మూల చతుశ్లోకి & భాగవత దశలక్షణములు (Parts 13-17)

Core Chatushloki & Bhagavata Characteristics (Parts 13-17)

bhagavatam

ఈ భక్తిపూర్వకమైన ఎపిసోడ్‌లో, స్కంధం 2లోని మూల చతుశ్లోకిని విశ్లేషిస్తాము — స్వయంగా శ్రీమహావిష్ణువు బ్రహ్మకు పరమసత్యమును వివరించిన నాలుగు మూలభూతమైన శ్లోకాలు. ఈ దివ్యమైన శ్లోకాలు పరమాత్మ స్వరూపమును, సృష్టి రహస్యమును, మరియు శరణాగతి మార్గమును అద్భుతంగా ప్రకాశింపజేస్తాయి. అనంతరం, భాగవతమును సర్వ శాస్త్రాలలో శ్రేష్ఠముగా నిరూపించే దశలక్షణములను విస్తారంగా చర్చిస్తాము.

In this profound episode of our Srimad Bhagavatham podcast, we explore Canto 2's Mula Chatushloki — the four foundational verses in which Lord Vishnu Himself reveals the essence of ultimate reality to Brahma. These sacred verses illuminate the nature of the Absolute Truth, the origin of creation, and the path of surrender to the Supreme. We then delve into the Dasha Lakshanas, the ten distinguishing characteristics that define the Bhagavatam as the pinnacle of all scriptures, offering seekers a complete map of spiritual knowledge.

← Prev Next →
Core Chatushloki & Bhagavata Characteristics (Parts 13-17) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యో మాయయా విరచితం నిజయాత్మనీదం కేరూప ఖేదమివ తత్ప్రతి చక్షణాయ యేతేన ధర్మ సదనే ఋషి మూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై ఆకాశములో ఘటాకాశము, మఠాకాశము మొదలగు భేదములు లేకున్నను కల్పించబడుచుండును. అదే విధముగా అద్వయ పరబ్రహ్మ యందు భేదములు లేవు. అయినను ఆ పరబ్రహ్మ తన మాయాశక్తిచే తన యందే ఈ నానా నామ రూపాత్మక జగత్తును ప్రకటింపజేసెను. అట్టి తన యధార్థ స్వరూపమును భక్తులకు ప్రకాశింపజేయుటకై ఆ పరబ్రహ్మ ఈనాడు ఈ ఋషి దేహముతో ధర్మును గృహములో ఆవిర్భవించెను. ప్రకృతికి అతీతుడు పూర్ణ స్వరూపుడగు అట్టి పరమేశ్వరునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 56 ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధం. 13వ పాడ్కాస్ట్ లో మీ అందరికీ స్వాగతం. ఇంతవరకు మనం నారదుడు అడిగిన ప్రశ్నకు చతుర్ముఖ బ్రహ్మ తెలిపినటువంటి అవతారాల గురించి భగవంతుని యొక్క స్వరూపం గురించి చెప్పిన విషయాలని కూడా మనం తెలుసుకుందాం. ముందు భాగం తెలుసుకుందాం. ఇట్లు నారదుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా చతుర్ముఖ బ్రహ్మ భగవత్ స్వరూపమును అవతారమును వివరించినాడు. ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు. నారదా, భగవానుని గూర్చి నీకు సంగ్రహముగా తెలియజేసితిని. ఇంకను సంగ్రహముగా చెప్పెదని వినుము. లోకములో చేతనా చేతనాత్మకమగు మనకు ఇష్టమని భావించుచున్న వస్తువులు ఏవి ఉన్నవో అవి అన్నియు భగవంతుడు ఆత్మగా గలవే. అతడు ఆత్మగా లేక తాను స్వతంత్రముగా ఉండగలిగిన వస్తువు ఏదియు లేదు. ఇది భగవానుడు నాకు చెప్పిన భాగవతము. దీనిని విస్తారముగా లోకమునకు అందింపుము. సకల వస్తువులకు ఆధారమగువాడును సకల వస్తువులకు ఆత్మ అగువాడును అగు భగవానుని యందు. మానవులకు భక్తి కలుగునట్లుగా ఈ భాగవతమును వర్ణింపుము. ఈ మనుష్య జన్మనందు మనము చేయు ఏ వ్యాపారమైనను భగవానులు సంతుష్టి కలిగించే విధముగా ఉండనిచో ఆ వ్యాపారము నిరర్ధకము.

ధర్మార్థ కామములు భగవత్ ప్రీతికరములు కానినాడు అవి నశ్వరములు. వానిచే ప్రయోజనము లేదు. వరుణాశ్రమ ఆచారములు దానములు తపస్సు పాండిత్యం అనునవి ఎన్ని ఉన్నను మోక్షప్రదుడగు శ్రీకృష్ణుని యందు భక్తి కలగనిచో వాని వలన ప్రయోజనము లేదు. భక్తి ఒక్కటే సమస్త పాపములను నశింపచేయునది. ఆ సర్వేశ్వరుని వశవర్తియగు మాయ అనబడి ప్రకృతి యొక్క స్వరూపమును వర్ణించితిని. దీనిని వినినవారు, విని ఆనందించిన వారు, మాయ ఆవరించని మనసు గలవారై మోహమునందక శాంతినందుదురు. పరీక్షిత్తు శుకయోగిని మరల ఇట్లు ప్రశ్నించుచున్నాడు. పరమాత్మ దర్శనము చేసిన నారదుడు చతుర్ముఖ బ్రహ్మచే ప్రేరణ చేయబడిన వాడై. సత్వరజస్తమో గుణము అంటని భగవానుని గుణములను కీర్తించుటకు ప్రేరణ చేయబడిన వాడై ఎవరెవరికి ఏ ఏ ప్రశ్నలకు ఏ విధముగా సమాధానాలు చెప్పెనో వివరముగా ఎరంగింప కోరుచున్నాను. ఆశ్చర్యకరమగు శక్తి గల భగవాను యొక్క కథలు లోకమునకు మంగళమును కలిగించునవి మహానుభావా సకల అంతర్యామియగు ఆ శ్రీకృష్ణుని యందు. ఈ కథను వినుటచే మనసు నిలిచి ఇతర విషయముల యొక్క సంఘమును వీడి ఈ శరీరమును విడవగలవాడనగుదును. భగవానుని కథలను గుణములను అల్పకాలమైనను శ్రద్ధతో వినినచో భగవానుని మనసులో ప్రవేశించి ఇతర విషయములను స్మరణ లేకుండా చేయును. శ్రవణముచే కర్ణరంధ్రముల ద్వారా తన భక్తుల హృదయ పద్మమున ప్రవేశించిన శ్రీకృష్ణుడు శరత్కాలమున నీటిలోని మాలిన్యమును తొలగించి నిర్మలత్వమును కలిగించినట్లు పాపమును పోగొట్టి నిర్మలను చేయును అట్టి. పరిశుద్ధమైన మనసు గల పురుషుడు శ్రీకృష్ణ పాద సేవనమును వీడడు. కేశములన్నియు క్లేశములన్నియు వీడినవాడై పై దేశములలో తిరిగి తిరిగి బడలి ఇంటికి చేరిన వాడి వలె హాయిగా ఉండును. భగవానుడు సహజముగా భౌతికములగు దోషములు అంటనివాడు. అతడు కూడా మన వంటి దేహమును పొంది శ్రీకృష్ణుడుగా వచ్చినాడు. శరీరము పంచభూతములతో నిర్మితమగును కదా? జీవుని శరీరము వలె పరమాత్ముని శరీరము కూడా అట్లే ఏర్పడినదా? జీవునకు కర్మవశమున శరీరము కలుగుచుండును. భగవానునకు శరీరము కలుగుటకు కారణం ఏమి? ఏమియు లేకనే శరీర సంబంధం కలుగునా?

లోకములన్నియు జగదాకారముకు పద్మముగా ఉండి స్వామి నాభి నుండి ఆవిర్భవించినవి కదా? ఈ సర్వలోకములకు ఆధారభూతుడగు పరమాత్మ పరిణామ ఎట్టిది? సమస్త భూతములకు నియామకుడగు భగవానుని నావిపద్నము నుండి జన్మించిన చతుర్ముఖ బ్రహ్మ ఈ భూతములన్నింటిని సృజించుచున్నాడు. అతడు ఆ భగవానుని విరాట్ రూపమును దర్శించినాడు. అట్టి భగవానుడు ఈ సకల విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణభూతుడు. మాయను నియమించువాడు సకల గుణాశ్రయుడు ఈ గుణములన్నింటినీ అతిక్రమించి జగత్ వ్యాపారమును మాని ప్రళయంలో హెచ్చరపరుండి ఉండును. ఈ లోకములు, లోకపాలురు పూర్వ కల్పములో ఉన్నట్లుగానే చతుర్ముఖుని అవయవముల నుండి కల్పింపబడినవి అని వింటిని. కల్పము అవాంతర కల్పము అనునవి ఎంత పరిణామము గలవి? కాలము యొక్క భాగములేవి? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని అవి విభజించబడినవి కదా? కాలము ఎట్లు గ్రహింపబడును? దేవ పితృ మనుష్యాదుల యొక్క ఆయు ప్రమాణం ఎంత? సూక్ష్మమగు నిమిషం మొదలు కాల పరిణామములో పెద్దగా ఎన్నబడు సంవత్సరం వరకు ఎట్లు లెక్కించబడుచున్నది? కర్మలచే అనుభవింపబడు ఫలములు ఏ విధములుగా ఉండును? కర్మకు ఫలములను దేవతలు ఎన్ని ఏర్పాట్లు చే ఎట్లు ఏర్పాటు చేయుదురు? సత్వాది గుణముల యొక్క ఆ గుణముల యొక్క ఆ గుణములు గల జీవుల యొక్క పరిణామ కారణం ఏమి? జీవులు దేవాది శరీరములను స్వీకరించుటలో కారణం ఏమి? పర్వతములు, భూమి, పాతాళము, ఆకాశము, దిక్కులు, గ్రహములు, నక్షత్రములు, నదులు, సముద్రములు, ద్వీపములు మొదలగు స్థానములు ఎట్లు బయలుబడినవి? ఈ అండకోశం యొక్క ప్రమాణం ఎంత? దీనికి బాహ్యముగా ఉండు ఆవరణమేమి? వీటన్నింటినీ వివరింపగోరుచున్నాను. ఇంతేగాక మహాపురుషులగు భగవద్భక్తుల చరిత్రలను వర్ణ ఆశ్రమ స్వరూప స్వభావములను యుగములను యుగముల పరిణామమును ఆయా యుగములలో ఏ ధర్మము పాలింపబడినదో దానిని ఆ యుగములలో భగవానుని అవతారముల వృత్తాంతమును ఎరింగింప ప్రార్థించుచున్నాను. మనుష్య మాత్రుడు ఆచరించవలసిన ధర్మమేమి? వర్ణాశ్రమములను బట్టి వారు ఆచరించవలసిన ధర్మములు ఏవి?

ఆయా వృత్తులలో జీవించడి వారి ధర్మములు ఏవి? పరిపాలించడి రాజర్షుల ధర్మము ఏమి? తత్వములు ఎన్ని? వాని స్వరూపమేమి? పరమ పురుషుని ఆరాధించుట ఎట్లు? ప్రకృతి కంటే వేరైన ఆత్మ స్వరూపం ఎరింగెడి జ్ఞాన యోగమెట్టిది? అనిమాది యోగములను సాధించిన యోగుల స్వరూపమేమి? వారి శరీరం ఎట్లు పతనమగును? వేదముల, ఉపదేశముల, ఇతిహాస పురాణముల స్వరూపమేమి? సర్వభూతముల యొక్క అవాంతర ప్రళయము, స్థితి, సంహారము ఎట్లు జరుగును? వైదిక కర్మలను, స్మృతి విహితములకు కర్మలను, కామ్య కర్మలను ఆచరించుటలోని విధములు ఏవి? కొంత కర్మను పరలోకములో అనుభవించి కర్మ శేషముతో పరలోకము నుండి జారిన వారు ఎట్లు మరల జన్మలెత్తుదురు? పాషండ ధర్మం ఎట్లు వెలిసినది? జీవుడు బంధము నొందుట మోక్షము నొందుట ఎట్లు జరుగును? మోక్షము నొందినప్పుడు జీవుడు ఎట్లుండును? స్వతంత్రుడగు భగవానుడు తన వశవర్తియగు మాయతో ఎట్లు క్రీడించును? ఆ మాయను దూరముగా వదలి దానిని తాను చూచుచు ప్రళయములో ఉదాసినుడై ఎట్లుండును? నేను అడిగిన విషయములన్నియు నీవు ఎరుంగజాలినవి రహస్యమైనను నాకు ఎరుంగింప ప్రార్థించుచున్నాను. ఆహారము లేక నా ప్రాణములు కలతనందుచున్నవి కానీ నీ వలన భగవత్ కథామృతమును పానము చేసినచో నా ప్రాణములకు వ్యాకులత తగ్గును. కోపగించిన బ్రాహ్మణుల వలన గాని ఆహారము లేకపోవట వలన గాని నాకు ఎట్టి వ్యధ లేదు భయము లేదు కావున మీరు భగవత్ కథామృతమును ప్రసాదింప ప్రార్థించుచున్నాను ఈ విధంగా పరీక్షిత్తు ప్రశ్నింపగా శ్రీ శుకుడు భాగవతమైనడి వేద తుల్యముగు పురాణమును చెప్పెను. ఈ పురాణమును సృష్టి ప్రారంభమున చతుర్ముఖునకు భగవానుడు చెప్పినాడు. పరీక్షిత్తుడు అడిగిన ప్రశ్నలన్నిటినీ వరుసగా శుకయోగి సమాధానం చెప్పుటకు ఆరంభించినాడు. ఈ ఇన్ని ప్రశ్నలు పరీక్షిత్తుడు అడిగిన తర్వాత వాడికి జవాబు శుక్రుడు ఎలా ఇచ్చినాడు ఆ విషయాన్ని మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మత్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. The creation of Maya is true to itself, like the sorrow of a king. To the one who sees it, to the one who is the embodiment of Dharma, to the first one who manifested, salutations to the Supreme Being. In the sky, the pot sky, The difference between the mattitude and the beginning is not there, but it is being created. Similarly, there are no differences in the non-dual Supreme Brahman. However, that Supreme Being, through His Maya Shakti (divine power), manifested this world of various names and forms within Himself. To illuminate the true form of that, to reveal it to the devotees, that Supreme Being, today, with this sage's body, manifested Dharma in the house. Salutations to the Supreme Being, the one who is beyond nature and is the complete form. Fourth Canto, First Chapter, 56 Prayers. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Second Canto. Welcome to episode 13. Until now, let us also learn about the incarnations told by the four-faced Brahma to the question asked by Narada, and about the form of God. Let's start with the basics. Thus, as an answer to the question asked by Narada The four-faced Brahma explained the form and incarnation of the Lord. He is still saying this. Narada, I have briefly explained to you about the Lord. Listen, I will tell you briefly. In the world, all the objects that we consider to be our liking, which are conscious and active, are all those that have God as their soul. He is not a soul, nor is there anything that he can be independent of. This is the Bhagavatam that Lord told me. Extend this widely to the world. In the Lord, who is the basis for all things and the soul for all things. Describe this Bhagavata in a way that inspires devotion in humans. In this human birth, whatever business we do, if it is not in a way that pleases God, that business is meaningless.

Dharma, Artha, Kama, when they are not pleasing to God, they are perishable. He's no good. Varunashrama rituals, donations, penance, and scholarship, however many there are, if there is no devotion to Sri Krishna, who grants salvation, there is no benefit from him. Devotion alone destroys all sins. I have described the form of nature, which is the Maya, the controller of the Lord of all, as the form of nature. Those who have heard this, those who have heard and rejoiced, those who have a mind free from illusion, and those who do not bewilder themselves, attain peace. Parikshit is again questioning Shukayogini. Narada, who had a vision of the Supreme Being, was inspired by the four-faced Brahma. I am eagerly seeking to explain in detail to whom all, to whom all the questions, in what manner the Lord's qualities were praised, who were inspired to do so. The stories of the Lord with astonishing power bring auspiciousness to the world, O great one, in that Sri Krishna, who is the inner controller of all. By listening to this story, the mind is stable, leaving behind the association of other things, this body I will become one who can be released. If one listens with devotion to the stories and virtues of the Lord even for a short time, it will enter the mind of the Lord and make one forget other things. Srikrishna, who entered the lotus of the hearts of his devotees through the ears and the eardrums by hearing, removes the impurity in the water in the rainy season and makes it pure, and removes sin and makes it pure. A man with a pure heart will not abandon the service of Lord Krishna. He who has abandoned all suffering and misery, like one who has returned to his home after wandering in foreign lands, will be happy. God naturally does not say that there are physical defects. He also attained a body like ours and came as Sri Krishna. The body is made up of five elements, isn't it? Like the body of a living being, is the body of the Supreme Being also formed in the same way? The body is obtained by karma of a living being. What is the reason for the body to be possessed by God? Is there any connection with the body?

All the worlds are like a lotus to the form of the world, and they have emerged from the navel of the Lord, haven't they? What is the evolution of the Supreme Being, who is the basis of all the universes? The four-faced Brahma, born from the navel of the Lord, who is the ruler of all beings, is creating all these beings. He saw the divine, the cosmic form of the Lord. Such a God is the cause of the creation, preservation, and destruction of this entire universe. He who appoints Maya is the refuge of all virtues. He transcends all these virtues, abandons the worldly affairs, and remains alert in the deluge. I have heard that these worlds and the lords of the worlds were created from the limbs of the four-faced one, just as they were in the previous kalpa. How much evolution do the kalpamu and avantara kalpamu have? What are the parts of time? Past tense, present tense, future tense, they are divided like that, right? How is time perceived? What is the lifespan of gods, ancestors, and humans? From the minute to the microsecond, how is the year considered in the evolutionary process? Experienced through karma In what ways are the fruits? How do the gods arrange the fruits of karma? What is the reason for the evolution of beings that possess the qualities of the supreme being? What is the reason that living beings accept the bodies of the Gods? Mountains, earth, underworld, sky, directions, planets, stars, rivers, seas, islands, and other such places, how were they revealed? What is the standard of this ovary? What is the external enclosure for this? I would like to elaborate on some of them. In addition to this, describe the histories of great men and devotees of God, the nature of the ashrams, the eras, and the evolution of the eras, and the religion that was practiced in those eras, and the stories of the incarnations of God in those eras I'm praying. What is the dharma that a human being should practice? What are the dharmas that they should practice according to the Varna system?

What are the dharmas of those who live in various professions? What is the duty of the rulers who govern? How many principles are there? What is his form? How to worship the Supreme Being? What kind of knowledge yoga is this, which is different from nature, the form of the soul? What is the nature of the yogis who have attained Anima and other yogic states? How will their body fall? What is the nature of the Vedas, the teachings, and the epics and Puranas? How does the interruption, destruction, and dissolution of all beings occur? What are the methods of performing Vedic rituals, prescribed by Smritis, and desirable actions? How will those who have experienced some karma in the afterlife, and have fallen from the afterlife with the residue of karma, be reborn again? How did the heretical religion emerge? How does a being attain liberation and salvation? When one attains liberation, what is the state of a being? How can the independent God play with his dependent Maya? Leaving that illusion far away, how will he be in the apocalypse, seeing it himself, being a disciple? I pray that you may understand all the things I have asked of you, even though they are mysterious. Without food, my life is restless, but if I drink the nectar of the divine story from you, my worries will decrease. I have no pain or fear from the angry Brahmins or lack of food. Therefore, I pray that you grant me the nectar of the Lord's story. When Parikshit asked this, Sri Sukudu replied, 'Bhagavatamadidi Veda.' He told a similar myth. This Purana was told by the Lord to the four-faced ones at the beginning of creation. Parishiṣṭitu started answering all the questions asked by Shukayoigi in order. After Parikshit asked so many questions, let's find out in another podcast how Shukra gave him the answer. Salutations to the Guru of the Universe, Shri Narayana.