అజామిళోపాఖ్యానము & నామసంకీర్తన వైభవము (Parts 1-4)

The History of Ajamila & Holy Name Glories (Parts 1-4)

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, పతితుడైన బ్రాహ్మణుడు అజామిళుని చరిత్రను వివరిస్తారు — మరణ సమయంలో తన కుమారుడైన "నారాయణ" పేరు పిలవడం వల్ల అతనికి మోక్షం లభించిన విధానం హృదయాన్ని స్పర్శిస్తుంది. యమదూతలు మరియు విష్ణుదూతల మధ్య జరిగిన వాదన కర్మ సిద్ధాంతాన్ని, భగవద్కృపా మహిమను, మరియు భగవంతుని సర్వోన్నత అధికారాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. నామసంకీర్తన వైభవాన్ని వివరిస్తూ, తెలిసినా తెలియకపోయినా భగవన్నామాన్ని ఉచ్చరించడం సర్వపాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఈ ఎపిసోడ్ నిరూపిస్తుంది.

In this profound episode from Canto 6 of the Srimad Bhagavatham, we explore the remarkable story of Ajamila, a fallen brahmin who unknowingly attained liberation by calling out his son's name "Narayana" at the moment of death. The Yamadūtas and Viṣṇudūtas engage in a dramatic confrontation over Ajamila's soul, revealing deep truths about karma, divine grace, and the ultimate authority of the Lord. This episode further illuminates the unparalleled glory of the Holy Name, showing how sincere or even inadvertent chanting of the Lord's names has the supreme power to purify all sins and grant liberation.

Next →
The History of Ajamila & Holy Name Glories (Parts 1-4) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయానిరుద్ధాయ తుభ్యం భగవతే నమః ఓ వాసుదేవా, భగవంతుడవగు నీ కొరకు నమస్కారం. ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణుల కొరకు నమస్కారం. ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారం. సర్వ జగన్నివాసుడు, ప్రకాశ స్వరూపుడు, తేజస్ స్వరూపుడు, స్వతంత్రుడు, ప్రేమ స్వరూపుడై భక్తులను తన వద్దకు ఆకర్షించువాడగు భగవానునకు నమస్కారం. 11th క్యాంటో, ఫిఫ్త్ చాప్టర్, 29th ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక షష్ట స్కంధంలో మొదటి పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం ఆరు సారీ ఐదు స్కందములను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆరో స్కంధంలో ప్రవేశిస్తున్నాం. ముందు పాడ్కాస్ట్లన్నీ కూడా విని ఐదు స్కంధాల యొక్క విషయాల్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఆనందించి తరిస్తారని భావిస్తూ ముందుకు వెళ్తున్నాం. అజామిలోపాఖ్యానం పరీక్షిత్తు శుకయోగిని ఇట్లా అడుగుచున్నాడు. మీరు వెనక నాకు మోక్ష ధర్మమును ఉపదేశించినారు. దానిచే పొందడి ముక్తి స్వరూపము దాని ఉపయోగములు ఉన్నగునవి అన్నియు ఎరింగించినారు. ఎవరి వర్ణమునకు ఆశ్రమమునకు చెందిన పంచమహాయజ్ఞములు మొదలగు కర్మలను ఆచరించు విధానము ఆత్మ స్వరూప యదార్ధ జ్ఞానము. భగవత్ భక్తి యోగము వానిచే లభించిన భగవత్ అనుగ్రహముచే మోక్షము లభించుటను ఎరిగించినారు. ప్రవృత్తి లక్షణముకు ధర్మమును కూడా వివరించినారు. అధర్మమును కూడా వివరించినారు. సృష్టి క్రమమును ఎరిగించినారు.

అధర్మమును చేయువారు పొందెడి నరకములను ఎరింగించినారు. స్వయంభువ మనువు కుమారులగు ప్రియవ్రత ఉత్తానపాదుల వంశ చరిత్రము వింటిని. జ్యోతిరి మండలమును ఎరిగించితిరి. మీరు భయంకరమగు నరకములను వర్ణించినారే, ఆ నరకములో పడకుండా పాపము ఆచరించిన వాడు తప్పించుకొనుటకు ఏదైనా మార్గము ఉన్నదా? నరకములో పడకుండా తప్పుటకు ఉపాయమేమో నాకు ఎరుంగింపగోరుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు ఇట్లు చెప్తున్నాడు. ఓ రాజా ఈ లోకములో పాపములను ఆచరించిన వారు ఆ పాపములకు ప్రాయశ్చిత్తములను ఇతడినే ఆచరించుకొని నరకమును పొందకుండా తప్పించుకొనవచ్చు. అట్లు ప్రాయశ్చిత్తము చేసుకొనని వారు తప్పక నరకమును పొందుదురు. ప్రాయశ్చిత్తము చేసుకొనని వారు. మానవులు మనస్సుతో, మాటలతో, చేతలతో పాపములను చేయుచుందురు. దానికి ప్రాయశ్చిత్తము చేసుకొనకుండుదురు. అందుచే వివేకము గల మానవుడు బ్రతికి ఉండగానే పాపములను తొలగించుకొనుటకు ప్రాయశ్చిత్తమునకు యత్నింపవలెను. రోగముల యొక్క తీవ్రతను బట్టి వైద్యులు భిన్న భిన్న చికిత్సలు చెప్పినారు. పెద్ద పాపములకు కూడా ఎన్నో ప్రాయశ్చిత్తములు చెప్పినారు. మరల పరీక్షిత్తు ఇట్లా అడుగుచున్నారు. లోకములో కొందరు ప్రత్యక్షముగా పెద్దలు తప్పని నిందించుచున్నను శాస్త్రములో చేయకూడదని చెప్పినారని ఎరింగియు. ఆయా విషయానుభవములకు పరవశులై తమకు అనిష్టమును కలిగించును ఎరింగియు పాపు పని చేయుచుందురు. అట్టి వారికి ప్రాయశ్చిత్తము ఎట్లు పాపములను తొలగింపజాలును? ప్రాయశ్చిత్తము చేసుకొనెనను మరల పాపము చేయువానికి ఏనుగు స్నానము చేసి మరల ఇసుక జల్లుకొనునట్లు ప్రాయశ్చిత్తములు వ్యర్థములని అనుకొందురు. కావున ఈ శాస్త్రములో చెప్పిన ప్రాయశ్చిత్తములు కాక వేరొక మార్గమున్నదా ఎరంగింపుము ఇట్లు పరీక్షిత్తు ప్రశ్నింపగా శుకుడు చెప్తున్నాడు.

పాప కర్మ చేసి దానికి ప్రాయశ్చిత్తముగా వేరొక యాగమో దానమో చేయుట శాస్త్రములో వేధింపబడి ఉన్నది. కానీ మొదట చేసిన కర్మ యొక్క ఫలితమును రెండవ కర్మ పూర్తిగా నివారింప చాలదు. ఆ ప్రాయశ్చిత్తము చేయునప్పుడు మరల ఎన్నో దోషములు జరగవచ్చును. దానికి మరల ప్రాయశ్చిత్తములు చేర్చుకొనుచున్నచో పూర్తిగా పాపమును తొలగిపోవుట అనునది ఎన్నటికీ జరగదు. రోగము పూర్తిగా తగ్గకపోయినను తాత్కాలికముగా కొంతవరకు తగ్గించుటకు ఉపయోగించును. ఆరోగ్యకరము ఆహారమును తీసుకును వారలకు. వ్యాధులు కరగవు కదా? నియమబద్ధముగా జీవితము సాగించువాడు క్రమముగా క్షేమమును పొందగలడు. దీనికి ఒక క్రమములో నియమమును పాలించుచుండవలెను. ఎన్ని కర్మలు ఆచరించినను భగవద్భక్తి కలిగినవా కానీ పూర్తిగా పాపఫలము నశింపదు. బంధము వీడి మోక్షము కలగదు. అందుచే ముందు తపస్సు చేయుట కర్తవ్యం. తపస్సు అనగా చేతలలో, మాటలలో, మనస్సులో నియమములను పాటించవలెను. తీసుకునుటి ఆహారములో రాజస, తామస పదార్థములను విడిచి సాత్విక ఆహారమును తీసుకునుటే తపస్సు. అలా తీసుకునుట కూడా తపస్సే. మనసులో ఇతరులకు బాధను కలిగించు ఆలోచనలు వీడి మంగళకరములగు భావన చేయుట కూడా తపస్సే. ఇట్టి తపస్సును ఆచరించుట అలవాటు చేసుకొనవలెను. శ్రీ భోగము శాస్త్ర విహితమే కానీ తనకు శాస్త్ర విధిగా లభించిన భార్యతో ఋతుకాలమందు సత్సంతానముకై సంగమించుట బ్రహ్మచర్యమే అది కూడా తపస్సే. పూర్తి బ్రహ్మచర్యము ఆచరించుట ఉత్తమమే. ఎనిమిది విధములగు స్థిరితో సంబంధము లేకుండా బ్రహ్మచర్యమును పాటించుట మనసునకు కామరహిత స్థితిని కలిగించును. దానిని అలవాటు చేసుకొనవలెను. జ్ఞానేంద్రియములు దుష్టములు నిషిద్ధములగు విషయముల వైపు ప్రసరించకుండా నిరోధించుట దమము. మనసును నిర్గ్రహించుట శమము.

తనకు ఉన్న దానిలో తన శక్తికి తగినట్లు సత్పాత్రములను సత్పాత్రములకు దానము చేయుచుండవలెను. సత్యమును పాటించవలెను. భూతములకు మేలు కలుగునట్లు మాట్లాడుట ప్రవర్తించుట అనృతమును పలకకుండుట. సత్యం. దానిని అలవరచుకొనవలెను. సదాచారం పాటించవలెను. ఒక వస్తువు లభించనిచో బ్రతకలేము అనడి తీవ్రమగు కోరికను కోరికకు వశము కాకుండా ఉండవలెను. వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెను. ఇట్లు నియమములతో ప్రవర్తించుట ముందుగా అలవర్చుకొనవలెను. సుఖమునకు సాధనము ధర్మము. ఆ ధర్మమును ఎరింగిన వారు శీతోష్ణములను సుఖదుఃఖములను ఓర్చుకొను నేర్పుగలవారై శ్రద్ధతో ధర్మమును ఆచరించుచు భగవానుని సేవించి తాము చేసిన పాపమును నశింప చేసుకుందురు. వెదురు పొదలో అగ్ని పడినచో అది మొత్తం పొదను అంతను ఎట్లు కాల్చి వేయునో. అట్లే శ్రద్ధతో తపస్సును, బ్రహ్మచర్యమును, శమమును, దమమును, త్యాగమును, శౌచమును, యమమును, నియమమును పాటించుచున్నచో భగవద్భక్తి కలుగుటకు ప్రతిబంధకములైన పాపములు పోవును. భక్తి బ్రహ్మ ప్రాప్తికి ప్రతిబంధకమును తొలగించును. అందుచే చేసిన పాపను అనుభవించకుండా తొలగించుకొనుటకు ప్రధానమైన సాధనము భక్తియే. కానీ అట్టి భక్తి కలుగుట చాలా దుర్లభము. ఎక్కడో ఒక్కరు ఆ వాసుదేవుడే తనకు ఉపాయమని వాడే తనకు ప్రాప్తి సాధనమని వాడే ప్రాప్యము ఆధారము అని ఉండును. సూర్యుడు మంచును తొలగించునట్లు వాని భక్తి పాపములను తొలగించును. ఫలమునందు కోరిక లేక సాత్వికమగు బుద్ధితో శ్రద్ధతో తపస్సు మున్నగునవి చేసుకునేనచో భక్తి కలుగుటకు ప్రతిబంధకమునైన పాపములు పోవును. కానీ మోక్షమును కలిగింపజాలవు. నిరదిశయమైన సుఖమే మోక్షము. ఆ సుఖము భగవత్ ప్రాప్తిచే కలుగును. భగవత్ ప్రాప్తి భగవత్ అనుగ్రహము చేతినే లభించును. భగవత్ అనుగ్రహము లభించుటకు భగవంతుని యందే తనను తన సర్వస్వమును అర్పించిన వాడే ఉండవలెను. భగవత్ భక్తుల పాద సేవ చేయవలెను. అట్లున్నచో పాపములన్నియు పూర్తిగా తొలగిపోవును.

దుఃఖములు అనుభవించుటకు కారణము పాపం. ఆ పాపమును తొలగించుకొనుటకు సాధనములు, తపస్సు మొదలగున ఎన్నో ఉన్నవి కానీ. అన్నిటికంటే క్షేమకరమైనది సందేహము లేకుండా ఫలమునిచ్చునది భక్తి ఒక్కటే. కనుక మంచి శీలము గల సాధువులు నారాయణ పరాయణులై ఉందురు. నారాయణుని యందు భక్తి లేకుండా ఎన్ని తపస్సులు శుద్ధులు, యాగములు, ప్రాయశ్చిత్తములు చేసినను అవి పాపములను తొలగించి పవిత్రము చేయజాలవు. కుండలో కళ్ళు పోసి ఉంచి దానిపై సీలు చేసి ఎంత గంగాజలము తెచ్చి కడిగినను అది ఎట్లు పవిత్రము కాదో అట్లే నారాయణుని స్మరణ లేక విముఖమై ఉన్న మనస్సు గలవారు ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసుకునెనను ప్రయోజనము లేదు. లోక విషయములందు మనస్సు లగ్నమై ఉన్నను ఒక్కసారి ఆ మనస్సు కృష్ణ పాదారవిందములయందు చేరి ఉన్నచో యమభటులు స్వప్నములో కూడా వాని వైపు చూడరు. కృష్ణ నామస్మరణము కృష్ణుని పాదారవింద్యములను హృదయమున నిలుపుకొనుటయు ఒక్కసారి అయినను లభించినచో మరి పాపములు అంటవు. ఇంకా ఎల్లవేళలా వాసుదేవుని స్మరించుచు తలంచుచు ఉండెడి వారికి పాపములు అంటని వేరే చెప్పవలెనా పరిపూర్ణమోభవత్ భక్తియే అక్కరలేదు. కేవలం భక్తి యోగమునకు ఆరంభమున చేయు నామస్మరణ కూడా పాపములను దూరము చేయును. నామమును ఉచ్చరించుట మనసారా గాక అనుకొనకుండా జరిగినను అది యమభటులకు దగ్గరగా రాకుండా దూరము చేయును. దీనికి ఒక ఇతిహాసమును చెప్పెదను వినము. ఏ ఇతిహాసం చెబుతున్నారో ఆ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to Vasudeva, salutations to Sankarshana, salutations to Pradyumna and Niruddha, salutations to you, O Lord. Oh Vasudeva, salutations to you, the Lord. Salutations to Lord Pradyumna, Aniruddha, and Sankarshana. Greetings to the four formations with those names. Salutations to the Lord who is the master of all the worlds, the embodiment of light, the embodiment of splendor, the independent one, the embodiment of love, and the one who attracts devotees to himself. 11th Canto, 5th Chapter, 29th Prayer. Dear devotees, welcome to the first podcast in the sixth book of Srimad Bhagavata Tattvadipika. So far we have completed six saris and five skandhas. Now entering the sixth book. Listening to all the previous podcasts, we are moving forward hoping that everyone will understand the matters of the five skandhas, enjoy them, and be saved. The story of Ajamila, Parikshit, and Shukayogini is being asked like this. You have already given me the teaching of Moksha Dharma in the past. It is the form of liberation obtained by it. Its uses are as follows All of them are eroded. The method of performing the Pancha Mahayagnas and other karmas belonging to whose Varna and Ashrama is the self-form, true knowledge. They have made known that salvation is attained by the grace of God, which is obtained through devotion to God. They also explained the nature of the tendency and its characteristics. He also explained what unrighteousness is. They revealed the order of creation.

They have shown the hells that those who do unrighteousness will attain. I have heard of the lineage of Priyavrata and Uttanapada, the sons of Swayambhuva Manu. They have identified Jyothiri Mandal. You have described terrible hells, is there any way for the one who commits sin to escape without falling into that hell? When Parikshit asked what is the way to avoid falling into hell, Shuka is saying this. Oh king, in this world, those who have committed sins can atone for those sins and escape from hell by performing the atonements themselves. Those who do not atone for their sins will surely be in hell. Those who have not made atonement. Humans commit sins with their minds, words, and actions. They will atone for it. Therefore, a wise man should strive for atonement for sins while he is still alive. Doctors have suggested different treatments depending on the severity of the diseases. Even for big sins, many Expiation was promised. Again, Parikshit is asking like this. In the world, some directly condemn elders as wrong, but Erngi said that it is said not to do so in the scriptures. Being engrossed in those experiences, they cause their own displeasure, and they do sinful deeds. How can atonement for such people remove sins? They think that atonement is futile, like an elephant bathing and then sprinkling sand, for one who commits sin again. Therefore, is there another way besides the expiations mentioned in this scripture? When Parikshit asked this, Shuka is saying.

It is prescribed in the scriptures that one should perform a separate sacrifice or charity as atonement for committing sinful deeds. But the result of the first action cannot completely prevent the second action. When performing penance, many more sins may occur again. If we continue to add atonements to it, the complete removal of sin will never happen. Even if the disease does not completely disappear, it can be used to reduce it temporarily to some extent. Those who take healthy food. Diseases don't melt, do they? One who lives a disciplined life can achieve success in a systematic way. It should be followed in a systematic way. No matter how many karmas one performs, even if one has devotion to God, the consequences of sins will not be completely destroyed. There is no liberation without breaking the bond. Therefore, it is necessary to do penance first. Tapasya means to follow the rules in the hands, words, and mind. Taking food that is Rajasic and Tamasic, leaving them out, and taking Sattvic food is penance. That is also penance to take. In the heart, pain to others To have thoughts that are auspicious and to have a feeling that is also penance. One should make it a habit to practice this kind of penance. Sri Bhogamu is prescribed by the scriptures, but to have children during menstruation with a wife obtained by the scriptures is celibacy, that too is penance. Complete celibacy is the best. Observing celibacy without any connection to eight types of stability brings a state of mind free from lust. You just have to get used to it. The sense organs are bad, the sense organs are forbidden, to prevent them from proceeding towards subjects, that is self-control. Controlling the mind is pacifying.

One should give good deeds according to one's ability and strength. Truth be told. Speaking and acting in a way that benefits ghosts, not uttering falsehood. Truth. That should be cultivated. Respect should be given. If an object is not available, we cannot live. The intense desire to live should not be controlled by desire. One should follow the rules of Varna and Ashrama. Thus, it is necessary to prepare before acting with rules. Dharma is the means to the end of happiness. Those who have understood that Dharma, being skilled in enduring heat and cold, and serving the Lord with devotion, will destroy the sins they have committed. If fire falls on a bamboo grove, it will burn the entire grove. Similarly, if one practices penance with devotion, celibacy, self-control, restraint, sacrifice, purity, Yama, and rules, then sins that hinder devotion to God will be removed. Devotion removes the obstacles to the attainment of Brahman. Without experiencing the sin committed The main tool to get rid of it is devotion. But such devotion is very rare. Somewhere, one person considers Vasudeva as his only means, considers him as his attainment, considers him as his means, and considers him as his support. Just as the sun removes the snow, so his devotion removes sins. If one performs penance and other such things with a desire for fruit, and with a sattvic intellect, then sins that hinder devotion will be removed. But they cannot give salvation. The only permanent pleasure is the knowledge of liberation. That pleasure is obtained through the attainment of God. Divine attainment is attained only through the grace of the Lord. To receive God's grace, one must be the one who has surrendered his entire being to God. Serve the devotees of God. If that is the case, all sins will be completely removed.

Suffering is caused by sin. There are many means to remove that sin, including penance and other practices. The most secure and without doubt, the one that gives fruit is devotion alone. Therefore, good virtuous saints are devoted to Narayana. Without devotion to Narayana, no matter how many penances, purifications, sacrifices, and expiations are performed, they cannot remove sins and purify. Even if you pour water into a pot, seal it, and bring and wash it with Ganges water, it is not as sacred as it is not purified. Similarly, those who are averse to remembering Narayana, there is no use in doing any penance. Even if the mind is attached to worldly matters, if that mind is once attached to the lotus feet of Krishna, the servants of Yama will not even look at him in a dream. Remembering Krishna's name, keeping Krishna's lotus feet in the heart, if attained even once, sins will not touch you. And those who always remember and think of Vasudeva, should I tell you something else about the sins that do not affect them? Completely Devotion is not needed. Only the chanting of the name at the beginning of Bhakti Yoga removes sins. Even if the name is uttered wholeheartedly, without thinking, it will keep it away from coming close to the servants of Yama. I will tell you a legend for this. We will learn about the story later in the podcast. Jai Shri Srimannarayana.