వామన అవతారం మరియు పయోవ్రత మహిమ – అష్టమ స్కంధం, ఎనిమిదవ భాగం

Vamana Avatar and the Payovrata – Eighth Skandha, Episode 8

bhagavatam

ఈ ప్రవచనంలో సప్తమ మన్వంతరం నుండి చతుర్దశ మన్వంతరం వరకు గల మనువులు, ఇంద్రులు మరియు విష్ణు అవతారాల వివరణ చేయబడింది. బలి ఇంద్రునిచే ఓడింపబడి శుక్రాచార్యుని సహాయంతో విశ్వజిత్ యాగం చేసి దివ్య శక్తిని పొంది స్వర్గాన్ని ఆక్రమించిన వృత్తాంతం వివరించబడింది. తన కుమారులు స్వర్గభ్రష్టులైనందుకు శోకించిన అదితి కశ్యప ప్రజాపతిని శరణు వేడగా, ఆయన వాసుదేవ భక్తి సర్వోత్కృష్టమైనదని బోధించాడు. కశ్యపుడు అదితికి ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుండి ద్వాదశి వరకు పన్నెండు రోజులు పాలతో అభిషేకం, హోమం, బ్రాహ్మణ సంతర్పణ మరియు ద్వాదశాక్షరీ మంత్ర జపంతో కూడిన పయోవ్రతాన్ని ఉపదేశించాడు, దీని ద్వారా వాసుదేవుడు వామనుడిగా అవతరించి బలి నుండి త్రిలోకాలను తిరిగి ఇంద్రునకు అప్పగిస్తాడు.

This discourse covers the transition from the seventh to the fourteenth Manvantaras, highlighting that each Manvantara has a distinct Manu, Indra, deities, sages, and Vishnu's avatar. The narrative focuses on Bali's rise to power after being defeated by Indra, his subsequent conquest of the three worlds with the help of Shukracharya's divine blessings, and the distress of Aditi over her sons' exile from heaven. Kashyapa consoles Aditi by emphasizing the supreme importance of devotion to Vasudeva and instructs her in the Payovrata, a twelve-day vow observed in the Phalguna month involving worship of Vasudeva, milk abhisheka, homa, feeding Brahmins, and constant chanting of the Dvadasakshari mantra. This vow is prescribed as the means by which Vishnu will incarnate as Vamana, reclaim the three worlds from Bali, and restore Indra's position in the eighth Manvantara.

← Prev Next →
Vamana Avatar and the Payovrata – Eighth Skandha, Episode 8 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయత్పద ద్వంద్వాం భోరుహ సంస్మృతిం విజయతే దేవస్స నారాయణః శ్రీమన్నారాయణ పదాంబూర్హ స్మరణమును విడిచి కేవలము వేదములు వల్ల వేయుట అరణ్య రోదనము. వేదోక్త నియములను పాటించుట ఖండలు కరుగుటకు చేయు వ్యాయామ సదృశ్యము. యజ్ఞాది కర్మలు బుడిద పాలు గంగాది పుణ్య తీర్థ స్నానము గజ స్నానం వలె ప్రయోజన శూన్యము కావున నిత్యము ఆ నారాయణుని స్మరించుచునే సర్వ కర్మలను ఆచరింపుము. ముకుందమాల 26th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధం ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు క్షీరసాగర మథనం పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత భాగంలో మనం ఇంకొక అవతారం గురించి తెలుసుకుందాం. ఆరు మన్వంతరములు గడిచిన తరువాత ఏడవ మన్వంతరము వైవస్త మన్వంతరం. వివస్వతుని కుమారుడు శ్రాద్ధ దేవుడు మనువు. ప్రతి మన్వంతరమునందును మనువు, ఇంద్రుడు, దేవతలు, ఋషులు, అవతారము భిన్నభిన్నములుగా ఉందురు. ఇంతవరకు ఏడు మన్వంతరములైనవి. వివస్వంతునకు సంజ్ఞ, ఛాయ అను విశ్వకర్మ కుమార్తెలు ఇద్దరు భార్యలు. బడబ అని వేరొక భార్య కూడా ఉన్నదని కొందరందురు. అందు సంజ్ఞకు యముడు, శ్రాద్ధ దేవుడు అని ఇద్దరు కుమారులు.

యమునా కుమార్తె, ఛాయకు సావరణి, శనేశ్వరుడు అని ఇద్దరు కుమారులు. తపతి అను కుమార్తె కలిగిరి. అశ్విని దేవతలు బడబ కుమారులు. ఈ విధంగా వివస్వంతుని కుమారుడగు శ్రాద్ధ దేవుడు ఏడవ మన్వంతరమున మనువై ఉండెను. అతడే వైవస్తతము మనువు. ఇప్పుడు మనము ఆ వైవస్తత మన్వంతరముననే సాగుచున్నాం. ఎనిమిదవ మన్వంతరమున సావరిణి మనువు అగును. అప్పుడు బలి ఇంద్రుడగును. అప్పుడు విష్ణువు ఇంద్రునికి తమ్మునుగా తమ్మునిగా అదితికి కుమారునిగా వామనుడే అవతరించి బలి నుండి రాజ్యమును యాచించి స్వీకరించును. బలి సిద్ధిని పొందును. ఆ బలి భగవానుచే బంధించబడి మరల విడువబడి సుతలమున చక్రవర్తియే ప్రకాశించుచుండును. తొమ్మిదవ మన్వంతరమున దక్ష సావరిణి మనువగును. 10వ మన్వంతరమున బ్రహ్మ సావరణి మనువగును. 11వ మన్వంతరమున ధర్మ సావరణి, 12వ మన్వంతరము రుద్ర సావరణి, 13వ మన్వంతరము దేవ సావరణి, 14వ మన్వంతరమున ఇంద్ర సావరణి మనువులుగా ఉందురు. ప్రతి మన్వంతరమునకు విష్ణువు యొక్క అంశచే ఒక్కొక్క అవతారం వచ్చుచుండును. ఈ 14 మన్వంతరములు వే యుగముల కాలము సాగును. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు మారి మారి సాగుచుండును. ఎనిమిదవ మన్వంతరమున జరిగిన కథ వామన అవతారం. విష్ణువు వామన రూపమున బలి నుండి త్రిలోకములను దానము పట్టి ఇంద్రునకు మరల ఇంద్ర పదవి నొసంగును. బలిని బంధించును. ఈ వృత్తాంతమును తెలుసుకొందుము. దేవాసుర సంగ్రామమున ఇంద్రునిచే బలి ఓడింపబడినాడు. ప్రాణములతో మాత్రము మిగిలి ఉన్నాడు. గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్లి తన కలిగిన అవమానము విన్నవించి శోకించెను. అప్పుడు భృగువంశ సంజాతులగు బ్రాహ్మణులు బలిచే విశ్వజిత్తు అనడి యాగము చేయించి బహురుచ బ్రాహ్మణమున ప్రసిద్ధమగు మహాభిషేకముతో అతనికి అభిషేకమును చేసిరి.

ఆ విశ్వజిత్ యాగమున హోమాగ్ని నుండి బంగారు రథం ఆవిర్భవించెను. ఇంద్రుని గుర్రములు పోలిన గుర్రములు ఆవిర్భవించినవి. సింహపు గుర్తు గల ధ్వజము కూడా ఆవిర్భవించెను. దివ్యమైన ధనస్సు అక్షయములగు. అమ్ముల పొదలు దివ్యమగు కవచము అతనికి లభించినవి. బ్రహ్మ ఎప్పుడును వాడని మాలికను వసంగెను. శుక్రుడు శంఖమును వసంగెను. బలి బ్రాహ్మణుల అనుగ్రహముచే యజ్ఞమున యుద్ధ పరికరములన్నింటినీ పొందినాడు. బ్రాహ్మణులు మంగళాశీస్సులను వసంగిరి. బలి వారికి ప్రదక్షిణము చేసి నమస్కరించి ప్రహ్లాదునకు నమస్కరించి ఇంద్రుడిపై దండయాత్రకు బయలుదేరెను. బంగారు రథమునధిరోహించి ఇంద్రపురిపై దండెత్తెను. నందనవనమున సైన్యముతో విడిది చేసెను. ఆనందనము అందమగు కొలనులతో పుష్పములతో కూయుచున్న జలపక్షులతో సుందరముగా ఉండెను. ఇంద్రపురికి ఆకాశగంగ అగర్త వలె చుట్టూను వ్యాపించి ఉన్నది. అగ్ని వర్ణమగు ప్రాకారము ప్రకాశించుచున్నది. కవాటములు, ద్వారములు రజితమయములుగా నుండెను. గోపురములు స్ఫటికమయములు. ఆ పట్టణమును విశ్వకర్మ నిర్మించినాడు. అందు నిత్య యవ్వనము గల సుకుమారులగు సుందరాంగులు విరాజిల్లు చొందురు. వారి నృత్య గీతములతో ఆ పట్టణము ఎల్లప్పుడూ ధనించుచుండును. అధర్మమును ఎక్కువగా ఆచరించిన వారు, భూతద్రోహులు, అహంకారులు, కాముకులు, మోసము చేయువారు, లుబ్ధులు ఆ పట్టణమున ఉండరు. బలి తన సైన్యముతో ఆ పట్టణము చుట్టుముట్టడించెను. శుక్రాచార్యుడు ఇచ్చిన శంఖమును పోలించెను. ఆ ధ్వనిని విని ఇంద్రుడు భయపడి గురువగు బృహస్పతిని చేరి ఇట్లు విన్నవించెను. స్వామి మాతో పూర్వ వైరము గల బలి నేడేదో కారణముచే తేజస్సు కలవాడై తీవ్రమైన ప్రయత్నముతో మన పట్టణంపై దండెత్తినాడు. ఇప్పుడు ఇతన్ని ఎదురించుటకు ఎవ్వరికినీ సఖ్యము కాదు. పై దిక్కులను తమ ముఖముతో త్రాగునా అనునట్లు, నాలుకతో నాకి వేయునా అనునట్లు, చూపుతో దహించునా అనునట్లు ఒప్పుచున్నాడు.

ఇంద్రుని మాటలు విని బృహస్పతి, ఇంద్రా వాని గురువులు శుక్రాచార్యులు వానికి దివ్యశక్తిని సంపాదించి ఇచ్చిరి. ఇప్పుడు శ్రీహరి తప్ప వేరొకరెవ్వరును అతని ఎదుట నిలవలేరు. మీరు స్వర్గమును వదిలి వెడలిపోయి కొంతకాలము నిరీక్షించుచుండుడు అని చెప్పెను. బృహస్పతి చెప్పినట్లే దేవతలందరూ స్వర్గమును వదిలి ఎచటికో పోయి దాగి ఉండిరి. బలి స్వేచ్ఛగా స్వర్గ రాజధానిని ఆక్రమించి జగత్త్రయమును తనదిగా పాలించెను. శుక్రాచార్యుడు వానిచే మూడు అశ్వభేదములు చేయించెను. అతని కీర్తి మూడు లోకముల ప్రసిద్ధిమాయెను. సమృద్ధమగు ఐశ్వర్యమును అనుభవించుచుండెను. దేవతల తల్లియగు అదితి తన కుమారులు స్వర్గము పోయి అనాధుల వలె ఉండుట చూచి శోకించుచు తన పతిదేవులు కశ్యపుల ఆశ్రమమునకు చేరెను. కశ్యపుడు సమాధి నుండి లేచినాడు. ఆమెను కుశల ప్రశ్నను చేసెను. బ్రాహ్మణులకు ధర్మమునకు లోకమునకు హాని ఏమీ వాటిల లేదు కదా? మీ గృహములలో ధర్మార్థ కామములు యధాయోగ్యముగా ప్రవర్తించుచున్నవా? కుటుంబ కార్యములందు ఆసక్తిచే వచ్చిన అతిథులను మంచి నీటితోనైనను ఆరాధించని గృహస్తుల గృహములు నక్కలు నివసించెడి గృహములు వంటివి సుమా. ఆయా సమయములందు హవిస్సులతో అగ్ని పరిచర్య చేయుచున్నావా? అగ్నిహోత్రుడిని ఆరాధించిననే గాని కోరికలు నెరవేరవు. సర్వ దేవాత్ములగు బ్రాహ్మణులు అగ్నికి ముఖం వంటివారు. నీ పుత్రులు కుశలమే కదా? నీ లక్షణములు చూచినా ఏదో దిగులుతో బాధపడుచున్నావు. అని కశ్యపుడు అడగగా అదితిట్టు పలికెను. మీ అనుగ్రహముచే అన్నియు అనుకూలముగా సాగుచున్నవి. అగ్నులు, అతిథులు, సేవకులు, యాచకులు శమింపబడుచున్నారు. మీరు మాకు నాయకులై ఉండగా. ధర్మలోపం ఎన్నడును కలగదు. లోకములోనున్న సకల ప్రజలు సాత్వికులు, రాజసులు, తామసులు కూడా మీ బిడ్డలే. అందరియందును మీ భావం ఏకరూపముగానే ఉండును. అసురులు, సురలు కూడా మీకు సమానమే. అయినను భజించిన వారిని అనుగ్రహించుట మీ స్వభావము కదా ప్రభు ఇప్పుడు మిమ్ములను నేను భజించుచున్నాను. శత్రువులు నా బిడ్డల రాజ్యమును ఐశ్వర్మమును దోచుకొయినారు. మాకు శ్రేయస్సును కలిగింపుము కాపాడుము. నా బిడ్డలు మరల తమ పదవులను ఐశ్వర్మమును పొందునట్లు చేయుము. అతిథి ఇట్లు ప్రార్థింపగానే కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను. ఓహో విష్ణువు యొక్క మాయా బలము చాలా గొప్పది. ఈ జగమంతయు ప్రేమచే బంధింపబడినది.

పంచభూత వికారమగు ఈ దేహమునకును ప్రకృతి అవ్వలిదైన ఆత్మకును గల భేదమును ఎవ్వరూ గుర్తించలేరు. దాని చేతనే భర్త పిల్లలు అనడి మోహము కలుగుచున్నది. సర్వ జీవ అంతర్యామియగు వాసుదేవుని ఆరాధింపుము. అతడు దీనులపై దయచూపువాడు. నీ మనోరథమును అతడే నెరవేర్చగలడు. భగవత్భక్తి కంటే వేరొకటి. అన్నిటినీ సమకూర్చగలదు. ఈ లోకంలో భగవత్భక్తి కంటే వేరొకటి అన్నిటినీ సమకూర్చగలదని గలది ఈ లోకంలో లేదని నా అభిప్రాయం. ఇట్లు కశ్యపుడు చెప్పగా అదితి భగవానుని సేవించి సేవించు విధానమును నాకు ఉపదేశింపుడు, ఏ విధానముచే సేనా నేను ఆరాధించిన భగవానుడు నా మనోరథమును నేరవేర్చునో ఉపదేశింపుడు అని ప్రార్థించెను. కశ్యపుడు అదితికి ఇట్లు చెప్పెను. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ నాకు పయోవ్రతమును ఒక వ్రతమును సంతానమును పొందుటకు సాధనముగా ఉపదేశించినాడు. దానిని నీకు ఉపదేశించెదను. ఈ వ్రతమును ఫాల్గుణ మాసములో శుక్ల పక్షమున చేయవలెను. 12 రోజులు చేయవలెను. ఫాల్గుణ మాసమునకు ముందటి అమావాస్య నాడు. అడవి పొందు కొమ్ములతో పెగిలించిన మట్టిని ఒంటికి రాసుకొని నదిలో ఆ మంత్రమును చదువుచు ఈ మంత్రమును చదువుచు స్నానము చేయవలెను. త్వం దేవ్యాది వరాహేణ రసాయాః స్థానమిచ్ఛత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. ఈ మంత్రమును చదువుతూ స్నానము చేసి నిత్యము చేయవలసిన కృత్యములను నియమములను నెరవేర్చుకొని వాసుదేవుని ద్వాదశాక్షర మంత్రముతో ఆరాధించవలెను. వాసుదేవుని మూర్తిని ఎదురుగా నుంచుకొని ఆరాధించవలెను. ఒక వేదికపై మండపం కల్పించుకొని దాని యందు వాసుదేవుని ఆవాహన చేసి దాని ఆరాధించవలెను. సూర్యుని యందు జలమునందు అగ్ని యందు బ్రాహ్మణుని యందు కూడా వాసుదేవ భావన చేసి ఆరాధించవలెను. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును ఇందు ముఖ్యముగా జపించవలెను. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే.

సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణి మొదలగు తొమ్మిది శ్లోక రూపములగు మంత్రములతో అర్చన చేయవలెను. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, గంధమాల్యాదులు, వస్త్ర ఉపవీత ఆభరణాదులు, ధూపదీపాదులు, నైవేద్యము. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రం ఉచ్చరించుచు సమర్పించవలెను. ప్రతిదినము పరమాన్నము నీతితో కలిపి ద్వాదశాక్షరీ మంత్రముతో నివేదనము చేయవలెను. నివేదనం అయిన తరువాత అర్ఘ్యపాద్య ఆచరణమును వసంగవలెను. తరువాత అష్టోత్తర శతము వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమును స్తోత్రము చేసి ఆ మూర్తికి ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారము చేయవలెను. నివేదన చేసిన ఆ పాయసమును భక్తుల కోసంగి తాను భుజింపవలెను. స్వామికి సమర్పించిన పుష్పములను తాను ధరింపవలెను. ప్రతిరోజు ఇద్దరికైనను బ్రాహ్మణులకు పాయసముతో భోజనం పెట్టవలెను. బ్రాహ్మణులు భుజించిన తరువాత మిగిలిన పదార్థమును తాను స్వీకరించవలెను. బ్రహ్మచర్యము. అతశ్శయనము చేయవలెను. వ్రతకాలములో ప్రతిదినము తాను ప్రతిష్టించుకొనెన వాసుదేవ మూర్తికి పాలతో అభిషేకము నరుచవలెను. అగ్నిహోత్ర హోమము చేయవలెను. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకు శ్రద్ధతో భగవదారాధనము, హోమము, బ్రాహ్మణ భోజనము ఆచరించవలెను. నియమముతో బ్రహ్మచర్యము, అధశ్శయనము, త్రికాల స్నానము ఆచరించవలెను. చెడు విషయములపై ఇంద్రియములను పోనీయక, చెడు ప్రసంగములు చేయక, భోగ లాలసత లేక సర్వభూతము ఏడ దయతో ప్రవర్తించవలెను. ఈ 12 దినములు సర్వదా వాసుదేవునే భావించుచు ఉచ్చరించుచు ఉండవలెను. ఆ తరువాత ఈ 12 దినములు గడిచిన తరువాత త్రయోదశి నాడు వాసుదేవమూర్తికి శాస్త్రక విధానముతో ఋత్విక్కులచే స్నపనము చేయించవలెను. విష్ణు దేవతా విష్ణు దేవతాకమగు పాయసమును పురుష సూక్తమునందలి పదనారు రుక్కులతో అగ్నియందు హోమమున చేయవలెను. ధనమున లోవపడక షడ్రసోపేతముగు నైవేద్యమును భగవంతునకు అర్చింపవలెను అర్చించవలెను అర్పించవలెను. తరువాత ఆచారునకు బ్రాహ్మణులకు ధనముననుసరించి

వస్త్రాదులు దక్షిణలు సమర్పించవలెను. వారికి సంతర్పణము చేయవలెను. దీనులకు, అంధులకు అందరికీ తన శక్తి కొలది భోజనము పెట్టవలెను. వారందరి భోజనం అయిన తరువాత బంధువులతో కలిసి తాను భుజింపవలెను. ప్రతిదినమూ వా నామ సంకీర్తనము కథాగానము చేయవలెను. శ్రద్ధతో ఆ వ్రతమును నీవు ఆచరింపుము. దీనిచే వాసుదేవుడును నీ కోరిక నెరవేర్చును అని కశ్యపుడు చెప్పెను. ఆ తరువాత భాగాన్ని మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Gurus. I am the one who has practiced the Amnaya, the forest-cleared, the Vedas, and the Vrata. I am the one who has fulfilled all the fruits of intellect and wisdom. All the sacrifices, the fire, the sacred water, the knowledge of the names, and the elephant bath, and the remembrance of the feet of Vinayaka, are victorious, O God Narayana, Srimannarayana, abandoning the remembrance of Padamboor, merely chanting the Vedas is like wandering in the forest. Following the Vedic rules is like doing exercises to melt the khandalas. Sacrifices, deeds, and bathing in holy waters like the Ganges, like bathing in elephants, are useless, therefore, always remembering that Narayana, perform all actions. Mukundamala 26th prayer. Devotees of God, welcome to the eighth podcast of the Srimad Bhagavata Tattva Deepika, the eighth book. We have completed the churning of the ocean of milk. We will learn about another avatar in the next part. After six Manvantaras, the seventh Manvantara is Vaivasvata Manvantara. Vivasvanta's son was Manu, the god of shraddha. In each Manvantara, Manu, Indra, the gods, the sages, and the incarnations were different They are there. Until now, there have been seven Manvantaras. Vivasvanta had two wives, the daughters of Vishwakarma, Sangya and Chhaya. Some say that there was another wife, who was called Badaba. He has two sons, Yama and Shraddha Deva, who are symbols.

Yamuna had two sons, Chaya and Savarna, and Shaneshvara. Tapati had a daughter. Ashwini Devas are the sons of Bada. In this way, Shraddha Deva, the son of Vivasvanta, was Manu in the seventh Manvantara. He is the Vaivasvata Manu. Now we are continuing in that Vaivasvata Manvantara. In the eighth Manvantara, Savarni Manu will be. Then the sacrifice is offered to Indra. Then Vishnu, as Indra's younger brother, as Aditi's son, Vamana incarnated and asked for the kingdom from Bali and accepted it. The sacrifice is accomplished. That sacrifice, bound by the Lord, is released again, and shines as the emperor in gold. In the ninth Manvantara, Daksha's wife was Manu. In the tenth Manvantara, Brahma will be the presiding deity. In the 11th Manvantara, Dharma Savarani, in the 12th Manvantara, Rudra Savarani, in the 13th Manvantara, Deva Savarani, in the 14th Manvantara, Indra Savarani will be as Manu. In each Manvantara, an incarnation of Vishnu comes. These 14 Manvantaras and the ages of the Yugas will continue. Krita, Treta, Dvapara, The eras keep changing. The story of the eighth Manvantara is the Vamana avatar. Vishnu, in the form of Vamana, took the three worlds from Bali, gave them as a donation, and again granted Indra the position of Indra. Binding the sacrificial fire. Let's learn about this story. Indra was defeated by Bali in the Devasura sangrama. He is the only one left. He went to the wise Shukracharya, confessed his humiliation, and grieved. Then, the Brahmins born in the Bhrigu dynasty, having performed the sacrifice called Bali Che Vishwajit, performed the great anointment to him with the famous Mahabhishekam of Bahurucha Brahmana.

A golden chariot emerged from the sacrificial fire at the Vishwajit Yaga. Horses, identical to Indra's steeds, appeared. The lion emblem flag also emerged. The Divine Arrow of Wealth. The divine armor of the Ammu Podis was obtained by him. Brahma has set a garland that he has never worn. The planet Venus has conquered the conch. By the grace of the sacrificial priest, he obtained all the war equipment in the Yagnya. The Brahmins accept the auspicious gifts. Having circumambulated the sacrificers, having bowed, having bowed to Prahlada, he set out on a campaign against Indra. He rode in a golden chariot and invaded Indraprastha. He camped in the grove with his army. It was beautiful with joy, with beautiful ponds, with flowers, with water birds. Indraprastha is surrounded by the sky like a mountain. The fortress, which is as bright as fire. The valves and doors were made of silver. The towers are made of crystal. The town was built by Vishwakarma. Therefore, those who are always young and innocent Beautiful people shine brightly. The town is always prosperous with their dance songs. Those who practice unrighteousness excessively, those who are treacherous, arrogant, lustful, deceitful, and greedy will not be in that town. Baal besieged the city with his army. He wore the conch shell given by Shukracharya. Hearing that sound, Indra, frightened, approached Brihaspati, the guru, and thus pleaded. Swami, Bali, who had a previous enmity with us, due to some reason, being radiant, attacked our town with intense effort. Now, there is no peace for anyone to confront him. He confesses as if he were drinking from his face to the upper directions, as if he were licking with his tongue, as if he were burning with sight.

Hearing Indra's words, Brihaspati, Indra's guru Shukracharya, gave him divine power. Now, except for Srihari, no one else can stand before him. He said that you left heaven and waited for some time. Just as Brihaspati said, all the gods left heaven and went to some place and hid. Bali, freely, occupied the capital of heaven and ruled the world. Shukracharya had him perform three tests. His fame spread throughout the three worlds. She was experiencing a prosperous life of wealth. Aditi, the mother of the gods, grieved to see her sons go to heaven and live like orphans. She reached her husband's abode, Kashyapa's ashram. Kashyapa got up from his meditation. He asked her a question about her well-being. Brahmins have no harm to religion or the world, right? In your homes, are your dharma, artha, and kama (righteousness, wealth, and desire) functioning properly? The houses of householders who do not worship with even good water, those who have come with interest in family affairs Like the dwellings of foxes. At those times, are you performing the fire service with offerings? Desires are not fulfilled by worshipping Agnihotri. The Brahmins, who are the all-pervading gods, are like the face to the fire. Are your sons well? Even if I see your characteristics, you are suffering from some sadness. And when Kashyapa asked, Aditi replied. By your grace, everything is going favorably. The fire, the guests, the servants, and the beggars are being pacified. While we have you holed. There is never any lack of dharma. All people in the world, whether they are gentle, kings, or tyrants, are your children. Your feelings towards everyone are the same. The Asuras, like the Suras, are also among the gods. But it is your nature to bless those who worship, Lord. Now I worship you. The enemies have plundered my children's kingdom and wealth. Protect and preserve for us the welfare. May my children again receive their positions and prosper. As soon as the guest prayed thus, Kashyapa Prajapati thus He spoke. Oh, the illusionary power of Vishnu is very great. The whole world is bound by love.

No one can recognize the difference between this body, which is a distortion of the five elements, and the soul, which is the nature of the self. Because of that, the desire to have children is arising. Let us worship Vasudeva, the Lord of all beings. He is the one who shows mercy to the humble. He is the one who can fulfill your desires. There's something better than devotion to God. It can gather all of them. In this world, there is nothing that can provide everything better than devotion to God, that is my opinion. Thus, when Kasyapa said, Aditi, instruct me on the method of serving the Lord, and by what method will the Lord whom I worship fulfill my desires, please instruct me, she prayed. Kashyapa said this to Aditi. In the past, the four-faced Brahma taught me the vow of Prayobhrathamu, a vow, and as a means to attain progeny. I will teach you that. This ritual should be performed during the Shukla Paksha in the month of Phalguna. It's a 12-day thing. The day is the previous new moon day of Phalguna. Applying the mud mixed with the horns of the wild animal to the body and in the river, that mantra While studying, while reciting this mantra, one should take a bath. You are divine, and I desire your place. I bow to you, who are the source of the essence of the Varaha. While chanting this mantra, after bathing, one should fulfill the daily rituals and rules, and worship Vasudeva with the twelve-syllable mantra. One should stand in front of the idol of Vasudeva and worship it. A platform should be set up, a pavilion should be arranged, and Vasudeva should be invoked upon it, and it should be worshipped. One should worship the sun, water, fire, and Brahmins with devotion. One should mainly chant the mantra 'Om Namo Bhagavate Vasudevaya'. Salutations to you, O Lord, the great and glorious Purusha.

One should perform the worship with nine shloka-form mantras such as 'Sarvabhuta Nivasaya Vasudevaya Sakshini'. Invocation, asana, arghyam, padya, achamana, snana, sandalwood paste, clothes, loincloth, ornaments, incense, and offering. One should chant the mantra 'Om Namo Bhagavate Vasudevaya' and offer it. Every day, along with the supreme food, offerings should be made with the Dwadashakshari mantra. After the offering, the performance of the arghya and the pradana should be done. Then, after praising the Ashtottara Shatamu Vasudeva Dwadashakshari mantra, circumambulate that deity and offer Sashtanga Namaskaram. The offering of the payasam should be eaten by him for the sake of the devotees. He should wear the flowers offered to the Swami. Every day, two Brahmins should be given a meal with payasam. After the Brahmins have eaten, one should accept the remaining food. Celibacy. One should not lie down. During the period of fasting, one should daily perform an ablution with milk for the Vasudeva Murthy whom they have installed. Agnihotra Homa It should be done. From Falguna Shuddha Padyami to Dwadashi, with devotion, one should perform Bhagavadaradhana, Homa, and Brahmin Bhojanam. With the rule, celibacy, lying down, and bathing at three times should be practiced. Without letting the senses go to bad things, without making bad speeches, without lust for pleasure, one should act with compassion towards all beings. These 12 days should always be considered and uttered in the form of Vasudeva. After that, after these 12 days have passed, on Trayodasi, Vasudeva Murthy should be bathed with a scriptural method by the Ritvikks. The payasam, which is the offering to Lord Vishnu, should be made into an offering to the fire with the nine steps of the Lord in the Purusha Sukta. Without being greedy for wealth, one should offer a six-taste delicacy to God, offer it, offer it. After that, according to the Brahmins, the money was given to the Acharuna

Offerings and Dakshina. Offerings should be made to them. To the poor and the blind, to everyone, according to their ability, food should be given. After everyone has eaten, he should eat with his relatives. Every day, one should do Naamasankirtanam and Katha Gana. With devotion, you should perform that vow. Vasudeva will fulfill your wish, said Kashyapa. We will learn about the next part in another podcast. Jai Srimannarayana. Salutations to the Guru