నారద మహర్షి దివ్య ఆగమనం - సంభాషణ
Arrival of Narada Muni & Spiritual Consultation
ఈ ఎపిసోడ్లో, సరస్వతీ నదీ తీరంలోని వ్యాసదేవుని ఆశ్రమానికి నారద మహర్షి దివ్యంగా విచ్చేసిన ఘట్టాన్ని వివరిస్తాము. వేదాలు, పురాణాలు, మహాభారతం రచించినప్పటికీ వ్యాసదేవుడు తీవ్రమైన అసంతృప్తి మరియు మనోవేదనకు గురవుతాడు. తన శిష్యుని అంతరంగ వేదనను గుర్తించిన నారద మహర్షి, శ్రీకృష్ణ భగవానుని లీలలను ప్రత్యక్షంగా వర్ణించమని ప్రేమతో మార్గదర్శనం చేస్తారు. ఈ పవిత్రమైన సంభాషణ, సమస్త వేదవాఙ్మయపు పరిపక్వ ఫలమైన శ్రీమద్భాగవతం రచనకు పునాది వేస్తుంది.
In this episode of our Srimad Bhagavatham series, we explore the sacred arrival of Narada Muni at the hermitage of Vyasadeva on the banks of the Saraswati River. Despite having compiled the Vedas, Puranas, and Mahabharata, Vyasadeva is overcome by a deep sense of incompleteness and spiritual restlessness. Recognizing his disciple's inner turmoil, the divine sage Narada lovingly guides Vyasadeva toward the highest truth — the direct glorification of Lord Sri Krishna. This profound spiritual consultation sets the foundation for the composition of the Srimad Bhagavatham, the ripened fruit of all Vedic literature.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే ఓ భగవానుడా, పూర్ణుడవగు నీకు నమస్కారం. సర్వాంతర్యామి, సకల ప్రాణులకు అధిష్టానవగు నీవు. సర్వలో ఆత్మరూపుడవై ఉన్నావు. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని. సదనుడవు నీవే టెన్త్ కాంటు 16th చాప్టర్ 39th ప్రేయర్ భగత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము ఆరవ పాడ్కాస్ట్ లో స్వాగతం ఇంతవరకు ప్రియవర్తని చరితము, నాభి చరితము, వృషభదేవుని యొక్క చరితము, అందుభాగంగా ఋషదేవుడు తను తన కుమారులకు ఉపదేశించినటువంటి భక్తి యోగాన్ని, కర్మ యోగాన్ని మనం విన్నాము. ఇంకా భక్తి యోగంలో వివరాలని మోక్ష మార్గాన్ని మనకు వినిపించబోతున్నారు. శ్రద్ధగా అలకిద్దాం. వృషభ దేవుడు తన కుమారులకు ఇంతవరకు భక్తి యోగమును మోక్ష మార్గమును ఉపదేశించెను. ఇంకను ఇట్లు చెప్పుచున్నారు. ఓ పుత్రులారా, నా శరీరము లోకములో అందరి శరీరము వంటిది అని భావించుటకు వీలు కానిది. సప్త గుణములతో పూర్తిగా నిండినది. రజస్తమో గుణముల సంపర్కము లేదు. లోకుల శరీరములు సత్వరజస్తమో గుణములతో కూడినవి. నా శరీరము శుద్ధ సత్వమే గలది. అట్టి సత్వము నిండిన నాడు ధర్మమే ప్రధానమై నిండి ఉండును. అధర్మము దూరముగా తొలగును. సత్వగుణము అధికముగా ఉన్నవారికి భవత్గుణములు రుచించును. ప్రవృత్తి ధర్మములు రుచింపవు. అందుచే అందరికంటే శ్రేష్టుడను కనుక పెద్దలు వృషభుడు అని నన్ను వ్యవహరించిరి. మీరందరూ సత్వప్రధానముగు హృదయము గల నా నుండి జన్మించినారు కావున మీరు కూడా సత్వప్రధానులే. మీ సోదరుడు భరతుడు మీ అందరి చేతను పూజింపదగినవాడు. మనసులో కాపట్యము లేకుండా అతనిని సేవింపుడు. మన భరతుని సేవించుటచే నన్ను సేవించుట ప్రజలను పాలించుట అని భావింపుడు. పితృ సుశ్రూషచే ప్రజాపాలనచే లభించడి ఫలము భరతుని సుశ్రూషచే లభించును.
ఈ లోకములోని దేహములలో భూమి నుండి వెలుపలికి మలిచి వచ్చేడి మొక్కలు ఉత్తమమైనవి. వాటికంటే కదలాడి జంగమ శరీరములు గలవి గొప్పవి. వాని కంటే జ్ఞానము గల పశువులు మొదలగునవి గొప్పవి. ఆ పశువుల కంటే మనుషులు గొప్పవారు. వారి కంటే గంధర్వులు, సిద్దులు మొదలగువారు గొప్పవారు. వారి కంటే సురలు గొప్పవారు. సురలు కంటే ఇంద్రుడు మొదలగా గల దేవతలు గొప్పవారు. వారి కంటే బ్రహ్మ కుమారులకు దక్షాదులు గొప్పవారు. వారి కంటే వృద్ధునకు జనకుడొకటచే బ్రహ్మ గొప్పవాడు. ఆ బ్రహ్మ కంటే పరుడగు వాసుదేవుడునగు నేను గొప్పవాడను. ఓ జ్ఞానులారా! ద్విజులలో బ్రహ్మజ్ఞాన సంపన్నులు గొప్పవారు. బ్రహ్మజ్ఞాన సంపన్నులే బ్రాహ్మణులు. వారే వేదవేత్తలు. బ్రహ్మజ్ఞాన సంపన్నులగు బ్రాహ్మణులు సకల ప్రాణులలో శ్రేష్టులు. ఈ విశ్వములో బ్రాహ్మణులతో సమానముగు భూతము ఏదియు లేదని నా భావం. బ్రాహ్మణులకు అర్పించిన దానిని వారి ద్వారా నేనే స్వీకరింతును. అగ్నిహోత్రములో హోమము చేయుట కంటే బ్రాహ్మణులకు సమర్పించుట ఉత్తమం. నా మూర్తియే వేదము అది సనాతనమైనది. నా శరీరముకు ఈ ఆ వేదమును బ్రాహ్మణులు ధరించుచున్నారు. బ్రాహ్మణులయందు నిరతిశయ పవిత్రమగు సత్వగుణము ప్రతిష్ఠితమై ఉండును. బ్రాహ్మణుల యందు మను నిగ్రహమనడి శ్రమము, బాహ్యేంద్రియ నిగ్రహమనడి దమము, అన్రుతమాడకుండుట, భూతహితమనడి సత్యము, సర్వభూత దయ. తపస్సు, ఓరిమి, స్వాత్మ, పరమాత్మ యాధాత్మ్యమును అనుభవించుట అనునవి స్థిరముగా ఉండును. వారికి దేనియందు వాంఛ ఉండదు. బ్రాహ్మణుల కంటే పరుడను అనంతుడనగు నా నుండి కూడా వారు కోరదగినది ఏదీ ఉండదు. వారు అకించనులు. కోరదగినది ఏదీయు లేనివారు భగవానునందు భక్తి గల వారలకు ఐహిక పురుషార్ధములు ఎందుకు ఉపయోగపడును? ఇట్లు భగవద్భక్తులగు భాగవతులయందు భక్తి కలిగి ఉండుట చాలా ఆవశ్యకం. ఇంకను ఆ లోకములోని స్థావర జంగములకు భూతములన్నిటినీ భగవాను శరీరములుగా భావించుట భగవానుని ఆరాధించుటయే. దేహమును, జీవులను, పరమాత్మను స్వభావముచే వేరువేరుగా ఎరుంగ కలిగిన వారు.
విశ్వములో దేనిని చూచినను భగవదాత్మకముగా భావించి ఆరాధింతురు. అదియే భగవదారాధన. మనస్సుచే, వాక్కుచే, చూపుచే చేసే వ్యాపారములన్నిటినీ ఫలము నారాధనమే అని భావించిన వాడే ధన్యుడు. ఎవడు మృత్యుపాశము వంటి మహా మోహము నుండి విడివిడుట శక్యముగాక బాధపడుచుండునో వానికి భోగదారాధన ఒక్కటియే మోక్ష సాధనం. మనస్సుతో సర్వభూతములయందు భగవానునే భావించుచుండుట, మాటలతో భగవానుని గూర్చియే ప్రసంగించుచుండుట, చూపులతో భగవానుని దివ్య శరీరముగా విశ్వమునంతయు చూచుచుండుట అనునవే ముక్తి సాధనములు. ఇట్లు వృషభ దేవుడు తన కుమారులకు ఎరుంగవలసిన విషయములను ఆచరింపవలసిన కర్తవ్యమును ఉపదేశించెను. ఇట్లు లోకమునకు ఎరంగింపచేయుటకై సర్వభూత సుహృతగు వృషభ దేవుడు తన కుమారులకు జ్ఞానమును ఉపదేశించి ఇంద్రియ నిగ్రహమే శీలముగా గలవారను సర్వ కర్మలందు ఆసక్తి లేని వారలై సంతతము భగవానిని మననము చేయుచుండు వారును అగు తన కుమారులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ఉపదేశించి తన కుమారులతో పెద్దవాడును పరమ భాగవతుడును భాగవత భక్తి గలవాడునగు భరతుని రాజ్య పాలనమునకు నియమించెను. వృషభ దేవుడు అన్ని పరికరములను వదిలివేసి శరీరమును మాత్రమే ధరించి పరివ్రాజకుడై పిచ్చివాని వలె దిగంబరుడై జుత్తు జొల్లుకొని పోయిన వాడై ఉండెను. ఇంతకాలము తాను ఆరాధించిన అగ్నిని తనయందే సమారోహణము చేసుకుని బ్రహ్మవర్తము నుండి వెలలిపోయెను. జడుని వలె, మూగవాని వలె, చెవిటి వాని వలె, పిచ్చి వాని వలె, భూతావిష్ణుని వలె ప్రవర్తించుచు వధూత వేషముతో ఎవరు మాట్లాడినను మాట్లాడక మౌనముతో ఉండెను. అట్లు పోవుచుండగా మార్గములో పట్టణములలో పల్లెలలో కొందరు దుర్జనులు అతనిని అవమానించు ఉండరు. ఈగలు ఎనుగుపై వాలినట్లు అతను కొందరు అతనిని కొందరు బాధించుచుండరి. కొందరు బెదిరించుట కొందరు కొట్టుట కొందరు ఉమ్మివేయుట మూత్రమును పోయుట
కొందరు ఇసుక జల్లుట, రాళ్ళు విసురుట, తట్టుట చేయుచు అతనిని బాధించు ఉండెను. అతడు వానిని పట్టించుకొనకుండా దేహము అనునది ఉన్నను లేనిదిగా భావించుచుండెను. సంతతము మార్పు చెందెడి అచిత్తు యొక్క వికారమైన శరీరము. దేహాత్మ భ్రాంతి గల వారలకు తానుగా గోచరించుచుండును. కానీ వృషభ దేవుడు ఆత్మ స్వరూపమును పరమాత్మ స్వరూపమును ఎరింగి దేహమునందు నేను అనిటి భావము లేనివాడే ఉండెను. అంతటా బ్రహ్మమే అతనికి గోచరించుచుండెను. బ్రహ్మము ఆత్మగా లేని వస్తువు అతనికి గోచరమగుట లేదు. అట్టు భూమండములంతను సంచరించుచుండెను. అతని శరీరము అతి సుకుమారము. అతని హస్తపాదములు, వక్షస్థలము, బాహువులు పరమ సుందరములు. దీర్ఘములైన బాహువులు, విశాలమైన మోపులు గలవాడు, సహజముగా సుందరుడు. ఎల్లప్పుడూ చిరునవ్వు తొంగి చూచెడి మోహము కలవాడు. మోము కలవాడు. ఇంతకుముందు అతని రూపమును చూచిన స్త్రీలు కామపరవశులై బాధపడుచుండెడివారు. అట్టివాడు ఇప్పుడు ధూళి కమ్మిన జుట్టుతో, జటలతో, మలినమైన శరీరముతో గ్రహము పట్టిన వాని వలె కనపట్టుచుండెను. వృషభ దేవుడు కొంతకాలం ఇట్లు సంచరించి ఒకచోటనే పరుండి. ఉండి ఏది తన వద్దకు వచ్చిన దానిని మాత్రమే తినుచు కదలక మెదలక కొండచిలువ వలె అజగర వ్రతమును పాటించెను. అట్లు పరుండియే తినుట త్రాగుట మూత్ర విసర్జనము చేయుట పురీషమును విడుచుట మొదలగునవి చేయుచు తన నుండి వెడలిన మలమూత్రములలోని దొర్లుచు ఒంటి నిండా మలమూత్రమును పులుపుకొని పులుముకొని పోయి ఉండెడివాడు. అతని పురీషము దివ్యమగు పరిమళములు గలదై ఉండెను. ఆ పరిమళం దాల్చిన వాయువు 100 యోజనముల మేరను మంచి వాసన వెదజల్లుచుండెను. ఈ విధముగా కొంతకాలము అజగర వ్రతము చేసి కొంతకాలము గోవు వలె కొంతకాలము మృగము వలె కొంతకాలము కాకి వలె సంచరించుచు నడుచుచు కూర్చునుచు పరుండుచు ఆయా జంతువుల వలె తినుట త్రాగుట చేయుచుండెను. ఈ విధమగు యోగ చర్యలను చేయుచు వృషభ దేవుడు తనకును అన్ని ఆత్మలకును ఆత్మ అయిన వాసుదేవుని యందు నిశ్చలముగా నిలిపిన మనసుతో ఆ భగవత్ స్వరూపము గోచరము కాకుండా చేసెడి కర్మ తొలగిన వాడై శరీరము కన్నా వేరెన భగవానుడే. ఆత్మగా గల ఆత్మ స్వరూపమును ఎల్లప్పుడూ దర్శించుచుండెను. అతనికి కోరిక లేకపోయినను సర్వశక్తులు అతనికి యోగ బలముచే లభించెను.
అతనికి ఇచ్చ లేకపోయనును ఆకాశములో వెళ్ళగలిగిన శక్తి, మనస్సు వేగముతో పోగలిగిన శక్తి, అంతర్ధాన శక్తి, పరకాయ ప్రవేశము శక్తి. దూరగ్రహణ శక్తి మున్నగునవి అన్నియు కలిగెను. కానీ అవి తన ముక్తికి విరోధులని వృషభ దేవుడు వారిని ఆదరించి స్వీకరించలేదు. దీని తర్వాత భాగాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. వృషభ దేవుని యొక్క చరిత్ర. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru, salutations to you, the Lord, the great soul, the sustainer of beings, the supreme soul, O Lord, I bow to you, the complete one. Omnipresent, You are the Lord of all living beings. You are the form of the supreme soul. Without the material possessions of the world. You are always the one, tenth, 16th chapter, 39th prayer, devotees of Bhagat, welcome to the fifth Skandha of Srimad Bhagavata Tattva Deepika, in the sixth podcast. So far, the story of Priyavarta, the story of Nabhi, the story of Vrishabhadeva, As a part of that, we have heard of the Bhakti Yoga and Karma Yoga that Rishadevudu taught to his sons. Furthermore, they are going to explain the details of Bhakti Yoga and the path to liberation to us. Let's make sure we get it right. The bull god has thus far instructed his sons in devotion, yoga, and the path to liberation. They are still saying this. Oh sons, my body is not like everyone else's in the world, it is impossible to imagine. Fully saturated with seven attributes. There is no contact of qualities of Rajastham. Human bodies They are made up of the sattva, rajas and tamas gunas. My body is pure essence. When such a quality is filled, then dharma is the main thing. Evil will never go far. Those who have a predominance of sattva guna will find the gunas of bhava pleasing. Inclinations are not in accordance with nature. Therefore, because I am the best of all, the elders treated me as Vrishabhudu. All of you are born from me, who has a heart full of goodness, therefore you are also full of goodness. Your brother Bharata is worthy of worship by all of you. Serve him without any hidden motives. He thinks that serving Bharata is serving me and serving the people. The fruit obtained by serving ancestors and nurturing the people will be obtained by serving Bharata.
Among the bodies in this world, the plants that come out from the earth are the best. They are greater than those with mobile and transient bodies. Cattle, etc., are greater than men. Humans are better than animals. Gandharvas and Siddhas are superior to them. Superior in strength to them. The gods, Indra among them, were greater than the Suras. Daksha and his sons were greater than them. Brahma is great because he is older than them. I am greater than Brahma, I am Vasudeva, who is beyond. Oh, saints! The twice-born, the enlightened ones, are great among men. Brahmins are those who have realized Brahman. They are the Veda scholars. Brahmins, who are endowed with divine knowledge, are the best among all living beings. In this universe, there is no being equal to Brahmins, that is my feeling. I accept what is offered to the Brahmins by them. Offering to a Brahmin is considered holier than sacrificing to a fire. My idol is the Vedas, it is eternal. To my body, this Veda Brahmins are wearing. Among Brahmins, the quality of goodness, which is supremely sacred, is established. Among Brahmins, self-control is the effort, external sensory control is self-control, not speaking untruth, truth is that which does not harm beings, compassion for all beings. Penance, self-control, self-awareness, and the experience of the supreme self and the supreme soul will remain firm. They have no desire for anything. There is nothing that they can ask from me, who is infinite and greater than the Brahmins. They are insignificant. Why are worldly pursuits useful to those who have nothing to do but to be devoted to God? Thus, it is very necessary to have devotion among the devotees of the Lord. Furthermore, considering all the ghosts and spirits as the bodies of the Lord, and worshipping the Lord is the same. They are those who are different in nature, the body, the living beings, and the Supreme Soul.
Whatever they see in the universe, they consider it as divine and worship it. It is Bhagavata worship. He who thinks that the fruit of all the businesses done by mind, speech, and sight is worshiping Narada is blessed. He who is suffering from great delusion like the noose of death, it is difficult to be freed from it, for him, only the worship of pleasures is the means to salvation. To contemplate the Lord in all beings with the mind, to speak about the Lord with words, to see the Lord as the divine body throughout the universe with sight, these are the means to attain liberation. Thus, the bull god instructed his sons on what to learn and what duties to perform. Thus, to make the world prosper, the Vrishabha deity, who is the benefactor of all beings, imparted knowledge to his sons, taught them, and those who have self-control as their characteristic, those who are not interested in all actions, and those who constantly meditate on the Lord, his Having taught his sons devotion, knowledge, and detachment, he appointed Bharata, who was older and the supreme devotee, and who had devotion to the Bhagavata, to rule the kingdom. Taurus Having abandoned all instruments, having only clothed the body, being a wanderer, being naked like a madman, having shaken his hair and gone away. For so long, he had worshipped the fire, and having summoned it within himself, it emerged from Brahmavartam. Like a madman, like a mute, like a deaf person, like a mad person, like a ghost, he behaved as if he was in disguise, and he remained silent without speaking. While going like that, on the way, in towns, in villages, some wicked people will not insult him. Like flies on an elephant, some of them are troubling him, some of them are troubling him. Some threaten, some fight, some spit, and some urinate
Some people were causing him pain by throwing sand, stones, and hitting him. He, without paying attention to her, considered his body as if it existed or did not exist. The distorted body of the unconscious that changes constantly. He appears as himself to those who have the illusion of a body. But the bull god, the form of the soul, the form of the Supreme Soul, in the body of Eringi, there was no one without the feeling that it is me. At the end, only Brahma was visible to him. That which is not perceptible to him is Brahman as the soul. It was traveling all over the earth. His body is very delicate. His hands, chest, and arms are extremely beautiful. One with long arms and broad shoulders is naturally handsome. The one who always had a smiling face and a curious heart. A man of mood. Women who had seen his form before were driven to lust and suffering. That person now appeared as if he had taken on an earthly form, with dust-covered hair, matted hair, and a filthy body. The bull god wandered around for some time and then stopped at one place He stayed. Whatever came to him, he only ate it, without moving or stirring. Like a python, he observed the vow of the Ajagara. Thus, lying down, eating, drinking, urinating, defecating, etc., he would be rolling in the excrement that came out of him, filling his body with excrement, souring it, and going away. His loincloth was divinely fragrant. That fragrance, the scent of cinnamon, spread a good fragrance for 100 yojanas. In this way, after performing the Ajagara Vrata for some time, he would roam, walk, sit, and lie down like a cow, like a beast, like a crow for some time, eating and drinking like those animals. Performing these kinds of yogic practices, the bull-like God, with a mind steadfastly fixed on Vasudeva, the soul of all souls, without the manifestation of that divine form, having removed the karma, is none other than the Lord, who is beyond the body. He always saw the form of the soul as a soul. Even though he did not have the desire, all the powers, through his yoga strength I found it.
He has the power to go into the sky without a veil, the power to go with the speed of mind, the power to disappear, the power to enter another body. The power of the distant planets, etc., all came together. But the bull god did not accept them, saying that they were against his liberation. Let's review the previous part and come back to this later. The Legend of Vrishabha. Jai Srimannarayana and salutations to the Ashmadguru.