దధీచి త్యాగము & వృత్రాసుర సంగ్రామము (Parts 13-16)

Dadhichi's Sacrifice & Vritra Battle (Parts 13-16)

bhagavatam

శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ భాగంలో, మహర్షి దధీచి తన అస్థులను స్వచ్ఛందంగా దానం చేసి, దేవతలకు వజ్రాయుధం తయారు చేసుకునే అవకాశం కల్పించిన అసాధారణ త్యాగగాథ వివరించబడింది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురునితో భీకర సంగ్రామం చేస్తాడు, ఆ యుద్ధం మూడు లోకాలనూ కంపింపజేస్తుంది. వృత్రాసురుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, శ్రీహరిపై అచంచలమైన భక్తి కలిగిన మహాభక్తుడని ఈ కథ స్పష్టం చేస్తుంది. నిస్వార్థ త్యాగమూ, నిర్మల భక్తీ మాత్రమే మోక్షమార్గానికి నిజమైన సాధనాలు అని ఈ ఎపిసోడ్ హృదయంగమంగా బోధిస్తుంది.

In this profound episode of Srimad Bhagavatham Canto 6, we witness the incomparable self-sacrifice of Maharshi Dadhichi, who willingly offered his own bones so that Indra and the Devas could forge the mighty Vajrayudha. With that divine weapon in hand, Indra faces the terrifying demon Vritrasura in an epic cosmic battle that shakes the three worlds. Remarkably, Vritrasura is revealed not as a mere villain but as a great devotee of Lord Vishnu, whose final moments are filled with supreme bhakti and surrender. This episode beautifully illustrates that true heroism lies in selfless giving, and that liberation can be attained even on the battlefield through unwavering devotion to the Lord.

← Prev Next →
Dadhichi's Sacrifice & Vritra Battle (Parts 13-16) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్యే పురుషంత్యాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్ బహిరవస్థితం నీవు ఆది నారాయణుడవు. సర్వ జగన్ నియంతవు. మాయా శక్తికి అతీతమైన నీవు ఇంద్రములకు గోచరించవు. సర్వ ప్రాణుల అంతఃకరణమునందు మాత్రమే గాక బాహ్యమునందు కూడా నెలకొనియున్న నీకు నమస్కరించుచున్నాను. ఫస్ట్ క్యాంటో ఎయిత్ చాప్టర్. 18th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము 13వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసున సంహారంలో భాగంగా ఇంద్రుడికి దధీచి యొక్క ఎముక నుండి వజ్రాయుధం లభించటం, ఆ వజ్రాయుధంతో వాళ్ళు యుద్ధంలో దిగటం కానీ యుద్ధంలో ఎప్పుడైతే రాక్షసులు తట్టుకోలేక ఓడిపోతున్నారో, అందరూ పారిపోతున్నప్పుడు వారిని చూస్తూ మృతురు ఉత్తరాసురుడు చేసినటువంటి సంభాషణ ఏమిటో మనం తెలుసుకుందాం. ఓ అనర్వా, శంబర, మాయ, పులోమా, నముచి, విప్రచిత్తి వినుడు వినుడు జన్మనెత్తిన వానికి మరణము తప్పదు. దానికి ప్రతిక్రియ ఏమీయు లేదు. మృత్యువునకు వెరచి యుద్ధమును వీడి పారిపోవుటచే అపకీర్తి కలుగును. పరలోకమునకు హాని కలుగును. అంతకంటే మృత్యువే మేలు. యుద్ధములో మరణించిన కీర్తి వచ్చును. స్వర్గమునందుదురు. వీరులకు యుద్ధములో మరణము దుర్లభము. ఇంద్రియములను జయించి, ప్రాణాయామము చేసి, బ్రహ్మమునందే మనస్సు నిలిపి, ధారణచే శరీరము వీడుట లేదా వీరుడై రణభూమిలో వెనుతిరగక శరీరమును వీడుట అనే రెండు విధములగు మరణములే ప్రశంసనీయము. అవి లభించుట దుర్లభము అట్లు వృత్రాసురుడు చెప్పుచున్నను ధర్మబద్ధములగు అతని మాటలను వారి మనసులకు అంటలేదు మిక్కిలి భయముతో యుద్ధము వీడి పరిగెత్తుచునే ఉండిరి

కాలము అనుకూలమై దేవతలు విజృంభించి యుద్ధము చేయుచుండగా అమరసేన సారీ అసురసేన పారిపోవుచుండగా చూచి రుత్రాసురుడు చాలా కోపము గలవాడై బలము చేత సైన్యమును భయపెట్టి ఆపెను. దేవతలతో ఇట్లు పలుకుచుండెను. దేవతలారా, మీరు పిరికి వారు. మీలో వీర ధర్మము లేదు. పారిపోవుచున్న వారిని వెనక నుండి కొట్టుటచే మీకు ఏమి లాభము? కీర్తియా? స్వర్గమా? భయపడి పారిపోవుచున్న వారిని చంపుట మెచ్చుకొనదగినది కాదు. నీచులారా, మీకు యుద్ధమునందు కోరిక ఉన్నదా? రెండు, ఒక్క క్షణకాలము నా ఎదుట నిలిచి పోరాడుడు అని పలికెను. తన దేహముచే దేవతలకు భయము కలిగించుచు నిండ అయిన బలముతో గంభీరముగా గర్జించెను. ఆ నాదము విని లోకమునందలి జనులందరు మూర్చిల్లిరి. దేవతలు మూర్చిల్లిరి. పిడుగు పడినప్పుడు జనులు ఎక్కడి వారక్కడ పడినట్లు పడిరి. దేవ సైన్యమంతయు వృత్తుని బలముచే మూర్ఛబడి కనులు మూసుకొని ఉండిరి. మదించిన ఏనుగు అరటి తోటలను విరిచి త్రొక్కుకొనుచు తిరుగునట్లు వారించుటకు శక్యముగాని మదము గల వృత్తుడు శూలము చేత డాల్చి భూమిని వణికించుచు ఆ సైన్యమును పాదములతో తిరుక్కుకొనుచు తిరిగెను. ఇంద్రునకు ఆగ్రహం వచ్చెను. వజ్రధరుడైన ఇంద్రుడు తనకెదురుగా వచ్చుచున్న వృత్తుడిపై భయంకరమగు గదను విరిసిరెను. వృత్తుడు ఆ గదను చేతితో ఒడిసి పట్టెను. ఆ గద చేత పుచ్చుకొని తీవ్రము కోపముతో మృత్యుడు ఘనముగా గర్జించుచు అడుగులు దృఢముగా వేయుచు గదతో ఐరాతమును కొట్టెను. దాని కుంభస్థలముపై గదాఘాతము తగిలెను. ఐరావతం పిడుగు పడి కొండ కదిలినట్లు ఘూర్ణిల్లెను. దాని ముఖము బ్రద్దలాయెను. రక్తము శ్రవించెను. తనపై కూర్చున్న ఇంద్రునితో కూడా ఏడు ధనుస్సుల మేరకు వెనకకు పోయెను. ఇంద్రుడు వాహనముతో బడలి ఉన్నాడని అట్టి సమయంలో మరల కొట్టరాదని ధర్మము ఎరింగిన వృత్తుడు మరల గదను విసురలేదు.

అమృతం స్రవించుచున్న తన చేతితో ఇంద్రుడు ఏనుగును తడిమి దానికి బడలిక తీర్చెను. మరల వృత్తునికి ఎదురుగా నిలిచెను. తన సోదరుడగు విశ్వరూపిని చంపిన ఇంద్రునిపై తీవ్రమగు పగగలవాడై వృత్రాసురుడు సోదరుని యొక్క మరణమును స్మరించుకొనుచు ఇంద్రుని చూచి శోకముతో మోహముతో ఇట్లు పలికెను. నీవు బ్రహ్మహత్యం చేసినవాడవు. నీకు గురువు నాకు సోదరుడైన విశ్వరూపిని చంపిన పాపాత్ముడవు. నా శూలముతో పాషాణం వంటి నీ గుండెను చీల్చి నా సోదరుడు రుణము తీర్చుకొందును. కరుణలేని వాడవై బ్రాహ్మణుడు, గురువు, ఏ పాపము ఎరుగని వాడు, యజ్ఞ దీక్షలో ఉన్నవాడగు నా సోదరుడు విశ్వరూపుని శిరస్సును ఛేదించి యజ్ఞ పశువును చంపినట్లు చంపితివి. నీకు లజ్జ లేదు. ఐశ్వర్య భ్రష్టుడవు. దయాహీనుడవు. కీర్తి రహితుడవు. నీవు చేసిన పనికి మనుష్యులను తినడి పిశాచములు కూడా నిందించును. ఇట్టు నిన్ను ఇప్పుడే శూలముతో ఛేదించి ముక్కలు చేసి. గ్రద్దలకు ఆహారముగా పడవేతును. పాపాత్ముడవగు నిన్ను అవివేకులై అనుసరించుచున్న ఈ దేవతలందరును నా వాడియగు త్రిశూలముతో కంఠములపై పొడిచి భూతగణములకు ఆహుతి చేసెదను. కానీ ఓ ఇందిరా. వీరుడవై యుద్ధములో నీ వజ్రముతో నా శిరస్సును ఛేదింపుము. నా దేహము భూతములకు బలియగును. నా కర్మ బంధము వీడును. ప్రశస్తమైన మనస్సు గల మహాపురుషుల పాద పరాగము సోకిన మార్గమున పరమ పదమునకు ఏగెదెను. శత్రువునగు నేనే ఎదురుగా ఉన్నాను. ఎదురులేని వజ్రాయుధము నీ చేతనున్నది. అది నీ గద వలె వ్యర్థము కాదు. ఒక నీచుని యాచించి ప్రయోజనం పొందలేక విఫలుడైనట్లు గదను ప్రయోగించి విఫల ప్రయత్నుడవు కాకుము. వజ్రమును నాపై ప్రయోగించుము. నీ వజ్రము భగవానుని తేజస్సు దధీచి తపస్సుచే పదును పెట్టబడినది. విష్ణువు ఆ వజ్రముతో నన్ను చంపమని చెప్పినాడు కదా. ఎవరి పక్షమున శ్రీహరి ఉండునో. అచ్చట సంపద, గుణములు, విజయము ఉండును. నేను అసురుడనైనను స్వర్గమును నరకమును పొందను. నేను ఉపాసించు దైవము గురువు సంకర్షణుడు అతడు తన పాదపద్మములచే ధ్యానింపుమని చెప్పినాడు. గ్రామ్య విషయములందు లోలత లేనివాడనై మునులు వెళ్ళెడి మార్గమున నేను మోక్షమును పొందెదను. వేరొక ప్రయోజనమును కోరక భగవానుని ధ్యానించడి వారలకు భగవానుడగు సంకర్షణుడు స్వర్గములో భూమిలో పాతాళములో ఉండెడి సంపదలను వసంగడు.

ఆ సంపదలు ఇచ్చినచో కొందరికి ఓర్వలేనితనము, ద్వేషము, ఉద్వేగము, మానసిక పీడ, మదము కలుగును. తత్వజ్ఞానము కలగకుండా ప్రతిబంధకము కలిగెడి వ్యసనములు ప్రయాసలు కలుగును. కావున అనర్థములకు మూలములగు ఐశ్వర్యమును వసంగక భగవానుడు తన భక్తులకు ముక్తినే ఇచ్చును. అల్పములు అస్థిరములగు ధర్మార్థ కామముల కొరకు ఆయాస పడకుండా తను సేవించు భక్తులకు ముక్తినే వసంగును. భగవత్ అనుగ్రహము దుర్లభము. అది ఏ ప్రయోజనము కోరిక కోరక సేవించడి వారికే లభించును. హే భగవాన్ నేను మరల మరల నీ పాద సేవా పరాణులగు దాసులకు దాసురునగుదును కాక నా మనస్సు నా ప్రాణనాథుడవగు. నీ గుణములనే స్మరించు గాక, నా వాక్కు నీ గుణములనే కీర్తించు గాక, దేహము నీ ఆరాధనము చేయు గాక. సకల సౌభాగ్యనిధి సర్వేశ్వర నాకు వైకుంఠము అక్కరలేదు చతుర్ముఖ బ్రహ్మ ఐశ్వర్యమును నేను కోరలేదు సకల లోకాధిపత్యము నాకు కోరునది కాదు పాతాళ లోకములకు ప్రభువై ఉండుట కూడా నా కోరిక కాదు అని మాది సిద్ధులు నాకు అక్కరలేదు. జన్మ మరణములు లేకుండా చేసేడి కైవల్యము నాకు అక్కరలేదు. నీతో కూడి ఉండుటయే నేను యాసించెడిది. ఎచ్చట ఉన్నను. నీ సన్నిధి నాకు అనుగ్రహించిన అంతే చాలును. ఓ పుండరీకాక్ష, రెక్కలు రాని పిల్లలు తన తల్లి అయిన పక్షిని ఎట్లు చేరి ఉండవలెను కోరును? లేగదూడలు ఆకలిచే తల్లి పొదువుని ఎట్లు ఆశించును? దూర దేశమున భర్త గల కాంత తన ప్రియునే పొందవలెనని ఎట్లు కోరునో అట్లే నా మనస్సు నిన్ను చూడ కోరుచున్నది. స్వామి నేను కోరినది ఇంత మాత్రమే దానిని అనుగ్రహింపుము. నీ దాసులతో ఎల్లప్పుడూ చెలిమి కలుగుగాక. కర్మానుగుణముగా సంసార చక్రములో పరిభ్రమించుచున్న నాకు మరల ఈ శరీరమునందు శరీర సంభవం. ముందులయందు ఆసక్తి లేకుండు గాక ఇది అనుగ్రహించి నన్ను కృప చూడుము ఇటు వృత్రాసురుడు తన దేహమును యుద్ధములో

వదలదలిచిన వాడై విజయము కంటే మృత్యువునే పొందదలిచిన మనస్సుతో చేతిలో శూలమును పట్టుకొని పూర్వము కైటభాసురుడు మహాపురుషుడగు భగవాను ఎదిరించినట్లు ఇందును ఎదిరించెను. రుత్రాసురు ప్రళయాగ్ని వలె అగ్ని జ్వాలను వెదులుచున్న శూలమును తిప్పి ఇంద్రుడిపై విసిరి సింహనాదము చేసి ఓ పాపాత్ముడా చనిపోతివి అనెను. అప్పుడు ఇంద్రుని ఆకాశములో ఇంద్రుడు ఆకాశములో తోకచుక్క వలె కదలాడుచు చూడశక్యము కానిదై సూర్యుడు నక్షత్రములు తోకచుక్కలు అగ్ని జ్వాలలు కరిసి వచ్చుచున్నట్లు తన వైపు వచ్చుచున్న ఆ వృత్రాసురుని శూలమును చూచెను. అది వాసుకి దేహం వలె అతి దీర్ఘముగా అతి స్థూలముగా తన పైకి వచ్చుచుండెను. అధైర్యము చెందక తన చేతిలో ధరించిన వజ్రముతో శూలమును సర్పరాజ శరీరము వలె ఉన్న అతని భుజములను కూడా ఖండించెను. ఒక చేయి తెగిపోయెను కానీ వృత్రాసురు వెనక్కు తగ్గలేదు. రెండవ చేతితో పరిఘను పట్టుకొనెను. ఇంద్రుని పైకి వచ్చి అతడు అధిరోహించిన ఐరావతమును ఇంద్రుని కూడా పరిఘతో కొట్టెను. ఇంద్రుని చేతి నుండి వజ్రాయుధము జారెను. వృత్తుడు చేసిన మహత్తర కార్యమును చూచి దేవతలందరూ అతని పరాక్రమమును మెచ్చుకొనిరి. ఇందునికి కలిగిన ఆపదను చూచి హాహాకారములు చేసిరి. చేతి నుండి వజ్రమును జారి నేల పలుటకు ఇందుడు సిగ్గుపడెను. సిగ్గుపడి మరల తీసుకునుటకు జంకెను. ఇప్పుడు వృత్తుడు ఇందునితో ఇట్లు చెప్పెను. ఇందిరా వజ్రమును తీసుకునుము. నీ శత్రువునైన నన్ను చంపుము. ఇది నీకు దుఃఖించు సమయము కాదు. యుద్ధము చేయు కోరు వారలకు ఎల్లప్పుడును విజయమే కలగదు. ఎప్పుడో ఒకప్పుడు కలుగును. పరమ పురుషుడు వారి వారి కర్మానుసారముగా జీవులలో ప్రవేశించి నియమించుచుండును. కర్మలకు తగినట్లు సుఖదుఃఖములను కలిగించును. జయాపజయములు కలిగించుచుండును. కనుక అపజయం కలిగినందుకు లజ్జపడకుము, శోకింపకుము. ఒక్క సర్వేశ్వరునికే సర్వత్ర జయము చేకురును. అతడు సృష్టి స్థితి లయములను చేయువాడు. సర్వజ్ఞుడు కర్మవశ్యుడు కాడు. అందుచే అతనికి అంతటా ఎల్లవేళలే జయమే కలుగును.

బ్రహ్మాది దేవతలు కూడా ఆ పరమ పురుషుని వశమందు ఉందురు. అతని సంకల్పం వలన జీవింతురు. ఒక త్రాడుతో కట్టబడిన పక్షి. కట్టి పట్టుకొనిన దాని వశమందు ఎట్లుండునో అట్లు ఈ లోకమంతయు సర్వేశ్వరుని వశమందు ఉండును. ప్రాణులందరకు తమ తమ పనుల యందు ప్రవర్తించు సామర్థ్యము అనగా ఓజము, వేగము, బలము, ప్రాణశక్తి, సంసారము, మోక్షము అన్నవి అన్నియు అతని అధీనములే. ఈ రహస్యము తెలియక ఈ లోకులు మూర్ఖులై తానే వీనికి అన్నిటికీ కారణం అనుకొందురు. కొయ్యలతో చెక్కిన స్త్రీ మూర్తి. మంత్రముతో బంధింపబడిన మృగము ఎట్లు ఆ చేసిన శిల్పి అధీనము బంధించిన పురుషుని అధీనమై ఉండునో అట్లే సకల భూతములు ఈశ్వరాధీనములు. జీవుడు, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, భూతములు, ఇంద్రియములు మొదలగున అన్నియు భగవత్ అనుగ్రహము చేయలేనిచో ఈ విశ్వ సృష్టిలో చేయుటలో సమర్థములు కావు. చైతన్యం లేని ప్రకృతి మొదలగునవి ఎట్లు సమర్థములు కావో చైతన్యము గల జీవుడు కూడా జగత్ వ్యాపారంలో సమర్థుడు కాడు. సకల విశ్వము యొక్క స్థితి ప్రవృత్తులు అతని అధీనము. జీవుడు తాను స్వతంత్రుడు కాడు. పరతంతుడు దాని ఎరుంగక తనను స్వతంతుడుగా తలంచును. సర్వేశ్వరుడు ఈ పృథివ్యాధి భూతములచే తానే సకల ప్రాణికోటిని సృజించును. మరల తనలోనికి లాగుకొనుచుండును. ఆయుర్దాయము, ఐశ్వర్యము, కీర్తి, సంపద. కోరికలు ఏవైనను సర్వేశ్వరుని సంకల్పము చేతనే కలుగుచుండును. జీవించుట మరణము కూడా అతని అధీనము. దారిద్ర్యము, సంపద, కీర్తి, అపకీర్తి కూడా అతని వలనే. నియమించు శక్తి ఒకరిచే నియమింపబడుట కూడా సర్వేశ్వరుని వలనే కలుగుచుండును. ఇవి జీవునికి కోరిక కోరికున్నను లేకున్నను రాకమానవు.

అందుచే ఈ రహస్యమును ఎరంగినవాడు, కీర్తి కలిగినవాడు, అపకీర్తి కలిగినవాడు, జయము కలిగిన నాడు, అపజయం కలిగిన నాడు, సుఖదుఃఖమును కలిగిన నాడు, జీవించి ఉన్న నాడు, మరణించిన నాడు కూడా మనసు చెదరక ఉండవలెను. ఒకప్పుడు పొంగుట, ఒకప్పుడు దిగులు పొందుట అజ్ఞాన లక్షణము. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణములు ప్రకృతికి చెందినవే కానీ ఆత్మకు చెందినవి కావు. ఆ గుణములు పరిణామ రూపముగా దేహమును ఏర్పరచును. దాని యందు ఉండు ఆత్మ వాని అన్నిటినీ సాక్షిగా దర్శించుచుండును. ప్రకృతి చేయు కర్మలను తానే చేయుచున్నానని జీవుడు భావించుచుండుటచే బంధింపబడుడు. తాను చేసెడివాడు కాదని ఎరింగిన నాడు బంధింపబడడు. ఓ ఇంద్రా, యుద్ధములో నేను ఓడింపబడితిని. నా భుజమును, నా శూలమును కూడా నీవు ఛేదించితివి. కానీ నేను నిన్ను చంపవలెనని మరల ప్రయత్నించుచున్నాను. చూచిత్వా, యుద్ధం ఒక జూదం వంటిది. ఇందు పందెము ప్రాణము. మన చతురంగ బలమే ఇందు మనము నడిపడి పావులు. ఇందు ఎవరికి జయము అపజయము ఎరుంగుట సఖ్యము కాదు. భగవానుడు సహాయమగు ఉన్నవాడు గెలుచును. నీకు భగవానుని సహాయం ఉన్నది. నీవు గెలుచుట తప్పదు, యుద్ధము చేయుము అని వృద్రాసురుడు ఇంద్రుని ప్రోత్సహించాను. మరి ప్రోత్సహించిన తర్వాత జరిగినటువంటి భావం ఏంటో కథా భాగాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the first among men. You are the beginning, the supreme, beyond the nature of all beings. You are the one who is within and without all beings. You are the original Narayana. The Lord of the Universe. You, beyond the power of illusion, are not visible to the Indra's. I bow to you, who are present not only in the inner being of all beings but also in the external. First Canto Eighth Chapter. 18th Prayer. Oh, devotees of the Lord, welcome to the 13th podcast of the Srimad Bhagavata Tattva Deepika, the sixth volume. Until now, as part of the destruction of Vritrasura, Indra receiving the Vajrayudha from Dadhichi's bone, and them engaging in battle with that Vajrayudha, but when the demons are unable to withstand and are losing in the battle, While everyone was running away, let's find out what conversation the dead Uttarasurudu had while watching them. Oh Anarva, Shambara, Maya, Puloma, Namuchi, Viprachitti, listen, listen, one who is born will inevitably die. There is no response to that. Abandoning war and running away from it will bring disgrace. Harm will come to thee in heaven. Death is better. Those who die in battle will gain fame. They will be in heaven. For warriors, death in battle is rare. Having conquered the senses, having done pranayama, keeping the mind in Brahman, to abandon the body by holding it, or to abandon the body without turning back in the battlefield, these two types of death are praiseworthy. It is difficult to obtain them. Thus, Vritrasura said, but they did not heed his words, which were righteous. With great fear, they left the battle and ran away

When time was favorable, the gods were raging and fighting, and as the immortal army, sorry, the demon army, was fleeing, Rutrarasura, very angry, with his strength, frightened the army and stopped it. He was speaking to the gods. Gods, you are a bunch of talkin' trash. You have no heroic daring. What is the use of hitting those who are fleeing from behind? Keerthiya? Paradise? Killing those who are running away in fear is not commendable. Do you have a desire for war, you vile bitch? Two, he said that he would stand before me for a moment and fight. With his body, he terrified the gods and roared majestically with full strength. Hearing that sound, all the people in the world were stunned. The gods fell into a stupor. When the thunder struck, the people fell wherever they were. The entire army of gods, having been struck by the power of Vrutthi, were lying with their eyes closed. Like a drunken elephant tearing apart and trampling the banana groves, a person with a drunken temper, unable to control himself, wields a spear and shakes the earth, turning that army with his feet He turned around. Indra became angry. Indra, the jewel-wearer, unleashed a fearsome mace on the one who was coming towards him. The worker grabbed the mace by hand. Taking the mace, with intense anger, Death roared loudly, and with firm steps, he struck the night with the mace. He was hit by a mace on his skull. The elephant roared, as if struck by lightning and the mountain moved. Its face was broken. The blood was shed. He also went back seven bows behind Indra, who was sitting on him. Indra, knowing that he was lost with his vehicle, did not throw the mace again at that time, the one who had the right to do so.

Indra, with his hand that was dripping nectar, touched the elephant and relieved its fatigue. Again, he stood opposite the profession. Vritrasura, filled with intense hatred towards Indra for killing his brother Vishwarupi, grieving over the death of his brother, spoke thus to Indra with sorrow and delusion. You have committed Brahmahatya. You are the sinner who killed the guru, the universal form, who is like a brother to me. With my spear, I will tear apart your heart, which is like stone, and my brother will repay the debt. Oh, you, the unforgiving one, the Brahmin, the guru, the one who knows no sin, the one who is in the vow of Yagnya, you have severed the head of my brother, the cosmic form, and killed the Yagnya animal. You have no shame. You are ruined by wealth. You are unkind. You are unhonored. Even the hungry demons will condemn men for the work that you have done. Like this, I will now sever you with a spear and cut you into pieces. I'll feed the eagles. Oh sinful one, all these gods who are following you as fools, I will strike them on their throats with my divine trident and offer them as sacrifices to the ghosts I will do it. But oh Indira. Be a hero in battle, sever my head with your sword. My body becomes a sacrifice for the ghosts. My karmic bond will be broken. He ascended to the supreme abode by following the path touched by the lotus feet of the great men with excellent minds. I, the enemy, am facing you. The unstoppable diamond-lance is in your hand. It is not as useless as your mace. Do not be a failure by using the mace as if you failed to gain any benefit by begging a vile person. Fire the diamond glaive at me. Your diamond, the radiance of the Lord, was sharpened by Dadhichi's penance. Vishnu has ordered to kill me with that sword, right? On whose side is Sri Hari. There, wealth, virtues, and victory will be there. I, being a demon, will not attain heaven or hell. I worship the divine, the guru, Sankarshana. He told me to meditate on his lotus feet. I will attain salvation by following the path taken by the sages, who are without weakness in matters of village affairs. Without seeking any other benefit, those who meditate on the Lord, the Lord, the Lord, the Lord, in heaven and on earth The treasures of the underworld are not to be found.

If wealth is given, some people will experience intolerance, hatred, excitement, mental distress, and arrogance. Without the knowledge of philosophy, obstacles, addictions, and efforts will arise. Therefore, without destroying the wealth that is the root of calamities, the Lord grants salvation to his devotees. For the sake of small and unstable dharmas, karmas, and desires, without straining himself, he will grant liberation to the devotees who serve him. Divine grace is rare. That benefit will only be available to those who serve without seeking any desires. Hey Bhagavan, I will again and again be a servant to the servants who are devoted to your feet, but my mind will be devoted to my Lord. Let me remember your virtues, let my words praise your virtues, let the body worship you. The treasure of all fortunes, the Lord of all, I do not need Vaikuntha. I do not desire the wealth of the four-faced Brahma. All the lordship of the world is not what I desire. It is also not my desire to be the lord of the netherworlds, said our Siddhas to me No need for that. I do not need liberation, which prevents birth and death. It is with you that I am longing. Wherever it is. "All I need is this grace from you. Oh Pundarikaksha, how can the children without wings be able to reach their mother, the bird? How can a mother cow, hungry, expect to give milk? Just as a woman in a distant land desires to find her beloved, so my heart desires to see you. Swami, I only ask for this much, please grant it. And may your servants always be loyal. For me, who is wandering in the cycle of worldly affairs according to my karma, again in this body, the birth of a body. Do not be interested in the past, bless this and have mercy on me. Here, Vritrasura in the war with his body

Having decided not to leave, with the mind that he would rather die than achieve victory, holding a spear in his hand, he faced Indu as Kaitabhasura, the great man, had faced Bhagavan in the past. Like the fire of Rudra's death, turning the trident that was burning the fire, throwing it at Indra, making a lion's roar, he said, O sinner, you have died. Then Indra, in the sky, Indra, in the sky, like a comet, moving, unseeable, the sun, stars, comets, fire flames, melting and coming, he saw the trident of that Vritrasura coming towards him. It was coming up to him, as long and as huge as Vasuki's body. Without being discouraged, he seized the trident in his hand and struck down the serpent king's shoulders, which were like his own shoulders. One hand was severed, but Vritrasura did not retreat. He is holding the parigha in his second hand. Indra came up and struck Indra's mount, which he had mounted, with a thunderbolt. The Vajrayudha fell from Indra's hand. Seeing the great work done by the worker All the gods were amazed by his prowess. Seeing the calamity that befell him, they cried out in despair. Indu was ashamed that the diamond slipped from his hand and fell to the ground. He was too shy to take it again. Now the worker said this to Indu. Take the Indira diamond. Kill me, you impalable. This is not the time to grieve. Those who desire war will never have victory. I'm sure there have been times. The Supreme Being, according to their respective karmas, enters and rules over the beings. Suffering is caused according to karma. It causes victory and defeat. Therefore, do not be ashamed or grieve because of failure. Victory to the one God, everywhere. He is the one who creates, preserves, and destroys. The all-knowing does not need to act. Therefore, he will always have victory.

The gods, including Brahma, are also subject to the will of the Supreme Being. We live by his command. A bird with a string attached to it. As it is in the control of what is held and held, so it is in this world, in the control of the Lord of all. The ability for all living beings to perform their respective tasks, that is, strength, speed, power, life force, family, and salvation, are all under his control. Without knowing this secret, these people become fools and consider themselves the reason for everything. Female figurine with incised decoration. Just as a beast bound by a spell is subject to the sculptor who made it, so are all beings subject to God. If the living being, nature, the great element, ego, beings, senses, and all such things are not blessed by God, then they are not capable of doing anything in this universe. How can the inanimate nature and such be justified? Even a being with consciousness is not justified in the affairs of the world. The state and tendencies of the entire universe are under his control. The individual is not independent. The other one, its Yerungka considers himself independent. The Lord of all is the creator of all living beings through these earthly elements. Again, he is being pulled into himself. Life, wealth, fame and prosperity. Whatever desires there may be, they are caused by the will of the Lord. Death is also under his control. Poverty, wealth, fame, and disgrace are all his. The power to appoint is also obtained from the Lord of all. These are not something that a living being can wish for or not.

Therefore, one who knows this secret, one who is glorious, one who is dishonored, one who has victory, one who has defeat, one who has happiness and sorrow, one who is alive, even when he is dead, one should not lose heart. Being overwhelmed and being depressed are signs of ignorance. Sattva, Rajas, and Tamas are the three gunas that belong to nature, but not to the self. Those qualities form the body as a result of evolution. The Spirit that is in him witnesses all of them. The individual is bound because he thinks that he himself is performing the actions performed by nature. He will not be bound when he has judged that he is not the doer. O Indra, I have been defeated in battle. You have pierced my side, and my spear as well. But I'm trying to kill you again. War is a gambler, you see. The prize is life. Our four-armed strength is the pawns that we lead. In this, it is not right to know who will win or lose. The one who has God's help will win. You have God's help. You must win, fight the war, thus I encouraged Indra, the demon. And let's find out in the next episode what the feeling was after encouraging. Jai Srimannarayana, salutations to the Asmadgurus