ఋషభదేవుని అవధూత స్థితి & చరితం
Lord Rishabhadeva's State of Avadhuta & His Deeds
ఈ ఎపిసోడ్‌లో, భగవాన్ ఋషభదేవుని అద్భుతమైన అవధూత స్థితిని వివరిస్తున్నాము — ఆయన రాజమర్యాదలన్నింటినీ త్యజించి, దేహాభిమానం లేకుండా ముక్తులైన మహాయోగిలా భూమిపై సంచరించారు. సమస్త సామాజిక నియమాలను అతిక్రమించి, ఆయన లభించినది తిని, నేలపై పడుకుని, ఆత్మానందంలో నిమగ్నమై జీవించారు. ఆయన అసాధారణ చరితం మరియు ఆచరణ, వైరాగ్యం మరియు ఆత్మజ్ఞానం పై శాశ్వతమైన బోధగా నిలిచి, మోక్షమార్గంలో ఉన్న సాధకులందరికీ స్ఫూర్తిని అందిస్తుంది.
In this episode, we explore the profound Avadhuta state of Lord Rishabhadeva, who renounced all royal dignity and wandered the earth like a liberated sage, completely indifferent to the body and the world. Moving beyond all social norms, He behaved like an aimless wanderer — eating whatever came His way, lying on the ground, and remaining absorbed in the bliss of the Self at all times. His extraordinary deeds and conduct serve as a timeless teaching on the highest state of detachment and self-realization, inspiring seekers on the path of liberation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః ప్రమాణ మూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః ప్రత్యక్షాది ప్రమాణములకు మూలమునందుండే సాక్షి చైతన్యము నీవే సర్వజ్ఞుడవగు నీవే వేదకర్తవు వేద ప్రతిపాద్యుడవు రామాద్యవతారములలో ప్రవృత్తి దక్షిణమూర్తాద్యవతారములలో నివృత్తి నీ స్వరూపమై. వేద రూపుడవగు నీకు అనేక నమస్కారములు. 10th క్యాంటో, 16th చాప్టర్, 44th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము. ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్త చరిత్రలో భాగంగా వృషభ దేవుడి యొక్క చరిత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు భరత ఉపాఖ్యానాన్ని అనుభవిద్దాం. మహా భాగవతుడగు భరతుడు వృషభదేవునిచే భూమండలమును పాలించుటకు నియమింపబడి తండ్రి ఆజ్ఞ ప్రకారము విశ్వరూపుని కుమార్తెయగు పంచజని అనే కన్యను వివాహమాడెను. ఆమె యందు తనకు కలిగిన ఐదుగురు కుమారులు భూతాది అను అహంకారము నుండి భూత సూక్ష్మములగు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, తన్మాత్రలు బయలుబడినట్లు జనియించిరి. సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతు అని ఐదుగురి నామధేయములు. వృషభుడు పరిపాలించినది మొదలు ఇంతవరకు అజనాభమని పిలువబడుచున్న వర్షము భారత వర్షమని భరతుని పేరుతో వ్యవహరింపబడెను. అతడు అనేక విషయములను ఎరింగినాడు. తండ్రి తాతల వలె ప్రజలయందు వాత్సల్యము గలవాడై తమ తమ ధర్మములను తాము పాలించునట్లు ప్రజలనందరును నడుపుచు తన ధర్మమును తాను పాలించుచు రాజ్యము చేయసాగెను. యజ్ఞ స్వరూపుడు, క్రతుస్వరూపుడగు భగవానుడు వాసుదేవుని యజ్ఞములచే అతడు ఆరాధించుండెను. యజ్ఞమునకు చాతుర్హోత్రమని పేరు. ప్రధాన యాగమునకు ముందు చేయవలసిన ప్రాతఃశ్రవనము మొదలగు మూడు శ్రవనములను ఆచరించి
యాగములను చేయుచుండెను. యజ్ఞము కర్మ కనుక కొద్దిసేపు ఉండి నశించెడిది అయినను ఆ యజ్ఞములచే ఆరాధింపబడిన భగవదనుగ్రహమే ఫలమును సొంగునని. విశ్వసించిన వాడై ఇంద్రాది దేవతాంతర్యామిగా ఉన్న భగవదారాధనగా అతడు యజ్ఞములను చేయుచుండెను. పరమ పురుషుని అవయవ భూతులుగా ఉండెడి ఆయా దేవతలకు ఆరాధన చేయుచు వారి ద్వారా భగవానుని ఆరాధించుచున్నానని. శ్రద్ధతో ఆరాధనము చేయుచుండెను. అట్టి యజ్ఞములలో అగ్నిహోత్రము, ధర్మపూర్ణ మాసము, చాతుర్మాస్యము, పశుయాగములు, సోమయాగములు కూడా అతడు ఆచరించెను. ఇట్లు యజ్ఞములను ఆచరించుచు ఆరాధింపబడిడివాడు ఇంద్రాది దేవతా శరీరకుడు వాసుదేవుడై అని భావించుచున్నవాడై తమలో అంతర్యామిగానున్న పరమాత్మయే యజ్ఞము చేసెడివాడని భావించుచు కర్మ సంబంధం అంటకుండా అతి నిపుణతతో యజ్ఞములను ఆచరించెను. అద్ధర్యువు మొదలగు వారు హవిస్సులను ఆయా మంత్రములతో గ్రహించినప్పుడు ఆ యజ్ఞములో భాగ ప్రతిగ్రహము చేయు దేవతలను పరమ పురుషుని శరీరావయములుగా భావించి సమర్పించుచుండెను. ఈ విధముగా పరిశుద్ధమగు కర్మాచరణముచే అతని అంతఃకరణము పవిత్రమయ్యెను. అంతఃకరణం పరిశుద్ధము కాగానే తీవ్రమగు భక్తి జనీయించెను. హృదయ పుండరీకమునందు ఉండెడి దహరాకాశమనెడి పరబ్రహ్మమునందు అతడు మనసును నిలిపి యాగము చేయుచుండెను. ఇట్లు వాసుదేవుడే యజ్ఞములచే ఆరాధింపబడుచున్నాడని భావించి. భక్తుల హృదయములో నిశ్చలముగా సన్నిధానము చేసి ఉండెడి భగవాను రూపము అనుసంధానము చేసుకొనుచుండెను. శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల, శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములతో కూడిన రూపమును భావించి ధ్యానించుచుండుటచే తీవ్రమగు భక్తి కలిగెను. ఇట్లు కొన్ని వేల సంవత్సరములు వరకు కర్మలను ఆచరించి ఆ కర్మలు ఫలపర్యవసానము. అందు సమయమున తాను అనుభవించుచున్న తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్యము తన కుమారులకిచ్చి తాను సకల సంపదలతో తులతూవుచుండెడి తన భవనమును వీడి పులహాశ్రమమునకేయును.
ఆ పులహాశ్రమమునందు భగవానుడవు శ్రీహరి ఇప్పటికిని తన భక్తుల యెడ వాత్సల్యముచే ఒక రూపమును దర్శించి దర్శనం వసంగుచునునని పెద్దలు చెప్పుదురు. ఆ ఆశ్రమ సమీపములో చక్రములతో కూడిన శిలలు అనగా శాలగ్రామములు అధికముగా ఉండెడి చక్ర నది అను నది ఆశ్రమమునంతను. పవిత్రము చేయుచు ప్రవహించుచుండెను. ఆ ఆశ్రమమునందు ఎవరును తోడులేక ఒక్కడే పూలను, పళ్ళను కోసి తెచ్చి భగవానునకు ఆరాధనము చేయుచుండెను. భగవానులకు నివేదించిన ఫలములను కంద మూలములను ఆహారముగా స్వీకరించుచుండెను. అందుచే విషయాభిలాష పూర్తిగా తొలగిన వాడాయను. దానిచే ఇంద్రియ నిగ్రహము కలిగెను. సంతతము భగవానునే ధ్యానించుచు పరమ ప్రీతినందుచుండెను. ఎల్లవేళలా భగవంతునికి సేవలు చేయుచు వృద్ధి పొందుచున్న అనురాగముతో మనసు శిథిలమైన వాడై. భగవత్ అనుభవముతో ఆరాధనచే రోమాంచము కలిగి అత్యంత ప్రీతిచే ఆనంద భాష్పములు ప్రవహించి దేనిని చూడలేని వాడై తన స్వామియగు భగవానుని దివ్య చరణారవిందములను తలంచుచు సంతతము దాని చేతనే ఆక్రమింపబడిన మనసు గలవాడై భక్తియందే మునిగి ఉండెను. భగవంతుని సేవించుటకు అనుగుణమగు వేషమును స్వీకరించెను. లేడి చర్మమును వస్త్రముగా దాల్చెను. మూడు కాలముల యందు స్నానము చేయుటచే ఎర్రవారిన తడి కేశములు జడలుగా ఏర్పడి ప్రకాశించుచుండెను. సూర్యుడు ఉదయించు సమయమునకే లేచి ఉండి సూర్యమండల అంతర్వర్తియగు భగవానుని ఆ భగవాను ప్రకాశింపజేయు రుక్కుతో స్తుతించుండెను. సర్వలోకములకు ఉత్పాదకుడకు చేతను సవిత సర్వలోకములను ప్రేణ చేయువాడకు చేతను సవిత అనబడును. ఆ విష్ణువు యొక్క తేజోమయముగు రూపమును శరణముగా తలంచుకొనుచున్నాను. ఈ విధంగా తను స్తుతిస్తుండేవాడు. ఈ ప్రకృతి మండలము కంటే పరమైన లోకమునందు నివసించుచున్న ఆ దేవుని ధ్యానించుచున్నాను. అట్టి దేవుని యొక్క తేజస్సును ధ్యానించుచున్నాను.
ఆ దేవుడు తన సంకల్ప రూప జ్ఞానముచే ఈ జగత్తును సృష్టించును, సృష్టించిన జగత్తును తన శక్తి వలె తనతో వేరు చేసి చూప వీలుగాని జీవుని ద్వారా ప్రవేశించి తన సంకల్ప రూప జ్ఞానముచే. శరీరేంద్రియములను ప్రేరణ చేయుచు జ్ఞాన రూపముగా వ్యాపించి ఉన్నాడు. అట్టి విష్ణువే హంస అనబడును. ఆ హంస శరీరమునందే వ్యాపించియుండు శబ్దాది విషయములను కోరు వారిని క్లేశముల పాలు చేయును. బుద్ధి వృత్తుల చేతనే కర్మ ఫలములను జీవుడు అనుభవించుచుండును. అట్టి బుద్ధి వృత్తులను ప్రేరణ చేయు హంసను మేము ధ్యానము చేయుచుందుము. ఇట్లు గాయత్రీ మంత్రం యొక్క అర్థము కలిగిన ఒక రుక్కుతో నిత్యము సూర్యమండలాత్ వర్తి అగు భగవాన్ని భారతుడు ఉపాసించుచుండును. ఆ భరతుడు ఒకనాడు చక్రనదిలో స్నానం చేసి నిత్యము ఆచరించడి ప్రణవ జపము చేయుచు నదీ తీరమందు మూడు ముహూర్తముల కాలము కూర్చొని ఉండెను. అదే సమయమున ఒక ఆడు లేడి దాహముచే ఒంటరిగా నీరు త్రాగుటకు ఆ నదికి వచ్చెను. ఆ లేడి నీరు త్రాగుచుండగా దగ్గరలో ఒక సింహము లోక భయంకరముగా గర్జించెను. ఆ గర్జన విని ఆడులేడి బెదిరినదై హృదయము కలత చెంది చూపులు బెదిరుచుండగా దాహము తీరినదై ఉండియు ఆ నదిని దాటిపోవలెనని ఎగిరెను. అట్లు ఎగిరిన ఆడలేడి పూర్ణ గర్భిణి అయి ఉండెను. తీవ్రమగు భయముచే గర్భము చలించి బయటపడగా ప్రవాహములో పడెను. భయము చేత ఎగిరిన శ్రమ చేత కలిగిన బాధచే పరిగెత్తి పోయి పోయి లేడి ఒక పొద వద్ద పడి మరణించెను. ప్రవాహములో పడిన ఆ లేడి పిల్ల కొట్టుకొని పోవుచుండెను. భరతుని కంటపడెను. తల్లి చనిపోయినది. మరియొక లేడి ఏదియు దగ్గర లేదు. తాను వదిలిన చనిపోవునని జాలిచే నదిలో దిగి తన చేతిలో ఆ పిల్లను ఎత్తి ఆశ్రమం చేర్చెను. ఆ లేడి పిల్ల యందు భరతునకు మమకారం ఏర్పడెను. ప్రతినిత్యము దానికి ఆహారము పెట్టి పోషించుచుండెను.
పెద్ద పులులు మొదలగు క్రూర మృగమును హింసింపకుండా కాపాడుచుండెను. చేతితో తాకుచు ముద్దు పెట్టుకొనుచు లాలించుచుండెను. లేడిపై ఆసక్తి పెరిగెను. భగవత్ సేవకు అంతరాయం ఏర్పడెను. శౌచము, ఆచారము మొదలగు విషయములు, అహింస మొదలగు యమములు అన్నియు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిపోవుచుండెను. సంతతము లేడి పిల్లను కూర్చే ఆలోచన సాగుచుండెను. ఆ లేడి పిల్ల దైవవశముచే తన తల్లి నుండి మంద నుండి దూరమై నన్ను చేరినది. నేనే రక్షకుడనని అనుకొనుచున్నది. నన్నే తల్లిగా తండ్రిగా చూచుకొనుచున్నది. ఏ పాద ఆ పాద కలిగినను మంద వైపు పరుగులిడక నన్ను ఆశ్రయించుచున్నది. నన్ను ఎంతో నమ్మినది. దీని పోషణ, పాలన, లాలన నేనే చేయవలెను. తానే దిక్కు అని నమ్మిన వారిని వదులుట దోషము కదా? సత్పురుషులు పూజ్యులకు పెద్దలు ఇంద్రియ నిగ్రహము గలవారులు దీనులపై ప్రేమ గలవారులై వారి కొరకు తమ ధర్మములను వదులుట కూడా తప్పుగా భావింపరు. ఇట్లు తలంచి తాను అడవికి దర్భలకు, పువ్వులకు, సమిధలకు, ఆకులకు, కందకు, దుంపలకు నీటికి ఏగునప్పుడు కూడా తన వెంట దానిని కూడా తీసుకొని పోవుచుండెను. ఆశ్రమములో ఒంటరిగా వదిలినచో తోడేళ్ళు ఆ పిల్లను కబళించునేమో అని భయపడుచుండెను. ఇట్లు ఆ లేడి యందే మనసు పెట్టుకొని ప్రేమతో తన వెంట వచ్చుచున్నప్పుడు అది ఆగిన నడవలేక ఆగినదని భావించి జాలితో భుజముపై ఎత్తుకొనును. కూర్చున్నప్పుడు తన ఒడిలో కూర్చుండబెట్టుకొనును. పరుండినప్పుడు తన గుండెలపై పరుండబెట్టుకొని లాలించును. అట్లు దానిని లాలించుటలో ఎంతో ఆనందము పొందుచుండెను. సంధ్యావందనము దేవతారాధనము చేయుచు కూడా. మధ్యలో మధ్యలో లేచి ఆ లేడి వైపే చూచుచుండెను. ఆ లేడి సుఖముగా ఉండవలెనని ఎల్లప్పుడూ కోరుచుండెను.
లేడి కొంచెము సేపు కనపడకపోయినా మనసు చెడిన వాడగును. ధనము పోయిన వాని వలె దైన్యముతో, జాలితో, ఆరాటముతో బాధపడుచుండెను. కొంతసేపు కనపడకపోగానే దానిని గూర్చి రకరకముల ఆలోచనలు చేయుచుండెను. అయ్యో ఈ దీనమైన లేడి పిల్ల నన్ను నమ్మి ఉన్నది. నేను దానిని వదిలి హాయిగా ఉన్నాను. నేను పాపాత్ముడను. నేను మంచి వాడననుకొని విశ్వసించినది. మరల తిరిగి వచ్చి ఈ ఆశ్రమ ప్రాంతమునందలి ఉద్యానవనములో హాయిగా గడ్డి మేయుచు నా కంట పడునా? ఏ తోడేలైనను, ఏ క్రూర మొఖమైనను దీన్ని భక్షింపలేదు కదా? సకల జగత్తుకు క్షేమమును కలిగించు సూర్య భగవానుడు అస్తమించబోవుచున్నాడు. సూర్యాస్తమయము కాక మునుపు చీకటి పడక ముందే నా లేడి తిరిగి వచ్చునా? దురదృష్టవంతుడను. దీనిని చూచి ఆనందించు అదృష్టం ఉన్నదో లేదో. దీని ఆటలు మనసును ఎంత ఆనందముగా ఉండును. అది ఒక్కొక్కప్పుడు ఆడుకొనుచు కోపం వచ్చినట్లు దూరముగా వెళ్లి కన్నులు మూసుకొని కూర్చుండును. ఒకసారి తన కొమ్ముతో నన్ను రాసి ప్రేమతో చేరును. ఎప్పుడైనను దర్భలపై ఉంచిన హవిస్సును తాను ముట్టెతో లాగినచో నేను కేక వేసినచో భయపడి అటు మాని భయపడుచు కూర్చుండును. ఈ భూమి ఎంత తపస్సు చేసినదో మా లేడి తన సుందరము గిట్టలతో నేలపై గుర్తులను ఏర్పరిచినది. దాని గిట్టల గుర్తులే దీనికి ధనం వలె ఉండును. ఈ భూమినంతను తన గిట్టలచే అలంకరించి ఈ ప్రదేశము యజ్ఞయాగాదులు చేయుటకు తగినదని నిరూపించును. ఇంతలో చీకటి పడి చంద్రుడు ఉదయించిన ఆ చంద్రునిలో లేడిని చూచి అదిగో లేడి మా ఆశ్రమం నుండి తప్పిపోయి చంద్రుని చేరినది. దీనిపై జాలిగల చంద్రుడు దీనిని చేరదీసి కాపాడుచున్నాడు. చంద్ర కిరణములు తమకు చల్లగా తగిలినప్పుడు లేడి దూరమగుటచే నా హృదయ పద్మము వేడి ఎక్కిపోయి వెదపడుచున్నదని ఆ లేడియే తన పుక్కిలి పట్టిన నీటిని నాపై ఉమ్మి వేయుచున్నట్లున్నది. ఈ విధముగా పొందిక లేని ఆలోచనలో మనసు చెదిరి లేడిపిల్ల రూపములో వచ్చి చేరిన తన ప్రారబ్ధ కర్మచే తన యోగ సాధన నుండి భ్రష్టుడై.
యోగము నుండి, తపస్సు నుండి, భగవత్ ఆరాధన నుండి భ్రష్టుడాయను. ప్రారబ్ధ కర్మయే కాకపోయినచో తన జాతి గాని మృగశిశువుపై ఇంత ప్రేమ ఎందుకు కలుగును? ముక్తికి విరోధులని తన వారసులను బిడ్డలను వదిలిన వానికి ఈ మృగ శిశువునందు ఈ వదలరాని మమకారం ఏమి? ఆ బాల్య మృగమును పోషించుటలో తన శరీర పోషణము కూడా మరిచినాడు. ఎంతటి ప్రారబ్ధము. ఇట్లు ఇతడు ఎచ్చటికో పోయిన లేడికై తీవ్రమగు బాధపడుచు తపస్సును ధ్యానమును కూడా మాని దానినే ధ్యానించుండగా తీవ్రమగు వేగముతో మృత్యువు ఎలక ఖన్నములోనికి పాము పోయినట్లు భరతునిలో చేరెను. మృత్యువు ఆసన్నమాయెను. మరణ సమయములో కూడా పక్కన తన లేడి ఉన్నట్లు ఆ లేడినే తలంచుచు శరీరము వీడెను. దేనిని స్మరించుచు శరీరము వదిలిన మరల జన్మ ఆ శరీరముతోనే లభించును. కావున మృగ మృగమును స్మరించుచు చనిపోయిన భరతుడు మృగముగా పుట్టెను. తర్వాత భాగాన్ని మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the original source, the poet, the teacher, the originator, the destroyer, the cessation, the syllable. Salutations to you, the witness consciousness at the root of the direct and other proofs. You are the all-knowing, you are the author of the Vedas, the Veda You are the presiding deity, in the incarnations of Rama, the tendency is in the incarnations of Dakshinamurthy, the cessation is in your form. Salutations to you, who are the embodiment of the Vedas. 10th Canto, 16th Chapter, 44th Prayer. Oh, devotees of the Lord, the fifth book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode eight. Until now, as part of the history of Priyavrata, we have completed the history of Vrishabha Deva. Now, let's experience the Bharata Upakhyan. Bharata, the great devotee, was appointed by Vrishabhadeva to rule the earth, and according to his father's command, he married Panchajani, the daughter of Vishwaroopa. She gave birth to five sons who were born from the ego of being from the earth and other elements, and who were born as if the subtle sounds, touches, forms, tastes, smells, and elements of the earth and other elements were revealed. Sumati, the royal historian, Sudarshanudu, Aavaranudu, Dhoomrakethu, these are the five names. From the time Vrishabha ruled until now, the rain that is called Ajanabha, the Indian rain, was known by the name of Bharata. He had learned many things. Like father and grandfather, being affectionate to the people, and leading all the people in the way that they should follow their own dharma, and leading his own dharma, he began to rule the kingdom. The form of Yajna, the form of Kratu, the Lord, Vasudeva, he was worshiping through the Yajnas. The Yajna is called chatur-hotra. Perform the three Shravanas, which are to be done before the main Yagam, starting with the morning Shravana
He was performing a yagna. Because the sacrifice is an action, even if it is short-lived and perishes, the grace of God that is worshiped through those sacrifices is the fruit and the wealth. He was a believer, and as the lord of Indra and other gods, he performed yagnas (sacrifices) as a devotee of the Lord. I am worshiping those deities who are the limbs of the Supreme Being, and through them, I am worshiping the Lord. Was carefully adored. In such yagnas, he also performed Agnihotra, Dharmapurna Masam, Chaturmasyam, Pashuyagamulu, and Soma Yagamulu. Thus, the one who performs sacrifices and is worshiped, the one who is the embodiment of Indra and other deities, considering him as Vasudeva, the Supreme Soul who is within them, considering that he performs the sacrifice, without any connection to karma, with great skill, the sacrifices He practiced. When the elders and others accepted the offerings with their respective mantras, they considered the deities who were part of that sacrifice as the body and breath of the Supreme Being and offered them. In this way, by the holy conduct of his actions, his inner self became holy. Consciousness As soon as it was holy, intense devotion was attained. In the lotus-like heart, in the supreme Brahman called the radiant sky, he was keeping his mind and performing the Yagam. Thus, Vasudeva is worshipped through yagnas (sacrifices), it is believed. The form of the Lord, who is steadfastly present in the hearts of devotees, was being connected. Thinking of the form consisting of the Srivatsa, Kaustubha, Vanamala, conch, discus, mace, etc., and meditating on it, intense devotion arose. Thus, for thousands of years, performing actions, those actions bear fruit. And at that time, he, experiencing the kingdom that came from his father and grandfather, gave it to his sons, and he left his palace, which was full of all riches, and went to Pulahashrama.
In that hermitage, you are the Lord, Srihari. Even now, due to his affection for his devotees, the elders say that he will appear in a form and grant a vision. Near that ashram, there are rocks with chakras, that is, Shalagramas, and the Chakra River is abundant throughout the ashram. The consecration was proceeding. In that ashram, without anyone to accompany him, he alone would pluck flowers and fruits and bring them to worship the Lord. He was accepting the fruits offered to the Lord and the roots as food. Therefore, I have completely removed the desire for worldly matters. Through it, control over the senses was achieved. He was constantly meditating on the Lord and was very pleased. Always serving God, growing, with affection, the mind became dilapidated. With the experience of God, having the thrill of worship, with utmost love, tears of joy flow, and being unable to see anything, remembering the divine lotus feet of his Lord, the Lord, constantly, being one with the mind occupied by it, only in devotion It was submerged. Suitable for serving God He assumed the role. She wore a dress made of leather. By bathing in the three periods, the red-colored wet hairs formed into braids and shone. Having risen at the time of sunrise, he was praising the Lord, who is the inner light of the solar system, with the light of that Lord. He is called Savita to the creator of all the worlds and Savita to the one who breathes all the worlds. I am taking refuge in the radiant form of that Vishnu. In this way, he used to praise. I am meditating on that God who lives in a world beyond this natural realm. I meditate on the glory of the Lord.
That God creates this world through his form of will knowledge, and enters through a being that cannot separate the created world from himself like his power, through his form of will knowledge. He is inspiring the body and mind, spreading as knowledge. Such a Vishnu is called a Hamsa. That swan, pervading within the body, causes those who desire sound and other things to be subjected to suffering. The soul experiences the fruits of karma only through its intellectual activities. We meditate on the swan that inspires such intellectual pursuits. Thus, with a rope that has the meaning of the Gayatri mantra, Bharata worships the Lord who always shines in the solar system. That Bharata, one day, after bathing in the Chakranadi, was practicing the chanting of the Pranava, sitting on the banks of the river for three moments. At the same time, a girl came to the river to drink water alone because of thirst. While the deer was drinking water, a lion roared terribly nearby. Hearing that roar, the deer, frightened, felt a disturbance in its heart With eyes full of wonder, and with thirst quenched, he jumped to cross the river. The female that flew was pregnant. Due to intense fear, the womb shook and came out, falling into the stream. The deer, driven by fear and suffering from hardship, ran and fell near a bush and died. The deer fawn that fell into the stream was being swept away. Bharata is spotted. Mother's dead. There ain't a skunk near me. He, feeling pity that she would die, went down into the river where she had left him, lifted the child in his hand, and took her to the ashram. Bharata developed affection for that lady child. Every day, he was feeding and nurturing it.
He protected the large tigers and other wild animals from being harmed. She was caressing, touching, and kissing with her hands. The lady's eye. The Lord's service was interrupted. Cleanliness, rituals, and other matters, and the yamas like non-violence, all were decreasing one by one. The idea of raising a lamb continuously was going on. That lamb, by divine will, separated from its mother and from the flock, reached me. I think I am the saviour. She is considering me as her mother and father. Whatever foot, whatever foot it may be, without running towards the herd, it is taking refuge in me. She believed in me. I alone will do its nourishment, governance, and care. Isn't it a sin to abandon those whom one believes to be their own? The virtuous, the venerable, the elders, those who control their senses, those who love the humble, and those who give up their dharmas for them, do not consider it wrong. Thus, thinking thus, when he went to the forest, to the forests, to the flowers, to the fuel, to the leaves, to the tubers, to the roots, to the water, he would also take it with him. She was afraid that the wolves might abduct the child if she was left alone in the ashram. Thus, when the deer, with its mind fixed on us, comes along with us with love, it stops, unable to walk, and feeling that it has stopped, it lovingly lifts it onto its shoulder. When sitting, he would make her sit on his lap. When he lies down, he spreads himself out on his heart. Thus, in cherishing it, he was experiencing immense joy. Even while performing Sandhyavandanam and Devaataranam. In between, he got up and kept looking at the deer. She always wished to be happy.
Even if a lady is not seen for a while, the heart will be ruined. Like a poor man who lost his wealth, he was suffering with misery, anxiety, and longing. For some time, as it disappeared, various thoughts were going through his mind. Oh, this poor little deer believes me. I'm perfectly fine with not having it. I'm a poor, miserable sinner. I have faith in what I consider good art. Having returned again, is it pleasant to me to graze happily in the garden in this ashram area? Which wolf, which cruel face, has not devoured this, has not eaten this? The Sun God, who brings well-being to the entire world, is about to set. Before sunset, before darkness falls, will my deer return? I am unfortunate. Seeing this, I am happy, whether there is luck or not. Its games are so joyful to the mind. Sometimes, while playing, as if angry, he would go far away, close his eyes, and sit. Once, with his horns, he will write me and reach me with love. Whenever I put the oblation on the darbha grass and pull it with my hand, if I shout, it is frightening He sits there, scared. How much penance this earth has done, our deer has made marks on the ground with its beautiful hooves. Its marks are like its wealth. He decorated the entire land with his own hands and proved that this place is suitable for performing yagnyas and yagadis. Meanwhile, it got dark, and seeing the deer in the moon that had risen, behold, the deer escaped from our hermitage and reached the moon. The compassionate moon is taking care of it. When the moonlight touches them coolly, the deer moves away, and my heart's lotus blooms and withers, as if that deer is spitting the water it has drunk on me. Having attained in this way, in a thought that is not coherent, the mind is scattered, and having come and joined in the form of a lamb, due to his past karma, he is ruined from his yoga practice.
He is depraved by yoga, austerity, and the worship of God. If it is not due to past karma, then why does one have so much love for a calf or a lamb? What is this unyielding affection for this animal child to the one who abandoned his heirs and children, who are against salvation? In nurturing the young animal, he also forgot his own body's nourishment. What a fate. Thus, as he was intensely suffering from the deer that had gone far away, he abandoned penance and meditation, and while he was meditating on it, death entered Bharata with great speed, like a snake entering a lap. The end. Even at the time of death, he remembered his lamb, as if it were beside him, and gave up his body. Remembering what, the body is left behind, the next birth is obtained with that body. Therefore, Bharata, who died remembering the animal, was born as an animal. We will learn about the next part in the next episode. Jai Srimannarayana. Salutations to the Asmadgurus