నారద మహర్షి ఉపదేశము - దక్షుని పుత్రుల మోక్ష మార్గము

Narada Instructs Daksha's Sons & Paths of Renunciation

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, మహర్షి నారదుడు దక్ష ప్రజాపతి యొక్క పదివేల మంది పుత్రులైన హర్యశ్వులకు అద్వితీయమైన తత్త్వోపదేశం చేస్తాడు. సృష్టి విస్తరణ కంటే భగవత్ సేవయే పరమ పురుషార్థమని నారదుడు వారికి బోధిస్తాడు, దాంతో వారిలో వైరాగ్యభావన మేల్కొంటుంది. నారదుని దివ్యవాక్కులకు ప్రభావితులైన హర్యశ్వులు సంసార బంధాలను త్యజించి మోక్షమార్గంలో పయనిస్తారు, దక్షుడు దీనితో విచారగ్రస్తుడవుతాడు. ఒక సత్పురుషుని సాంగత్యం ఆత్మను శాశ్వత సత్యం వైపు మళ్ళించగలదని ఈ ఘట్టం సుందరంగా నిరూపిస్తుంది.

In this profound episode from Canto 6 of the Srimad Bhagavatam, the great sage Narada Maharshi imparts transcendental wisdom to the ten thousand sons of Daksha Prajapati, known as the Haryashvas. Narada reveals the supreme path of renunciation and devotion to Lord Vishnu, awakening in them a deep dispassion toward worldly life and the desire to propagate creation. Moved by his enlightening words, the Haryashvas choose the path of liberation and depart for spiritual seeking, leaving Daksha in grief and bewilderment. This episode beautifully illustrates how the association of a true saint can instantly redirect a soul toward the eternal and the absolute.

← Prev Next →
Narada Instructs Daksha's Sons & Paths of Renunciation bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే కేవలాయాద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే భగవానుడు మూడు గుణములను కలిగి యున్నను వాటికి అతీతమైన కేవల అద్వితీయ చైతన్యమే స్వరూపముగా గలవాడు. గురువు, వేదము భగవాను రూపములే ఆ భగవానుని కొరకు నమస్కారము. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు దక్ష ప్రజాపతి చేసినటువంటి గుహ్య స్తోత్రము తను సృష్టి కార్యం కోసమై చేసినటువంటి సంతానాన్ని నారదుడు నివృత్తి మార్గం వరకు మరలించినందువలన తను ఆక్రోశముతో నారదుని శపించుట, ఆ తర్వాత తను మరలి 60 మంది భార్యలను, 60 మంది పుత్రులను సంతానంగా పొంది వారి ద్వారా తను సంతానాన్ని పొందించినటువంటి విషయాన్ని. తెలుసుకున్నాం. అయితే ఆ తరువాత కశ్యపుని యొక్క భార్యలు ఈ జగత్తుకు సృష్టి చేశారు, జన్మనిచ్చారు. వారి వంశం గురించి చెప్తాము, విందాం. అదితి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇళ, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, శరమ, తిమి అనువారలు. వారు సంతానం వినుము. తిమికి జలచరములు సంతానముగా జన్మించెను. శరమకు కుక్కలు వ్యాఘ్రమార్జాలములు సంతానముగా జన్మించెను. సురభికి ఎనుబోతులు, గోవులు, చిలిన గిట్టలు గల జంతువులు సంతానముగా జన్మించెను. తామ్రకు, డేగలు, గద్దలు మొదలగు బలమైన పక్షువులు సంతానముగా జన్మించెను. మునికి అప్సరసల గణములు జన్మించెను. క్రోధవశకు కాటువేసడి పాములు మొదలగునవి జన్మించెను. ఇళ్లకు వృక్షములు, సురసకు రాక్షసులు సంతానముగా జన్మించిరి.

అరిష్టకు గంధర్వులు జన్మించిరి. కాష్టకు చీలని గిట్టలు గల గుర్రములు, గాడిదలు మొదలగు జంతువులు పుట్టెను. ధనువుకు 61 మంది జన్మించిరి. అందు ప్రధానులైన వారి పేరు చెప్పెదన విను. దిమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభవసువు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానువు, కపిలుడు. అరుణుడు, వృషపర్వుడు, లోముడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తుడు, దుర్జయుడు అను 18 మంది. ముఖ్యులు వీరిలో స్వర్భానువు సముచి కన్యాను సుప్రభను పరిణయమాడెను వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్టను నహుషుని కుమారుడయగు యయాది పరిణయమాడెను వైశ్వానరులకు కుమార్తెలు నలుగురు. ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అని వారి పేర్లు. హిరణ్యాక్షుడు ఉపదానవిని, క్రతువు హయశిరను, కశ్యపుడు అను ప్రజాపతి పులోమను. కాలకను పరిణయమాడెను. పులోమ కాలక అనడి వైశ్వానద కన్యలను పరిణయమాడవలెనని కశ్యపుని బ్రహ్మ నియమించెను. వారి ఇరువులకు కలిగిన సంతానమే పౌలోములు, కాలకేయులు అని దానవులు. వారు యుద్ధము చేయుటలో కడు సమర్ధులు. వారిని నివాత కవచులు అని కూడా అందురు. నివాత కవచులను, దానవులను యజ్ఞములకు విఘ్నములు కలిగించుచున్నారని. మీ తాతయ్యగు అర్జునుడు ఒకప్పుడు స్వర్గమునకేగి ఇంద్రుని కొరకు వారితో యుద్ధము చేసి వారిని పంపించెను. విప్రచిత్తి సింహికాను భార్యలయందు 101 మంది దానవులు కలిగెను. వారిలో పెద్దవాడు రాహువు మిగిలిన నూరు మంది కేతువులు. ఈ రాహువే దానవాదముడైనను భోగదనుగ్రముచే గ్రహము అయ్యెను. ఇక అదితి వంశం వినుము. అంశమునందు సాక్షాత్తు నారాయణుడు తన అంశచే జన్మించెను. అదితికి వివస్వంతుడు, సర్యముడు, ఉష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రుముడు.

ఉరుక్రముడు అని పుత్రుడు జన్మించిరి. ఈ ఉరుక్రముడే భగవానుని అవతారము. అతడే వామనుడు. త్రివిక్రముడు వివస్వంతునకు సౌన్య అనడి భార్య యందు శ్రాద్ధ దేవుడు జన్మించెను. ఇతడే వైవసత మనువు అని ప్రసిద్ధుడాయెను. ఆమెయే యముడు యమి అని ఇద్దరిని కనెను. వీరు కవలలు. ఆ సంజ్ఞయే బడబ అయి అశ్విని దేవతలను వివస్వంతునకు కుమారులుగా పొందెను. ఆమెయే ఛాయా అను పేరు గలదై శనేశ్వరుని కనెను. ఆమెయే సావర్ణి అనేడి మనువును కూడా కనెను. అట్లే తపతి అనేడి కన్యను కూడా ఆమె ప్రసవించెను. ఆ తపతి అనేటి కన్య సంవరణుని భర్తగా పొందెను. అర్యమునకు మాతృక అనునామె భార్యగా ఉండెను. వారికి చర్షణలు అను పేరు గల కర్మచేయు స్వభావము గల సంతతి కలిగెను. ఈ చర్షణల యందే మనుష్యమతి బ్రహ్మచే కల్పింపబడినది. పూష అనునతునకి పుత్రులు లేరు. దక్ష యజ్ఞములో అతని దంతములు ఊడెను. అందుచేత అతడు పిండి ముద్దనే తినుచుండెను. పూష దక్ష యజ్ఞములో కోపించి రుద్రుని చూసి పండ్లు కనపడనట్లుగా నవ్వెను. అందుచే అతని దంతములు ఊడగొట్టబడినవి. దైత్యులకు చెల్లెలగు ప్రవచ అనునామే త్వష్ట యొక్క భార్య ఆయను. వారిద్దరుకు విశ్వరూపుడు. అను కుమారుడు కలిగెను. దైత్యులకు మేనల్లుడగు ఈ విశ్వరూపుని దేవతలు ఒకప్పుడు పురోహితునిగా వరించిరి. బృహస్పతి ఇంద్రునిపై కోపం వచ్చి దేవతలను వదిలినాడు. దేవతలు ఈ విశ్వరూపుని పురోహితునిగా వరించిరి. బృహస్పతి దేవతలకు పౌరోహిత్యము చేయుచు ఎందుకు వదిలినాడు? దేవతలు గురువు వద్ద ఏమి తప్పు చేసినారు తెలుపుడని పరీక్షిత్తు ప్రార్థింపగా శోకయోగి చెప్తున్నాడు. ఇంద్రునికి మూడు లోకముల ఐశ్వర్యము లభించిన తరువాత తనంత వాడు లేడని మదము కలిగెను. దానిచే అతడు సన్మార్గమును ఉల్లంఘించి తప్పుగా ప్రవర్తించెను. ఒకనాడు ఇంద్రుడు సభలో సింహాసనమును అధిష్టించి ఉండెను.

అప్పుడు మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, వృషభులు, విశ్వదేవులు, సాధ్యులు, అశ్విని దేవతలు పరివేష్టించి సేవించుచుండిరి. సిద్ధ, చారణ, గంధర్వులు, బ్రహ్మవేత్తలగు మునులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పతగములు, వృగములు కూడా ఇంద్రుని స్తోత్రము చేయుచుండిరి. ఇంద్రుడు కొలువు తీరి ఉండగా అతని ఆసనము చంద్రమండలములే అందమైన తెల్లని ఛత్రము చే ప్రకాశించుచుండెను. మహారాజ చిహ్నములగు చామరములు వీవనలు వీచ్చుండిరి. అప్పుడు ఇంద్రునకు దేవతలకు కూడా పూజింపదగిన వాడగు బృహస్పతి సభలోకి వచ్చుచుండెను. ఇంద్రుడు అహంకారముతో చూచియు లేచి ఎదురేగి ఆసనము చూపక తటస్థుడై ఊరకుండెను. వెంటనే విద్వాంసుడగు బృహస్పతి ఐశ్వర్యముచే ఇట్టి అవమానము జరిగినదని గుర్తించి మాట్లాడక వెనుతిరిగి తన భవనమునకేగెను. అతడు వెళ్ళగానే ఇంద్రుడు గురువు విషయమున తాను చేసిన అవమానము గుర్తించి తనను తానే సభలో నిందించుకొనెను. ఓహో! అల్పబుద్ధితో ఎంతటి తప్పు చేసితిని? ఐశ్వర్యమత్తుడనై గురువును సభలో తిరస్కరించితిని. జ్ఞానము గలవాడు సత్యలోకాధిపతి యొక్క ఐశ్వర్యమును కూడా తుచ్ఛముగా భావించును. కానీ కావలెనని కాంక్షింపడు అది నశ్వరమని వారి రుంగుదురు దేవతలకు ప్రభువునై ఉండియు నేను ఈ అసుర భావమును పొందితిని కొంతమంది మహారాజు తన సింహాసనము నుండి లేచి ఒకరిని ఎదుర్కొనరాదని అందురు కానీ వారికి ధర్మము తెలియదు. అట్టి వారు చెడు మార్గమును ఉపదేశించు వారు గానీ సన్మార్గ దర్శకులు కారు. వాని మాట విని వినిన వారు నరకములో పడుదురు. రాతి పడవనెక్కి నదిని దాటుటకు ప్రయత్నించుట ఎంత అవివేకమో గురు ఉపదేశములను పాలింపకుండుట. అంత వినాశకరము. నేను ఇప్పుడే వెళ్లి అగాధముగు బుద్ధి గల మా ఆచార్యుని అనుగ్రహింప చేసేదను. తుంటరితనం వదలి వారి పాదములపై పడెదను. ఇట్లు ఇంద్రుడు అనుకొనుచున్నాడని ఎరింగి. బృహస్పతి యోగ ప్రభావము చేత ఇంద్రుడు కనపడకుండా మాయమాయెను. ఇంద్రుడు గురువుగారి గృహమునకు వెళ్లి వారిని దర్శింపవలెన ఎంత ప్రయత్నించినను దర్శనం లభింపకపోవుటచే శోకముతో శాంతినందక బాధపడెను.

ఈ విషయము రాక్షసులకు తెలిసెను. వారి గురువు శుక్రుడు. బృహస్పతి వదిలినాడు కనుక ఇప్పుడు మీరు వెళ్లి ఎదిరింపుడు అని చెప్పెను. వారు దుర్మధులు, వారు ఆకతాయులు. ఒకరిని చంపవలెను పూనిక కలవారు. అట్టి అసురులందరును దేవలోకముపై దండెత్తి వచ్చి తమ బాణములతో దేవతలందరినీ చెండాడిరి. ఇంద్రునితో కూడా దేవతలందరు బ్రహ్మలోకమునకేగి బ్రహ్మకు నమస్కరించి శరణు పొందిరి. దేవతలను చూచి బ్రహ్మ దయతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను. ఓ దేవతలారా, మీకు చాలా కష్టము వచ్చినది. చేయకుడిని పనిని చేసితిరి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు జితేంద్రియుడగు బృహస్పతిని అనాదరము చేసితిరి. అట్టి చెడ్డ పనిని చేయుటచే శత్రువులు మిమ్మలను ఆక్రింపగలవారైనారు. మీ బలము తగ్గుటచే వారి బలము పెరిగినది. గురువును తిరస్కరించుట ఆపదలకు కారణము. రాక్షసులు ముందు ఒకసారి తమ గురువగు శుక్రువుని అవమానించి చెడి మరల అతనిని ఆశ్రయించి ఇప్పుడు సమృద్ధి నందినారు. ఆ గురువు అనుగ్రహముచే వారు మిమ్ములనే కాదు నా లోకమును కూడా ఆక్రమింపగలరు. నేడో రోపో రేపో ఆ రాక్షసులు లోకమును స్వాధీనము చేసుకొనగలరు. శుక్రాచార్యుల మంత్రశక్తి ఎవ్వరి చేతును ఓడించుటకు శక్యము కానిది. ఎవరు బ్రాహ్మణులను, గోవిందుని, వేదములను పూజింతురో వారికి అమంగళములు కలగవు. గురువును ఆరాధింపని వారికి ఎంత సమర్ధులైనప్పటికీ అమంగళములు కలుగుచునే ఉండును. కావున మీరు తష్ట కుమారుడగు జితేంద్రుడైన విశ్వరూపుడను వానిని ఆశ్రయింపుడు. మీకు పురోహితునిగా ఉండుమని ప్రార్థింపుడు. విశ్వరూపుడు అసురుడి యొక్క పక్షపాతము గలవాడు. ఆ పని మీకు అఇష్టమే అయినను మీరు క్షమించి ఉండుడు. బ్రహ్మ ఇట్లు చెప్పగానే భయము తొలగి స్పష్ట కుమారుడగ ఒక విశ్వరూపుని వద్దకు వెళ్లి దేవతలందరూ వెళ్లి అతని ఆలింగనము చేసుకుని ఇట్లు పలుకుచున్నారు. మేమందరము మీకు అతిథులుగా వచ్చితిమి. మీ ఆశ్రయము మంగళప్రదమగుగాక. మీ తండ్రి తాతలకు నెరవేరవలసిన కోరికలు నెరవేరుగాక. యోగ్యురైన కుమారులు తండ్రులకు సేవ చేయుటయే పరమ ధర్మము. నీవు బ్రహ్మచారివి. మీకు అతిథిగా వచ్చిన మాకు మనసుకు సంతుష్టిని కలిగించుట మీకు ధర్మము.

ఆచార్యుడే మూర్తి దాల్చిన బ్రహ్మము. తండ్రి చతుర్ముఖుడగు ప్రజాపతి యొక్క మూర్తి. సోదరుడు ఇంద్రుని మూర్తి. తల్లి సాక్షాత్తు. భూదేవి యొక్క మూర్తి. అందుచే బ్రహ్మను ఉపాసించినట్లు, ఆచార్యుని ప్రజాపదిని సేవించినట్లు ఉండి ఉన్నట్లు, తండ్రిని ఇంద్రుని సేవించినట్లు, సోదరుని భూమిని సేవించినట్లు తల్లిని గౌరవించి సేవించవలెను. సోదరి దయా స్వరూపిణి, అతిథి అభాగ్య అభ్యాగతుడు, అగ్నిమూర్తి, సర్వభూతములు ఆత్మతో సమానులు. మేము నీ తండ్రి వంశం వారలమై ఆర్తులమై వచ్చితిమి. పరాభవము పొంది ఉంటిమి. నీ తప ప్రభావముచే మాకు సహాయము చేయదగును. జ్ఞానివి అగు నిన్ను ఉపాధ్యాయునిగా వివరించియున్నాము. నీ తేజస్సుచే మేము శత్రువులను జయింపగలమని నమ్మి వచ్చితిమి. మీరు మాకంటే వయస్సులో చిన్నవారే. తప్పక పొందవలసిన ప్రయోజనము ఉన్నప్పుడు మంత్రమును స్వీకరించునప్పుడు తమకంటే చిన్నవారికి కూడా నమస్కరించవచ్చును. మంత్రమును ఉపదేశించునప్పుడు చిన్నవారికైనను నమస్కరించి ఉపదేశమును పొందవచ్చును. నీవు వేదములను ఎరుగిన వాడవు కావున మేము నీకు నమస్కరించుచున్నాము. ఇట్లు దేవతలు ప్రార్థింపగానే మహా తపస్శాలి యుగ విశ్వరూపుడు ప్రసన్నుడై మృదువుక వాక్కుతో ఇట్లు పలికెను. ధర్మాచరణము చేయువారు పౌరోహిత్యమునకు అంగీకరింపరు. పౌరోహిత్యం బ్రహ్మ వర్చస్సును తగ్గించును. ధర్మమును నశింపచేయును. మీ కొరకు నేను కొంత తపస్సును ధార పోయవలసి వచ్చును. అందుచే చేయరాదు. కానీ లోకములకు పాలకులకు మీరు వచ్చి యాచించినారు. నేను తండ్రుల యెడ గౌరవము గలవాడను. మీ వంటి వారు శిష్యులుగా ఉండుమని వచ్చుటయే మహా లాభము. పౌరోహిత్యముచే ధనము లభించునని కొందరు అనుకొందురు. కోరిక లేని వారికి ఏరుకొని తెచ్చిన వరి వెన్నులో ధాన్య గింజలో జీవించుటకు చాలును. అదే వారికి ధనము. దానితోనే వారు మహా యజ్ఞములను కూడా నెరవేర్తురు. మాకు ఏ కోరిక లేదు. నాకు ధనము అవశ్యకము కాదు. అందుచే ఓ దేవతలారా, నేను మీ పౌరోహిత్యము చేయుటకు ఎట్లు అంగీకరింతును? కానీ మీరు నాకు పితృ సమానులు. మీరు ప్రార్థించిన నాడు నేను కాదనుట తగదు. అందుచే మీరు కోరినట్లు నాకు సామర్థ్యం ఉన్నంతవరకు తపస్సు చేతను చివరకు ప్రాణము చేతనైనను మీ కోరిక నెరవేరుతును.

ఇట్లు మహా తపస్శాలి అయిన విశ్వరూపుడు తన ఉత్తమమగు మనస్సుతో వారికి పౌరోహిత్యము చేయుటకు అంగీకరించెను. అసుర సంపద శుక్రాచార్యుల నీతి కౌశలముచే రక్షింపబడుచున్నది. దానిని ఎవ్వరునూ తమ వశము చేసుకున చాలరు. కానీ విశ్వరూపునకు నారాయణ కవచమనేటి విద్య తెలుసును. దానిని ఇంద్రునకు ఉపదేశించెను. దానిచే అసురుల యొక్క ఐశ్వర్యమును వారి నుండి తొలగించి ఇంద్రుడు కొసంగెను. ఇంద్రుడు వైష్ణవి విద్యయగు నారాయణ కవచ మంత్రము నేర్చుకొని ధ్యానించి దానిచే రక్షింపబడిన వాడై అసుర సేనలను జయించెను. ఆ విద్యచే ఇంద్రుడు శత్రులను జయించి ఐశ్వర్యమును పొందెను. పరీక్షిత్తు శ్రీ సుఖుని ఇటు ప్రశ్నించుచున్నాడు. ఇంద్రుడు శ్రీ వైష్ణవీ విద్యచే రక్షింపబడి సైనికులను వారి వాహనములతో కూడా హేలగా జయించి. త్రిలోకైశ్వర్యమును ఎట్లు అనుభవించెనో ఆ నారాయణ దేవాంశమగు మంత్రమును నాకు ఉపదేశింపుడు. ఆ కవచము జపించి కదా ఇంద్రుడు తమను చంపుటకు వచ్చుచున్న అసురులను జయించినాడు. నాకు దాని ఎరుగింపుడని ప్రార్థించెను. శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. సష్ట కుమారుడగు విశ్వరూపుడు తనను ఉపాధ్యాయునిగా వరించి ఇంద్రుడకు నారాయణ కవచమును ఇట్లు ఉపదేశించినాడు చెప్పదని వినుము. మనము తర్వాత భాగంలో నారాయణ కవచం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to that Bhagavat, the embodiment of the three Gunas, the unique one, the Guru, the embodiment of Brahman. Bhagavan, although possessing three Gunas, is beyond them, the unique, non-dual consciousness itself. Guru, Veda is the form of God, salutations to that God. Devotees of God, welcome to the eighth podcast of the sixth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, the secret hymn performed by Daksha Prajapati, and the offspring he created for the purpose of creation, because Narada turned them back to the path of Nivritti, he cursed Narada with anger, After that, he returned and had 60 wives and 60 sons as children, and through them, he had children. We learned. However, after that, Kashyapa's wives created this world, gave birth. We'll hear about their lineage, we'll listen to it. Aditi, Diti, Dhanuvu, Kashta, Arishta, Surasa, Ila, Muni, Krodhavas, Tamra, Surabhi, Sharama, Timi are the names. Listen to the children. Thimiki The aquatic animals were born as offspring. The dogs were born as offspring of the tigers. Surabhi was born with eight elephants, cows, and animals with small horns. Tamraku, kites, eagles, and other strong birds were born as offspring. The Muni was blessed with a host of apsaras. Angry, venomous snakes were born. Trees and demons were born as children to the houses.

The Gandharvas were born to Arishta. Animals like horses and donkeys with split hooves were born. Dhanuva had 61 children. Listen, I will tell you the names of those who are the leaders. Dimurdhudu, Shambarudu, Arishtudu, Hayagreevudu, Vibhvasuvu, Ayomukhudu, Shankushirudu, Swarbhanuvu, Kapiludu. Arunudu, Vrushaparvudu, Lomudu, Ekachakrudu, Anutapakudu, Dhoomrakeshudu, Virupakshudu, Viprachittudu, Durjayudu, and 18 others. Among the chieftains, Swarbhanu, Samuchi, Kanayu, and Suprabhanu were married to Sharmishta, the daughter of Vrishaparva. Yayadi, the son of Nahusha, was married to Vaishvanara. The Vaishvanaras had four daughters. Their names are Udadanavi, Hayashira, Puloma, and Kalaka. Hiranyaksha, Upadanavini, Kratu, Hayasira, Kasyapa, and Prajapati Pulomanu. The time has come. Brahma ordered Kashyapa to marry the Puloma Kalaka and the Vaishvanaada Kanyas. The children of their union were the Paulomans and the Kalakeyas, who were demons. They are very good at fighting. They are also called Nivat Kavachulu They say that the demons and the gods who create obstacles to the sacrifices are causing disturbances. Your grandfather Arjuna once went to heaven and fought with Indra for them and sent them away. Viprachitti Simhika, along with his wives, had 101 demons. The eldest is Rahu and the rest are Ketu. This Rahu, although a donor, became a planet due to its appetite. Now listen to the Aditi lineage. In the essence, Narayana himself was born in his part. Aditi is Vivasvantudu, Saryamudu, Usha, Twashta, Savita, Bhagudu, Dhata, Vidhata, Varunudu, Mitrudu, Shakrudu, Urukrumudu.

A son named Urukrama was born. This Urukarama is the incarnation of the god. He is Vamana. Vishnu, the son of Vivasvanta, was born to the wife of Sauya. He is the well-known Vaivasvata Manu. She gave birth to two children, Yama and Yami. They are twins. That sign became a bad thing and the Ashwini Devas were obtained as sons to Vivasvanta. She, named Chaya, had a son named Shaneshvara. She also had a son named Savarni. Similarly, she also gave birth to a maiden named Tapati. Tapati married Kanya Samarvana's husband. Aryamuna was the wife of Matrika. They had a lineage with a nature of performing actions, called Charshanas. In these observations, the human intellect is created by Brahma. Pusha Anantu ki pautralu ledu. In the Daksha Yagna, his teeth fell out. So he kept eating the dough. Pusha, in anger at Daksha's Yagna, looked at Rudra and laughed as if fruits were not visible. Therefore, his teeth were broken. Pravacha, the sister of the Daityas, is the wife of Twashta. Both of them are the embodiment of the universe. Anu's son has been born. The gods, who were the nephews of the Daityas, once served as priests. Brihaspati got angry with Indra and left the Devas. The gods came as priests to this cosmic form. Why did Jupiter, the god, leave the priesthood? When Parikshit prayed to the gods to tell him what mistake they had made with the guru, the sorrowful Yogi is saying. After Indra received the wealth of the three worlds, he became arrogant, thinking there was no one like him. He violated the right path and behaved wrongly. Once upon a time, Indra was seated on a throne in a court.

Then the Marutas, Vasus, Rudras, Adityas, Vrishabhas, Vishvadevas, Sadhyas, and Ashwini Devas surrounded and served. Siddhas, Charanas, Gandharvas, Brahma-vidyas, sages, Vidyadharas, Apsaras, Kinnaras, and even Pātagas and Vrāgas were praising Indra. While Indra was seated, his seat was illuminated by the beautiful white canopy of the moon. The royal symbols, such as the fly whiskers and the crests, were removed. Then, Brihaspati, who is worthy of being worshipped by Indra and the gods, was coming into the assembly. Indra, seeing with arrogance, rose, went towards him, without showing his seat, remained silent. Immediately, Brihaspati, the scholar, realizing that such an insult had occurred due to his wealth, turned back and went to his palace. As soon as he left, Indra, realizing the insult he had made to the guru, condemned himself in the assembly. Oh! What a mistake I have made with my poor intellect! I rejected the guru in the assembly, saying I am wealthy. The one who has knowledge, the wealth of the lord of truth Even that is considered trivial. But he does not desire it, they say it is impermanent, even though he is the lord of the gods, I have attained this demonic feeling, some great king rose from his throne and said that one should not confront another, but they do not know Dharma. Those who teach the wrong path are not guides to the right path. Those who listen to his words will fall into hell. How foolish it is to try to cross the river by climbing a rocky mountain, without following the teachings of the Guru. So devastating. I will go now and please our Acharya who has the wisdom of the abyss. I will leave the mischief to them. Thus, Indra is thinking, so said Eringi. Due to the influence of Brihaspati Yoga, Indra disappeared. Indra went to the guru's house to see him, but no matter how hard he tried, he could not find him. He was saddened and distressed by this.

The demons knew this. Their patron is the god Shukra. Since Jupiter has left, now you go and challenge him, he said. They are wretches and they are starving. Someone who is determined to kill. All those demons attacked the heavens and wreaked havoc on all the gods with their arrows. With Indra, all the gods went to Brahma's abode, paid their respects to Brahma, and sought refuge. Seeing the gods, Brahma, with kindness, consoled them and spoke thus. Oh, gods, you've had a very bad experience. The one who made the man do the work. You have disrespected Brihaspati, the knower of Brahman, the conqueror of the senses. Because of doing such a bad deed, enemies have become able to attack you. Their strength increased because your strength decreased. Rejecting a guru is dangerous. The demons, once they insulted their guru, Shukra, and were ruined, now have abundance. By the grace of that guru, they can not only conquer you but also my world. Suddenly or slowly, those demons will take over the world They can do it. The power of Shukracharya's mantra is such that it is impossible for anyone to defeat it. Those who worship Brahmins, Govinda, and the Vedas will not be harmed. For those who do not worship the guru, no matter how capable they are, inauspicious things will always happen. Therefore, you should take refuge in Vishwaroopa, the son of Jitendra, who is the best of the best. Pray that you may be a priest. Vishwaroopa is partial to the Asura. Even if you like that work, please forgive me. As soon as Brahma said this, the fear disappeared, and the clear son went to a universal form, and all the gods went and embraced him, and thus they spoke. We all came as your guests. May your shelter be blessed. May your father and grandfathers' wishes come true. Serving the fathers is the ultimate duty for worthy sons. You are a bachelor. It is your duty to satisfy our hearts by visiting us as a guest.

The Acharya is the embodiment of Brahma. The father is the icon of the Chaturmukha Prajapati. The brother is the god Indra. Mother, of course. The idol of Bhudevi. Therefore, one should serve Brahma as one worships, serve Acharya's Prajapati as one serves, serve father Indra as one serves, and respect and serve mother as one serves brother. Sister, embodiment of compassion, guest, fortunate, unfortunate, Agni Murthy, all beings are equal to the soul. We, being descendants of your father, have come as mourners. I'm hurt and angry. Your prayers will help us. We have explained you as a wise teacher. We believed that we could conquer the enemies by your splendor. You are younger than I am. When there is an undeniable benefit to be obtained, when accepting a mantra, one can also bow down to those younger than oneself. When teaching a mantra, one should bow down to even a small child and receive the teaching. Since you are the one who knows the Vedas, we salute you. Thus As the gods prayed, the great ascetic, the universe-form, became pleased and spoke thus in a soft voice. Those who practice dharma do not accept priesthood. Purohitam reduces Brahma Varchasu. And destroyer of righteousness. For your sake, I have to pour some penance. You shouldn’t do that. But you have come and prayed to the rulers of the world. I'm a proud father. It is a great benefit for people like you to come as disciples. Some people think that they will get money through priesthood. For those who have no desire, the rice they have collected is enough to live on, in the grain of the rice they have brought. That is their wealth. With that they perform great sacrifices. We don't have any requests. Money is not necessary for me. Therefore, O gods, how can I agree to perform your priesthood? But you're more like a father to me. I shouldn't have said no when you asked me to pray. Therefore, as you wish, as far as I am capable, I will do penance, and finally, even if it is life, I will fulfill your wish.

Thus, the great ascetic Vishwaroopa, with his best mind, agreed to perform the priesthood for them. The wealth of demons is protected by the wisdom and skills of Shukracharya. No one can take it into their own hands. But the knowledge of the Narayana Kavacham is known to the universal ruler. He instructed Indra. By that, Indra took away the wealth of the demons from them. Indra, having learned and meditated on the Narayana Kavacha mantra, which is the Vaishnava Vidya, and being protected by it, conquered the Asura armies. By that knowledge, Indra conquered his enemies and attained prosperity. Parikshit is questioning Sri Sukuni. Indra, protected by Sri Vaishnavi's knowledge, conquered the soldiers with their vehicles easily. How you experienced the three worlds of wealth, instruct me on that Narayana Deva's essence, the mantra. By chanting that mantra, Indra conquered the demons who were coming to kill them. I prayed for deliverance. Shukudu is saying this. The six sons, the universal form He, as a teacher, thus instructed Indra about the Narayana Kavacham. Listen to what he said. We will learn the inner meaning of Narayana Kavacham in the next part. Jai Srimannarayana. Salutations to the Asmadgurus