భవాటవి వర్ణన - సంసార క్లేశాలు (భాగం 2)
Bhavatavi — Sufferings of Worldly Life (Part 2)
ఈ ఎపిసోడ్లో శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని భవాటవి వర్ణన కొనసాగుతూ, సంసార అరణ్యంలో జీవుడు అనుభవించే అనంతమైన క్లేశాలను శుక మహర్షి మరింత లోతుగా వివరిస్తారు. కుటుంబ బంధాలు, విషయవాసనలు, మరియు అహంకారం జీవుని మాయాపాశంలో ఏవిధంగా締め బంధిస్తాయో ఈ వర్ణన స్పష్టంగా తెలియజేస్తుంది. సంసార దుఃఖాల నుండి విముక్తి పొందాలంటే భగవంతుని శరణు కోరడమే ఏకైక మార్గమని ఈ పవిత్ర ప్రవచనం మనకు బోధిస్తుంది.
In this episode, the Srimad Bhagavatham's fifth canto continues its profound allegory of the forest of worldly existence, known as Bhavatavi, revealing how the conditioned soul wanders in endless suffering through the cycles of birth and death. Sage Shuka elaborates on the torments inflicted by the countless adversities of material life — from the afflictions of family attachments to the relentless pursuit of fleeting pleasures — all of which bind the soul ever deeper in illusion. Through this vivid and compassionate narration, listeners are invited to reflect on the urgency of seeking shelter at the lotus feet of the Supreme Lord as the only true refuge from the miseries of samsara.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినీ నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే పద్మముల మాల గల నీ యొక్క నాభి నుండి పద్మము పుట్టినది నీ కన్నులు పాదములు పద్మములను పోలియుండును నీ పాదములలో పద్మపు గుర్తులు ఉండును. నీకు అనేక నమస్కారములు. టెన్త్ క్యాంటో, ఫిఫ్టీ నైన్త్ చాప్టర్, ట్వంటీ సిక్స్త్ ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము 19వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు పంచమ స్కంధంలో ప్రియవర్తని చరిత్రం పూర్తి చేసుకుని భూగోళ వర్ణనంలో మనము ఇలావర్తంలో ఉండేటువంటి సంకర్షణ యొక్క అంశం అయినటువంటి రుద్రుని యొక్క విషయాన్ని అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అక్కడ ఎలా ఉంటారు ఎలా స్తుతించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు. ఇంకో వర్షంలో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం భద్రాసు వర్షం. భద్రాసు వర్షమునకు భద్రశ్రవుడు అధిపతి. అచట ఉండు ఉపాసకులందరూ సాక్షాత్ భగవానుడగు వాసుదేవుని యొక్క ప్రతిరూపమగు హయగ్రీవుడను నామముతో వివరింపబడు మూర్తిని తమ ధ్యానములో సన్నిధానము చేసుకుని ఈ మంత్రమును ధ్యానింతురు. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః చేతన చేతనులన్నియు తనకంటే వేరు కాకుండా తనకే చెంది ఉండునట్లు శరీరముగా గలవాడును జ్ఞానాది షడ్గుణములు గలవాడును అగు ఆత్మ విశోధనుడగు ధర్మజునకు నమస్కారము. వేదములలో పూర్వ భాగము ఆరాధనా స్వరూపమును, ఉత్తర భాగము ఆరాధ్య స్వరూపమును తెలుపును. అట్టి వేదమును ధర్మమును ప్రవర్తింపచేయువాడు హయగ్రీవుడు. అతడే జీవుని అంతఃకరణమును శుద్ధి చేయును. రజస్తమోగుళము అంటకుండా చేసి ప్రకృతి సంబంధమును తొలగించు బ్రహ్మ ప్రాప్తిని కలిగించును. అతడే ప్రాపకము ప్రాప్యము అయి ఉండును. ఇట్లు మంత్రముతో ధ్యానించి ఇట్లు స్తోత్రము చేయుదురు.
భగవానుని చేష్టితము చాలా విచిత్రమైనది. ఈ జనులు తమను చంపు వానిని గుర్తింపజారరు. ఇది భగవాని మాయా వైభవం. ఈ లోకంలో తండ్రిని కొడుకు దహించి వారు సంపాదించిన ధనముతో తాము బ్రతకవలెను కోరుచుండును. తుచ్ఛములగు విషయములను సుఖముగా సేవించుటకు చేయకూడని కర్మ ఉపాయమని తలంచుండును. ఇది అంతయు మాయా ప్రభావము. మాయ భగవానుని లీల. వేదాంత విద్యను అభ్యసించిన వారు కూడా జ్ఞానులై ఉండియు ఈ విశ్వము నశించునది అని ఎరుంగుదురే కానీ పరిపూర్ణముగా అనుసంధింపజాలరు. దానికి కారణము మాయయే. ఎంతటి వేదాంతులైనను పుత్ర మరణాదులలో శోకము అనుభవించుట చూచుచున్నాము. ఇది భగవంతుని లీల, ఆశ్చర్యము. దీనిని తొలగించుటకై సంసారములందలి ధర్మములతో సంబంధము లేని నిన్ను నమస్కరించుచున్నాను. అనేక భేదములతో కూడిన విచిత్రమగు జగత్తును సృష్టించియు నేను సృష్టించు వాడను కానని నీవే చెప్పుచొందువు. నీవు చేయు సృష్టి మొదలగు కర్మలు నాకు బంధకములు కావు. నీవు అవిద్యచే ఆవరింపబడని వాడవు. నీకు విశ్వమంతయు సమానమే. దానికి నీవు ఆత్మగా ఉందువు కానీ బాహ్యమగు జీవుల కర్మలే వారి సుఖదుఃఖములకు కారణములగును. వానికి తగిన శరీరములను నీవు కల్పింతువు కానీ నీకు పక్షపాతము గాని నిర్దయత్వము గాని లేవు. యుగాంతమునందు తమస్సు రాక్షస రూపముగా వచ్చి వేదములను కనపడకుండా చేసినది. అప్పుడు నీవే పాతాళము నుండి హయగ్రీవుడుగా రూపము దాల్చి వచ్చి వేదములను యాచించిన చతుర్ముఖునకు వసంగితివి. అట్టి అమోఘమగు చేష్టితములు గల నీకు నమస్కారము. ఇప్పుడు హరి వర్షం. హరి వర్షమునందు ఉపాసింపదగిన మూర్తి నరసింహ మూర్తి. ప్రహ్లాదునకు అనుగ్రహమును ప్రదర్శించిన రూపం ఇది. అతనికి ప్రియమైన ఆ రూపమును ఆ వర్షమునందు మహా భాగవతుడగు ప్రహ్లాదుడు అనన్య భక్తితో ఆ వర్షమునందలి ఋషులతో కలిసి ధ్యానించుచుండెను. ప్రహ్లాదుడు దైత్య దానవ వంశములను పవిత్రము చేసిన చరిత్రము కలవాడు. ఆ వర్షమునందు ప్రహ్లాదుడు వర్ష పురుషుని ఈ మంత్రముతో జపించుచు ధ్యానించుచుండును. నమో భగవతే నరసింహాయ నమస్తే తేజసే ఆవిర్భావిర్భవ తమోగ్రస గ్రస ఓం స్వాహా
అభయం అభయం ఆత్మని బోహిష్ట్య ఓం క్షౌం. ఈ మంత్రము జపించుచు ఈ క్రింది విధముగా స్తోత్రము చేయుదురు. మంత్రముకు అర్థం. చేతన చేతనములు అన్నియు తనకే వినియోగపడునట్లు ఉండువాడును జ్ఞానం మొదలగు ఆరు గుణములు గలవాడును అగు నరసింహుడే మాకు శరణము. అతని సేవయే చేయువారల మగుదుము కాక నరహరి సర్వ తేజస్సులను ప్రకాశింపచేయువాడు. తాను ప్రకాశించుటకు వేరొక తేజస్సు యొక్క సహకారం ఆవశ్యకము లేనివాడు. ఓ నరహరి మాకు ఆవిర్భవింపుము ఆవిర్భవింపుము. మా కర్మ వాసనను దహింపుము. దహింపుము. మా కర్మ వాసన చాలా అధికముగా ఉన్నది. దానిని దహించి మాకు అభయమసుంగు వాడవై ప్రకటముగా భాసించుము. ఇంకను ఇట్లు స్తోత్రము చేయుతుందురు. ఈ విశ్వమునకు అంతకు మంగళమగు గాక. దుర్జనులు క్రోధము వదిలి నిర్మలమగు మనసు గర వారరగుదురు. కాక. నిర్మలముగ మనస్సు వారలగుదురు గాక మంచి బుద్ధితో అందరూ ఒకరినొకరు మంగళమును కోరుచుందురు గాక సకల భూతముల మనస్సు ఫలమునందు కాంక్ష లేక భగవానుని యందే ప్రీతి గలది అగుగాక మాకు గృహ పుత్ర దారాదుల యందు ధనమునందు బంధువుల యందు సంఘము కలగకుండు గాక. భగవత్ భక్తుల యందు భగవత్ ఆలయములందు సంఘము ఏర్పడు గాక. భగవానునకు ప్రీతిపాత్రులగు వారితో చేరుటచే మనసు శాంతమగుగాక. శరీరములో భగవానునికిని విభూతికిని సేవ చేయుటకు మాత్రమే అవసరమైన వస్తువులను ప్రాణములను నిలుపుకొనుటకై ఆహారముగా స్వీకరించు వారము అగుదముగాక. అట్లు సంతృష్టి చెందిన వారికి భగవత్ కథా శ్రవణము ఆచార్య లాభము కలిగి ఈ బంధము నుండి విముక్తి శీఘ్రముగా లభించును గాక. ఇంద్రియ పోషణమే ప్రధానముగా విషయములందు కోరికలతో బ్రతికెడి వానికి సిద్ధి సులభముగా లభింపదు. భగవత్ భక్తులగు జ్ఞానుల సంఘము చేతనే మా మనసునకు భగవత్ ధ్యానము చే సామర్థ్యము లభించినది. పవిత్రమగు భగవానుని కీర్తి గంగాది తీర్థముల వలె
స్పృశించిన వారిని పవిత్రము చేయును. మహాపురుషుల అనుగ్రహముచే శ్రోత్రేంద్రియము ద్వారా భగవత్కీర్తి నా హృదయంలో ప్రవేశించి మా మనసులో ఉన్న మాలిన్యమును తొలగించి నిర్మలమైన ధ్యానము చేయు సమర్థము అగునట్లు చేసినది. భగవానుని గుణములు లీలలు అతి పవిత్రమైనవి. వానిని ఎవడు సేవింపడు? ఐహికమైన ఫలమును కోరకుండా భగవానుని ప్రేమించిన వానిని ఇంద్రాది దేవతలు ప్రేమించి వానికి ధర్మాదులను శమధమాది గుణములను కలిగించి వానిని అనవర్తించుచుందురు. మహాపురుషులను సేవించని వారికి గొప్ప గుణములు ఎట్లు కలుగును? భగవత్ గుణములను విడిచి బాహ్యమగు విషయములకై ప్రాకులాడిడి వారికి మంచి గుణములు కలగవు. చేపలకు నీరు ఎట్లు ధారకమో అట్లే దేహధారులగు జీవులకు సాక్షాత్ భగవానుడే ధారకుడు. అట్టి వానిని విడిచి గృహములందు గృహమునకు సంబంధించిన వాని యందు ప్రీతిగల వారైనచో వారి వయస్సుచే పెద్దలగుదురే కానీ జ్ఞానముచే పెద్దలు కారు. దంపతులు సుఖలేశమనుభవించి ఆనందించుచు అదియే ఆనందమని భ్రమింతురే కానీ వారికి పరమాత్మానుభవము కలగనేరదు. అందువలన భవద్భక్తి నిరతిశయ సుఖ హేతువు విషయాసక్తి నిరతిశయ దుఃఖ హేతువు రజస్సు రాగమును విషాదమును పగను కోపమును అహంకారమును కాంక్షలను భయం భయమును అధైర్యము ఆధులను కలిగించుటకు మూలమైనది. గృహమే జన్మ మరణ కూపమును ఆగకుండా తిరుగునట్లు చేయును. కావున దానిని విడిచి నృసింహుని పాదమును సేవింపుడు. కేతుమాల వర్షములో నెక్స్ట్ వర్షం ఎప్పుడు కేతుమాల. కేతుమాల వర్షములో భగవానుడు కామదేవుడు లేక ప్రద్యుమ్నుడు అనే రూపంతో ఆరాధింపబడుచుండును. లక్ష్మీదేవికి ప్రీతి కలిగించవలెనని కోరికతో. అతడచ్చడ వసించుచుండును. ఆ వర్షమునకు అధిపతులు ప్రజాపతియగు సంవత్సరుని కుమార్తెలు, కుమార్తెలు, కుమారులు. కుమారులే పగళ్ళు, కుమార్తెలే రాత్రిళ్ళు. అనగా రాత్రిని అభిమానించువారు పగటిని అభిమానించువారు. వారు ఆ వర్షమును పాలించుచుందురు. వారికి 30
6000 సంవత్సరములు ఆయుర్దాయము. అది వారి పురుషాయుషము. ప్రజాపతి కుమార్తెలగు కుమార్తెలగు రాత్రి అభిమాని దేవతలగు మహాపురుషులగు భగవానుని మహాస్త్రముగు చక్రరాజము యొక్క తేజస్సుచే మనసు భీతి నంది ఉండును. అందుచే వారు గర్భములు దాల్చియు సంవత్సరము చివర ఆ గర్భములు ప్రాణములు లేనివై వెలువడుచుండును. అచట లక్ష్మీదేవిని ఆనందింపజేయుచు ప్రద్యుమ్నుడు తన సుందరమగు గమనము చేతను విలాసముల చేతను మంద హాసము చేతను, చూపుల చేతను, సుందర ముఖారవింద శోభ చేతను ఇంద్రియమును రమింపజేయుచు విహరించుచుండును. అది భగవానుని యొక్క మాయామయముగు రూపము. అనగా భగవానుని సంకల్పము చేత ఆవిర్భవించిన రూపము. అచ్చటి ప్రజాపతి కుమారులు, కుమార్తెలు సమాధిచే ఆ రూపమును ఆరాధించుచుందురు. వారు ఈ క్రింది మంత్రమును జపించుచు ప్రద్యుమ్న మూర్తిని ధ్యానించుచుందురు. ఓం హరాం హ్రీం హురూం ఓం నమో భగవతే ఋషీకేశాయ స్వగుణ విశేషైహి విలక్షితాత్మనే ఆకూతీనాం చితినాం చేతనానాంచ విషాధిపతయే షోడశ కలాయ ఛందోమయాయ ఛందోమయాయ అన్నమయాయ అద్భుతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. ఇచ్చట ఉపాసించబడు దైవము భగవానుని మూర్తియగు ప్రద్యుమ్నుడు. అతడే ఋషికేశుడు అనగా ఇంద్రియములను నియమించువాడు. ఇతడే కామదేవుడు. ఈతనికి సత్యజ్ఞానాది గుణములు, గాంభీర్యాది గుణములు ఉండుటచే జీవుల కంటే అచేతనము కంటే విలక్షణముగా ఉండును. ఈతడే అందరూ చేయు క్రియలకు, జ్ఞానములకు, మనస్సులకు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనస్సులు చేయు క్రియలకు అధిపతి. పంచభూతములు మనసుతో కూడి ఉన్న 11 ఇంద్రియములు శరీరముగా గలవాడతడు. ఛందస్వరూపుడు అన్నమయమగు వ్యష్టి సమిష్టి శరీరములకు అంతరాత్మ అయి ఉండును. అంతేగాక జీవాత్మలకు కూడా ఆత్మ అయి ఉండును. కాలమునకు కూడా అంతరాత్మ అయి ఉండును. ఇతడే సహస్సు అనబడెడి మనోబలమునకు ఓజస్సు అనబడెడి ఇంద్రియముల శక్తికి.
బలము అనబడి దేహశక్తికి కారణమైనవాడు ఆ నిరతిశయమగు ప్రీతి అతని వలనే కలుగును. అతడు మనోహరమవుడగు కాముడు అట్టివానికి ఎదురుగా వెనకవైపు మేము నమస్కరించుచున్నాము. ఇతడు లక్ష్మీదేవికి ప్రియుడు. అట్టి నిన్ను వ్రతములతో ఆరాధించి సంసారములో స్త్రీలు నీ అనుగ్రహము చేయే భర్తను పొందవలెని కోరుచుందురు. వారు భర్తలు అనుకొనడి వారు ఆత్మలను, బిడ్డలను, ధనమును, ఆయుష్షును కూడా కాపాడజాలరు. వారు భర్తలు అనుకొనని వారు అస్వతంత్రులు. కర్మవశముచే వారి శరీరములు భర్తలుగా ఉద్దేశింపబడుచున్నవి కానీ పతి అను శబ్దముచే వివరింపబడినవాడు వాడవు నీవే. నీవే పతివి. నీవు దేని వలనను భయం ఎరుగని వాడవు, కర్మవశుడవు కావు. అందుచే నీవు అందరినీ అన్ని వేళలా రక్షింపగలవాడవు. నీవే భయముచే పీడింపబడక ఈ జనమును అన్ని భయముల నుండి కాపాడుచున్నావు. నీవు పరిపూర్ణుడవొకటచే వేరొక దానిని దేనినీ కోరవు. నీవు ఏ ప్రయత్నము చేయనక్కర లేకుండని ఏ సాధనము అక్కర లేకుండని విన్నంత మాత్రమునని జీవరక్షణను చేయుచుందువు. నశించెడి భర్త, భార్య, ధనము, ఆయుష్షు మొదలగు కోరికల యందు ఆసక్తి గల స్త్రీ నిరుపాధిక రక్షకుడవు. పతివి అగు నీ పాదపద్మములు ఆరాధనము కోరదు. క్షుద్రములగు భర్త భార్య ధనాదులనే కోరుదురు. వారు కోరిన వారిని వారికి నీ వసంగెదవు. ఓ కామదేవా అట్టి కోరికలు కోరి వారి దుఃఖములను అనుభవించుచుందురు. లోకములో లక్ష్మి అనగా ధనము, సంపద కోరదగినదని అనుకొందురు. కానీ నీ స్వరూపము ఎరింగి నీవే పురుషార్థమని తెలిసిన వారు నిన్నే కోరుదురు. ఐశ్వర్యమును పొందవలెనని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, సురలు, అసురులు కూడా నీ పాద పద్మములను శరణు పొందక ఇతరములకు తపస్సులు చేయుచుందురు. అయినను వారు లక్ష్మిని పొందలేరు. నీవు ఎవరి చేతనో జయింప శక్యము కాని వాడవు. అనగా లక్ష్మి నీయందే మనసు నిలిపి ఉన్నది. అగుటచే నిన్ను విడిచి ఉండదు. నిన్ను కోరిన వారికే నీతో విడదీయరాని లక్ష్మి లభించునని వారు ఎరుంగరు. నీతో చేరి ఉండుట చేతనే.
లక్ష్మి అనగా ఐశ్వర్యము కూడా పురుషార్ధమగుచున్నది. లక్ష్మి కూడా ఆ ప్రద్యుమ్న మూర్తిని ఇట్లు ప్రార్థించుచుండును. నీవే కావలెనని కోరువారి శిరస్సులయందు కృపతో నీవు నీ హస్తమును ఉంచెదవు. అట్టి నీ హస్తపద్మము నా శిరస్సునందు కూడా ఉంచవలెనని లక్ష్మీదేవి కోరుచుండును. లక్ష్మీదేవి ఇలా అంటుంది, ఓ ప్రభు నీవే కోరదగిన వాడవు. నీ వక్షస్థలమందున శ్రీవత్సము మాయ అనబడి ప్రకృతికి గుర్తు. ఆ శ్రీవత్సముతో పాటు నన్ను కూడా నీ వక్షస్థలమందు గురుతుగా ధరించుచున్నావు ధరించి ఉన్నావు. నేను నీ భక్తురాలను కావున నా శిరస్సుపై కూడా నీ కరాంబుజం ఉంచుము. నీవు ఏమి చేయదలంతువో ఎవ్వరును ఊహింపజాలరు అని లక్ష్మీదేవి కూడా ప్రార్థించుచుండును. ఇప్పుడు ఇక్కడ తరువాత రమ్యక వర్షాన్ని గురించి మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఒక్కొక్క వర్షం గురించి ఆ వర్షం అధిష్టాన దేవత ఎవరు, వారు ఎలా ప్రార్థిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది తిరిగి ఒకసారి విని కూడా విషయాన్ని అర్థం చేసుకోండి. చక్కటి ప్రార్థనలు, చక్కటి శరణు చేసేటువంటి భావాన్ని మనకు దీనిలో ఉంది. మళ్ళీ మరొక పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus, salutations, salutations to the lotus-like one, salutations to the lotus garland, salutations to the lotus-eyed one. Salutations to the lotus-like one, the lotus-like one. From your navel, the lotus is born, your eyes and feet resemble the lotus, in your feet It has the lotus symbols. Many salutations to you. Tenth Canto, Fifty-ninth Chapter, Twenty-sixth Prayer. Dear listeners, welcome to the 19th podcast of Srimad Bhagavata Tattva Deepika, the fifth book. Until now, having completed the story of Priyavrata in the fifth book, in the description of the earth, we will discuss the matter of Rudra, which is an aspect of the interaction that exists in the Ilavrata, the atmosphere there, how they live there, how they are there We have now learned that he was praised. Let's find out about the other rain, Bhadras rain. Bhadrasra Vasu was the ruler of Bhadrasra. All the devotees who are there, the idol that is described with the name Hayagriva, who is the direct form of Lord Vasudeva, by establishing it in their meditation, this Meditate on the Mantra. Om Namo Bhagavate Dharmaya Atma Vishodhanaya Namah. Salutations to Dharmaja, who is the embodiment of the self, who is the knower of the six qualities of the self, who is the knower of the self, who is the self-realized, who is the self-realized, who is the self-realized, who is the self-realized, who is the self-realized. The former part of the Vedas describes the form of worship, and the latter part describes the form of adoration. Hayagriva is the one who practices such Vedas and Dharma. He alone cleanses the inner parts of the righteous one. By preventing the loss of Rajas, it removes the connection with nature and brings about the attainment of Brahma. He himself will be the recipient of the benefit. Thus, meditating with the mantra, they praise thus.
The Lord's actions were certainly bizarre. These people do not recognize the one who kills them. It is the glory of God's power. In this world, the son burns the father and desires to live with the wealth they have earned. He thinks that it is a means of action that should not be done to enjoy trivial matters. This is all an illusion. The magic of God's presence. Even those who have studied Vedanta are wise, but they do not realize that this universe will perish, but they cannot completely connect. The cause of that is Maya. Even though we are great Vedantins, we see that we experience grief in the deaths of our children. This is the wondrous lore of God. I salute you, who are unconnected with the dharma of all worldly relationships, to remove this. You will say that I am the one who created the strange and peculiar world, which is full of differences. The actions you perform, including creation, are not binding on me. You are not one to be unaware. You're as good as the whole universe. For that, you are the soul, but the actions of external beings are their happiness and sorrow It will be the cause. You will create bodies suitable for him, but you have no partiality or cruelty. In the end of the Yuga, the demon Tamas came and made the Vedas invisible. Then you, from the underworld, taking the form of Hayagriva, came and settled in the four-faced one who came to ask for the Vedas. Salutations to you, who have such wonderful deeds. Now it's Hari's turn. Narasimha is the deity to be worshipped in the rain. This is the form in which Prahlada was blessed. Prahlada, the great devotee, was meditating with the sages in that rain, with his beloved form, in that rain. Prahlada is a historical figure known for his role in sanctifying the lineage of the demon Asura Daityas. In that rain, Prahlada chants and meditates on this mantra of the rain god. Salutations to Narasimha, salutations to the radiant one. May they be born, may they be born, may they be born from the essence of the moon. Om Swaha
Abhayam Abhayam Atmani Bohishtya Om Kshaum. Chanting this mantra, they praise in the following manner. The meaning of the mantra. He who is conscious, who is conscious of all, who is the one who is useful to himself, who has six qualities like knowledge, that Narasimha is our refuge. His service is what makes us servants, not Narahari, who illuminates all the splendors. He is not one who needs the cooperation of another light to shine. Oh Narahari, manifest to us, manifest to us. Burn away the residue of our karma. Burn it away. The residue of our karma is very excessive. Burn it and proclaim it as a place of refuge for us. And thus they sing praises. May the universe be auspicious. Those who are wicked, leaving anger, will have a pure heart. Otherwise. May the minds be pure, may they be free from evil, may everyone wish each other well with good sense, may all beings have no desire for the fruits of their minds, may they have love for the Lord alone, may we have no desire for household, children, spouses, wealth, or relatives May there be no congregation. Devotees May the community be established in the temples of God. May our minds be at peace by associating with those who are pleasing to God. May we not be those who accept food only to sustain our lives, only to serve the Lord and the glory of the Lord in the body. May those who are satisfied be blessed with listening to the stories of the Lord, the benefit of the teacher, and may they be freed from this bondage quickly. The main thing is sensory nourishment. For one who lives with desires in matters, success will not be easily achieved. It is only through the association of wise people who are devotees of God that we have been able to attain the ability to meditate on God in our minds. Like the sacred Ganges and other holy rivers, the glory of the Lord is immense
Touching the dead body of a person will make it impure. By the grace of the great men, through the sense of hearing, the glory of the Lord entered my heart, removed the impurity in my mind, and made me capable of performing pure meditation. The virtues and the divine sports of the Lord are supremely sacred. Who will not serve him? Without desiring worldly fruits, Indra and other gods love one who loves God, and bestow upon him the qualities of Dharma, Shama, and Dama, and make him obey. How can those who do not serve great men possess great virtues? Those who abandon the divine qualities and are engrossed in external matters will not possess good qualities. Just as water is the nourishment for fishes, similarly, the embodied beings are nourished by the direct Lord. If they are pleased with such a person, leaving him, in houses, in those related to houses, they become elders by their age, but they are not elders by knowledge. Couples experience happiness and enjoy it, but they mistakenly believe that is happiness, but they do not experience the Supreme Being. Therefore, devotion to the world is the cause of unparalleled happiness The cause of subjective attachment, unceasing sorrow, is the passion of passion, the rage of rage, the sorrow of sorrow, the anger of anger, the ego of ego, desires, fear, fear, and courage, the root of causing them. Home is where the cycle of birth and death does not cease. Therefore, leaving that, serve the feet of Nrusimha. When is the next rain in Ketumala rain? In the Ketumala rain, the Lord is worshipped in the form of Kamadeva or Pradyumna. With a desire to please Goddess Lakshmi. He is staying there. The lords of that rain are the daughters, daughters, and sons of Prajapati, the lord. "Sons are days, daughters are nights. That is, those who admire the night, those who admire the day. They are the ones who govern the rain. For them 30
6000 years of life expectancy. It's their lifespan. The mind will be filled with fear and wonder by the radiance of the great weapon, the Chakra Raja, of the great men, the gods, the great devotees, and the daughters of Prajapati. Therefore, they conceive, and at the end of the year, those pregnancies are released as lifeless. There, pleasing Lakshmi Devi, Pradyumna, with his beautiful gait, with his amusements, with his gentle smile, with his gaze, with the beauty of his beautiful face, delights the senses and revels. It is the illusory form of the Divine. That is, the form that appeared by the will of God. The sons and daughters of the Prajapati there worship that form by burying it. They chant the following mantra and meditate on Pradyumna. Om Haram Hreem Hoorum Om Namo Bhagavate Rishikesaya Swaguna Visheshaihi Vilakshitatmane Akutinam Chitinam Chetanamchanamcha Vishadhipataye Shodasha Kalayam Chandomayaya Chandomayaya Annamayaya Ammayaya Ammayaya Sahase Ojase Balay Kantay Kamay Namaste Ubhayathra Bhuyat. The deity worshipped here is Pradyumna, the idol of the Lord. He is Rishikesh, the one who controls the senses. It's Kama. Because he possesses the qualities of truth, knowledge, and other virtues, and is different from living beings and inanimate objects. The swimmer is the master of all actions, knowledge, minds, and actions of the senses and intellect. He is the one who has the five elements, 11 senses combined with the mind, and a body. The form of the rhythm is the inner self of the individual and collective bodies that are the embodied self. Besides that, it is also the soul of living beings. Even to the passage of time, it seems to have become an inner self. This is the strength of mental strength called courage, the power of senses called strength.
He who is called strength, the one who is the cause of physical strength, that immeasurable love will be with him. He is the beautiful Kama, and we are bowing down to him from the front and back. He is the lover of Lakshmi. Thus, worshiping you with vows, women in the world wish to have a husband who will bless them. They, who are considered husbands, cannot protect their souls, children, wealth, and even life. They are independent, not like their husbands. Due to karma, their bodies are intended as husbands, but you are the one described by the word husband. You are my lord. You are not afraid of anything, you are not subject to karma. Therefore, you are able to protect everyone at all times. You are the one who is not troubled by fear, but protects this people from all fears. You are perfect, you do not ask for anything else. Without any effort, without any means, just by hearing, you protect the life. Destructive, interested in desires such as husband, wife, wealth, and life The protector of the helpless woman. Your lotus feet are not worthy of worship. The husband and wife, being poor, desire wealth. You will give them their inheritance. Oh, Kamadeva, desiring such desires, they experience their sorrows. In the world, Lakshmi is considered to be wealth and prosperity. But those who know that you are the form of the earth, you are the purpose of man, they will desire you. Brahma, Rudra, Indra, the gods, and the demons, wishing to attain prosperity, do penance to others without seeking refuge in your lotus feet. However, they are unable to obtain Lakshmi. You are not someone who can be defeated by anyone. That is, Lakshmi's mind is fixed on you. It will not leave you. They do not know that those who desire you will receive an unbreakable Lakshmi (wealth) with you. Because of being with you.
Lakshmi, meaning wealth, is also the Purushartha. Lakshmi also prays to that Pradyumna Murthy like this. You will place your hand on the heads of those who desire you with grace. Lakshmi Devi wishes that your lotus-like hands should also be placed on my head. Lakshmi Devi says this, O Lord, you are the one who is worthy of being asked. The Srivatsa on your chest is a symbol of nature, which is called Maya. Along with that Srivatsa, you are also wearing me as a mark on your chest, you are wearing it. I am your devotee, therefore, place your karampujam (a type of flower) on my head as well. Lakshmi Devi also prays that no one can guess what you intend to do. Now, hereafter, let's learn about Ramya's rain in another podcast. We are learning about each rain, who is the presiding deity of the rain, and how they are worshipped. Try to repeat the phrase and pronounce it correctly. Beautiful prayers, a beautiful feeling of surrender We have it here. We'll catch up again on another podcast. Jai Srimannarayana, salutations to the Gurus