బ్రహ్మ నారద సంవాదము & సృష్టి క్రమము (Parts 7-12)
Brahma-Narada Dialogue & Cosmology (Parts 7-12)
శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలో ఈ భాగంలో బ్రహ్మదేవుడు మరియు నారద మహర్షి మధ్య జరిగిన దివ్యమైన సంవాదం కొనసాగుతుంది, ఇందులో సృష్టి రహస్యాలు విశదంగా వివరించబడతాయి. పంచభూతాల నుండి సమస్త జగత్తు వరకు జరిగిన సృష్టి క్రమాన్ని బ్రహ్మదేవుడు అత్యంత గంభీరంగా నారదునికి బోధిస్తాడు. పరమాత్మ తన దివ్యశక్తితో సమస్త సృష్టిని ఏ విధంగా వ్యాపించి నిలబెడుతున్నాడో ఈ సంవాదం స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వ స్వరూపాన్ని మరియు ఆధ్యాత్మిక తత్త్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే భక్తులకు ఈ ఎపిసోడ్ అమూల్యమైన మార్గదర్శిగా నిలుస్తుంది.
In this episode of Srimad Bhagavatham Canto 2, we continue the sacred dialogue between Lord Brahma and the sage Narada, where Brahma reveals the profound mysteries of creation and cosmic order. The discussion unfolds the sequential process of universal manifestation, from the primordial elements to the structure of the living world, as described in the Bhagavatham's timeless cosmology. Narada's earnest inquiry draws out Brahma's deepest wisdom on how the Supreme Lord pervades and sustains all of creation through His divine will and energy. This episode is an invaluable guide for sincere seekers wishing to understand both the outer universe and the inner spiritual reality behind all existence.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యస్య వాచా ప్రజాస్సర్వాః గావస్తంత్యైవ యంతితాః హరంతి బలిమాయత్తాః తస్మై ముఖ్యాయతే నమః నీ వేద రూపమగు వాక్కు జనులను త్రాడు ఎద్దుల వలె ఎద్దులను వలె ధర్మాధర్మములకు బద్ధులను చేసి నియంత్రించుచున్నది. జనులు నీకు అధీనులై సావధాన మనస్కులై నీకు పూజాదికమును సమర్పించుచున్నారు. నీవు పురాణంలో ముఖ్య పురాణం రూపములో ఉన్నావు నీకు నమస్కారము. థర్డ్ క్యాంటో ఫిఫ్తీన్త్ చాప్టర్ ఎయిత్ ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వదీపికలో ఏడవ పాడ్‌కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం పాడ్‌కాస్ట్ లో భగవంతుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని ఏ రకంగా ప్రారంభిస్తాడు అనే విషయంలో మనము సాత్వ అహంకారము గురించి తెలుసుకున్నాము. ఇంకా ముందు తామస అహంకారము, రాజస అహంకారం గురించి తెలుసుకోవాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి ఒకసారి వెళ్లి ఆరవ పాడ్‌కాస్ట్‌ను విని తర్వాత ఇది వింటే బాగా అర్థమవుతుంది. తామస అహంకారమునకు భూతాది అని పేరు. ఇది మార్పు చెంది శబ్దమును పుట్టించి దాని ద్వారా ఆకాశమును పుట్టించును. అందుచేత ఇది శబ్దము గుణముగా కలది. ఆకాశము యొక్క సూక్ష్మ రూపము అనగా దానిని ఇతరమైన వాటి నుండి వేరు చేసి చూపడి అసాధారణ ధర్మమగు శబ్దము భూతాది నుండి వెలువడినది. ఈ శబ్దమే శాస్త్ర రూపముగా వచ్చినది. అదియే ద్రష్ట దృశ్యము అను భేదమును ఎరుంగ చేయునది. ఇట్లు ఆకాశమనడి భూతము తామస అహంకారము నుండి బయలుబడిన తరువాత అది రూపాంతరము చెంది స్పర్శ అనుగుణము గల వాయువు అయినది. దీని అసాధారణ ధర్మము స్పర్శ. కానీ దీనికి ఆకాశము కారణము కనుక దాని ధర్మమగు శబ్దము కూడా వాయువునందుండును.
ఈ వాయువే ఒక అవస్థను పొంది ప్రాణము అనబడును. ఓజస్సు, సహస్సు, బలము అన్నవి కూడా ఈ వాయు యొక్క ధర్మములే. శరీరము ఇంద్రియములు ప్రవర్తించునట్లు చేయు శక్తి ఓజస్సు. ఇది వాయువు వలనే కలుగును. వేగము సహస్సు అనబడును. వేగము కూడా వాయువు వలనే కలుగును. బలము అనగా సామర్థ్యము కూడా వాయువు చేతనే కలుగును. ఇంద్రియములు ప్రవర్తించు సామర్థ్యము ఓజస్సు, మనస్సు యొక్క సామర్థ్యము సహస్సు, శరీరం యొక్క సామర్థ్యము బలము. ఈ మూడింటిని కలిగించునది వాయువు. తామసాహంకారము నుండి శబ్ద గుణము కల ఆకాశము స్పర్శ గుణము కల వాయువు వెలువడిన తరువాత కాలము జీవుని కర్మ అనువానిని వలన ఈ వాయువు కూడా మార్పు చెందును. దాని నుండి రూపము గల తేజస్సు బయలు వెడలును. వెనుకటి రెండు భూతముల యొక్క శబ్దము స్పర్శ కూడా ఈ తేజస్సునందుండును. తేజస్సు మార్పు చెందుట వలన రసము అనుగుణము కల జలము ఆవిర్భవించును. వెనుకటి భూతములు దీనికి కారణమగును. కనుక ఆకాశమందలి శబ్దము, వాయువునందలి స్పర్శ. తేజస్సునందలి రూపము కూడా రసముతో పాటు జలమునందుండును. ఈ జలము మార్పు చెంది గంధమును గుణము గల భూమి అయ్యెను. భూమిని విశేషమందురు. వెనకటి భూతముల యొక్క సంబంధం వలన శబ్దము, స్పర్శ, రూపము, రసము కూడా గంధముతో పాటు భూమియందుండును. భూమి యొక్క ప్రత్యేక ధర్మము గంధము ఇట్లు తామసము భూతాది అనేటి అహంకారము నుండి ఆయా ధర్మములతో కూడిన పంచమహాభూతములు ఏర్పడినవి. అహంకారములలో సత్వగుణము ప్రధానముగా గల అహంకారము వైకారికము అనబడును దానిని సాత్వికాహంకారమందురు. ఈ అహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అనునవి బయలుబడలెను. ఇంద్రియములకు, మనస్సుకు అధిష్టాన దేవతలొందురు. ఆ దేవతలు కూడా ఈ అహంకారము నుండి వెలువడిన వారే. చెవి, చర్మము, కన్ను,
ఘ్రాణము అంటే ముక్కు, నాలుక అనునవి జ్ఞానేంద్రియములు. వీనికి వరుసగా దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలను వారు అధిష్టాన దేవతలు. వాక్ నోరు మాట్లాడునది, పాణి చేయి. పాదము, కాలు, పాయు, మలద్వారము, ఉపస్థ, మూత్రద్వారము అనునవి ఐదును కర్మేంద్రియములు. వీనికి అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి అనువారు వరుసగా అధిష్టాన దేవతలు. మనస్సు అధిష్టాన దేవత. చంద్రుడు ఇట్లు పదునొక్క ఇంద్రియములు పదునొక్క అధిష్టాన దేవతలు తేజస అహంకారము సాత్విక అహంకారముతో ఇంద్రియములను ఆవిర్భవింపజేయును. రాజస అహంకారముతో కలయిక లేనిదే సాత్విక అహంకారము, తామస అహంకారము కూడా మార్పు చెందవు. కానీ ప్రధానముగా సాత్విక అహంకారము నుండి ఇంద్రియములు మనస్సు వచ్చినవి అనియు తామసాహంకారము నుండి భూతములు వచ్చినవి అనియు ఎరంగవలెను. కానీ ప్రధానముగా జ్ఞానశక్తి, క్రియాశక్తి అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. బుద్ధి అనగా అంతఃకరణము అనబడెడి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి నాలుగును తేజస అహంకారము నుండి వెలువడినవి. ఈ విధముగా మహాభూతములు, ఇంద్రియములు, మనస్సు, శబ్దాది గుణములు ఆవిర్భవించినను విడివిడిగా కాక అన్నియు కూడిన గాని బ్రహ్మాండము ఏర్పడదు. ఆ బ్రహ్మాండమే భగవానుని శరీరము. ఆ శరీర నిర్మాణమునకు భగవానుడే ప్రేరణ కలిగించి పంచభూతములను వానిలో అవి కలిగినట్లు చేసెను. అట్లు కరియుటకు పంచీకరణము అని పేరు. మనకు లభించు మహా భూతములు ఐదింటిలో సగము ఆ భూతమునకు చెందిన భాగముండును. ఇప్పుడు మనకు కనబడుతు భూమిలో సగ భాగము భూమి. మిగిలిన సగము జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఉండును. అనగా సగము 1/2 భాగము భూమి భాగము.
1/8 భాగము తేజస్సు. 1/8 భాగము వాయువు. 1/8 భాగము ఆకాశము. 1/8 భాగము జలము. ఇది మనము భూమి అని వ్యవహరించడి మహాభూతం. ఇట్లే పంచభూతములు కూడా ఉండును. భగవానుని శక్తిచే ప్రేరణ చేయబడిన సూక్ష్మభూతములు. పైన చెప్పిన పాళ్ళలో పంచీకరణము చెంది మహాభూతములుగా ఏర్పడినవి. ఇవి స్థూలముగా సూక్ష్మముగా కూడా ఉండును. ఒకప్పుడు కారణముగా ఉండును. అప్పుడు అది సూక్ష్మం అనబడును. అది ఏ కార్యమై స్థూలము అనబడును. స్థూలముగా ఉన్న దానిని సత్తు అందురు. సూక్ష్మముగా ఉన్నప్పుడు అసత్తు అందురు. ఇట్లు పరమ పురుషుని సంకల్పముచే సత్వరజస్తమో గుణములు కల ప్రకృతి బ్రహ్మాండముగా పరిణమించినది. ఆ బ్రహ్మాండము ప్రళయ కాలాంతము వరకు జలములో మునిగి యుండెను. అప్పుడు ఆ బ్రహ్మాండము నుండి ఒక పురుషుడు బయలుదేరెను. అతడే విరాట్ పురుషుడు. ఈ సమిష్టి పురుష శరీరుడగు బ్రహ్మ కాలము, కర్మ, స్వభావము అను వానిని ఆధారముగా చేసుకొని చైతన్యము లేని బ్రహ్మాండమున చలనమును కలిగించెను. ఆ అండమును ఛేదించి వెలువడిన పురుషునే పురుష సూక్తము వర్ణించినది. అతనికి సహస్ర శిరస్సులు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు. పురుషుడు చేయి దానికంటే వెయ్యి రెట్లు అధికముగా చేయగలవాడని వాడని ఎరంగవలెను. బ్రహ్మాండమంతయు అతని శరీరముగా భావించునప్పుడు ఆయా లోకములను ఆయా అవయవములుగా ఉపాసకులు భావించుందురు. క్రిందనున్న అతలము మొదలు ఏడు లోకములను ఆ పురుషుని పిరుదులకు క్రింద భాగము నుండి పాదముల వరకు ఉండు భాగములుగా కల్పించుకొందురు. బొడ్డు క్రింద నుండి భాగము ఆరంభించి శిరస్సు వరకు పైనుండు అవయములుగా భూమ్యాది ఏడు లోకములను కల్పించుకొందురు. ఇట్లు 14 లోకములు ఆ పరమ పురుషుని శరీరముగా భావించి ఉపాసింతురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు అన్నియు విభూతులే అని ఎరుంగుటకు ఆ పురుషుని అవయవములుగా ఉపాసింతురు. దీనిచే నాలుగు వర్ణములు ఆ పురుషుని అవయవుల వంటివే. బ్రాహ్మణుడు ముఖము, క్షత్రియుడు బాహువులు, ఊర్వులు వైశ్యులు, పాదములు క్షూద్రులు అని కల్పించుటలోని భావమిది.
వేరొక విధముగా కూడా కొందరు భావించుందురు. పాతాళం మొదలు భూలోకం వరకు పాదములు మొదలు కటిపర్యంత వరకు అవేములు. భావింపబడినవి. పాదా పాతాళం మొదలు భూలోకము వరకు పాదములు మొదలు కటి పర్యంతము అవయవములుగా భావింపబడినవి. నాభి మొదలు వక్షోభాగం వరకు భూవర్లోకము దాని పైన ఉరము మహర్లోకము. మెడ జనోలోకము, భృభాగము తపోలోకము, మూర్ధ అనగా శిరస్సు సత్యలోకము లేదా బ్రహ్మలోకం. బ్రహ్మలోకమే వైకుంఠమనియు చెప్పుదురు. ఇది ఎల్లకాలములందు ఉండెడది. కటి ప్రదేశమునందు అతల లోకము, పిక్కలు తలాతలము, చీలమండలు మహాతలము, మీగాళ్ళు రసాతలము, పాదము పాతాళము. ఇట్లు ఆ విరాట్ పురుషుని అవయవములుగా లోకములన్నియు ఉన్నవని భావించి బ్రహ్మాండమునే విరాట్ పురుషుని విగ్రహముగా ఉపాసింతురు లేదా పాదములచే భూలోకము నాభిచే భువర్లోకము, శిరస్సుచే స్వర్లోకము కల్పింపబడినవి మూడు లోకములన్నిటి భావనచే కొందరు ఉపాసన చేయుదురు. మిగతా భాగాన్ని ఆ వర్ణన ఏమిటో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. By whose speech all the people are liberated, they are destroyed, they are killed by the illusion of sacrifice. Salutations to that chief. You are the form of the Vedas, the word, like a rope to the people, like oxen, bound to righteousness and unrighteousness It is controlling. People are subject to you, with a mind of attention, offering you worship and other things. You are in the form of the main Purana in the Puranas, I salute you. Third Canto, Fifteenth Chapter, Eighth Prayer. Dear devotees, welcome to the seventh podcast in the Srimad Bhagavata Tattvadipika. In the previous podcast, we learned about the Sattva ego in the matter of how God starts this creation program. Next, we need to learn about Tamas and Rajas ego. To understand this better, go back and listen to the sixth podcast, then listen to this one, it will be better understood. Tamas is the name of the egoistic element. This changes, creates sound, and through that, it creates the sky. Therefore It is a sound that has a quality of being a quality. The subtle form of the sky, that is, separating it from other things, the sound, which is an extraordinary attribute, originated from the earth. This sound itself has come as a form of science. That is what makes the distinction between the seer and the seen. Thus, after the element of sky, the ghost, emerged from the Tamas ego, it transformed and became the air that is in accordance with touch. Its only unique attribute is its touch. But since the sky is the cause of this, its dharma, the sound, is also in the air.
This air, having attained a state, is called life. Strength, endurance, and power are also the properties of this air. The power and strength that makes the body and senses function. It is caused by the presence of a gas. Speed is called patience. Speed is also caused by air. Strength, meaning capability, is also caused by air. The ability of the senses to function, strength, the ability of the mind, patience, the ability of the body, strength. The three that cause this are air. After the sound-qualified sky and the touch-qualified air are released from the state of inertia, this air also changes due to the karma of the living being. From it, the radiance that is formed will emerge. The sound and touch of the past two ghosts are also present in this radiance. Due to the change in radiance, water with the taste of juice will emerge. Past events can be a reason for this. Therefore, the sound in the sky, the touch in the air. The form in the radiance is also with the juice along with the water. This water changed and became a land with fragrance and qualities It happened. They are special to the earth. In the past, due to the connection of elements, sound, touch, form, and taste, along with smell, existed on earth. The special property of the earth is fragrance. Thus, from the ego called Tamas and Bhutadi, the Panchamahabhutas, which are composed of those Dharmas, were formed. Among egos, the ego with the quality of goodness as the main one is called Vaikarika, and that is called Sattvika ego. From this ego, the senses of knowledge, the senses of action, and the mind will emerge. The presiding deities are of the senses and of the mind. The gods too are revealed to be far from perfect. Ear, skin, eye,
Ghaṇṇāṁ means nose and tongue are the sense organs. These are the deities Vayu, Surya, Varuna, and Ashwini, who are their presiding deities. The mouth is the organ that makes sounds, and the hand is the organ that moves. The five organs of action are the foot, leg, anus, genitals, and urinary opening. He is associated with Agni, Indra, Vishnu, Mitra, and Prajapati, who are the presiding deities. The presiding deity is the mind. The moon thus, with its eleven senses, the eleven presiding deities, with their radiance, ego, and sattvic ego, manifest the senses. Without the combination of Rajasic ego, Sattvic ego and Tamasic ego also do not change. But mainly, it is said that the senses and mind came from Sattvic ego, and the elements came from Tamasic ego. But mainly, the main ones are the power of knowledge, the power of action, that is, the sensory organs and the motor organs. Buddhi, meaning the inner instrument, is the mind, intellect, consciousness, and ego; these four are emanations from the radiant ego. In this way The great elements, senses, mind, and other qualities of sound, etc., even if they appear separately, without being united, the universe cannot be formed. The universe is the body of the Lord. The Lord inspired the body structure and made the five elements in it as they are. That is called Panchakaranam. The great beings we obtain, half of them belong to that being. Now we see half of the earth, the earth. The remaining half is water, light, air, and sky. That means half, 1/2 part, is the land part.
1/8 Part Tejasswi. 1/8 of the gas. One eighth is sky. 1/8 part of water. This is the great earth, which we consider as our earth. Similarly, there are five elements. Microorganisms induced by the power of God. In the above mentioned parts, they were divided into five and formed into great beings. These are both gross and subtle. It used to be a cause. Then it is called subtle. That is called a gross object. The one who is gross is called Sattu. When it is subtle, it is untrue. Thus, by the will of the Supreme Being, the nature with the qualities of Sattva, Rajas, and Tamas, has transformed into the universe. That universe was submerged in water until the end of the deluge. Then out of the firmament a man was sent. He is the Virat Purushu. This collective male body, Brahma, taking time, action, and nature as his basis, caused movement in the unconscious universe. The male who emerged from the breaking of the egg is described in the Purusha Sukta. He has a thousand heads, a thousand Eyelashes, a thousand feet. He is like a man who can do a thousand times more than what a man can do. When the universe is considered as his body, the devotees consider those worlds as their respective limbs. From the bottom of the abode, starting from the seven worlds, they create the parts from the bottom of that man's buttocks to the parts from the feet. Starting from below the navel, up to the head, as the upper parts, they create the seven worlds from the earth. Thus, the 14 worlds are considered as the body of that Supreme Being and are worshipped. Brahmin, Kshatriya, Vaishya, Shudra, all are manifestations, to know this, they worship that man as their limbs. The four varnas are the limbs of that Purusha. The Brahmin's face, the Kshatriya's arms, the Vaishyas' feet, and the Shudras' feet, this is the meaning in the creation.
Some people also think in a different way. From the netherworld to the earth, from the feet to the pelvic region, they are the same. They are considered. From the feet to the netherworld to the earth, from the feet to the pelvic region, they are considered as organs. From the navel to the chest, the earthly world; above that, the chest, the great world. Mada janaloakam, bhrugamu taapaloakam, mudho anaga sirassu satyalokamu leda brahmalokam. Brahmaloka is also called Vaikuntha. This will be there forever. In the pelvic region, the netherworld; in the calves, the head; in the ankles, the great netherworld; in the soles, the netherworld; in the feet, the netherworld. Thus, considering that the entire universe exists as the limbs of that Virat Purusha, they worship the universe itself as the idol of Virat Purusha, or the earthly world by the feet, the world by the navel, The three worlds created by the head are worshipped by some with the feeling of all three worlds. Let's see what the rest of the description is. Jai Srimannarayana. Salutations to the Asmadgurus