భగవత్ మాయా వైభవము - విశ్వ సృష్టి స్థితి లయములు
The Lord's Potencies & Cosmic Manifestation Architecture
ఈ భక్తిపూర్వకమైన ఎపిసోడ్‌లో, శుకదేవ గోస్వామి మహారాజు పరీక్షిత్తుకు భగవంతుని బాహ్య, అంతర మరియు తటస్థ శక్తుల అద్భుతమైన వైభవాన్ని వివరించే ద్వితీయ స్కంధ బోధనలను పరిశీలిస్తాము. సర్వేశ్వరుడు తన దివ్యమైన మాయా శక్తి ద్వారా సృష్టి, స్థితి మరియు లయములను ఎంత సువ్యవస్థితంగా నిర్వహిస్తాడో అనే రహస్యాన్ని ఈ ఎపిసోడ్ ఆవిష్కరిస్తుంది. పంచభూతాల నుండి బ్రహ్మాండము వరకు విస్తరించిన విశ్వ నిర్మాణ వాస్తుశిల్పాన్ని, అన్నింటికీ ఆధారమైన పరమాత్మ యొక్క అనంత స్వరూపంలో ఎలా స్థితమై ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం.
In this illuminating episode, we explore the profound teachings of Canto 2, where Śukadeva Gosvāmī reveals to Mahārāja Parīkṣit the majestic workings of the Lord's external, internal, and marginal potencies that govern all of existence. We examine how the Supreme Lord, through His divine Māyā, orchestrates the creation, sustenance, and dissolution of the cosmos in a perfectly ordered cosmic cycle. The episode further unfolds the architecture of universal manifestation, detailing the layers of the material universe from the primordial elements to the expansive cosmic egg, all resting within the Lord's infinite being.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యస్త్వత్ర బద్ధైవ కర్మాభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్యమాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి ప్రకృతియే పరిణామమును చెంది దేహము, ఇంద్రియములు, అంతఃకరణము అనే రూపముగా ఉన్నది. జీవుడు దానినే తానుగా పొరపడి కర్మలను చేయుచు వాటి ఫలమగు పాప పుణ్యములచే కప్పివేయబడిన స్వరూపము గలవాడై. బంధితుడు వలె తల్లి ఉదరములోనున్నాడు. అట్టి నేను ఉపాధి సంపర్కము లేని ఆ పరమేశ్వరునికి నమస్కరించుచున్నాను. జన్మాది వికారములు లేని ఆ పరమేశ్వరుడు నా పీడితమైన హృదయములో భాసించుచున్నాడు. జ్ఞాన స్వరూపుడగు ఆయన యందు జ్ఞాత. న్యాయము అనే భేదము లేదు. థర్డ్ క్యాంటో 31 చాప్టర్ 13th ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక. ద్వితీయ స్కంధం ద్వితీయ స్కంధం 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం అవతారాల యొక్క వివరాలను సూక్ష్మంగా తెలుసుకున్నాం. కృష్ణుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి విషయాలను కూడా కొంత తెలుసుకున్నాం. ముందు భాగం తెలుసుకుందాం. కాల ప్రభావము చే మానవుల బుద్ధి సంకోచము నందినది. ఆయుర్దాయములు తగ్గి ఉండుటచే వేదమునంతను ఎరుంగుట వారికి సాధ్యము కాదని ఆ వేదమును అందరకు అందునట్లు యుగమునకు తగునట్లుగా శాఖలుగా విభజించుటకు వ్యాసుడుగా భగవానుడే అవతరించినాడు. వైదిక మార్గముననుసరించు శ్రోత్రియులను మయుడు నిర్మించిన ఎరుంగజాలని వేగము గల మూడు పట్టణములుగా ఉన్న రాక్షసులు సంహరించుండగా వారి బుద్ధులను అధర్మ మార్గమున ప్రవర్తించునట్లు చేయుటకు ఆ భగవానుడే బుద్ధ రూపమున అవతరించి ధర్మం వలె కనిపించు పాషండ మతమును ప్రకాశింపచేసినాడు.
కలిప్రభావం విజృంభించుటచే సత్పురుషుల భవనములలో కూడా హరికథలు వినబడకుండా బ్రాహ్మణులు పరమ నాస్తికులై ధర్మభ్రష్టులై రాజులు శూద్ర ధర్మమును ఆచరించువారై ఎచ్చటను యజ్ఞయాగాదులు ప్రవర్తింపకపోవుట చూచి భగవానుడే కల్కిగా అవతరించి కలియుగము చివర కలిని శాసించెడి వాడగును ఇట్లు భగవానుడు అనేక రూపములతో అవతరించి లోకమును ధర్మమును కాపాడుచున్నాడు అతని నియమనము చేతనే నేను అంటే బ్రహ్మను ఋషులు తొమ్మిది మంది ప్రజాపతులు సృష్టి కార్యమును చేయుచున్నాము ధర్మము యజ్ఞము విష్ణువు లోకమును పాలించుచున్నవారు అట్లే మనువులు ఇంద్రాది దేవతలు రాజులు కూడా భగవన్ నియమనముచే ఈ లోకమును కాపాడుచున్నారు చివరకు ప్రళయకాలమున అధర్మము రుద్రుడు, మన్యువునకు వశువులై ఉండు, అసురులు మొదలగు వారు ఈ లోకమును అంతమొందింతురు. ఇట్లు భగవంతుని నియమనముచే సృష్టి, స్థితి, ప్రళయములు జరుగుచున్నవి. ఆ భగవానుని అవతారములను చేష్టితములను వర్ణించుట ఎవరికినీ సాధ్యము కాదు. బుద్ధిమంతుడగు పురుషుడు ఎంత ప్రయత్నించినను ఎట్లు భూమియందలి ధూళి కణములను లెక్కింపలేడో అట్లే విష్ణువు యొక్క వివిధ విచిత్రములగు లీలను ఎవ్వరునూ ఎరుంగజాలరు. కీర్తింపజాలరు. ఈ ఆ భగవానుడు మూడు పదన్యాసములచే మూడు లోకములను ఆక్రమించినాడు. అందరి చేతను కీర్తింపదగిన వీర్యము కలవాడు. దేవతలతో కూడా సత్యలోకమును ఆక్రమించినాడు. అట్టి భగవానుని మహిమను సమగ్రముగా ఎవరు పేర్కొనగలరు? నేను. అంటే చతుర్ముఖ బ్రహ్మను కానీ సనక సనందాదులు కానీ మాయను తన వశమందు ఉంచుకొనిన పరమ పురుషుని స్వభావమును ఎరుంగజాలము. మేము కాదు సహస్ర ముఖములు గల ఆదిశేషుడు కూడా తన రెండు వేల నాలుకలతో ఆ భగవానుని గుణములను కీర్తించుచున్నను వాని అంతమును చూడలేకున్నాడు. ఇట్టి అపరిచ్ఛిన్నమగు మహిమ గల భగవానుని మాయను తరించి భగవత్ స్వరూప స్వభావములను ఉన్నవాని ఉన్నట్లుగా ఎరుంగజాలిన వారు ఆ భగవానుని అమాయకముగా ఆశ్రయించి అతని దయకు పాత్రులు గల పాత్రులగు వారే అట్లు భగవానుని పరిపూర్ణముగా శరణాగతి చేసిన వారికి కుక్కలో నక్కలో తినడి ఈ శరీరమునందు నాది నేను అను మోహం ఉండదు
ఇట్లు భగవంతుని శరణు పొంది భగవానుని యోగమాయను ఇరంగగలిగిన వారము మనమే. భగవాను నుగ్రహముచే నేను అంటే చతుర్ముఖ బ్రహ్మను రుద్రుడు నా పుత్రులగు నారద సనక సనందాదులు. ప్రహ్లాదుడు, స్వయంభువ మనువు, ఆయన భార్యేగు శతరూప ధ్రువుడు అనువారము మాత్రమే భగవానుని మాయను ఎరుంగజాలిన వారము. ఇంకను ఇక్ష్వాకువు, ముచుకుందుడు, విదేహరాజు, గాధి, అంబరీషుడు, సగరుడు, భీష్ముడు, దిలీపుడు, గయుడు, యయాతి, మాంధాత. అలర్కుడు, రంతి దేవుడు మొదలగు కొందరు రాజులు కూడా భగవత్ అనుగ్రహం చే భగవానుని మాయను ఎరుంగగలవారు గలరు. సౌభరి, ఉదంకుడు. సిబి, దేవలుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిషేనుడు, విభీషణుడు, హనుమంతుడు, విదురుడు, సీతదేవుడు మొదల కొంతమంది భక్తులు కూడా భగవత్ అనుగ్రహం చే భగవానుని మాయను ఎరింగి దాటగలవారైరి. ఉత్తమమైన జన్మ లేకపోయినను కొందరు స్త్రీలు శూద్రులు, హూణులు, శబరులు. మొదలగు జీవులు తిరియక్కులు కూడా భగవాన్ లీలలను ఎరింగి దానినే సంతతము ఉపాసించి మహాపురుషుల సంబంధముచే ఈ మాయను ఎరింగి దాటగలవారగుదురు. ఆ భగవత్ స్వరూపము అన్ని వేళలా ప్రశాంతముగా ఉండును. భయము ఉండదు. జ్ఞాన స్వరూపమైనది, శోక రహితమైనది, పరిశుద్ధమైనది, ఉపనిషత్తుల చేతనే ఎరుంగదగినది. దీనికి కర్మ సంబంధము లేదు. ఆ భగవత్ తత్వము చేతన అచేతనములకు విలక్షణమైనది. చేతనా చేతనములలో వ్యాపించి ఉన్నను వాని దోషములు అంటనిది. ఆ తత్వమే మోక్షమును వసంగ జాలినది. ఇట్టి భగవత్ స్వరూపమును సంతతము చింతనము చేయువారు మనస్సును నియమించి సాధించు జ్ఞానమును స్వర్గాది ఫలములకు సాధనముకు కర్మను సాధనము కాదని.
విడిచివేతురు. వర్షమును వసంగు ఇంద్రుడు జలములు తన అధీనములో ఉండుటచే ఆ జలములను పొందుటకు సాధనమగు బావిని త్రవ్వుటకు అవసరమైన గునపం మొదలగు సాధనమును ఎట్లు పారవేయునో. అట్లే భగవత్ చింతనము చేయువారు ఇతర సాధనములను విడిచివేతురు. మనము చేయు కర్మలకన్నిటికిని ఫలమునిచ్చువాడు భగవానుడే. స్వర్గాదులను వసంగెడి ఇంద్రాదులను కూడా అతడు ఆత్మయై ఉండి ఆ ఫలములను వసంగగలవాడు అతడే. భగవానుని భజించిన వారికి ఐహిక ఫలములు, ఆముష్మిక ఫలములు, మోక్షము కూడా భగవాను వలనే సిద్ధించును. కావున వారు వేరొక ఉపాయమును ఆశ్రయించరు. ఇట్లు నారదుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా చతుర్ముఖ బ్రహ్మ భగవత్ స్వరూపమును అవతారమును వివరించినాడు. దీని తర్వాత భాగము మరియొక ఎపిసోడ్ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Wherever bound by karmas, the self, filled with the desires of the body and senses, following that, I meditate on the pure, unchanging, and undivided knowledge. I meditate on the body, senses, and It is in the form of an inner instrument. The living being, mistaking it for itself, performs actions and is covered by the form of sin and virtue that is the fruit of them. The mother is in the womb like a fetus. Thus, I offer my salutations to that Parameshwara who has no connection with employment. That Parameshwara, who has no birth defects, is shining in my afflicted heart. The knower is the form of knowledge, in him is the knower. There is no difference of law. Third Canto, Chapter 31, 13th Prayer. Devotees, Srimad Bhagavata Tattvadipika. Welcome to the second episode of the second episode of the 12th podcast. So far, we have learned the details of the avatars in a subtle way. We also learned some things about the incarnation of Krishna. Let's start with the basics. The effect of time, the contraction of human intellect It is Nandi. Because lifespans are decreasing, it is not possible for them to understand the entire Veda, so Vyasa incarnated as Bhagavan to divide that Veda into sections so that it is appropriate for the era. While the demons, who were destroying the three cities, which were like a spear, with the speed of the Erungaja built by Mayudu, who followed the Vedic path, were destroying their minds, that Lord himself, in the form of Buddha, to make them behave in the path of unrighteousness He appeared and, appearing like dharma, illuminated the heretical religion.
Due to the influence of Kali, even in the houses of virtuous people, without hearing Harikathas, Brahmins became extreme atheists, became corrupt in dharma, and kings, Shudras, and those who practice dharma did not perform yagnyas and sacrifices. Seeing this, the Lord himself became Kalki Having appeared, at the end of Kali Yuga, he is the one who rules Kali. Thus, the Lord has appeared in many forms and is protecting the world and Dharma. It is by his ordination that I, meaning Brahma, the nine sages, the Prajapatis, the creation work We are doing righteousness, sacrifice, Vishnu, those who rule the world, similarly humans, Indra and other gods, kings also, by the order of God, are protecting this world. Finally, in the time of destruction, unrighteousness, Rudra, Those who are born as animals to humans, and those like demons, will end this world. Thus, by the ordinance of God, creation, preservation, and destruction are taking place. It is not possible for anyone to describe the incarnations and deeds of that God. A man of intelligence, no matter how much he tries, how he cannot count the dust particles on the earth, similarly, Vishnu's No one can understand or praise the various and unique plays of this Lord. This Lord has conquered the three worlds through three verses. He is a man of valor. He also invaded Satyaloka along with the Goddesses. Who can fully describe the glory of such a God? Me. That is, whether it is the four-faced Brahma or Sanaka, Sanandaadi, or the supreme being who has kept Maya in his control, one cannot understand the nature of him. We are not, even Adiseshu, who has a thousand faces, is praising the qualities of that Lord with his two thousand tongues, but he has not been able to see his end. Those who cannot understand the illusion of the unbroken glory of the Lord, the nature of the Lord, and the existence of the Lord, can innocently take refuge in that Lord and become worthy of His mercy. Thus, the Lord Those who have completely surrendered, will not have the delusion of 'I am mine' in this body, whether it is a dog or a fox
Thus, having taken refuge in God, we are the ones who have mastered the illusion of God's yoga. By the grace of God, I mean the four-faced Brahma, Rudra, and my sons Narada, Sanaka, Sanandaadi. Prahlada, Swayambhuva Manu, and his wife Shatarupa Dhruva are the only ones who could not understand the illusion of the Lord. And also Ikshvaku, Muchukunda, Videharaju, Gadhi, Ambarishudu, Sagarudu, Bhishmudu, Dilipudu, Gayudu, Yayati, Mandhata. Alarkudu, Ranti Devudu, and some other kings also, by the grace of God, are able to understand the illusion of God. Soubhari and Udankudu. Sibi, Devadula, Prahlada, Uddhava, Parashara, Bhurishena, Vibhishana, Hanuman, Vidura, and some devotees like Sitadeva, by the grace of God, were able to cross the illusion of the Lord. Even though they do not have a good birth, some women are Shudras, Huns, and Shabaras. Even creatures like turtles, by understanding the divine plays of the Lord, and by constantly worshipping it, can transcend this illusion through the connection with great men. That divine form, at all times It will be peaceful. There's no need to fear. It is the embodiment of knowledge, free from sorrow, pure, and can only be understood through the Upanishads. It is not karmic. The divine essence is unique to the conscious and unconscious. Even though it is pervading in the consciousness, his faults do not touch him. That very principle is what leads to liberation. Those who constantly contemplate this divine form, controlling their mind, attain the knowledge they desire, and consider the fruits of heaven and other worlds as means, not as objects of action.
They will abandon. Indra, who causes rain, because the waters are under his control, how will he discard the pestle and other tools needed to dig a well to obtain those waters? Similarly, those who contemplate the divine abandon other means. The Lord is the one who gives the fruit for all the deeds we do. He who is the self, who is the one who can take the fruits, even Indra and others who are the abodes of heaven. For those who worship God, worldly fruits, otherworldly fruits, and salvation are also attained by God. Therefore, they do not resort to any other means. Thus, in response to the question asked by Narada, the four-faced Brahma explained the form and incarnation of the divine. We will find out the next part in another episode of the podcast. Jai Srimannarayana. Salutations to the Guru