చిత్రకేతు మహారాజు ఉపాఖ్యానము (Parts 17-20)

The History of King Citraketu (Parts 17-20)

bhagavatam

చిత్రకేతు మహారాజు ఉపాఖ్యానపు ఈ చివరి భాగాలలో, నారద మహర్షి మరియు అంగిరా ఋషి అనుగ్రహంతో శోకసంతప్తుడైన రాజు శ్రీ సంకర్షణ భగవానుని పరమ భక్తుడిగా ఎలా మారాడో అనే దివ్యమైన కథను వింటాము. చిత్రకేతు మహారాజు భగవద్దర్శనం పొంది అర్పించిన స్తోత్రాలు భక్తి మార్గపు సర్వోన్నత మహిమను ప్రకటిస్తాయి. తదనంతరం, చిత్రకేతుడు అహంకారవశుడై శివపార్వతులను అగౌరవంగా సంభోదించిన సందర్భం మరియు పార్వతీదేవి అతనికి శాపం ఇచ్చిన ఘట్టం ఒక నిజమైన వైష్ణవుని సమభావాన్ని అద్భుతంగా చాటిచెప్తాయి.

In these concluding parts of the glorious history of King Citraketu, we witness the profound transformation of a grief-stricken king into an exalted devotee of Lord Saṅkarṣaṇa through the grace of Nārada Muni and Aṅgirā Ṛṣi. King Citraketu receives the divine vision of the Lord and offers magnificent prayers, revealing the supreme glory of bhakti as the highest path to liberation. We also witness the remarkable encounter where Citraketu, in his pride, speaks irreverently to Lord Śiva, and the gracious response of both Śiva and Pārvatī that illustrates the equanimity of a true Vaiṣṇava.

← Prev Next →
The History of King Citraketu (Parts 17-20) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నతాస్మతే నాథ సదాంగ్రి పంకజం విరించి వైరించ సురేంద్ర వందితం పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం నయత్ర కాలః ప్రభవేత్ పరప్రభుహు ఓ ప్రభు, బ్రహ్మాదులను కూడా కబళించి వేసే కాలము యొక్క నీడ అయినను నీపై పడదు. నీ పాద పద్మమును బ్రహ్మ సనకాదులు ఇంద్రుడు నమస్కరించెదరు. ఈ లోకములో క్షేమమును గోరు వారికి. సర్వోత్కృష్టమగు ఆశ్రయమైన నీ పాదపద్మమును మేము నమస్కరించుచున్నాము. ఫస్ట్ క్యాంటో 11th చాప్టర్ సిక్స్త్ ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము 17వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రుద్రాసన వృద్ధ పూర్తి చేసుకొని చిత్రకేతు ఉపాఖ్యానములో చిత్రకేతువు తన యొక్క సంతానం వియోగం కలిగిన తర్వాత నారదుడు తనకి ఆ ఆత్మను దర్శింపచేసి అడిగినప్పుడు ఆ పిల్లవాడు చెప్పినటువంటి విషయాన్ని తను అర్థం చేసుకుని జ్ఞానోదయమై తిరిగి మళ్ళీ తనొక మంత్రోపదేశాన్ని కోసమని సిద్ధమవుతాడు. నారదుడు తనకు బోధిస్తున్నాడు. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపముగా ఉన్న భగవానును ధ్యానించుచున్నాము. వానికి నమస్కారము. అతడు జ్ఞానము, ఆనందము, స్వరూపముగా గలవాడు. మరొక దాని అధీనము లేకుండా తనంత తాను ప్రకాశించువాడు. అంతయు తనకు అనుకూలమనే బుద్ధి గలవాడు. వేరొక సుఖమునందు అపేక్ష లేకపోవుటచే తనంత తానే ఆనందించువాడు. రాగద్వేషాదులు లేనివాడు, శరీరముల భేదముచే ఆత్మలను వేరు వేరు అనుకొనిని అనుకొనిడి భేద సృష్టి భేద దృష్టి లేనివాడు, స్థూలము, అణువు మొదలగు భేదములు లేనివాడు, ఆరు గుణములతో పూర్ణుడగు భగవానునకు నమస్కారం, ఆత్మానందానుభవముచే

ఆకలి, దప్పిక, శోకము, మోహము, జనన మరణములు లేనివాడు, ఇంద్రియములను నియమించువాడు, స్వభావముచే, గుణములచే అన్నింటినీ మించినవాడై బ్రహ్మ అనబడువాడు భగవానుడు. అట్టి నీకు నమస్కారము. మనస్సు, వాక్కు ప్రసరించక ఆగిననాడు అపరిచ్ఛిన్నమని మాత్రమే అనుసంధింపదగినవాడు. సమానుడు గాని అధికుడు గాని లేనివాడు, జ్ఞానైకారుడు కర్మకృతమైన నామరూపములు లేనివాడు. చేతనా చేతనముల కంటే వేరైన వాడు అట్టి భగవానుడు మమ్ములను రక్షించుగాక. ఈ స్థూలమగు చేతనా చేతనాత్మకమగు జగత్తు సూక్ష్మ చేతనా చేతనములతో కూడిన ఎవరి నుండి వెలువడుచున్నదో ఎవరిలో లీనమగుచున్నదో. ఎవని యందు ఆధారపడి ఉన్నదో అట్టి భగవానునకు నమస్కారము. మట్టితో చేయబడిన పదార్థములు ఎట్లు మట్టి నుండి వెలువడి మట్టి యందే ఆధారపడి మరల మట్టిలోనే చేరుచున్నవో అట్లే బ్రహ్మము నుండి వెలువడి బ్రహ్మమే ఆధారముగా నిలిచి మరల బ్రహ్మమునందే ఈ జగము లయముగుచున్నది. అట్టి సకల జగత్తుకు కారణమైన వానికి నమస్కారము. సకల విశ్వములో వెలుపల లోపల కూడా వ్యాపించి ఉన్నవాడు ఆ భగవానుడే. యవనిని మనసు గాని బుద్ధి గాని ఇంద్రియములు గాని ప్రాణములు గాని ఎరుంగలేవో, తలంపలేవో అట్టి భగవానునకు నమస్కారము. దేహము, ఇంద్రియములు మొదలగున అన్నియు బ్రహ్మము యొక్క శక్త్యావేశము చేత తమ తమ వ్యాపారములు చేయుచున్నవి. అగ్నితో కాల్చబడిన కర్రకు సహజముగా లేని వెచ్చదనము వచ్చినట్లు పరమాత్మతో చేరి ఉన్ననాడే దేహేంద్రియములన్నియు తాము చేయు పనులయందు శక్తి గలవియగును. ఇంద్రియములన్నియు తాము చేయు పనులయందు శక్తి కలవియగును. ఇంద్రియములకు జ్ఞానశక్తి లేదు. జీవుడు కూడా జ్ఞానశక్తి గలవాడైనను పరమేశ్వర సంకల్పము చేతనే ఇంద్రియముల ద్వారా చూచువాడు ఉండువాడు అగును. భక్తుడగు చిత్రకేతువునకు నారదుడు ఇట్లు విద్యను ఉపదేశించెను. అంగిరసునితో కలిసి నారదుడు బ్రహ్మలోకమునకు ఏగెను. చిత్రకేతువు నారదుడు చెప్పిన సమాధితో జలములను మాత్రం ఆహారముగా తీసుకోనుచు ఏడు రోజులు జపించెను. ఏడు రోజులు ఆ విద్యను ధరించుటచే అతనికి విద్యాధరులు ఆధిపత్యము లభించెను. విద్యాధరుల ఆధిపత్యము లభించెను. తరువాత కొద్ది రోజులకు విద్యా ప్రభావముచే

తాను కోరిన చోటికి వెళ్ళగల శక్తి గలవాడై పాతాళ లోకము కంటే క్రిందనున్న సంకర్షుణి చరణ సమాగమము కేగెను. సంకర్షుణుడు తామర తూడు వలె తెల్లని శరీరము గలవాడు. నల్లని వస్త్రములు ధరించి ఉన్నవాడు. ప్రకాశించుచున్న కిరీటము, కటిసూత్రము, కంకణములు దాల్చినవాడు ముఖము ప్రసన్నమై ఉండును. నేత్రములు ఎర్రగా ఉండెను. సిద్దేశ్వరులు గుంపులు గుంపులుగా అతని చుట్టూ ఉండిరి. చిత్రకేతువు. అతనిని దర్శింపగానే అతని మనస్సు స్వచ్ఛమై నిర్మలమై ఉండెను. భక్తితో అతని నేత్రముల నుండి ఆనంద బాష్పములు వెడవెను. ఒడలు గగుర్పొడెచెను. పురాణ పురుషుడగు ఆ సంకర్షునకు అభిముఖముగా ఏగి నమస్కరించెను. సంకర్షుని పాదముల క్రింద ఉన్న ఆసన పద్మమును చేరి నమస్కరించి ఆనంద భాష్పములచే పాదపీఠమును ఆర్ద్రము చేసెను. ప్రేమచే కంఠము నిరుద్ధమై మాట వెలువడలేదు. అందుచే స్తోత్రము చేయలేకపోయెను. ఎట్లో బుద్ధిచే మనసును వశపరుచుకొని మాట పలుకుటకు సిద్ధపడిన చిత్రకేతువు సర్వేంద్రియముల యొక్క బాహ్య విషయముల యందలి ప్రవృత్తిని నిగ్రహించుకొని పంచరాత్రి శాస్త్రములో ప్రతిపాదింపబడిన విగ్రహము గలవాడైన జగద్గురువును ఇట్లు స్తోత్రము చేసెను. ఓ భగవాన్ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలయములు అంతర్నియమనము మోక్షము నీ అధీనములు. బ్రహ్మాదులందరు అగ్ని నుండి మెనుగురులు వెలువడినట్లు నీ నుండి వెలువడిన నీ అంశభూతులే. తాము స్వతంత్రులమని తామే నియామకులమని బ్రహ్మాదులు ఒకరితో ఒకరు పోటీ పడుచుందురు. కానీ వాస్తవముగా వారు స్వతంత్రముగా నియామకులు కారు. పరమాణువు మొదలుకొని పరమ మహత్తు వరకు ఉన్న సకల పదార్థములకు నీవే అంతరాత్మగా ఉండువాడవు. నీకు ఆది, అంతము, మధ్యము లేవు. సకల వస్తువులకు ఆది అయిన వాడవు. అంత ముందున్న వాడవు నీవే. మిగిలినవన్నియు ఆద్యంతములు కలిగి మధ్యలో ఉండెడి కార్యములే. ఈ బ్రహ్మాండ కోశము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనేడి ఏడు ఆవరణములతో ఆవరింపబడి ఉన్నది. అది ఒకదాని కంటే ఒకటి పది రెట్లు అధికంగా ఉండును. ఈ అండకోశములో అణువగు జీవుడు చేరి జన్మ మరణములందు

జన్మ మరణము అందుచు తిరుగుచుండును. ఇట్లు కోట్ల కొలది అంశములు చేరి జన్మ మరణములందు తిరుగుచుండును. ఇట్టి కోట్ల కొలది అంశములు పరమ పురుషుని యందు అణువుల వలె పరిభ్రమించును. కావున అతడు అనంతుడు. జీవులు పరమ పురుషుని విభూతులనే ఉపాసింతురు గాని ఈ విభూతులు కూడా నశించునవే. వారు కోరి పొందిన లోకమును నశించుటచే మరల మరల జన్మలను అందుచుందురు. పరమ పురుషా కొందరు నిన్ను కోరి ఉపాసించుచుందురు. వారికి నిత్య నిర్దిశానందమే ఎల్లప్పుడూ ఉండును. కానీ జన్మ మరణాది రూపబంధము మరల మరల పొడుమదు. వెచ్చ చేసిన విత్తనములు భూమిలో తినను ఎట్లు మొలకెత్తవో అట్లే నీ యందు మనసు నిలిపి నిన్నే ఉపాసించిన వానికి సంసారం పొడసూపదు. నీవంతను వశపరుచుకొని ఉన్నవాడవు. నిన్ను వశపరుచుకొనగల వారు ఎవ్వరూ లేరు. కానీ నిన్ను భాగవత ధర్మము అనగా భగవదారాధన రూపమగు ధర్మము. భక్తులకు వశముగునట్లు చేయును. పాంచరాత్రాది శాస్త్రములలో భాగవత ధర్మము దోషరహితమని నీవే చెప్పితివి. వేరొక ఫలము కోరని వారలై బ్రహ్మ గుణములను అనుభవించుటయే పురుషార్ధముగా భావించిన మునులు మోక్షమునే కోరి ఉపాసింతురు. కానీ వేరొక ప్రయోజనము కోరి నిన్ను ఆరాధింపరు. భగదారాధన రూపముకు ధర్మము అన్యరాధనల కంటే ఉత్కృష్టమైనది. ఆ ధర్మము ఆచరించు వారులకు విషమ బుద్ధి ఉండదు. వారికి దంభము, మాత్సర్యము, హింస మొదలగు స్వభావములు కలగవు. సర్వభూతముల యందు వారు ప్రేమ కలిగి ఉందురు. నీవు నేను అని, నాది నీది అని భగవానునకే చెందిన విశ్వమునందు భేదభావం వారికి కలగదు. నాది నా కొరకు అను బుద్ధితో ఆరాధించు వారలకు బుద్ధి విషమముగా ఉండును. వారిది విశుద్ధమగు ధర్మము కాదు. అట్టి బుద్ధితో చేసిన ఆరాధన ఫలము నశించునది. అధర్మము. తో నిండినది. తనకు ఇతరులకు కూడా అనర్థమును కలిగించు ధర్మమును ఆచరించుటచే తనకు గాని పైవారికి గాని ఏమి ఫలము సిద్ధించును? పరమ పురుషుని స్వరూపము నిరంగక శరీర భూతులగు ఆయా క్షుద్ర దేవతలను శత్రు హింసాదుల కొరకై ఆరాధించు వారి ఆరాధన తనకు ఎదుటి వారికి కూడా వినాశకరము. దానిచే నీ మనసులో వారిపై కోపం ఉండుటచే నీకు బాధ కలుగును.

ఇతరులకు బాధ కలిగించుటచే అది అధర్మమగును. అది ధర్మము కాదు. హే భగవాన్, నీ సంకల్పం ఎన్నడును వ్యర్థము కాదు. నీ ఆరాధన చేయుట అనేటి ధర్మమును నీవే చెప్పితివి. భాగవత్ ధర్మమును చెప్పుటకు చేతులు చేతనులను ఉద్ధరింపవలెనని నీ సంకల్పమే కారణము. ఈ చేతనులు నిన్ను విడచి విషయములందు ఆసక్తి కలవారగుటచే అనర్థములు పొందుచుండగా వారిని ఉద్ధరించుటకే నీవు నీ ఆరాధన అనడి భాగవత్ ధర్మం ప్రకటించితివి. నీ సంకల్పమును ఎరిగిన వారు ఆర్యులు వారు ఈ చరచరాత్మకమగు సకల ప్రాణుల యందు నీవే ఆత్మగా ఉన్నావని బుద్ధితో ఉపాసించి అమృతత్వమును పొందుదురు ఓ భగవాన్. మానవులకు నీ దర్శనమే పాపములను సమూలముగా నాశనము చేయును. అది నీకు చేయజాలని పని గానీ, చేయశక్యము గానీ పని గానీ కాదు కదా? నీ నామమును ఒక్కసారి స్మరించినంత మాత్రము చేతనే హీన జాతిలో జన్మించిన వారికి కూడా సంసార బంధము వేడును. అనినచో మీ దర్శనము ఎంత మహత్మము గలదో చెప్పగలమా? ఓ అనంతా ఈ లోకములోని జనులు ఎవ్వరూ ఏ పని చేసినను అదంతయు సమస్త జగత్తుకు అంతర్యామిగా ఉండుటచే వారి బుద్ధివృత్తులు నీకు తెలియుచునే ఉండును. నేను మీకు విన్నవించుకొనునది ఏమున్నది? మినుగురు పురుగులు సురునకు వెలుంగును వసంగవెలెనా? నీ అనంత కళ్యాణ గుణము సంపూర్ణుడవు. నీ గుణములలో అల్పాల్ప భాగము కూడా నేను స్తోత్రము చేయగలవాడను కాను. నీవు పరమ గురువు. జ్ఞానమును వసంగిడి నారదాదులకు కూడా జ్ఞానమును వసంగిన వాడవే నీవు. నీ గుణములను నేను స్తోత్రము చేయుట హాస్యాస్పదము. నీవు షాడ్గుణ్య పరిపూర్ణవుడు, పరిపూర్ణుడవు. ఏ దోషములు అంటని వాడవు. ఉత్పత్తి స్థితిలయములు చేయువాడవు. కుయోగులు ఈ లోకములోని వస్తువులన్నిటినీ వేరువేరుగా తలంతురు. వారికి నీ స్వరూపము, స్వభావము తెలుసుకొన శక్యము కాదు. నీవు పరిశుద్ధుడవు. బ్రహ్మాదులు కూడా నీ సంకల్పము చేతనే జీవించుచుందురు. వారి వారి వ్యాపారములు చేయుచున్నారు. నిన్ను అనుసరించియే విశ్వములోని అందరి జ్ఞానములు ప్రసరించుచున్నవి. ఓ సంకర్షణ నీ శిరస్సునందు భూమండలము ఆవగింజ వలె ఉండును. సహస్ర శిరస్సులు గల జ్ఞానము, శక్తి, అనుగుణములు కల నీకు నేను నమస్కరించుచున్నాను. అంగీకరింతువు కాక. ఈ రకంగా చిత్రకేతువు ఆ పాతాళ లోకంలో కింద ఉన్నటువంటి సంకర్షుడిని స్తోత్రం చేస్తాడు. తర్వాత జరిగిన విషయాన్ని మనము

మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. May we be devoted to the Lord. May the lotus feet of the Lord be adorned. May the Sun be worshiped. May the supreme Lord be pleased. May no evil time prevail. The supreme Lord, O Lord Even if it were the shadow of a time when even Brahma and others were swallowed up, it would not fall on you. Brahma, Sanaka, and Indra bow to your lotus feet. May they have safety in this world. We bow to your lotus feet, which is the supreme refuge. First Canto, Eleventh Chapter, Sixth Prayer. Welcome to the 17th podcast of Srimad Bhagavata Tattva Deepika, Shashta Skandham, Bhod Bandhilasara. Until now, after completing the Rudrasana Vriddha, in the story of Chitraketu, after Chitraketu's children were separated, Narada showed him the soul and when he asked, he understood the matter that the child had said Having attained enlightenment, he prepares to return and give his teachings again. Narada is teaching him. We will get to know about it. Vasudeva, Sankarshana, Pradyumna, and Aniruddha are in the form of We meditate on the Lord. Greet him. He is the one who is full of knowledge, bliss, and form. One who is self-sufficient and does not depend on others. He is one who is endowed with the wisdom that everything is in his favour. He who does not desire another pleasure, rejoices in himself. He who is without attachment and aversion, who does not consider souls different due to the differences in bodies, who does not have a different vision of creation, who is without the differences of gross, subtle, and other forms, salutations to the Lord who is complete with six qualities By the experience of bliss

He who is without hunger, thirst, sorrow, delusion, birth and death, one who controls the senses, by nature, by qualities, exceeding all, the one who is called Brahma is the Lord. Greetings to you. When the mind and speech cease to be, only the unchanging is connected. He who is without an equal or superior, the knower, without name and form caused by action. May such a God, who is different from the consciousnesses of the self, protect us. This gross body, the causal body, the subtle body, from whom it emanates, into whom it merges. Salutations to the Lord upon whom one depends. How are the substances made of clay emanating from clay and depending on clay and returning to clay? Similarly, emanating from Brahma, Brahma remains the basis, and again, this world is dissolving in Brahma. Salutations to the one who is the cause of all the universe. He is the one who is spread in all the universe, both outside and inside. Yavani, mind or intellect, senses But neither lives nor senses, such a salutation to the Lord. The body, senses, and all other things are doing their respective businesses due to the power of Brahman. Just as the heat that comes naturally to a stick burned with fire, so too, when united with the Supreme Being, all the senses and organs become powerful in the tasks they perform. All the senses are powerful in the work they do. The senses are not instruments of knowledge. Even though a living being is endowed with the power of knowledge, it exists through the will of God, through the senses, and through the senses. Narada thus imparted the knowledge to the devotee Chitraketu. Narada, along with Angiras, ascended to Brahma's abode. Chitraketu, along with the samadhi told by Narada, took water as food and chanted for seven days. For seven days, by wearing that knowledge, he attained the authority of the Vidyadharas. The Vidyadhara's dominions were acquired. After a few days, due to the influence of education

He, having the power to go to the place he desired, ascended to the abode of Sankarshuni, which is below the netherworld. Sankarshana had a white body like a lotus stem. The one in black. The one who wears the crown, the waist thread, and the bangles shining brightly, his face will be pleasant. The pupils were dilated. Siddheswarulu were in groups around him. Chitraketu. As soon as he saw him, his mind was pure and clear. With devotion, tears of joy flowed from his eyes. I'm scared. He went and bowed down facing that Sankarshana, who is an ancient being. Reaching the lotus seat under the feet of Sankarshana, she bowed and watered the lotus feet with tears of joy. Love, with its chastity, has not uttered a word. Therefore, I could not praise. How, by controlling the mind, the one who is ready to speak, the Chitraketu, controlling the tendency of the external objects of all the senses, the idol presented in the Panchratri Shastra He praised the Jagadguru who was very good. Oh Lord, the creation, preservation, and destruction of the world, and the internal regulation, are under your control. All the Brahmas are like the embers that emerged from the fire, they are your part and parcel that emerged from you. They claim to be independent and that they are the rulers, and the Brahmins compete with each other. But in reality, they are not independent appointees. From the atom to the supreme greatness, you are the inner self of all substances. You have no beginning, no end, no middle. You are the origin of all things. You're the one who was ahead. The rest are all works that have beginning and end. This universe is surrounded by seven coverings called earth, water, fire, air, sky, ego, and greatness. It is ten times more expensive than one. In this ovary, the atomic being joins and is born and dies

Birth and death are constantly changing. Thus, countless elements combine and wander through birth and death. Countless elements, like atoms, revolve in the Supreme Being. Therefore, he is infinite. Living beings worship the manifestations of the Supreme Being, but these manifestations also perish. They are born again and again, taking birth because the world they desired is destroyed. The Supreme Being, some desire you and worship you. They will always have eternal, definite bliss. But the bond of birth and death is repeatedly prolonged. Just as seeds sown in the ground do not sprout without being eaten, similarly, one who keeps his mind on you and worships you will not have the trouble of worldly life. You're the one who's got my goose stuck. There ain't anyone there to hold you. But you, the Bhagavata Dharma, that is, the Dharma that is in the form of devotion to God. Will make it easy for the devotees to get hold of it. You yourself have said that the Bhagavata Dharma is flawless among the Pancha Ratra and other scriptures. Those who do not desire any other fruit, considering the experience of Brahma's qualities as the purpose of life, the sages desired liberation They worship. But they do not worship you for any other purpose. The worship of God is superior to other forms of worship. Those who practice dharma will not have a difficult mind. They do not have the nature of arrogance, envy, violence, etc. They have love for all beings. You are me, and mine is yours, in the universe belonging to the Lord, they do not have any discrimination. For those who worship with the intellect that thinks it is for me, wisdom will be difficult. They do not have a pure religion. The worship done with such a mind is fruitless. It is unrighteous. It is full of impurity. By practicing dharma that causes misfortune to others as well, what fruit will be obtained for oneself or for others? The form of the Supreme Being, those who worship those demonic deities who are embodied in the form of the body, for the sake of enemy violence, their worship is destructive to those who hear it. Because of that, you will feel pain in your heart because of anger towards them.

It is unjust to cause pain to others. It's not dharma. Oh God, your will is never in vain. You yourself have told the dharma of worshipping. Your determination to speak of the Bhagavata Dharma and to uplift the hands and feet is the reason. These devotees, having abandoned you and become interested in worldly matters, are experiencing misfortunes. To uplift them, you have declared your worship, the path of the Lord, and the Dharma of the Lord. Those who know your resolve, the Aryans, with the wisdom that you are the soul in all these moving and non-moving beings, worship and attain immortality, O Lord. Your vision to humans will completely destroy sins. Isn't it something you can't do, or something you can't do? By merely remembering your name once, even those born into a lower caste will be freed from the bonds of family life. If you say so, can we tell how great your vision is? Oh, Ananta, all the people in this world, whatever work they do, all of it is inherent in the entire world, so their intellect and actions are known to you It is. What is there for me to request? Are the minugur insects the light that shines on the sun? You are the perfect embodiment of infinite bliss. I am not one to praise my own attributes. You are the supreme guru. You are the one who gave knowledge to Narada and others. It is ridiculous for me to praise your qualities. You are perfect, you are perfect. You don't say any faults. You are the one who does the production mixing. The Kuwoogu separate all the things in this world. It is not possible for them to know your form and nature. You are holy. Even the Brahmins live by your will. They are doing their respective businesses. Following you, the knowledge of all in the universe is spreading. Oh, interaction, on your head, the earth will be like a mustard seed. I bow to you, who have a thousand heads, knowledge, power, and adaptability. Unless you agree. In this way, Chitraketu, in that netherworld, below He praises the Sankarshana. What happened next, we

We can learn more in another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.