క్రమముుక్తి మరియు సద్యోముక్తి మార్గములు

Elevation to Higher Planets & Paths of Liberation

bhagavatam

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, జీవాత్మకు అందుబాటులో ఉన్న రెండు గొప్ప మార్గాలైన క్రమముక్తి మరియు సద్యోముక్తి గురించి శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తారు. వేద కర్మలు మరియు దేవతా ఉపాసన చేసేవారు క్రమంగా ఉన్నత లోకాలకు చేరుకుని, చివరకు బ్రహ్మలోకం వరకు ఆరోహించగలరని తెలియజేయబడింది. అయితే పరమేశ్వరుడైన విష్ణుభగవానుని పట్ల పూర్ణ శరణాగతి పొందిన భక్తుడు సృష్టి-లయ చక్రాన్ని అధిగమించి, ఒక్క జన్మలోనే భగవంతుని శాశ్వత ధామాన్ని చేరుకుంటాడని ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తుంది. భక్తి మార్గమే పరమాత్మ చరణాలను చేరుకోవడానికి అత్యంత సులభమైన మరియు కరుణాపూర్ణమైన మార్గమని పలికింది

In this sacred episode of the Srimad Bhagavatham podcast, we explore Canto 2's profound teachings on the two great paths available to the soul — Krama Mukti, the gradual path of liberation through higher planetary ascent, and Sadyo Mukti, the immediate liberation attained through pure devotion to the Supreme Lord. Shukadeva Goswami explains to King Parikshit how those who perform Vedic rituals and worship ascend step by step through the cosmic planes, ultimately reaching Brahmaloka and beyond. By contrast, the illumined devotee who surrenders completely to Lord Vishnu transcends the cycle of creation and dissolution entirely, attaining the eternal abode in a single lifetime. This episode invites every sincere seeker to reflect deeply on the path of Bhakti as the most direct and merciful route to the Lord's lotus feet.

← Prev Next →
Elevation to Higher Planets & Paths of Liberation bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో నమస్తే ఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ సర్వ కృతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మ జయాను భావితా జ్ఞానాయ విద్యా గురవే నమో నమః సకల మంత్రములు, దేవతలు, ఆజ్యము మొదలగు యజ్ఞ ద్రవ్యములు, సకల క్రతువులు, సకల వైదిక కర్మలు నీ స్వరూపమే. వైరాగ్యము, భక్తి, మనోజయము అను వాటి వలన సాక్షాత్కరించే ఆత్మజ్ఞానము నీ స్వరూపమే. ఆ జ్ఞానమునిచ్చే గురువు నీవే. నీకు అనేక నమస్కారములు. థర్డ్ క్యాన్ టు 13th చాప్టర్ 39th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక రెండవ స్కంధములో నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం ధ్యానము చేసే ప్రక్రియ ధ్యానము తరువాత ఆత్మ యొక్క ప్రయాణం ఊర్ధ్వలోకంలో అశ్చర్యాది మార్గమును గురించి తెలుసుకున్నాం. ఇక ముందు ఇంకా వివరాలు తెలుసుకుందాం. పరిపూర్ణముగా బుద్ధిచే ప్రమాణములన్నింటినీ మూడుసార్లు ఆలోచించి నిశ్చయింపగా తేలిన సారము భక్తియోగం వలనే పరమాత్మ యందు ప్రీతి కలుగుననియు భక్తియోగమే ముక్తికు ఉపాయముననియు నిశ్చయింపబడినది యోగమునందు పరిశుద్ధుడగు పరిశుద్ధమగు మనస్సుతో సర్వభూతములలో భగవానుడు గుర్తింపదగిన వాడై యుండును. అతడు ద్రష్ట అన్నిటిని తాను చూచువాడు ఎరుంగువాడు. మన జ్ఞానములకు గోచరములగు ఆ పరమాత్మచే సృజింపబడిన కార్యములగు మహత్తు మొదలగు తత్వములచే కారణభూతుడగు పరమాత్మ. అనుమానముచే ఎరుంగదగిన వాడగును. కేవలం అనుమానము చేతనే కాక బ్రహ్మ స్వరూపం నిర్ణయించి చెప్పేటి వేదాంత వాక్యముల చేత భగవానుడు ఉన్నాడని స్పష్టముగా ఎరుంగ వీలగును.

కార్యములగు పరమ పదార్థములచే కారణమగు భగవానుడు ఉన్నాడని గుర్తింపబడును. శాస్త్రములచే స్పష్టముగా ఎరుంగనగును. యోగ పరిశుద్ధమగు మనసుచే దర్శింప వీలగును. అందువలన అతనిచే సృష్టించబడిన మానవుడు తనకు తన చుట్టూనున్న సకల పదార్థములకు కారణభూతుడగు శ్రీహరియే సర్వదా సర్వత్ర వినదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు. భగవానుని కథామృతమును సత్పురుషులు చెప్పుచుండగా చెవుల నడి దొప్పలలో నింపుకొని పానము చేయువారు శబ్దాది విషయములను అనుభవించుటచే కలుషితముకు అంతఃకరణమును పవిత్రము చేసుకొనగలరు. దానిచే వారు భగవత్ చరణారవింద సన్నిధిని చేరగలరు. ముందుగా సత్పురుషుల సేవ చేయవలెను. వారి నుండి భగవత్ కథామృతమును వినవలెను. దానిచే మనస్సులో ఇతర విషయముల అనుభవముచే స్మరణ చేయగలిగే రాగద్వేషములు తగ్గును. అవి తొరిగిన తరువాత శాస్త్రముచే వివేకము మొదలగు సాధన సంపదను సంపాదింపవలెను. దానిచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానముచే మరల మరల భగవాని ప్రీతితో స్మరించుట అలవడవలెను. అప్పుడు భగవానుడు ప్రత్యక్షముగా చూచినట్లు దర్శింపబడును. ఇదే భక్తి, ఇదే మోక్షమునకు సాధనము. చనిపోవుటకు ముందు బుద్ధిమంతులగు మనుష్యులు భగవంతుని పొందుటకు ఏమి చేయవలెనని నన్ను అడిగితివి, నేను చెప్పితిని. భగవానే పొందుట గాక ఇతరములైన ఫలములను కోరెడి వారు వేని వేనిని ఆరాధింపవలెనో చెప్పెదన వినుము. బ్రహ్మ వర్చస్సును కోరువారు వేదమునకు ప్రభువగు బ్రహ్మను ఆరాధింపవలెను. ఇంద్రియ శక్తిని పెంపొందించుకొనవలెను కోరిక గలవారు ఇంద్రుని ఆరాధించవలెను సంతానమును కోరిడి వారు ప్రజాపతులను ఆరాధించవలెను. ఐశ్వర్యకాముడు శ్రీ మహావిష్ణువునకు చెందిన ఆశ్చర్యకరమగు శక్తి గల దేవిని ఉపాసించవలెను. తేజస్సును కోరువారు అగ్నిని ఆరాధించవలెను. ధనమును కోరువాడు వసువులను, వీర్యమును కోరువాడు రుద్రులను.

ఆరాధింపవలెను. అన్నము మొదలగు ఆహార పదార్థములను పొందగోరువాడు అదితిని స్వర్గమును కోరువాడు దేవతలను రాజ్యమును కోరువాడు విశ్వదేవులను దిక్పాలత్వమును కోరువాడు సాధ్యులను ఉపాసించవలెను. ఆయుష్షును కోరువాడు అశ్విని దేవతలను, దేహ బలమును కోరువాడు భూదేవతను, పదవిలో స్థిరముగా ఉండవలెను కోరువాడు సర్వలోకాధార భూతురాలగు భూమి ఆకాశములను ఉపాసించవలెను. సౌందర్యమును కోరువాడు గంధర్వులను, స్త్రీలను పొందవలెనని కోరువాడు ఊర్వశిని, ఆధిపత్యము కావాలెనని కోరువాడు పరమేష్టిని అనగా బ్రహ్మను ఉపాసించవలెను. కీర్తిని కోరువాడు వరుణుని, విద్య కోరువాడు అనగా జ్ఞానమును కోరువాడు పరమశివుని, దంపతులకు అన్యోన్య ప్రీతిని కోరువాడు పార్వతిని ఉపాసించవలెను. ధర్మమును ఆర్జింపవలెనని కోరికలవారు ఉత్తమ శ్లోకుడగు విష్ణువును సంతాన వృద్ధి కావలెనని కోరువారు పితృ దేవతలను బాధలు తొలగవలెనని కోరువారు మనువులను పేరుగల దేవతలను శత్రువులను చంపవలెనని కోరువాడు నిరుతి అను రాక్షసుని కామమును కోరువాడు సోముని ఉపాసించవలెను. వైరాగ్యమును కోరువారు పరమపురుషుని ఉపాసించవలెను. పైన చెప్పిన దేవతలందరిలోనూ ఆత్మగా ఉండువాడు పరమపురుషుడు వాసుదేవుడే. వీరిని ఆరాధించుటచే సంతుష్టి నందిన ఈ దేవతలు వాసుదేవుడు వసంగిన ఫలములని వసంగుదురు కానీ ఏ కోరికతో ఉపాసించినా ఆ కోరికనే ప్రసాదింతురు. ఏ కోరికయు లేనివాడును అన్నిటినీ పొందవలెనని కోరువాడును ఉదారమైన బుద్ధితో ప్రకృతి బంధమును వీడి భవ సన్నిధిని చేరి ఉండవలెనని కోరువాడు. తీవ్రమైన భక్తి యోగముతో యోగముతో పరమ పురుషుని సేవింపవలెను. ఈ లోకంలో భగవానును ఉపాసించు వారులకు మోక్షమును కోరువాడు తప్పక పొందవలసినది భాగవత సహవాసము. భాగవత సహవాసముచే భగవానుని యందు నిశ్చలమగు ప్రేమ కలుగును. దానిచే మోక్షము లభించును. అందుచే మానవులు భాగవత సంఘముని ప్రధానముగా సంపాదించవలెను.

భగవత్ భక్తులను చేరినందువలన హరికథను వినుటకు అవకాశం కలుగును. హరికథా శ్రవణమునందు ప్రీతి కలిగినవాడు సత్తరజస్తమస్సులచే కరిగెడు సుఖ దుఃఖ మోహములు కలగవు. ఆకలి. దప్పిక, శోకము, మోహము, ముసలితనము, చావు అని ఆరు విధములకు ఊర్ములు తగ్గిపోవును. మనసు నిర్మలమగును. ఈ లోకంలో పై లోకంలో శబ్దాది విషయములందు వైరాగ్యము కలుగును. శరీరము కంటే వేరగు ఆత్మను చేరుటకు తగిన ఉపాయము లభించును. తరువాత పరమాత్మను పొందించు భక్తి యోగము సిద్ధించును. ఇన్ని ఫలములను కలిగించే హరికథల యందు ఎవరు ఆసక్తి కలిగి ఉందురు? ఇట్లు శికుడు ఏదో వినదగినదో చెప్పినాడు. అట్లు వినిన పరీక్షిత్తు ఊర్చి మరల శ్రీ శుక్ల వారు ఇట్లు చెప్పుచున్నారని సూతుడు శవనకాదులకు చెప్పుచున్నాడు. పరీక్షిత్తు భగవత్భక్తుడు బాల్యములో ఆటలలో కూడా శ్రీకృష్ణ పూజలనే ఆటలుగా ఆడుకొని ఆనందించేడివాడు. శ్రీ శుక్లవారు పరమ భాగవతులు. ఆయన బాల్యము నుండియు వాసుదేవ పరాయణుడు. వాసుదేవుడే ప్రాప్యము, వాసుదేవుడే ఉపాయము అని నిశ్చయం గలవాడు. అట్టి భగవత్ భక్తులు ఇద్దరు కలిసినప్పుడు భగవత్ గుణములను ప్రకాశింపచేసేడి కథలే సాగుచుండును. భగవత్ భక్తి లేని వారి ఆయువు సూర్యోదయము, సూర్యాస్తమము అవుచు తిరుగుచున్న కాలముచే హరింపబడుచుండును. ఇట్లు వ్యర్థముగా కాలము గడిచిపోకుండా ప్రతిక్షణము భుగత్కథలను వినుటయే తమ ఆయువునకు ఫలమని భక్తులు భావింతురు. ఊపిరి పీల్చుచు బ్రతికి ఉండుటయే ఆయుర్దాయం ఉన్నంతవరకు ఫలము కాదు. చెట్లు జీవించుట లేదా? కొలిమి తిత్తులు గాలిని పీల్చి విడుచుట లేదా? గాడిదలు, కుక్కలు మొదలగునవి తినుట లేదా? రమించుట లేదా? ఒక్కనాడైనో భగవానుని నామము ఎవరి కర్ణపుటములను సోకదో అట్టివాడు. ఊరిలో తిరుగు పందుల వలె, కుక్కల వలె, ఒంటిల వలె, గాడిదల వలె తినదాని వానిని తిని సంతానములు కనుటయే ఫలముగా జీవించని ఫలము పశువులతో సమానము. భగవాన్ లీలలను వినన చెవులకు గోడకు ఉన్న కన్నముల వంటివి. భగవద్గుణములను గానము చేయని నాలుక కప్ప నాలుక వంటిది. భగవాని పాదములకు నమస్కరించని శిరస్సు పట్టాభిషేకమై కిరీటముతో కూడినదైనను భారము మోయుటకే గానీ దాని వల్ల ప్రయోజనము లేదు.

బంగారు కంకణములు ధరించిన భగవానులకు పూజ చేయని చేతులు శవము చేతుల వలె అమంగళములు. భగవానుని మూర్తులను దర్శించని కన్నులు నెమిలి పెంచము పైనుండు కనుల వంటివి. భగవంతుడు అధివసించియుండు దివ్య క్షేత్రములకు వెళ్లని పాదములు చెట్ల వేళ్ళ వంటివి. మనుష్యుడు భాగవత పాదరేణువును ధరింపక ధరింపవలెనని కోరిక లేక జీవించినచో వాడు బతికి ఉన్న శవము. భగవత్ పాదములయందు అర్చింపబడిన తులసి యొక్క పరిమళము చూచిన వాసన చూచి ఆనందింపని మనుజుడు ఊపిరి తీయుచున్న శవము. భగవాన్ నామములను ఒకరు కీర్తించునప్పుడు కానీ తాను కీర్తించినప్పుడు గానీ శరీరము గగుర్పాటు కలగక నేత్రము నుండి ఆనంద భాష్మములు జాలు వారక ఏ వికారము లేక ముద్దువల నుండి వాని గుండె రాతి గుండె అందుచే ఓ సూత మా మనసులకు అనుకూలమగు భవత్కథలను నీవు తెలియజేయుము. ఆత్మవిద్యా విశారదుడగు శ్రీ సుఖయోగి ఏమి వినదగినది అని అడిగినప్పుడు ఏమి చెప్పినాడో వానన్నింటినీ మాకు ఎరిగింపుము అని శౌనకాది ఋషులు ప్రశ్నింపగా సూతుడు ఇట్లు చెబుతున్నాడు. సూతుడు ఏం చవాబు చెప్పాడు తర్వాత పోడ్కాస్ట్ మనం పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం స్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations, salutations to all the mantra deities, the substance, the doer of all actions, the detached, the devotee, the conqueror of the mind, the future, the giver of knowledge, the guru. Salutations, salutations. All the mantras, deities, The fire and other sacrificial materials, all rituals, and all Vedic ceremonies are your form. The self-knowledge that is realized through detachment, devotion, and conquest of the mind is your form. You are the guru who imparted the knowledge. Many salutations to you. Third can to 13th chapter 39th prayer. Devotees of God, welcome to the fourth podcast in the second book of Srimad Bhagavata Tattva Deepika. Until now, we have learned about the process of meditation, the journey of the soul after meditation, and the path of wonder in the upper world. Let's learn more about it. Having fully considered all the proofs with intellect, having decided after thinking three times, the essence that has come out is that devotion is the means to attain the Supreme Soul, and devotion is the means to liberation, it has been decided that one who is pure in yoga Holy With the mind, the Lord is recognizable in all beings. He is the seer, the one who sees and the one who knows everything. The Supreme Soul is the cause of the greatness and other elements, which are the works created by that Supreme Soul, which is visible to our senses. He is a man to be doubted. Not only by doubt, but by the Vedanta sentences that determine and tell the form of Brahma, it is clear that the Lord exists.

It is recognized that the Supreme Being is the cause of the actions of the supreme substances. It is clearly understood by the scriptures. Yoga is possible to see with a pure mind. Therefore, the human being created by him, Sri Hari, who is the cause of all the substances around him, is always, everywhere, worthy of being heard, worthy of being praised, worthy of being remembered. While the virtuous are narrating the nectar of the Lord's story, those who fill their ears with the dust of their feet and drink it, by experiencing the sounds and other things, can purify their inner selves and make them pure. By that, they can reach the presence of the lotus feet of the Lord. First, one must serve the noble ones. We should listen to the divine nectar of the story from them. By that, the attachment and aversion that can be remembered through the experience of other things in the mind will decrease. After they are worn out, one should acquire the wealth of means like wisdom and other resources through scriptures. It brings with it knowledge. By that knowledge, again and again, one should learn to remember God with love. Then the Lord will appear to you as you have seen him. This is devotion, this is the path to salvation Practice. Before dying, you asked me what wise men should do to attain God, and I told you. Listen, I will tell you what they should worship, which are the other fruits besides attaining God. Those who desire the glory of Brahma should worship Brahma, the lord of the Vedas. Those who desire should increase their sensory powers, those who desire should worship Indra, those who desire progeny should worship Prajapatis. Aishwarya Kamudu should worship the goddess who has the wonderful power belonging to Sri Maha Vishnu. Those who desire splendor should worship the fire. He who desires wealth desires houses, he who desires virility desires Rudras.

Should be worshiped. One who desires to obtain food items like rice, that one who desires heaven, that one who desires gods, that one who desires the kingdom of gods, that one who desires the guardianship of the directions, should worship the accomplished ones. One who desires longevity should worship the Ashwini deities, one who desires physical strength should worship the Bhudevata, one who desires to be established in a position should worship the earth and the sky, which are the support of all the worlds. One who desires beauty should worship Gandharvas and women, one who desires to have a wife should worship Urvashi, one who desires dominion should worship Parameshi, that is, Brahma. One who desires fame is Varuna, one who desires knowledge is Parameshwara, one who desires mutual love between couples should worship Parvati. Those who desire to earn righteousness, the best of the shlokas, those who wish for the increase of progeny, those who wish for the removal of the sufferings of the ancestors, those who wish to kill the gods named Manus, the demon Niruti He who desires lust should worship Som. Those who desire detachment should worship the Supreme Being. Above The supreme being Vasudeva is the one who is the soul of all gods and goddesses. These gods, who are satisfied by worshiping them, Vasudeva, will grant the fruits of Vasamunigu. But whatever desire you worship with, they will grant that very desire. He who has no desires and desires to attain everything, with a generous mind, should renounce the bonds of nature and reach the abode of the world. One should serve the Supreme Being with intense devotion and yoga. In this world, those who worship God, those who desire salvation, must surely receive the association of the Bhagavata. Through the association of the Bhagavata, a steadfast love for the Lord arises. By that, salvation will be attained. Therefore, humans should primarily earn the Bhagavata Sangham.

By reaching the devotees of the Lord, one gets the opportunity to listen to Harikatha. One who is pleased with listening to Harikatha will not experience pleasures, sorrows, delusions, or old age caused by the darkness of the moon. Hunger, thirst, sorrow, delusion, old age, and death, these six types of ailments will be reduced. The mind becomes pure. In this world and the next, detachment will arise in matters of sound and other things. A suitable means to reach the soul, different from the body, will be found. Then the yoga of devotion to the Supreme Being is perfected. Who is interested in Harikatha, which produces so many fruits? Thus, Shikudu said something worth hearing. Having heard that, Parikshit, having heard, again, Sri Sukla is saying this, thus Sutudu is telling the Shavanakas. Parikshit, a devotee of the Lord, enjoyed playing games, including those related to Lord Krishna's worship, even in his childhood. Sri Shukla was an ardent devotee of the Lord. He was devoted to Vasudeva since his childhood. He who is determined is Vasudeva, he who is determined is the means. When two such devotees of God meet, they experience the qualities of God The stories that illuminate continue to unfold. The life of those who do not have devotion to God is being destroyed by the time that goes by, like sunrise and sunset. Thus, devotees believe that listening to the stories of the earth every moment is the fruit of their life without wasting time. Breathing and living is not fruitful as long as there is life. Don't trees live? Is it that the furnace breathes only in and out? Don't donkeys eat or dogs eat etc.? To enjoy or not? He is the one who, as a single person, does not let the name of the Lord touch anyone's eardrum. Like stray pigs in the village, like dogs, like camels, like donkeys, eating what is not eaten, having children is like not living as a fruit, a fruit that does not live. The Lord's plays are like the holes in the wall that one hears. A tongue that does not sing the praises of God is like a lizard. Even if the head, which does not bow to the feet of the Lord, is crowned and adorned with a crown, it is only for bearing the burden, there is no benefit from it.

Hands that do not worship the Lord who wears golden bracelets are inauspicious like the hands of a corpse. Eyes that do not see the forms of God are like the eyes above the peacock's crest. The feet that do not go to the divine abodes where God resides are like the roots of trees. If a man lives without desiring to wear the lotus feet of the Bhagavata, he is a living corpse. A person who does not rejoice in the fragrance of the Tulasi worshiped at the feet of the Lord, is like a breathing corpse. When someone praises the names of God, or when he praises himself, without the body trembling, without tears flowing from the eyes, without any distortion, from the cheeks of the beloved, his heart is a stone heart. Therefore, O Soota, to our minds Please let me know the suitable stories. When asked what is worth listening to, the learned Sri Sukha Yogi, what did he say? Shaunakadi Rishis asked, "Tell us all the rains." Soothu is saying this. What did the guru say? After that, we will have a podcast in the podcast Let's know, salutations to the enlightened ones