అగ్నీధ్ర మహారాజు వంశానుక్రమణం
King Agnidhra's Lineage & Genealogy
ఈ ఎపిసోడ్‌లో శ్రీమద్భాగవతంలోని అగ్నీధ్ర మహారాజు వంశక్రమాన్ని విశదంగా తెలుసుకుంటాము, ఆయన ప్రియవ్రతుని పుత్రుడిగా జంబూద్వీపంలోని తొమ్మిది వర్షాలను తన పుత్రులకు పంచి పాలించిన వైభవాన్ని అర్థం చేసుకుంటాము. అగ్నీధ్రుని తొమ్మిది మంది కుమారులు ఆయా వర్షాధిపతులుగా నియమింపబడి, ధర్మబద్ధమైన రాజ్యపాలనను నిర్వహించారు. భాగవతం కేవలం చరిత్రను మాత్రమే కాకుండా, సృష్టి, రాజధర్మం మరియు వంశపారంపర్య ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే దివ్యగ్రంథమని ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తుంది.
In this episode of our Srimad Bhagavatham podcast, we explore the royal lineage of King Agnidhra, the devoted son of Priyavrata, tracing the sacred genealogy of his descendants across the nine divisions of Jambudvipa. Each of Agnidhra's nine sons was entrusted with rulership over one of these great varshas, establishing a divine order that reflects the cosmic arrangement of the earth. This episode illuminates how the Bhagavatham preserves not merely history, but a profound spiritual vision of creation, kingship, and dharmic responsibility passed through noble bloodlines.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోత గుణచ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః వసుదేవ పుత్రుడవగు నీవే సృష్టికర్తవగు భగవానుడవు నీ వలన ప్రకాశించే సత్వాది గుణములు నీ యధార్ధ స్వరూపమును కప్పివేయును. అట్టి పరబ్రహ్మవగు నీ కొరకు నమస్కారము. టెన్త్ క్యాంటో టెన్త్ చాప్టర్ 33rd ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. పంచమ స్కంధములో ఒకటవ రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం ప్రియవరత చరిత్రలో భాగంగా ప్రియవ్రతుడికి బ్రహ్మదేవుడు, నారదుడు కలిసి వచ్చి ఉపదేశం చేసినటువంటి ఉపదేశాన్ని తరువాత స్వయంభవ మనువు. వనాలకు వెళ్ళిపోవటం ఆ తరువాత ప్రియవ్రతుడు తన భార్య పిల్లలతో రాజ్యాన్ని అనుభవిస్తూ ఉండడం వరకు మనం తెలుసుకున్నాం తరువాత భాగాన్ని అనుభవిద్దాం. ఇట్లు పరిపాలించుచు దివ్య ప్రభావముచే అతి మానుషమగు ఒక చేష్టితము చేసెను ఎవరు ప్రియవ్రతుడు. సూర్యుడు మేరు పర్వతమునకు చుట్టూ తిరుగుచు ప్రకాశమునిచ్చుచుండెను. ఇచ్చుచుండెను కానీ ఆ మేరువునకు సూర్యుడు దక్షిణముగా తిరుగునప్పుడు ఉత్తర భాగమున చీకటి ఆవరించి ఉండును. ప్రియవ్రతునకు అట్లు సగము చీకటిగా ఉండుట ఇష్టము లేక సూర్యునితో సమానమగు వేగము గల సూర్యుని వలె ప్రకాశించుచున్న రథమునెక్కి. సూర్యుడు ఉత్తరం వైపున ఉన్నప్పుడు దక్షిణ వైపున దక్షిణ వైపున ఉన్నప్పుడు ఉత్తర వైపున రెండవ సూర్యుడా అనునట్లు భూమిని పరిక్రమించుచుండెను. ఆ ప్రియవ్రతుడు తన రథముతో భూమిపై సంచరించినప్పుడు చక్రపు తాకిడిచే భూమిపై ఏర్పడిన గోతులే ఏడు సముద్రములైనవి.
మేరు పర్వతమునకు చుట్టూ భూమిపై అతడు ఏడు సార్లు తిరిగెను. కనుక ఏడు సముద్రములు ఏర్పడినవి. ఆ సముద్రముల మధ్య భాగము ద్వీపములుగా ఏర్పడెను. జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము, కుశ ద్వీపము. క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము అని ఆ ద్వీపముల పేర్లు. ఒక ద్వీపము కంటే ఒక ద్వీపము రెండు రెట్లు అధిక పరిమాణము కలవి అయి ఉండెను. ఏడు సముద్రములకు లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోద సముద్రము, శుద్ధోద సముద్రము అని పేర్లు. ద్వీపములకు అగర్తల వలె సముద్రములు ఉండెను. జంబూ మొదలగు ద్వీపములయందు తనతో సమానులగు కుమారులను అగ్నీధ్ర, ఇధ్మజిహ్వ, యజ్ఞబాహు, హిరణ్యరేత, ఘృతవృష్ట, మేతా మేదాతిథి. వీతిహోత్రులు అనేటి వారిని ప్రియవర్తుడు పరిపాలకుడుగా నియమించెను. తన కుమార్తెయగు ఊర్జస్వతిని శుక్రాచార్యునకు వసంగెను. ఆమె యందే శుక్రునకు దేవయాని అనేటి కన్యక పుట్టెను. భగవానుని పాదములను ఆశ్రయించి ఆ పాద పరాగముచే ఇంద్రియములను జయించిన వారల యొక్క వ్యాపారములు ఈ విధంగా ఉండును. విచిత్రములు అవి ఊహించుటకు అందనివి. మూడు లోకములను తన పాదములతో కొలిచిన మహాపురుషుని ఆశ్రయించిన వారికి అసాధారణమైన శక్తులు కలుగుటలో ఆశ్చర్యం ఏమున్నది? భగవన్ నామమును ఒక్కసారి ఎనను మనసున స్మరించిన వారలకు మనసునకు వాక్కుకు గోచరము గాని ప్రభావము కలుగును. వారు అసన్మార్గమును ఆశ్రయింపరు. వారు చివరకు బంధమును వీడి ముక్తిని పొందుదురు. ఇట్టి దివ్యశక్తి గల ప్రియవ్రతుడు. అపరిమిత బల బలపరాక్రమములు గలవాడై మహర్షియగు నారదుని చరణ సేవచే లభించిన జ్ఞానము గలవాడయ్యి ప్రకృతి మార్గమునందు సంబంధము గలవాడై ఉండుట చేత అనుభవించిన భోగములచే తృప్తినందని వాడాయను. అతడు భోగములను నరకము వలె భావించుచు మనసు నిర్వేదము కలవాడయెను. అయ్యో నేను మొదట నివృత్తి ధర్మముతో ఉండెడి వాడను మనసున బాధించెడి ఇంద్రియము నన్ను వంచించినవి అజ్ఞానముచే విషయ భోగమునందు బుద్ధి ప్రసరించినది. విషయములే గడ్డి ప్రాకిన నూతులు అందులో నేను పడవేయబడితిని ఈ బర్హిష్మతి విలాసమునకు వినోద మృగమునైతిని అని తనను తాను నిందించుకొనెను.
ఈ విధముగా భగవత్ అనుగ్రహముచే లభించిన ఆత్మ విమర్శ గలవాడై తనను అనుసరించి ఉండెడి కుమారులకు సప్త ద్వీపములతో నిండిన భూమిని పంచి. ఇచ్చి తాను ఇంతకాలము అనుభవించిన భార్యను శివమును చూచినట్లుగా అపవిత్రముగా భావించి ఐశ్వర్యమును మహిషెగు బర్హిష్మతిని కూడా తప్పు చేసితినని పశ్చాత్తాపముతో విడిచిపెట్టెను. భగవత్ ప్రభావములను భావించుచుండెని నారదుని సేవించుచు ఉండవలెనని గంధమాధన పర్వతమున కేగెను. ప్రియవ్రతుడు చేసిన కర్మలను కీర్తించుచు కొందరిట్లు పాడి సర్వేశ్వరుడు తప్ప ప్రియవ్రతుడు చేసిన పనిని ఎవరు చేయగలరు? తన చక్రముచే ఏర్పడిన గోతులచే సప్త సముద్రమును ఏర్పరిచినాడు. ద్వీపములుగా భూమిని విభజించినాడు. దివ్యమైన భోగములను గాని మనుష్య లోకములో నుండు సుఖములను గాని యోగముచే కలిగెడి అణిమాది సిద్ధులను గాని అతను నరకంగా భావించినాడు. పరమ పురుషుని భక్తులే తనకు ఆత్తులని ప్రేమతో సేవించినాడు. ప్రియవ్రతునకు సాటి చెప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ప్రియవ్రతుడు రాజ్యమును పాలించి విరమింపగా అతని ఆజ్ఞను అనుసరించి పెద్ద కుమారుడు జంబూద్వీపును పాలించెను. ప్రజలను తన కన్న బిడ్డలను కాపాడినట్లు కాపాడెను. అతనికి సంతానము కలిగిన గాని పితృలోక ప్రాప్తి ఉండదని సంతానమును కోరి మందర పర్వతమున ఏకాగ్ర చిత్తముతో ప్రజాపతులందరుకు ప్రభువగు బ్రహ్మను సకల లోపచారములతో ఆరాధించెను. అతని ఆరాధనను ఎరింగి తన ఆస్థానములో గానము చేయుచున్న పూర్వచిత్తి అను పేరుగల అప్సరసను అతని వద్దకు పంపెను. ఆమె యందు అతడు సంతానం పొందవలెనని పంపెను. కానీ తపో విఘ్నమునకు కాదు. ఆమె అగ్నీర్ధ్రుని ఆశ్రమ ప్రాంతములో సంచరించుచుండెను. ఆ వనమునందు వృక్షములు వృక్షములను అల్లుకొనిన లతలు ఆ లతలపై జంటలు జంటలుగా పక్షులు ఉండెను. పక్షులు మధురముగా కూయుచుండెను. అందు జలాశయములు జలాశయములలో కూయుచున్న జలపక్షులు సుందరముగా ఉండెను. ఆమె ఉద్యానవనమున లలిత లలితముగా అడుగులిడుచు విలాసముగా నడుచున్నప్పుడు ఘల్లు ఘల్లుమని ఆమె కాలియందలు ధ్వనిని విని అగ్నీధ్రుడు సమాధియందు నేత్రములు మూసుకొని ఉన్నవాడు నేత్రములు విప్పి చూచెను.
ఆమె తుమ్మెద పుష్పమును వాసన చూచుచున్నట్లు వాసన చూచుచు నిలిచి ఉండెను. ఆమె నడకలు, ఆమె విహారములు, ఆమె బిడియముతో సంగు జంకుచు చూచెడి చూపులను, దేవతలను, మనుషులను కూడా ఆకర్షించినవై ఉండెను. అట్టి పూర్వచిత్తిని చూచి అగ్నీర్ధ్రుడు కామవర పర్వసుడాయెను. ఆమెనిట్టు ప్రశ్నించెను. నీవెవరవు? ఈ పర్వతమునందు ఏమి చేయుటకై తిరుగుచున్నావు? నీవు స్త్రీ రూపము దాల్చిన పరదేవతా స్వరూపుడవగు భగవానుడవా? ఆమె కనుబొమ్మలను చూచి ఏమి నారి కట్టకుండా రెండు విల్లులను ధరించి ఉన్నావు. మంచి హృదయము గల నా వంటి వాని కొరకు వింటిని ప్రయోగింప వచ్చితివా? లేక మృగములను వేటాడవలెనని విల్లు దాల్చి వచ్చితివా? ఆమె చూపులను చూచి ఏమి ఈ బాణములు? శతపత్రములను బోలి ఉన్నవి, మెల్లమెల్లగా సాగుచున్నవి. వాడి అయిన మొనలు లేకపోయినను సుందరముగా ఉన్నవి. నీవు ఈ బాణములను ఎవరిపై ప్రయోగించదలచి ఉన్నావు? నీ బాణములను వింటిని చూచిన మాకు భయమగుచున్నది. నీ పరాక్రమము మా వంటి జడబుద్ధులకు క్షేమమును కలిగించు కాక. ఆమె శరీరపు పరిమళమును అఘ్రాణించి వెంటనే వచ్చి వస్తున్న తుమ్మెదలను చూచి ఇట్లనుచున్నాడు. ఇదిగో, నీ శిష్యులు నీ వెంటనంటి నీ కేశముల నుండి జారిన పుష్పములు చుట్టూ ఆశ్రయించుచున్నవి. ఋషులు వేద శాఖలను నేర్చుటకు గురువులను ఆశ్రయించినట్లు ఈ తుమ్మెదలు నీ శిష్యులై నీ వెంటనంటి వచ్చుచున్నవి. నూపురములందున్న మణుల ధ్వనిని విని నీ పాదములకు అలంకరించుకొనిన ఈ నూపురములను పంజరములుగా చేసుకొని యజుర్వేదమును ప్రవర్తింపచేసిన ఋషులగు తిత్తిరులు అను మహాపురుషులు పలుకు వేద వాక్కును మేము వినుచున్నాము ఇది సత్యము. ఆ శబ్దము వర్ణధ్వని రూపముగా అభివ్యక్తమై ఉన్నది. నీ నితంబ కాంతి కదంబ పుష్ప వర్ణము గల పరిధాన వస్త్రముగా కనపడుచున్నది. గుండ్రముగా తిప్పుచున్న కొరివి నుండి పసుప్పచ్చని వలయాకారము కాంతి ఏర్పడినట్లు నీ నితంబ కాంతియే వస్త్రముగా నీ మధ్య భాగమును ఆవరించి ఉన్నది. వల్కలములు నీ సుందరములగు వక్షోజములను
శృంగముల యందు ధరింపబడి అనిర్వచనీయ సౌందర్యమును ప్రకాశింప చేయుచున్నవి. కానీ అది ఎట్టిదియో నిశ్చయింప జాలకున్నాను. నీ మధ్య కాయము చాలా కృషించి ఉన్నది. పై భాగమున శృంగములు ఎట్లు నిలుచున్నవో నాకు గోచరము కాలేదు. నా చూపు వానిని ఆశ్రయించినది. ఎర్రని కుంకుమ పంకము పరిమళము కలదై నీ శృంగముల యందు అలది ఉన్నది. ఆ పరిమళముచే నా ఆశ్రమమునంతయు పరిమళింపజేయుచున్నావు. ఓ మిత్రమా, నీ ఉండెడి లోకమును నాకు చూపింపుము. లోకములో ఉన్నవారు మా వంటి వారు మనస్సును క్షుభ పెట్టినట్లు ఆ పూర్వావయములను భక్షస్థలమున ధరింతురా ఆ అవయవములు నన్ను పైకి ఎత్తుచున్నట్లు ఉన్నవి చాలా ఆశ్చర్యముగా ఉన్నది సరసమగు రుచి గల అమృతము వలె మధురమగు రసము మధురమగు నీ వాక్కులలో ప్రవహించుచున్నది. ఇట్లు ఆమె రూపమును చూచి వాటిని అన్నింటినీ చిత్రముగా ఉత్ప్రేక్షించుటు అగ్నీధ్రుడు వర్షించుచుండెను. అగ్నీధ్రుడు అంటే ప్రియవ్రతుని యొక్క కొడుకు చెంబుద్వీపాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అన్నమాట. అంతే కాదు, మీ లోకములో మీరే విధంగా ఆహారము స్వీకరింతురు? మీరు ఆహారము లేకనే జీవించుచున్నట్లు కనపడుచున్నది. మీరు భుజించిన ఆహారము వాసన వింతగా ప్రసరించుచున్నది. నీవు విష్ణువు యొక్క అంశమై ఉందువు. విష్ణువు ఆహారము స్వీకరింపడు కనుక నీవు కూడా ఆహారము తీసుకునవని ఊహించుచున్నాను. నీ చెవులు మకరాకారముగా ఉన్నవి. మకరాకారములగు కుండలములు ధరించి ఉన్నవి. మీ ముఖమునందు రెండు చంచలములగు చేపలు వివరించుచున్నవి. అందుచే ముఖము సరస్సు వలె ఉన్నది. అందు తెల్లని హంసలు మొదలగు పక్షులు వలె నీ దంతములు ప్రకాశించుచున్నవి. సరస్సులో పువ్వులపై తుమ్మెదలు చేరినట్లు నీ ముఖముపై భాగమున తుమ్మెదల వంటి కేశపాశములు వ్యాపించి ఉన్నవి. నీవు చేతిలో బంతిని పట్టుకొని ఆడుచున్నావు. ఆ బంతి ఇటునడు తిరుగుచుండా నీ చూపులు కదులుచున్నవి. నీ కేశపాశములు వీడిపోయి చెదిరి ఉన్నవి. బంధించుకొనునావా? ధూర్తుడగు ఈ వాయువు నీ మొలనున్న బట్టను తొలగించుచున్నాడు. వాడు చాలా లంపటుని వలె ఉన్నాడు. నీవా వస్త్రమును గుర్తింపలేదేమీ? ఆమె యొక్క అప్సరస అయిన అగ్నీర్ధుడు గుర్తింపక తపోధనుడిగా భావించి మాట్లాడుచున్నాడు. ఓ తపోధనా, నీ రూపము తపస్సు చేసుకును వారులకు విఘ్నకరము. ఇట్టి రూపము ఎట్టి తపస్సు చేయుటచే నీకు లభించినది?
నాతో కూడా నీవు ఇచ్చటనే ఉండి తపస్సు చేయుము. జగత్తును సృష్టించిన ఓ బ్రహ్మ మిత్రమా, నిన్ను నాకు అనుగ్రహింపడా? దైవవశముచే బ్రహ్మ నిన్ను నాకు వసంగినాడు, నిన్ను నేను వదలలేను. నీ యందు నా మనసు చూపు కూడా లగ్నమైంది. నీ వీడి వచ్చుట లేదు, ఓ చారు శృంగి. నీ యెడలనే నీ యెడలనే లగ్నమైన మనస్సు గల నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళుట తగును. ఇంతకాలము నాతో అరణ్యములో వసించున్న ఈ జంతుజాలము నీకు ప్రదక్షిణముగా వెడలిపోవుగాక. రాత్రులు మంగళకరములై సాగుగాక. అన్నారు. తరువాత విషయంలో ఏం జరిగిందో మరొక భాగంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Gurus. To you, to you, O Lord Vasudeva, the knower of the Vedas, the light of the self, I bow to you, the Brahman. You are the son of Vasudeva, the creator, the Lord. The qualities of goodness, light, and existence that shine from you are your true Covering up the form. Salutations to that Supreme Being, who is also the Supreme Brahman. Tenth Canto, Tenth Chapter, 33rd Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the first and second podcast in the fifth Skandha. Until now, as part of the history of Priyavrata, Brahma Deva and Narada came together and preached the sermon to Priyavrata, which was later given by Swayambhava Manu. We have learned about going to the forests, and then Priyavrata enjoying the kingdom with his wife and children. Let's experience the next part. Thus, ruling, by divine power, he performed a very human act, who? Priyavrata. The sun was shining, circling around Mount Meru. He was giving, but when the sun was south of that tree The north part is covered in darkness. Priyavrata, not liking being half-dark like that, climbed onto the chariot that shone like the sun, which had the speed equal to the sun. When the sun is on the north side, when it is on the south side, when it is on the north side, it was revolving around the earth as if it were the second sun. When that Priyavrata traveled on his chariot on the earth, the pits formed on the earth by the touch of the wheel became seven seas.
He circled the earth seven times around the Meru mountain. Therefore, seven seas were formed. The middle part of those seas formed islands. Jambuvadi, Plaksha Island, Shalimali Island, Kusha Island. The names of those islands are Kruncha, Shakha, and Pushkara. An island was twice the size of another island. The seven oceans are named as Lavana Samudramu, Ikshu Samudramu, Sura Samudramu, Dadhi Samudramu, Mandoda Samudramu, Shuddhoda Samudramu. The islands had seas like Agartala. In the islands like Jambhu, he had sons equal to him: Agnidhra, Idhmajihva, Yagnyabahu, Hiranyaret, Ghritavrishta, Meta Medhatithi. Priyavarta appointed them as the administrator of Veathihotra. He entrusted his daughter, Urjaswati, to Shukracharya. She gave birth to a maiden named Devayani, who was a virgin. Those who, by taking refuge in the feet of the Lord and conquering the senses through the dust of those feet, their business will be in this way. Those are strange things It's beyond imagination. What is surprising that those who have taken refuge in the great man who measured the three worlds with his feet have extraordinary powers? Those who remember the name of God once in their minds will have a visible and powerful effect on their minds and words. They do not follow the Ashtanga. They eventually break free and are liberated. Priyavratudu, who has such divine power. Being the one with unlimited strength and prowess, being the one who attained knowledge by serving the feet of Narada, the great sage, being related to the path of nature, being satisfied by the pleasures experienced, he became one. He considered pleasures like hell and was full of disgust in his mind. Oh, I was not a person who was initially in the state of detachment. The senses that tormented my mind, the intellect that spread in the enjoyment of worldly pleasures, was due to ignorance. The subjects are the grass-grown pegs. I was cast down into them. I was a pleasure animal for this Barhishmati luxury, he condemned himself.
Having thus, being one who has self-reflection obtained by the grace of God, he distributed the land filled with seven islands to his sons who followed him. Giving, considering his wife and Shiva, who had been experiencing for so long, as impure, and with remorse that he had also wronged Aishwarya and Mahishegu Barhishmati, he abandoned them. Narada, who was contemplating the divine influences, went to the Gandhamadhana mountain to serve. Singing the praises of the deeds done by Priyavrata, who can do the work done by Priyavrata except for the Lord of all? He created the seven seas by the holes formed by his chakra. He divided the earth into islands. He considered divine pleasures or the pleasures in the human world, or the powers attained through yoga, as hell. He served with love, considering the devotees of the Supreme Being as his own strength. There is no one who can match Priyavrat. In this way, Priyavrata ruled the kingdom and retired. Following his command, the eldest son Jambudvipa was the ruling one. He saved the people as he saved his own children. Even if he had children, he did not attain the world of ancestors. Desiring children, he with a focused mind on Mandara mountain, worshiped Brahma, who is the lord of all the people, with all kinds of offerings. Eringi sent an Apsara named Purvachiti to him, who was singing his praises in his court. He sent her to have children. But not of Tapasya. She was wandering around the Agnirdhruni hermitage. In that forest, the trees, the vines that adorned the trees, and the birds were in pairs on those vines. The birds were chirping. And the waterfowls were beautifully nesting in the reservoirs. When she was walking gracefully, delightfully, and luxuriously in the garden, Agni Draudu, hearing the sound of her anklets, was in meditation with his eyes closed, and he opened his eyes and looked.
She stood as if smelling a bumblebee flower. Her walks, her picnics, her gaze, which was intricately connected with her bodily movements, attracted even the gods and humans. Seeing such a past life, Agnirudra became a Kama-varapara. He asked her like that. Who are you? What are you doing on this mountain? Are you the God who took the form of a woman, the embodiment of a supreme deity? Looking at her eyebrows, without tying a knot, you are holding two bows. For a person like me with a good heart, have you come to try the experiment? Or did you come with a bow and arrow to hunt animals? Seeing her gaze, what are these arrows? They are like the Shatapatha Brahmanas, slowly progressing. Even though they don't have sharp points, they are beautiful. Whom are you aiming these arrows at? We are afraid, seeing that we have heard your arrows. Your valor does not bring safety to the foolish like us. Smelling the fragrance of her body, she immediately came and saw the bumblebees coming He is saying that he saw it. Behold, your disciples, clinging to your hair, falling around like flowers. Just as sages sought the gurus to learn the Vedic branches, these bumblebees are your disciples, following you. Hearing the sound of the gems in the anklets, these anklets that adorn your feet, making them into cages, the great men called Tittirulu, the sages who made the Yajurveda practice, we hear the Vedic words, this is the truth. The sound is expressed as a consonant-vowel combination. Your dark, radiant, and fragrant garment is visible. From the round, rotating, darkness, like a yellow-brown, circular, light has formed, your nimba light itself, as a cloth, has covered your middle part. Your beautiful breasts
They are adorned in the peaks and shining with indescribable beauty. But I'm afraid it's not possible. The fruit in your middle is very tired. I cannot see how the horns are standing on the upper part. My gaze is fixed on him. A red kumkuma pot, with fragrance, is on your horns. You are the one who makes my entire hermitage fragrant. Show me, O friend, the world you inhabit. Those who are in the world, like us, as if they have disturbed the mind, do you eat those old parts in the place of food? Those parts seem to be lifting me up. It is very surprising. Like nectar with a pleasant taste, like a sweet juice It flows in your sweet words. Thus, seeing her form, Agnidhra was raining down all of them as a picture. Agnidhrudu means Priyavrata's son, the king who is ruling Chembudweepa. Not only that, in your world, how do you accept food? You are without food It seems to be alive. The smell of the food you ate is spreading strangely. You are a part of Vishnu. Since Vishnu does not accept food, I assume that you too will take food. Your ears are shaped like makara. They are wearing earrings that look like makara. Two fish, which are fickle, are described on your face. Therefore, the face is like a lake. And like white swans and other birds, your teeth are shining. Like a bumblebee gathering on flowers in a lake, hair like bumblebees are spread over your face. You're playing with a ball in your hand. That ball, without turning this way, your eyes are moving. Your hair is disheveled. Are you going to tie it? This wind, which is a whirlwind, is removing the cloth you are wearing. He is very lazy. Didn't you recognize the garment? He is speaking, unknowingly, as if he is a Tapodhanudu, who is the apsara Agniradhudu. Oh, ascetic, your form is like penance A thorn in the side. What kind of penance did you perform to attain this form?
Stay with me and do penance. Oh Brahma, the creator of the universe, friend, will you grant me your grace? By the grace of God, Brahma, you are my wife, I cannot leave you. My heart is set on you. Your Vidi is not coming, oh Charu Shringi. It is appropriate to take me with you, who has a mind fixed on you, towards you. May this fauna that has been living with me in the forest for so long depart to you as a circumambulation. May the nights be auspicious. They said. Let's find out in another part what happened in the next matter. Jai Srimannarayana and salutations to the Gurus.