కైలాస పర్వతమున పార్వతీదేవి ఆగ్రహము - చిత్రకేతుని శాపము
Citraketu Insults Shiva-Parvati & Recieves Mother's Curse
శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ ఘట్టంలో, విష్ణుభక్తుడైన విద్యాధర రాజు చిత్రకేతుడు కైలాస పర్వతముపై శివపార్వతులను దర్శించుకుంటాడు. మహర్షుల సమక్షంలో పార్వతీసమేతుడైన శివుని చూసి, చిత్రకేతుడు అవివేకముతో అగౌరవపూర్వకమైన మాటలు పలుకుతాడు. పరమేశ్వరుని పట్ల భర్తృభక్తితో నిండిన పార్వతీదేవి ఆగ్రహముతో చిత్రకేతునికి రాక్షసుడిగా జన్మించమని శాపమిస్తుంది. అయినప్పటికీ చిత్రకేతుడు ఆ శాపమును సంపూర్ణ సమభావముతో స్వీకరించి, తన ఆత్మజ్ఞానమును మరియు భగవద్భక్తిని ప్రకటిస్తాడు.
In this episode from Canto 6 of the Srimad Bhagavatham, the great Vidyadhara king Citraketu, empowered by Vishnu's grace and the knowledge of the self, encounters Lord Shiva and Mother Parvati on Mount Kailasa. Upon seeing Shiva resting openly with Parvati in the presence of sages, Citraketu makes a bold and disrespectful remark, failing to recognize the transcendental nature of the divine couple. Mother Parvati, unwilling to tolerate such insolence toward her beloved Lord, rises in righteous anger and curses Citraketu to be born as a demon. With complete equanimity and devotion, Citraketu humbly accepts the curse, revealing the depth of his spiritual realization and surrender to the Lord's will.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః భూయో నమః సద్వృజినచ్ఛిదే సతాం అసంభవాయాఖిల సత్వమూర్తయే పుంసాం పునః పారమహంశమాశ్రమే వ్యవస్థితానాన్ అనుమృగ్యదాసుషే సత్పురుష దుఃఖమును పోగొట్టువాడు, దుష్టుల ప్రాపంచికాభివృద్ధిని అరికట్టి వారిని సంహరించి మోక్షమునిచ్చువాడు, సకల ప్రాణుల రూపంలోనున్నవాడు. సర్వ కర్మ సన్యాస పూర్వకమగు ఆత్మజ్ఞాన నిష్ఠయందు నెలకొనియున్న సన్యాసులకు వారు నిత్యము వెదికే పరమాత్మ సాక్షాత్కారమును అనుగ్రహించువాడగు శ్రీహరికి మరల మరల నమస్కారము. సెకండ్ క్యాంటో, ఫోర్త్ చాప్టర్, థర్టీన్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము. 19వ పాడ్కాస్ట్ లో 19వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు రుత్రాసుర వధ రుత్రాసురు యొక్క పూర్వజన్మ వృత్తాంతం భాగంగా చిత్రకేతు ఉపాఖ్యానాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తప్పనిసరిగా చిత్రగతోపాఖ్యానం అందరూ కూడా వినవలసింది, తరించవలసింది. ప్రార్థిస్తూ తర్వాత విషయంలో మరుత్గణముల జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. సవిత భార్య పుష్ణి మరియు సావిత్రి వ్యాహృతి మూడు వేదములను అగ్నిహోత్రమును, పశుయాగమును, సోమయాగమును, చాతుర్మాస్యమును మహా ముఖములను కనెను. భగుని భార్య సిద్ధి ఆమె మహిషుని, విభువుని, విభుని, ప్రభువును కనెను. సుశీల ఆశీషా అనడి కన్యను కనెను. ధాత యొక్క భార్యలు నలుగురు. కుహు, సినీవాలి, రాక, అనుమతి అను నలుగురు భార్యలు. వారి యందు వరుసగా సాయము, దర్శయము, ప్రాతఃకాలము, పూర్ణమాసము ఆ నలుగురు కుమారులను కనెను.
విధాత భార్య క్రియ ఆమె యందు పురీష్య అను సంజ్ఞ గల ఇష్టక చైతన్యములు ప్రసవించెను. వరుణ్ణి భార్య చరిషణి ఆమె యందు భృగువు జన్మించెను. వరుణుని యొక్క కుమారుడే వాల్మీకి. అతడు పుట్ట అనగా వల్మీకము నుండి వెలువటచే వాల్మీకి అని పేరు వచ్చెను. ఒకప్పుడు మిత్రుడు వరుణుడు ఊర్వశిని చూచి రేతస్కలనమై ఒక కుంభమునందుంచిరి. ఆ కుంభము నుండి వశిష్టుడు అగస్త్యుడు జన్మించిరి. మిత్రునకు రేవతి అనే భార్య యందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అనే కుమారులు కలిగిరి. ఇంద్రునకు పౌలోమి అనిని భార్య యందు జయంతుడు, వృషభుడు, విదుషుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. తన సంకల్పముచే భగవానుడు వామనుడై జన్మించి త్రివిక్రముడాయెను. అతడు ఉపేంద్రుడు. అతనికి కీర్తి అను భార్య యందు మ్రోచ్లోకుడు జన్మించెను. అతనికి సౌభగుడు మొదల కుమారులు జన్మించిరి. ఈ విధముగా కశ్యపుని భార్యలలో ఐతి వంశం వివరించితిని. ఇక దితి వంశం చెప్పెదని వినుము. దితి వంశమునందే శ్రీమంతుడు, భాగవతుడు అగు ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి జన్మించిరి. దితికి దైత్య దానవులందరి చేత నమస్కరింపబరుడి హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు అను ఇద్దరు కుమారులు ఉండిరి. హిరణ్యకశిపునకు జంబుని కుమార్తె కయాధూజ భార్య ఆయను. ఆమెయందు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు ఆ నలుగురు కుమారులు కలిగిరి. వారి తేబుట్టువు సింహిక ఆమె విపరిచితి అను దానవుని భార్య. ఆమెకు రాహువు అను కుమారుడు కలిగెను. అతని అమృతమును త్రాగుటకు సిద్ధపడగా శ్రీహరి అతని శిరస్సును ఛేదించెను. సంహ్లాదుని భార్య గతి. ఆమె యందు పంచజనుడు జన్మించెను. హ్లాదునకు ధమని భార్య యందు వాతాపి ఇలువలుడు పుట్టిరి. ఆ ఇలువలుడే వాతాపిని మేకగా చేసి అగస్త్యునకు దాని మాంసమును పెట్టెను. అనుహ్లాదుని భార్య సూర్మ్య ఆమె యందు భాష్కలుడు మహిషుడు కలిగిరి. ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు.
అతని కొడుకు బలి. బలికి అశన అరడి భార్య యందు భానుడు మొదలగు 100 మంది కుమారులు కలిగిరి. భానుడు పరమేశ్వరుని ఆరాధించి అతని భృత్యువులలో ప్రధాన స్థానమును పొందెను. శివుడు అతనికి పురపాలకుడై ఇప్పటికిని అతని వద్దనుండును. దిదికి మరుత్తులను 49 మంది కుమారులు కలిగిరి. వానిని మరుత్గణములందురు. వారికి సంతానము లేదు. వారిందునితో సమానులైరి. పరీక్షిత్తు మరుత్తుల దితిపుత్ర పుత్రులగుటచే దైత్యులు కదా? మరుత్తులు దితిపుత్రులగుటచే దైత్యులు కదా? వారికి ఎందునితో సామ్యము కలిగెనని దేవత్వం పొందని చెప్పిరే అది ఎట్లు సంభవించును? మరుత్తులు దేవత్వమును పొందుటకు తగిన ఏ మంచి పని చేసిరి అని ప్రశ్నించెను. ఇంద్రుని పక్షమును విష్ణువు స్వీకరించి అతనికి అండగా ఉండి హిరణ్యాక్షి హిరణ్యకశిపులను చంపెను. దానిచే దితికి శోకము. ఆ శోకముచే పగ కలిగి చింతతో ఇట్లు తలంచెను. ఈ ఇంద్రుడు సోదరులను చంపిన పాపాత్ముడు. ఇతనికి ఇంద్రియ భోగమున నభవించుటయే కావలెను. క్రూరుడు, దయలేని వాడు, పాపాత్ముడు. అతని ఎన్నడైనను చంపించి నేను హాయిగా నిద్రపోవలెను. శరీరము దహించకపోయినచో పురుగుల పాలై కాకుల చేత, గ్రద్దల చేత, కుక్కల చేత తినదగినదగును. అట్టి శరీర సుఖము కొరకు భూతహింస చేయువాడు పురుషార్ధమును ఎరుంగడు. అతడు భూతద్రోహము జంకడు నరకమునందును. అట్టి దేహ సౌఖ్యమునే కోరి భూతద్రోహము చేయుటకు జంకని ఆ ఇంద్రుని మదమును తగ్గించగల కుమారుడు నాకు కలగవలెను. ఇంద్రుని చంపి ప్రతీకారము చేయవలెను. అట్టి కోరికతో ఆమె భర్తయ్యవు కశ్యపుని శుశ్రూష చేసి అనురాగము చేతను, వినయము చేతను, ఇంద్రియ నిగ్రహము చేతను, భక్తి చేతను, మనోహరములగు విలాసముల చేతను తన వశము చేర్చుకొనవలెనని చాలా కాలం ప్రయత్నించి. అతని మనసు తన వైపు ఆకర్షించెను. అతడు ఆమెకు వశపడెను. నైపుణ్యము గల స్త్రీ ఎంతటి విద్వాంసుడైన పురుషునైనను తన వశము చేర్చుకొనగలదు. అతనితో రమింపవలెను ఆమె కోరికను ఎరింగి అతడు పరవశుడై అందుకు సమ్మతించెను. సృష్టి ప్రారంభములో
స్త్రీ పురుష రూపముగా ఒకే శరీరమును రెండు భాగములుగా ఏర్పరచెను. కానీ తరువాత అతడే తన శరీరములో ఏక దేశముతో స్త్రీ సృష్టించెను. ఆమెకు పురుషుల మనస్సును ఆకర్షింపగల శక్తిని వసంగెను. అందుచే కశ్యపుడు దితికి వశపడెను. పరమ ప్రీతితో నవ్వుచు అభినందించుచు దితోయితునెను సుందరాంగి నా మనస్సును ఆనందింప చేసితివి నీకు ఏది కావాలనో కోరుకొనుము. భర్త సంతోషించినచో ఏ కోరిక పొంద సక్యము కాదు. శ్రీలకు పతియే పరమ దైవము. పరమ దైవము నారాయణుడై భర్తయే నారాయణుడై సర్వాభీష్టము నెరవేర్చగలడు. భర్త రూపమున ఉన్న వాసుదేవుడే భార్యచే ఆరాధింపబడుచుండును. పతివ్రతలకు స్త్రీలు శ్రేయస్సును కోరువారలై భర్తనే సర్వేశ్వరునిగా ఆరాధించి కోరికలు నెరవేర్చుకొందురు. నీవు నన్ను అట్లు భావించి భక్తితో సేవించితివి కనుక నీకు కావలసిన కోరికను వసంగిదును కోరుకొనుము అనెను. కశ్యపుని అనుకూలమగు భాషణము విని దితి మీరు నాకు వరమును వసంగుటకు అంగీకరించిరి. కావున ఇంద్రుని చంపజాలిన కుమారుని నాకు ప్రసాదింపుడు. మృత్యువు లేని వానిగా వానిని చేయుడు అని కోరెను. నా కుమారులు ఇరువును చంపబడినారు కదా, అందుచే మృత్యువు లేని కుమారుని అనుగ్రహింపుడు అని కోరెను. కశ్యపునకు ఆమె కోరిక సంకట పరిస్థితిని చచ్చి పెట్టెను. ఇంద్రుని చంపగల కుమారుని వసంగుట అధర్మము. ఇయ్యజాలడు. వరమునిచ్చేదని మాట ఇచ్చి మరలజాలడు. అందుచే మనసులో బాధపడుచు ఇట్ల అనుకొనుచున్నాడు. ఆహా ఇంద్రియములకు వశపడితిని స్త్రీ అనడి మాయ నా మనసును వశపరచుకొనునది. దీనుడై నరకములో పడెదను. నేను ఎంత బుద్ధిహీనుడను. మనకు రాబోవు అనర్థమును గుర్తించుకొనక లేకపోయితిని. ఇంద్రియములను జయింపలేకపోతిని. స్థిర స్వభావము, రూపము పరస్పర విరుద్ధముగా ఉండును. ముఖము శరత్కాలమందలి పద్మము వలె ఆకర్షకముగా ఉండును. మాటలు అమృతం వలె ఉండును. కానీ హృదయము పదునైన కత్తి అంచు వలె ఉండును. వారి చేష్టితములను ఎవరు గుర్తింపగలరు? స్త్రీకి స్వార్థమునందు పట్టుదల ఎక్కువ. దానికి అడ్డం వచ్చిన వాడు భర్త అయినను, పుత్రుడనైనను, సోదరునైనను స్త్రీ చంపుటకు జంకదు.
ఆమె స్వభావమునకు అనుగుణంగా ప్రవర్తించినది నేను ఏమి చేయలేను చేయగలను వరము ఇచ్చెదను. అసత్యము ఆడుట తగదు కానీ ఇంద్రుడు చనిపోవుట లోకమునకు అనర్థము అని ఆలోచించి కశ్యపుడు తనను తాను నిందించుకొనుచు ఆమెతో ఇట్లు పలికెను. ఓ కళ్యాణి నీకు ఇంద్రుని చంపగల కుమారుడు కలుగును. అతడు దేవతలగు బాంధవుడగును. నేను చెప్పని వ్రతమును నీవు ఒక్క సంవత్సరము చేసినచో అట్టి కుమారుడు కలుగును ఆయన అనెను. దితి ఆ వాక్యమును విని చెప్పుడు. ఆ వ్రతమును తప్పక చేతును. అందు చేయదగినవేవో, చేయరానివి ఏవో తెలియజేవుడు అని పలికెను. కశ్యపుడు ఆమెకు ఆ వ్రత నియమములను ఇట్లు చెప్పెను. ఈ వ్రతం ఒక సంవత్సరము చేయవలెను. వ్రత సమయములో ఏ ప్రాణి హింసింపరాదు. ఎవ్వరిని నిందింపరాదు. అసత్యము పలకరాదు. గోళ్ళు వెంట్రుకలు తుంపరాదు. అశుచి అయిన వస్తువులను స్పృశింపరాదు. ఎవరిపై కోపము తెచ్చుకొనరాదు. దుర్జనులతో మాట్లాడరాదు. నదులలో సరస్సులలో మునిగి స్నానము చేయరాదు. తడిపి ఆరవేయని వస్త్రములను దాల్చరాదు. ముడిచి విడిచిన మాలను దాల్చరాదు. ఎంగిలి తినరాదు. చండికకు పెట్టిన మాంసము తినరాదు, ముట్టరాదు. శూద్రుడు పెట్టిన అన్నము తినరాదు. రజస్వల అయిన ఉన్న స్త్రీ చూచిన అన్నము తినరాదు. దోశలతో నీరు త్రాగరాదు. ఎంగిలైనచో నీటిని స్పృశించవలెను. ఉభయ సంధ్యాలందు జుత్తు విర్య పోసుకొని ఉండరాదు. రెండు వేళలా దేవతార్చనము మానరాదు. మాటలో నియమం పాటించవలెను. పైని బట్ట కప్పుకోకుండా బయట సంచరించరాదు. కాళ్ళ చేతులు కడుక్కొనకుండా పరుండరాదు. తడి పాదములతో పరుండరాదు. దిగంబరగా పరుండరాదు. ఉతికిన బట్టలను ధరింపవలెను, పవిత్రురాలై ఉండవలెను, పసుపు, చందనం మొదలగు మంగళ ద్రవ్యములను అరుదుకొని తిలకమును దాల్చి ఉండవలెను. ఉభయ భోజనమునకు ముందు గోవును, బ్రాహ్మణులను, మహాలక్ష్మిని, భగవానుడగు నారాయణుని పూజించవలెను. పుత్రవతుడగు స్త్రీలను పూజించవలెను. వారికి మాలలు, చందనము, కానుకలు, అలంకారములు సమర్పింపవలెను. భర్తను దైవముగా భావింపవలెను. ఇట్లు ఒక సంవత్సరము పుంసవనమనడి ఈ వ్రతమును నీవు చేసినచో ఇందును చంపజాలిన కుమారుడు నీకు కలుగును.
అని తను చెప్తాడు. ఆ వ్రతాన్ని మరి తను స్వీకరించి తర్వాత ఏం జరిగిందో విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Again and again, may the virtuous be protected. May the unobtrusive, all-encompassing, and embodiment of all good qualities, the male and female, be renounced by those who are situated in the shelter of the supremely great one. The one who removes the sorrow of the virtuous He who restrains the worldly progress of the wicked, destroys them, and grants salvation, is in the form of all beings. Salutations again and again to Sri Hari, who bestows the realization of the Supreme Soul upon the ascetics who are steadfast in the knowledge of the Self, which is preceded by complete renunciation of all actions. Second Canto, Fourth Chapter, Thirteenth Prayer. Oh, devotees of the Lord, the sixth book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 19th podcast, 19th podcast. Until now, we have completed the story of Chitraketu, as part of the story of Rutrasura's killing and Rutrasura's past life. It is mandatory that everyone should listen to and understand the story. Praying, then let us know the birth story of the Marutganas in the matter. Savita's wife Pushni and Savitri's Vyahruti three He became the fire, the sacrifice, the animal sacrifice, the Soma sacrifice, and the four-month sacrifice, and the great mouths. Bhaguni's wife Siddhi, she had Mahishu, Vibhu, Vibhu, Prabhu. Susheela gave birth to a baby girl. The four sons of the Dhata are. Kuhu, Sinivali, Raka, and Parimi are four wives. In them, in order, help, vision, morning, full moon, he had four sons.
The creator's wife's action, in her womb, the desired consciousness with the sign of 'Purishya' was born. Varuna had a wife, Charishani, from whom Bhrigu was born. Valmiki was the son of Narayana. He was born, meaning that he emerged from Valmiki, hence he was named Valmiki. Once upon a time, a friend, Varuna, seeing Urvasi, became a semen ejaculation and remained in a pot. Vashishta and Agastya were born from the Kumbha. Revati, a friend, had sons named Utsargudu, Arishtudu, and Pippaludu. Indra had three sons named Jayanta, Vrishabha, and Vidusha, with his wife Paulomi. By his determination, the Lord was born as Vamana and became Trivikrama. He is Upendra. He had a son named Mrochlodu born to his wife Kirti. He was born to Saubhaghu and his sons. In this way, I have described the lineage of Kashyapa's wives. Now listen, I will tell you about the lineage of Diti. In the Diti dynasty, Prahlada, who was wealthy and a Bhagavata, and Bali Chakravarti were born. Having been defeated, he was made to bow down before all the demons and giants Hiranyakashipu and Hiranyaksha were two sons. Hiranyakashipu's wife was Kayadhuja, the daughter of Jambavan. She had four sons, Prahlada, Anuhlada, Sanhlada, and Hlad. Their grandmother is Simhika, the wife of the demon Vipariti. She was blessed with a son, Rahu. As he was about to drink the nectar, Srihari severed his head. The Destruction of Sanhlad's Wife. And with her, the Panchajanya was also created. Vatapi was born to Hladun's wife, the daughter of Atharvana. He made Vatapi a goat and gave its meat to Agastya. Anuhladu's wife was Suryamya, and he had Bhaskaludu and Mahishudu. Virochana is the son of Prahlada.
His son is sacrificed. Bali had 100 sons, including Ashana, Aradi, wife, and Bhanudu. Bhanu worshipped Parameshwara and attained the foremost position among his servants. Shiva is his townspeople, even now he has it. Dadik had 49 sons with Marutu. He is in the army. They have no children. They are equal to a week. Parikshit and Marutu are the sons of Ditiputra, therefore they are Daityas, right? Are the Marutuṛṛu the Dītiputraṛu because they are demons? Why did they not attain divinity, saying that they had similarities with the gods? How did that happen? Maruthulu asked what good deed they had done to be worthy of attaining divinity. Vishnu accepted Indra's side, stood by him, and killed Hiranyaksha and Hiranyakashipu. Grief at her death. He thought thus, filled with grief and anger. This Indra is the sinner who killed the brothers. He wants to indulge in sensual pleasures. A cruel, unforgiving tyrant. I can sleep peacefully after he is killed. Body If it is not burnt, it will become prey to worms, birds, eagles, and dogs. He who commits violence for the sake of bodily pleasures does not understand the purpose of life. He who does not turn away from treachery will not escape in hell. I want a son who can reduce the arrogance of Indra, who does not hesitate to commit atrocities for the sake of worldly pleasures. Vengeance for Indra's murder must be done. With such a desire, she tried for a long time to get her husband Kashyapa under her control by serving him, by being affectionate, by being humble, by controlling her senses, by being devoted, and by being charming. His heart was drawn to her. He took her. A skilled woman can subdue even the most learned man. He should be made to enjoy with her. Having heard her request, he was ecstatic and agreed. In the beginning of creation
The male and female forms are made up of a single body into two parts. But after that, he created a woman with a single country in his body. She had the power to attract the hearts of men. Thus Kāśyapa, realizing this, became pleased. With utmost love, laughing and congratulating, I am telling you, beautiful woman, you have made my heart happy. Ask for whatever you want. If the husband is happy, it is not possible to get any desire. Sri Lanka's husband is the supreme deity. The supreme God, being Narayana, the husband, being Narayana, can fulfill all desires. Vasudeva, who is in the form of a husband, is worshipped by his wife. Women, who are devoted to their husbands, worship their husbands as the supreme being and fulfill their desires. Because you thought of me that way and served with devotion, I will grant you the desire you asked for, he said. Hearing Kashyapa's favorable speech, Diti agreed to grant me a boon. Therefore, grant me a son who can kill Indra. He asked to be made one without death. My two sons They were killed, right? Therefore, he asked for the blessing of a son without death. Her desire to marry Kashyapa killed him. It is unrighteous to kill a son who can kill Indra. He cannot give a boon. He cannot give it back after promising to give a boon. Therefore, he is suffering in his heart and thinking like this. Oh, I am enslaved to the senses. The illusion of being a woman captivates my mind. I'm going to end up in the devil's den. How stupid am I? I was unable to recognize the disaster that was about to happen to us. I could not control my senses. The static nature and form are mutually contradictory. The face is as attractive as a lotus in the autumn season. Words are like nectar. But the heart is like the edge of a razor. Who can recognize their actions? A woman has a greater tendency towards selfishness. He who is an obstacle to that, even if he is a husband, son, or brother, does not hesitate to kill a woman.
I cannot do what she did according to her nature, I can do it, I will grant a boon. It is not right to lie, but thinking that Indra's death is a disaster to the world, Kasyapa condemned himself and said this to her. Oh Kalyani, you will have a son who will be able to kill Indra. He is a relative of the gods. If you perform a vow that I have not told you, you will have such a son, he said. Diti, listen to that sentence. The vow is to be undertaken without fail. He said, tell me what can be done and what cannot be done. Kashyapa gave her the rules of the Vrata. This vow should be undertaken for one year. No animal should be harmed during the time of the vow. No one can be blamed. You can't lie! Nails and hair don't grow. Unclean things should not be touched. Don't hold a grudge against anyone. One shouldn't approach the wretched. One should not bathe in rivers and lakes. Wet or damp clothes should not be worn. A garland of broken arrows cannot be worn. Eating leftovers is not allowed. The meat that was put for Chandika It is not to be eaten or touched. One should not eat food offered to a Shudra. A woman who has just had her period cannot eat the food that has been seen. One should not drink water while having dosa. If it is a bird, touch the water. In both twilight, the hair should not be parted. Both times I did not offer prayers to the Gods. One has to maintain decorum. You cannot roam outside without covering yourself with a cloth. One should not be barefoot. You can't sit on wet feet. One doesn't sit cross-legged. One should wear washed clothes, be pure, keep turmeric and sandalwood and other auspicious items, and wear a tilak. Before both meals, one should worship the cow, Brahmins, Mahalakshmi, and Lord Narayana. A daughter-in-law should be worshipped. Offer them garlands, sandalwood paste, gifts, and decorations. A husband is considered as God. Thus, if you perform this Vrata (religious vow) for one year, you will have a son who can kill Indu.
He says that. Let's find out what happened after she accepted the vow in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus