మృత పుత్రుని ప్రాణ ప్రతిష్ఠ - చిత్రకేతుని వైరాగ్య హృదయము
Narada Revives Dead Child & Citraketu's Enlightenment
శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, మహర్షి నారదుడు చిత్రకేతు మహారాజు యొక్క మృత పుత్రుని తిరిగి జీవింపజేసి, శోకతప్త రాజు కళ్ళముందు ఆ జీవాత్మను ప్రత్యక్షపరుస్తాడు. పునర్జీవితుడైన పుత్రుడు ఆత్మ యొక్క నిత్యత్వమును, జన్మ జన్మల బంధాల మాయను గురించి లోతైన జ్ఞానబోధ చేస్తాడు. ఈ దివ్యజ్ఞానముతో చిత్రకేతుని హృదయం వైరాగ్యంతో నిండిపోగా, నారదుడు అతనికి దీక్ష ఇచ్చి భగవద్భక్తి మార్గంలో నడిపిస్తాడు.
In this profound episode from Canto 6 of Srimad Bhagavatham, the great sage Narada Muni performs a miraculous act of compassion by reviving the dead son of King Citraketu, bringing the grieving royal family before the departed soul. The revived child delivers a powerful discourse on the eternal nature of the soul, revealing that attachments to parents, relatives, and the body are mere illusions of repeated births. Moved by this divine wisdom, King Citraketu turns away from worldly sorrow and receives sacred initiation from Narada, beginning his journey toward true spiritual enlightenment and devotion to Lord Vishnu.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవ స్థాన నిరోధ లీలయా గృహీత శక్తి త్రితయాయ దేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే అనంత మహిమాన్వితుడు జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుటనే లీల కొరకై క్రమముగా రజస్సు, సత్వము, తమస్సు అనే మాయాశక్తి గుణములను ఉపాధిగా స్వీకరించువాడు. సకల ప్రాణుల యందు అంతర్యామియై ఉండువాడు, ఇంద్రియములకు గోచరము గాని స్వరూపము గలవాడు, ప్రకృతికి అతీతమైన చేతన స్వరూపుడగు ఆ శ్రీహరికి నమస్కారము. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 12th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము 18వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రుత్రాసుర వధ చిత్రకేతు ఉపాఖ్యానంలో చిత్రకేతువు నారదుడికి నారు ఉపదేశం చేయటము, ఉపదేశం తరువాత తనకు వచ్చినటువంటి అపారమైన శక్తితో తను పాతాళం కంటే కింద ఉన్నటువంటి లోకంలో వెళ్లి సంకర్షుని ప్రార్థించడము, సంకర్షుని ప్రార్థన చేసిన తరువాత ఆ సంకర్షుడు తనకి ఏమి ఉపదేశం చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రకేతు ఇటు స్తోత్రము చేయగా విద్యాధర పతియగు చిత్రకేతువుతో అనంతుడు ఇటు చెబుచున్నాడు. నారదుడు, అంగీరసుడు, నీకు ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు అనే మూడింటి యొక్క స్పష్టమైన జ్ఞానమును నా సంకల్పము చేతనే ఉపదేశించినారు. దానిచే నీవు సిద్ధినందితివి. ఆ మంత్ర విద్యచే నన్ను దర్శింపగలిగితివి. లోకములోని అన్ని భూతములలోనూ నేను ఆత్మగా ఉందును. కావున వారికి నాకు భేదము లేదు. శరీరము చేయ కలిగే భేదములు నాకు అడ్డవు. నేను శబ్ద రూపముగాను అర్ధ రూపముగాను కూడి ఉందును. శబ్ద రూపముగా ఉన్న నన్ను శబ్ద బ్రహ్మనియు అర్ధ రూపముగా ఉన్న నన్ను పరబ్రహ్మనియు అందురు.
ఇవి రెండును నా శాశ్వతమైన శరీరములు. లోకములో మనకు కనపడుచున్న అచేతన ప్రపంచమునందు దానిలో వ్యాపించి ధరించు ప్రత్యగాత్మ యందును పరమాత్మనుగు నేను వ్యాపించి ఉందును. చేతన చేతనములు రెండును నాచే ధరింపబడునవే. గాఢ నిద్రను పొంది స్వప్నమును కనుచున్న పురుషుడు స్వప్నావస్థలో తాను ఒక్కడే ఒకచోట పడి ఉండి ఉన్నట్లే తెలుసుకొనుచుండును. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, శరీరముతో జీవునకు కలిగేడి అవస్థలే గానీ ఆత్మ స్వరూపమునకు చెందినవి కావు. అవి అన్నియు భగవత్ సంకల్పముచే ప్రకృతి వికారములుగా భగవంతునిచే సృష్టింపబడినవి. ఆ స్వప్నమును చూచువాడు పురుషుడు అనగా ఆత్మ. పరమాత్మ చేతనే జీవుడు స్వప్నావస్థను సుషుప్తవస్థను కూడా పొందును. సుషుప్తిలో అతడు ఆత్మ సుఖమును అనుభవించును. పరమాత్మ సుషుప్తినందిన జీవునకు ఆధారమైనవాడు సుషుప్తికి కారణం అయినవాడు సుషుప్తిలో అనుభవించడు సుఖమునకు కారణమగువాడు. అహం అనగా నేను అనడి ఆత్మ అన్ని వస్తువులలోనూ అనువర్తించి ఉండును. అది సుఖరూపము. దానికి సత్తరజస్తమో గుణములు లేవు. కలలు కనినప్పుడు మేల్కొనినప్పుడు తనను కూర్చిన జ్ఞానము సాగుచునే ఉండును. మేల్కొని మేల్కొని ఇప్పుడు తరువాత కూడా ఆ జ్ఞానము సాగుచునే ఉండును. అన్ని అవస్థలలో జీవ స్వరూపమును నియమించు పరమాత్మ జీవునితో అంతరాత్మగా అనువర్తించి ఉండును. జీవాత్మ బ్రహ్మ శరీరమై బ్రహ్మాధీనమైన సత్త గలదై స్థితి గలదై ప్రవృత్తి గలదై ఉండును. జీవుడు తనకు ఆత్మనగు నన్ను మరి మరచి నేను ఆత్మగా ఉండుట చేతనే తాను ఉన్నానని గుర్తింపక పరమాత్మ కంటే తాను వేరని భావించుటచే సంసారము కలుచుచున్నది. ఒక దేహము నుండి మరియొక దేహమును చేరుచున్నాడు. జీవుడు శాస్త్రములలో కలిగే జ్ఞానమును పొందుటకు మనుష్య జన్మను పొంది కూడా తనను గూర్చియు తనకు ఆత్మగానున్న పరమాత్మను గూర్చియు ఎరుంగక క్షేమమును పొందడు. మనుష్యులుగా జన్మించి కూడా కొందరు జ్ఞానమును అందజాలరు. విషయ సుఖములను అనుభవించు వ్యాపారములనే చేయుచుందురు. దానిచే శరీర ఆయాసమును పొందుదురు. సుఖము కొరకై చేసే ప్రయత్నములచే ఒకప్పుడు దుఃఖమును పొందుదురు. వీటినన్నిటినీ స్మరించి అమృతత్వమును పొందవలెనని స్వాత్మ పరమాత్మ.
యాధాత్మ్యమును ఎరింగి కర్మాచరణము నుండి విరమింపవలెను. అట్లు వైరాగ్యము కలిగిన నాడే జ్ఞాన విజ్ఞానములు స్థిరముగా నిలుచును. భార్యాభర్తలు సుఖము పొందవలెనని దుఃఖము పోవలెనని ఎన్నో వ్యాపారములు చేయుచుందురు. కానీ వాని వలెన దుఃఖము తొలగుట గాని సుఖము లభించుట కానీ జరగలేదు. విజ్ఞానము గలవారు తమ ప్రయత్నములచే సుఖము లభింపకుండుట, దుఃఖమును పొందుట ఎరింగి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు. ఆవలిదైన ప్రత్యగాత్మ స్వరూపమును బ్రహ్మాత్మకముగా ఎరుంగ చాలుదురు. యోగమందు నైపుణ్యము గల బుద్ధి గల మనుజులు తాను ఎరుంగవలెనని ప్రయత్నించవలసినది ఇదియే. ఇదియే స్వార్థము. పరమాత్మ తనలో ఆత్మగా ఉన్నాడనియు తాను అతనికి శరీరముగా చేరియే ఉన్నాననియు పరమాత్మను ఆత్మగా తన్ను శరీరముగా ఇద్దరూ కలిసి ఒకటిగానే ఎల్లప్పుడూ ఉండురు అనియు ఎరుంగుటయే స్వార్థము. రాజా, నేను చెప్పుచున్న ఈ విషయము నీవు శ్రద్ధతో విని దీని విషయమున పరాగు చెందని వాడే ఉండుము. దీనిచే జ్ఞాన సంపన్నుడవై వేగముగా ముక్తినందెవు. ఈ విధంగా భగవానుడగు హరి చిత్రకేతువునకు జ్ఞానోపదేశము చేసి అతనిని కుదుటపరచి అతడు చూచుండగా అంతర్ధానమాయెను. ఈ విధంగా అనంతుడు ఉపదేశించి వెలగిన తర్వాత అతడు ఏ దిక్కుకే గనో ఆ దిక్కునకు అభిముఖుడై చిత్రకేతువు నమస్కరించెను. విద్యాధరుడగుటచే ఆకాశమున సంచరించుచుండెను. మహాయోగి అని చిత్రకేతువు చాలా కాలం మునులచే సిద్ధులచే స్తోత్రము చేయబడుచు నానా విధములగు సిద్ధులను పొంది మేరు పర్వతపు లోయలలో విద్యాధర స్త్రీలచే భవద్గుణగానము చేయించుచు ఆనందించుచుండెను. అతనికి విష్ణువు ఒక విమానమును సంగెను. ఆ విమానం ప్రకాశించుచుండెను. దానిపై సంచరించుచు సిద్దులచే చార్ణులచే పరివేష్టింపబడి ఉన్న శివుని దర్శించెను. అతడు పార్వతిని తన తొడపై కూర్చుండబెట్టుకొని ఒక చేతిలో ఆలింగనము.
చేసుకొని మునులందరూ నిండి ఉన్న సభలో కూర్చోండి ఉండెను. చిత్రకేతువు ఆ సన్నివేశమును చూచి పార్వతి వినుచుండగా గట్టిగా నవ్వెను. చిత్రకేతువు గట్టిగా ఇట్లనెను పరమశివుడు లోకమునకు గురువు. శరీరధారులందరూ ఇతను ధర్మోపదేష్ట మునులు మధ్య సభలో భార్యతో కలిసి కూర్చునినాడు. ఇతని సభలో ఉన్నవారందరూ బ్రహ్మవాదులు. తీవ్రమగు తపస్సు ఇతడు చేయుచుండును. జటలు దాల్చి ఉండును. ఇట్టి వేషముతో మునుల మధ్య సిగ్గులేని వాడై ప్రాకృత పురుషుని వలె స్త్రీని తొడపై కూర్చుండబెట్టుకొని కౌగలించుకొని కూర్చునినాడు. పామరు లేని జనులు కూడా స్త్రీని రహస్యముగా కౌగలించుకొందురు. తొడపై కూర్చుండ పెట్టుకొందురు గాని అందరూ చూచుండగా అట్టి పని చేయరు. ఈ మహావ్రత ధరుడు స్త్రీని పట్టుకొని సభలో కూర్చుండినాడు అని నవ్వెను. భగవానుడు ఒక పరమశివుడు కూడా అగాధముకు జ్ఞానము గలవాడవుటచే అతని మాటలను విని నవ్వి ఊరుకొండెను. ఆ రుద్రుని అనుచరులు కూడా ఏమియు మాట్లాడకుండా ఊరకుండిరి. శివుని యొక్క ప్రభావం ఎరంగని వాడు ఏదో అనినాడు అని పట్టించుకొనలేదు. కానీ అంబిక తాను జితేంద్రుడనని చిత్రకేతు అహంకరించి అట్లు మాట్లాడుచున్నాడని అతనిపై కోపగించి ఇట్లు పలికెను. ఏమి ఈతడు ఈ లోకమునకు దండధారుడా, శాసకుడా, సిగ్గులేని వంటి మా వంటి దుష్టులను శాసించి దిద్దుబాటు చేయువాడా? ఇంతవరకు దేవతలందరును చూచియు తప్పుగా భావించని ఈ విషయము వీనికే తోచినది. ధర్మము ఉల్లంఘించినాడని హరుని ఎవ్వరును ఇంతవరకు ఆక్షేపింపలేదు. తామర పువ్వులో పుట్టిన బ్రహ్మకు ధర్మము తెలియదా? బ్రహ్మపుత్రులగు భృగువునకు నారదునకు తెలియదా? సనత్కుమారుడు, కపిలుడు, మనువు మొదలగు వారు ధర్మమును ఎరుంగరా? ఎవ్వరును ఆక్షేపించలేదు. బ్రహ్మాదులు అందరి చేతను ధ్యానింపదగిన పాదములు కల వాడు పరమశివుడు. అతడు జగద్గురువు. మంగళములకు మంగళము అయినవాడు. ఒక క్షత్రియాధముడైన ఈతడు పెద్దలగు అందరినీ జ్ఞానులందరినీ ధూర్తుడై శాసించుచున్నాడు. ఈతడు భగవత్పాద మూలమును సేవించుటకు తగడు. తానే గొప్పవాడని భావించువాడు పొగరుమోతు ఈ దుర్మతి పాపజాతికి చెందిన అసుర యోనిలో జన్మించు గాక పెద్దలెవరికీ ఇట్టి అపరాధము చేయకుండు గాక అని చిత్రకేతువును శపించెను.
చిత్రకేతువు పార్వతి శపించునట్లు విని విమానము నుండి దిగి తలవంచి నమస్కరించి ఆమెను అనుగ్రహింప చేసుకునుటకు ఇట్లు పలికెను. అమ్మా నీవు వసంగిన శాపమును నేను దోసిలి పట్టి స్వీకరించు. చూంచుచున్నాను. దేవతలు మనుష్యులను కూర్చి శాపమును గాని అనుగ్రహమును గాని ఏది పలికినను అది అంతయు వారి వారి ప్రాచీన కర్మానుగుణముగా వచ్చినది. జన్మించిన ప్రతి ప్రాణియు అజ్ఞానము చే మోహమునంది ఈ సంసార చక్రములో భ్రమించుచు ఎల్లప్పుడూ అంతటా సుఖమును దుఃఖమును అనుభవించుచుండును. మానవునకు సుఖదుఃఖములు కలుగుటకు ఒకడు కర్తగాడు. తానును కర్తగాడు. తన వలన వచ్చినది, ఇతరుల వలన వచ్చినది అని జ్ఞానము లేకపోవుట వలన అనుకొనుచుండును. ఈ ప్రకృతి మండలము సత్తరజస్తమో గుణముల యొక్క ప్రవాహ రూపమైనది. ఇందు శాపము ఏమి, అనుగ్రహమేమి, స్వర్గమేమి, నరకమేమి, సుఖమేమి, దుఃఖమేమి అన్నియు ఆయా గుణముల ప్రభావముచే మారి మారి వచ్చుచుండును. భగవానుడు తన సంకల్పముచే తన అధీనమందున్న ప్రకృతిచే భూతములను సృజించును. అతడే జీవులకు బంధమును, మోక్షమును, సుఖమును, దుఃఖమును కర్మానుసారముగా సృజించుచుండును. అతడు ఏ మాత్రము ఏ దోషము అంటని వాడై వైషమ్యము పక్షపాతము లేని వాడే ఉండును. అతనికి ఒకడు ప్రీతిపాత్రుడు ఒకడు శత్రువు లేడు. అందరూ సమానమే. తన జ్ఞాతి వారు బంధువులు ఎవ్వరూ లేరు. తనవాడు పైవాడు లేడు. అందరి యెడ అతడు సముడు. రాగద్వేషములు అంటనివాడు. సుఖము పొందవలెనని కోరిక లేనివాడు అట్టివానికి రోషమెట్లు కలుగును అట్టివాడైనను జీవుల కర్మల యొక్క శక్తిని అనుసరించి సుఖము దుఃఖము మోక్షము కలుగునట్లు అతడు సంకల్పించుచుండును కావున అమ్మ శాపము తొలగింపమని నిన్ను నేను ప్రార్థింపను. అది నా ప్రాచీన కర్మఫలం అనుభవింతును. కానీ నీ మహిమ నిరంగక చెడ్డ మాటలను పలికితిని. వానిని క్షమింపుము అని నిన్ను ప్రార్థించుచున్నాను.
ఇట్లు చిత్రకేతువు క్షమింపుడు అని పలికిన తన విమానముతో వారిద్దరూ ఆశ్చర్యముగా చూచుండగా వెడలిపోయెను. తరువాత భగవానుడు వృద్ధుడు పార్వతితో దేవతలు, ఋషులు, దైత్యులు, సిద్ధులు వినుచుండగా ఇట్లు పలికెను. పార్వతి, శ్రీహరి ఆశ్చర్యకరమగు శక్తి గలవాడు. అతని భృత్యులు, వారి భృత్యులు కూడా మహాత్ములు. వారికి దేనిపైనను కోరిక ఉండదు. సూచితివి కదా? శ్రీహరి భక్తుల గొప్పదనము నారాయణుడే సర్వస్వమని సర్వత్రా నారాయణునే దర్శించు వారలు దేనివలన భయపడరు. ఆత్మలకు ఈశ్వరు నీలచే దేహ సంబంధము కలుగును. దేహ సంబంధముచే కలుగునవే దేవుడు మనుష్యుడు అను భేదములు. ఆ భేదములు దేహమునకే గానీ ఆత్మకు లేదు. అవివేకముచే ఆత్మయందు ఉన్నట్లు భావింతురు. సుఖము, దుఃఖము అవివేకముచే వారి వలన వీరి వలన కలిగినవి అనుకొందురు. కానీ అవి వారి కర్మల ఫలితములే. నారాయణ పరాయణులకు ఇట్టి వివేకం ఉండును. వాసుదేవుని యందు భక్తి గల నరులకు జ్ఞానము, వైరాగ్యము, బలము వాసుదేవుని లభించును. బ్రహ్మ గాని సనుత్కుమార నారదులు గాని. బ్రహ్మపుత్రలగు మునులు గాని నేను గాని ఆ నారాయణుని యొక్క చేష్టితమును స్వరూపమును ఎరుంగజాలిన వారము కాము. మాకు అందరికీ అల్పాప్మైన జ్ఞానమే కలదు. అంత మాత్రము చేతనే స్వతంత్రమని అహంకరించుచుందుము. నారాయణునకు ప్రియుడు అప్పయుడు లేడు. తనవాడు పైవాడు లేడు. అతడు సకల భూతములకు ఆత్మగా ఉండువాడు. మనము శరీరములో ఉండు అవయయములను ఏకరూపముగా ప్రేమించునట్లు శ్రీహరి సర్వభూతములను ప్రేమించును. మహానుభావులకు చిత్రకేతువు నారాయణునకు ప్రియమైన భక్తుడు. అంతటా సమదర్శనము చేసినవాడు. ఇంద్రియముల ఆవేశము లేనివాడు. అతడు అచ్యుతునకు ప్రియుడు. నేను కూడా ఆ అచ్యుతుని భక్తుడని అందుచే అతను నీ శాపమును స్వీకరించి కలత చెందకుండుటకు. ఆశ్చర్యపడనవసరము లేదు. మహాత్ములు, మహాపురుషుడగు వాసుదేవుని భక్తులు ఇట్లే శాంతులై సమదర్శులై ఉందురు. శివుడు చెప్పిన మాటల వలన నారాయణ భక్తులు మహత్వమును పార్వతి విని మనసులోని ఆవేశము తగ్గి ఆశ్చర్యము తగిలినదై ఉండెను. భాగవతులకు చిత్రకేతువు పార్వతి యొక్క శాపమునకు ఇయ్యగలవాడే.
కానీ అతడు శాపమును తలవగ్గి స్వీకరించెను. ఇది సాధువుల లక్షణం. ఒకడు చేసిన అపకారమునకు ప్రతీకారము చేయుట అవివేకుల లక్షణం. మహా భక్తులు అట్లు చేయరు. ఆ చిత్రకేతువే స్వష్ట యొక్క సంకల్పం వలన దక్షిణాగ్ని యందు దానవ జాతిలో జన్మించినాడు. అతడే మృత్రుడు. జ్ఞానముచే పరిపూర్ణుడు. అతడు అసుర జాతిలో జన్మించుటకు కారణము నీకు తెలిపితిని. ఈ చిత్రకేతోపాఖ్యానం పుణ్యమైనది. విష్ణు భక్తుల యొక్క మహాత్మ్యమును వినుటచే సంసార బంధము వీడును. ఉదయమున లేచి శ్రద్ధతో శ్రీహరిని పూజించి స్మరించి. ఎవరి ఇతిహాసమును పఠింతురో వారు పరమగతిని పొందుదురు. శ్రవణముచే, పఠనముచే పరిపూర్ణమగు భక్తులు భక్తి కలుగును. ఇంతటితో చిత్రకీర్తోపాఖ్యానము ముగిసింది. ఎందుకు వృత్తరాసురుడికి ఈ రకమైనటువంటి జ్ఞానము, భక్తి ఉన్నది అని చెప్పేసి అని. అడిగినప్పుడు దానికి కారణంగా ఈ చిత్రకేతు ఉపాఖ్యానాన్ని తెలిపారు అంటే ఆ ఈ చిత్రకేతువే అప్పుడు పుట్టినటువంటి మృతుడు అన్నమాట. తర్వాత విషయాన్ని మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations, salutations to the Supreme Being. May the power that is obtained by the destruction of the place of creation, the destruction of the place of existence, and the destruction of the inner being of the beings, be infinite. He is the one who created, protected, and withdrew the universe For the sake of Leela, gradually, the Rajas, One who accepts the qualities of the illusionary powers called Sattva and Tamas. Salutations to that Srihari, who is the indwelling being in all beings, who has a form that is not visible to the senses, who is the conscious form beyond nature. Second Canto Fourth Chapter 12th Prayer. Devotees of God, welcome to the 18th podcast of Srimad Bhagavata Tatva Deepika, the sixth book. Until now, in the story of Rutrarasura's slaying, in the story of Chitraketu, Chitraketu advising Narada, and after the advice, with the immense power he received, he went to the world below the netherworld and prayed to Sankarshana, After praying to Sankarshana, let us now learn what Sankarshana is preaching to him. Chitraketu praised him, Vidyadhara Anantudu is saying this to Patiyaagu Chitrakethu. Narada, Angirasa, to you, nature, man, God, these three have been clearly taught by my will. You have attained Siddhi by that. By the power of magic, you were able to see me. I am the spirit in all of the elements of the world. Therefore, there is no difference between them and me. The differences that the body makes are not for me. I exist as both sound and meaning. They call me, who is in the form of sound, the sound Brahman, and they call me, who is in the form of meaning, the Supreme Brahman.
These two are my eternal bodies. In the unconscious world that we see in the world, in that, pervading and wearing, in the self, in the supreme self, I am pervading. Consciousness and consciousness are both made by me. The man who has fallen into a deep sleep and is dreaming, in the dream state, feels as if he is alone, lying in one place. The state of being watchful, the state of being in a dream, the states that occur to the living being with the body, are not belonging to the form of the soul. They are all created by God as natural distortions of the Divine Will. The one who sees the dream is the man, that is, the soul. The soul attains the state of dream and also the state of deep sleep only through the Supreme Soul. In deep sleep, he experiences the pleasure of the soul. The Supreme Being is the basis for the sleeping being, the cause of sleep, does not experience sleep, the cause of happiness. Aham means I, the self, is present in all things. It's a happy form. It does not have the qualities of Saturn. When dreams appear, when awakened, what made him sit Knowledge keeps on growing. Wake up, wake up. Even after this, that knowledge will continue. In all circumstances, the supreme soul, who regulates the form of life, is united with the individual soul as an inner soul. The soul, being the body of Brahma, having the power of being subordinate to Brahma, being in a state, being in a tendency, exists. The living being, forgetting that I am the soul, and because of being the soul, without realizing that he exists, considering himself different from the Supreme Soul, is getting entangled in worldly affairs. He ascends from one to another. A living being, even after attaining human birth, does not attain well-being without understanding about himself and the Supreme Soul who is his soul, to acquire the knowledge gained in the scriptures. Some people are born with knowledge and some are not. They do business by experiencing worldly pleasures. By that, I mean that they get tired of the body. They once suffered sorrow due to the efforts made for happiness. Remembering all of these, one should attain immortality, says the self, the supreme self.
The yadhathamyamu should be abandoned from karma-charanam. Thus, only when there is detachment, knowledge and wisdom will remain firm. Husbands and wives do many things to find happiness and to get rid of sorrow. But, like him, neither sorrow nor happiness happened. Those who have knowledge, not being able to attain happiness through their efforts, and attaining sorrow, be careful of these states of sleep, dream, and deep sleep. It is enough to understand the other self-existent form as Brahman. Those who are skilled in yoga and have intelligence should try to understand this. This is selfishness. It is selfish to know that the Supreme Being is in Himself as the soul, and that He has become His body, and that the Supreme Being is the soul and His body, and that they both are always together as one. King, listen carefully to what I am saying, and be the one who does not delude himself about this matter. By this, having become enriched with knowledge, you will quickly attain liberation. In this way, Hari, the Lord, gave enlightenment to Chitraketu and He disappeared as soon as he was defeated. In this way, after Anantudu preached and appeared, he turned towards whichever direction he was going and bowed to Chitraketu. Being a teacher, he was wandering in the sky. The great Yogi, Chitraketu, was praised by sages and siddhas for a long time, attained various kinds of siddhis, and was enjoying himself by having Vidyadhara women sing Bhavaguna songs in the valleys of Meru mountain. Vishnu gave him a Vimana. The plane lit up. He saw Shiva, who was surrounded by Siddhas and Charanas, moving on it. He made Parvati sit on his lap and embraced her with one hand.
Having done that, all the sages sat in the assembly. Chitraketu, seeing that scene, laughed loudly as Parvati was listening. Chitraketu said firmly, "Parama Shiva is the guru of the world." All the members of the assembly, including the learned men, sat together with their wives. All those present in his court were believers in Brahman. He is doing severe penance. The matted hair is tied up. With such a disguise, shameless among the sages, like a natural man, he made a woman sit on his lap, embraced her, and sat down. Even the uninitiated will secretly embrace a woman. They may sit on their thighs, but they won't do such a thing while everyone is watching. He laughed, saying that the man who was observing the great vow was sitting in the assembly holding a woman. The Lord, a supreme Shiva, also, being knowledgeable about the abyss, listened to his words, laughed, and remained silent. Rudra's followers also remained silent without saying anything. He did not care what Shiva's influence was. But Ambika, she is Jitendra Chitraketu, arrogantly, spoke as he was speaking, and got angry with him and said this. What is this? Is this the punisher, the ruler, the one without shame, who punishes and corrects the wicked like us? Until now, all the gods have seen and not considered it wrong, this matter occurred to him. No one has ever objected to Haruni for violating dharma. Does Brahma, born in a lotus flower, not know dharma? Doesn't Brahma's son, Bhrigu, and Narada know? Sanatkumarudu, Kapiludu, Manu, etc., did they not understand dharma? No one's objectionable. The supreme Shiva is the one who has feet that can be meditated upon by all the Brahmins. He is a jagadguru. The one who is auspicious of auspicious things. This Kshatriya-like swimmer is ruling the elders and all the wise men, being cunning. This man is not fit to serve the lotus feet of the Lord. May he who considers himself great be born in the sinful womb of this wicked, vile, and sinful race, may he not commit such a crime against the elders, thus he cursed Chitraketu.
Hearing that Parvati was cursing Chitraketu, he got down from the plane, bowed his head, and spoke thus to seek her blessings. Mother, I will accept the curse that you have cast upon me. I am watching. Whatever the gods say, whether it is a curse or a blessing, it all comes according to their ancient karma. Every living being, due to ignorance and delusion, wanders in this cycle of life, always experiencing happiness and sorrow everywhere. For a human to experience happiness and sorrow, one person is the doer. He is the doer. He thinks that what came from him, what came from others, is because of lack of knowledge. This nature is a flow of the qualities of Sattvajasthamo. What is this curse, what is this blessing, what is heaven, what is hell, what is happiness, what is sorrow, all are changing due to the influence of those qualities. The Lord creates beings through His own will, through His own power, through His own dominion. He is the one who binds the beings, grants liberation, happiness, and sorrow according to karma He creates. He is without any fault, without any discrimination or partiality. He has one friend, and he has no enemies. Everyone is equal. He has no relatives or close friends. He has no master. He is equal to everyone. One who cannot be angry. He who has no desire to attain happiness, how can such a person have anger? Even if he is such, following the power of the actions of living beings, he will desire that happiness, sorrow, and liberation may occur. Therefore, I am telling you to remove the curse, mother I will pray. "I will experience the consequences of my past actions. But I spoke badly of your glory. I pray that you forgive him.
Thus, saying, "Kshamimuduu," Chitraketu, with his plane, as they both looked in amazement, disappeared. Then the Lord, the old man, said this while listening to Parvati, the gods, the sages, the demons, and the siddhas. Parvati, Sri Hari is a man of wondrous powers. His servants, his servants are also great men. They do not have a desire for anything. You mentioned it, didn't you? The greatness of Srihari's devotees is that Narayana is everything, and those who see Narayana everywhere are not afraid of anything. For the souls, the connection with the body is made by the color of God. The differences between God and man are those that arise from bodily relationships. Those differences are only between the body and the soul. They think they are in the Spirit because they are unintelligent. They think that happiness, sorrow, and foolishness are caused by them and by these people. But they are the product of their own misdeeds. Those who are devoted to Narayana have such wisdom. To those who have devotion to Vasudeva, knowledge, detachment, and strength will be obtained by Vasudeva. Brahma or Sanutkumara or Narada. Whether they are Brahma Purushas or I, that Narayana's We are not those who cannot understand the nature of action and its form. All of us are having a superficial knowledge. With that much alone, we pride ourselves as independent. Narayana has no beloved. He doesn"t have a father. He is the one who is the soul of all beings. Just as we love the organs in our body equally, Srihari loves all beings. Chitraketu is a favorite devotee of Lord Narayana, the Supreme Being. The one who showed equanimity. One who is free from the emotions of the senses. He is a lover of Achyuta. I am also a devotee of that Achyuta, therefore, he accepted your curse and did not be disturbed. No surprise. The great souls, the devotees of Vasudeva, the great man, are thus peaceful and equanimous. Because of the words spoken by Shiva, Parvati, hearing the greatness of Narayana's devotees, her inner emotion subsided and she felt surprised. The Chitraketu of Bhagavatam is the one who can give Parvati's curse.
But he accepted the curse reluctantly. It is the hallmark of a saint. Revenge for a wrong done to oneself is a sign of a fool. Great devotees are not like that. That Chitraketu was born in the southern fire by the will of the self, in the demon race. He is a dead man. The perfect man of wisdom. I have told you the reason for his birth into the demon race. This film's story is sacred. By listening to the greatness of Vishnu devotees, worldly bonds are broken. Waking up in the morning, worshiping and remembering Srihari with devotion. Those who recite the history of others will attain the supreme state. Devotees who are perfected by hearing and reading will have devotion. The film's story ends here. Why does Vrittarasu have this kind of knowledge and devotion, he asked. When asked, they explained the reason for that, this Chitraketu legend. That means, this Chitraketu was the dead one who was born then. We'll learn more about it in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus