ఋషభదేవుని కుమార ఉపదేశాలు (భాగం 1)

Lord Rishabhadeva's Instructions to His Sons (Part 1)

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ ఎపిసోడ్‌లో, భగవాన్ ఋషభదేవుడు సన్యాసం స్వీకరించే ముందు తన నూరుగురు కుమారులకు అందించిన అమూల్యమైన జ్ఞానోపదేశాలను తెలుసుకుంటాము. మానవ జన్మ ఇంద్రియ సుఖాల కోసం కాకుండా, ఆత్మజ్ఞానం మరియు భగవద్భక్తి కోసమే లభించిందని ఆయన స్పష్టంగా బోధిస్తారు. ఈ దివ్యమైన ఉపదేశాలు జీవిత పరమార్థాన్ని వెల్లడించి, ముముక్షువులకు సన్మార్గం చూపే శాశ్వత వెలుగుగా నిలుస్తాయి.

In this episode from the Fifth Canto of Srimad Bhagavatham, we explore the profound wisdom imparted by Lord Rishabhadeva to His one hundred sons before renouncing the world. He teaches that the human form of life is not meant for sense gratification but for the pursuit of self-realization and devotion to the Supreme Lord. His timeless instructions reveal the highest purpose of existence and serve as a guiding light for all sincere seekers on the spiritual path.

← Prev Next →
Lord Rishabhadeva's Instructions to His Sons (Part 1) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శ్రీ కృష్ణ వృష్ణి కుల పుష్కర జోష దాయిన్ క్ష్మానిర్జరద్విజపశూదధివృద్ధికారిన్ ఉద్ధర్మశార్వరహరక్షితిరాక్షసధ్రిక్ ఆ కల్పమార్క మరుషన్ భగవన్ నమస్తే ఓ శ్రీకృష్ణ భగవానుడా నీవు వృష్టి వంశముని పద్మమును వికసింపచేసిన సూర్యుడవు. భూమి, దేవతలు, వేదవేత్తలు, పశువులు అనే సముద్రమును వర్ధిల్ల చేసిన చంద్రుడవు. ధర్మం వలె కనబడే అధర్మమనే రాత్రి చీకట్టిని పోగొట్టే సూర్యుడవు. నీవు భూలోకమునందరి రాక్షసులను సంహరించెదవు. సూర్యునితో సహా అందరూ నిన్ను పూజించెదరు. నీకు కల్పాంతం వరకు నేను నమస్కరించుచున్నాను. 10th క్యాంటో, 14th చాప్టర్, 48th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు. ప్రియవర్తుని చరిత్రము దానిలో భాగంగా నాభి యొక్క చరిత్రము తరువాత తన పుత్రుడైనటువంటి వృషభ దేవుడి యొక్క చరిత్రము మనం అనుభవిస్తున్నాం. వృషభ దేవుడు తను ఉపదేశిస్తున్నాడు జీవితం గురించి. దానిలో కర్మ భాగాన్ని చెప్తున్నాడు మనం అది మనం అనుభవిద్దాం. జీవునకు కర్మ సంబంధం ఎప్పుడు ఆరంభమైనదో తెలియదు. అనాది కర్మ సంబంధముచే వాసనలు ఏర్పడెను. ఆ వాసనలచే తాను కానీ శరీరమును తాననియు తనది కాని ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలగు వారందరూ తనవనియు తోచుండును. ఇదియే అవిద్య. ఈ అవిద్య చేతనే జీవునకు శరీరముతో సంబంధం ఏర్పడును. దేహ సంబంధముచే మరల కర్మ చేయుచుందురు. కర్మలు చేయుటచే సుఖము దుఃఖము కలుగుచుండును. ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును. ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండుటచే మరల కర్మలు చేయుచుండును.

ఇట్టి చక్ర భ్రమణము దేవుని యందు భక్తి కలిగిన గాని ఆగదు. ఈ వాసనలే సంసారమునకు మూలము. మనసున అంటిన వాసనలు తొలుగుటయే ముక్తికి మూలము. ఈ వాసనలు ఏర్పడుటకు పురుషుడు, స్త్రీ అన్యోన్యానురాగముతో కలియుట హేతువు. వాయి హృదయములను అనురాగమే ఒకదానితో ఒకదానిని ముడివేయును. ముడివేయుటచే విడదీయరాని స్బంధము ఏర్పడును. దాని చేతనే మనసులో వాసనలు ఏర్పడి ఇది నా ఇల్లు, నా భార్య, నా క్షేత్రము, నా కుమారులు నేను దీనిని అనుభవించుచున్నాను. కాపాడుచున్నాను అనడి అహంకార మమకారముననడి మోహము ఏర్పడును. ఇదియే అవిద్య. కర్మ చేయుటచే మనసులో వాసనలు ఏర్పడి వాసనలచే విప్పుకొనుటకు వీలుకాని గ్రంథి వంటి బంధము ఏర్పడును. దానిని శిథిలము చేసిన గాని సంసారము నుండి ముక్తి పొందలేరు. వాసనలతో కూడిన మనస్సు విప్పుటకు వీలుగాని ముడిచే బంధింపబడినదని గుర్తించవలెను. ఆ ముడి విడిన నాడే ఈ సంసారము నుండి వీడి భగవానుని పొందును. ఈ హృదయ గ్రంథి శిథిలమగుటకు కొన్ని సాధనములు ఉన్నవి. అవిద్యా దోషము వాసనకైనను లేని హంస వలె స్వచ్ఛమైన గురువునందు ప్రేమ కలిగి ఉండవలెను. హితమును ఉపదేశించువాడే గురువు. గురు భగవత్ స్వరూపుడే అందుచేత గురు భక్తియే హృదయ గ్రంథి ఛేదనమునకు మంచి సాధనము. అట్టి గురువును అనువర్తించుచుండవలెను. అట్లు ఉండిననాడు అతని ఉపదేశములచే శబ్దాది విషయములందు తృష్ణ తొలగును. ఇంకా కావలెననిటి కోరిక తగ్గును. చలి, వేడి, ఆకలి, దప్పి మొదలగు ద్వంద్వములను ఓర్చుకొనుటి స్థితి కలుగును. ఇట్లు ఉన్నను పై స్వర్గాది లోకములలో ఉన్నను దుఃఖం వదలదని ఎరుంగుటచే ఆ సుఖములందు కోరిక తగ్గును. ఏది స్వీకరింపదగినదో ఏది విడువదగినదో, ఏది ఆచరింపదగినదో, ఏది మానదగినదో ఎరుంగవలెనని కోరిక ఉండవలెను. సతతమో భవత్స్మరణతోని పెద్దల సేవలతోని కాలము గడుపుటచే వ్యర్థమైన కోరికలు తొలుగును. ఇట్లు మనసునందలి వాసనలు అనడి గ్రంధులను తొలగించుకొనుటకు ప్రయత్నించవలెను. తరువాత తాను చేయు కర్మలను భగవదారాధనగానే చేయుట అలవరచుకొనవలెను. భాగవతుల సహవాసము చేయుచుండవలెను. భగవద్గుణములచే కీర్తించుచుండవలెను. ఎవరియందును వైరముండరాదు. అందరినీ సమముగా చూచుట అలవరచుకొనవలెను. ఇంద్రియముల ఉద్రేకము తగ్గవలెను. దేహము నేను అనడి బుద్ధి ఇది నాది అనడి బుద్ధి పోవలెనని కోరిక కలగవలెను.

దేహము కంటే వేరైన ఆత్మ యాధాత్మ్యమును సంతతము భావించుచుండవలెను. సాత్వికాహారమును తీసుకునుచుండవలెను. ప్రాణములను ఇంద్రియములను తన వశమునందుంచుకొనుటకు ప్రయత్నము చేయవలెను. మంచి శ్రద్ధ కలిగి ఉండవలెను. తన హితమును తాను పొందుటకు ఉపాయమును వినవలెనని శ్రద్ధ ఉండవలెను. స్త్రీ సంఘము వీడవలెను. ఎల్లప్పుడూ చేయవలసిన పనులను పరాగుచే మానకుండా ఉండవలెను. మాటను నియమముతో వ్యవహరించుట నేర్చుకొనవలెను. సర్వ భూతముల యందు బ్రహ్మయే ఆత్మగా ఉన్నదని అన్నిటినీ బ్రహ్మాత్మకముగా ఎరుంగవలెను. శాస్త్రాధ్యయనము చేసి జ్ఞానముతో భగవత్ స్వరూప రూప గుణ విభూతులను ఎరింగి ధ్యానము చేయవలెను. దానియందే స్థిరముగా మనసును నిలిపి ఉండవలెను. ఎన్ని విఘ్నములు కలిగినను చలింపక ధైర్యముగా ప్రవర్తించుచుండవలెను. తాను పొందవలసినవేవియో పొందుటకు చేయదగిన సాధనములేవియో ఎరింగి ఆచరించుటలో నేర్పుగలవాడై ఉండవలెను. ఈ దేహమునకు మూలము అహంకారము. ఆ అహంకారమే అజ్ఞానమును కలిగించి హృదయ గ్రంధులను అనగా వాసనలను ఏర్పరిచి ఆత్మను దేహముతో బంధించును. ఈ పైన చెప్పిన ఉపదేశమును పరాకు లేకుండా గ్రహించి ఆచరించి వాసనలను చక్కగా తొలగించుకొనవలెను. అవి తొలగు వరకు ఈ ఉపాయమును శ్రద్ధతో ఆచరించవలెను. ఇదే సంసారమనడి రోగము తొలువుటకు ప్రధానమైన వందు. ఇదియే యోగము. ఈ లోకములో భగవత్ అనుగ్రహముని పరమ ప్రయోజనముగా భావించి. భగవన్ లోకమును పొందవలెనని కోరెడి తండ్రి తన పిల్లలకును, గురువు తన శిష్యులకును, రాజు తన ప్రజలకును దీనిని తప్పక నేర్పవలెను. అంతేయే గానీ ఆత్మజ్ఞానము లేకుండా కర్మాచరణమే ప్రధానమని భావించి వారిని కర్మాచరణం చేయుటయందు వినియోగింపరాదు. వారు అజ్ఞానముచే అశక్తిచే ఎరుంగలేక శ్రద్ధ లేక సరిగా ఆచరింపలేకపోయినను కోపము తెచ్చుకొనక మరల మరల వారిని శాసించుచుండవలెను. ఈ లోకము తనకు శ్రేయస్సు ఏదో ఎరుంగదు. ఆ శ్రేయస్సును ఆర్జించుటకు మార్గమేదో ఎరుంగదు.

కోరికలే అధికమగుటచే శబ్దాది విషయములనే కోరుచుండును. అనర్థములను కలిగించెడి కర్మలనే చేయుచుండవలెననిపించును. తనకు ఉపయోగించెడివని మానవులు చేసెడి కర్మలన్నియు అనర్థములనే కలిగించును. ఆ కర్మలు ఆచరించుటచే కలిగెడి సుఖము అత్యల్పమైనది. దానికై తాను ప్రాకులాడుచుండుచ్చే ఒకరితో ఒకరికి వైరము ఏర్పడుచుండును. దానితో అనంతములగు దుఃఖములు కలుగుచుండును. మూఢుడు తనకు శ్రేయస్సు ఏదో ఎరుంగలేడు. ఎరుంగక కర్మ మార్గమునందే ప్రవర్తించుచున్న మూఢుని మంచి మనసు గలవాడు. ఎవ్వడును వారించకుండా ఉండలేడు. కర్మ మార్గమున ప్రవర్తించి కోరి తనకు అనర్థమును తెచ్చుకొను వారిని చూచి వారింపని వాడు అతని శత్రువే కానీ మిత్రుడు కాదు. గుడ్డివాడు తెలియక తప్పుదారి. పోవుచున్నప్పుడు కన్నున్నవాడు ఎవడును అటు కాదు ఇటు రమ్మని చెప్పక ఊరకుండగలడా? భక్తి యోగమును ఉపదేశించి సంసార నివారకమైన భక్తి మార్గమున మరలింపని వాడు ఎవడైనను దేహ సంబంధము చేయువాడు గురువైనను గురువు కాడు, తండ్రి అయినను తండ్రి కాదు, బంధువైనను బంధువు కాడు. ఉపదేశించిన తల్లి తల్లి కాదు, అట్టి దైవము కూడా దైవము కాదు. భర్త భర్త కాదు. దేహ పోషణమునకై కోరికలతో కర్మలు ఆచరించి మనసులో వాసనను పెనవేసుకొని ఇంతకంటే నీచమైన జన్మలకు పోబోవుచున్న వారిని చూచి వారింపకుండని వారు మృత్యువు దగ్గర పడుచుండగా చూచి నివారింపని వాడు ఎంతటి ద్రోహియో అంతటి అంత ద్రోహియే అగును. వృషభ దేవుడు తన కుమారులకు ఇంతవరకును భక్తి యోగమును మోక్ష మార్గమును ఉపదేశించెను. దీని తరువాత భాగంలో ఏం ఉపదేశిస్తున్నారో మళ్ళీ మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Gurus. Sri Krishna, the son of Vrishni, the giver of the Pushkara festival, the destroyer of sins, the increase of the cows, the protector of the good, the destroyer of the demons, the destroyer of the demons, the destroyer of the Kapha, the destroyer of the Maruts, salutations to you, Lord. Oh, Sri Krishna Bhagavan, you Oh, you who have made the lotus blossom, the sun of the Vrishti dynasty. You are the moon, who has made the ocean of earth, gods, scholars, and animals flourish. Like dharma, you are the adharma night, the sun that dispels it. You will slay all the demons in the world. Everyone will worship you including the sun. I bow to you, O Lord, who are worthy of my salutations till the end of time. 10th Canto, 14th Chapter, 48th Prayer. Devotees of God, welcome to the fifth episode of Srimad Bhagavata Tatva Deepika Panchama Skandham. Until now. Priyavartuni Charitramu, as part of that, Nabhi's Charitramu, after that, we are experiencing the Charitramu of his son, Vrishabhadeva. The bull is the representation of Lord Vrishabha, who is the guiding spirit behind the life. He is telling the karma part in it, we will experience it. To the living being The karmic connection is never made conscious. Due to the karmic connection of the past, the aromas were formed. He feels that he is not his body, but his body is his, and that he is not his house, wife, children, and everyone else. It is ignorance. It is because of this ignorance that a living being is connected with the body. They perform karma again due to bodily connections. Suffering and happiness are caused by actions. He experiences pleasures and pains. Because of experiencing happiness and sorrow, one performs actions again.

This cycle of rotation will not stop even if one has devotion to God. These smells are the source of all of life. The removal of the impressions that have touched the mind is the root of liberation. The reason for the formation of these fragrances is the union of a man and a woman with mutual love. Love unites hearts. By tying it up, an inseparable bond is formed. It is by that that fragrances are formed in the mind, this is my house, my wife, my field, my sons, I am experiencing this. I am protecting, saying that, ego, attachment, and delusion arise. It is ignorance. By performing actions, impressions are formed in the mind, and a knot-like bond is formed that cannot be broken by the impressions. Even if it is destroyed, one cannot be liberated from worldly life. The mind, filled with fragrances, is bound by a knot that cannot be untied. The day that knot is untied, one will be freed from this worldly life and attain God. There are some means by which this heart gland can be damaged. One should have love for the Guru, as pure as a swan that has no fault of ignorance. Hitamuni The teacher is the one who teaches. The Guru is the embodiment of God; therefore, devotion to the Guru is a good means for the piercing of the heart's knot. Such a guru should be followed. When that happens, his teachings will remove thirst for worldly matters like sound. The desire for what is lacking will decrease. The state of enduring duality such as cold, heat, hunger, thirst, etc. Even if it is like this, even if it is in the upper heavens and other worlds, knowing that sorrow will not leave, the desire for those pleasures will decrease. One should have the desire to know what is acceptable, what is unacceptable, what is to be practiced, and what is to be avoided. By constantly remembering you and serving elders, and spending time, vain desires will be removed. Thus, one should try to remove the feelings and thoughts that reside in the mind. Afterwards, one should make it a habit to perform the actions one performs as a form of worship to God. One should always associate with devotees. May we be praised by the virtues of the Lord. There should not be animosity amongst them. One must learn to treat everyone equally. The arousal of the senses must be lessened. The body is me, the intellect is this, it is mine May the desire to lose consciousness arise.

The soul, different from the body, should always be considered as distinct. One should take a vegetarian diet. One should try to keep their life and senses under their control. Good care is important. One should have the determination to listen to the means to obtain one's own good. The women's association is different. One should not neglect the tasks that must be done. We must learn to deal with words in a disciplined way. It is said that in all beings, Brahma is the soul, and one should understand everything as Brahma. Having studied the scriptures, one should meditate on the form, qualities, and manifestations of the divine with knowledge. It is to be steadfast in that. No matter how many obstacles there are, one should act courageously without wavering. He should be skilled in practicing what he needs to attain and what are the means to attain. The root of this body is ego. That ego causes ignorance and forms the glands of the heart, that is, the senses, and binds the soul to the body. Without missing the above-mentioned advice One should accept, practice, and properly eliminate the smells. This remedy should be followed with care until they disappear. This is the main reason for the disease called family life. It is yoga. Considering the grace of God as the ultimate purpose in this world. The father who desires to attain God's world must teach this to his children, the guru to his disciples, and the king to his people. That's all, but without self-knowledge, considering karma as the main thing, they should not be used in performing karma. They, due to ignorance, due to inability, unable to understand, without diligence, without being able to practice properly, without getting angry, should repeatedly admonish them. This world does not know what good fortune is. The way to prosperity is not known.

Desires are excessive, therefore one desires worldly things. It seems that one should do only those actions that cause misfortunes. All the actions done by humans, thinking that they are for oneself, cause only misfortunes. The happiness derived from performing those karmas is very little. For that, he is fighting with someone, and enmity arises between them. With that, infinite sorrows arise. The fool cannot understand what good he has. The fool who is acting only in the path of karma is good-hearted. Nobody can help themselves. He who does not stop those who act in the path of karma and bring ruin to himself, is his enemy, not a friend. A blind man makes a mistake. While going, can anyone with an eye not stay quiet without telling him to come this way? He who preaches Bhakti Yoga and does not turn away from the path of devotion that removes worldly attachments, even if he is a guru, is not a guru; even if he is a father, he is not a father; even if he is a relative, he is not a relative. The mother who gave the teaching is not just a mother, but also a divine being It's not God. The husband is not the husband. Those who perform actions with desires for the nourishment of the body, and cling to the impressions in their minds, and seeing those who are about to go to even lower births than this, and seeing them falling near death without preventing them, and seeing him who does not prevent them, how much of a traitor is he, so much so He's a schemer. The bull god has thus far taught his sons devotion, yoga, and the path to liberation. Let's find out what they are preaching in the next part. Jai Srimannarayana. Salutations to the Gurus