భగవద్భక్తి యోగ సాధన - పరమ శ్రేష్ఠ నిరూపణ
Devotional Service & Glories of Bhakti-Yoga
శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, భక్తియోగం మోక్షప్రాప్తికి అత్యున్నత మార్గంగా శుకదేవ మహర్షి పరీక్షిన్మహారాజుకు ఉపదేశిస్తున్నారు. శ్రీహరి నామ స్మరణ, శ్రవణ, కీర్తనల ద్వారా చిత్తశుద్ధి కలిగి జన్మమృత్యు చక్రం నుండి విముక్తి లభిస్తుందని స్పష్టంగా నిరూపించబడింది. నిష్కల్మష భక్తిభావంతో భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించడమే సాధకుని పరమ కర్తవ్యమని ఈ ఎపిసోడ్ హృదయంగమంగా తెలియజేస్తుంది. భక్తియోగ సాధన సర్వులకు అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక మార్గమని ఈ ప్రవచనం మనకు ప్రేరణ కలిగిస్తుంది.
In this illuminating episode from Canto 2 of the Srimad Bhagavatham, the supreme glory of Bhakti-Yoga is revealed as the highest path to liberation and God-realization. Shukadeva Goswami instructs Maharaja Parikshit on how unwavering devotion to Lord Vishnu purifies the heart and frees the soul from the cycle of birth and death. The practice of hearing, chanting, and remembering the Lord's holy names and pastimes is established as the most accessible and powerful form of spiritual discipline for all seekers. This episode inspires us to anchor our minds in the lotus feet of the Supreme Lord through sincere and continuous devotional service.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మేఢుషే శివాయ న్యస్త దండాయ ధృత దండాయ మన్యవే మహాదేవుడు దుష్టులకు భయంకరుడై కోపమూర్తియే శిక్షను విధించువాడు సత్పురుషుల విషయంలో దండించవలెననే భావనను సైతము దూరంగా పెట్టి వారికి కోరికలను వర్షించువాడు మంగళ స్వరూపుడగు రుద్రునకు నమస్కారము. థర్డ్ క్యాంటో 14th చాప్టర్ 35th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధము ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం మనం భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించే వారికి జరిగేటువంటి ఫలాన్ని భక్తి భావం ఎలా ఉండాలో మనకు శుక్లవారు. చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. భగవత్భక్తియే ప్రధానమనియు హరికథల యందు ఆసక్తి కలుగుటయే ముఖ్యమనియు చెప్పాను. శ్రీకృష్ణుడు శ్రీ శుఖుడు చెప్పగా విని ఉత్తర కుమారుడగు పరీక్షిత్తు శ్రీకృష్ణుని యందు తన మనసును పరిపూర్ణముగా లగ్నము చేసెను. తన శరీరమునందు గాని భార్య యందు గాని బిడ్డల యందు గాని ఇంటి యందు గాని ధనమునందు గాని బంధువుల యందు గాని పరిపూర్ణమగు తన రాజ్యమునందు గాని మమతను ఇవి నాకు చెందినవి అని భావమును పూర్తిగా వదలవలెను. మీరు ఇప్పుడు అడిగినట్లే హరికథను గూర్చియే ప్రశ్నించెను. శ్రీకృష్ణ లీలలను వినవలెనని శ్రద్ధ గలవాడయెను. మృత్యువు సమీపించెనని ఎరిగినవాడై ధర్మార్థ కామములను సాధించెడి కర్మలను అన్నిటినీ విడిచి. భగవానుడగు వాసుదేవుడు తనకు ఆత్మ అని దృఢముగా ఎరింగి యుండెను. అట్లు ఉన్న పరీక్షిత్తు శ్రీ శుక్ల వారు చెప్పిన వచనములను విని దేవా మీరు సర్వజ్ఞులు. మీరు చెప్పుచున్న హరికథల వలన నాలోని అజ్ఞానం విచ్చిపోవుచున్నది.
కానీ ఒక ప్రశ్న అడుగుచున్నాను చెప్పవలెను. బ్రహ్మాది దేవతలు కూడా ఊహింపనలవి గాని ఈ విశ్వమును భగవానుడు తన సంకల్పం మాత్రముచే ఎట్లు సృష్టించుచున్నాడు? ఎట్లు రక్షించుచున్నాడు? ఎట్లు లయమనుచున్నాడు? తన శరీరముగా నందు నుండు బ్రహ్మ రుద్రుడు మొదలగు వారితో తాను చేరి స్వయముగా క్రీడించుచు ఎట్లు జగత్ వ్యాపారమును సాగించుచున్నాడు. శ్రీహరి చేష్టితములు అద్భుతములు జ్ఞానాదికులు కూడా గుర్తింపనలివి గానిగా గోచరించుచున్నవి. తాను ఒక్కడే అనేక అవతారములచే అనేక కర్మలను చేయుచున్నాడు. అప్పుడు ఈ ప్రకృతి యొక్క ఈ సత్వరజస్తమో గుణములను ఒక్కసారిగా కలిగిన వాడే ఉన్నాడా లేక క్రమముగా కలిగిన వాడై ఉన్నాడా? ఈ జగత్తును రక్షించునప్పుడు స్వయముగా తానే అవతరించి రక్షించునా లేక అంతర్యామిగా ఉండి రక్షించునా? సంహరించినప్పుడు తానే స్వయంగా సంహరించునా లేదా ఒక జీవినిలో అంతర్యామిగా ఉండి సంహరించునా? భగవానుని అవతారములోని శరీరములు. సప్తరజస్తమో గుణములు మూడును కలిగి ఉండునా లేదా ఏదో ఒక గుణమును కలిగి ఉండునా లేక ఈ ప్రకృతి కంటే వేరైన ప్రకృతిచే ఏర్పడినవా? నాకు కలిగిన ఈ సందేహమును మీరే తీర్చగలరు. సమస్త శాస్త్రార్థములను ఎరింగిన వారు పరబ్రహ్మ విషయకము జ్ఞానమును యోగముచే సాధించిన వారు కావున నా సందేహమును తీర్చవలెనని ప్రార్థించుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా శ్రీ హరి గుణకీర్తనమును ఆరంభించుటకు ముందు ఋషికేశుని స్మరించుకొని శ్రీ శుక్ల వారు చెప్పడానికి ప్రారంభించారు. భగవాను లీలలను వర్ణించుటకు ముందుగా శ్రీ శుక్ల వారు మంగళాచరణమును చేయుచున్నారు. ఈ ప్రకృతి పురుషుల కంటే వేరైన పరమ పురుషునకు నమస్కారము. స్వభావముచే అన్నిటికీ లోన వెలుపల వ్యాపించి ఉన్న పరమ పురుషునకు నమస్కారము. ఈ ప్రపంచమును సృష్టించుటకు, రక్షించుటకు, సంహరించుటకు లీలగా హిరణ్యగర్భుడు, శంకరుడు అను రెండు రూపములతో నుండు రెండు జీవశక్తులను తన శరీరముగా స్వీకరించి
విష్ణువు అను పేరుతో స్వయముగా తాను వారి మధ్య ఉండి సృష్టి స్థితి లయములను చేయు పరమ పురుషునకు నమస్కారము. సకల ఆత్మలకు లోన వ్యాపించి నియమించు ఆత్మ అయిన పరమ పురుషుడునకు నమస్కారము. ప్రాకృతములగు ఇంద్రియములచే గుర్తింప వీలుకాని వాడై ఉపాసన అనేటి జ్ఞానము చేతని ఎరుంగదగిన స్వరూపము రూపము గల పరమ పురుషునకు నమస్కారము. సత్పురుషుల పాపములను అంతమొద్దించువాడు, అసత్పురుషులను నశింపచేయువాడు, పూర్ణము సత్వమే ప్రధానముగా గల మూర్తి గలవాడు, పరమహంసలకు సంబంధించిన సన్యాసాశ్రమమున ఉండెడి ముముక్షువులకు పొందగోరిన దానిని వసంగెడివాడు అగు పరమపురుషునకు నమస్కారము. ఇట్లు దుర్లభుడగు పరమపురుషుడు సులభుడై ఆశ్రితులందరి వాత్సల్యముచే సాత్వతులగు యదువంశును అవతరించినాడు. ఇట్లు సులభుడై ఉండియు భగవత్ భక్తి లేని కుయోగులకు అందని వాడై దూరముగా ఉండును. తేజస్సుచే తనతో సమానులు గాని అధికులు గాని లేని వాడై తన మహిమ యందు తాను ప్రతిష్ఠితుడై ఉండును. అట్టి పరమ పురుషునకు నమస్కారము. ఇట్టి భగవంతుని నామములను గుణములను కీర్తించుట, స్మరించుట, దర్శించుట, పూజించుట, వినుట ఎవరు చేయుదురో అట్టి వారి పాపం వెంటనే చిమ్మివేయబడును. అట్టి మంగళకరమగు కీర్తి గల పరమపురుషునకు నమస్కారము. పరమపురుషుని చరణారవిందములను భజించుట వలన మనస్సునకు లౌకిక విషయములపై నుండు సంఘము పరలోక సుఖముల యందు ఉండు కోరిక కూడా వీడిపోవును. ఆధ్యాత్మికము ఆదిభౌతికము ఆదిదైవికమగు క్లేశములు తొలగిపోవును చివరకు బ్రహ్మ ప్రాప్తి లభించును అట్టి మంగళకరమగు కీర్తి గలవానికి నమస్కారము భక్తి లేని వారలై చాంద్రాయణాది తపస్సులు చేసినను సదాచారములు పాటించినను మనోనిగ్రహం గలవారైనను మంత్ర జపములు చేసిన వారైనను క్షేమమును పొందరు. భగవానుని ఆరాధనగా వానిని భగవానునకు అర్పించిన వాడే అవి క్షేమమును కలిగించును. అట్టి మంగళకరములగు కీర్తి గల పరమ పురుషునకు నమస్కారము.
భగవానుడు సేవించడి వారు హీన జాతులలో జన్మించిన కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కసులు, అభీరులు, కుంకులు, యవనుల హస హసజాతి వారు అయినను శుద్ధిని పొందుదురు. వారికి జాతి చేత గాని ఆచరణ చేత గాని శుద్ధి లేకపోయినను భగవంతుని సేవించిన భక్తులను సేవించుట మాత్రము చేతనే సర్వ ఫలపదుడగు పరమ పురుషుడు వారికి శుద్ధిని కల్పింపగలడు. అట్టి పరమ పురుషునకు నమస్కారము. అట్టి పరమ పురుషుడు యోగాభ్యాసము చేసి ఆత్మ దర్శనము చేసిన యోగులకు ఆత్మ అయి ఉండును. అతడే వారి యోగమునకు ఫలమునిచ్చువాడు. వేదములో చెప్పబడిన కర్మలచే ఆరాధింపబడి ఫలమునిచ్చువాడు అతడే. స్మృతులలో చెప్పబడిన దానము మొదలగు ధర్మములచే ఆరాధింపబడి ఫలమును వసుంగువాడు కూడా అతడే. ఉపనిషత్తులలో చెప్పబడిన ఉపాసనాత్మకమగు జ్ఞానముచే ఎరింగిన వారికి మోక్షమును వసంగువాడు కూడా అతడే. బ్రహ్మ రుద్రాదులచే ఇట్టి వాడను నిశ్చయించుటకు శక్యముగాని లక్షణములు కలవాడు ఆ పరమ పురుషుడు. అట్టి భగవానుడు అనుగ్రహింపుగాక. పరమ పురుషుడే శ్రీపతి, అతడే యజ్ఞపతి, సకల ప్రాణికోటికి పాలకుడు, ధ్యానము చేయు వారి ధ్యానములను నెరవేర్చువాడు అతడే, సమస్త భువనములకు ఆ లోకములలో ఉన్నవారికి కూడా అధిపతి అతడే. భూలోకమునకు పాలకుడు అతడే. లోకములో రామకృష్ణాది రూపములతో అవతరించి దుర్మార్గులను అంతమొందించి సాధువులను ధర్మమును కాపాడినవాడు అతడే. అట్టి భగవానుడు నన్ను అనుగ్రహించు గాక. ఎవరి పాద పద్మ ధ్యానముచే పరిశుద్ధమైన బుద్ధితో జ్ఞానులు ఆత్మతత్వమును ఎరుంగుచున్నారో, తమకు అందినంతవరకు ఇతరులకు ఉపదేశించుచున్నారో అట్టి భగవానుడగు ముకుందుడు. నన్ను అనుగ్రహించుగాక. కల్పారంభమునందు బ్రహ్మకు సృష్టి చేయుటకు తగిన స్మరణమును ఏ భగవానుడు కలిగించినాడో, ఎవని ప్రేరణచే వేద రూపముగా వాణి ఆ బ్రహ్మ ముఖము నుండి ఆవిర్భవించినదో, అట్టి జ్ఞానప్రదుడగు భగవానుడు నన్ను అనుగ్రహించుగాక. ఏ భగవానుడు మహత్తత్వం మొదలు పృథ్వి వరకు గల తత్వములను సృజించి వానిచే ఈ శరీరమును నిర్మించి ఆ శరీరములను జీవులలో వ్యాపించి శయనించుచున్నాడో ఆ జీవులలో నుండి ఇంద్రేయ వ్యాపారములను
మనో వ్యాపారములను పంచభూతముల యొక్క గుణములను స్వయముగా లీలగా అనుభవించుచున్నాడో అట్టి సర్వాంతరాత్మ యొగు భగవానుడు నా వాక్కులచే ప్రతిపాదింపబడిన వాడై నా వాక్కులను అంగీకరించుగాక. ఇట్లు శుకుడు భగవానుని నమస్కరించి తన గురువగు తండ్రి గురువును తండ్రియునగు వ్యాసుని నమస్కరించుచున్నాడు వాసుదేవ భగవానుని భగవానుని అవతారమగు సర్వయజ్ఞమయుడునగు వ్యాస భగవానులకు నమస్కారము. అతని ముఖపద్మము నుండి స్రవించిన జ్ఞానమయమగు మకరందమును సౌమ్యులగు వారి శిష్యులు పానము చేసి జ్ఞానము కలవారైరి. ఓ పరీక్షిణ మహారాజా ఇప్పుడు నీవు నన్ను అడిగిన ప్రశ్నలని నారదుడు వేదగర్భుడగు చతుర్ముఖుని అడిగెను. అతడు దానికి సమాధానముగా ఏమి చెప్పెనో దానినిగు ఇప్పుడు ఎరింగించెదను. చతుర్ముఖుడు నారదుడికి ఏమి సమాధానం ఇచ్చారో మనం దాన్ని తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Rudra, the great God of gods, to Shiva, the one who holds the staff, the one who holds the staff, and the one who is the destroyer of the wicked. In the matter of good people, one should punish, even if it is to be a form of anger He who keeps the thought away and showers them with desires, salutations to Rudra, who is the auspicious form. Third Canto, Fourteenth Chapter, Thirty-fifth Prayer. Devotees of God, welcome to the second book of the Srimad Bhagavata Tattva Deepika, fifth podcast. Previously, Shukla told us how devotion should be towards the fruit that happens to those who utter the name of God. We are learning from what has been said. I said that devotion to God is primary and interest in Harikatha is important. Srikrishna, Sri Sukudu, having heard, the eldest son Parikshitta, completely fixed his mind on Srikrishna. In his body, or in his wife, or in his children, or in his house, or in his wealth, or in his relatives, in his kingdom, which is complete But, the feeling that these are mine, should be completely abandoned. You just asked a question about Harikatha. He was devoted to listening to the stories of Lord Krishna. Having known that death is near, having abandoned all actions that seek to fulfill dharma, wealth, and desire. Vasudeva, the Lord, firmly believed that he was his own self. Having been like that, Parikshit, hearing the words spoken by Sri Shukla, O God, you are omniscient. Because of the Harikatha you are doing, the ignorance in me is fading away.
But I have a question to ask. Even the Brahma and other gods cannot imagine how the Lord creates this universe merely by His will. How is he protecting himself? How is the rhythm? He, being in his body, along with Brahma, Rudra, and others, joins them and, playing himself, how he is carrying out the worldly affairs. The acts of Srihari are wonderful, even more so than the knowledge and other things that are not recognized. He alone, through many incarnations, performs many actions. Then, is there anyone who has all these qualities of nature, namely Sattva, Rajas, and Tamas, all at once, or is there someone who has them in a gradual manner? When protecting this world, will he himself incarnate and protect, or will he protect by being the inner controller? When destroyed, does it destroy itself or does it destroy itself while remaining as an intrinsic part of a living being? The bodies of the Divine are in turn the vehicles of the Divine. Does it possess all three qualities of the Saptarajastamo, or does it possess only one of them, or is it formed by a nature different from this nature? You are the only person who can clear my confusion. Those who have understood all the scriptures are not those who have attained knowledge about the Supreme Brahman through yoga, therefore, I am praying to resolve my doubt, when Parikshit asked, before Sri Hari starts the Gunakirtanam Remembering Rishikesh, Sri Shukla began to speak. Before describing the divine plays of the Lord, Sri Shukla is performing the auspicious rites. Salutations to the Supreme Being, who is distinct from the material creation and yet is identical with it. Salutations to the Supreme Being, who is inherently within and pervading all things. To create this world, to protect it, to destroy it, playfully, Hiranyagarbha, Shankara, with two forms, two life forces, accepting them as his body
Salutations to the Supreme Being who is self-existent and exists among them, bearing the names of Vishnu. Salutations to the Supreme Being, the soul that pervades and governs all souls. Salutations to the Supreme Being, who is beyond the reach of the senses and cannot be recognized by them, but is known through the knowledge of worship, and who has a form and appearance. He who destroys the sins of the virtuous, he who destroys the wicked, he who is the embodiment of complete goodness Salutations to the Supreme Being, who is the one who resides in the hermitage of the Paramahamsas, the seeker of liberation, who is the one who has obtained what is desired. Thus, the supreme being, who is rare, became easy and, through the affection of all his devotees, incarnated as the Sattvic Yadava dynasty. Thus, being simple, he remains distant, unreachable to those who are not devoted to God. He, who is equal to or superior to the radiance, is established in his glory. Salutations to that Supreme Being. Singing, remembering, seeing, and worshipping the names and virtues of such a God Those who listen, their sins will be immediately erased. Salutations to the Supreme Being, who is auspicious and has glorious fame. By worshiping the lotus feet of the Supreme Being, the association of worldly matters in the mind and the desire to be in the pleasures of the afterlife will also be abandoned. Spiritual, physical, and divine sufferings will be removed, and ultimately, Brahma Prapti (realization of Brahman) will be attained. Salutations to such auspicious and glorious one. Even if one is without devotion, even if one performs penance like Chandrayana, even if one follows good conduct Even those with self-control and those who chant mantras will not attain salvation. The one who offers him to the Lord as worship of the Lord, he will cause well-being. Salutations to the supreme being who has such auspicious fame.
Those who serve the Lord, even though they are Kiratas, Hunas, Andhras, Pulindas, Pulkas, Abhiras, Kunkkus, and Yavanas, who are of the Hassa Hassajati caste, will attain purity. Even if they do not have purity by caste or practice, only by serving the devotees who serve God, the Supreme Being, who is the giver of all fruits, can purify them. Salutations to that Supreme Being. Such a supreme being, having practiced yoga and attained self-realization, is the self for those yogis. He is the one who gives the fruit of their yoga. He is the one who is worshiped by the karmas mentioned in the Vedas and gives the fruits. He is also the one who receives the fruit by worshiping the charity and other dharmas mentioned in the Smritis. He is the one who grants salvation to those who are enlightened by the knowledge that is said in the Upanishads. The supreme being is one who has the qualities that are impossible to determine, such as being able to decide on such a use by Brahma, Rudra, and others. May it be an act of grace from the Lord. The supreme being is Sripati, he is the sacrificer, the ruler of all living beings, those who meditate He is the one who fulfills the meditations, He is the ruler of all the worlds, of those who are in those worlds. He is the ruler of the earthly realm. In the world, he incarnated with forms like Ramakrishna and others, destroyed the wicked, protected the saints, and upheld dharma. May God bless me with such a God. Those wise men, with a pure mind, meditating on the lotus feet of whom, are understanding the essence of the soul, and are preaching to others as much as they have been given. Such is the Lord Mukunda. May grace be upon you. May that Lord, who gave Brahma the appropriate remembrance to create at the beginning of creation, and by whose inspiration the Vedas emerged from the mouth of Brahma, may that enlightened Lord bestow grace upon me. Which God, starting from the greatness, created the elements up to the earth, and by Him, this body is built, and those bodies are spread in the living beings, and from those living beings, the sensory activities
He who is experiencing the qualities of the five elements in his mind and business playfully, such an all-pervading soul, the Lord, being propounded by my words, may accept my words. Thus, Shuka, after saluting the Lord, is saluting his guru, Vyasa, who is his father and also his father. Salutations to Vyasa, the incarnation of Vasudeva Bhagavan, the all-knowing one. The knowledge-filled nectar that flowed from his lotus-like face was drunk by the gentle disciples, and they became knowledgeable. Oh, King Parikshit, now Narada asked Chaturmukha, the Vedagarbha, about the questions you asked me. I will now reveal what he said in response to that. We will learn what the four-faced one gave as an answer to Narada in the next podcast. Jai Srimannarayana and salutations to the Ashram Guru.