త్వష్ట ప్రజాపతి పుత్రుడైన విశ్వరూపుని పురోహిత స్వీకారము
Devas Accept Visvarupa as Their Sacrificial Priest
ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, దుర్వాస మహర్షి శాపం కారణంగా తమ శక్తిని మరియు సంపదను కోల్పోయిన దేవతలు తమకు యజ్ఞకార్యాలు నిర్వహించే సమర్థుడైన పురోహితుడు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న సందర్భాన్ని వివరిస్తాం. ఇంద్రుడు మరియు దేవతలందరూ ప్రజాపతి త్వష్ట పుత్రుడైన విశ్వరూపుని వద్దకు వినయంగా వెళ్ళి, తమకు రాజపురోహితుడిగా వ్యవహరించమని వేడుకుంటారు. అసుర వంశానికి చెందిన తల్లి యొక్క పుత్రుడైనప్పటికీ, విశ్వరూపుడు ధర్మభావనతో మరియు దేవతలపై కరుణతో ఆ బాధ్యతను స흔ంతగా స్వీకరిస్తాడు. ఈ ఘట్టం, ధర్మనిష్ఠ మరియు దైవకృప ద్వారా కష్టకాలంలో కూడా విశ్వక్రమం పునరుద్ధరింపబడుతుందని అద్భుతంగ వివరించబడినది.
In this episode of the Srimad Bhagavatham podcast, we explore the pivotal moment when the Devas, having lost their strength and prosperity due to the curse of Durvasa Muni, are left without a capable priest to guide their sacrificial rites. Indra and the celestial gods humbly approach the young and virtuous Visvarupa, the son of the great Prajapati Tvashta, and request him to serve as their royal priest. Visvarupa, though born of a mother belonging to the asura lineage, graciously accepts the role out of his devotion to dharma and his compassion for the Devas. This episode beautifully illustrates how divine grace and righteous resolve can restore cosmic order even in times of great adversity.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణి సంసార సర్పదష్టమ్యో విష్ణురాతమమోముచత్ యోగులలో శ్రేష్టుడగు శుక మహర్షి పరబ్రహ్మ స్వరూపుడు ఆయన కొరకు నమస్కారం. ఆయన సంసారము అనే సర్పముచే కరువబడిన పరీక్షిణ్ మహారాజును సంసార బంధము నుండి విముక్తిని చేసెను. 12th కాంటో 13th. చాప్టర్ 21st ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము 10వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతకుముందు నారాయణ కవచాన్ని మనం దానిలో ఉన్న అర్ధాన్ని మనం సేవించాము. మిగతా భాగాన్ని మనం ఇప్పుడు నారాయణ కవచంలో ఉన్నటువంటి మిగతా భాగాన్ని ఇప్పుడు సేవించుదాం. ఈ విధంగా నారాయణుని ప్రార్థించుచు నారాయణుని అవతారముకు నృసింహుని మరల ప్రార్థించుచున్నారు. ఆగ్నేయాది విదుక్కులలోను తూర్పు మొదలగు దిక్కులలోను ఊర్ధ్వలోకమున అధోలోకమున నా శరీరము యొక్క లోపల వెలుపల భగవానుడగు నారసింహుడు రక్షించుగాక. లోకుల భయమును అతని మహాట్టహాసముచే బయల్వెడిన ధ్వనిచే తొలగించువాడు అతడే. తన తేజస్సుచే సూర్యాది సమస్త తేజస్సులను ఆచ్ఛాదించువాడు అతడే. అట్టి నరసింహుడు రక్షించుగాక. విశ్వరూపుడు నారాయణ వర్మము అనడి. మంత్రమును ఇంద్రుడికి ఉపదేశించి ఇంద్రా ఈ మంత్రముచే మీకు కవచము ధరించినట్లు రక్షణ ఏర్పడును. నీవు. సుఖముగా శత్రువులను జయింపగలవు. ఈ కవచము నిత్యము అనుసంధానము చేయువారు భయమునందిన వారిని చూచినను స్పృశించినను వారికి కలిగిన భయము తొలుగును.
ఈ నారాయణ కవచము ధరించిన వారికి రాజుల వలన గాని, దొంగల వలన గాని, పెద్ద పులులు మొదలగు క్రూర జంతువుల వలన గాని ఎన్నడూ భయము కలగదు. దీనికి దృష్టాంతముగా ఒక ఇతిహాసమును చెప్పెదను వినుము. పూర్వము కౌశికుడను ఒక బ్రాహ్మణుడు ఈ కవచమును నిత్యము ధరించి ఆ ధ్యానములో ఉండి ఒక ఎడారిలో శరీరము వీడెను. చనిపోయిన తరువాత అతని శవము ఆ ఎడారిలో పడి ఉండెను. ఒకనాడు చిత్రరధుడు అనేటి గంధర్వుడు తన భార్యలతో కలిసి మరణించిన అతని శరీరం మీదుగా విమానముతో ఏగుచుండెను. అతని శరీరము ఉన్న చోటికి విమానము రాగానే ఆ విమానము ఆకాశము నుండి కింద పడెను. అతడు ఆశ్చర్యపడెను. వాలఖిల్యుడను ఋషి అతనికి ఆ కౌశికుని ప్రభావమును చెప్పి అతని ఎముకలను తీసుకొని వెళ్లి సరస్వతి నదిలో నిమజ్జనము చేయమని చెప్పెను. అట్లే ఆ ఎముకలను తీసుకొని వెళ్లి సరస్వతి నదిలో ఉంచి స్నానము చేసి తన స్థానమును చేరెను. ఓ రాజా ఎవడు ఇట్టి ప్రభావము గల ఈ కవచమును ఆదరముతో ధరించునో వారికి సర్వభూతమును నమస్కరించును. వారికి ఎప్పటికిని భయము కలగదు. ఈ విధముగా నారాయణ కవచం ఉపదేశం పొంది యుద్ధములో అసురులను గెలిచి మూడు లోకముల ఐశ్వర్యమును ఇంద్రుడు అనుభవించెను. దేవతలకు పురోహితుడుగా ఉన్నను విశ్వరూపునకు తల్లి సంబంధముచే అసురులపై పక్షపాతము తగ్గలేదు. విశ్వరూపునకు మూడు శిరస్సులు ఉండెను. ఒక శిరస్సు సోమపీఠము అది యజ్ఞములలో సోమరసమును పానము చేయును. మరియొక శిరస్సు సురాపీఠము అనగా సురను పానము చేయును. ఒక శిరస్సు అన్నదము అనగా అన్నమును తినును. అతడు యజ్ఞములో తమ తండ్రులు దేవతలగుటచే యజ్ఞములో హవిర్భాగమును ఇది ఇంద్రునకు, ఇది అగ్నికి అని చెప్పుచు వసంగిన దానిని దేవతలకు వసంగుచు పరోక్షముగా అసురులకు కొంత భాగము వసంగుచుండెను.
మేనమాములగుటచే అసురులయందు అతనికి పక్షపాతం. దేవతలను ప్రత్యక్షముగా భాగమును ఇస్తున్నానని ఇంద్రాయ అగ్నయే అని చెప్పుచునను పరోక్షముగా అసురులకు భాగమును అందించుచుండెను. దేవతలను కపటముతో వంచించుచున్నాడని ఇంద్రుడు గుర్తించి వెంటనే తమకు అవిర్భాగములు లేకుండా పోవునని భయపడి విశ్వరూపుని శిరస్సులను కోపముతో ఛేదించెను. సుమపీఠమనెడి శిరస్సు కపింజలమనెడి పక్షి ఆయను. సురాపానము చేయు శిరస్సు కలవింకము అనేడి పక్షి ఆయను. అన్నాదము తిత్తిరి అనేడి పక్షి ఆయను. అతడు బ్రహ్మహత్యను హరించుకొనుటకు సామర్థ్యము గలవాడయు అంజలితో ఆ పాపమును స్వీకరించెను. సంవత్సరము బ్రహ్మహత్యా పాపమును భరించి తరువాత దానిని భూమికి, జలమునకు, చెట్లకు, స్త్రీలకు నాలుగు భాగములుగా విభజించి ఇచ్చెను. అట్లు బ్రహ్మహత్యను పుచ్చుకున్నందుకు వరముగా భూమికి ఇంద్రుడు తవ్వినను వెంటనే పూడ్చనవసరము లేకుండా మరల పూడునట్లు వరమునిచ్చెను. చెట్లు నాలుగవంతు బ్రహ్మహత్యా పాపమును భరించెను. అదియే జిగురు రూపమున చెట్ల నుండి స్రవించుచుండును. దానికి ప్రత్యుపకారముగా నరికినను వెంటనే మొలుచునట్లు ఇంద్రుడు చెట్లకు వరమిచ్చెను. స్త్రీలకు నాలుగవంతు బ్రహ్మహత్యను స్వీకరించిరి స్త్రీలు. ఆ దోషమే ప్రతి మాసము వారిలో రజోరూపముగా స్రవించుచుండును. వారికి భోగమునకు యోగ్యులగునట్లు ఇంద్రుడు వరమునిచ్చెను. జలములు బ్రహ్మహత్యలో నాలుగవ భాగమును స్వీకరించెను. అదియే నురుగు బుడగలు రూపముగా కనపడుచును. దానికి ప్రతిగా జలములకు ద్రవ స్వరూపం అనేటి తడిపెడి శక్తి అధికముగా ఉండునట్లు వరమిచ్చెను. ఇట్లు బ్రహ్మహత్యనును నలుగురికి ఇంద్రుడు పంచెను. వృత్రాసుర సంహారము భాగము మనం తెలుసుకుందాం. తరువాత విశ్వరూపుని తండ్రి త్వష్ట కుమారుడు చనిపోయినాడని క్షోకముచే ఇంద్రుని వినాశము చేయుటకు ఇంద్ర శత్రో వర్ధస్వ ఇంద్రుని చంపువాడా నీవు అగ్ని నుండి వెలువడుము ఇంద్రుని చంపుము అని అగ్నిలో హోమం చేసెను.
అతడు మంత్ర రూపంతో హోమము చేయగానే దక్షిణాగ్ని నుండి సర్వలోక ప్రళయము ఏర్పడినప్పుడు బయలువెడుల అగ్ని వలె భయంకరుడగు అసురుడు బయలువెడెను. అతడు రోజు రోజుకు బాణ ప్రమాణముగా అన్ని వైపులా పెరుగుచుండెను. అగ్ని పర్వతము కాలిపోయి బొగ్గువైనచో ఎట్లు ఉండునో సంధ్యాకాలమందలి మేఘములు ఒకచోట చేరిన ఎట్లుండునో అట్లు కాల్చిన రాగి వలె నుండి శిఖలతో గడ్డములతో రాక్షసులు పెరుగుచుండెను. అతని నేత్రములు మధ్యాహ్న సమయమందలి సూర్యుని వలె భరింప శక్యముగానంత తీవ్రముగా ఉండెను. మెరేయుచున్న మూడు శిఖలు గల శూలమునందు భూమి అంతరిక్షముల మధ్యనున్న సమస్త పదార్థములను ఆరోపించి గట్టిగా గర్జించుచు పాదముతో భూమిని దట్టించి కదలినట్లు చేయుచు అతడు సంచరించుచుండెను. అతని నోరు ఒక కొండ లోయ వలె లోతుగా గంభీరమై కనపట్టుచుండెను. తన నాలికతో నక్షత్రములను, గ్రహములను నాకుచు, నోటితో ఆకాశమును త్రాగుచు, మూడు లోకములను మ్రింగుచు. భయంకరములగు కోరలతో మాటిమాటికి నోరు ఆవరించుచు అతడు సంచరించుచుండెను. ఆ రూపమును చూచి లోకులు పది దిక్కులకు భయపడి పరిగెత్తుచుండిరి. ఇట్లు ఆ అత్వాష్ట్రుడు తన రూపముచే లోకములన్నింటినీ ఆవరించి అంధకారం ఆవరించునట్లు చేసెను. లోకమంతను ఆవరించునచే అతనిని వృత్రుడు అని వ్యవహరించిరి. అతడు చాలా భయంకరమైన పాప స్వరూపుడు. ఆ రూపమును చూచి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సైన్యముతో వచ్చి చూచి తమ తమ అస్త్రములతో ఆ వృత్తుని కొట్టిరి కానీ అతడు ఆ అస్త్రమును తనలోనికి తీసుకొని మ్రింగెను. దేవతలందరూ ఆశ్చర్యపడిరి. వారి తేజస్సునంతను మృతుడు మాసిపోవునట్టు చేసెను. అందరును విషాదగ్రస్తులైరి. అది పురుషుడగు పరమాత్మను వారు ఇట్లు స్తోత్రము చేయనారంభించిరి. ఆ దేవతలు ఏ రకంగా స్తోత్రం చేస్తున్నారో మనము తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఇక్కడ వృత్రాసుని యొక్క కథ మనము ముందు భాగంలో జరగబోతుంది. మళ్ళీ మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the Yogindra. To that Shuka, the embodiment of Brahma, who is the destroyer of the sufferings of the world, the destroyer of Vishnu's anger, the best among the yogis, the great sage Shuka, the embodiment of the Supreme Brahman, salutations to him. He liberated King Parikshit, who was afflicted by the serpent called family life, from the bondage of family life. 12th is 13th. Chapter 21st Prayer. Devotees of God, welcome to the 10th podcast of Srimad Bhagavata Tatva Deepika, the sixth volume. Earlier, we served the meaning of Narayana Kavacham. Let's now serve the remaining part, which is in the Narayana Kavacham. In this way, praying to Narayana, they are again praying to Narasimha for the incarnation of Narayana. In the southeast direction, in the eastern directions, and in the upper and lower worlds, may Lord Narasimha protect my body inside and outside. He is the one who removes the fear of the people and the sound that is released by his great laughter. He who covers all the radiance of the sun and other luminaries with his own radiance It is him. May that Narasimha protect us. Vishwaroopudu Narayana Varmamu Anadi. Having instructed the mantra to Indra, Indra, by this mantra, you will have protection as if you are wearing a shield. You. You can easily defeat enemies. This armor, those who constantly connect, even if they see or touch those who are afraid, their fear will be removed.
Those who wear this Narayana Kavacham will never be afraid of kings, thieves, or wild animals like tigers. I will tell you a story as an example. Listen. Once upon a time, a Brahmin named Kaushiku, wearing this armor daily, stayed in meditation and left his body in a desert. His body was found in the desert after he had died. Once upon a time, there was a Gandharva named Chitrarathudu, who was flying on a plane along with his wives over the body of a dead man. As soon as the plane arrived at the place where his body was, that plane fell from the sky. He was so surprised. Valakhilyanu Rishi told him about the power of Kaushiki and told him to take his bones and immerse them in the Saraswati River. Similarly, taking those bones, he went and placed them in the Saraswati River, bathed, and reached his destination. Oh king, whoever wears this armor with reverence, all beings will salute them. They will never be afraid. In this way, having received the Narayana Kavacham upadesam, in the war Indra won the Asuras and enjoyed the wealth of the three worlds. Even though he was a priest to the gods, the bias towards the demons did not diminish due to his motherly relationship with Vishwarupa. Vishwaroopa had three heads. A head, a Somapitham, it offers Somarasa in sacrifices. Another head is a Surapitham, that is, one who drinks the nectar of the gods. A head, food, means food, he eats. He, because his fathers were gods in the Yagnya, was telling Indra that this was the offering in the Yagnya, this was for the fire, and was indirectly telling the gods that some portion was being told to the demons.
Being his maternal uncles, he has partiality towards the Asuras. Indra, Agni, saying that he is directly giving a share to the gods, was indirectly giving a share to the demons. Indra, realizing that he was deceiving the gods with deceit, immediately, fearing that they would be without offspring, severed the heads of Vishwaroopa with anger. The head is the Sumapitha, the bird is the Kapinjala. The bird called Sirisu Kalavinum is one who drinks alcohol. The bird called Anadamutthiri is the one who said it. He was capable of destroying Brahmahatya and accepted that sin with Anjali. The year, after bearing the sin of Brahmahatya, he divided it into four parts: to the earth, to the water, to the trees, and to the women. Thus, because of committing Brahmahatya, Indra gave a boon that even if he dug for the earth, it should be filled again without needing to be filled immediately. The trees bore a fourth of their burden of sin of Brahmahatya. It is the form of glue secreted from the trees. In return for that, even if it is cut, immediately Indra granted boons to the trees as they budded. Women accepted four-fifths of the Brahmahatya. That defect is constantly secreted in them like semen every month. Indra granted them a boon so that they would be worthy of enjoyment. The waters received the fourth part in the sin of Brahmahatya. It appears as foam bubbles. In return, he granted a boon that the water would have the power to be wet, having a liquid form. Thus, Indra gave the sin of Brahmahatya to four people. Let's learn about the Vritrasura Samharam part. Then, Vishwaroopa's father, Twashta, because his son had died, to destroy Indra with grief, Indra's enemy, Vardhasva, you who kill Indra, emerge from the fire, kill Indra, thus he performed a homam in the fire.
As soon as he performed the homam with the form of a mantra, when the universal destruction occurred from the southern fire, a terrifying demon like a fire that bursts out emerged. He was growing day by day like an arrow. Like a mountain of fire that has been burned and reduced to coal, like the clouds that gather in one place during the evening, like a copper that has been burned, from the peaks and the lumps, demons were growing. His eyes were as intense as the midday sun. He was moving, placing all the substances between the earth and space on the trident with three peaks, roaring loudly, pressing the earth with his foot, and making it move. His mouth was as deep and serious as a mountain valley. With his tongue, he shows the stars and the planets to me, with his mouth, he drinks the sky, he swallows the three worlds. With terrifying fangs, he kept moving, repeatedly covering his mouth. Seeing that form, the people were afraid in ten directions and running. Like this Athvastrudu, with his form, covered all the worlds and made them enveloped in darkness. He who encompasses the world is called Vritra. He is the most devil-like creature in existence. Seeing that form, Indra and all the other gods came with their armies and saw, and struck that weapon with their respective weapons, but he took that weapon into himself and swallowed it. The gods were all astonished. He made the light of their brilliance disappear. Everyone is sad. They began to praise the Supreme Being, who is male. We will learn in the next part how those gods are praising. Here, the story of Vritrasura is going to happen in the first part. We will meet again. Jai Srimannarayana, salutations to the Gurus