వామన అవతారం: బలి దానధర్మం మరియు త్రివిక్రమ విశ్వరూపం

Vamana Avatar: Bali's Steadfast Charity and Trivikrama's Cosmic Form

bhagavatam

శుక్రాచార్యుడు బలికి వామనుడు సాక్షాత్తు విష్ణువని హెచ్చరించి దానం చేయవద్దని సూచించాడు. అయినప్పటికీ బలి చక్రవర్తి, బ్రాహ్మణునకు ఇచ్చిన మాట తప్పడం అసత్యమని, అది నరకం కంటే భయంకరమని గురువు ఆజ్ఞను తిరస్కరించాడు. శుక్రుని శాపాన్ని కూడా లెక్కచేయక బలి దానం చేయగా, వామనుడు త్రివిక్రముడుగా విశ్వరూపం దాల్చి రెండు అడుగులలో భూమిని, స్వర్గాన్ని ఆక్రమించాడు. సత్యలోకంలో బ్రహ్మ ఆ పాదాన్ని అభిషేకించగా ఆ జలం మూడు లోకాలను పవిత్రం చేసే ఆకాశగంగగా మారింది. ఆగ్రహించిన రాక్షసులు యుద్ధానికి పూనుకోగా, బలి వారిని వారించి దైవేచ్ఛకు తలవంచమని హితవు చెప్పాడు.

Shukracharya warns Bali that the dwarf Vamana is actually Lord Vishnu, sent to reclaim the heavens for the gods, and advises him to retract his promise. Bali, however, firmly refuses, declaring that breaking a vow made to a Brahmin is a greater sin than any loss of wealth or kingdom. Despite Shukracharya's curse, Bali proceeds with the donation, and Vamana expands into the cosmic Trivikrama form, measuring the earth and heavens in two strides, leaving nothing for the third. Brahma worships Trivikrama's foot at Satyaloka, and the water from that ablution becomes the sacred celestial river. The demons, enraged at Vishnu's deception, attack but are repelled, and Bali wisely instructs them to retreat, accepting the Lord's will.

← Prev Next →
Vamana Avatar: Bali's Steadfast Charity and Trivikrama's Cosmic Form bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః మజ్జన్మనః ఫలమిదం మధు కైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథా దైత్య సంహారకా, లోకనాథా, ఈ నా కోరిక నీడేర్చుము. నన్ను అనుగ్రహింపుము. నీ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యునకు భృత్యుడనగా నన్ను తలంచుము. అట్లు నీ భృత్య పరంపరలో ఒక్కనిగా నన్ను తలంచుటయే ప్రభు నా జన్మకు ఫలం. ముకుందమాల 28th ప్రేయర్. భగవద్బంధులారా శ్రీమద్భాగవత తత్వదీపిక. అష్టమ స్కంధం 10వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షణం, క్షీర సాగర మథనం పూర్తి చేసుకొని వామన అవతారంలో వామనుడుగా అవతరించి బలి చక్రవర్తి వద్ద మూడడుగులు. దానం చాలు నాకు అని వామనుడు అడుగుతాడు. ఆ తర్వాత జరిగేటువంటి కథను మనం తెలుసుకుందాం. అప్పుడు బలి అతని కోరికను అనుసరించి మూడడుగుల నీళ్ళను సంగుటకు జల కలశమును తీసుకొని దానము చేయుటకు సిద్ధపడుచుండెను. ఆచార్యుడు శుక్రుడు విష్ణువు చేయదలిచిన కార్యమును గుర్తించి శిష్యుడగు బలితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ బలి ఈతడు సాక్షాత్తు భగవానుడు విష్ణువు. కశ్యప ప్రజాపతి వలన అదితి యందు జన్మించినాడు. దేవతలకు రాజ్యమును సాధించుటకు వచ్చినాడు. నీవు ఈతనికి మూడడుగులు నేలనిచ్చెదని ప్రతిజ్ఞ చేసితివి. రాభు అనర్థమును గుర్తించవైన ఐతివి. ఇది మంచిది కాదు. రాక్షసులకు అనర్థము దీనిచే వాటిల్లును. నీ స్థానమును, ఐశ్వర్యమును, తేజస్సును, కీర్తిని సర్వమును ఈతడు నీ నుండి లాగికొని ఇంద్రుని కొసంగును.

ఇతడు వామనుడుగా కనపడుచున్నాడు, కానీ ఇతడు విశ్వరూపుడు. లోకములన్నింటినీ తన పాదములతో ఆక్రమించగలడు. సర్వస్వమును ఇతని కొసంగి నీవెట్లు బ్రతకగలవు? తన శరీరమును పెంచి ఒక పాదముతో భూమిని, రెండవ పాదముతో ద్విలోకమును కొలిచి విశ్వమంతయు నండి ఉండును. మూడవ పాదమునకు ఇచ్చుటకు ఏదియు నీకు ఉండదు. నీ విచ్చెదనని ప్రతిజ్ఞ చేసిన మూడడుగులు కూడా నీవు వసంగలేవు. ఇచ్చెదనని ఇయ్యలేకపోయినా నీవు నరకమును పొందుట తప్పదు. తను జీవిక సాగుటకు కూడా అవకాశం లేకుండా దానమొసంగుట ప్రశంసింపతగినది కాదు. దానము, యజ్ఞము. తపస్సు మొదలగు ఏ కర్మ చేసినను తాను బ్రతికుండి ఇతరులను సుఖింపచేయవలెను. కానీ తానే లేకుండా ఉండునట్లు చేయరాదు. తనకున్న ధనమును ధర్మమునకు అర్థమును కామమునకు తన బంధువులకు కీర్తికి ఐదు విధములుగా ఉపయోగపడునట్లు. విభజించి వినియోగించువాడు ఇహలోకమున పరలోకమున సుఖమునొందును. వేదమున బహృచ శాఖ ఇట్లు చెబుచున్నది. ఒకరు అడిగినప్పుడు ఓం సరే అనుట సత్యము లేదనుట అసత్యము. ఎంత ఉన్నను తనకే కొంత ఉంచుకొని లేదనిన నాడు వేరులేని చెట్టు వలె దేహమే లేకుండా పోవును. చెట్లు ఉన్ననాడు కదా పువ్వులు, పళ్ళు. సత్యం. అన్రుతముచే శరీరమును నిలుపుకొని సత్యమును పండించుకొనవలెను గాన అన్రుతమే లేక ఉండవలెనన శరీరమే నిలవదు. సర్వస్వమునిచ్చెదను అనుట తానేమియు లేనివాడగుట. తానేమియు లేనివాడైనచో తాను బ్రతకలేడు. అందుచే శరీరము కొరకు కొంత అనృతము సేవించవలెను. అంతయు ఇచ్చేదననరాదు. ఏమియు లేదనరాదు. ఉన్నంతలో కొంత తన దేహ పోషణకు ఉంచుకొని దానము చేయవలెను. మాట ఇచ్చితిని కదా మరల వచ్చునా అని సంకోచింపకుము. స్త్రీలను వశపరచుకొనునప్పుడు పరిహాసమున వివాహమున శరీర పోషణమునకు గోవులను బ్రాహ్మణులను కాపావుటకు హింసను వారించుటకు ఆడిన మాట తప్పుడు దోషము కాదు. అందుచే వామనునకు ఇచ్చెదనను అనినను నీ శరీరముకు తగినంత ఉంచుకొని మిగిలినది వసంగుట దోషము కాదు. శుక్రాచార్యుడు ఇట్లు చెప్పగా బలి ఒక క్షణము మౌనంగా ఆలోచించి ఇట్లు సమాధానం ఇచ్చెను. గురుదేవా మీరు చెప్పినది నిజమే గృహస్తులకు కర్తవ్యం అదియే.

అర్థము, కామము, కీర్తిని, జీవికను గృహస్తు పాడు చేసుకొనరాదు. నేను బ్రాహ్మణునికి ఇచ్చెదనని మాట ఇచ్చి ధనమందు లోభముచే కాదనుట ప్రహ్లాదుని మనవడైన నాకు తగదు. అసత్యము కంటే అధర్మము వేరొకటి లేదు. భూమి మేరుమందరాది పర్వతములేనను మోయగలను కానీ అసత్యమును పలికెడి మానవుని మోయలేను అనెను కదా. ఆచార్య నేను నరకమునకు భయపడను. దుఃఖ సముద్రములో మునిగినను భయపడను. స్థానము నుండి భ్రష్టుడునగుటను భయపడను కానీ బ్రాహ్మణులు కొసంగిన మాటను వెనుకకు తీసుకునుటకు భయపడెదరు. ధనము మొదలగు సంపదలన్నియు శరీరమును విడిచిన వెంటనే మనను విడుచును గాని వెంటరావు. ఎప్పుడైనను వదిలిపోవునవే కదా జీవించి ఉండగానే. ఒక బ్రాహ్మణునకు సంతుష్టి కలుగుటకు ఆ ద్రవ్యం ఉపయోగపోవుట మేలు కదా? సాధువులగు దధీచి, శిబి మొదలగు వారు భూత హితమునకై విడవ శక్యము కాని ప్రాణములను కూడా విడిచినారు కదా? భూమిలో వసంగుటలో నేను సంకోచపోవుట తగునా? మా పితృ పితామహాదులు యుద్ధములో వెనుదియ్యని పరాక్రమము గలవారలై ఈ భూమిని అర్జించిరి. అనుభవించిరి. ఆ భూమిని అనుభవించుటకు వారు ఇప్పుడు లేరు. కానీ వారి కీర్తి మాత్రం నేటికినీ చెడక నిలిచి ఉన్నది. దేహము కంటే ప్రియమైనది ధనం. దానిని యోగ్యుడగు సత్పాత్రునికి శ్రద్ధతో అర్పించుట కష్టం. కానీ యుద్ధములో ప్రాణం వీడుట సులభం. ఒక యాచకుని కోరికను నెరవేర్చి దైన్యమును అనుభవించుట కూడా మానవునకు అలంకారమే. అందుచే ఈ వటువునకు దానము సంగి దైన్యము నొందినను సంకోచింపను. ఇతడు బ్రహ్మచారి కాదు. విష్ణువే అని మీరు చెప్పినారు. అట్లే అయినచో నాకు మిక్కిలి సంతోషముగా ఉన్నది. యజ్ఞముల చేత, క్రతువుల చేత మహాపురుషులు శ్రీ మహావిష్ణువును ఆరాధించుచుందురు. నాకు మూడడుగుల భూమి వసంగుటచే ఆ భాగ్యము లభించుచున్నది. అతడు నన్ను రక్షించినను శిక్షించినను నేను బాధపడను. అతని ఆరాధనమే నా కర్తవ్యం. మీరు చెప్పినట్లు మూడవ పాదం మోపుటకు నేను ఇచ్చినది చాలదని అతడు నన్ను అపరాధము లేకున్నను బంధించిన నాడు కూడా నేను అతని ద్వేషింపలేను. బంధింపలేను. శత్రువైనను బ్రాహ్మణ శరీరముననున్న వారిని హింసించుట తగదు. ఈ విధంగా గురుని ఉపదేశమునకు బలి సమాధానము చెప్పి అతని ఆజ్ఞను తిరస్కరించెను.

అప్పుడు శుక్రునకు కోపం వచ్చి ఇట్లు శపించెను. నీవు పండితుడవు అనుకొనుచున్నావు, అజ్ఞానము నీకు నిండినది, గర్వము కలిగినది. నా ఆజ్ఞను ధిక్కరించితివి, కావున నీవు నీ ఐశ్వర్యము నుండి త్వరలో భ్రష్టుడవు కాగలవు. ఇట్లు శపించినను బలి చలించలేదు. అతని భార్య వింధ్యావళి సువర్ణ కలశముతో జలము తెచ్చెను. ఆమె జలము పోయుచుండగా బలి స్వయముగా శ్రీ మహావిష్ణువు పాదములను ప్రక్షాళనము చేసెను. లోక పావనములగు ఆ జలములను శిరమున ప్రోక్షించుకొనెను. దీనిని చూచి దేవతలు, గంధర్వులు మున్నగు వారందరు బలి యొక్క ఆర్జవమునకు సంతుష్టులై పుష్ప వర్షమును వర్షించిరి. దుందుబులు మ్రోగెను. తమకు శత్రువగు విష్ణువే వామనుడని ఎరుంగియు ఇతడు దానము చేసినాడని లోకములన్నియు ప్రశంసించినవి. శ్రీహరి వామన రూపమున ఆశ్చర్యముగా పెరిగిపోయెను. సత్తరజస్తమో గుణాత్మకమగు ప్రకృతి యొక్క పరిణామ రూపముగు జగత్తు అంతయు తన శరీరము గల శ్రీహరి విశ్వమునంతను నిండెను. భూమి, ఆకాశము, దిక్కులు, జ్యోలోకము, సముద్రములు, సూర, నర, త్రిక్కులు. ఋషులు అందరూ అతని శరీరమున ఇమిడి ఉండిరి. బలి చక్రవర్తి ఆ విశ్వమూర్తి యొక్క శరీరమున పృత్విక్కులతో, సదస్సులతో సకల విశ్వమును దర్శించెను. స్వామి పాదతలమున రసాతలమును, పాదముల యందు భూమిని, పిక్కల యందు పర్వతములను, మోకాళ్ళ యందు పక్షులను, తొడల యందు మరుద్గణమును ఇంద్రసేనుడు అను పేరు గల ఆ బలి చక్రవర్తి దర్శించెను. స్వామి యొక్క వస్త్రముగా సంధ్యను గగన భాగమున తాను మొదలుగా సకల రాక్షస సంఘమును ప్రజాపతులను గుహ్య దేశమున నాభియందు అంతరిక్షమును ఉదర ప్రదేశమున సప్త సింధువులను వక్షస్థలమున నక్షత్ర పంక్తిని ధరించెను. హృదయమున ధర్మమును, స్తనములయందు వృతమును, సత్యమును, మనసునందు చంద్రుని, వక్షస్థలమున పద్మహస్తయగు లక్ష్మిణి, కంఠదేశమున సామవేదములను, సకల వాంగ్మయములను దర్శించు. దర్శించెను. ఇంద్రుడు మొదలుగా గల దేవతలను, భుజములయందు, చెవులయందు దిక్కులను, శిరమునందు జులోకమును, కేశములయందు మేఘములను, నాసికయందు వాయువును, నేత్రమునందు సూర్యుని, ముఖమునందు అగ్నిని దర్శించెను.

మాట యందు ఛందస్సులను, నాలుక యందు వరుణుని, కనుబమయుల యందు నిమిష శాస్త్రమును, విధి శాస్త్రమును, రెప్పల యందు పగటిని, రాత్రిని, నుదిటి యందు క్రోధమును. పెదవియందు లోభమును దర్శించెను. ఆ విశ్వమూర్తి యొక్క వాగింద్రియమందు కామమును రేతో రూపమున జలమునకు జలమును పృష్టమున అధర్మమును అడుగులలో యజ్ఞమును నీడలో మృత్యువును నవ్వులో మాయను వెంట్రుకలలో ఔషధులను నాడులలో నదులను గోళ్ళలో శిలలను, బుద్ధిలో బ్రహ్మను, దేవతలను, ఋషులను దర్శించెను. ఇంద్రియములలో శరీరమునందు స్థావర జంగ జంగమాత్మకమగు భూతములు కనపట్టెను. వామనుడు విశ్వమూర్తియై నిలిచిన రూపమున సకల విషయము నుండి బలికి దర్శనమాయెను. ఆ స్వామి శంఖముతో, చక్రముతో, ఖడ్గముతో, అమ్ముల పొదితో ప్రకాశించుచుండెను. సునందుడు మొదలుగా గల పార్షదులు, లోకపాలురందరు ఆ విష్ణు రూపమును స్తోత్రము చేయుచుండిరి. ఈ విధంగా వ్యాపించి బలిచే పాలింపబడు భూమిని ఒక పాదముతో, ఆకాశమును తన శరీరముతో, దిక్కులను బాహువులతో వ్యాపించి ఉండెను. రెండవ పాదముతో స్వర్గమును ఆక్రమించెను. ఇంకా బలికి చెందిన ప్రదేశం ఏదియు మిగలలేదు. త్రివిక్రముడుగా పెరిగిన వామునుని పాదము పైకి వ్యాపించుచు స్వర్గమును దాటి మహా జనః తపః లోకములు దాటి సత్యలోకం వరకు చేరెను. ఆ సత్యలోకమున బ్రహ్మ ఆ పాదనక కాంతులచే ఆక్రమింపబడిన కాంతులుగా తమ లోకమును చూచి ఆశ్చర్యపడెను. ఆ సత్యలోకమునందలి మరీచీ మొదలగు ఋషులు సనందాది యోగులు కూడా ఆ తేజస్సును చూచి ఆశ్చర్యపడెరి. సకల వేదముల చేతను యోగమనడి వాయువుచే ప్రజ్వలింపబడిన జ్ఞానాగ్ని చేతను పుణ్య పాపములు దహించుకొనిన మహానుభావులందరూ సకల శాస్త్రములు వేదములు ఆ సత్యలోకమునకు చేరిరి. బ్రహ్మ తన లోకము వరకు చాచబడిన శ్రీ మహావిష్ణువు పాదమునకు ఆరాధనము చేయువ అర్ఘ్యాదులను సమర్పించి తన కమండలమున ఉన్న జలముతో ఆ పాదమునకు అభిషేకము నడిచెను. ఆ అభిషేక జలము ఆకాశ నదియై భగవానుని కీర్తి వలె నిర్మలమై మూడు లోకములను పవిత్రము చేయుచుండెను. బ్రహ్మాది లోకనాధులందరు త్రివిక్రముని పాదమును ఆరాధించిరి. తరువాత స్వామి తన శరీరమును సంకోచింపచేసి మరల వామన రూపముతో

నిలిచినాడు. జాంబవంతుడు ఆ విశ్వవ్యాప్తముగు స్వామి రూపమును దర్శించి భేరి మ్రోగించుచు స్వామిని కీర్తిని స్వామి కీర్తిని దేశమంతటా కీర్తించెను. ఈ విధంగా మూడడుగుల నేలను కోరి మోసముతో తమ ప్రభువుని వంచించిన వామనును చూచి అసురులు తీవ్రముగా వ్యధ చెంది తమ ప్రభువుతో ఇట్లు అనుచుండిరి. ప్రభువు ఇతడు బ్రహ్మ బ్రాహ్మణ వటుడు కాదు మాయావి అయిన విష్ణువు. ఇతడు మోసముతో మిమ్ములను వంచించినాడు. మీరు దీక్షలో ఉండి అసత్యమాడుట తగదు, కానీ మేము ఓర్చి ఉండలేము అని ఆగ్రహముతో ఆయుధములు దాల్చి వామన్ని చంపుటకై భయబడిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుచరులందరూ అసుర సైన్యమును నాశనము నాశనమునర్చిరి. బలి దానిని చూచి వారించెను. గురు శాపం వలన నాకు ఐశ్వర్యము పోవుట తప్పదు. యుద్ధము చేయకుడు వెనకకు మరులుడు. మనకిది అనుకూలమగు కాలము కాదు. సర్వభూతముల యొక్క సుఖదుఃఖములకు కారణమైనవాడు ఈశ్వరుడు. అతనిని పౌరుషముచే ఎదిరింపజాలము. ఇంతకాలము మనకు సుఖమును దేవతలకు దుఃఖమును కలిగించుచున్నాడు. ఇంతకుముందు దేవతలను జయించిన వారలం మనం. ఇప్పుడు వారికి దైవము అనుకూలము కావున దైవము అనుకూలమగు వరకు నిరీక్షింపుడు. బలి చక్రవర్తి చెప్పిన మాటలు విని దైత్యులు రసాతలమునకు పోయిరి. ఆ తరువాత ఏం జరిగిందో మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Gurus. This fruit is obtained by bathing. Please, O Madhukaitabha, with your grace, I remember you as a servant, a caretaker, a servant, a servant, a servant, a servant. O Lord of the Universe, destroyer of demons, Lord of the Universe, Fulfill my desire. Please, God help me. Consider me as a servant to your servants, to your servants, to your servants. Thus, considering me as one among your servants is the fruit of my birth, Lord. Mukundamala 28th prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattvadipika. Welcome to the 10th podcast episode of Ashtama Skandam. Until now, after completing Gajendra Mokshanam and Ksheera Sagara Mathanam, Vamana incarnated as Vamana and took three steps from Bali Chakravarti. Vamana asked him that charity is enough for me. We will learn about the story that happens after that. Then Bali, following his wish, was preparing to take a water pot to pour three feet of water and give alms. The teacher, Shukra, recognizing the task that Vishnu intended, is saying this to his disciple, Bali. Oh, the sacrificial bull The very God is Vishnu. He was born to Aditi by Kashyapa Prajapati. He came to the gods to win the kingdom. You vowed to give him three steps of land. Rabhu is a disaster. "This is not good. Evil will come to the demons from this. He will take away your place, wealth, splendor, and fame, everything, and for Indra.

He appears as a Vamana, but he is the Viswaroope. He who can stretch out his feet to the whole world. Having everything for him, how can you live? He will increase his body and measure the earth with one foot and the two worlds with the other foot, and will be all over the world. You will have nothing to give in the third step. You cannot even cross the three steps of your vow. Even if I cannot give what I have given, you will have to suffer hell. It is not commendable that he is donating without even having a chance to make a living. Charity, Yagna. He should live and make others happy, whatever penance or other deeds he performs. But he doesn't have to. So that he may use his wealth, wealth, meaning, desire, and his relatives, and fame, in five ways. He who divides and uses will have happiness in this world and in the hereafter. The Veda says so. When someone asks, is it true to say 'Om okay' or is it false? However much one has, if one keeps some aside, then like a separate tree, without a body, one will disappear. When there are trees, there are flowers and fruits. Truth. By controlling the body with unruly tendencies, one should cultivate truth, but if there is no unruly tendencies, the body will not remain. To say that I will give everything is like being without anything. If one is without anything, then one cannot live. Therefore, for the sake of the body, some dishonesty must be served. I can't give you that. You can't say no. Whatever is left, some of it should be kept for the nourishment of his body and donated. I have given my word, so don't hesitate to come again. When women are taken into possession, the words spoken in jest, in marriage, for the sake of body nourishment, to protect cows and Brahmins, and to refuse violence, are not wrong or sinful. Therefore, even if I say I will give it to Vamana, it is not a sin to keep what remains for your body. Shukracharya said this, and Bali silently thought for a moment and gave this reply. Oh Gurudeva, what you have said is true, it is the duty of the householders.

Meaning, desire, fame, and livelihood should not be ruined by a householder. I gave my word that I would give it to a Brahmin, but not because of greed in money. It is not appropriate for me, the grandson of Prahlada. There is no greater injustice, no more unrighteous thing, than untruth. I can carry mountains like earth, mountains, and the ocean, but I cannot carry a human who speaks falsehood, he said, right? Acharya, I am not afraid of hell. I will not be afraid even if I am drowned in the sea of sorrow. I am not afraid of being disgraced from my position, but I am afraid to take back what I have said for the sake of Brahmins. Wealth and all other possessions leave us as soon as they leave the body, but they do not follow us. They will never leave, even while living. Is it not better for a Brahmin to be satisfied with that money? The saints Dadhichi, Shibi, etc., even gave up lives that were impossible to give up for the sake of the welfare of beings, didn't they? Is it proper for me to hesitate in settling down on this earth? Our ancestors, who had the valor to not retreat in battle, acquired and enjoyed this land. They experienced it. They are no longer here to enjoy that land. But Their fame has remained intact even to this day. Money is dearer than life. It is difficult to offer it with devotion to a worthy and virtuous person. But it's easy to lose heart in battle. Fulfilling a beggar's wish and experiencing poverty is also an ornament for a human being. Therefore, even if this offering is given and one suffers poverty, one should not hesitate. He wasn't a bachelor. You said Vishnu did. If that happens, I will be very happy. Great men worship Sri Maha Vishnu by performing yagnas and kratus. I am getting that fortune because of the three-foot land acquisition. Even if he protects me or punishes me, I will not be hurt. His worship is my worship. As you said, even if what I gave is not enough to put the third foot, even if he has bound me without any fault, I cannot hate him. I cannot bind him. Even if he is an enemy, it is not right to torture those who are in the Brahmin body. In this way, after giving sacrifices and peace of mind to the guru's teachings, he rejected his command.

Then Shukra got angry and cursed like this. You think you are a scholar, but ignorance fills you, pride fills you. You have defied my command, therefore you will soon be ruined from your wealth. Even though he was cursed like this, Bali did not budge. His wife Vindhyavali brought water in a golden pot. While she was going through the water, the sacrifice itself washed the feet of Sri Maha Vishnu. He washed his head in the waters that were holy to the people. Seeing this, the gods, gandharvas, and all others were pleased with the offering of the sacrifice and showered flowers. The thunder crashed. They knew that Vishnu, who was their enemy, was a Vamana, and that he had given alms, and that the whole world praised him. Srihari grew up in a Vamana form, surprisingly. The world, which is the result of the evolutionary form of the nature of the seventy-third quality, Srihari, who has his body, was all over the universe. Earth, sky, directions, celestial sphere, oceans, sun, human, and triads. All the sages were entwined in his body. Bali The emperor, with the earthly beings and the assembly, saw the entire universe in the body of that universal form. Indrasena, the name of that Bali Chakravarti, saw the lotus feet, the earth at the feet, the mountains at the knees, the birds at the knees, and the Marudgana at the thighs. As the garment of the Lord, he began the evening in the sky, and in all the demon clans, in the Prajapatis, in the secret country, in the navel, in the space, in the abdominal region, he wore the seven oceans, and in the chest, he wore the line of stars. In the heart, see the Dharma; in the breasts, see the Vrittam; in the truth, see the moon; in the chest, see Lakshmi, who has the lotus-handed form; in the throat, see the Samavedas and all the Vedas. He saw. Indra saw the gods, starting with Indra, in his shoulders, in his ears, the directions, in his head, the world, in his hair, the clouds, in his nose, the air, in his eyes, the sun, and in his face, the fire.

In speech, the meter; in the tongue, the rain; in the eyelids, the minute script; in the rules, the rule; in the eyelids, the day; in the night, the anger; in the forehead, the anger. He saw the greed in the lips. That universal form, in the speech organ, desire, in the form of earth, water, water, in the stomach, unrighteousness, in the feet, sacrifice, in the shade, death, in the laughter, illusion, in the hair, medicines, in the rivers, in the nails, stones, In his wisdom, he saw Brahma, the gods, and the sages. In the senses, in the body, the ghosts that are static and moving were seen. Vamanudu, as the universal form, appeared before Bali from all matters. That Swami was shining with conch, discus, sword, and quiver of arrows. The Parshadas, including Sunandu, and all the protectors of the world were praising that form of Vishnu. Thus, the earth, which was spread out and ruled, was spread out with one foot on the earth, with its body in the sky, and with its arms in the directions. He seized the heaven with his second step. No more remains of the Bali. Vamuni, who grew up as Trivikrama, spread his feet upwards, crossed heaven, crossed the worlds of great people, and reached the true world. In that Satyaloka, Brahma was surprised to see his world as a world occupied by the rays of those feet. The sages like Marichi and other yogis in that Satyaloka were also surprised to see that radiance. All the Vedas, the fire of knowledge ignited by the wind of Yoga, and all the great people who burned away the merits and sins, all the scriptures and Vedas reached that realm of truth. Brahma, offering arghyadulu (water for washing the feet) to the feet of Sri Maha Vishnu, which is stretched up to his world, and performed ablution to that feet with the water in his kamandalam (water pot). That anointing water became a river in the sky, pure like the glory of God, and was sanctifying the three worlds. All the lords of the world, including Brahma, worshipped Trivikrama's feet. Afterwards, the Lord contracted his body and again in the form of Vamana

He stood. Jambavanthudu, having seen the universal form of the Lord, beating the drum, praised the Lord, praised the Lord's glory throughout the country. Thus, seeing Vamana, who deceived the three-foot land by deceit, the demons became severely distressed and were saying this to their lord. The Lord is not a Brahmin, nor is he a Brahmin, but Vishnu, who is illusory. He has deceived you with deceit. You should not lie while being in penance, but we cannot be patient, and with anger, they took up weapons and were afraid to kill Vaman. Then, all the followers of Sri Maha Vishnu destroyed the Asura army. Bali saw it and stopped it. Due to the curse of the guru, I have to lose my wealth. The warrior did not retreat. This is not a good time for us. God is the one who is the cause of all pleasures and displeasures of beings. We cannot match his virility at all. For so long, he has been causing us happiness and sorrow to the gods. "We are the ones who conquer the Gods before. Now, God is favorable to them Therefore, wait until God is favorable. Hearing the words of Bali Chakravarti, the demons went to the netherworld. We'll find out what happened next on another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.