has not manifested. Then Hari himself was ready to be beaten.

Let us see the beauty of the Lord who is shining. Meghasyamudu wore a golden colored silk garment. Jeweled ornaments shining like lightning in the cloud, a head adorned with a crown that touches the sky. Here, the actor, the garland of flowers swaying, the Lord with red eyes, is giving fear to the world. With his arms, he is holding and subduing that Vasuki. It is as if another mountain is standing next to the mountain. From the sea, a terrible poison called Halahala came out. All the fish, makara, and other aquatic creatures in the sea were disturbed. No retribution was seen for the poison. Seeing the poison that was spreading like wildfire in all directions, the people and rulers of the three worlds also took refuge in Sadashiva. Oh God, the soul of all beings, protect us who have taken refuge from this poison that burns the three worlds of the three states of being. You are the one who grants liberation from bondage to the entire world, aren't you! You are the three-fold, illusory, creator, protector, and destroyer of this world. You are the supreme being. Composed of many powers You are Jagadishwar. You are the one who is worthy of being measured by the sound standard. You are the cause of the world. Lives, senses, and beings are sustained by your soul. Time, ritual, truth, cycle, dharma are your forms. The Pranava mantra proclaims you as the akara, ukara, makara, and so on. In the world, all substances are your form. Gayatri and other meters are your seven elements. The Vedas are the source of the Vedas, the Dharma is your heart. The five Upanishads, Tatpurusha, Aghora, Sadyojata, Vamadeva, Ishana, Anadi, your faces, those that emerged from that face, 38 mantras, the self-illuminating Shiva, your form, is eternal, Shiva is imperishable, thus is the famous Supreme Soul.

The waves of unrighteousness are like the deceitful pleasures, like your shadow. The eye of the sun is your eyes. Gayatri, the form of the Vedas, which is full of meter, is your form. Your sight is the form of the supreme light, your form is beyond the three gods. That is Brahma, the Supreme Soul, the Supreme Light, Narayana, and is called the cause. The Truth, And The Truth. You are the essence that is the cause of the entire universe. That is Brahma, having his form, Rudra having his form, Indra having his form, appearing. Therefore, the gods are praying through him, the cause of the visible form. By causing happiness to the entire world, Shiva, accepting the body, in that being, in the life, the vision of the supreme element is attained. The gods who were angry prayed to Parameshwara for worldly happiness. Now, then, seeing the suffering caused to the people by Parameshwara, he was very saddened by compassion and spoke thus to Parvati. The poison Kalakuta was released from the churning of the ocean of milk by the god. See the calamity that befell these people because of it. It is taking their lives. They are terrified. I will be your friend and your guide. The one who is capable should protect the weak. The virtuous, even though they leave their fragile lives, protect the lives of others. By the power of Maya, beings are held captive by enmity among themselves. But the Supreme Being pervades all of them. Therefore, when the Lord, who is the very embodiment of the soul, saves those who are afflicted with suffering with grace, He rejoices. When Srihari is satisfied, I too will be satisfied with all beings and the animate and inanimate. Therefore, my happiness is that their troubles are removed and they are happy. He drank the poison. May it be pleasing to the people, I say with all good fortune. She was allowed and prepared to swallow the poison. She agreed because she knew the power of Shiva. Then, spreading, that poison of Halahala, by his power, he gathered it in one place and made it as big as it could be held in his palm.

It was devoured. That poison showed its effect even on the great glorious Mahadeva and turned his throat blue. The black wealth that was in the throat of Parameshwara shone as jewelry. Those who experience the suffering that befalls the people are great souls who remove the suffering that befalls the people. May they experience that sorrow, a remembrance to the Supreme Being, the universal soul. Hearing of the great favor done by Shambhu, the people, Parvati, Brahma, and Vaikuntha also praised him. When the poison was being poured into the mouth of Lord Shiva with a palm, the scorpions, snakes, and poisonous medicines, having grasped the spilled poison, remained as a calamity in the world. We will find out what happened after this in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus