భగవంతుని ప్రధాన గుణావతారములు మరియు దివ్య లీలలు
The Scheduled Incarnations with Specific Functions
శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు భగవంతుని వివిధ అవతారముల దివ్య రహస్యాలను వివరిస్తారు. పురుష అవతారం నుండి నారద, వరాహ, నర-నారాయణ వరకు ప్రతి అవతారమూ సృష్టిలో ఒక నిర్దిష్ట ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరిస్తుందని తెలుపబడింది. భగవంతుని గుణాలు మరియు లీలలు కాలానికి అతీతంగా, సమస్త జీవుల మోక్షం కోసం ఆయన సంకల్పానుసారం ప్రకటితమవుతాయని ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తుంది.
In this sacred episode of Srimad Bhagavatham Canto 2, Shukadeva Maharshi reveals to King Parikshit the divine incarnations of the Supreme Lord, each appearing with a specific purpose to uphold cosmic order and bestow grace upon creation. From Purusha to Narada, from Varaha to Nara-Narayana, each form of the Lord carries a unique function in the grand design of existence. The episode also illuminates how the Lord's qualities and pastimes are not bound by time but unfold according to His eternal will for the liberation of all souls.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నమస్తే ఖిల యజ్ఞ తంతవే స్థితౌ గృహీతామల సత్వ మూర్తయే దిష్ట్యా హతోయం జగతామరుంతుదః త్వత్పాద భక్త్యా వయమీశ నిర్వృతాః ఓ ఈశ్వరా యజ్ఞములన్నింటినీ ప్రవర్తిల్ల చేయువాడవు నీవే. నీవు జగద్రక్షణ కొరకై రజస్తమో గుణముల దోషము లేని సత్వమయమగు అవతారములను దాల్చెదవు. నీకు అనేక నమస్కారములు. లోకములను లోకములకు పీడన కలుగజేసే ఈతడు దైవవశముచే సంహరించబడినాడు మేము నీ పాదములయందు భక్తిని చేసి సుఖమును పొందినాము. దేవతలు ప్రార్థించినారు. థర్డ్ క్యాంటో 19th చాప్టర్ 30th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధం తొమ్మిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనము సాత్విక అహంకారము, రాజస అహంకారము, తామస అహంకారము, బ్రహ్మ యొక్క సృష్టి, ఈ ప్రకృతి ఎలా ఏర్పడుతుంది? ఈ విషయాలని చాలా తెలుసుకున్నాం. ఇంతకుముందు వచ్చినటువంటి రెండు పాడ్కాస్ట్లు మీరు మళ్ళీ ఒకసారి వింటే మంచిది. ఆ విషయం చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ అర్థం చేసుకోవలసినటువంటిది. ఇక ముందు భాగం ఏమిటో తెలుసుకుందాం. ఈ మహాత్ముడు ఒక విరాట్ పురుషుని నాభి నుండి ఒక కమలం బయలువిడినది. ఆ కమలము తపోరూపమగు భగవానుని సంకల్పము. ఆ సంకల్పము నుండి నాలుగు ముఖములు గల నేను. అంటే చతుర్ముఖుడు బయలు విడిలితిని. అప్పుడు నాకు ఆ పురుషుని అవయవములు తప్ప వేరొక యజ్ఞ సాధనములు గోచరించలేదు. ఆ పరమ పురుషుని ఆరాధించుటకు పరమ పురుషుని కంటే వేరుగా సాధనములు లభింపలేదు. ఆ పరమ పురుషుని శరీర భాగములని యజ్ఞ సాధనములుగా చేసుకొని నేను భగవదారాధనమును చేసితిని. వృక్షములు అనగా వనస్పతులు, యూపము మొదలగు సాధనములాయను.
ఈ జగత్తే దేవ యజనము అనగా యాగ భూమి ఆయను. వసంతాది ఋతువులు కూడా పరమ పురుషుని శరీర భాగములే. అవి యజ్ఞమునకు తగిన కాలమాయెను, పురోడాశము మొదలగు వస్తువులు, ధాన్యము మొదలగు ఔషధులు, ఆజ్యము, రసములు, లోహములు, కపాలము మొదలగును అన్నియు. ఆ శరీర అవయవముల నుండే కల్పింపబడినవి. రుక్కులు, యజస్సులు, సామము అనేటి మంత్రములతో చేయబడి చాతుర్హోత్రము అహోరాత్రములాయెను. జ్యోతిష్ఠోమము మొదలు. యజ్ఞ నామ ధేయములు, స్వాహా మొదలగు మంత్రములు, పయోభక్షణం మొదలగు వ్రతములు, దేవతా క్రమము, కల్పము, ప్రయోగము, తంత్రము మొదలగునవి అన్నియు ఆ అవయవముల నుండియే ఏర్పడినవి. గతులు, దేవతా ధ్యానాదులు, శ్రద్ధ, ప్రాయశ్చిత్తము, సమర్పణము కూడా ఆ పురుషావయవములతో యజ్ఞ సంభారములన్నింటినీ సంపాదించి యజ్ఞ నియంతయగు విష్ణువును వాని అవయవములే యజ్ఞ సాధనముగా యజించితిని. మరీచి మొదలగు తొమ్మిది మంది ప్రజాపతులు సమాహితమైన మనస్సు కలవారై ఇంద్రుడు మొదలగు రూపములతో వ్యక్తమైన అవ్యక్తుడగు ఆ పరమ పురుషును యజించిరి. తరువాత కాలమునందు మనువులు, మిగిలిన ఋషువులు యజ్ఞమును ఆచరించిరి. పితరులు, విభుదులు, దైత్యులు, మనుష్యులు కూడా క్రతువులతో ఆ పరమ పురుషుని తరువాత కాలమున ఆరాధించుండిరి. ఆ నారాయణుడు సత్వము, రజస్సు, తమస్సు మొదల గుణములు లేనివాడు. జీవాత్ముల సమిష్టియగు చతుర్ముఖుడునగు నేను కూడా సత్వాది గుణముల సంబంధం లేనివాడని. సృష్టి ప్రారంభమునందు ఆ నారాయణునిచే నియమింపబడిన వాడనై నేను ప్రకృతి సంబంధము నొంది దానిచే సత్వాది గుణముల సంబంధం గలవాడనై సృష్టించుచున్నాను. అతని అధీనమందున్న రుద్రుడు ఈ విశ్వమును లయమొందించుచున్నాడు. ఆ నారాయణుడు తానే పురుష రూపమున ఉండి విశ్వమును కాపాడుచున్నాడు.
సృష్టి స్థితి సంహారములను మూడు శక్తులు గలవాడు నారాయణుడే కానీ బ్రహ్మనగు నాచే సృష్టిని రుద్రునిచే సంహారమును తానే అంతర్యామిగా ఉండి నియమించి చేయించుచు తాను స్వయముగా రక్షణ నిర్వహించుచున్నాడు. ఓ నారదా, నీవు నా స్వరూపమును తెలియక నేను పరుడననుకొని ప్రశ్నించితివి. కానీ ఈ చేతనా చేతనాత్మకము జగత్తంతయు భగవానుని కంటే భిన్నమగునది కాదు. అతడు ఆత్మగా ఉన్ననే. నిలిచి ఉండునది నాకు వాక్కు అసత్ నా వాక్కు అసత్యము కాదు నా మనస్సు తప్పు దారిని ప్రసరించదు నా ఇంద్రియములు అసత్యముగు విషయమును గ్రహింపవు దానికి కారణము నేను సర్వకాలముల యందు ప్రీతితో కూడిన హృదయములో శ్రీహరిని ధరించి ఉండుటయే నాకు కూడా జ్ఞానమును వసంగువాడు, నాచే కూడా ఎరుంగుటకు శక్యము కాని స్వరూపము స్వభావము కలవాడు అగు సర్వేశ్వరుడు వేరొకడు ఉన్నాడు. నేను వేదమయుడను, తపోమయుడను. అందుచే తపస్సు అందరికంటే అధికమైన వాడను. మరీచి మొదలగు ప్రజాపతులందరి చేతను నమస్కరింపబడు వాడును. వారికి కూడా నియామకుడను. ఆ హరి కృపచే లభించిన జ్ఞానము గలవాడనై సమాధిచే నిపుణముగా యోగమునభ్యసించియు మాయను తన వశమునందుంచుకొనిన ఆ పరమాత్మను ఎరుంగజాలను అట్టి శ్రీహరి యొక్క చరణమునే నేను నమస్కరించుచున్నాను. చరణాగతులకు సంసారము తొలగించునది శ్రీహరి చరణము. మంగళము ప్రసాదించినది ఈ చరణమే. అందరిచే సేవింపదగినది శ్రీహరి చరణమే. ఆకాశమునందే వాయువు ప్రసరించుచున్నను ఎట్లు సృజించుటకు వీలు కాకుండా ఉండునో. అట్లే శ్రీహరితో మాయ చేరి ఉన్నను వాని అంటలేకుండా ఉండును. నేను గాని మీరు గాని శంకరుడు గాని వాయుదేవుడు గాని ఆ పరమాత్మ యొక్క సత్యముకు స్వరూపమును ఎరుంగలేము. అనినచో ఇంకా ఇతర దేవతల సంగతి చెప్పవలెనా? దేవతలందరును అతని మాయచే మోహమునందిన బుద్ధి గలవారలే. అట్టివారు అతని మాయను ఎట్లతిక్రమించగలరు? అందరును అతని చేతనే గుర్తింపబడి మాయా వికారముగు శరీరమునే ఆత్మగా తలంచుందురు. తన ఆత్మని ఎరుంగలేని వారు పరమాత్మను ఎట్లు ఎరుంగగలరు?
ఆ భగవానుని అవతారములను అవతారములలో చేసిన లీలలను చతుర్ముఖుడనగు నేను ఇతర దేవతలు కూడా గానము చేయుచుందుము. కానీ మేము కూడా అతని వాస్తవమైన రూపమును ఎరుంగజాలము. అట్టి భగవానునకు నమస్కరించుచున్నాను. ఆ భగవానుని గుణములను చేష్టితములను కీర్తించుటయే మాయను తరించుటకు ఉపాయము. కర్మాధీనమగు జన్మలేని ఆ నారాయణుడే సకల విశ్వమునకు కారణమగు పరమ పురుషుడు. అతడే ప్రతి కల్పమునందు తానే తనయందే తన సంకల్పము చేతనే ఈ జగత్తును సృజించును పాలించును సంహరించును. అతడు చేయు ఈ జగత్ వ్యాపారమనడి కర్మ పుణ్య పాప రూపములగు కర్మలచే కలిగినది కాదు అతనికి ఈ సృష్టి వ్యాపారముచే. పుణ్యము, పాపము ఏర్పడవు. ఆ పరమాత్మ స్వరూపము తనంత తానే తనకు ప్రకాశించునది. అది పరాధీనమగు ప్రకాశము కలది కాదు. మరియొక దాని అపేక్ష లేకయే తాను తనంతగా నిలవగలిగినది. స్వరూపముచే ధర్మముచే వికారమునందనిది. అచేతనమగు ప్రకృతి స్వరూపముచే మార్పునందును. జీవుడు స్వభావముచే మార్పునందును. కానీ పరమాత్మ ఏ విధమగు మార్పునందడు? కోరబడెడి వస్తువులన్నిటినీ తాను ఎల్లప్పుడూ అతడు కలిగియుండును గాన కోరి పొందదగినదేదియు అతనికి పరిమితము కాదు. తనతో సమానుడు గాని అధికుడు గాని లేనిది ఓ నారదా. ఋషులు, జ్ఞానులు, ప్రశాంతమగు అంతఃకరణము, ఇంద్రియములు, వాసనలు కలవారలై పరిశోధించి ఈ పరమాత్మ తత్వము చేతనలగు జీవుల కంటే, అచేతనమగు ప్రకృతి కంటే ప్రత్యేకమైన స్వభావం గలదిగా ఎరింగిరి. యోగ్యమగు అజ్ఞానము అంతఃకరణము కలవారల ఊహలకు అందునే కానీ విశ్వాసము శ్రద్ధ లేని వారి హేతువాదములకు ఆ తత్వము అందదు. మరుగుపడును ఇంకా భగవానుని అవతారములను చెప్పెదని వినుము. అవతారముల విషయాన్ని మనం మరొక ప్రాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Gurus. Salutations, salutations to all the Yagnya Tantras. By your sight, the destroyer of the three enemies, the destroyer of the three enemies, is established. By devotion to your feet, O Lord, I am constantly engaged. Oh Lord, you are the one who makes all the Yagnyas happen. You assume incarnations that are without the faults of Rajas and Tamas, and are full of Sattva for the protection of the world. Many salutations to you. This one who causes suffering to the worlds, by the grace of God, has been destroyed. We have attained happiness by devotion at your feet. The gods prayed. Third Canto, Chapter 19, 30th Prayer. Devotees of the Lord, welcome to the second book of the Srimad Bhagavata Tattva Deepika, ninth podcast. Until now, we have discussed Sattvic ego, Rajasic ego, Tamasic ego, and how Brahma's creation, this nature, is formed. We learned a lot about these things. It's good if you listen to the two podcasts that came out earlier. That's something that needs a long think and understanding. Let's see what's next. This great man is one A lotus was born from the navel of Virat Purusha. That lotus is the will of the Lord, who is the embodiment of penance. I am the four-faced one from that intention. That means the four-faced one has left the field. Then, besides the male organs, I could not see any other means of sacrifice. To worship that Supreme Being, different means are not available than the Supreme Being. I have performed the worship of the Lord by making the parts of that Supreme Being as means of sacrifice. Trees, that is, plants, and instruments like the yupamu.
This world is the land of the gods, that is, the land of sacrifice. The seasons of Vasanta are also part of the body of the Supreme Being. Those were the things suitable for the Yagnya, including Purodashamu, medicines like grains, Agya, juices, metals, skulls, and all. They are made out of the body parts. The Rukkusu, Yajus, and Samam were performed with mantras, and the Chaturhotram became Ahoratra. Jyothishtoma mu. Yagnya Nama Dheyamulu, Swaha and other mantras, Payobhakshanam and other vrathamulu, Devata Kramamu, Kalpamu, Prayagamu, Tantramu and all such things are formed from those organs. Paths, divine meditations, devotion, atonement, and offering, also with those male organs, having acquired all the materials of the Yagnya, I have worshiped Vishnu, the lord of Yagnya, as the means of Yagnya, with his limbs. The nine Prajapatis, including Marichi, were united in mind and worshiped that Supreme Being, who was manifested with forms like Indra and others. In the later period, the men and the remaining sages performed the yajna. Great-grandfather, The Vibhus, the Daityas, and the humans also worshiped that Supreme Being with rituals in later times. That Narayana is without the three Gunas (qualities) of Sattva, Rajas and Tamas. I, being the collective of living beings, the four-faced one, am also unconnected to the qualities of goodness. In the beginning of creation, I, being appointed by that Narayana, having attained the nature, and being related to the qualities of goodness through it, am creating. The Rudra under his control is destroying this universe. That Narayana, being in the form of a man, protects the universe.
Narayana, who has three powers, is the creator, preserver, and destroyer of the universe, but he himself, being the inner controller, rules and causes the creation and destruction by Rudra, and he himself protects. Oh Narada, without knowing your form, you questioned me, saying I am a stranger. But this consciousness, this activity, the whole world is not different from the Lord. He is alive. That which remains, my speech is not untrue, my speech is not false. My mind does not spread the wrong path. My senses do not perceive the false thing. The reason for that is that I am in my heart filled with love for Sri Hari in all times It is by wearing that I also have the knowledge, the one who possesses it, There is another Lord, who is beyond my comprehension, with a form and nature that is impossible to describe. I am Vedamayudu, I am Tapomayudu. Therefore, penance is the greatest of all. He is the one who is worshiped by all the Prajapatis, including Mareechi. I'll make sure to include them in the appointment. Having attained the knowledge obtained by the grace of Hari, having become proficient in the Samadhi through Yoga I bow to the feet of that Srihari, who is the one who knows the supreme being who has taken Maya into his possession. The feet of Sri Hari are the ones that remove the worldly attachments of the charanagathas. This verse bestows auspiciousness. Sri Hari's feet are worthy of being served by everyone. Even though the air is spreading in the sky, how is it not possible to create it? Similarly, even though Maya is with Srihari, she remains without saying anything. Neither I, nor you, nor Shankar, nor Vayudeva, nor that Supreme Being, can understand the truth or the form of it. Shall I tell you about other gods? All the gods were deluded by his illusion, they were intelligent. How can those who are like that overcome his illusion? Everyone is recognized by him, and they consider the body, which is an illusion, as the soul. Those who cannot understand their own soul, how can they understand the Supreme Being?
I, the four-faced one, along with other gods, sing the plays performed by the incarnations of that Lord. But we also don't know his real form. I bow to such a God. It is by praising the virtues and actions of that God that one overcomes illusion. That Narayana, who is dependent on karma and is without birth, is the supreme being who is the cause of all the universe. He himself, in every creation, by his own will, creates, governs, and destroys this world. He does not do this worldly business because of the karma, the sin and virtue, the sin and virtue that are caused by karmas. This creation is not done by him. No more sin or guilt. That supreme being's form shines on its own. It is not one that is subject to influence. Without any expectation of another, he was able to stand on his own. It is said to be a distortion of the form and the nature of dharma. In the change of the unconscious nature of nature. The soul is in a state of change by nature. But what kind of change does the Supreme Being bring about? He always possesses all the things that are not asked for, therefore he desires Nothing is beyond his reach. He is not equal to him, nor is he superior, O Narada. Sages, wise men, with a calm inner self, senses, and fragrances, having investigated, this supreme soul's essence is more distinct than conscious beings, more than inanimate nature, having a unique nature. That which is worthy of ignorance, the inner self, is the imagination of those who have it, but that essence does not reach the rationality of those who have no faith or devotion. It is getting cold. Listen, I will tell you more incarnations of God. Let's learn about the incarnations in another podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.