హృదయ ఆకాశమునందు చతుర్భుజ పరమాత్మ ధ్యానము

Meditation on the Supersoul Within the Heart

bhagavatam

శ్రీమద్భాగవతం రెండవ స్కంధంలో శుకదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు హృదయాకాశంలో విరాజిల్లే చతుర్భుజ పరమాత్మను ధ్యానించే అద్భుతమైన విధానాన్ని వివరిస్తున్నారు. భగవంతుని పాదారవిందాల నుండి ప్రారంభించి, ఆయన దివ్యమైన మందహాసం వరకు క్రమంగా ధ్యానించే ఈ పద్ధతి సాధకుడి మనసును లోపలికి మళ్లించి పరమాత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. సమస్త జీవులలో నారాయణుడు శాశ్వతంగా నివసిస్తున్నాడని ఈ పవిత్రమైన ధ్యాన పద్ధతి స్పష్టంగా తెలియజేస్తుంది.

In this illuminating episode of the Srimad Bhagavatham podcast, we explore Canto 2's profound teaching on meditating upon the four-armed form of the Supersoul residing within the space of the heart. Shukadeva Goswami guides Maharaja Parikshit through a detailed and step-by-step visualization of the Lord's transcendental form, from His lotus feet upward to His radiant, smiling face. This sacred practice of inner meditation reveals how the sincere seeker can turn their awareness inward and experience the divine presence of Narayana dwelling eternally within all living beings.

← Prev Next →
Meditation on the Supersoul Within the Heart bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః జితం జితంతే జిత యజ్ఞ భావనా త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిల్యురధ్వరాః తస్మై నమః కారణ సూకరాయ పరాజయము ఎనురుంగని వాడా నీవు యజ్ఞములను పాలించెదవు నీకు జయము జయము. నీవు ఋగ్వేద, యజుర్వేద, సామవేదమయమగు నీ దేహమును విదల్చుచున్నావు. నీకు నమస్కారము. నీ రోమకూపముల యందు యజ్ఞములు విలీనమైయున్నవి. నీవు భూమిని ఉద్ధరించుట కొరకై ఈ వరాహ రూపమును దాల్చినావు. అట్టి నీకు నమస్కారము. థర్డ్ క్యాంటో, 13th చాప్టర్, 34th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా. రెండవ స్కంధము మూడవ ఎపిసోడ్ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం విరాట్ పుష్ణక స్వరూపము ఆ స్వరూపమైన ఎలా మనము ఆ రూపంలో ధ్యానాన్ని నిలపాలి కొంత భాగం తెలుసుకున్నాం. ఇంకా ముందు ముందు ధ్యానం చేసే ప్రక్రియని తెలుసుకుందాం. ఒక మూర్తిని ఎదురుగా నిలుపుకొని పైవిధమగు ఆభరణ, అవయవ, సౌందర్యములు గల ఆ మూర్తిని ధారణ నిలుచు వరకు చూచుండవలెను. బుద్ధితో పాదం మొదలు చిరునవ్వు వరకు ఆ సుందర రూపుని అవయవములను ఒక్కొక్క దానిని చింతించుచుండవలెను. తన తలంపులో ఒక అవయవము స్థిరముగా నిలిచిన తరువాత దానిపై అవయవమును భావించుచుండవలెను. పూర్తి రూపము మనసు తనలో నిలుపుకొను వరకు ధారణ చేయవలెను. దానిచే పరిశుద్ధమగును. ఇట్టి రూపము ప్రేమతో ఎడతెగక మనసులో దర్శనమగునట్లు స్మరించుటయే భక్తి యోగము. ఇట్టిది స్థిరపడు వరకు తాను చేయు నిత్య అనుష్టానమందు సూక్ష్మ రూపమును కాక స్థూల రూపముని స్మరించవలెను. బాహ్యముగా కనిపించు విశ్వమంతయు భగవాను రూపముగా భావించుచు అది మనసున కుదుటపడిన తరువాత హృదయమునందు పైన చెప్పిన విధమగు రూపమును నియతమగు శ్రద్ధతో స్మరింపవలెను.

ఇట్లు పరిపూర్ణ భక్తి యోగము సాధించి యోగి ప్రారబ్ధ కర్మావసానమున ఈ శరీరమును వీడునప్పుడు గంగా ఉత్తరాయణము మొదలగు పవిత్ర దేశమును కాలమును భావించుచు ఉండక స్థిరమైన ఆసనంపై సుఖముగా కూర్చొని మనస్సుచే ఇంద్రియములను ప్రాణమును నిగ్రహించి ఇతర విషయములపై పోకుండా నిలుపుకొనవలెను. తన నిశ్చయాత్మక బుద్ధితో భగవత్ ఉపాసనముచే అవిద్య, అహంకారము, రాగద్వేషములు, అభినివేషము అనటి మలములు తొలగిన వాడు కావలెను. మనసున బుద్ధి వ్యాపారమునందే నిలిపవలెను. మనసును బుద్ధి వ్యాపారమునందే నిలిపవలెను. ఆ బుద్ధిని జీవుని యందు నియమించవలెను. ఆ జీవుని పరమాత్మ యందు సమర్పించి శాంతిని పొందిన వాడై బాహ్యముకు కర్మలను విరమించవలెను. అంతవరకు ఉపాసన చేయుచుండవలెను. కర్మ పరిత్యాగము చేయరాదు. ఇది యోగముచే స్వాధీనమైన స్థితి గలవాళ్ళరు. శరీరమును వీడెడి క్రమము ప్రారబ్ధం పూర్తి అగు వరకు యోగశక్తి గలవారైనను శరీరమును వీడరాదు. కాలమునకై నిరీక్షించుండవలెను. భగవత్ ఉపాసనచే బుద్ధి నిర్మలమై ఉండెడి భక్తి యోగ నిష్ఠులు విష్ణు సంబంధియగు పరమ పదమునందు ఉందురు. అచట కాలమునకు ప్రభుత్వము లేదు. బ్రహ్మాది దేవతలను కూడా నియమించు కాలమునకే అచట ప్రభుత్వము లేదన్న నాడు బ్రహ్మాది దేవతలు అచట నియమించుచు శక్తి కలవారు కారు అని చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఇంకా లోకములోని ఇతరులు ఆ పదమును నియమింపలేరని చెప్పనవసరము లేదు. ఎవ్వరి శాసనమునకు లొంగని ఆ విష్ణువు యొక్క పరమ పదమునందు ప్రధానము నుండి బయలువెడలి మహదహంకారములు. సత్వాది గుణములు ఏ విధమైన ప్రభావం కలిగి ఉండవు. ఈ పరమపదం ఇట్టిది అని చెప్పుటకు శక్యము కానిదగుటచే దానికంటే ఇతరమైన వానిని తొలగించుటకు ఇట్టిది కాదని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. భగవానుని కంటే ఇతరము విషయములపై మనసు పోని వాడై హృదయములో దానిని నిలుపుకొని క్షణక్షణము దానియందే మనసు నిలిచిన నాడు కృతకృత్యుడైనాడు.

సకల పదార్థములు బ్రహ్మాత్మకములను బుద్ధి నిలిచిన భగవత్ ఉపాసకుడు భగవత్ సాక్షాత్కారమును స్మరణ చేతనే పొంది ఆ జ్ఞానం యొక్క శక్తిచే అశేష వాసనలు తొలగిన వాడగును. అప్పుడు అతడు తన మడమతో మూలాధార స్థానము నొక్కి ఉంచి ప్రాణవాయువును క్రమముగా పై నుండి ఆరు స్థానములలో సాగునట్లు శ్రమలేక చేయవలెను. మూలాధారము నుండి నాభి వద్ద నుండి మణిపూరకమునందు చేర్చవలెను. ఆ హృదయము నుండి ఉదాన వాయు సాయముతో కంఠమునకు క్రిందు భాగమునందు విశుద్ధ చక్రమునందు చేర్చవలెను. తరువాత తాను పయనించని మార్గమును మనసులు అనుసంధానము చేయుచు ప్రాణవాయువుతో శిరసు నందలి కపాలమును ఛేదించుకొని బయటకు వెడలవలెను. అర్చిరాది మార్గమున పయనించి అట్లు శరీరమును వీడిన. వాడు పరమాత్మును పొందును. ఇట్లు పరమపదమును కాక చతుర్ముఖ లోకమును సిద్ధ లోకాదులను అణిమాద్యైశ్వర్యములతో కూడిన స్థానమును పొందగోరువారు శరీరమును విడిన తరువాత భూత సూక్ష్మములు ఇంద్రియములుగా లింగ శరీరముతో ఆ లోకములు చేరి మరల ఆ శరీరముతోనే వెనకకు వచ్చును. బ్రహ్మమును పొందగోరువారు కొంత దూరం వరకు ఈ శరీరముతో వెళిన తరువాత ఈ శరీరమును వీడి దివ్య శరీరమును పొందుదురు. భగవత్ భక్తి యోగము కలవారు పరమ పదమును చేరుదురు. జీవుడు బ్రహ్మాత్మకుడిగా ఉండునని ఎరుంగక స్వతంత్రుడిగా ఉండునని ఉపాసించువారు మూడు లోకములకు పైనున్న జనలోకాదుల యందు వాయుభూతముకు సూక్ష్మ దేహముతో పయనించెదరు. ఆ సూక్ష్మ శరీరముతో కూడిన జీవులు వాయువున ప్రవేశించి వాయువేగముతో గమనమును సాగింతురు. ఫలమును కోరి కర్మలను ఆచరించువారు శాస్త్రజన్య జ్ఞానము, కర్మయోగము, యమ నియమాది యోగ సాధన కలిగి బ్రహ్మాత్మకముగా ఆత్మ స్వరూపమును అనుసంధానము చేయు యోగీశ్వరులు పొందిడి లోకమును పొందజాలరు. కేవల కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కేవల జీవనోపాసనము జీవోపాసనము చే యోగుల కంటే భగవత్ ఉపాసకుడు గొప్పవాడు.

భగవత్భక్తి లేని వారు ఈ లోకములో ధూమాది మార్గమున సంచరించుందురు. వెనక చెప్పినట్లు శిర కపాలమును ఛేది భేదించుకొని వెలువడిన జీవుడు ప్రకాశవంతముకు సుషుమ్నా నాడిని గుండా పయనము చేయును. ఆ సుషుమ్నా నాడి ద్వారము భగవత్ భక్తి యోగముచే అనుగ్రహించిన హృదయ కమలమందున్న పరమాత్మ ప్రకాశింపచేయును. ఇట్లు వెలుపలికి వచ్చిన జీవుడు అర్చిహి అను శబ్దముచే వ్యవహరింపబడు అతివాహికుడగు దేవతను పొందును. పుణ్య పాప సంబంధము విడిన వాడై సూర్య మండలము భేదించుకొని సూర్య మండలమునకు ఆవలనున్న సించుమార చక్రమును చేరును. పుణ్య పాపములు నశించిన సూక్ష్మాతి సూక్ష్మ రూపమున ఉన్న లింగ శరీరముతో బ్రహ్మవేత్తలు నమస్కరించి సించుమార చక్రమును దాటును. అచటి నుండి సంకర్షణి యొక్క ముఖము నుండి వెలువడు అగ్నిచే దహింపబడుచున్న ఈ విశ్వమును చూచి అందుగల దోషమును చూచి ఏవగించుకొని సిద్దేశ్వరులచే సేవింపబడు విమానములు గల రెండు పదార్థముల రెండు పరార్థముల కాలము నిలిచి యుండెడి. బ్రహ్మలోకమును చేరును దానికి ముందు వరన ఇంద్రలోకమును చేరును బ్రహ్మలోకము స్వర్గాదుల కంటే చిరకాలం నిలిచియుండునది ఆ బ్రహ్మలోకమునందు శోకముండదు దుఃఖముండదు భయం ఉండదు కానీ పరబ్రహ్మ స్వరూపమును ఎరింగినవాడు ఈ బ్రహ్మలోకములో కూడా దురంతముకు దుఃఖమును కలిగించు సంసారమందరి దుఃఖములు ఉండుటకు అవకాశం ఉన్నదని ఎప్పుడైనను ఈ లోకము కూడా అంతము ముందున్నదే అని ఎరింగి దానిని ఊహించుకొని అచ్చట నిలుచుటకు కూడా బాధపడుచుందురు. ఈ విధంగా ప్రజాపతి లోకము దాటి అండకటాహమునకు మొదట ఆవరణమగు పృథ్వీమయమగు భాగమును చేరి. భయము తీరిన వాడై అతటి నుండి ఆవరణ జలభాగమును చేరి తరువాత జ్యోతిర్మయ ఆవరణము చేరి దానిని దాటి ఆవరణ వాయువును చేరి తరువాత ఆవరణ ఆకాశమును చేరి దానిని భేదించుకొని వెలుపలికి వచ్చును. ఇట్లు ప్రయాణం సాగించుచున్న ముక్తులు బ్రహ్మలోక పర్యంతమందు శబ్ద స్పర్శ రూప రస గంధములను ఏవగించుకొందురు. ఆ బ్రహ్మలోకమును దాటి ఆవరణములలోనికి వచ్చిన తరువాత ఇవి ముక్తులకు తప్ప ఇతరులకు అనుభవింపదగినవి కాకపోవుటచే వాని ఆయా ఇంద్రియములచే అనుభవింతురు. తరువాత అంతఃకరణముచే అభిప్రాయం

గ్రహింతురు. ఈ విధంగా ముక్త పురుషుడు ఆయా ఆవరణములను భేదించుకొని ఆయా గుణములను గ్రహించుచు ముందుకు సాగును. తరువాత మహత్తత్వమును చేరును. ఇట్లు ప్రకృతినంతను అతిక్రమించి శాంతము ఆనందమయమునగు పరమాత్మను చేరును. ఇట్లు అర్చిరాది మార్గమున భగవంతుని చేరుటకై పయనించిన యోగి మరలై ప్రకృతి మండలమున కర్మాధీనమైన ప్రకృతి యందు ఆసక్తి గలవాడు కాడు. ఇట్లు నీకు అర్చిరాది మార్గము ధూమాది మార్గము అని వేద చోదితములగు సనాతనములగు రెండు మార్గములను చెప్పితిని. ఈ మార్గమును గూర్చి ఎరింగి అర్చరాది మార్గమును స్మరించుటయే మరణము ఆసన్నమగునప్పుడు కర్తవ్యము. భగవానుడగు వాసుదేవుని చతుర్ముఖ బ్రహ్మ ఆరాధించగా సంతుష్టుడై ఈ మార్గము రెండింటినీ ఉపదేశించెను. సంసారంలో ఉన్నవారులకు భగవానుడగు వాసుదేవుని యందు భక్తి యోగము తప్ప వేరొక మార్గము మంగళకరము అగునది లేదు. ఈ సర్వ జగత్తు కారణము భగవానుడగు వాసుదేవుడే. తర్వాత భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మత్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Those who conquer, conquer. The three-fold thought of conquest, the body, the self, and the supreme. Salutations to you, who stand firm in the depths of the ocean. Salutations to you, the cause of the pig. You are the one who does not fear defeat. You perform yagnas (sacrifices), and you attain victory Victory. You are tearing apart your body, which is composed of the Rigveda, Yajurveda, and Samaveda. Namaskar. In your hair follicles, sacrifices are merged. You have assumed the form of a boar to save the earth. Greetings to you. Third Canto, 13th Chapter, 34th Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the second episode of the third episode podcast. Until now, we have learned to know the form of Virat Pushnaka, how we should establish meditation in that form, and to know a part of it. Let's learn more about the process of meditation. One should stand facing a statue and observe the statue with the above-mentioned ornaments, limbs, and beauty until one is able to hold it. From the Buddha's mind to the beginning of his feet, to his smile, to that beautiful form, to each of its limbs One should be mindful. After one limb is firmly established in one's mind, one should contemplate that limb. The complete form should be held in the mind until it is retained. Ηerself is then sanctified. Recognizing this form with love, without ceasing, in the mind, is the yoga of devotion. Until this is firmly established, one should remember the gross form, not the subtle form, in the daily practice one performs. Considering the entire universe as appearing externally as the form of the Lord, and after it is established in the mind, one should remember the form mentioned above in the heart with unwavering devotion.

Thus, having attained complete devotion to yoga, when the yogi leaves this body at the end of his karmic cycle, without contemplating the sacred places and times like Ganga Uttarayanam, he sits comfortably on a steady seat, and with his mind, the senses One must control the life force and not let it go to other things. With his determined intellect, through the worship of God, he should become one who has removed the impurities of ignorance, ego, attachment and aversion. The mind should be kept in the business of intellect. The mind should be kept in the business of intellect. That intellect should be established in the being. Having surrendered that being to the Supreme Soul, having attained peace, one should abandon external actions. Upasana should be done until then. One should not abandon karma. These are people who have attained a state of being that is yoga. The order to abandon the body, until the end of the karmic cycle, even if one has the power of yoga, one should not abandon the body. We must wait for the time to come. Those who are devoted to the supreme abode, which is related to Vishnu, and whose intellect is pure through devotion to the worship of the Lord, will be in the supreme abode. At that time There is no government. Even the Brahma and other gods were appointed at that time, and when there was no government there, it is not surprising to say that the Brahma and other gods were appointed there and were not powerful. It is not necessary to say that others in the world cannot appoint that word. Those who do not yield to anyone's command, from the supreme abode of that Vishnu, from the main part, leaving, great egoism. The Sattvic qualities have no effect of any kind. The Upanishads say that this supreme being is such that it is impossible to describe it, and therefore, it is not such that it can be described as something other than it. He who does not let his mind go to other things than God, keeps it in his heart, and when his mind is fixed on it every moment, he becomes accomplished.

The devotee who has realized the divine through the remembrance of all substances and the divine, attains the divine realization and becomes one who has removed all the residual impressions by the power of that knowledge. Then he should press the base of the spine with his heel and, keeping the life air flowing from above in six places in a systematic manner without strain. It should be inserted from the base, from the navel, into the ring of the navel. From that heart, with the help of the upward wind, it should be placed in the throat, in the lower part, in the pure chakra. Then, connecting the path he has not traveled with his mind, he should sever the skull on his head with the life air and exit. Having traveled through the Archiradi path, he abandoned his body. He will find the Lord. Thus, those who wish to attain the supreme abode, the four-faced world, the Siddha world, and the place filled with the eight great riches, after separating the body, those worlds join with the subtle bodies of beings and again with that body It will come back. Those who desire to attain Brahman, go with this body for some distance Then, leaving this body, they attain a divine body. Those who have the yoga of devotion to God will reach the supreme state. Those who do not understand that the soul should be as Brahman, but as an independent being, and those who worship, travel with a subtle body to the people and the worlds above the three worlds. The creatures with that subtle body enter the air and proceed with the speed of air. Those who perform actions desiring results cannot attain the world of yogis who have attained the knowledge of scriptures, the yoga of action, and the yoga of restraint, and who unite the self-form with the Brahman. A yogi is greater than any mere karmanishta. Only by practicing Jivanoopasana, Jivopasana, is a devotee of God greater than a Yogi.

Those who do not have devotion to God wander in this world in the path of smoke. As said before, the being that emerges piercing the head and skull, through the Prakashavat and Sushumna nadis, makes a journey. That Sushumna Nadi, through the door, by the Bhagavat Bhakti Yoga, illuminates the Supreme Soul residing in the lotus of the heart. Thus, the being that comes out will attain the deity who is called Archihi and is known by the sound. Having broken free from the connection of merit and sin, he will penetrate the solar system and reach the auspicious and radiant chakra in the solar system. The Brahmins, with the subtle form of the linga body, which destroys sins and sins, salute and cross the Sanchumara Chakra. Seeing this universe being burned by the fire emanating from the face of Sankarshani, seeing the fault in it, and being pleased, the time of the two substances, two purposes, the two vehicles being served by Siddeswaras, stopped Yeah, I have. He will reach Brahmaloka, before that he will reach Indraloka. Brahmaloka is longer than heaven That which is stable, in that Brahmaloka, there is no sorrow, no suffering, no fear, but one who knows the form of the Supreme Brahman, even in this Brahmaloka, there is a possibility of causing suffering to the end, of sorrow in all the worlds, whenever this The world is also the end, so they imagine it and even feel sad to stand there. In this way, Prajapati crossed the world and reached the earth, which was initially the enclosure for Andaka Taha. Having overcome fear, he reached the outer enclosure from there, then reached the luminous enclosure, crossed it, reached the outer air, then reached the outer sky, and pierced through it and came out. Thus, the liberated ones who are traveling, in Brahmaloka, enjoy the sounds, touches, forms, tastes, and smells. After crossing that Brahmaloka and entering the environs, these are not experienced by others except the liberated ones, so they experience them through their respective senses. Then, the opinion by the inner self

They grasp. In this way, the liberated person, differentiating those enclosures, grasps those qualities and proceeds forward. The great truth will be found out later. Thus, transcending all nature, one attains the supreme being, which is peace and bliss. Thus, the yogi who traveled on the path of Arjuna to reach God is no longer interested in the nature mandalam, in the nature that is dependent on karma. Thus, I have told you about the path of Arjuna, the path of Dhuma, and the two paths that are prescribed by the Vedas and are eternal. Remembering this path, the path of the Archa Rathi, is the duty when death approaches. The four-faced Brahma, pleased with the worship of Vasudeva, the God, instructed both these paths. For those who are in the world, there is no other path that is auspicious except devotion and yoga to Lord Vasudeva. The cause of this entire universe is Lord Vasudeva. We'll learn about the next part in the podcast. Salutations to the Guru of the Universe, Shri Narayana.