నారాయణ నామ ఉచ్ఛారణ - విష్ణుదూతల రక్షణ సంవాదము

Chanting 'Narayana' & Intervention by Vishnudutas

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, మరణ సమయంలో అజామిళుడు అప్రయత్నంగా "నారాయణ" అను నామాన్ని ఉచ్ఛరించగా, ఆ నామ మహత్మ్యమే అతనికి మోక్షమార్గాన్ని సుగమం చేసిన వైనాన్ని వివరిస్తారు. యమదూతలు అజామిళుని తీసుకెళ్ళబోగా, విష్ణుదూతలు వెంటనే అడ్డుపడి అతనిని రక్షించిన దివ్య సంఘటన ఈ ఎపిసోడ్‌లో వర్ణించబడింది. విష్ణుదూతలు మరియు యమదూతల మధ్య జరిగిన సంవాదం, ధర్మ స్వరూపాన్ని, నారాయణ నామ మహిమను, మరియు భగవంతుని పరమాధికారాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది.

In this profound episode from Canto 6 of the Srimad Bhagavatham, we explore the remarkable story of Ajamila, whose accidental utterance of the name "Narayana" at the moment of death becomes his ultimate salvation. The Vishnudutas swiftly intervene to protect Ajamila from the Yamadutas, asserting that the divine Name holds the power to erase all accumulated sins. A deep and illuminating exchange unfolds between the Vishnudutas and Yamadutas regarding the supreme authority of Lord Vishnu, the nature of dharma, and the liberating power of the Lord's holy name.

← Prev Next →
Chanting 'Narayana' & Intervention by Vishnudutas bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమోస్తుతే మహాయోగిన్ ప్రపన్న మనుషాధిమామ్ యధాత్వచ్చరణాంభోజే ప్రతిస్యాదనపాయినీ ఓ మహాయోగి నీకు నమస్కారం నేను నిన్ను శరణు వేడుచున్నాను నీ పద్మం వంటి పాదమునందు శాశ్వతమైన ప్రీతి ఉండే విధముగా నన్ను అనుగ్రహించుము. 11th క్యాంటో, 29th చాప్టర్, 48th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత దత్త దీపిక. షష్ట స్కంధము నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు అజామిలోపాఖ్యానంలో భాగంగా అజాముని యొక్క వృత్తాంతము. యమదూతలు, విష్ణుదూతలు మధ్య జరిగిన సంభాషణని మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇట్లు విష్ణుదూతలు చెప్పిన భాగవత ధర్మమును బాగుగా నిర్ణయించి యమభటులు అజామిణుని యమపాశముల నుండి విడదీసి వెలికి వచ్చినట్టు చేసిరి. యమదూతలు తమ రాజగు యముని వద్దకెగిరి. అంతయు నివేదించిరి. బ్రాహ్మణుడగు యజామిణుడు యమపాశముల నుండి విడువడి మరల పూర్వావస్థను పొందినాడు. ఎదురుగా విష్ణుదూతలను చూచెను. చూడగానే అతని మనస్సునకు ఆనందము కలిగెను. వారికి శిరస్సు వంచి నమస్కరించెను. వారితో ఏవో మాట్లాడవలెనని అనుకొనుచుండెను. అంతలో విష్ణుదూతలు అంతర్ధానమైరి. అతడు యమపాశములచే కట్టుబడి ఉండి వారి సంవాదములను విని భాగవత ధర్మమును తెలుసుకునినాడు. అది అతని మనసులో దృణముగా నిలిచెను. ఈ చేసెడి కర్మలు అన్నియు గుణత్రయవసులై సంచరించెడి జనులు ఆచరింపదగినవే. భాగవత ధర్మము నామస్మరణమే అని అతడు ఎరంగెను. ఇంతవరకు తాను చేసిన పాపములకు పశ్చాత్తాపము కలిగెను. శ్రీహరి నామము యొక్క మహాత్మ్యము వినుటచే భగవంతుని యందు భక్తి కలిగెను.

అతడు ఇట్లు తనను తాను నిందించుకొనుచున్నాడు. ఛీ ఛీ ఎంత తప్పు చేసితిని మనసును అడ్డుకొనలేక ఎంత పాపము చేసినాను. శూద్ర స్త్రీతో కలిసి నా బ్రాహ్మణ్యమును నాశనము చేసుకుంటిని. నేను చేసిన పాప పని నిందింపదగిన పని. మా వంశమును నాశనము చేసితిని. కళంకము కలిగించితిని. పతివ్రత చిన్న వయసులో ఉన్న భార్యను వదలి మద్యపానము చేసెడి కొలటను చేరెతిని. తల్లిదండ్రులు వృద్ధులు, దిక్కు లేని వారు, మరొక బంధువులు లేని వారు, దీనులు. వారిని నేను కృతజ్ఞత లేని వాడనై వదిలినాను. మహా భయంకరముగు నరకములో తప్పక పడెదను. ధర్మమును పాడు చేసి కామముతో ప్రవర్తించిన వారు ఏ నరకమును అనుభవింతురో. దానిని అనుభవించి తీరుదును. ఇది ఏమి స్వప్నమా? కాదు, ప్రత్యక్షముగా చూచితిని. చాలా ఆశ్చర్యం. పాశములతో నన్ను కట్టి లాగుచున్న యమదూతలు ఏమైనారు? ఆ సిద్ధ పురుషులు సుందరులగు నలుగురు ఎచటకేగినారు? పాశములతో కట్టి పాతాళమునకు లావుకొని పోవుచున్న నన్ను వారు విడిపించినారు. నేను దురదృష్టవంతుడనే కానీ అంతటి మహాపురుషుల దర్శనము కలిగినది కనుక నేను ఏదో పుణ్యము చేసి ఉందును. నా మనసు ఇప్పుడు నిర్మలంగా ఉన్నది. తెలియని పుణ్యమేదో లేనిచో క్షూద్ర స్త్రీపై కామము గల నాకు ఆమె పేరు గాక. నారాయణ నామం ఎందుకు నోట వచ్చినది? నేను మోసగాడను, పాపాత్ముడును, లజ్జలేని వాడను. ఇట్టి నా నోరు మంగళకరమగు నారాయణ నామం పలికినది. ఏదో పుణ్యము. తెలియని పుణ్యము నాకు ఉన్నది కనుక ఇక ముందు నేను నా మనస్సును ఇంద్రియములో నియమించి భగవన్ నామస్మరణముచే చేయుచు గడిపెదను మరలా ఆ అంధతమస్సులో మునగకుండా ఉండెదను దేహాత్మాభిమానముచే కామము, ఆ కామముచే కర్మ, దానిచే ఈ సంసారమును పొందితిని. దీన్ని వదిలించుకొని సర్వభూతములను మైత్రితో చూచుచు మనసును నిగ్రహించుకొని అన్ని భూతముల యందు దయగలవాడనై ప్రశస్తమైన మనసు గలవాడనగుదును. ఈ శరీరము నేనని, శరీరము చెందినవి నావని, వాని అనుభవించుటయే నాకు ఆనందమని, ఇంతకాలము భ్రమించి ఈ స్త్రీ రూపముగా నన్ను ఆవరించిన భగవన్ మాయకు వశమైతిని, ఇప్పుడు భగవన్ నామమును కీర్తించి భగవద్గుణములను తలంచి.

భగవానుని యందు మనస్సు నిలిపి ఈ మాయను వదిలించుకొందును. ఇంతకాలము నన్ను ఇది క్రీడామృగముగా ఆడించినది. ఇట్లు వజామియుడు నిర్వేదము గలవాడాయను. క్షణకాలము మహానుభావులతో కలిసిన కలిగిన సంఘము అతని బంధములన్నింటినీ తినించెను. వెంటనే ఇల్లు, ఇల్లాలు, పుత్రులు మొదలగు బంధములన్నింటినీ వదలి గంగానది అవతరించిన హరిద్వారమునకేగెను. ఆ గంగా ద్వారమునందు నిశ్చలముగా కూర్చొని ఇంద్రియములను విషయముల నుండి మరల్చి మనస్సును ఆత్మయందు నిలిపెను. ఆత్మను భగవానుని దివ్య తేజోమయ మూర్తియందు స్థిరముగా నిలిపెను. అట్లు అతడు నిశ్చలమగు ధ్యానముతో ఉండగా వెనుక తాను చూచిన ఆ పురుషులు నలుగురు మరల కనపడిరి. వారిని చూచి తాను చూచిన వారే అని గుర్తించి వారి పాదములకు నమస్కరించెను. వెంటనే తన శరీరమును గంగలో పడవేయెను. అతనికి ఆ వచ్చిన భగవద్దూతల యొక్క స్వరూపము వచ్చెను. వారితో కలిసి విమానం అధిరోహించి ఆకాశ మార్గమున ఆ శ్రీయపతి ఉండెడి స్థానమునకేగెను. ఇట్లు సర్వ ధర్మములను వదిలినవాడు, దాసీపతి, నింద్యముకు కర్మాచరణము గలవాడు, అన్ని వ్రతములను వదిలినవాడు, నరకములో పడిపోవుచున్నవాడు ఒకసారి భగవన్ నామము అనుకొనకుండా ఉచ్చరించి మోక్షమునందెను. కర్మ బంధమును ఛేదించునది భగవన్ నామము కంటే వీరొకటి లేదు. నామ సంకీర్తనము చేసినచో మనస్సునకు అంటిన రజస్తమస్సులు తొలగిపోవుటయే కాదు మరల కోరిక కూడా కలగదు. ఈ ఇతిహాసము పరమ రహస్యమైనది. పాపములను తొలగించునది. దీనిని శ్రద్ధతో వినెను కీర్తించినను యమకింకరులు కంటబడరు. నరకమును పొందరు. ఎట్టి దుష్టుడైనను ఈ ఇతిహాసమును వినుటచే మనసునంటిన మాలిన్యము తొలగి విష్ణులోకములో విరాజిల్లును. పుత్రుడి పేరుగా నారాయణ అని చనిపోవుచు ఒక్కసారి నారాయణునందు భక్తి లేక పుత్ర ప్రేమతో పిలిచినను అజామిలుడు మోక్షమునందినాడు కదా. శ్రద్ధతో, భక్తితో భగవన్ నామమును కీర్తించిన వారు బంధమును వీడి ముక్తినందుదురు అనుటలో సందేహమేమి? యమదూతలు విష్ణుదూతలచే త్రోచిపుచ్చబడి మరల యమలోకమును చేరి యమునకు ఈ వృత్తాంతము వినిపించిరి.

ఇంతవరకు యముని ఆజ్ఞ ఎన్నడును ఎచ్చడను తిరస్కరింపబడుట యమదూతలు ఎరుగరు. అందుచే వారికి సందేహము కలిగి యమునితో ఇట్లు వినవించుతున్నారు ప్రభు. జీవలోకమునకు వారు చేయు కర్మలకు తగిన ఫలమునిచ్చడి శాసకులు ఎందరున్నారు? ఇంతవరకు మీరు ఒక్కరే అని విన్నాం. పుణ్యకర్మ చేసినను, పాపకర్మ చేసినను, పుణ్య పాప మిశ్రమం అయిన కర్మ చేసినను వారు అనుభవించవలసిన ఫలమును నిర్ణయించవలసిన వారు మీరే అని మేము అనుకొనుచున్నాము. జీవుల కర్మలకు తగిన ఫలములను వసంగెడి దండధరులకు శాసకులు అనేకులు అయినచో ఒకరు చెప్పిన దానికి రెండవ వారు చెప్పిన దానికి విరోధం వచ్చినచో మృత్యువు మోక్షము అనునవి నియతమైన వ్యవస్థ లేనివి అగును కదా అందులో ఒకరు ప్రధానులు మరొకరు అప్రధానులు అగుదురు ఒకరికి అధికారము ఎక్కువ ఒకరికి అధికారము తక్కువ అగును మండలాధిపతి కంటే దేశాధిపతికి ఎక్కువగా అధికారం ఉండునట్లు ఇతర కూడా తారతమ్యం ఉండునా? మీరు చేసినది పుణ్యమని పాపమని నిర్ణయించి దండమును నిర్ణయించు వాడవు నీవు ఒక్కడివే కదా? కానీ ఈనాడు అద్భుతమైన రూపము గల నలుగురు శుద్ధ పురుషులు వచ్చి. మీ ఆజ్ఞను త్రోసిపించినారు. మీ ఆజ్ఞను అనుసరించి నరకమునకు ఒక పాపాత్ముని మేము తీసుకొని వచ్చుచుండగా వారు వారించి మా పాశములను త్రెంచి వదిలించినారు. వారు ఎవరో ఎరుంగింప కోరుచున్నాము. ఆ రహస్యము మేము ఎరుంగింపదగినదై తగినది అయినచో ఎరుంగింపుడు. ఆ పాపాత్ముడు నారాయణాని పలికినాడు అంతే. వారు వచ్చి మా పాశమును నుండి విడిపించినారు. దూతలు చెప్పినా విని నారాయణ అను శబ్దం వినగానే శ్రీహరి పాదమును స్మరించి దండధరుడగు యముడు ప్రీతినిందిన వాడై తన దూతలతో ఇట్ట అనుచున్నాడు. ఈ లోకములను నియమించుటలో నాకంటే పైవాడు ఒకడు ఉన్నాడు. నాకంటే మాత్రమే కాదు, లోకములో ఎవరను అతని మించిన వారు లేరు. ఈ విశ్వమంతయు అతని యందే దారములు బట్టలో పడుగవే పేకగా. పడుగు పీకగా అల్లుకొని ఉండి వెడల్పుగా పొడవుగా సాగుచున్నట్లు విశ్వమంత

అంతయు అతని యందే విస్తరించి ఉన్నది. ఈ జగత్తు పుట్టుట అతని వలన, ఉండుట అతని వలన, అతని అంశమే జగత్తు. ఈ లోకమంతయు బలిసిన ఎద్దు ముక్కు త్రాడుకు లొంగి నడుచునట్లు అతని ఆజ్ఞకే వశమై నడుచున్నది. అందరికంటే గొప్పవాడు అతడు. అన్ని జన్మలకు కారణమైన వాడు అతడు. అన్నిటినీ శాసించువాడు అతడు. అన్నిటిలో వ్యాపించిన వాడా అతడు. భగవానుడు వేదమనడి తన వాక్కుతో త్రాడుతో బలమైన ఎద్దును కట్టినట్లు వర్ణాశ్రమ కర్మలతో దేవ మనుష్యాది నామములతో బంధించి నడిపించుచున్నాడు. లోకులందరూ అతనికి భయపడి అతనినే పూజించుచుందురు. దేవతలలో గొప్పవారమగు నేను, మహేంద్రుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ. విశ్వే దేవతలు, వసువులు, సాధ్యులు, మరుత్తులు కూడా అతని ఆజ్ఞను అనుసరించియే ప్రవర్తించుచుందుము. విశ్వమునంతను సృజింపజాలిన బ్రహ్మ మిగిలిన ప్రజాపతులు, భృగ్వాది మహర్షులు మాత్రమే కాదు, రజస్తమస్తులు ఎన్నడును అంటని సత్వప్రధానులగు నిత్య శూరులు కూడా. అతని అభిప్రాయమును ఎరుంగ జాలరు. అందరూ అతని మాయకు వశులై ప్రవర్తించడి వారే. ప్రాణులు ఎవ్వరును ఆ భగవానుని ఇంద్రియములు చేయగాని, మనసు చేయగాని, ప్రాణాయామము చేయగాని. ధ్యానము చేయగాని వాగ్విభవము చేయగాని చూడజాలరు. ఎరుంగజాలరు. అతను అందరికీ ఆత్మయై అందరిలో ఉండును. ఎదురుగనుండు రూపములను దర్శింపజేయు చక్షునింద్రియమును ఎట్లు చూడలేమో. అన్నిటికీ ప్రకాశకుడగు భగవానుని ఎవరూ దర్శింపజాలరు. సర్వము తన వశమందు ఉన్నవాడతడు. అతడు స్వతంత్రుడు. అతని శాసించి నియంత అతడు. అందరిచే ఆరాధింపవాడతడు. అతని సంకల్పమును ఎవ్వరును ఎరుంగజాలరు. అతని స్వరూపమును గాని స్వభావమును గాని ఇట్టిది అని ఎవ్వరును ఎరుంగజాలరు. చేతనులను అచేతనము కూడా నియమించువాడతడు. అట్టి భగవానుని యొక్క దూతలు ఆ భగవానుని వంటి రూపము స్వభావము గలవారలై మనోహరులై ఈ లోకములో సంచరించుచుందురు. వారు విష్ణు కింకరులు. వారి స్వరూపములు జ్యోతిర్మయములు, మహాద్భుతములు. బ్రహ్మాది దేవతలకు కూడా పూజింపదగినవి. వారు భగవద్భక్తి గల జనులను మృత్యువు నుండి ఇతరుల నుండి కాపాడుచుందురు.

భక్తి గల వారిని రక్షింపవచ్చును గాని అజామినుడు పాపాత్ముడు కదా అని మీకు సందేహము కలగవచ్చును. భగవాను ప్రకాశింపచేసిన ధర్మము భాగవత ధర్మము. దాని రహస్యమును ఋషులు గాని, దేవతలు గాని, సిద్దులు కానీ, విద్యాధర చారణాదులు కానీ ఎరుంగజాలరు అనినచో మనుష్యులు, అసురులు ఎరుంగుట అనుట అనవసరం కదా. భాగవత ధర్మమును ఎరింగిన వారు కొద్దిమంది ఉన్నారు. వారిలో బ్రహ్మ, శంభువు, నారదుడు, సనత్కుమారుడు, కపిలుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, శుకుడు, ప్రధానులు. వీరి కంటే వేరొకరు భావధర్మం ఎరిగిన వారు లేరు. భాగవత ధర్మము సత్వగుణం ప్రధానముగా గలవారికి తప్ప తెలియదు. రహస్యమైనది, విశుద్ధమైనది. దీని ఎరిగిన వారు ముక్తిని పొందుదురు. భగవాను నామములను ఉచ్చరించుట, భగవానుని యందే భక్తి కలిగి ఉండుట అను వాని కంటే వేరొక సాధనము ముఖ్యమునకు లేదు. అత్యంత శ్రేయస్సును పొందుటకు ఇదియే పరమమైన ధర్మము. యముడు తన దూతలను పుత్తులారా అని పిలిచి ఇటు చెప్పుచున్నాడు. భగవన్ నామమును ఉచ్చరించుట యొక్క గొప్పదనం మీకు తెలిసినదా? పాపాత్ముడగు అజామిరుడు నామోచ్చారణము చేతనే మృత్యుపాశము నుండి విడింపబడినాడు. తెలిసి తెలియక ఎన్నో పాపములను చేయుచుందుము. వానిని తొలగించుటకు ఏ ప్రాయశ్చిత్తము కూడా సమర్థము కాదు. భగవాను గుణములను, భగవాను చేష్టితములను, భగవాను నామమును సంకీర్తనము చేయుటయే పాపములు అంటకుండా చేయు సాధనము. పాపాత్ముడగు అజామిలుడు నారాయణ అని కుమారుని పిలిచి మోక్షమునందినాడు. సాధారణముగా ఈ రహస్యం అందరూ గుర్తింపజాలరు. పెద్ద పెద్ద విద్వాంసులు కూడా భగవానుని మాయ చేయ మోహమునంది సరియగు నిర్ణయము చేయలేక ఫలమును కాకుండా పూలు పూలుగానే ఉండినట్లీ ఉండినట్టి చెట్టు చెట్ల వలె చూచుటకు వినుటకు అందముగనున్న వేదం ప్రతిపాదించుడి కర్మల యందే శ్రద్ధ కలిగి ఉండెదరు. భగవన్ నామమునందు రుచి గలవారు కారు. నేర్పుగల బుద్ధిమంతులు కొందరు. భావుగా పరిశీలించి అనంతరగు భగవానుని యందు భక్తి నిలిపిన వారగుదురు. వారిని దండించుటకు నాకు అధికారము లేదు. వారు దండింపబడుటకు తగినవారు కారు. వారికి పాపం ఉండదు. భగవానుని యొక్క గుణములు నామములు కీర్తించువారు ఏ విధముగా పాపమును అనుభవింప యోగ్యులు కారు.

ఓ దూతలారా, ఈ లోకములో సర్వమును భగవదాత్మకముగా దర్శించుచు అన్నిటియందు సమభావముతో ప్రవర్తించెడి సాధువులు కొందరుందురు. వారు భగవానుని ఉపాయముగా ఉపయముగా స్వీకరించినారు. వారే భగవానుకు శరణాగతులు. వారి కీర్తిని దేవతలు సిద్ధులు కూడా గానము చేయుచుందురు. భగవానుడు కూడా వారి చుట్టూను తిరుగుచు వారిని కాపాడుచుండును. వారికి సంసార భయం ఉండదు. వారిని శిక్షించుటకు మాకు అధికారము లేదు. అట్టి వారి సమీపమునకు మీరు వెళ్ళకుడు. ఎట్టి వారిని మీరు తీసుకుని రావాలనో చెప్పుచున్నాను వినుడు. భగవానుడు అంతట నిండి ఉన్నాడని విశ్వసించి విశ్వమును భగవతాత్మకముగా చూడని వారిని తీసుకుని రండి. భగవత్పాదారవింద మకరందపు రుచికి విముఖులైన వారిని తీసుకుని రండి. భగవంతుని నామమును రూపమును అనుభవించుచు ఆనందింపలేని వారు పాపాత్ములు. వారు సంసారమునందే తృష్ణ కలిగి ఉందురు. అట్టి వారిని తీసుకుని రండి. ఎవరిని తీసుకుని రావాలనో చెప్పుచున్నాను శ్రద్ధగా వినుడు. ఎవరి నాలుక భగవాను యొక్క గుణములను గాని నామమును గాని పలకదో వారిని తీసుకుని రండి. ఎవరి మనస్సు భగవత్పదారవింద స్మరణము చేయదో వారిని తీసుకుని రండి. ఎవరి శిరస్సు ఒక్కసారైనను శ్రీకృష్ణునికి నమస్కరింపదో, ఎవరు శ్రీకృష్ణుని ఆరాధనము చేయరో వారిని తీసుకొని రండి. యముడిట్లు తమ భక్తులకు ఆజ్ఞాపించి. భగవానుని వద్ద క్షమాపణ చెబుచున్నాడు. పురాణ పురుషులగు నారాయణుడు తెలివితక్కువ వారలైన నా భటులు భగవానుని యెడ చేసిన అపరాధమును క్షమించుగాక. నమస్కరించుచున్న మమ్ములను నారాయణుడు మన్నించుగాక. క్షమాగుణం అధికముగా గల స్వామి భక్తులు నమస్కరించినంత మాత్రముననే క్షమించును కదా. ఓ పరీక్షణ మహారాజా, భగవన్నామ సంకీర్తనము జగత్తునకు మంగళప్రదము. ఎంతటి గొప్ప పాపములైనను సమూలముగా నశింపచేయును. నామ సంకీర్తనము కంటే గొప్ప ప్రాయశ్చిత్తము వేరొకటి లేదు. శ్రీహరి లీలలను గుణములను భక్తితో విన్నవారి పలికిన వారి మనసులలో నిర్మలమైన భక్తి ఆవిర్భవించును. ఎన్ని వ్రతములు చేసినను కలగని పరిశుద్ధి భగవన్ నామముచే కలుగును. శ్రీకృష్ణ చరణారవిందము యొక్క రుచిని ఎరింగిన మనస్సు పాపము కలిగించడి ప్రకృతి కార్యములందు ఆసక్తమై ఉండదు. శ్రీకృష్ణ చరణారవింద మకరంద రసమును ఎరుగని మూఢుడు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలను చేసినను అంటని పాపములను తొలగించుకొన చాలడు. ఇట్లు యముడు చెప్పగా యమకింకరులు ఆశ్చర్యపడిరి.

భగవన్ నామ మహిమను వారు తెలుసుకొని భయపడుచుండిరి. ఆశ్చర్యపడుచుండిరి. ఆనాటి నుండి భగవంతుని సేవించడి వారి వైపు చూచుటకు కూడా యమకింకరులు భయపడుచుందురు. ఈ ఇతిహాసము పరమ రహస్యము దీనిని మలయ పర్వతమున ఆసీనుడైన అగస్త్య మహర్షి శ్రీహరిని ఆరాధించి ఎరింగి తన ఆప్తులకు తెలియజేసెను. అని శుకుడు పరీక్షణ మహారాజునకు నామ సంకీర్తన మహాత్యమును వివరించెను. దీనితో అజాముని యొక్క వృత్తాంతం మనకు పూర్తి అవుతుంది. తర్వాత మనము మరొక వృత్తాంతాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to the great Yogi, the surrendered human, who is like the lotus feet of the feet of the Lord. Oh great Yogi, I salute you. I seek refuge in you. In your lotus-like feet, the eternal Please bless me so I may be filled. 11th Canto, 29th Chapter, 48th Prayer. Oh, devotees of the Lord, Srimad Bhagavata Datta Deepika. Welcome to the fourth podcast of the sixth Skandam. The account of Azam is part of the Azamilopakhyanam. We have learned about the conversation between the messengers of Yama and the messengers of Vishnu. Let's see what happens. Thus, the Vishnu's messengers, having properly determined the Bhagavata Dharma, freed Ajamila from the noose of Yama and brought him out. The messengers of Yama went to their king Yama. They reported everything. The Brahmin Yajamani was freed from the noose of Yama and regained his former state. He saw Vishnu's messengers coming in his way. As soon as he saw it, his heart was filled with joy. He bowed his head and greeted them. With them, something He was thinking of talking. Vishnu's messengers then disappeared. He was bound by the Yama's nooses, listened to their conversations, and learned the Dharma of Bhagavata. It was etched in his mind. These actions are all the three Gunas (qualities of nature) that are moving, and are worthy of being practiced by people. He said that Bhagavata Dharma is the remembrance of the name. Until now, he has repented for the sins he has committed. By hearing the greatness of Srihari's name, devotion to God was established.

He is thus brought in question. Oh my god! How much sin have I committed, unable to control my mind! I destroyed my Brahminhood in the company of a Shudra woman. The sin I have committed is a heinous crime. I have destroyed my own lineage. I have caused disgrace. A chaste woman abandoned her young wife and joined a group that consumed alcohol. Parents are old, helpless, without any relatives, and wretched. I have left them without gratitude. I will surely fall into the terrible hell. Those who spoil dharma and act with lust, what hell will they experience. I'm sure we will get to experience it. What is this dream? No, I saw it directly. That's surprising. What happened to the Yama's messengers who were binding me with chains and dragging me? Where did the four accomplished men, the four beautiful ones, go? They released me, who was tied with chains and was going to the underworld. I am unfortunate, but because I have had the darshan of such a great man, I must have done some good deeds. Naa The heart is now pure. I don't know what good deed I have done, so I don't know her name. I have lust for a lowly woman. Why did the name Narayana come to your mouth? I am a liar, a sinner, a shameless man. Thus, my mouth uttered the auspicious name of Narayana. Some merit. Since I have unknown merit, from now on I will control my mind and senses, and spend time chanting the name of God, and I will not be immersed in that darkness again. With body consciousness, desire, and through that desire, action, By that, I have gained this world. Having abandoned this, looking at all beings with friendship, controlling the mind, and being compassionate to all beings, I will become a person with a praised mind. That this body is me, that the body belongs to me, that experiencing it is my joy, having deluded me for so long, having embraced me as this female form, I have become subject to the illusion of the Lord, now praising the name of the Lord and contemplating the virtues of the Lord.

Keeping the mind on the Lord, I will get rid of this illusion. All this time, I have been made a sport. Thus, Vajamiyudu is one who is without sorrow. For a moment, the community that met with the great ones ate up all his bonds. Immediately, leaving behind all relationships such as home, wife, sons, etc., he went to Haridwar, where the Ganges had descended. He sat still in the Ganges gate, turning the senses away from the objects of the senses and fixing the mind on the soul. The soul firmly fixes itself in the divine luminous form of the Lord. Thus, while he was in a state of still meditation, the four men he had seen earlier appeared again. Seeing them, he recognized that they were the ones he had seen, and bowed down to their feet. Immediately, he threw his body into the Ganges. He was possessed by an angel of death. Having boarded the plane with them, he ascended to the place where Sriyapati was. Thus, one who has abandoned all dharmas, the master of the servant, one who has the karma of the condemned, one who has abandoned all vows, in hell He who is falling, once, without thinking of the name of God, utters it and attains salvation. There is no other name greater than the name of the Lord to break the bonds of karma. If one performs Naamasankirtanam, not only will the impurities attached to the mind be removed, but also the desire will not arise again. The story is deeply mysterious. It takes away the sins. Even if you listen to this with attention and sing it, the servants of Yama will not be able to hear. They don't go to hell. Even the most wicked person, by listening to this history, the impurity that has settled in their mind will be removed and they will shine in Vishnu's world. As the son's name, Narayana, while dying, once, without devotion to Narayana, even if called with sonly love, Ajamila attained salvation, didn't he? Is there any doubt in saying that those who have sung the name of the Lord with devotion and faith will break free from bondage and attain liberation? The messengers of Yama, having been thrown away by the messengers of Vishnu, again reached Yama's world and narrated this story to Yama.

Until now, the Yama's command has never been disobeyed by any of the Yama's messengers. Therefore, they have doubts and are asking Lord to hear this from Yama. How many rulers are there who give the appropriate fruits for the deeds they do in this world? Until now, we've only heard that you are one. Whether you do good deeds, bad deeds, or mixed deeds, you are the ones who determine the fruits they should experience, we believe. If there are many rulers who are the judges for the fruits due to the actions of living beings, if there is a contradiction between what one says and what the other says, then death and salvation will be without a fixed system, right? Among them, one Presidents and other deputies will be there. One has more power, one has less power. Like the head of the mandal has more power than the head of the country, is there any other difference? You decide whether what you did is virtuous or sinful, and you decide the punishment. You are the only one, aren't you? But today, four pure men with wonderful forms came. Mi He defied the order. Following your command, as we were bringing a sinner to hell, they stopped us and released our bonds. We want to know who they are. If that secret is something we should know and is appropriate, then we should know it. The sinner uttered Narayana. They came and delivered us from the yoke. Even after the messengers told him, as soon as he heard the sound of Narayana, remembering Srihari's feet, Yama, the one who holds the staff, became pleased and said this to his messengers. There is someone above me who rules these worlds. Not only me, but no one in the world is better than him. This entire universe is his threads, spread out in the cloth like a mat. Like a wide, long, and broad expanse, as if it is stretched out

Everything is spread out on him. This world is born from him, exists from him, his part is the world. Like an ox yoked to a plow, it walks obediently to his command. He's the greatest. He is the one who caused all of existence. He is the one who rules all. He is the one who is pervasive in everything he touches. The Lord, as if tying a strong ox with a rope with his word, is binding and leading with the names of gods, humans, and others with the rituals of Varna Ashrama. All the people are afraid of him and worship him. Among the gods, I am the greatest, Mahendra, Vayu, Surya, Brahma. The gods, Vasus, Sadhyas, and Maruts also act according to his command. Brahma, who can create the entire universe, is not only the remaining Prajapatis and Bhrigu and other great sages, but also the eternal heroes who are always the Sattva-dominated, who never say Rajas and Tamas. His opinion is not to be considered. All of them behaved as if possessed by his evil spirit. No creatures have the senses of that God Whether you do it, whether you do it with your heart, whether you do pranayama. They cannot see whether it is meditation or eloquence. They cannot understand. He is the soul of everyone and resides in everyone. How can one not see the eye that shows the forms that are in front of us? No one can see the Lord, who is the light of all things. He is the one in control of everything. He is independent. He is the emperor who ruled with an iron fist. He is one who is worshipped by everyone. No one could understand his determination. No one can understand his form or nature. He is the one who appoints the unconscious as well as the unmanifest. Such messengers of God, who have a form and nature like that of God, are beautiful and wander in this world. They are Vishnu's servants. Their forms are luminous, they are wonders. They are also worth worshipping, along with Brahma and other gods. They protect the people who are devoted to God from death and from others.

Those who are devoted can be saved, but you may have doubts that Ajamin is a sinner. The Dharma which the Lord has revealed is the Bhagavata Dharma. If it is said that neither the sages, nor the gods, nor the Siddhas, nor the Vidyadharas, nor the Charanas, can understand its secret, then it is unnecessary to say that humans and demons cannot understand it, right? There are very few people who know the Bhagavata Dharma. Among them are Brahma, Shambhu, Narada, Sanatkumara, Kapila, Swayambhuva Manu, Prahlada, Janaka, Bhishma, Bali, Shuka, and the foremost. No one knows the feeling of being a different person than they are. Bhagavata Dharma is known only to those who have the Sattva Guna as their predominant quality. Mysterious and sacred. Those who know this will attain liberation. There is no other means more important than uttering the names of God, having devotion to God. This is the ultimate dharma for attaining supreme happiness. Yama, calling his messengers, is saying this. Do you know the greatness of uttering the name of the Lord? Sinful Ajamirudu was freed from the noose of death by the utterance of the name. Knowingly or unknowingly, we commit many sins. No atonement is adequate to remove him. Singing the praises of God's virtues, God's deeds, and God's name is the means to prevent sins. Ajamila, the sinful, called his son Narayana and attained salvation. Generally, this secret is not recognized by everyone. Even great scholars, unable to make a proper decision due to the desire to deceive God, like flowers that remain as flowers without bearing fruit, propose the Vedas that are beautiful to look at and to hear, but are only in actions They will be attentive. Those who are not fond of the Lord's name. A few bright sparks. Those who observe with devotion and then maintain devotion to the Lord, become devotees. I'm not authorized to punish them. They are not worthy of being punished. They will be free from sin. Those who praise the virtues and names of God are not worthy of experiencing sin in any way.

Oh, messengers, in this world, seeing everything as divine, there are some saints who act with equanimity in all things. They accepted the Lord's intercession. They are the ones who surrender to the Lord. Even the gods and siddhas sing their praises. The Lord also walks around them and protects them. They will not be afraid of life. We are not authorized to punish them. Do not go near them. I am telling you what kind of people you should bring. Listen. Bring those who do not believe that God is filled in the universe. Bring those who are averse to the taste of nectar, O lotus-footed one. Those who do not experience and rejoice in the name and form of God are sinners. They are always thirsty for worldly affairs. Bring those men over here to us. I am telling you who to bring, listen carefully. Bring those whose tongues do not utter the virtues or names of God. Whose mind Bring those who do not remember the Lord's name. Bring those who have not bowed to Sri Krishna even once, those who do not worship Sri Krishna. Yama, the god of misfortune, commands his devotees. He is asking for forgiveness from God. Oh Narayana, the ancient man, may the offenses committed by my soldiers, who are foolish, towards the Lord, be forgiven. May Narayana forgive us for our greetings. The devotees of the Lord, who have great forgiveness, forgive only as much as they are saluted, isn't it? Oh, testing Maharaja, the chanting of the Lord's name is auspicious for the world. It completely destroys even the greatest sins. There is no greater penance than chanting the name of God. Those who listen to the pastimes and virtues of Srihari with devotion, pure devotion will manifest in their minds. No matter how many vows are performed, the purity that is not attained will be obtained through the name of the Lord. The mind that has tasted the feet of Sri Krishna will not cause sin, will not be attached to the works of nature. The nectar of Sri Krishna's lotus feet Even if a fool who knows nothing performs many expiatory rites, he cannot remove the sins that he does not know. Thus, when Yama spoke, the Yama's servants were astonished.

They were afraid to know the glory of the Lord's name. They were astonished. From that day on, even the servants of God were afraid to look at them. This history is a great secret. Agastya Maharshi, who was seated on the Malaya mountain, worshiped Srihari and revealed it to his disciples. Thus, Shuka explained the greatness of the name-chanting to King Parikshit. With this, the account of Azamuni is completed for us. Next, let's learn another story. Jai Srimannarayana. Salutations to the Gurus