వివిధ్య దేవతారాధనలు - అనన్య శరణాగతి వైశిష్ట్యము
Worship of Demigods vs. Pure Devotional Service
శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్లో, శ్రీ శుకదేవ గోస్వామి వివిధ దేవతారాధనల ఫలితాలు మరియు శ్రీ విష్ణు భక్తి యొక్క సర్వోత్కృష్టతను అద్భుతంగా వివరిస్తారు. ఇతర దేవతలను ఆరాధించేవారు తాత్కాలికమైన, పరిమితమైన ఫలాలను మాత్రమే పొందుతారు, అయితే భగవంతుని యందు అనన్య శరణాగతి చేసిన భక్తుడు మోక్షాన్ని మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. అనన్య శరణాగతి అనే మహోన్నత సాధన మనిషికి లభించిన అత్యున్నతమైన మార్గమని శ్రీ శుకుడు స్పష్టంగా నిరూపిస్తారు. సమస్త ఆరాధనలు చివరికి పరమాత్మ చరణ సేవలోనే పరిపూర్ణతను పొందుతాయని ఈ ప్రవచనం మనకు గుర్తుచేస్తుంది.
In this sacred episode from Canto 2 of Srimad Bhagavatham, the great sage Shukadeva Goswami illuminates the profound difference between the worship of demigods for material boons and the path of pure, unconditional devotion to the Supreme Lord Sri Vishnu. Those who worship various demigods receive temporary, limited results corresponding to the nature of those deities, while the devotee who surrenders exclusively to the Lord attains liberation and eternal bliss. This episode powerfully establishes that Ananya Sharanagati — complete and undivided refuge in the Lord — is the highest and most exalted path available to the human soul. Shri Shuka's timeless wisdom reminds us that all other forms of worship ultimately find their fulfillment only in the loving service of the one Supreme Being.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో విజ్ఞాన వీర్యాయ మాయయేదముపేయుషే గృహీత గుణ భేదాయ నమస్తే వ్యక్తయోనయే చైతన్య శక్తియే నీ బలము గుణములలో ఒకటే రజోగుణమును ఉపాధిగా స్వీకరించి నీవి చతుర్ముఖ రూపమును పొందితివి. పరబ్రహ్మ యొక్క మాయాశక్తి నుండి ప్రకటమైన నీకు అనేక నమస్కారములు. థర్డ్ క్యాంటో 15th చాప్టర్ ఫిఫ్త్ ప్రేయర్. భవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. ద్వితీయ స్కంధం ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం. వేదగర్భుడైనటువంటి చతుర్ముఖునికి చతుర్ముఖుడు నారదుడికి ఏ రకంగా భావతాన్ని వివరించారు ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. పూర్వము నారదుడు బ్రహ్మను చేరి దేవదేవా నమస్కారము. సకల భూత సృష్టికర్తవు నీవు. నీవు అందరికూ ముందు జన్మించిన వాడవు. ఆత్మ తత్వమును విశేషముగా ప్రకాశింపజేయు జ్ఞానమును నాకు ఎరంగింపజేయుము. ఈ కనపడుచున్న జగత్తునకు నిమిత్త కారణం ఎవడు? దీనికి ఉపాదాన కారణం ఎవడు? కుండకు కుమ్మరి నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణం. అట్లే కార్యమగు ఈ జగత్తు ఎవరిచే సృజించబడినది? ఏ పదార్థముచే సృజింపబడినది? దేనిని ఆధారంగా చేసుకుని నిలుచున్నది? మరల చివరకు దేని యందు నిలబడుచున్నది? దీనిని వాస్తవంగా ఎరుగింపుము. ఈ రహస్యమంతయు నీకు తెలియును. నీవు జరిగిన కాలములో, జరుగుచున్న కాలములో, జరగబోవు కాలములో ఉన్న సకల పదార్థములను పుట్టించిన వాడవు.
నీ విజ్ఞానముచే నీవు అంతను అరచేతిలో ఉన్న ఉసిరికను వలె ఎరుంగ గలవాడవు. జగత్తును గూర్చి కాక నిన్ను గూర్చి కూడా నాకు ఎరుంగ చేయుము. నీవు ఏ విషయమున పరిపూర్ణమగు జ్ఞానము కలవాడవు. నీకు ఆ విజ్ఞానము ఎట్లు కలిగినది? నీకు ఆశ్రయము ఎవరు? నీకు స్వామి ఎవరు? నిన్ను ధరించి నిలిపెడి ఆత్మగా ఉన్న వారు ఎవరు? నా దృష్టిలో నిన్ను నియమించు వారు ఎవరూ లేరని నీవు స్వతంత్రుడవని తోచుచున్నది. నీవు అసహాయుడవై నీ సంకల్పముచే ఆ పంచభూతములతో దేవతలు మొదలగు వారిని సృష్టించుచున్నావు. సృజింపబడిన సకల భూతములను నీవు క్రింద పడకుండా కాపాడుచున్నావు. సాలీయుడు తన శక్తితో తనలో మరుగుపడి ఉన్న దారమును వెలికితీసి గూటిని సృష్టించి నిలిపి లేకుండా చేసినట్లు చేయుచున్నావు. నా దృష్టిలో ఈ సర్వ జగత్తునకు కారణం నీవే గానీ నీకంటే పరులు గానీ నీతో సముడు గానీ వేరొకడు లేడని తోచుచున్నది. నామ రూపములు గల చేతనా చేతనాత్మకమగు ఈ జగత్తునంతను నీయంత నీవే ఎరంగుచున్నావు. కానీ నీవు కూడా ఇతరులు చేయుటకు శక్యమగాని గొప్ప తపస్సుని చేయుచున్నావు కదా. నీ ఏమి పొందవలెనని తపస్సు చేయుచున్నావో నాకు గోచరించుట లేదు. నీకంటే గొప్పవారు ఎవరైనా ఉందురేమో అని నీవు తపస్సు చేయుచుంటులేవు. నీకంటే గొప్పవారు ఎవరైనా ఉందురేమో అని నీవు తపస్సు చేయుచుండుటచే నా మనసున శంక కలుగుచున్నది. నీవు అన్నియుని ఎరిగినవాడవు. అన్నిటిని నియమించువాడవు. నా సందేహమును తీర్చి నాకు పై విషయములు స్పష్టముగా ఎరంగింపుము. ఇది నారదుడు చదునుగు బ్రహ్మను. అడిగిన ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకి నారదుడు ఇట్లు ప్రశ్నింపగా బ్రహ్మ ఇట్లు అనుచున్నాడు. ఓ నారదా నీకు నా యందు కరుణ కలగదు కరుణ గలదు అందుచే ఇట్టి శంఖ కలిగినది. నీవు అడిగిన ప్రశ్న అసత్యం అనుటకు వీలు కాదు. నాకంటే వేరొక తత్వం ఉన్నదని ఎరుంగుట చాలా కష్టం. అది భగవానుని కటాక్షము చేతనే తెలియవలెను. దాని ఎరుంగకపోవుటచే నీకు శంక కలిగినది. ప్రశ్నించినావు. లోకములో ప్రకాశమునిచ్చు సూర్యుడు మొదలగు తేజోరాశులు ఆ పరాత్ముని తేజస్సుచే తాము ప్రకాశించుచు లోకము ప్రకాశింప చేయుచున్నవి.
ఆ ప్రకాశము తమదే అని అవి అనుకొనుట ఎంత అవివేకమో నేనే సృష్టిని చేయుచున్నానని అనుకొనుట అంతటి అవివేకం. లోకమునంతను ప్రేరణ చేయువాడు ప్రకాశింప చేయువాడగు భగవానుడైనట్టి వాసుదేవునకు నమస్కారము వానినే నేను ధ్యానించుచుందును. వాని విచిత్రమగు సంకల్పముచే నన్ను జగద్గురు అని తత్వవేత్తలు కూడా అనుసుందురు. అతని విచిత్రమగు మాయను ఎవ్వరును జయింపజాలరు. ఆ మాయ భగవాను దృష్టి పదములో నిలుచుటకు సిగ్గుపడును. లోకులనందరూ ఆ మాయ చేతనే నేను అని తమను స్వతంత్రులుగా భావింతురు. నాది అని తమకు చెందని వానిని తమవిగా అభిమానింతురు. కానీ మాయ ప్రభావం వాసుదేవుని వద్ద సాగదు. లోకములోనున్న సకల ద్రవ్యములు కర్మ, కాలము, స్వభావము, జీవుడు అనునవి అన్నియు వాసుదేవుని కంటే వేరైనవి కావు. కొందరు ఈ జగత్తునకు కారణము పృథివి మొదలు ద్రవ్యములే అందురు. మరికొందరు కర్మయే కారణమందురు. మరికొందరు కాలమే సృష్టి నిర్వహించునందురు. మరికొందరు స్వభావమే సృష్టికి మూలమందురు. కొందరు జీవుడే సృష్టిని చేయువాడందురు. కానీ వీటన్నిటిలో వాసుదేవుడు అంతర్యామి అయి ఉండి వానిని నిలుపుట చేతనే అవి ఉన్నవి. వాడు లేని పదార్థం ఏదియు లోకములో లేదు. వేదమునకు నారాయణుడే మూల కారణము. అతని నిశ్వాసమే వేదముగా వెలువడినది. ఆ వేదములు నారాయణుని ప్రతిపాదించును. వేదములలో చెప్పబడిన ఇంద్రాది దేవతలు నారాయణుని అవయవుల నుండి జన్మించిన వారు అతనికి శరీర భూతులు. లోకములన్నియు నారాయణుడే స్వామిగా గలవి. క్రతువులు అన్నిటి చేతను ఆరాధింపబడువాడు నారాయణుడే. యోగాభ్యాసము లేదా ధ్యానము చేయువారు నారాయణుని పొందుదురు. తపస్సు చేత, కర్మ చేత పొందబడువాడు నారాయణుడే. శాస్త్రమును ఎరింగించెడి జ్ఞానము చివరకు నారాయణుని ఎరింగించును. అన్ని సాధనలచే పొందెడి ఫలము నారాయణుడే. ఆ ఫలమును పొందించెడి మార్గము నారాయణుడే.
అట్టి సర్వాంతర్యామియగు సర్వజ్ఞుడగు సర్వనియామకుడగు నిర్వికారుడగు నారాయణుని చేతనే నేను సృష్టించబడితిని. అతడు వసంగిన ప్రేరణ చేతనే నేను ఈ లోకములను సృజించుచున్నాను. నేను అందరికంటే పైవాడనన్నట్లు తోచునట్లు అతడే చేయుచున్నాడు. అతనికి విడవదగిన గుణములగు సత్వ, రజ, తమస్సులు సంబంధము లేదు. ఆ గుణములు గల ప్రకృతి అతనిచే నియమింపబడును. సృష్టికి స్థితికి సంహారమునకు పరికరముగా ఆ గుణములు కల ప్రకృతిని అతడు తన వశమందు ఉంచుకొని సృష్టింపచేయును. మాయ అతని అధీనమునందుండును. మేము మాయ అధీనమందు అందుందుము. ఈ ప్రకృతి గుణములకు సత్వ రజస్తమస్త్యములు శరీరము ఇంద్రియములు అనువానిచే పుణ్యము పాపము అనేటి కర్మలను చేయుటకు నిత్యుడగు జీవుని తన వశమందు ఉంచుకొనును. ఆ మూడు గుణములే ప్రకాశమును, ప్రవృత్తిని, మోహమును కలిగించు స్వభావము గలవై ఉండును. ఆ గుణములు ప్రధానముగా గల ద్రవ్యములు ఆ స్వభావములు గలవిగా మనకు తోచుచుండును. ఇట్లు తన లీలకై మాయను తనకు పైకరముగా చేసుకునిన సర్వేశ్వరుడు అన్నిటినీ నియమింపగల ఐశ్వర్యము గలవాడు. స్వచ్ఛందమగు గతి గలవాడు. అందరకు నాకు కూడా అతడే నియామకుడు. ఈ సృష్టి అంతయు సర్వేశ్వరుడగు భగవానుడే. మాయ అనబడు ప్రకృతిని తన అధీనమందు ఉంచుకొని తన సంకల్పముచే ఆ ప్రకృతి ద్వారా అనేక నామములు రూపములు గలదానివిగా తానే కనపడుచుండును. ఈ ప్రకృతిని తానే తనకు శరీరముగా ఉండునట్లు స్వీకరించి తానే నానా రూపములు గలవాడై జగద్రూపమును కనపడుతును. మొట్టమొదట భగవానుని సంకల్పముచే కాలము ప్రకృతియందలి సప్తరజస్తమస్సులలో వైషమ్యమును కలిగించును. అట్లు గుణములు క్షోభ చెందుటచే ప్రకృతిలో పరిణామము కలుగును. పరిణామము చెందుట ప్రకృతి యొక్క స్వభావము. దానికి ప్రేరకము జీవుల యొక్క కర్మ. ప్రకృతిలో జీవుడు చేరగని జీవుని అదృష్టముగు కర్మ వలన ప్రకృతి పరిణామము నొందును. పరమ పురుషుడు జీవుని ద్వారా ప్రకృతిలో చేరుటచే అవ్యక్తము నుండి మహత్తత్వం బయలు వెళ్ళినది.
ఆ మహత్తత్వము రజోగుణముతో కూడిన సత్వగుణముచే కదలిక కలదై ద్రవ్యము, జ్ఞానము, క్రియ అనే మూడు విధములకు స్వభావము గల అహంకారముగా పరిణమించును. అందు తమోగుణము ప్రధానముగా గల అహంకారము నుండియే మోహమును కలిగించును. ద్రవ్యములు బయలు వెడెను. సత్వగుణం ప్రధానముగా గల అహంకారము నుండి జ్ఞానము, ప్రకాశము కలుగు ఇంద్రియములు, ప్రవృత్తి కూడా కలుగును. మహత్తత్వము, సత్తరజస్తమస్సులు అను మూడును కలిగి ఉన్నది. అయినను అందు తమోగుణము పాలు తక్కువ. రజస్తత్వములే ఎక్కువగా నుండును. రజోగుణముచే క్రియాశక్తి, సత్వగుణముచే జ్ఞానశక్తి మహత్వత్వమునందు కనపడుచుండును. దాని నుండి వచ్చిన అహంకార తత్వము తమోగుణం ప్రధానముగా ఉండును. అందుచే అహంకారము నుండి వెలువడిన వానిలో తామసము అధికము, రాజసము సాత్వికము అల్పముగా ఉండును. మహత్తత్వము నుండి వెలువడిన వానిలో తామసము అల్పము, రాజసము సాత్వికము అధికముగా ఉండును. అహంకారము మహత్తత్వము నుండి వెలువడును. అది మార్పు చెందుచు వైకారికము, తైజసము, తామసము అని మూడుగా మారును. సత్వగుణము అధికముగా గల అహంకారం వైకారికము ఇది సాత్వికము. తమోగుణము అధికముగా గల అహంకారము భూతాది ఇది తామస అహంకారము. తామస అహంకారమునకు ద్రవ్యములను ఏర్పరచు శక్తి కలదు. దాని చేతనే మహాభూతం వచ్చుచున్నవి. రాజస అహంకారము సాత్విక అహంకారముతో కూడి క్రియాశక్తిని, ప్రజాశక్తిని కలిగించును. దీని చేతనే కర్మలు చేయగల శక్తి గల కర్మేంద్రియమును ఏర్పడును. సాత్విక అహంకారమునకు జ్ఞానమును కలిగించు సామర్థ్యము గలదు. అందుచే శబ్దాది విషయముల గూర్చిన జ్ఞానము కలిగించు ఇంద్రియములు సాత్విక అహంకారము నుండి వెలువడును. ఇంకా ముందు భాగాన్ని ఈ అహంకారాల విషయంలో ఉన్నటువంటి వివరాలు ముందు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the knowledge and power of Maya, which is the one who is accepted by the house, the one who is the manifestation of the qualities. Your strength is one of the qualities, accepting the Rajoguna as a means, you have attained the four-faced form. Many salutations to you, who are proclaimed from the illusionary power of the Supreme Brahman. Third Canto, 15th Chapter, Fifth Prayer. Oh, my dear relatives, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the sixth podcast episode of the second Skandam. They are telling us here how the four-faced one explained the feeling to Narada, who is the embodiment of the Vedas. In the past, Narada approached Brahma and offered salutations. You are the creator of all beings. You were the firstborn. Make me enlightened with the knowledge that especially illuminates the essence of the soul. Who is the instrumental cause of this visible world? Who is the main reason for this? The potter is the cause, the clay is the material cause. Similarly, by whom was this world created? What material is it made of? What Is it based on that? Again, finally, what is it standing on? This is a literal translation. You already know the secret. You are the one who created all the substances in the past, in the present, and in the future.
By your knowledge, you are able to grasp everything like a gooseberry in your palm. Do not only teach me about the world, but also about you. You are perfect in every way. How did you get that knowledge? Who is your refuge? Who is your God? Who are those who are the soul that holds you and keeps you? In my opinion, it seems that there is no one to appoint you, and you are independent. You, being helpless, are creating the gods and others with those five elements by your will. You have protected all the created beings from falling. You are doing as if Salyudu, with his power, has unveiled the thread hidden within himself, created a nest, and made it without ceasing. In my view, you are the reason for this entire world, but it seems that there is no one else like you, neither greater than you nor equal to you. You are the one who is the cause of this world, which is full of names and forms, and you are the one who is the cause of everything. But you too are doing great penance that is impossible for others to do, right? What penance should I perform to attain what you desire I don't see you doing anything about it. You are doing penance thinking that there might be someone greater than you. I have a doubt in my mind that there might be someone greater than you, because you are doing penance. You know everything. You are the one in charge of everything. Clear my doubts and make the above matters clear to me. It is Narada who has taken the form of Brahma. The question was supposed to be the one asked. When Narada asked this question, Brahma replied thus. Oh Narada, you do not have compassion for me, but you have compassion. Therefore, such a conch is created. It is not possible to say that the question you asked is false. It is very difficult to know that there is a different nature than mine. It is only through the grace of God that it is known. Because it did not shine, you had a doubt. You asked. In the world, the sun, the light-giving sun, and other luminaries shine by the light of that Supreme Being, and they illuminate the world.
How foolish it is for them to think that the light belongs to them, it is as foolish as thinking that I am creating the universe. I meditate on the Lord, the Lord, who inspires and illuminates the whole world, the Lord of Vasudeva. By his peculiar resolve, even the philosophers believe me to be a Jagadguru. No one could ever overcome his strange illusion. That illusory God is ashamed to stand in the sight of the feet. All the people think that I am because of that illusion, and they consider themselves independent. They admire someone who doesn't belong to them, claiming it's their own. But the illusionary effect does not work with Vasudeva. All the substances in the world, karma, time, nature, and the living being, are not different from Vasudeva. Some say that the cause of this world is the earth and the beginning of matter. Others attribute the cause to karmic reasons. Others believe that time itself is the creator. Others have a naturalistic worldview. Some people believe that God is the creator. But among all these, Vasudeva being the inner controller, keeping him They are there in the end. There is nothing in the world that he does not have. Narayana is the cause of the Vedas. His breath came out as a Veda. The Vedas proclaim Narayana. The gods, as described in the Vedas, including Indra, were born from the parts of Narayana, and are his bodily beings. All the worlds are ruled by Narayana. Narayana is the one who is worshipped by all the rituals. Those who practice yoga or meditation will attain Narayana. Narayana is the one who is attained by the penance and by the rituals. The knowledge that eradicates the scriptures ultimately eradicates Narayana. The fruit obtained by all means is Narayana. The path to attaining that fruit is Narayana.
I was created by Narayana, who is omnipresent, omniscient, omnipresent, and without attributes. By the inspiration of God, I am creating these worlds. It seems as if I am the highest one, and he is doing it. He has no qualities that are worthy of separation, such as Sattva, Rajas, and Tamas. Nature, which has such qualities, is subject to him. He creates by keeping the nature with those qualities in his control, which is the instrument for creation, to destruction. The illusion is under his control. We are under the spell of May. These qualities of nature, namely Sattva, Rajas, and Tamas, along with the body and senses, keep the eternal being in their control to perform actions of merit and sin. Those three qualities are the nature that causes light, behavior, and delusion. Those qualities, the substances that primarily possess them, appear to us as having those characteristics. Thus, the Lord, who made Maya as his own superior for His play, is the one who has the wealth to rule over all. One who is at ease. To everyone He's my man. The creator God is the one who created all of creation. Maya, being the nature that is called, keeping it under her control, through her will, through that nature, appears to herself as having many names and forms. Accepting this nature as his own body, he himself, being of various forms, appears as the form of the world. First, by the will of God, time causes inequality among the seven metals in nature. Thus, due to the disturbance of qualities, evolution occurs in nature. The result is the nature of nature. The motivation for that is the karma of the beings. In nature, the evolution of nature is due to the karma of the creature that cannot join the creature. The Supreme Being, through the individual soul, by entering into nature, from the unmanifest, the greatness of the greatness has gone out.
That great element, mixed with the quality of passion, being in motion by the quality of goodness, becomes an ego that has the nature of being the substance, knowledge, and action, of the three kinds. Therefore, from ego, which is primarily of the quality of darkness, delusion arises. The treasuries have been opened. From the ego, which is primarily of the quality of goodness, knowledge, light, senses, and also inclination are obtained. It contains the three which are the Mahatatvam, Satarajastamassu. However, their Tamoguna (quality of being Tamasic) is less. The desert is very large. Due to Rajas Guna, the power of action; and due to Sattva Guna, the power of knowledge is seen in the greatness. The egoistic nature that comes from it is primarily of the tamoguna (quality of darkness). Therefore, in one who emerges from ego, Tamas is more, Rajas is less, and Sattva is moderate. In one who emerges from the great element, Tamas is less, Rajas is more, and Sattva is more. Ego is born out of the great element. It changes into Vaikari, Taijasamu, and Tamasamu, three types. Ego, which has more sattvic qualities, is vaikarika. This is sattvic. The ego that is excessively full of Tamoguna, Bhutadi, this is Tamasic ego. Tamasic ego has the power to accumulate wealth. It is through that which the great beings come to be. Rajasic ego, combined with sattvic ego, generates action energy and public energy. It is through this that the karmendriya, which has the power to perform actions, is formed. It has the ability to impart knowledge to the Satvik ego. Therefore, the senses that generate knowledge about sound and other subjects originate from the Sattvic ego. Let's learn more about the details regarding these egos in the next podcast. Jai Srimannarayana, salutations to the Gurus