శ్రీమద్భాగవత పురాణ దశలక్షణముల నిరూపణ

The Ten Characteristics of Srimad Bhagavatham Explained

bhagavatam

ఈ భక్తిపూర్వకమైన ఎపిసోడ్‌లో, శ్రీమద్భాగవత పురాణంలోని రెండవ స్కంధంలో వివరించబడిన దశలక్షణముల గురించి లోతుగా అర్థం చేసుకుంటాము. సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతి, మన్వంతర, ఈశానుకథ, నిరోధ, ముక్తి మరియు ఆశ్రయ అనే ఈ పది లక్షణాలు భాగవతం యొక్క సారాంశాన్ని నిర్వచిస్తాయి. శ్రీ శుక మహర్షి, పరీక్షిత్ మహారాజుకు ఈ దివ్యమైన తత్త్వాలను అత్యంత ప్రేమతో మరియు స్పష్టంగా వివరిస్తారు. భగవత్ తత్త్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసువులకు ఈ ఎపిసోడ్ ఒక అమూల్యమైన మార్గదర్శి.

In this enlightening episode, we explore the ten defining characteristics of Srimad Bhagavatham as revealed in the Second Canto, which form the very foundation of this sacred scripture. These ten aspects — known as Dasha Lakshanas — include Sarga, Visarga, Sthana, Poshana, Uti, Manvantara, Ishanukatha, Nirodha, Mukti, and Ashraya, each unveiling a deeper dimension of cosmic and spiritual truth. Sri Shuka Maharshi lovingly explains these characteristics to the earnest seeker Parikshit Maharaja, guiding him toward the ultimate understanding of the Lord's divine nature. This episode is an invaluable guide for devotees who wish to comprehend the profound scope and sacred purpose of the Bhagavatham.

← Prev Next →
The Ten Characteristics of Srimad Bhagavatham Explained bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే శ్రిత సత్వాయ ధర్మాదీనాంచ సూతయే నిర్గుణాయ చయత్ కాష్టాం నాహం వేదాపరేపి చ వేద పరుషుడు ఇట్లు పలికెను. నీవు సత్వగుణ ప్రధానుడవై ధర్మార్థ కామ మోక్షములను భక్తులకు అనుగ్రహించుచున్నావు. కానీ నీవు నిర్గుణుడవు కూడా నీ తత్వమును జ్ఞాన రూపుడను నేను. నేనే తెలియకున్నాను, ఇతరులు కూడా నీ స్వరూపమును తెలియకున్నారు. ఫోర్త్ క్యాంటో సెవెంత్ చాప్టర్ 40th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికలో ద్వితీయ స్కంధము 16వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతకుముందు మనం భాగవత చతుష్లోకి భగవంతుడు బ్రహ్మకు అందించిన దానిని దానిలో విషయాలని తెలుసుకున్నాం. ఇంక ముందు భాగాన్ని తెలుసుకుందాం. తత్వజ్ఞానమును ఎరుంగ గోరినవాడు ఈ విషయముని ఎరుంగదగును. ఇంతకంటే వేరొక విషయం ఎరుంగదని లేదు అంటే ఈ చతుశ్లోకిలోని సారాంశాన్ని గురించి చెప్తున్నారు. చేతనులగు జీవులు అచేతనమగు ప్రకృతి శరీరం వలె తనతో విడదీయరాక చేరి ఉండెడి పరమాత్మ కంటే అతిరిక్తమగు వస్తువు వేరొకటి లేదు. అది ఏ సృష్టికి ముందు కారణముగా, సృష్టి తరువాత కార్యముగా ఉన్నది అని ఎరుంగుటయే విజ్ఞాన సర్వస్వము. భగవత్ స్వరూపము దీనికి పరతంత్రములకు జీవ ప్రకృతి స్వరూపము వానికి గల సంబంధము ఎరుంగుటయే తత్వజ్ఞానము. దీనిని నీవు ఎల్లప్పుడూ ఏకాగ్రము చిత్తముతో ధ్యానించుచుండుము. సృష్టి చేయునప్పుడు, సంహారము చేయునప్పుడు నేనే అన్నింటిలో ఉండి నిర్వహించున్నానని ఎరుంగుటచే మోహము కలగదు. ఇట్లు భగవానుడు చతుర్ముఖునకు రహస్యముకు తత్వజ్ఞానం ఉపదేశించెను. శ్రీహరి కర్మాయత్తమైన జన్మలేనివాడు. వ్యష్టి సృష్టికి అధిపతి అయి ఉన్న చతుర్ముఖునకు ఉపదేశము చేసి అతడు చూచుచుండగానే అతనికి దర్శింపచేసిన తన రూపమును మరుగపరిచెను.

కంటికి గోచరించిన రూపమును మరుగుపరిచిన శ్రీహరికి చతుర్ముఖుడు నమస్కరించెను. సర్వభూతముల స్వరూపం అతనికి గోచరించెను. వెనుకటి కల్పములో ఈ విశ్వం ఎట్లుండెనో అట్లే అతడు సృష్టించెను. భాగవత ధర్మములను ప్రవర్తింపచేసి రక్షించిన బ్రహ్మ ప్రజలకు మంగళము కలగవలెనని భావించి తాను కూడా యమములను నియమములను ఆచరించినాడు. అట్లు తపస్సు చేయుచున్న తమ జనకుడగు బ్రహ్మను సేవించుచు ఆ ధర్మములను వినవలెనని కోరిక కలవాడై నారదుడు తన శీలము చేత వినయము చేత ఇంద్రియ నిగ్రహము చేత అతనిని సంతోషపరిచి అతని నుండి మాయను తన వశమందుంచుకొనిన శ్రీ మహావిష్ణువు యొక్క మాయాశక్తిని ఎరుంగగోరి లోకములకు పితామహుడును తనకు జనుకుడునగు బ్రహ్మను ప్రశ్నించెను. అతని ప్రశ్నలకు సమాధానముగా 10 లక్షణములతో కూడిన ఈ భాగవతమును చతుర్ముఖుడు నారదునకు ఉపదేశించెను. నారదుడు సరస్వతీ నది తీరమందు పరబ్రహ్మ ధ్యానమునందు ఉన్నవాడును. వేద శాస్త్రార్థ తత్వములను మననము చేయుచున్నవాడును అగు వ్యాసునకు ఈ భాగవతమనే రహస్య జ్ఞానమును ఉపదేశించెను. వ్యాసుడు నాకు జనకుడగుటచే నాయందు అనుగ్రహముతో నాకు ఆ భాగవతమును అనుగ్రహించినాడు అని శ్రీ సుఖయోగి పరీక్షిత్తునకు చెప్పెను. ఓ రాజా, నీవు అడిగితివి అని నేను ఈ రహస్యముగు భాగవతమును నీకు చెప్పుచున్నాను. ఇది విరాట్ పురుషుడగు అనిరుద్ధునుచే సృజింపబడిన చతుర్ముఖి నుండి ఈ లోకమున ప్రసన్నించినది. భాగవత పురాణము 10 లక్షణములు కలదని చెప్పితిని. ఒకటి సర్గము, రెండు విసర్గము, మూడు స్థానము, నాలుగు పోషణము, ఐదు. ఊతులు, ఆరు మన్వంతర కథ, ఏడు సర్వేశ్వరుని చేష్టితములను వర్ణించుట, ఎనిమిది నిరోధము, తొమ్మిది ముక్తి, పది ఆశ్రయం. ఇందు ప్రధానమైనది ఆశ్రయము. మనసున దేనిని ధ్యానింపవలెనో దానిని ఆశ్రయమందురు. ఆ ఆశ్రయము భగవానుడే. ఆ మనస్సునకు ఆశ్రయమగు భగవానుని స్వరూపమును స్పష్టముగా ఎరుంగుటకై.

ముందు తొమ్మిది విషయములు ఇందు వివరింపబడును. ఆకాశము మొదలు పంచభూతములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటి భూతముల సూక్ష్మావస్థలగు తన్మాత్రలు. జ్ఞాన, కర్మ, ఇంద్రియములు, అంతఃకరణమగు బుద్ధి, శబ్దముచే గ్రహింపబడిన మహత్తత్వము మొదలగు వాని యొక్క ఉత్పత్తి సర్గము అనబడును. ప్రకృతి పరిణామము చెంది మహత్వత్వము మొదలు పృథ్వి వరకు మారిన తత్వములు ఉత్పత్తి క్రమమును ఎరుంగుట సర్గమును ఎరుంగుట పరబ్రహ్మమగు భగవానుడు తన సంకల్పముచే తనతోనే చేరియున్న సత్వరజస్తమో గుణములు గల ప్రకృతిలో ఆ గుణములలో వైషమ్యమును కలిగించును. దానిని సృష్టి దానిచే సృష్టి జరుగును. అందు మొదట సృజింపబడిన వాడు చతుర్ముఖుడు. అతడు చేసిన వ్యష్టి సృష్టి విసర్గము అనబడును. ఇది రెండవ భాగం రెండవ లక్షణం శ్రీహరి. శత్రువులను జయించి తాను అందరికంటే ఉత్కర్షతో ఉండుట స్థితి అనబడును. శ్రీహరి తన అనుగ్రహముచే ఈ జగత్తును రక్షించుట పోషణము అనబడును. ఆయా ప్రాణులు చేసెడి కర్మలచే వాసనలు ఏర్పడి ఆ వాసనలచే కలిగెడి సంసారమునకు ఊతులు అని పేరు. ఆ ధర్మమును రక్షించుటకు ఆచరించుటకు మనువులు కొంతకాలం పరిపాలించుదురు. ఆ మనువులు పరిపాలించడి కాలమునకు మన్వంతరం అని పేరు. మన్వంతరమునకు అధిపతులగు ఆ మనువుల చరితము మన్వంతరాను కథనము. సర్వేశ్వరుడగు శ్రీహరి లోక రక్షణమునకై శిష్టులను రక్షించి. దుష్టులను శిక్షించుటకు, ధర్మమును స్థాపించుటకు ఈ లోకమున అవతరించిన అవతారముల చరిత్ర వర్ణించుట ఈశ చరితము. భగవానుని యందు నిరతిశయముగు భక్తి గల భగవత్ భక్తుల చరిత్రము కూడా అనేక విధములో కథలతో ప్రతిపాదింపబడును. సర్వేశ్వరుని కథలు వాని అనుయాయులగు భక్తులు కథలు ఈశాను కథలు అనబడును. జీవాత్మలు తమ శక్తులగు కర్మలతో కూడా సూక్ష్మావస్థ యందున ప్రకృతిలో చేరి ఉండుట నిరోధము అనబడును.

జీవులు, దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములను విడిచి సస్వరూపముతో అపహత పాపత్వం మొదలగు ఎనిమిది గుణములు ఆవిర్భవించి పరమాత్మతో సమానముగు రూపమును, స్వరూపమును, గుణములను అంది ఉండుట ముక్తి అనబడును. ఈ జగత్తు ఎవరి నుండి స్థూల రూపమున వెలికి వచ్చుచుందునో కొంత కాలము కనపడి మరల అవ్యక్తము చేయు చేరుచున్నదో ఆ కారణమైన తత్వమును ఆశ్రయము అందురు. అది ఏ పరబ్రహ్మమనియు పరమాత్మనియు చెప్పబడును. గుణములచే స్వరూపముల స్వరూపముచే దానిని మించిన తత్వం మరొకటి లేదు కనుక దానిని పరబ్రహ్మము అందురు. కర్మ వశముచే జ్ఞానానందములు సంకోచించిన జీవులకు మరల వికాసమును కలిగించునది అగుటచే దానిని పరబ్రహ్మము అని కూడా అందురు. చేతనా చేతనములను జగద్రూపమున సృజించి అందు వ్యాపించి ఉండును కనుక ఈ తత్వమును పరమాత్మ అని కూడా అందురు. అట్టి పరబ్రహ్మము పరమాత్మ అని వ్యవహరింపబడే సర్వ జగత్ కారణము. వ్యాపకము అగు భగవత్ తత్వమే మనసునకు ఎల్లప్పుడూ ఆశ్రయమై ఉండవలెను. కనుక దానిని ఆశ్రయమందురు. దానిని ఎరుంగుటకే ముందు తొమ్మిది లక్షణములు భాగవతమున వర్ణింపబడినవి. భగవానుడే ఆత్మయందు నియమించువాడుగా అంతర్యామి అయి ఉండును. కనుక అతడే ఆధ్యాత్మిక పురుషుడు. అతడే ఇంద్రియములకు అభిమాన దేవతల యందు అంతర్యామి అయి ఉండి ఇంద్రియములను ప్రవర్తింపజేయుచుండును. కావున అతడే ఆది దైవిక పురుషుడు. పై రెండు విధములగు పురుషుల కంటే వేరగు జ్ఞేయమగు ఆకాశాది భూతములందును శబ్దాదుల యందును అంతరాత్మగా ఉండెడి పురుషుడు ఆదిభౌతిక పురుషుడు. ఈ విధముగా జ్ఞాత అనగా తెలుసుకొనుడి వాడగు జీవుడు వానికి జ్ఞానమును కలుగజేసే సాధనము ఇంద్రియములు వాని చే ఎరుంగబలిడి శబ్దాది విషయములు కూడా భగవదాత్మకములే గనుక అంతయు ఆ పురుషుడే. ఈ ముడింటిలో ఏ ఒకటి లేకపోయినను జ్ఞానము కలగదు. జీవుడు లేకపోయినను, ఇంద్రియములు లేకపోయినను, ఇంద్రియములచే రంగబరెడు విషయములు లేకపోయినను జీవునకు జ్ఞానము కలగదు. కానీ ఆ మూడింటికి ఆశ్రయమగువాడు పరమాత్మ. ఆ పరమాత్మయే అవిద్యను కూడా ఆశ్రయమైన జీవునకు కూడా ఆశ్రయమై ఉండువాడు. అతడు విషయము.

దగ్గరగా లేకపోయినను, ఇంద్రియములు లేకపోయినను, జ్ఞానము కలిగి ఉండేడి సర్వజ్ఞుడు. ఆ పరమాత్మయే సృష్టి చేయుటకు చతుర్ముఖునిలో ఆత్మ అయి ఉండి, తాను ఉండుటకు స్థానముగా పరిశుద్ధములగు జలములను సృష్టించెను. ఆ జలములలో అనేక వేల సంవత్సరములు ఉండెను అందుచేతనే అతనికి నారాయణుడు అని వ్యవహారము కలిగెను. నారములు అనగా జలములు అవి ఆశ్రయముగా ఉన్నవాడు కనుక అతనికి నారాయణుడు అని పేరు. మహత్తు మొదలుకొని పృథ్వి వరకు గల భూతములు జీవుని అదృష్టమైన కర్మ కాలము స్వభావం అతని అనుగ్రహం వలనే ఉన్నవి. అతడు సంకల్పించినచో అవి ఉండవు. అతడు సృష్టికి ముందు నామరూప విభాగము లేక సూక్ష్మ చేతనా చేతనములు శరీరముగా గలవాడై ఒక్కడే ఉండెను ఆ నారాయణుడే దేవ మనుష్యాది రూపమగు జగత్తుగా మారదలచి తనను గూర్చి తానే తలంచుపరుండెను దానినే యోగమందురు. ఆలోచనతో శయనించుటకే యోగ నిద్ర అని పేరు. ఆ శయనము నుండి లేచి తన అంశమగు హిరణ్మయమగు వీర్యముచే మాయచే అనగా సంకల్పముచే తానొక్కడే నానా రూపము గలవాడుగా ఉండవలెనని సంకల్పించెను. సంకల్పించి తన హిరణ్మయమగు వీర్యమును జీవుడు శరీరము ఎరుంగదగిన పదార్థములని మూడు విధములుగా సృష్టించెను దీనిని ఏ సహాయము లేక సంకల్పము చేతనే చతుర్ముఖునిలో ఆత్మగా ఉండి సృష్టించెను ఈ విరాట్ పురుషుని వీర్యము, అధిదైవము, ఆధ్యాత్మికము, అధిభూతము అని మూడు విధములుగా పరిణమించెను. ఇంద్రియములకు అధిపతులకు దిక్కు మొదలగు దేవతలను పదునొక్క ఇంద్రియములను అధిదైవము అనబడును. పృథ్వి మొదలగు భూతములందున్న గంధము మొదలగు ఎరుంగబడు ద్రవ్యములు అధిభూతము అనబడును. ఒక సమిష్టి పురుషుడు చతుర్ముఖుడు. ఆ సమిష్టి పురుషుడిచే అధిష్టితమైన ఒక రూపము. ఆ పురుషుని వీర్యము వ్యష్టికి కారణము.

అది ఈ జీవులుగా, ఇంద్రియములుగా, విషయములుగా మారినది. ఇట్టి ఇంద్రియములకు ఆశ్రయమైనది ప్రాణవాయువు. ఆ సమిష్టి పురుషుడగు చతుర్ముఖుని శరీరముందలి ఆకాశములో ప్రసరించిన వాయువు వలనే వ్యష్టి శరీరములలో ప్రాణము సృజింపబడెను. ఆ వాయువు వలనే ఓజస్సు, సహస్సు, బలము కలిగినవి. ఇవి ప్రాణము యొక్క వ్యాపారములు. ఓజస్సు అనగా ప్రవృత్తి సామర్థ్యము, సహస్సు అనగా వేగ సామర్థ్యము, బలము అనగా ధారణ సామర్థ్యము. ఈ ఓజస్సు, సహస్సు, బలము. అనవి ప్రాణం యొక్క ధర్మములు. ఆ చతుర్ముఖుని ప్రాణము నుండి ముఖ్య ప్రాణము వచ్చెను. అదియే సకల దేహముల యందు ప్రాణవాయువుగా మారెను. సకల జంతు కోటిలో కలుగు చేష్టలకు కారణమైనది ఆ ప్రాణవాయువు యొక్క చేష్టయే. దానిని అనుసరించి ఇంద్రియములు పనిచేయును. ఆ ప్రాణమును అనుసరించి ఇంద్రియములన్నియు రాజును అనుసరించి భృత్యులు ఉన్నట్టుగా ప్రవర్తించుండును. ఆ చతుర్ముఖుని శరీరములో కదలుచున్న ప్రాణవాయువుచే వాని శరీరమందలి జఠరాగ్ని ప్రదీప్తమగును. దాని చేతనే ఆకలి దప్పిక కలుగును. ఆ ఆకలి దప్పులు కలగగానే ఆ చతుర్ముఖుని శరీరములో ముఖము బయలు వెడలెను. సమిష్టి పురుషుల చతుర్ముఖుని ముఖము నుండియే వ్యష్టి శరీరములో ముఖములు ఉత్పన్నమాయెను. ఆ ముఖమునందు తాలువు అనగా జిహ్వ మూలము బయలు వెడలెను. అచ్చట నాలుక బయలుదేరెను. ఆ జిహ్వ చేత పులుపు, కారము మొదలగు రుచులు ఎరంగబడుచున్నవి. ఈ జిహ్వేంద్రియమునకు తాలువు అధిష్టానము. రుచులు దానిచే ఎరంగబడు విషయము. వర్ణుడు దేవత అట్లే ఆ ముఖము మాట్లాడవలెనని కోరిక కలదాయను ఆ సమిష్టి పురుని పురుషుని ముఖము నుండి వాక్కునకు అభిమాన దేవత వహ్ని. వన్ హి అంటే అగ్ని, వాక్కు అనే ఇంద్రియము ఆ రెండిటి యొక్క వ్యాపారమైన మాట బయలు బడెను. ఇట్లు సమిష్టి పురుషుని శరీరము నుండియే వ్యష్టి పురుషుల శరీరము అవయములు నిర్మింపబడినవి. ఆ బ్రహ్మ యొక్క కంఠమునందు చాలా కాలం ప్రాణవాయువు నిరోధింపబడెను. ఆ వాయువు చాలా కాలం ఇటునటు ఊగి వెలుపలకు వచ్చుటకు నాసికములు ఏర్పడెను. ఆ నాసికకు వాసన చూడవలెను కోరిక కలిగెను. దానికి వాయువు అధిష్టాన దేవతగా తోడ్పడెను. అప్పుడు నాసిక అధిష్టానముగా దేవత వాయువు, ఘ్రాణము అనే ఇంద్రియములు. ఇంద్రియం బయలు విడలినది అప్పుడు దేనిని చూచుటకు శక్తి లేకుండుటచే తాను లోకమును చూడవలెని బ్రహ్మకు కోరిక కలిగెను. ఆ తర్వాత జరిగిన భాగాన్ని ముందు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఈ విషయాన్ని రెండు సార్లు వింటే కానీ మనకు పూర్తిగా అర్థం కాదు రెండోసారి కూడా విననని.

మనవి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the one who is the essence of the virtuous, the protector of the righteous, the destroyer of the wicked, the one without attributes, the one who is beyond the Vedas, and the one who is beyond the Vedas. Thus he spoke. You are the foremost of the Sattva Guna, bestowing Dharma, Artha, and Kama, and liberation upon your devotees. But you are also formless, I am the embodiment of your essence and knowledge. I have known and others have known your form. Fourth Canto, Seventh Chapter, 40th Prayer. Devotees of God, welcome to the second episode of the second book, Srimad Bhagavata Tatva Deepika, in the 16th podcast. Previously, we learned about the Bhagavata Chatushloki, which was given by God to Brahma, and the subjects within it. And we'll learn about the front part. He who desires to understand philosophy will not understand this matter. There is no other matter more important than this, that is, they are talking about the essence of this quadrilateral. There is no object more distinct than the Supreme Being, which is united with the inert being, like the inert body of the inert being, without separating from it. That is the cause before creation, creation Knowing what is to happen next is the essence of knowledge. The form of God, the relationship between this and the other, the nature of life, the form of that, knowing that is the knowledge of the essence. Always meditate on this with a single-minded devotion. When creating, when destroying, I am the one who is in all of it and managing, therefore, there is no delusion. Thus, the Lord revealed the secret and the essence of knowledge to the four-faced one. Sri Hari is unborn and eternal. Having instructed the four-faced one who is the lord of individual creation, he made his form disappear as he watched.

The four-faced one saluted Srihari, who had hidden the form that was visible to the eye. He saw the form of all beings. In the previous kalam (epoch), he created the universe as it was. Brahma, thinking that the people who practiced and protected the Bhagavata Dharmas should have auspiciousness, also practiced the rules and regulations of Yama. Thus, Narada, desiring to serve his father, who is engaged in penance, and to listen to those Dharmas, pleased him with his character, humility, and control of the senses, and having taken Maya into his possession from him The father of the worlds, who wanted to know the illusory power of Mahavishnu, questioned Brahma, who was his servant. In response to his questions, the four-faced one (Chaturmukha) imparted this Bhagavatam, which consists of 10 characteristics, to Narada. Narada was on the banks of the Saraswati river, in meditation on the Supreme Brahman. He who contemplates the essence of the Vedas and the scriptures, Vyasa, was taught this secret knowledge of the Bhagavata. Vyasa, being my father, with his grace, to me Sri Sukha Yogi told Parikshit that he had blessed the Bhagavatam. Oh king, I am telling you this secret Bhagavatam because you asked. This is the creation of Aniruddha, the Virat Purusha, from the four-faced one who is present in this world. I said that the Bhagavata Purana has 10 characteristics. One is Sargam, two is Visargam, three is Sthana, four is Poshana, five. Ouchi, six, the story of the Manvantara, seven, describing the actions of the Lord of all, eight, resistance, nine, liberation, ten, refuge. The main thing is the shelter. They take refuge in what in their heart should be meditated upon. The Lord is the Refuge. To clearly understand the form of the Lord who is the refuge of that mind.

Nine things will be described here. From the sky to the five elements, sound, touch, form, taste, and smell are the subtle states of the elements called Tanmatras. Knowledge, action, senses, the intellect that is the inner instrument, the great element that is perceived by sound, the production of such things is called Sarga. Having evolved from nature, understanding the elements that changed from greatness to the earth, understanding the order of creation, understanding the supreme being, the Lord, by his will, being united with himself, in the nature that has the qualities of Sattva, Rajas, and Tamas, in those qualities It causes disharmony. It is creation, creation happens by it. The first one created was the Chaturmukha. That which he created is called the dissolution of individual creation. This is the second part, the second character, Srihari. The state of being victorious over enemies and being superior to everyone else is called that state. Srihari, by his grace, protects and nourishes this world. The smells that arise from the karmas performed by those creatures, and the world that is formed by those smells, is called 'Uthulu'. To protect and practice that dharma, humans They will rule for some time. The time when those Manus ruled is called Manvantara. The history of those Manus who were the rulers of the Manvantara is the story of the Manvantara. The supreme Lord, Sri Hari, protects the world for the sake of protection. To punish the wicked, to establish Dharma, to describe the history of the incarnations that have incarnated in this world is the history of Yesh Charitamu. The story of the devotees of God, who have immense devotion to God, is also presented in many ways with stories. The stories of the Lord are called the stories of His devotees. The souls, along with their powers and karmas, are said to be prevented from joining the subtle state in nature.

Leaving the living beings, gods, humans, the three states, and the stationary, with their true form, the eight qualities such as unhurt, sinlessness, etc., appearing, and being in a form, form, and qualities equal to the Supreme Soul, is called liberation. From whom does this world emerge in a gross form, appearing for some time and then disappearing again, they call that cause of the essence to be the refuge. That is what is said to be the Parabrahma and the Para-atman. Because there is no other element that surpasses it in terms of qualities and forms, it is called Parabrahma. Because it causes the contraction of the bliss of knowledge for beings who have shrunk due to the influence of karma, it is also called Parabrahma. Because the consciousness is created in the form of the world and pervades it, this principle is also called the Supreme Soul. That Supreme Brahman, the Supreme Soul, is the cause of the entire universe. The divine essence that is the business should always be the refuge of the mind. Therefore, they take refuge in it. Before explaining that, nine characteristics were described in the Bhagavata. God He who is enlisted in the Spirit is the one who is inwardly on fire. Therefore, he is a spiritual man. He is the one who is the inner controller of the senses, being the deity of the senses, and he makes the senses function. Therefore, he is the first divine being. The one who is different from the two types of men, who is worthy of being known, who is the inner self in the sky and other elements, and in words, that man is the first physical man. In this way, the knower, that is, the living being who knows, the means to impart knowledge to him are the senses, and since the objects of sound, etc., are also divine, everything is that man. Without one of these three, knowledge will not be gained. Even if there is no living being, even if there are no senses, even if there are no objects of sense perception, the living being does not have knowledge. But the Supreme Soul is the refuge of all three. That Supreme Being is the refuge of ignorance and also the refuge of the living being. That's the subject.

Even if not nearby, even if the senses are not there, the all-knowing one is the one who has knowledge. That Supreme Being, being the soul in the four-faced one, to create the creation, created the pure waters as a place for Him to exist. He lived in those waters for many thousands of years, therefore he was called Narayana. Naramulu anaga jalamulu avi ashrayamuga unna vaadu kanuka athani ki narayanudu ani peru. From the great to the earth, the beings are due to the fortunate karma of the living being, the nature of time, and his grace. If he sets his mind to it, he won't be where he started. He was the only one before creation, without any form or name, with subtle consciousness and body, that Narayana, desiring to transform into the form of gods, humans, and other beings, was thinking of himself. That is what is called Yoga. Yoga nidra is a term for a type of guided meditation. Arising from that bed, with his part, the golden semen, by Maya, that is, by resolve, he resolved to be alone, with various forms. Having resolved, the soul uses its divine energy to form the body He created the worthy substances in three ways. Without any help, he created this by being the soul in the four-faced one with determination. The semen, supreme being, spiritual, of this immense being The supreme being manifested in three ways. The gods who are the lords of the senses, the directions, and the ten senses are called the lords of the gods. The substances that are known as gandham and other substances present in the elements like earth are called adhibhuta. A collective noun is a word that refers to a group of people, places, or things. A form that is dominated by the collective male. The male's semen is the cause of the individual.

It became these beings, senses, and objects. Prana is the life force that sustains the senses. The life force was created in individual bodies by the air that spread in the sky from the body of the collective male, the four-faced one. That air is what gives strength, endurance, and power. These are the trades of life. Ojas means the ability to be in the flow, Sahasa means the ability to be fast, and Balam means the ability to hold. This is strength, endurance, and power. The virtues of Anavi Pran. From the life of the four-faced one, the main life came. That itself became the life-air in all bodies. The breath is the cause of all the actions that occur in all living beings. The senses respond to it. Following that life, all the senses should act as if they are servants following the king. The life force moving in the body of that four-faced being illuminates the digestive fire within his body. Hunger and thirst are caused by it. As soon as hunger and thirst arose, the face of that four-faced one appeared in his body It is said. From the face of the four-faced Samyukta Purusha, faces originated in the individual body. In that face, the tongue, meaning the root of the tongue, has come out. There the tongue began. The tongue is being stimulated by sour, pungent, and other tastes. The tongue is the locus of the sensory organ. The subject of taste is the object of taste. The color is a goddess, similarly, that face, to speak, the desire to have, that collective Puruni, from the face of the man, to the speech, to the pride, the goddess is Vahni. One, he means fire, speech, the sense, the business of those two, the word, the word has come out. Thus, from the body of the collective male, the body and limbs of individual males are constructed. In the throat of that Brahma, for a long time, the life air was blocked. That air, for a long time, wandering here and there, to come outside, nostrils were formed. A desire arose to smell the fragrance. It was aided by the Vayu, the presiding deity. Then, as the nasal region, the deity is the sense of smell, the sense of smell. The senses are separated from the outside. Then what Because he had no strength to see, Brahma desired to see the world. We'll get to the next part in the podcast. Even if we listen to this matter twice, we will not fully understand it; we will not listen to it a second time.

I'm requesting. Jai Srimannarayana and salutations to the Gurus.