ప్రకృతి గుణముల సృష్టి - మహత్తత్వ వికాస వృత్తాంతము

Creation of Material Elements & Manifestation of Mahat-Tattva

bhagavatam

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, పరమాత్మ యొక్క మాయాశక్తి సత్త్వ, రజస్, తమో గుణముల ద్వారా సృష్టిని ఏ విధంగా ప్రారంభిస్తుందో శుకదేవ మహర్షి వివరిస్తున్నారు. అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్వము ఉద్భవించి, తదుపరి అహంకారము మరియు పంచతన్మాత్రలు ఏర్పడే క్రమము అత్యంత గంభీరంగా విశదీకరించబడింది. ఈ సమస్త సృష్టి వ్యవహారము భగవాన్ శ్రీ విష్ణువు యొక్క దివ్య సంకల్పము వలన జరుగుతున్నప్పటికీ, ఆయన దాని చేత ఎన్నడూ బంధింపబడడని మనము గ్రహించగలము.

In this sacred episode from Canto 2 of the Srimad Bhagavatham, we explore the profound cosmic process by which the Lord's material energy unfolds through the three modes of nature — goodness, passion, and ignorance. Shukadeva Goswami reveals how the Mahat-Tattva, the total material energy, first manifests from the unmanifest prakriti under the glance of the Supreme Purusha, giving rise to the false ego and the five subtle elements. We come to understand how this intricate hierarchy of creation reflects the supreme intelligence and will of Bhagavan Sri Vishnu, who remains ever untouched by the very creation He sets in motion.

← Prev Next →
Creation of Material Elements & Manifestation of Mahat-Tattva bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తంత్వానుభూత్యోపరత క్రియార్ధం స్వమాయయావర్తిత లోకతంత్రం నమామ్య భీక్షణం నమనీయ పాద సరోజ మల్పీయసి కామ వర్షం నీవు నిష్క్రియ పరబ్రహ్మ స్వరూపుడవు నీకు కర్మల యందు గాని వాటి ఫలము యందు గాని అపేక్ష లేదు అయినను నీవు నీ మాయా శక్తిచే లోక వ్యవహారమును నడిపించుచున్నావు. నీ పాద పద్మములు నమస్కరించదగినవి. నీవు అలుపుడగు నా వంటి భక్తుడు చేసే చిన్న ఆరాధనకైనను కోరికలను వర్షించదవు. అట్టి నీకు పలుమాలు నమస్కరించుచున్నాను. థర్డ్ క్యాంటో 21స్ట్ చాప్టర్ 21స్ట్ ప్రేయర్. భగవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధం 10వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు భగవంతుని యొక్క స్వరూపాన్ని ప్రకృతి, అహంకారాలు వివరాలన్నీ కూడాను మనం తెలుసుకున్నాం. ఇంకా భగవాను యొక్క అవతారాలు చెప్పెదనని. ఆసన్నమయ్యారు. ముందు భాగాన్ని తెలుసుకుందాం. విష్ణువు యొక్క మొదటి అవతారమే విరాట్ పురుషుడు. కాలము, స్వభావము, చేతనాచేతనములు, స్థూలావస్థలో, సూక్ష్మావస్థలోనున్న పృథ్వ్యాది వికారములు, సత్వాది గుణములు, ఇంద్రియములు, అంతరిక్షము, ఈ లోకమునందలి స్థావర జంగములు అతని విభూతులే. సృష్టి చేయు నేను రుద్రుడు, యజ్ఞము, ప్రజాపతులు, నారదులు మొదలగు ఋషులు, లోకపాలకులు, దేవ మనుష్య పక్షి వృక్షాదులు, పాతాళాధిపతులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు వాని అధిపతులు. యక్షరక్షో గణముల ప్రభువులు, నాగలోకాధిపతులు, ఋషిశ్రేష్టులు, పితృ దేవతలు, దైత్యులు, సిద్ధులు, దానవులు, వారి అధిపతులు. ప్రేత పిశాచ భూతములు వాని అధిపతులు, ఆయా క్షుద్ర దేవతలు, జలచరములు, మృగములు వాని అధిపతులు కూడా అతని విభూతి అయి ఉన్నవి.

అనగా అతనిచే నియమింపబడుచున్నవి లోకములో ఐశ్వర్యము గలవి తేజస్సు గలవి ధారణ సామర్థ్యము గలవి శ్రీ హ్రీ అంటే లజ్జ లోకములో అందరి చేత నియమింపబడు వర్గమంతయు ఆ పరమ పురుషుని విభూతియే బుద్ధి ఆశ్చర్యమని చెప్పబడునవి ఆ విరాట్ పురుషుని విభూతియే అనగా అతనిచే నియమింపబడునవే ఇట్లు విశ్వమునందు గల సకల పదార్థములను సకల భావములను తన రూపముగా గల విరాట్ పురుషుడు ఆ భగవానుని మొదటి అవతారము. ఆ పరమ పురుషుని లీలావతారములుగా ప్రధానముగా కొన్నిటిని పెద్దలు పేర్కొందురు. వానిని విన్నచో చెడు కథలను వినుటచే చెవుల కంటిన దోషములు తొలగిపోవును. ఇవి పరమ పవిత్రములు, ఇవి పరమ సుందరములు. వానిని పానము చేయుటయే కర్తవ్యమని అవతారము వృత్తాంతమును బ్రహ్మ నారదునకు చెప్పుచున్నాడు. నారదునకు బ్రహ్మ విరాట్ పురుషుని వర్ణించి పిమ్మట ఆయా అవతారములు ఎందుకు వచ్చినవో ఏ కార్యములను చేసినవో వానిలో ప్రధానమైన గుణములేవో చెప్పుచున్నాడు. ఒకనాడు భూమి మహార్ణవములో మునిగిపోయెను. దానిని వెలుగుతీయుటకు సమస్త యజ్ఞములను అవయవములుగా కలిగిన వరాహ రూపమును స్వామి స్వీకరించెను. భగవానుడు ఇట్టిదని చెప్పుటకు శక్యముగాని స్వరూపము స్వభావము కలవాడు. భూమిని ఎత్తుటకు సముద్రములో వరాహ రూపమున ప్రవేశించి అచ్చట తనతో తలపడిన దితి పెద్ద కొడుకగు హిరణ్యాక్షుని ఇంద్రుడు పర్వతములను ఛేదించినట్లు చీల్చి వేయెను. తరువాత రుచి అను ప్రజాపతి. భార్య ఏగు అకూతి అను ఆమె యందు సుయజ్ఞుడగు కుమారుడుగా భగవానుడు జనియించెను. ఆ సుయజ్ఞునకు యములను గుణములతో కూడిన యమములను గుణములతో కూడిన యాములు అని పేరు గల 12 మంది దేవతలు దక్షిణ అను భార్య యందు జన్మించిరి. ఆ దక్షిణ కుమారులకు దేవతలలో కలిగిన ఆర్తిని తొలగించుటకు హరి అను పేరు గలవాడై భగవానుడు అవతరించెను. స్వయంభువ మనువు ఇతనిని హరి అని పిలిచెను. దేవతలు ఆర్తిని హరించినవాడు కనుక అతనిని హరి అని వ్యవహరించిరి. కర్దమ ప్రజాపతి ఇంట అతని భార్య దేవహుతి యందు తొమ్మిది గురు తోబుట్టువులతో కూడా కపిలుడుగా జన్మించెను.

ఆ కపిలుడే తన తల్లియగు దేవహూతికి ఆత్మజ్ఞానము మోక్షమార్గమును ఉపదేశించెను. ఆ జ్ఞానముచే ఆమె ఆత్మను మలినపరుచు దేహ సంబంధముచే కలిగిన గుణత్రేయ సంపర్కమనడి మాలిన్యమును వీడి. కపిలుడు చెప్పినట్లు మోక్షమును పొందెను. భగవానుడు సంతానము కావలెనని కోరిన అత్రి మహర్షికి అతని తపస్సుచే సంతుష్టి చెంది. పరమ పురుషుడగు నన్నే నీకు కుమారుడిగా వసంగుచున్నానని వసంగినాడు. ఇట్లు స్వయముగా భగవానుడే దత్తుడు అగుడచే అతని పేరు దత్తుడు ఆయను. అత్రి కుమారుడు కనుక ఆత్రేయుడు అతడే దత్తాత్రేయుడు. ఆ దత్తరాత్రేయుని పాద పద్మ పరాగముచే పవిత్రమైన హైహయ్యుడు మొదలగు రాజులు అణిమాద్య అష్టైశ్వర్యములను ముక్తిని కూడా పొందిరి. ఇట్లు ఐహిక ఆముష్మిక యోగ సంపదను అనుగ్రహించిన వారు దత్తాత్రేయుడు. వెనుక నేను బ్రహ్మలోకములన్నింటినీ సృష్టించగల శక్తిని పొందుటకై తపస్సును చేసితిని. బ్రహ్మ చెప్తున్నాడన్నమాట. ఆ తపస్సునకు సంతుష్టినంది ఆ హరి సన అను శబ్దము మొదట గల నలుగు కుమారులుగా నా నుండి జన్మించెను. వారే సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు. ఆ రూపముగా జన్మించిన ఆ కుమారులే వెనక కల్పము చివర ప్రళయములో నశించిన సంప్రదాయము కలిగిన ఆత్మ తత్వమును ఈ కల్పములో ప్రవర్తింపచేసిరి. మునులు వారి చెప్పిన మార్గములచే ఆత్మ తత్వమును దర్శించిరి. ధర్ముడు అని వానికి దక్ష ప్రజాపతి కుమార్తెయగు మూర్తి అను నామ యందు నారాయణుడు నరుడు అను రెండు రూపములతో శ్రీహరి జన్మించెను. ఆ అవతారములు అత్యధికముగు తప ఫలమును కలవి. వారి తపస్సును భంగము చేయవలెనని మన్మధుడు వాని పరివారము అప్సరసలు కూడా ప్రయత్నించి భంగపరచలేక భంగపడిరి. లోకంలో వృద్ధుడు మొదలు కొందరు రోషముతో కూడిన కంటి నుండి విడలిన అగ్నిచే కామమును దహింతురు. కానీ వారు త మనస్సును దహించు.

సహించుటకు శక్యముగాని రోషమును దహింపలేరైరి. కామమును దహించిన వారైనను రోషమునకు వశమగుచుందురు. కానీ ఆ రోషము భగవానుడగు నారాయణుని మనసున ప్రవేశించుటకు కూడా భయపడుచుండును. కామమును దహించిన రోషమే వాని మనస్సు చేరుటకు భయపడినప్పుడు ఆ హరి మనస్సున కామము చేరుటకు అవకాశం లేదు కదా? పరమశివుడు కామమును మాత్రము జయించినవాడు కానీ నారాయణుడు కామమును ఆ కామమును జయించిన రోషమును కూడా జయించినవాడు. ఉత్తానపాదుడను రాజునకు ధ్రువుడు అను కుమారుడు జన్మించెను. ఆ ధ్రువుని అనుగ్రహించుటకు శ్రీహరి అవతరించెను. సద్ తల్లి అయిన సురుచి మాటలే ములుకులుగా మనసును గాయపరచగా బాలుడు అయి ఉండియు ధ్రువుడు తపస్సు చేయుటకు వనమునకేగినాడు. అట్టి తపస్సునకు మెచ్చి ప్రసన్నుడగు శ్రీహరి ప్రత్యక్షమై అతనిచే స్తుతింపబడి అతనికి ధ్రువముగు స్థానమును సంగినాడు. ఆ ధ్రువము యొక్క పైనున్న ఋషులు క్రిందనున్న ఋషులు కూడా ఆ ధ్రువపదం యొక్క ప్రభావమును ప్రశంసించుచుందురు. పూర్వము వేణుడు అను రాజు మర్యాదను ఉల్లంఘించి ప్రవర్తించుటచే బ్రాహ్మణులు శాపముచే అతని పౌరుషమును ఐశ్వర్యమును దహించి వైచిరి. అట్టి తండ్రిని నరకములో పడకుండా రక్షించుటకై అతని పుత్రుడుగా పృధువు అని పేరుతో భగవానుడు అవతరించెను. అతడే భూమిని గోవుగా మార్చి ఈ భూమిపై నుండి సమస్త పదార్థములను పిండెను. పృథ్విచే కల్పింపబడినది కనుకని ఈ భూమికి పృథ్వి అని పేరు వచ్చెను. నాభి అనువానికి వృషభుడు అను పేరుతో శ్రీహరి స్వయముగా తానే కుమారుడుగా జన్మించెను. కపిలావతారం వలె వృషభావతారము కూడా భగవత్ అంశచే వచ్చిన అవతారం. ఈ వృషభుడు నాభికి మేరుదేవికి అంటే సుదేవికి జన్మించిన కుమారుడు. అతడే జడుని వలె యోగాభ్యాసము చేసెను. అతడు సర్వ పదార్థములు భగవతాత్మకముగా దర్శించిన వాడగుటచే తన మహిమలందు తానే ప్రతిష్టితుడై ఉండెను. కానీ వేరొక దానియందు ఆధారపడి ఉండడివాడు కాడు. ఇంద్రియ వ్యాపారములు ప్రశాంతములకుటచే శబ్దాది విషయములందు సంఘము లేనివాడై ఉండెను.

భగవానుడు సాక్షాత్తుగా నేను సత్రయాగం చేసినప్పుడు ఆ యాగములో హయగ్రీవుడుగా ఆవిర్భవించెను. అతని శరీర ఛాయ బంగారమును పోలి ఉండెను. అతడు వేదమయుడు. అఖిల దేవతలకు అతడు ఆత్మయై ఉండెను. అతను నిట్టూర్పు నాసిక నుండి వెడలినప్పుడు అదియే పరిశుద్ధముగా వేదముగా ఆవిర్భవించెను. అతడు వేదములను ప్రవర్తింపచేసినవాడు, వేద విహిత కర్మలచే ఆరాధింపబడువాడు, యజ్ఞములచే ఆరాధింపబడు దేవతలకు ఆత్మ అయినవాడు కూడా. హయగ్రీవుడే ప్రళయకాలమందు వైవస్త మనువుచే దర్శింపబడిన మత్స్యమూర్తి ఐ రాబో సృష్టికి ఉపయోగించు ద్రవ్యములను నిలుపుటకు భూమిని నిలిపినాడు. అతడే సమస్త జీవ సమూహములకు నిలయమైనవాడు. ఒకనాడు ముఖము నుండి జారిన వేదములను మరల తెచ్చి నాకు ఉసంగినాడు. వేద మార్గములను ప్రవర్తింపచేసినాడు. ఇంకొక అవతారం. అమృతం కొరకు దేవదానవులు క్షీర సముద్రమును మధించుండగా ఆ మందరమును కదిలించకుండా నిలుపుటకు భగవానుడు కూర్మ రూపమును ధరించి దానిని తన వీప్పై నిలిపెను. ఆ మందర పర్వతము అతని వీప్పై తిరుగుచు రాపాడుచుండగా కూర్మరూపియగు భగవానుడు సుఖముగా నిద్రించినాడట. ఆ పర్వతం యొక్క రాపిడిచే వీపు దురద తీరినదట. అంతటి పర్వతమును మోయుట అతనికి క్లేశజనకం కాదని దీనిచే తెలియుచున్నది. తర్వాత ఇంకా అవతారాలని మనం ముందు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. Having realized the truth, I bow to the world, which is governed by my own will. I bow to the lotus feet of the venerable one. You are the rain of desire, which is inactive, you are the form of the supreme Brahman, you have no fruits in actions Even though there is no expectation in it, you are leading the world affairs with your magical power. Your lotus feet are worth paying homage to. You, who are like me, a devotee, will not rain down desires even for a small worship. I offer you my respects. Third Canto, 21st Chapter, 21st Prayer. Devotees of the Lord, welcome to the second episode of the second book of the Srimad Bhagavata Tattva Deepika. Until now, we have understood the form of God, nature, ego, and all the details. And I will tell you about the incarnations of God. They have arrived. Let's know the front part. The first avatar of Vishnu is Virat Purusha. Time, nature, consciousness, the subtle and gross states, the qualities of existence, the qualities of goodness, the senses, Space, the fixed and movable objects in this world, are his manifestations. I am the creator, Rudra, Yagnya, Prajapatis, Naradas, and other sages, rulers of the world, gods, humans, birds, trees, lords of the underworld, Gandharvas, Vidyadharas, and charanas, their lords. The lords of Yaksha Rakshasa Ganas, the rulers of Nagaloka, the best of sages, the ancestors, the demons, the Siddhas, the Danavas, their lords. Ghosts, demons, spirits, and various evil spirits are his masters, as well as various minor deities, aquatic creatures, and animals, all of which are also his vibhuti (divine power).

That is, those who are appointed by him, those who have wealth in the world, those who have radiance, those who have the ability to hold, Sri Hre means the world of shame, all the classes appointed by everyone, that supreme being's glory is the intellect, it is said to be wonderful, that Virat Purushuni Vibhutiye, meaning those who are appointed by him, thus the Virat Purushudu, who has all the substances and all the feelings in the universe as his form, is the first incarnation of that Bhagavan. The Parama Purusha is considered as the main incarnations of the Leela, and some of them are mentioned by the elders. By listening to bad stories, the defects that have afflicted the ears will be removed. These are supremely sacred, these are supremely beautiful. Brahma is telling Narada that it is his duty to offer him water. Narada is describing the Brahma Virat Purusha, and then he is telling why those incarnations came, what deeds they did, and what are the main qualities in them. Once, the Earth was submerged in the great ocean. To illuminate it, the Lord accepted the Varaha form, which was the embodiment of all sacrifices. God is such that it is not possible to describe his form and nature. To lift the earth, he entered the ocean in the form of a boar and, there, Indra split and threw Hiranyaksha, the elder son of Diti, who had clashed with him, into the mountains. Ruci Anu Prajapati. The wife, Ahu Kuti, gave birth to a son, Suyagna, as a son. Those 12 gods named Suyagnuna, Yamas, and Yamulu, who are associated with qualities, were born in Dakshina's wife. To remove the sorrow that the southern sons had in the gods, the Lord incarnated with the name Hari. Svayambhuva Manu called him Hari. Since the gods had destroyed Arthi, they addressed him as Hari. In the house of Kardama Prajapati, his wife Devahuti was born as a Kapila with nine brothers.

That Kapila taught his mother Devahuti the knowledge of the self and the path to liberation. By that knowledge, she should abandon the impurity of the association of Gunatraya, which is caused by the association of the body, and by which her soul is defiled. He attained salvation as per Kapila's words. The Lord was pleased with the penance of Atri Maharshi, who wished to have children. I, the supreme being, am the one who is residing as your son. Thus, by himself, the Lord himself, Dattudu, because he is, his name is Dattudu. Atreya is the son of Athri and Dattatreya is his son. Those kings, including the Haihayas, who were purified by the lotus feet of Dattatreya, attained the eightfold wealth of the great, and also attained salvation. Thus, Dattatreya is the one who bestowed the wealth of worldly and otherworldly yoga. Behind, I performed penance to gain the power to create all the Brahma worlds. It is said by Brahma. That Hari Sanu, who was satisfied with that penance, was born from me as four sons with the sound of 'Nalugu'. They are Sanaka, Sanatana, Sanandana, and Sanatkumara. Born in that form The sons, at the end of this kalpa, in the deluge, the soul with the tradition that was destroyed, made it manifest in this kalpa. The sages, through the paths they described, have realized the essence of the soul. Dharmudu, to him, Daksha Prajapati's daughter, named Murthi, in two forms, Narayana and Narudu, Srihari was born. Those incarnations are the most fruitful of penance. Manmadha and his entourage, the apsaras, tried to break their penance, but they could not and were broken. In the world, some, starting with the old, burn desire with fire emanating from the eyes filled with rage. But they burn their hearts.

They could not bear the anger that was unbearable. Even those who have burned desire are subject to anger. But that anger is also afraid to enter the mind of Lord Narayana. When the anger that burned desire is afraid to reach his mind, there is no chance for desire to reach Hari's mind, right? Parama Shiva is the one who conquered desire, but Narayana is the one who conquered desire and also conquered anger. Dhruva, a son of King Uttanapada, was born. Sri Hari incarnated to bless Dhruva. The words of Suruchi, who was a good mother, wounded the mind as thorns. Even though he was a child, Dhruva went to the forest to perform penance. Pleased by such penance, Srihari appeared and, being praised by him, granted him a place of stability. The sages above the pole and the sages below also praise the influence of that pole. Once upon a time, a king named Venudu, by violating the customs, behaved in a way that the Brahmins cursed his manhood and wealth Burned to ashes. To protect such a father from falling into hell, the Lord incarnated with the name Prudhu as his son. He turned the earth into a cow and squeezed all the materials from this earth. Because it was created by the earth, this earth is named Prithvi. Srihari was born as his own son by the name Vrishabhudu to Nabhi Anuvati. Like Kapila Avatar, Vrishabha Avatar is also an incarnation that came from the part of God. This Vrishabha is the son of Nabhi, Mareeduvi, and Sudevi. He himself, like a fool, practiced yoga. He was established in his own glory, as he had seen all things as being of the nature of the Lord. But he is not dependent on anything else. Because of the restraint of the senses, he was without association in matters of sound and other things.

When I performed the Satra-yagam as a witness, Hayagriva appeared in that yagam. The shade of his body was like gold. He is a Vedic scholar. He was the spirit of all gods. When he sighed and his nose came out, it was revealed as holy and as the Veda. He is the one who made the Vedas function, he is worshiped by the Vedic rituals, he is also the soul of the gods who are worshiped by the sacrifices. Hayagriva, in the time of destruction, the Matsya Murti, who was seen by Vaivasvata Manu, came and stopped the earth to preserve the materials used for creation. He is the one who is the abode of all living beings. Once upon a time, he brought back the Vedas that had slipped from his mouth and gave them to me. He has made the Vedic paths prevail. Another avatar. While the gods and demons were churning the ocean of milk for nectar, to keep that churning from shaking, the Lord assumed the form of a tortoise and held it up with his tail. While the Mandara mountain was spinning and revolving around him, the Lord in the form of a tortoise was sleeping peacefully. That mountain The back pain is cured by rubbing. It is understood from this that carrying such a mountain is not troublesome for him. We will learn more about the next avatars in our podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.