అధోలోక వర్ణన - పాతాళ లోకం & శేషనాగు (భాగం 2)
Subterranean Realms — Patala & Shesha Naga (Part 2)
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో వర్ణించబడిన అధోలోకాల గురించిన మన అన్వేషణను ఈ ఎపిసోడ్లో కొనసాగిస్తున్నాము, పాతాళ లోకాల వైభవాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటాము. రత్నాలతోను, మణిమయ భవనాలతోను అలంకరించబడిన ఈ అధోలోకాలు సైతం భగవంతుని సృష్టి వైభవాన్ని ప్రతిబింబిస్తాయని భాగవతం మనకు తెలియజేస్తుంది. అనంతరం, సమస్త లోకాలను తన వేలాది పడగలపై భరిస్తూ, శ్రీమహావిష్ణువుపై అపరిమితమైన భక్తిని కలిగి ఉన్న శేషనాగుని అద్భుతమైన మహిమను శ్రద్ధగా చర్చిస్తాము.
In this episode of our Srimad Bhagavatham podcast, we continue exploring the awe-inspiring subterranean worlds described in Canto 5, delving deeper into the glorious realms of Patala and their divine inhabitants. The text paints a vivid picture of these lower worlds adorned with jewels, palaces, and celestial pleasures, revealing that even regions beneath the earth reflect the boundless splendor of the Lord's creation. We then turn to the magnificent glorification of Shesha Naga, the infinite serpent who bears all the worlds upon his countless hoods and whose supreme devotion to Lord Vishnu is beyond measure.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నంతాయ బృహతే నమః కృష్ణాయ వేధసే సాంఖ్య యోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే దేశకాల పరిచ్ఛేదము లేని పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణుడే ఆయనయే సృష్టికర్త. సాంఖ్య యోగ కర్మ యోగములను ప్రవర్తిల్ల చేసినది ఆయనయే. ఆయనకు అనేక నమస్కారములు. 10th కాంటో, 85th చాప్టర్, 39th ప్రేయర్. ఒక బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము 27వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం భూగోల వర్ణనము, దీప వర్ణనము. జ్యోతిర్మండల వర్ణనము పూర్తి చేసుకొని అధోలోక వర్ణనములో మూడు లోకాల గురించి తెలుసుకున్నాం. అతలము, వితలము, సుతలము. సుతలములో ఉన్నటువంటి బలి చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని కూడా తెలుసుకున్నాం. తప్పక మనం అందరం వినాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయం దాంట్లో దాగి ఉంది. అది ముందు పాడ్కాస్ట్ లో వినగలరు. ఇప్పుడు మరొక లోకం గురించి తెలుసుకుంటున్నాం. సుతలమునకు క్రిందకు తలాతలము అను లోకమున లోకమును దానవేంద్రుడగు మయుడు పాలకుడై ఉండును. అచటి వారందరు మయుని ఆరాధించుచుందురు. మూడు లోకమును సుఖమును కలిగింపవలెనని కోరి రుద్రుడు త్రిపురమును దహించినాడు. అతని అనుగ్రహముచే మయుడు తలాతలమునకు అధిపతి. అతడు మాయావులకు మంత్రోపదేశము చేయును. రుద్రుడు ఆ మయుని పట్టణమును కాపాడుచుండును. అందుచే భయము లేకుండా హాయుగా ఉండును. దాని క్రింద లోకము మహాతలము. కద్రు బిడ్డలగు సర్పములుండును. ఆ సర్పములకు అనేక శిరస్సులుండును. ఆ సర్పములలో ఒక వర్గము క్రోధవశము అను వర్గము. వాటికి పగ ఎక్కువ.
ఆ వర్గములోని వారే కుహుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేనుడు మొదలగువారు. వారి శరీరము చాలా పెద్దది. నారాయణుని వాహనమగు గరుత్మంతుని వలన భయముతో వారు ఎన్నడును వెలుపలికి రాక తమ భార్యా బిడ్డలతో తలాతలముననే ఉందురు. మహాతలము కింద లోకము రసాతలము. అచట ఫణి నామముతో ప్రసిద్ధి చెందిన నివాత కవచులు, కాలేయులు, హిరణ్యపుర వాసులు మూడు వర్గములుగా ఉందురు. దేవతలకు శత్రువులు. వారు పుట్టుకతో బలము గలవారు. సాహసికులు. చాలా దర్పముతో సంచరించుచుందురు. భగవంతుని సుదర్శనాస్త్రమునకు భయపడి పాములు కన్నములో ఉన్నట్లు ఈ క్రింది లోకములోనే వారుందురు. ఈ ఫణులు అను పేరు గల అసురులు ఇంద్రదూతియగు శరమ అను దేవ శునకముచే ప్రయోగింపబడిన మంత్ర రూపములగు వాక్కులు కారణముగా వారు ఇంద్రునకు భయపడుచుందురు. దాని క్రింద భాగమున పాతాళము ఉండును. అచట నాగములు అను పేరు గల సర్పములు ఉండును. నాగములకు ఒకటే శిరస్సు. సర్పములకు అనేక శిరస్సులు. ఆ నాగలోకమునకు పాలకుడు వాసుకి. శంఖ, కుళిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవదత్త మొదలగునవి నాగములలో ప్రధానమైనవి. వీటికి కోపం ఎక్కువ. వీటిలో కొన్నింటికి 5, 7, 10, 100, 1000 వరకు పడగలుగును. అవి పాతాళంలో ఉన్న చీకటిని తొలగించుచుండును. ఇంతవరకు భూమి క్రిందనున్న లోకములు యొక్క వర్ణనములు వినింపబడినవి. ఈ విధముగా పాతాళమునకు మూల ప్రదేశమునందు క్రింద 30,000 యోజనముల దూరములో భగవదంశతో కూడిన తామస శక్తి అనంతునుడు అను పేరుతో ఉండును. సాత్వత సంహిత ఆ అనంతునే సంకర్షుణుడు అనును. ఈ అనంతుడు జీవులను, జీవుల చే చూడబడే సకల పదార్థములను దగ్గరగా చూడగల శక్తి గలవాడు. అందుచే వాన్ని సంకర్షణుడు అందురు. అదే అహం నేను అనబడే జీవుడు.
జీవ మార్గమునకు అభిమాని దేవత సంకర్షణుడు. ఆ భగవానుడగు అనంతుని యొక్క వెయ్యి శిరస్సులలో ఒక శిరస్సుచే ఈ భూమండలమంతయు ధరింపబడెను. అది ఒక ఆవగింజ వలె కనపడుచుండును. దానిచే అనంతుని శిరస్సు ఎంత విశాలమైనదో తెలియును. రెండు పదార్థములు కాలము పూర్తి కాగానే ఈ జగత్తునంతను సంహరింపవలెను అను సంకల్పము కలిగిన నాడు సంకర్షునకు కోపము కలుగును. ఆ కోపముచే కనుబొమ్మలు ముడిపడి ఆ బొమ్మముడి మధ్య నుండి సాంకర్షణులు అనబడి 11 రుద్రులు బయలు వెడలుదురు. ఆ రుద్రులు మూడు కన్నులు గలవారై త్రిశూలమును చేతబట్టిన వారై ఆవిర్భవింతురు. నాగరాజులు సాత్వత భోగదనుగ్రహమి అని ఆనందించుచుందురు. కావునని వారి భక్తులతో కూడా ఆ సంకర్షుని పాద పద్మ ద్వంద్వము ఆరాధించుచుందురు. వారికి సంకర్షణి పాదముల యందే అవ్యభిచరితమైన భక్తి ఉండును. భక్తితో వారు నమస్కరించునప్పుడు సంకర్షణి పాదముల యొక్క గోళ్ళ యందు ప్రతిభింబించిన వారి కుండలములు. ఒక్క కాంతులు చెక్కిళ్ళపై బడి వారి ముఖములు అందముగా ప్రకాశించుచుండును. నాగరాజ కుమారికలు కోరికలతో సంకర్షుని పాదములు సేవించుచుందురు. ఆ సంకర్షుని సుందరములగు భుజకీర్తులతో కంకణములతో ప్రకాశించుచున్న విశాలములు సుందరములు కోమలములు అయిగు బాహువులకు వారు అగరు. కుంకుమ చందన పంకములను పూయచొందురు. వారు వారి బాహులకు వారు అగరు, కుంకుమ, చందన, పంకములను పూయచొందురు. అతని స్పృశించుటచే వారిలో కామము ఆవేశించును. దానితో లలితముగు మందహాసము చేయుచున్న వారలై ఆ సంకర్షుని అనురాగముతో మదముతో తిరుగుడు పడుచున్న ఎర్రనైన కరుణాపూరితములగు చూపులను ముఖమును సిగ్గుతో దర్శించుచుందురు. ఈ సంకర్షణుడు అను పేరు గల అనంతుడు దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనివాడు. అనంత కళ్యాణ గుణములు కలవాడు. జగత్ కారణమైనవాడు. అతడు తన తేజస్సుచే జగత్ సంహార సమయంలో కలిగిన కోప వేగమును ఉపశమింపచేసుకొని లోకక్షేమునకై.
సంకల్పించుచుండును. దేవతా గణములు అతనిని ధ్యానించుచుందురు. తనను తాను అనుభవించుచుండుటచే మదించి ఆ మదముచే కనులు పారవశ్యముతో ఉండును. సుందరమగు భావగర్భమగు తన మాటలతో తన చుట్టూనున్న దేవతలను అతడు ఆనందింపజేయుచుండును. అతడు వక్షస్థలమున ధరించిన నవ తులసి మాల యొక్క పరిమళమును మకరందమును ఆస్వాదించు తుమ్మలు మధురమగు గానము చేయుచొందును. అట్టి వైజయంతి అనడి వనమాలను దాల్చి నల్లని వస్త్రములను దాల్చి ఒకే ఒక కుండలమును దాల్చిన వాడై ఉండును. తన సుందరమగు భుజముపై నాగలిని ధరించి ఉండును. ఇంద్రుని ఐరావతం వలె అతడు ప్రకాశించుచుండును. ఈ సంకర్షణుడే కృష్ణావతారమున బలరాముడిగా అవతరించినాడు. ఇతడు శేషాంశ సంభూతుడు. భగవానుడగు అనంతుని ధ్యానించు ముముక్షువులకు అనాది కాల కర్మ వాసనలతో నిండిన అవిద్యామయమగు హృదయ గ్రంథి ప్రదిలిపోవును. ఆ సంకర్షణి ధ్యానించిన వారికి హృదయములోని సత్వరజస్తమో గుణముల ప్రభావము తగ్గును. బ్రహ్మ పుత్రుడగు నారద భగవానుడు తుంబురునితో కలిసి బ్రహ్మ సభలో ఇట్లు కీర్తించెను. సర్వ జగత్తుకు ఉత్పత్తి స్థితి లయములకు కారణమైన ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణములే. కానీ అవి తమంత తాము సృష్ట్యాది కార్యములు చేయజాలనివి. గుణత్రయాత్మకమగు ప్రకృతి భగవాను సంకల్పము చేతనే సృష్టి, స్థితి, లయములకు చేయుటకు సమర్థమగును. ప్రకృతికి సృష్టికి ముందు దేవాది నామరూప విభాగములు లేవు. నిత్యము అవిభక్తము ఉన్న ప్రకృతి యందు భగవానుని సంకల్పముచే నామరూప విభాగము ఏర్పడెను. అట్టి భగవానుడే సంకర్షణుడు. ఈ రూపమున ఎవడు ఎట్లుండునని చెప్పగలడు? పరమ పురుషునకు ప్రకృతి పురుషులు శరీరముగా ఉందురు. ప్రకృతి పురుషులలో కలిగెడి దేవాది విభాగము సృష్టికి ముందు ఉండదు.
పరమ పురుషుడే తనతో ఏకమై ఉన్న ప్రకృతి పురుషులను వేరు చేసి కలిపి తన సంకల్పముచే వేరు వేరు నామ రూపములతో ఉండునట్లు చేయును. తరువాత తానే జీవునితో ప్రకృతిలో చేరి ఉండి శాసించును. శరీరముగు ప్రకృతి పురుషులలో నానాత్మము ఏర్పడుటచే తాను కూడా నానా రూపుడై ఉన్నట్లు కనపడుచుండును. పురుషుడు ప్రకృతి మార్పుచే మార్పు చెందును. పరమ పురుషుడు పురుషుడు ఈ రెండింటికీ ఆత్మగా ఉండి వాని ద్వారా జగద్రూపము కనపట్టును. కనపట్టుచు మార్పు లేని వాడే ఉండును. సృష్టికి ముందు ఒకటే అనునట్లున్న ఎవ్వరి చేతనో గుర్తించుటకు శక్యము కాని తన రూపముని మనయందు కృపచే ఈ కనపడుచున్న చేతనులు, అచేతనము అని రెండుగానున్న జగత్తుగా భాసింపచేయుచున్నాడు. అతని రూపము రజస్తమో గుణము లేని శుద్ధ సత్వమయమగు దివ్య మంగళ విగ్రహం. అదియే సంకర్షణ మూర్తి. దేవతలకు అందరకు పరదేవతా స్వరూపుడై బ్రహ్మాదులకు కూడా అన్వేషింపదగిన వాడై ఉండు ఆ భగవానుడు జగత్కర్తృత్వం మొదలగు విచిత్రముగు శక్తులు గలవాడై ఉండియు తన వారగు ఈ చేతనుల మనస్సులను తన వైపు ఆకర్షించుట కొరకు దోష రహితమగు కర్మ నిర్మితము గాని రూపమును స్వీకరించును. దానినే భక్తులు సేవించుచుందురు. అట్లు సేవించెడి విధానమును సాత్వతంత్రముగా తానే నిర్మించెను. ఇట్లు పరుడై సృష్టికి ముందున్న సంకర్షణుడే రూపము దాల్చి సులభుడైనాడు. అనంతుడగు సంకర్షణుని నామమును రోగాది బాధలచే పీడింపబడిన నాడు. అనుకొనకుండా గాని పరిహాసమునకు గాని నేలపై బడి గాని పలికినను వినెను వెంటనే సకల పాపములు అంతం అందించును. అట్టి మహానుభావుడగు సంకర్షణ నామము తప్ప వేరొక నామమును ముముక్షువైన వాడు ఆశ్రయింపడు. ఆ అనంతుడే సహస్ర శిరస్సులు కలవాడు. ఒక శిరస్సునందు పర్వతములు, నదులు, సముద్రములతో కూడిన ఈ భూగోళమును ధరించి ఉండును. అతని విక్రమము ఇంత అని చెప్పుటకు ఎవ్వరికినీ సఖ్యము కాదు. వాని కళ్యాణ గుణములు వెయ్యి జిహ్వలు కలవాడైనను కీర్తింప చాలడు. అట్టి అనంతుడు భూమి అడుగున ఉండి తనంత తాను కర్మవశుడు కాక స్వతంతుడై లీలగా భూమిని ధరించుచున్నాడు.
జీవుల కర్మానుసారముగా వారు వారు అనుభవించుటకు తగినట్లు భగవానుడు నిర్మించిన లోకములన్నియు నీకు వివరింపబడినది. సంప్రదాయ క్రమముగా వచ్చుచున్న వాటిని నీకు తెలిపితిని. సంసారులు తమ మనోబుద్ధి ఇంద్రియములతో ప్రవర్తించుచుందురు. దీనికి ఫలముగా అనేక విధములకు సుఖములను దుఃఖములను అనుభవించుందురు అని పరీక్షిత్తు శుకుడు భూవివరణ బ్రహ్మాండ వర్ణనము అంతయు కూడా. చేసి స్పష్టముగా వివరించెను. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Nantaya, who is greater than Nantaya. Salutations to Krishna, the knower of all, the teacher of Sankhya Yoga, the master of Vedas, the supreme soul, the supreme Brahman, the supreme soul, Sri Krishna is the one without the limitations of space and time, the supreme Brahman, the supreme soul. He is the creator. He is the one who performed the Sankhya Yoga and Karma Yoga. Many salutations to him. 10th Kanto, 85th Chapter, 39th Prayer. Dear listeners, welcome to the 27th podcast of Srimad Bhagavata Tatva Deepika Panchama Skandham. So far we have described the geography, described the lamps. Having completed the description of the Jyotirmandala, we learned about the three worlds in the description of Adholoka. Athilam, Vithalam, and Suthalam. We also learned about the story of Bali Chakravarthi, who was in Sutalam. It is hidden in it, a matter that we all must listen to and understand. You can listen to it in the podcast first. Now we're learning about another world. Below the surface, in the world called the head and body, Mayudu, the king of the demons, rules. All those who are there worship Mayuni. Three worlds and happiness Rudra, desiring to unite, burned Tripura. By his grace, Mayudu is the lord of the head and the lord of the feet. He will instruct the magicians. Rudra protects the city of Maya. Therefore, be carefree without fear. Below that is the Mahatala. Snakes are the children of Kadru. The serpents have many heads. One category among the serpents is the category of those who are angry. They have more vengeance than anything.
Those who belong to that group are Kuhu, Takshaka, Kaliyu, Sushena, and others. Their bodies are very big. Fearing Garutmanthu, who is the vehicle of Narayana, they never come out, and they stay with their wives and children on the same level. The earth is below the Mahatala, the netherworld. There, the famous Nivatakavachas, Kalayas, and Hiranyapura residents, who are known by the name of Phani, are divided into three groups. The foe of the gods. They are strong from birth. They are adventurous. They roam around with a lot of pride. Fearing the Sudarshana weapon of God, they are in this world, as if snakes are in a pit. These demons, known as Phanulu, are afraid of Indra because of the mantra-like words used by the dog-like Sharama, who is the messenger of Indra. Underneath it is the underworld. There are snakes called Nagas there. The serpents share one common head. Snakes have many different heads. Vasuki is the manager of the netherworld. Shankha, Kulika, Maha Shankha, Swetha, Dhananjaya, Dhritarashtra, Shankhachuda, Kambala, Ashwatara, Devadatta, etc., among the Nagas Important. They are very angry. Some of these can go as low as 5, 7, 10, 100, 1000. They are removing the darkness from the underworld. Until now, descriptions of the worlds beneath the earth have been heard. In this way, in the original place of the netherworld, at a distance of 30,000 yojanas below, there exists a Tamasic power with divine essence, named Anantunudu. The Sattvat Samhita is said to be Anantuna Sankarshunudu. This Anantudu has the power to see all the beings and all the substances that are seen by the beings closely. Therefore, they are called Sankarshan. That is the ego, the self that is called I.
Sankaracharya is the patron saint of the Jeeva Margam. That Lord Ananta, with one of his thousand heads, this entire earth was sustained. It looks like a mustard seed. It is known how vast Anantu's head is. When two substances have completed their time, when the intention arises to destroy this entire world, then Sankarshana becomes angry. With that anger, the eyebrows are joined, and from between that bindi, the eleven Rudras, who are called Samarshanulu, emerge. Those Rudras, with three eyes, holding the trident, will appear. The Nagas rejoice in the grace of Sattvata Bhoga. Therefore, they also worship that Sankarshana's lotus feet, along with their devotees. They have unwavering devotion only to the feet of Sankarshana. When they bow with devotion, the anklets of those who have reflected on the nails of the feet of Sankarshani. A single light shines on their cheeks, and their faces shine beautifully. Nagaraja Kumarikalu serve the feet of Sankarshuni with their desires. Ah Sankarshuni, with beautiful arms and bracelets shining with bangles, being vast, beautiful, and gentle, they are the ones with broad arms. They apply kumkum and sandalwood paste. They apply agarbatti, kumkum, sandalwood, and panka to their arms. His touch makes them feel lustful. With that, they are laughing mockingly, and with the affection and arrogance of that Sankarshana, they are reveling, and with red, compassionate, and tender glances, they are looking with shyness. This Sankaracharya, whose name is Anantudu, is without space, time, or objects. He is the one with the infinite capacity to perform miracles. The one who caused the world. He, with his radiance, calmed the anger that arose during the destruction of the world, for the welfare of the world.
He is resolved. The groups of gods are meditating on him. Because he is experiencing himself, he is intoxicated, and because of that intoxication, his eyes are filled with ecstasy. With his beautiful and profound words, he delights the gods around him. He who enjoys the fragrance and nectar of the nine-leaf garland worn on his chest, the bees will sing sweetly. He who wears the garland of Vaijayanti, wears black clothes, wears only one earring, and is the one who wears it. He holds a plough on his beautiful shoulder. He shines like Indra's elephant, Airavata. This interaction is the same Krishna incarnation, Balarama, who incarnated. He is a descendant of Seshasamhita. For those who meditate on the infinite Lord, the knot of ignorance, filled with the smells of eternal karma, will be loosened. For those who meditate on that Sankarshana, the effect of the Sattva, Rajas, and Tamas Gunas in their hearts will decrease. Narada, the son of Brahma, along with Tumburu, praised thus in the Brahma Sabha. The nature that is the cause of the production, preservation, and destruction of the entire universe Of the gunpowder element. But they cannot perform their own creation. The three Gunas (qualities) of nature, by the will of God, are capable of creating creation, preservation, and destruction. Before creation, there were no names or forms of the divine. In the undivided nature that is eternal, by the will of the Lord, the division of name and form was established. Such a God is the Sankaracharya. In what form can one say how he is? The Supreme Being is the one who exists as the nature of the Being, and the Being exists as the body. The divine division that is mixed in nature and mankind did not exist before creation.
The Supreme Being separates and unites the nature-beings who are united with Him, and makes them exist with different names and forms by His will. After that, he himself, being with the living being, joins in nature and governs. In the body and in the nature of the individual, due to the formation of various selves, it appears that he too is appearing in various forms. The man changes with the changes of nature. The Supreme Being, being the soul of both man and woman, manifests the form of the world through them. He who is not changed by sight remains. Before creation, by whom it is known that it is one, to recognize his form, which is impossible to be recognized by anyone, he is making the visible creatures, which are two, namely, unconscious, appear as a world. His form is pure, virtuous, and without any Rajas or Tamas qualities, a divine auspicious idol. It is Sankaracharya. That Lord, who is the supreme deity to all the gods, and who is also worthy of being searched for by Brahma and others, being endowed with various powers such as the world-creating power, to attract the minds of these beings who are his subjects to himself, without fault Karmanirmitam Or embodied. Devotees serve it. He himself constructed the method of serving it as a Satvatantram. Thus, the one who was before creation, the one who was in contact, took the form of a simple being. The name of the one who is infinite, the interaction, was afflicted by diseases and other sufferings. Even if you speak without thinking, jokingly, or falling on the ground, it will immediately bring an end to all sins. A seeker should not take refuge in any other name except the name of Sankarshana, who is a great person. The one who has infinite heads is the one with the thousand heads. On one head, this globe, consisting of mountains, rivers, and oceans, is held. No one has the ability to describe his prowess. His virtues are countless, even if he has a thousand tongues, he cannot be praised enough. That infinite being, being at the bottom of the earth, without being bound by karma, is independent and playsfully holds the earth.
According to the karma of living beings, all the worlds created by God are explained to you in a way that suits them to experience. I have informed you of the things that are coming in the traditional order. People live their lives with their mind, intellect, and senses. As a result of this, they experience happiness and sorrow in many ways, as said by Parikshit, Shuka, and the description of the earth, the description of the universe, and all of that. He/She clearly explained it. We will find out the next part in another podcast. Jai Shri Srimannarayana.