విరాట్ పురుషుని ఇంద్రియ ప్రాకట్యము - అధ్యాత్మిక రూపము

Manifestation of Cosmic Senses & Philosophical Meaning

bhagavatam

శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ అద్భుతమైన ఎపిసోడ్‌లో, విరాట్ పురుషుని దివ్య స్వరూపం నుండి ఇంద్రియాలు, అధిష్ఠాన దేవతలు మరియు సూక్ష్మ శక్తులు ఏ విధంగా ఆవిర్భవించాయో శుకదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తారు. వ్యష్టి జీవుని అనుభవానికి మరియు సమష్టి విశ్వ చైతన్యానికి మధ్య గల అభేద సంబంధాన్ని ఈ ప్రవచనం సూక్ష్మంగా బోధిస్తుంది. దర్శనం, వాక్కు, స్పర్శ మరియు మనస్సు వంటి ప్రతి ఇంద్రియ వ్యాపారమూ పరమాత్మ స్వరూపంలోనే మూలమును కలిగి ఉన్నదని ఈ ఉపన్యాసం స్పష్టం చేస్తుంది. ఈ శాశ్వత సత్యాలను మనతో పాటు మీరూ ధ్యానించి, మీ జీవన దృష్టిని పరమాత్మ వైపు మళ్ళించుకోండి.

In this illuminating episode from Canto 2 of the Srimad Bhagavatham, we explore the profound concept of the Virat Purusha — the universal cosmic form through whose divine body all creation is expressed. Shukadeva Goswami reveals to King Parikshit how the senses, presiding deities, and subtle faculties of the cosmic being progressively manifest, reflecting the intimate connection between the microcosm of individual existence and the macrocosm of universal reality. This episode guides seekers to understand that every aspect of human experience — sight, speech, touch, and thought — finds its ultimate source and meaning in the infinite form of the Supreme Lord. Meditate with us on these timeless truths that transform the way we perceive ourselves and the universe around us.

← Prev Next →
Manifestation of Cosmic Senses & Philosophical Meaning bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసార తరోః కుఠారం జిజ్ఞాసయాహాం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం నిన్ను శరణు పొందిన భక్తుల సంసార వృక్షమును నీవు గొడ్డలి వలె నశింప చేసెదవు. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రకృతి పురుషుల స్వరూపమును తెలియగోరుచున్నాను. మోక్ష ధర్మములు తెలిసినా వాయులో నీవు శ్రేష్టుడవు. నేను నీకు నమస్కరించుచున్నాను. థర్డ్ క్యాంటు 25th చాప్టర్ 11th ప్రేయర్. భగవత్ బంధువులారా మనము కిందటి శ్రీమద్ భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధము పదకొండవ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతక్రితం కొన్ని అవతారాల గురించి మనం తెలుసుకున్నాం. శ్రీహరి, పృథ్వి, ఆ ఋషభుడు. అయ్యగ్రీవుడు, మత్స్యము, కూర్మము వరకు తెలుసుకున్నాం. ముందు భాగాలను తెలుసుకుందాం. దేవతలు కలిగిన భయమును తొలగించినట్టి నృసింహ రూపమును భగవానుడే ధరించినాడు. భయంకరము కనుబొమ్మల కదలికచే భీకరము ఘోరలతో ఆవులించిన నోటిపై తనపై వచ్చి పడుచున్న హిరణ్యకశిపుని పట్టి లాగి తొడపై పడవేసుకొని గొళ్ళతో చీల్చినాడు. ఒకానొక గజయూధపతి ఒక చెరువులో దిగి అధికమగు బలము గల మొసలిచే పట్టుబడినది పోరాడునది. విడిపించుకొనలేక దుఃఖము నుండి తొండముతో తామర పువ్వును పట్టుకొని ఆదిపురుషా అఖిల లోకనాథా విన్నవారికి మంగళమును కలిగించు నామము గలవాడా పవిత్రము కీర్తి గలవాడా నారాయణా నీవు నాకు రక్షకుడుగా రావలని నిన్ను శరణు పొందుచున్నాను అని మొరబెట్టగా అప్రమేయుడగు హరి గరత్మంతుని భుజములపై అధిరోహించి వచ్చి కృపతో తుండము పట్టి ఏనుగును వెలికి లాగి చక్రముతో మొసలి యొక్క నోటుని చీల్చెను. ఆ గజేంద్రుని రక్షించెను. అతడే శ్రీహరి అను అవతారం.

అదితి పుత్రులలో చివరి వాడై ఉపేంద్రుడుగా అదితి గర్భమున వామనుడుగా జన్మించినాడు. అదితి పుత్రులలో చివరి వాడైయు గుణములచే వారందరి కంటే అతడు అధికుడు. యజ్ఞములచే ఆరాధింపబడువాడు అతడే యజ్ఞ భూమికేగి మూడడుగుల భూమిని వసంగుమని వామన రూపంతో బలిని యాచించి స్వీకరించెను తర్వాత మూడు లోకములను త్రివిక్రముడై ఆక్రమించెను ఇట్లు యాచకుడై అడుగుటకు కారణమేమి? శాసించి బలి నుండి భూమిని గ్రహింపలేడా అని సంధ్యము కలగవచ్చు. కానీ ధర్మ మార్గమునందు ప్రవర్తించున్న వారి నుండి ఐశ్వర్యమును అపహరింపవలెనైన ఎంతటి సమర్థులకైనను యాచన తప్ప వేరొక మార్గము లేదు. బలి ధర్మ మార్గమును వర్తించుచున్నాడు. శ్రీహరి వేరొక మార్గము లేదని యాచించినాడు. యాచించి అయినను ధర్మ మార్గమును ప్రవర్తించు వానిని పదభ్రష్టుని చేయుట అనుచితము కాదా అని శంక కలగవచ్చును. త్రివిక్రముని పాద ప్రక్షాళనము చేసి ఆ జలములతో తన శరీర శిరస్సును అభిషేకించుట కంటే దేవ సామ్రాజ్య పట్టాభిషేకం కూడా అతనికి అవిష్టము కాదు. బలి తాను ఆడిన మాటను తిరుగుటకు అంగీకరించలేదు. భగవాను ఒక సహజముగా దాసభూతమైన తన ఆత్మను అతనిది అని ఎరింగి అతనికి ఆర్పించినాడు. శుక్రుడు వారించినను శపించినను తన శిరస్సును స్వామి పాదమునకు పీఠముగా వసంగి ధన్యుడైనాడు. ఆ భగవానుడే నీవు యోగ మార్గమును భగవత్ ఉపాసనను ఎరుంగింపమని ప్రార్థింపగా హంస రూపమును దాల్చి నీకు మిక్కిలి ప్రేమతో భక్తి మార్గమును ఉపదేశించినాడు. భగవద్విషేకమగు భక్తి యోగమును ప్రకృతి కంటే వేరైన ఆత్మ తత్వమును ప్రకాశింపజేయు జ్ఞానమును ఆ వాసుదేవుడే శరణమని నమ్మిన మీరందరూ ఎరింగి నేడు ఆచరించుచున్నారు. ఆయా మన్వంతరములలో ఆ భగవానుడే మనువంశములో ఆ మన్వంతరమును పాలించిన మనువుగా అవతరించి తన ప్రతాపముచే తన ఆజ్ఞ అనడి చక్రము దిక్కులలో ఎచటను అడ్డు లేనిదై సాగునట్టు చేయుచున్నాడు. గర్వించిన రాజులను శిక్షించుచున్నాడు. తన కీర్తిచే, తన చరిత్రముచే సత్యలోకమందు కూడా విస్తరించినట్టు చేయుచున్నాడు.

భగవానుడే లోకములో ధన్వంతరిగా అవతరించి అధికమగు దుఃఖముతో బాధపడుచున్న రోగులకు తన పేరును సమయం స్మరించుట చేతనే రోగములు పోవునట్లు చేయుచున్నాడు. ఆయుర్వేదము లోకమును ప్రవర్తింప చేసినాడు. యజ్ఞములో తనకి భాగము లేకుండా పూర్వము దైత్యులు చేయగా దానిని మరల పొందినాడు. మరణము లేని ఆయుష్షును పొంది ఉన్నాడు. బ్రాహ్మణులకు ద్రోహము చేయుచు వేద మార్గమును వీడి ప్రవర్తించుచున్న తమ ప్రవర్తనచే నరకమును పొందుటకు తగి ఉన్న భూమికి కంటకప్రాయులగు క్షత్రియులను భగవానుడు పరశురాముడుగా అవతరించి దీర్ఘమగు తీక్షణమగు అంచుగల తన గండ గొడ్డలితో 21 మారు సంహరించెను. లోకమునకు దుర్మార్గులగు రాజుల పీడను తొలగించెను. దేవతల ప్రార్థన చేసి అనుగ్రహించి ఆ భగవానుడే తన అంశలతో ముగ్గురు సోదరులుగా తాను రాముడుగా ఇక్ష్వాకులమునందు అవతరించినాడు. తండ్రియగు దశరథుని ఆజ్ఞను పాలించినాడు. సీతాలక్ష్మణులతో వనమున ప్రవేశించినాడు. దశకంఠుడగు రావణుడు అతనితో విరోధించి నాశమొందినాడు. శ్రీరామునకు సముద్ర మార్గం వసంగినది కాదు ఆనాడు దారిని వసంగమని తీవ్రము కోపముతో ఎర్రన కంటితో శ్రీరాముడు చూడగా ఆ చూపునకు భయపడి సముద్రుడు గజగజ వణికెను. కలత చెందెను. రాముని కోపమునకు తాపమునందిన సముద్రములో మొసళ్ళు, పాములు మొదలగు జలచరములన్నియు అధికముగు తాపమునందినది. యుద్ధములో రావణుని వక్షస్థలమును తాకి ఇంద్రుని వాహనముగు ఐరావతమును గజము యొక్క దంతములు పిండి ఆయెను. ఆ పిండి అయిన దంతములతో దిక్కులను రాయుటచే ఆ దిక్కులన్నీ చల్లబడెను. దానిచే రాముని జయము లోకమంతట ప్రకటింపబడెను. నాతో సమానుడెవరని రావణుడు విర్రవీగి శ్రీరాముని భార్యను అపహరింపగా యుద్ధములో వాని ప్రాణమును తన బాణముచే హరించినాడు. మహాపరాక్రమశాలి శ్రీరాముడు.

భగవానుడే శ్రీరాముడే లోకమున ధర్మమును స్థాపించినాడు. లోకంలో రాజులు అసుర సంపదతో నిండి అసుర సైన్యములతో భూమిని పీడించుచుండిరి. భూమికి వారి వలన కలువు క్షేమమును తొలగించుట కొరకు భగవానుడు తన కేశములలో తెల్లని దానిని నల్లని దానిని ఈ భూమిపై మానవ రూపములతో అవతరింపజేసెను. తెల్లని కేశము యొక్క శక్తిచే అవతరించిన వాడు బలరాముడు. అతడు తెలుపు. నల్లని కేశము యొక్క శక్తిచే జన్మించినవాడు శ్రీకృష్ణుడు, అతడు నలుపు. ఇట్లు భగవానుడు ఈ లోకంలో జన్మించి ఇతరులెవ్వరి చేతను గుర్తింపరాని విధముగా ప్రవర్తించుచు తన మహాత్మ్యమును ప్రకాశింపజేయు కార్యములను ఎన్నిటినో చేసినాడు. ఇతడ తెల్లని నల్లని కేశములు బలరామకృష్ణులుగా జన్మించెనని అనుట భగవానుని శక్తి యొక్క వైభవమును ప్రకాశింపజేయుచుటయే. స్వామియే అక్కరలేదు కేశమైనను రాక్షస సంహారము ధర్మస్థాపనము చేయజాలునని అది నిరూపించును. ఇద్దరును ఒకసారి అవతరించి ఒకరు తెల్లగా ఒకరు నల్లగా ఉండుటకు ఆ కేశముల వర్ణములే కారణమని సూచించుచున్నది. అంతేగాని ఈ అవతారములు భగవత్ అవతారములు కావు కేశావతారములు అనుకొనరాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయముగా భగవానుడే అని భాగవతునని చెప్పబడుచున్నది. కనుక ఈ రెండు అవతారములు కూడా భగవత్ అవతారములే. మిగిలిన అవతారములలో కొన్ని ఏదో ఒక్కొక్క కార్యమును నెరవేర్చుటకు వచ్చి ఆ పని నెరవేరగానే సమాప్తమైనవి. అందు కొన్ని ఆవేశావతారములు, కొన్ని అంశావతారములు. అని శ్రీరామ శ్రీకృష్ణ అవతారములు చాలా కాలం భూమిపై ఉండి మానవులను దిద్దుబాటు చేసినవి. ఇందు శ్రీరామావతారము, పూర్ణావతారము, కృష్ణావతారము, పరిపూర్ణావతారము. కృష్ణావతారంలో భగవానుడు ఎన్నో లీలలను చేసి తాను పరమేశ్వరుడిని నిరూపించినాడు. బాలుడుగా ఉండి పూతన ప్రాణములను తీసినాడు. మూడు నెలల సమ వయస్సుతో పాదముతో శకటాసురుని తలక్రిందులు చేసినాడు. తల్లి కట్టిన రోలును లావుకొని పోవుచు మోకాళ్ళపై ప్రాకుచు ఆకాశమునకంటుచున్న రెండు మద్ది చెట్ల మధ్య నుండి దూరి వానిని పెగిలించినాడు.

ఈ కార్యములు సామాన్య అయిన బాలుడు చేయలేడు కదా, అందుచే అతడు పరమేశ్వరుడైన ఎరింగిన వారు ఆనాడు గుర్తించారు. బ్రేపలలలో విషజలమును తాగి ముడిచినందిన పశువులను, పశుపాలకులను అనుగ్రహ పూర్ణముగు చూపునే అమృతముగా ప్రసరింపచేసి బతికించినాడు. యమున యందరొక మడుగులో విహరించుచు దానిలో ఉన్న కాళీయును తొలగించి శుద్ధి చేయవలెనని బలముకు విషముతో చలించున్న జిహ్వలు గల కాళీయుని దాని నుండి దూరముగా పోనట్టు చేసినాడు. వీటన్నిటికంటే ఆశ్చర్యము కార్యము కార్చిచ్చుతో వనము కాలిపోవుచుండగా ఆ వనములో నిద్రించున్న గోపాలనందరిని కనులు మూయుడని వారి కనులు మూసి ఉండగానే ఆ అగ్ని నుండి వెలికి తెచ్చినవాడు ఇది ఆశ్చర్యకరమగు లీల. తల్లియోగ యశోద రోటి కట్టె వలెనని ఎన్ని తాళ్ళు తెచ్చినను పసివాని బొజ్జకు చాలకుంట అత్యాశ్చర్యకరం. ఆమెయే ఒకనాడు ఆవలించుచున్న కుమారుని నోటిలో లోకములన్నిటినీ చూసి ఏమి వెంట అని శంకించినది కానీ దివ్యశక్తిని గుర్తించినది కాదు. శ్రీకృష్ణుడు బాలుడై ఉండి తన తండ్రి వరుణపాశముతో బంధింపబడగా విడిపించినాడు. మయుని కుమారుడగు వ్యోమాసురుడు కొండ గుహలలో గోపాలకుని దాచి ఉంచగా వారిని విడిపించినాడు. తనను అనుసరించి తిరుగు ఏ విధముకు సాధన లేక పగలు తమందైన తమదైనందిన వ్యాపారములు చేసుకొనుచు రాత్రి నిద్రించుచు కాలము గడిపిన గోపకులందరును. నిరతిశానంద లోకమును పొందించిన వాడు అతడే. మోక్షమునందుటకు యజ్ఞ దాన తపస్సులు సాధనములు కావని తనను ప్రేమతో అనుసరించుటయే సాధనమని నిరూపించినాడు. ఏదేళ్ల వయసులో గోపాలకులు చేయవలసిన ఇంద్ర యాగములను వద్దని మాన్పించి ఆ యజ్ఞములో అర్పించు బలిని గోవర్ధన పర్వతునకు అర్పింప చేసినాడు. ఇంద్రునకు ఆగ్రహం కలిగినది. శిలా వర్షమును కురిపించినాడు. అప్పుడు ఏడు రోజులు దాని కింద గోవులను, గోపాలకులను వ్రజమునంతను నిలిపి ఒంటి చేతితో పుట్టగొడుగును ఎత్తినట్లు గోవర్ధనమును ఎత్తి కదలక నిలిచినాడు. ఎంత ఆశ్చర్యము.

భగవానుడు కాక ఇట్టి లీలలు ఎవరు చేయగలరు? వెన్నెలచే ప్రకాశించుచున్న రాత్రి వేళ బృందావనం క్రీడించుచు మధురముగా గానము చేయుచు తన గానముచే పరవశులే ఉన్న గోపికలను హరించిన ఆ శంఖచూడుని శిరస్సు ఛేదించినాడు. దేగాక ప్రళంబుడు, ధేనుకుడు, గార్ధవము, బకాసురుడు, అస్వరూపమున ఉన్న కేసి, అరిష్టుడు, చాణూర ముష్టికులు అనేటి మల్లులను, కువలయాపీడనం అనేటి ఏనుగు, కంసుడు, కాలయవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు. వివిధుడు, వానరుడు, దంతవక్తుడు, ఏడు ఎద్దులు, శంబరుడు, విదూరధుడు, రుక్మి మొదలగు వారెందరూ స్వామిచే చంపబడి వాని అనుగ్రహంచే శాశ్వతము పరమపదము నందిరి. కురుక్షేత్ర సంగ్రామమున ధనస్సులను దాల్చి పాండవులను ఎదిరించుటకు నిలిచిన కాంభోజ మ్రత్స్య కురు కేకయ శృంజయాది దేశపు రాజులను ఎందరినో బలభద్రుడు, భీముడు, అర్జునుడు. మొదలగు వారిని మిషగా కలిపించి భగవానుడు అస్తమింప చేసినాడు. ఈ విధముగా సాక్షాత్తు భగవానుడే శ్రీకృష్ణునిగా అవతరించి మనుష్యులతో సమానముగా ఉండి ఏ రూపమున ఉన్నను తన సామర్థ్యము తరుగునది కాదని మారునది కాదని నిరూపించినాడు. ఇంతవరకు మనము కృష్ణ అవతారము వరకు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంక ముందు భాగాన్ని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. I have come to the essence, the refuge, the refuge. The householder's life is saved. I am the pitcher of curiosity, the natural man. I bow to the knower of dharma, the foremost. You are the axe to the tree of the lives of the devotees who have taken refuge in you You'll ruin it. I beseech thee, o virgin. I am trying to get to know the nature of man. Even though you know the paths to liberation, you are superior in the air. I bow to you. Third Canto, 25th Chapter, 11th Prayer. Devotees of God, we welcome you to the eleventh podcast of the second volume of Srimad Bhagavata Tatva Deepika. So far we have learned about the following avatars. Srihari, Prithvi, and the sage. We have learned about Ayyagiri, Matsyam, and Kurmam. Let's start with the basics. The Lord himself assumed the form of Narasimha, who removed the fear of the gods. The terrifying, frightening, and horrific one, with the movement of his eyebrows, grabbed Hiranyakashipu, who was lying on his face, and threw him on his thigh, and tore him with a rope. One kind The elephant king, having descended into a pond, was caught by a crocodile with immense strength and was struggling. Unable to be freed from sorrow, holding the lotus flower with the trunk, Oh Lord of all the worlds, the first man, the one with a name that brings auspiciousness to those who hear, the one with purity and fame, Narayana, I surrender to you, asking you to come as my protector As he cried out that he was being captured, the invincible Hari, mounting on the shoulders of Garatmantu, came and, with grace, seized the trunk, pulled the elephant out, and tore the crocodile's jaw with a chakra. He saved Gajendra. He is an incarnation of Lord Sri Hari.

Aditi gave birth to Vamana, the last of her sons, in her womb. Aditi's last son, he is superior to all of them in qualities. He is the one who is worshiped by sacrifices. He went to the place of sacrifice and asked for the sacrifice in the form of Vamana, saying that he would conquer the three worlds. Then he occupied the three worlds as Trivikrama. What is the reason for asking like this as a beggar? It may be evening, can't he take the earth from the sacrifice? But there is no other way but to beg, even for the most capable, except to beg to take away wealth from those who are walking in the righteous path. He is following the path of righteousness. Srihari prayed that there was no other way. Even after praying, one might doubt whether it is inappropriate to disgrace someone who practices the path of righteousness. It is not inauspicious for him to perform the coronation of the Deva Samrajya, even more than washing the feet of Trivikrama and anointing his body and head with that water. Bali refused to renege his word. God is naturally a servant He burned him, saying his soul was his. Even though Shukra cursed and cursed, he placed his head as a pedestal at the feet of the Lord and became blessed. That God, when you prayed to learn the path of yoga and the worship of God, assumed the form of a swan and taught you the path of devotion with great love. All of you who believe that Vasudeva is the refuge and practice the knowledge that illuminates the devotion yoga that is the cleansing of the divine, which is different from nature, are practicing it today. In those Manvantaras, that God himself incarnated as Manu, who ruled that Manvantara, and with his glory, he makes his command, the Anadi Chakra, to flow in all directions without any obstruction. He is punishing the proud kings. He makes his fame and his history spread over the earth.

The Lord himself, having incarnated as Dhanvantari in the world, is making it so that diseases will be cured by the patients who are suffering with excessive sorrow by remembering his name. Ayurveda has influenced the world. In the Yagnya, without a share for himself, he regained what the demons had done before. He has attained immortality. By betraying Brahmins and abandoning the path of the Vedas, and by their behavior, to attain hell, the Lord Parashurama incarnated as Kshatriyas who were afflicted by thorns, to the earth that was about to be destroyed With an axe, he killed 21 times. He removed the oppression of the wicked kings of the world. Having prayed to the gods and blessed them, that Lord himself, with his parts, as three brothers, as himself, as Rama, descended upon the Ikshvakus. He obeyed his father Dasaratha's command. He entered the forest with Sita and Lakshmana. Ravana, who was the ten-headed, was defeated by him. Sri Rama's sea route was not established that day. He was furious and with an angry gaze, he refused to establish a route When Sriram saw that, the ocean, frightened by that sight, trembled. It was disturbing. In the ocean, which was afflicted by Rama's anger and suffering, all the aquatic creatures like crocodiles and snakes were greatly afflicted. In the war, Ravana's chest was touched, and Indra's vehicle, Airavata, and the tusks of the elephant were crushed. By drawing the directions with the flour-like teeth, all those directions were cooled. By that, the victory of Rama was proclaimed throughout the world. Ravana, who boasted that he was equal to me, abducted Sriram's wife, and in the war, he killed her with his arrow. The great valiant Lord Rama.

The Lord Rama established dharma in the world. In the world, kings were filled with demonic wealth and were tormenting the earth with demonic armies. To remove the suffering caused by them to the earth, the Lord descended upon this earth in human form, with white and black hair. Balarama is the manifestation of the power of white hair. He's white. The one who was born by the power of the black hair is Sri Krishna, he is black. Thus, the Lord, having taken birth in this world, behaved in a way that was unrecognizable by anyone else, and has done many things to illuminate his greatness. It is said that he, with white and black hair, was born as Balarama and Krishna, and that is how the glory of the power of God is revealed. Swami, even if it is hair, it proves that it is not necessary to destroy the demons and establish Dharma. It suggests that the color of the hair is the reason why both appear different, with one being white and the other black. But these incarnations are not divine incarnations; they are not to be considered as Kesava incarnations. Krishna is God himself. Krishna is said to be the Lord himself, the Bhagavata. Therefore, these two incarnations are also divine incarnations. Among the remaining incarnations, some came to accomplish each and every task, and once that task was completed, they were finished. And some are the embodiment of passions, some are the manifestation of aspects. Thus, the incarnations of Sri Rama and Sri Krishna stayed on earth for a long time and corrected humans. In this, the incarnation of Sri Rama, the complete incarnation, the incarnation of Krishna, the complete incarnation. In the Krishna avatar, the Lord performed many divine plays and proved himself to be the Supreme Being. He took the life of Putana, while still a boy. With the head of Sakatasura upside down, at the age of three months, with the foot. The mother, having grown the roll, crawled on her knees, jumped from between two maddi trees that were touching the sky, and tore him apart.

These tasks cannot be done by an ordinary boy, so they recognized that he was the one who had become Parameshwara (the supreme god) that day. He saved the cattle and herdsmen who had drunk poisonous water in the breasts, by bestowing a full-hearted vision as nectar and saving them. Yamuna, while wandering in a pond, removed the Kaliya in it and purified it, so that Kaliya, who had tongues that were agitated with poison, moved away from it. More surprising than all of this is that while the forest was burning with fire, he closed the eyes of Gopalanandam, who was sleeping in that forest, and as soon as he closed his eyes, the one who brought him out of the fire, this is a surprising play. Mother Yashoda, like a piece of bread, even if you bring many ropes, it is not enough for the baby's belly. It is astonishing. She, one day, seeing all the worlds in the mouth of her sleeping son, doubted what to follow, but did not recognize the divine power. Srikrishna, being a child, was bound by his father's Varuna noose, but he was freed. Vyomasura, the son of Maya, a mountain He hid the shepherd in the caves and freed them. Following him, wandering without any means, during the day they all do their daily business, and at night they sleep, all the cowherds spent their time. He is the one who brought eternal bliss to the world. He proved that following with love is the means to achieve liberation, not sacrifices, charity, penance, or austerities. At the age of what, he stopped the Indra Yagas that should be performed by the Gopalas and offered the sacrifice offered in that Yaga to Govardhana Parvat. Indra's anger had broken. He caused a rain of stones. Then, for seven days, he kept the cows and herds under it, and like lifting a mushroom with one hand, he lifted Govardhanam and stood still without moving. How surprising!

Who else but God could perform such miracles? At the time of the moonlight night, while playing in Vrindavan, singing sweetly, he severed the head of that Shankhachudu who had captivated the Gopis with his music. Besides that, Pralamba, Dhenukudu, Gardhava, Bakasura, Kesi who is in the form of Aswara, Arishtudu, Chanura, Mushtikulu, which are the Mallas, Kuvalayapidaanam, which is the elephant, Kamsa, Kalayavanudu, Narakasura, Paundrakudu. Vividhudu, Vanarudu, Dantavaktudu, seven bulls, Shambarudu, Viduradhudu, Rukmi, and all others were killed by the Swami, and by his grace, they attained the eternal supreme abode. In the Kurukshetra battle, Kamboja, Mritsya, Kuru, Kekaya, and many kings of Shrungajaya and other countries, who stood to oppose the Pandavas, were Balabhadra, Bhima, and Arjuna. He mixed them together and made the Lord disappear. In this way, the Lord himself incarnated as Sri Krishna, being equal to humans, and proved that his ability does not diminish or change in any form. Until now we We have completed up to the point of Krishna avatar. We will find out the rest in the next episode. Salutations to Asmadguru, Jai Srimannarayana.