ద్వీపములు మరియు సముద్రాల వర్ణన - భాగం 2

Description of Islands and Oceans (Part 2)

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ ఎపిసోడ్‌లో, శుకదేవ మహర్షి వివిధ ద్వీపములు మరియు వాటిని చుట్టుముట్టిన సముద్రాల గురించి విస్తారంగా వర్ణిస్తున్నారు. దివ్యమైన నదులు, పర్వతాలు, మరియు ఆ ప్రాంతాలలో నివసించే దేవతలు మరియు మహాత్ముల గురించి పవిత్రమైన వివరణ ఈ భాగంలో కొనసాగుతుంది. ప్రతి ద్వీపమూ శ్రీహరి యొక్క అనంత కృపకు మరియు సర్వశక్తికి ప్రతీకగా నిలుస్తుందని మహర్షి స్పష్టం చేస్తున్నారు. ఈ వర్ణన సమస్త సృష్టిని భగవంతుని మహిమాన్విత లీలగా దర్శించమని మనకు ప్రేరణ నిస్తుంది.

In this episode of our Srimad Bhagavatham podcast, we continue the sacred geographical exposition from Canto 5, exploring the remaining dvipas and the vast oceans that surround them. Shukadeva Goswami elaborates on the divine regions filled with celestial inhabitants, sacred rivers, and mountains that glorify the Supreme Lord. Each island is described as a realm sustained by the mercy of the Lord, reflecting the infinite grandeur of His creation. This profound narration invites us to see the entire cosmos as a magnificent expression of Sri Hari's glory.

← Prev Next →
Description of Islands and Oceans (Part 2) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే సర్వ భావాయ బ్రహ్మణేనంత శక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగినాం పతయే నమః సర్వమునకు ఉపాదానమైన అనంత శక్తి గల పరబ్రహ్మ నీవే. నీవు వసుదేవుని పుత్రుడవగు శ్రీకృష్ణుడవై అవతరించి యోగులను కాపాడుచున్నావు. నీకు అనేక నమస్కారములు. టెన్త్ కాంటో 64th చాప్టర్ 29th ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము 23వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియోధృతుని చరిత్రము. తర్వాత భూగోళ వర్ణనము దానిలో భాగంగా తొమ్మిది వర్షముల గురించి ఆ తర్వాత ద్వీప వర్ణనంలో జంబూద్వీపము, ప్రక్షద్వీపము, శాల్మలీ ద్వీపము, కుశద్వీపాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు. మనము అమెరికాలో తెలుపుతుంటాం క్రౌంచర్ ద్వీపం అని ఆ ద్వీపం యొక్క వర్ణన ఇప్పుడు తెలుసుకుందాం. కుశద్వీపమునకు అవతల క్రౌంచర్ ద్వీపము. కుశద్వీపమునకు క్రౌంచర్ ద్వీపమునకు మధ్యలో ఘృత సముద్రం ఉన్నది. క్రౌంచ ద్వీపమునకు ఆవల క్షీర సముద్రము ఉన్నది. క్రౌంచ ద్వీపము 10 లక్షల యోజనముల వైశాల్యము గలది. కుశ ద్వీపమునకు ఘృత సముద్రము ఉన్నట్లే క్రౌంచ ద్వీపమునకు ఆవల క్షీర సముద్రము ఉండెను. ఆ ద్వీపమునందు క్రౌంచమరడి పర్వతము ఉన్నది. అందుచేతనే దీని క్రౌంచ ద్వీపము అని పేరు వచ్చినది. ఈ క్రౌంచ ద్వీపమునని పూర్వము కుమారస్వామి తన బాణముచే ఆ పర్వతముందరి చెరువులను పెకిలించి వేసెను. కానీ వృత సముద్రముచే తడుపబడి వరుణులు అభయమసంగుటచే రక్షింపబడి ఉండెను. క్రోంచ ద్వీపమునకు ప్రియవ్రతుని కుమారుడు వృతపృష్టుడు అధిపతి. అతడు తన ద్వీపమును తన కుమారులు ఏడుగురి పేర్లతో ఏడుగురికి వసంగి తాను సకలాత్మ భూతుడగు హరి చరణారవిందములను చేరెను. ఆ వర్షములకు ఆమోదము, మధువహము, మేఘపృష్టము, సుధామము, భ్రాజిష్టము, లోహితారణము, వనస్పతి అని భృతపృష్టుని కుమారుల పేర్లతో వ్యవహారం ఏర్పడెను.

ఆ వర్షములోని పర్వతములు శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపభరిహిణము, నందము, నందనము, సర్వతోభద్రము అని వివరింపబడును. అందు అభయ, అమృతాఘ, ఆర్య, తీర్థవతి, వృత్తి, రూపవతి, పవిత్రవతి, శుక్ల అను ఏడు నదులు ప్రవహించుచుండును. వాటి జలములను సేవించుచు పవిత్రులైన ఆ వర్షమునందలి జనులు పురుష, వృషభ, ద్రవీణ, దేవత అను సంజ్ఞలతో వివరింపబడుచుందురు. అచ్చట జలశరీరకుడగు భగవానుని జలములతో పూర్ణమైన అంజలిచే అర్ఘ్యప్రధానము చేసి ఆరాధించుందురు. ఆపః పురుష వీర్యాః స్థపునంతీర్ భూర్భువస్వః తానః పునీతామీవఘ్నీహి స్పృశతామామాత్మనాభువః ఓ జనులారా మీరు భగవానుని శక్తి స్వరూపిణిలు అయి ఉండురు. మీరు భూహు, భూవః, సువః అనిటి మూడు లోకములను పవిత్రము చేయుచుందురు. మీరు స్పృశించిన వారి పాపములు హరించువారలు. పరమాత్మ నుండి జన్మించిన వారలై మిమ్ములను స్పృశించు వారలను పవిత్రము చేయుడు. దీని తర్వాత దిగము శాఖ ద్వీపము. 32 లక్షల యోజనములు వైశాల్యము గల పెరుగు సముద్రముచే ఆవరింపబడి శాఖ ద్వీపము ఉన్నది. ఆ ద్వీపమందు శాఖమును వృక్షము కలదు. అందుచే దానికి ఆ పేరు వచ్చినది. ఆ శాఖ వృక్షము యొక్క పరిమళము ఆ ద్వీపమునంతను పరిమళము గల దానినిగా చేయును. ఆ శాఖ ద్వీపమునకు అధిపతి మేధాదిధి అని ప్రియవ్రతుని కుమారుడు. అతడు తన కుమారులకు ఏడుగురికి ఏడు వర్షములు పంచి ఇచ్చి వారి పేర్లతో వానిని వివరించినట్లు చేసెను. తాను భగవంతుని యందు మనస్సు నిలిపి తపోవనం ప్రవేశించెను. పురోజవము, మనోజవము, పవమానము, ధూమ్రానీకము, చిత్రరేపము, బహురూపము విశ్వాధారము అను పేర్లతో ఆ వర్షములు వ్యవహరించుచుండును. వ్యవహరింపబడుచుండును. ఆ వర్షములలో సరిహద్దు పర్వతములు ఏడు కలవు.

ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేశరము, సహస్ర స్త్రోతము, దేవపాలము, మహాసన మహాననము అను పేర్లతో ఆ పర్వతములు వేరింపబడుచుండును. అనఘ, ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపది, సహస్ర శ్రుతి, నిజధృతి అను ఏడు నదులు అందు ప్రవహించుచుండును. ఆ వర్షములోని పురుషులు ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, సువ్రత పేర్లు గల నాలుగు వర్ణములుగా వివరింపబడుచుందురు. వాయువునకు ఆత్మగా నుండు భగవానుని వాయువు ద్వారా అచటి వారు ఆరహించుందురు. వారందరూ ప్రాణాయామముచే రజస్తమస్సును తొలగించుకొనిన వారు. వారు ధ్యానములో జపించు మంత్రం అంతఃప్రవిష్య భూతాని. యోస్యభిభత్యా కేతుభిహి అంతర్యామీశ్వర సాక్షాత్ పాతునోయద్దస్యేస్ఫుటం వాయు శరీరముగా గల పరమాత్మ శరీరములలో ప్రవేశించి ముఖ్య ప్రాణరూపుడై ఉండును తనకు చిహ్నమగు చిహ్నములకు ప్రాణ, అపాన, వ్యానోదాన సమానములను వృత్తులచే భూతములను భరించుచుండును. సాక్షాత్ ఈశ్వరుడే ప్రాణరూపుడై ప్రవేశించి నియమించుచు కాపాడుగాక. పరాన శరీరకుడగు భగవానుని వశమునందే ఈ జగత్తంతయు వర్తించియున్నది. ఆ నాలుగు వర్ణములందుండు జనులు వృతవ్రత, సత్యవ్రత, దానవ్రత, సువ్రత అను నామములు గలవారై యుందును. ఈ విధంగానే పెరుగు సముద్రమునకు అవతల పుష్కర ద్వీపం ఉన్నది. పుష్కర ద్వీపము తరువాత శాఖ ద్వీపం ఉన్నది. అది పుష్కర ద్వీపము కంటే రెట్టింపు విశాలమైనది. 64 లక్షల యోజనములు విశాలమైన మంచి నీటి సముద్రం ఉన్నది. పుష్కర ద్వీపములో విశాలముగు పుష్కరము అనగా పద్మము ఉన్నది. ఆ పద్మమునందు అగ్ని జ్వాలల వలె ప్రకాశించుచున్న బంగారు రేకులు మేనకు బంగారు రేకులు వేనకు వేలు ఉండును. ఆ పద్మమునందే చతుర్ముఖుడైన బ్రహ్మ ఉండును. అందుచే ఆ వర్షములో ఉన్నవారు చతుర్ముఖుని ఉపాసించుచుందురు.

పుష్కర ద్విపి మధ్యములో మానసూత్తరమును పేరు గల ఒక పర్వతం ఉన్నది. అది 10,000 యోజనముల ఎత్తు అంతటి వైశాల్యము కలిగి ఉండును. ఆ పర్వతమే వర్షములు మధ్య సరిహద్దు పర్వతముగా ఉండును. మానసోత్తర పర్వతమునందు నాలుగు దిక్కుల యందు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు అను లోకపాలుల పట్టణములకు పైని మేరు చుట్టూగా సూర్యరథము యొక్క చక్రము తిరుగుచుండును. ఆ పుష్కర ద్వీపమునకు అధిపతి వీతిహోత్రుడు అను పేరు గల ప్రియవర్తుని కుమారుడు. వీతిహోత్రుని కుమారుల కుమారులు రమణకుడు, ధాతికి అని వారి పేర్లు. వారిద్దరికీ రెండు వర్షములను పాలించుటకు వసంగి. వీతిహోత్రుడు బృహదారాధనయందే ఉండిపోయెను. ఆ పుష్కర ద్వీపమునందు ఉండు పురుషుల చతుర్ముఖుడు అని పేరుగా బ్రహ్మ రూపమగు భగవానుని కర్మయోగము చేతను. భగవత్ ఉపాసనము చేతను ఆరాధించుందురు. వారు ఈ మంత్రముతో ఆరాధన చేయుదురు. యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. వర్ణాశ్రమ భావముతో ఉన్న జనులు పరమ పురుషునకు శరీరముగానున్న వేదముచే ఎరుంగబడు కర్మమయముగు జగత్తును సృష్టి అనడి కర్మచే మొదటి క్షేత్రజ్ఞుడగు చతుర్ముఖుని ఆరాధింపవలెను. దేవ మనుష్యాది కార్యవర్గమంతయు సమిష్టి రూపముగా చతుర్ముఖ బ్రహ్మగా ఉండును. కావున ఆ కార్యరూపముకు బ్రహ్మము భేదము లేనిదని భావించి ఆరాధించవలెను. ఆరాధించునప్పుడు వేరుగా ప్రయోజనము కోరక ఆ బ్రహ్మ యొక్క ఆరాధనమే ప్రయోజనమని ఆరాధింపవలెను. అట్టి భగవానుడగు హిరణ్యగర్భునకు నమస్కారము. సమిష్టి రూపుడగు హిరణ్యగర్భుడే చతుర్ముఖ బ్రహ్మ అతన్ని ఈ వర్షములో పురుషులు ఆరాధింతురు. ఇంతవరకు శుద్ధోదక సముద్రం వరకు ఉండెడి సప్తద్వీప రూపమున ఉన్న భూమండలము వర్ణించెను. శుద్ధోదక సముద్రమునకు ఆవల లోకాలోకము అనడి పర్వతము గలదు. అది వెలుగునకు చీకటికి నీ మధ్యలో ఉండుటచే లోకాలోకము అని వ్యవహరింపబడుచున్నది. మానసోత్తర పర్వతమునకు చీకటికి మధ్యలో ఎంత భూమి ఉన్నదో అంత భూమి శుద్ధోదక సముద్రమునకు ఆవల ఉన్నది.

కోటి ఏడు లక్షల పరిమితి గల భూమి మేరు మధ్య మొదలు మానసోత్తరం వరకు ఉన్నది. అంత భూమియే శుద్ధోదయ. సముద్రమునకు తరువాత కూడా ఉన్నది. లోకాలోక పర్వతమునకు శుద్ధోదక సముద్రమునకు మధ్యలో ఉన్న భూమి 8 కోట్ల 30 తొమ్మిది లక్షల యోజనములు పరిణామం కలిగి ఉన్నది. అది బంగారం వలె మెరువుచుండును. అద్దం వలె సన్నగా నుండును. ఆ భూమియందు జనులు ఎవ్వరూ ఉండరు. అచట ఏ వస్తువు ఉంచినను అది నున్నగా ఉండుటచే జారిపోవును కానీ నిలవదు. కనపడదు అందుచే అక్కడ జంతువులు ఏవియు నేలపజాలవు. నిలవ చాలవు. అచ్చట వెలుగు ఉండదు. అందుచేతనే ఆ వైపు చీకటి ఈ వలు వైపు వేగు ఉండుటచే ఆ పర్వతమును లోకాలోకమందురు. ఆ పర్వతము భూహు, భూవః, సువః అను మూడు లోకములు తనలో ఉన్నదిగా ఉండును. అనగా ఆ పర్వతమునందే మూడు లోకములు ఉండును. మూడు లోకములను ఉండును. సూర్యుడు మొదలు ధ్రువుని వరకు ఉండేడి జ్యోతిర్మండలము యొక్క కిరణములు ఈ భూహు భూహు భువః సూర్యులోకములను తన కిరణములచే ప్రకాశింప చేయుచుండును. ఆ లోకాలోకము అడ్డుగా ఉండుటచే ఈ జ్యోతిర్మండలముల యొక్క కాంతులు ఆవలి వైపు ప్రకాశింప చాలవు. మొత్తము భూమండలం అంతయు 50 కోట్ల యోజనములు పరిమితి గలదని భూమండలం యొక్క యధార్త స్వరూపమును ఎరింగిన వారు చెప్పుదురు. ఈ లోకాలోక పర్వత భూగోళం యొక్క పరిణామములో నాలుగవ వంతు అనగా 12.5 కోట్ల యోజనముల ఔన్నత్యము వైశాల్యము కలిగి ఉండును. లోకాలోక పర్వతమునకు పై భాగమున తూర్పు మొదలగు భాగముల యందు సకల గురువగు బ్రహ్మ వృషభము పుష్కర చూడము, వామనము, అపరాజితము అనేటి పేర్లు గల నాలుగు ఏనుగులను నిలిచి ఉంచెను. అవి సమస్త లోకమును క్షేమముగా నిలిచి ఉండుటకు కారణమై ఉన్నవి.

భగవానుడు నిరతిశయ కళ్యాణ గుణములు కలవాడై ఏకపాద త్రిపాద అనబరుడి రెండు విభూతులకు అధిపతి అయి సర్వాంతరాత్మి అయి ఆ పర్వతమునందు ఉండును. అతడు ఈ ఏనుగులకు లోకపాలులకు సామర్థ్యమును వృద్ధి పొందించుచుండును. అతని దివ్య మంగళ విగ్రహము శుద్ధ సత్వమయము. అది కర్మవశమై ఉండెడిది కాదు. ధర్మ జ్ఞాన. వైరాగ్య ఐశ్వర్యములు అణిమాది యోగ సిద్ధులు మున్నగు వానిచే అతనిని గుర్తింప వీలగును. ఆ భగవానుని సభాసదులు విశ్వక్సేనులు మొదలగు వారితో కూడి ఉన్నవాడై. తన ఆయుధములకు చక్రాదులతో ప్రకాశించుచున్న భుజములు గలవాడై ఆ లోకాలోక పర్వతమునందు సకల జగత్తు యొక్క రక్షణకై వసించి ఉండును. ఈ విధముగా భగవానుడు తన సంకల్పముచే ఈ లోకమునంతను కల్పించి దానికి జీవనమును కల్పించి దాని రక్షణమునకై ఈ రూపముతో కల్పాంతం వరకు వెంచేసి ఉండును. ఇట్లు జంబూర్ ద్వీపం మొదలు శుద్ధోదక సముద్రం వరకు భూమండలం యొక్క పరిణామము పరిమాణం చెప్పబడినది. వేరొక చోట 2 కోట్ల 53 లక్షల 50 వేల యోజనముల సప్తద్వీపములు సప్తసముద్రములు పరిణామము గలవై ఉండునని చెప్పబడినది. తరువాత 10 కోట్ల యోజనములు భూమి బంగారు వలె మెరుయుచు అద్దం వలె స్నిగ్ధవై ఉండును. అచట దేవతలు విహరించుచుందురు. దాని తరువాత లోకాలోక పర్వతము అని పర్ణింపబడి ఉన్నది. ఈ లోకాలోక పర్వతం మొదలుకొని మేరువు నుండి నాలుగు దిక్కులకు ఉండు మొత్తం 25 కోట్ల యోజనములు గల భూభాగములో జంబూద్వీపము 50 వేల యోజనములు. తరువాత లవణ సముద్రం మొదలగు సముద్రములు ప్లక్షం మొదలగు ద్వీపములు ఉన్నవి. ఆ లోకాలోకమునకు ఆవల యోగ ప్రభావముచే పరిశుద్ధమగు గవనము గల యోగీశ్వరులే సంచరింపజాలుదురు. మేరు మొదటి నుండి లవణ సముద్రం వరకు జంబూద్వీపము. 50,000 యోజనముల పరిణామము గలది. తరువాత లక్షద్వీపము 2 లక్షల యోజనములు. తరువాత శాల్మలి ద్వీపము.

ఇక్షు ద్వీపము, కుశకౌంచ ద్వీపములు, శాఖ ద్వీపములు అనునవి ఉన్నవి. లవణ సముద్రముతో ప్రారంభించి శుద్ధోదర సముద్రం వరకు భూమి. తరువాత లోకాలోక పర్వతము. ఈ విధముగా మేరు పర్వతము మధ్య యందున్నట్లు దానిని హద్దు చేసుకొని భూమండలం యొక్క పరిణామం పరిమాణము ఏర్పడినది. సూర్యుడు బ్రహ్మాండ మధ్యమునందు ఉన్నాడు. భూమండల మధ్యమునందు మేరు ఉన్నట్లే బ్రహ్మాండము యందు మధ్య యందు సూర్యుడు ఉన్నాడు. నక్షత్ర జ్యోతిర్మండలములు ఉండు లోకమును ద్విలోకము అందురు. దానికిని భూలోకమునకు మధ్య స్థానమున సూర్యుడు ఉన్నాడు. అండమును మధ్యగా భాగించినచో ఊర్ధ్వ భాగము ద్విలోకము, అధో భాగము భూలోకము. ఈ అండమునకు మధ్యలో సూర్యుడు. ఆ సూర్యుడి నుండియే పరిమాణం చెప్పబడుచున్నది. సూర్యుని నుండి అండగోళము యొక్క అవతలి అంచుకు 25 కోట్ల యోజములు ఉండును. సూర్యునికి మార్తాండుడు అని పేరు. మృతము అనగా నశించు స్వభావము కలది. ఈ అండము నశించు స్వభావము కలది కనుక ఈ అండమునకు మృతాండము అని పేరు. మృతాండమును ఉన్నవాడు మార్తాండుడు లేదా మర్తండుడు అని కూడా అనవచ్చును. హిరణ్మయమగు బంగారు వికారమగు అండమునందు ఉండుడచే హిరణ్యగర్భుడని వివరింపబడుచుండును. దిక్కులు, అంతరిక్షము, జిలోకము, భూమి మొదలగు భేదములు సూర్యుని బట్టియే కలుగుచున్నవి. అట్లే స్వర్గము, మోక్షము, నరకములు అనునవి అతలం మొదలగు అధోలోకములన్నియు సూర్యుని బట్టియే ఏర్పడినవి. సూర్యుడే దిక్కులకు విభాగమును కల్పించినాడు. అంతేకాదు దేవతలకు, పశుపక్షాదులకు, మనుష్యులకు, ప్రాకడి జంతువులకు, భూమి నుండి మలచెడి లతలకు, సర్వ జీవ సమూహములకు సూర్యుడే ఆత్మ. అతడే భగవానుడు, అతడే ఈశ్వరుడు. సర్వ కోటి చూపు ప్రసరించుట అతని ఆధీనమై ఉన్నది. అందుచే చక్షు ఇంద్రియమునకు అధిష్టాన దైవము సూర్యుడు. ఇంతటితో మనము దీపాల యొక్క వర్ణన తెలుసుకున్నాం. సప్త దీప వర్ణనని చక్కగా ఇది మరొకసారి కూడా. విని ఆ వణని ఆనందించాలని భావిస్తూ మరొక పాడ్కాస్ట్ లో మనం జ్యోతిర్మండల వర్ణనాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the all-pervading Brahman, the infinite power, Krishna, the lord of Vasudeva, salutations to the lord of the yogis. You are the supreme Brahman, the infinite power that is the cause of everything. You, as the son of Vasudeva, as Srikrishna, have incarnated and are protecting the yogis. Many salutations to you. Tenth Canto 64th Chapter 29th Prayer. Dear listeners, welcome to the 23rd podcast of Srimad Bhagavata Tattva Deepika Panchama Skandham. Priyodhrutuni Charitram. Then, as part of the geographical description, about nine rains, and then in the island description, let's learn about Jambudvipa, Prakshadvipa, Shalmali Island, and Kushadvipa. Now. We are telling in America, Krokander Island, let's know the description of that island now. Crowcher Island is across from Kushadvipa. Between Kushadvipa and Krounchar Island is the Guttar Sea. The Cosy Sea is located across the Crowan Island. Kruncha Island is 10 lakh yojanas in area. Just as there is a Ghatotkacha sea on Kusha island Beyond the Crowa Island there was the Sea of Milk. There is a mountain called Krounchamaradi on the island. Therefore, it is called Krouncha Island. This Krouncha island, formerly Kumaraswamy, with his arrow, uprooted and threw away the ponds on that mountain. But the ocean was submerged, and the rains were protected by the abhayamasam. Priyavrata's son Vrttaprisht was the ruler of Krodhoja island. He, with his island, with the names of his seven sons, to the seven, he, being the embodiment of all beings, reached the lotus feet of Hari. The rains were approved by the names of the sons of Bhrutaprishtu: Madhuvahamu, Meghaprushtamu, Sudhamamu, Bhrajishtamu, Lohitaranamu, and Vanaspati.

The mountains in that rain are described as Shukla, Vardhamana, Bhojana, Upabharihina, Nandam, Nandanam, and Sarvato Bhadram. There, Abhaya, Amritagha, Arya, Tirthavati, Vrutti, Rupavati, Pavitravati, Shukla, these seven rivers flow. Those who serve their waters, those who are holy, those people in that rain are described with the symbols of male, bull, liquid, and god. There, they offer water to the Lord, who is the embodiment of the water, and worship him by making the offering complete with water. Those who are men, virgins, and those who are born, are purified, and those who touch us with their minds, O people, you are the embodiment of God. You purify the three worlds, Bhooh, Bhuva, and Suva. You are the remover of sins of those who have touched you. He who is born from the Supreme Soul, he who touches you, he who makes you pure. After this, Digamu Shakha Island. There is a branch island surrounded by a curd sea with an area of 3.2 million yojanas. The island has a branch and a tree. That's why it's called that. The fragrance of that branch will make the whole island fragrant. The lord of the island was Medhadhidhi, the son of Priyavrata. He gave seven rains to his seven sons and described him with their names. He entered the Tapovanam, keeping his mind on the Lord. Purojavamu, Manojavamu, Pavamanamu, Dhumranikamu, Chitrarepamu, Bahurupamu, Vishwadharamu, those rains are known by these names. They are being discussed. Among those rains, there are seven border mountains.

The mountains are separated by the names Eshanamu, Urusrungamu, Balabhadramu, Shatakesaramu, Sahasra Strotamu, Devapalamu, Mahasana, Mahananamu. Anagha, Ayudha, both creations, Aparajita, Panchapadi, Sahasra Shruti, Nijadhruti, these seven rivers flow together. In that rain, the men are described as four varnas named Ritavrata, Satyavrata, Dana Vrata, and Suvrata. Those who are there, through the wind, the wind that is the soul of the Lord, will be saved. They are those who have removed the Rajas and Tamas by pranayama. They chant the mantra in meditation, the inner past. Yosyabhabhitya Ketubhhih Antaryameshwara Sakshat Patunoyyaddasyaesphutam Vayu Shariramugala Paramatma, entering into the bodies, being the chief life force, to the signs that are his, life, Apana, The donations are being borne by the professions. May the living God himself enter and protect, establishing order. The entire world operates under the control of the Lord, who is beyond the body. Those people who are among the four varnas, Vrata Vrata, They are those who have names like Satyavrata, Danavrata, and Suvrata. In this way, there is a Pushkar island beyond the ocean. After Pushkar Island is the Shaksha Island. It is twice as wide as Pushkar Bay. There is a vast, good water ocean of 64 lakh yojanas. In the Pushkar island, there is a vast Pushkaram, which means lotus. In that lotus, like flames of fire, there are golden leaves, golden leaves, ten thousand leaves. In that lotus, the four-faced Brahma resides. Therefore, those who are in that rain, worship the four-faced one.

In the middle of the Pushkara lake, there is a mountain called Manasutara. It has an area of 10,000 yojanas. That mountain is the boundary between the rains. In the mountain of Manasottara, in the four directions, above the cities of the lords of the worlds, Indra, Agni, Varuna, Kubera, the wheel of the Sun chariot revolves around Meru. The lord of that Pushkara island is the son of Priyavarta, called Vihihotra. Vītihōtras' sons' sons are Ramanakudu and Dhātiki are their names. Vasangi to rule both of them with two rains. Vītihārtha remained in the service of Brihatrādhana. That four-faced being residing on the Pushkara island, named Brahma, is through the Karma Yoga of the Lord. They worship and adore God. They worship this mantra. That which is full of action, the lingam, the lingam of Brahma, should be worshipped. The solitary and united one, peaceful, to that, salutations to the Lord. People with the feeling of Varnaashrama, the world created by the Vedas, which is the body of the Supreme Being, is known as Karma One should worship the four-faced Chaturmukha, who is the first Kshetrajna. The divine, human, and other groups of beings exist as a collective form, as the four-faced Brahma. Therefore, considering that Brahma is without difference to the form of that work, it should be worshipped. When worshipping, without seeking any other benefit, the worship of that Brahma is the benefit, and one should worship. Salutations to Lord Hiranyagarbha, the Lord of all. The collective form, Hiranyagarbha, the four-faced Brahma, is worshipped by men in this rain. Until now, he described the earth, which is in the form of seven islands, up to the pure ocean. Beyond the ocean of pure water, there is the world of the world, with the mountain of the earth. That is, because it is between light and darkness, it is called the world. As much land as there is between the darkness of the mountain and the ocean, that much land is beyond the pure ocean.

The land with a limit of one crore seven lakhs is from the beginning to the end, from the earth to the sky. The whole earth is filled with light. It is also present in the sea. The earth between the world and the mountain and the pure ocean has a development of 8 crore 30 nine lakh yojanas. It shines like gold. It is as thin as a mirror. There will be no inhabitants on the planet. If any object is placed there, it will slip because it is smooth, but it will not stay. It is not visible, therefore, no animals are found there. It's not enough to just stay. It's not very bright. Therefore, because of the darkness on that side and the watch on this side, that mountain is called the world. That mountain has three worlds within it: Bhooh, Bhuvah, and Suvah. That is, three worlds exist in that mountain. It contains three worlds. The rays of the solar system, starting from the Sun and extending to the Moon, illuminate the Sun and the Moon. Because the universe is in the way, the lights of these constellations cannot shine far to the left. Total Those who know the true form of the earth say that the earth is limited to 50 crore yojanas. In this world, the evolution of the mountain geography is four-fifths, that is, 12.5 crore yojanas in height and extent. In the world, on the upper part of the mountain, in the eastern and other parts, Brahma, who is the guru, placed four elephants named Vrishabhamu, Pushkaramu, Vamanamu, and Aparajitamu. They are the reason why the whole world remains safe.

The Lord, being endowed with unparalleled auspicious qualities, being the lord of two vibhutis, one-footed, three-footed, and having all-encompassing attributes, resides on that mountain. He is increasing the capacity of these elephants and the world leaders. His divine auspicious idol is purely Sattvic. It is not something that is going to be done by accident. Dharma Jnana. By the powers of detachment, wealth, and the attainment of yoga, etc., it is possible to recognize him. He, along with the associates of that Lord, Vishwaksenas, and others. He, with his weapons shining with wheels, having shoulders, resides on that world mountain for the protection of all the world. In this way, the Lord, by His will, created this entire world, gave it life, and for its protection, has been guarding it with this form until the end of the eon. Thus, the evolution and size of the earth from Jambur Island to the Pure Ocean Sea is described. It is said that in another place, there are seven islands and seven seas with the evolution of 2 crore 53 lakh 50 thousand yojanas. After that, 10 crore yojanas of land It shines like gold, is as smooth as a mirror. The gods are there to be enjoyed. After that, it is described as the mountain of the world. In this world, starting from the mountain, from the Meru, in the four directions, in the total area of 25 crore yojanas, Jambudvipa is 50,000 yojanas. After that, there are oceans like the Lavanam Samudram and islands like the Plaksham. Yogis, who have a pure abode beyond the world, due to the effect of yoga, are able to travel. Jambudvipa from the first to the salt sea. It has a life of 50,000 yojanas. Lakshadweep followed, for 2 lakh yojanas. Next Island is Shalmali.

There are Ikshu Island, Kushakaucha Island, and Shakha Islands. Land up to the Lava ocean starting from the Lava ocean to the Shuddhodara ocean. The next world mountain. In this way, as if the Meru mountain is in the middle, it was bordered and the evolutionary size of the earth was formed. The sun is in the middle of the universe. Just as Meru is in the middle of the earth, the sun is in the middle of the universe. The world with stars and constellations is called a dviloka. The sun is in the middle of the earth. If the egg is divided in the middle, the upper part is the sky, and the lower part is the earth. The sun was in the middle of this egg. The size is said to be from the sun. The distance from the sun to the edge of the habitable zone is about 250 million miles. The Sun is called as Martand. Death is the nature of things. This ovum has a perishable nature, therefore this ovum is called a dead ovum. The one who is in the death chamber can also be called a martand or maratandu. Hiranmayamaganbu He is described as Hiranyagarbha, who resides in the womb of the Vikarama. Directions, space, the world, the earth, and other such differences are determined by the sun. Similarly, heaven, salvation, hell, etc., all the lower worlds like the netherworld are formed by the sun. The sun itself has divided the directions. Not only that, the sun is the soul of all living beings, including gods, animals, birds, humans, wild animals, plants, and vines that have fallen from the earth. He is God, He is the Lord. The gaze of all the crores is reflected in him. Therefore, the presiding deity for the eye is the Sun. With this, we have learned the description of the lamps. Seven lamps, the color is nice, this is also one more time. Listening to that, thinking that we should enjoy that sound, let's learn about the description of the Jyotirmandala in another podcast. Jai Srimannarayana. Salutations to the Guru