నాభి మహారాజు పుత్రకామేష్టి యాగం
King Nabhi's Putrakameshti Yajna
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, నాభి మహారాజు దివ్యమైన పుత్రుని కోసం నిష్ఠతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన వైనాన్ని తెలుసుకుంటాము. ఋషుల ప్రార్థనలతో కూడిన యాగఫలంగా సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై నాభి మహారాజుకు అనుగ్రహించాడు. భగవంతుని అపారమైన కృపాఫలంగా ఆయన స్వయంగా నాభి మహారాజు పుత్రునిగా అవతరించాలని అంగీకరించాడు, ఆ విధంగా మహాత్ముడైన ఋషభదేవుని జన్మకు పునాది పడింది.
In this sacred episode from Canto 5 of the Srimad Bhagavatham, we explore the story of King Nabhi, who performed the Putrakameshti Yajna with deep devotion, yearning for a divine son. Pleased by the sincerity of the ritual and the prayers of the assembled sages, Lord Vishnu Himself appeared before the king and blessed him. As a result of this extraordinary divine grace, the Lord agreed to incarnate as Nabhi's son, leading to the birth of the illustrious Rishabhadeva.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదునాం పతయే నమః ఓ కృష్ణా సర్వోత్తమమైన కళ్యాణ సాధనములు సర్వోత్తమమైన కళ్యాణమగు మోక్షము కూడా నీ రూపములే. వసుదేవ పుత్రుడవగు నీవు శాంతుడవు. యాదవుల ప్రభువగు నీకు అనేక నమస్కారములు. 10th క్యాంటో 10th చాప్టర్ 36th ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ఈ స్కంధంలో ప్రియవృతుని యొక్క వృత్తాంతాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ప్రేవ్రతుని యొక్క పుత్రుడు అగ్నిహిద్రుడు జంబూ ద్వీపానికి రాజైనటువంటి అగ్నిహిద్రుడు ఒక కన్యతో కలిసిన తర్వాత తనతో ఉన్న ప్రేమ. వ్యవహారాల విషయాల్ని మనం చర్చించుకున్నాం. ఇంక ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. ఇట్లు ఆ అప్సరసను చూచి భావావేశం చెందిన అగ్నీర్ధ్రుడు. ఆయా అవయవములు చిత్రముగా వర్ణించి ఆమెను అనునయించినాడు. నిపుణుడైన అతడు పామర వ్యాపారములందు నేర్పు కలిగిన ఆమెచే మోహింపబడిన మనసు గలవాడై ఆమెను తనకు అనుకూలమగునట్లు చేసుకొనెను. పూర్వచిత్తి వీర శ్రేష్టుడగు అగ్నీంద్రుడు యొక్క బుద్ధి చేతను, శీలము చేతను, రూపము చేతను, ఐశ్వర్యము చేతను, ఔదార్యము చేతను వశపడినదాయను. ఆ కన్య పేరు పూర్వచిత్తి. జంబూద్వీపాధిపతియగు అగ్నీధ్రునితో అయుతాయుత వత్సరములు ఈ భూలోకమునని స్వర్గ సుఖమును అనుభవించుచుండెను. అతడు ఆమెయందు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాస్యుడు, కేతుమాలుడు అనేటి పేర్లు గల తొమ్మండిగురు కుమారులను కనెను.
ఇట్లు తొమ్మిదిగురు పుత్రులను సంవత్సరమునకు ఒక్కని చొప్పున మొత్తం తొమ్మిది మందిని కానీ అగ్నీధ్రునితో వనమును వీడి బ్రహ్మలోకమునకేగెను. ఈ పిల్లలకు తల్లి అనుగ్రహం వలన సహజముగా దృఢమైన శరీరము, బలము, సామర్థ్యము కలిగెను. ఆ తొమ్మండిగురికి తొమ్మిది వర్షములను అగ్నేద్రుడు పంచి ఇచ్చెను. ఆ వర్షములు వారి పేర్లతో వివరింపబడెను. ఇది తొమ్మిది జంబూద్వీపమందలి భాగములగుటచే. ఇవి జంబూద్వీప వర్షములు. భరత వర్షమునకు నాభి అని వానితో వాని పేరుతో అజనాభము అని పేరు పెట్టబడినది. తరువాత భరతుడు పరిపాలించిన దీనికి భరత వర్షము అని పేరు వచ్చెను. అగ్నీధ్రుడు ఆమెతో అనుభవించిన కామభోగములచే తృప్తిని అందనివాడై శృతులలో చెప్పబడిన యజ్ఞాదులు చేసి ఆమె లోకమును చేరెను. ఆ లోకమున పితృ దేవతలు ఆనందముతో ఉండిరి. అగ్నీధ్రుడు. శరీరం వీడిన తరువాత నాభి మొదలు తొమ్మిదిగురు సోదరులు మేరు యొక్క కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి. భద్ర, దేవవతి అను పేర్లు గల తొమ్మండుగరిని పరిణయమాడిది. నాభికి సంతానము లేదు. భార్యయగు మేరుదేవితో యజ్ఞ పురుషుడగు భగవానుని శ్రద్ధతో ఆరాధించెను. అప్పుడు శ్రద్ధతో పరిశుద్ధమగు భక్తితో యజ్ఞము చేయుచుండగా ప్రవర్గ్యములను హోమములు సాగుచుండెను. ఆ యాగములో ద్రవ్యములు, దేశము, కాలము, మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణ విధానము అను ఏడు విధములగు అంగములు ఏ లోపము లేకుండా అమరుటచే పొందుటకు శక్యము గాని భగవానుడు ప్రసన్నుడాయెను. యజ్ఞములో హోమ ద్రవ్యములు పరిశుద్ధముగా ఉండవలెను. దేశము పవిత్రమైనది కావలెను. వసంతము మొదలగు రుతువులోనే చేయవలెను. చేసినను అనుష్టాన విధానము ఏ లోపము లేకుండా ఉండవలెను. అట్లు చేసినను భగవానుడు అనుగ్రహించుట దుర్లభము కానీ భాగవతుల యందు దయగలవాడగుటచే సేవించెడి వారి కోరికలను నెరవేర్చవలెనెని కోరికతో సంకల్పించి.
తన దివ్యమగు రూపమును మనసునకు నేత్రములకు ఆనందమును కలిగించునట్లుగా దర్శింపచేసెను. ఇట్లు ఆవిర్భవించిన మూర్తిని యజ్ఞములోనున్న ఋత్విక్కులు, సదస్యులు, యజమాని మొదలగు వారందరు దర్శించి ధనము లేని వారు ధనమును పొంది ఆనందించినట్లు. ఎంతో ప్రీతితో గౌరవముతో ఆదరించుచు శిరస్సులు వంచి నమస్కరించిరి. ఆ భగవానుని యొక్క రూపము వర్ణించుటకు శక్యము కానిది. ఆ బాహువులు బంగారు వలె మెరిసిపోవుచున్నవి. పచ్చని బట్టు బట్ట మొలయందు దాల్చెను. పక్షస్థలమును శ్రీవత్సము దాల్చెను. చేతిలో శంఖము, చక్రము దాల్చి ఉన్నాడు. వక్షస్థలమున వనమాలను దాల్చి ఉన్నాడు. కౌస్తుభముకు కౌస్తుభము కూడా హృదయ దేశముననే ప్రకాశించుచున్నది. కాంతులతో మెరేయుచున్న మణులతో మకర కుండలములు, కంకణములు, మొలనూలు. హారములు, కేయూరములు, నూపురములు మొదలగు ఆభరణములు ప్రకాశించుచుండెను. అట్టి దివ్య మంగళ విగ్రహమును సేవించి అందరును ఎంతో ఆనందించి దగ్గరగా చేరి ఇట్లు స్తుతించిరి. హే భగవాన్, నీవు పరిపూర్ణుడవు. అయినను ఆశ్రయించిన మా యొక్క ఆరాధనను నీవే స్వయముగా స్వీకరింపదగును. నీకు అవశ్యకము కాకపోయినను మమ్ములను అనుగ్రహించుటకు మా పూజను స్వీకరించుటచే నీకు తక్కువతనము కలగదు. మేము నిన్ను స్తోత్రము చేయుచు నమో నమః అని పెద్దలు చెప్పగా నేర్పిన మాటలనే పలుకగలము. పరిపూర్ణమగు నీ గుణములను చెప్పుట మా వశము కాదు. నీ స్వరూప స్వభావములు అనంతములు. పూర్తిగా ఎవ్వరును వర్ణింపజాలరు. ప్రకృతి యొక్క గుణములు అంటని వాడవు. అన్నిటినీ నియమించు వాడవు. నిన్ను నియమించువాడు వేరొకడు లేని వాడవు. ప్రకృతి పురుషులకు ఆవలి వాడవు. నామరూపములు, ఆకారము ప్రకృతి సంబంధముచే ఏర్పడునవి. కానీ నీ నామరూప ఆకృతులు ప్రకృతిచే ఏర్పడినవి కావు. నీయంత నీవు కల్పించుకొని ఆవిష్కరింప చేసుకునినవి. వానిని మా పరమ పరమ్య పరిమితములగు వాక్కులతో చెప్పజాలము. కావున నమో నమః అనుట తప్ప వేరొకటి మా చేత కాదు. నీ గుణగణములు సకల జీవ సమూహం యొక్క పాపరాశిని తొలగింపగలవు. అతి పవిత్రములు మంగళకరములు.
వానిలో ఏవో కొంత మేర చెప్పవీలగును. కానీ అన్నిటినీ ఎవ్వరును చెప్పజాలరు. నీ పరిజనులను అనుగ్రహింపవలెను. భక్తులు అనురాగముతో గద్గదాక్షరములతో చేసిన స్తోత్రములను సమర్పించిన పరిశుద్ధ జలమును చిగుళ్ళను తులసి దూర్వాంకురములను పూజించిన వారి భక్తిని చూచి నీవు సంతోషింతువు. కానీ అవి నీకు దుర్లభములు కావు, కొరదగినవి కావు. ఎన్నో పరికరములను సంపాదించి నీకు మేము చేసేడి ఈ ఆరాధనముచే నీవు నెరవేరదగిన ప్రయోజనము ఏమియు లేదని మేము ఎరుంగుదుము. నీకు ఎల్లప్పుడూ లభించడివే సకల పురుషార్ధములు. అవి నీకు ఒకనాడు ఒకరి వలన ఒక క్రియ వలన లభింపవలసినవి కావు. నీకు కోరదగినది అర్థము లేదు. అయినను మమ్ములను సంతుష్టులను చేయుటకు. నీవు పరమ కారుణికుడవై నీకు తగని ఆరాధనము మేము చేసినను సంతోషింతువు. ఏ పరమ పురుషా మాకు ఏది శ్రేయస్సో తెలియని మూర్ఖులము. నీకు తగిన ఆరాధన చేయలేకపోయినను అపారము కారుణ్యముచే మాకు మహత్తరము ఐశ్వర్యమును మోక్షమును కల్పింపదలచిన వాడవై పరిపూర్ణుడవైయు అరి అపైపూర్ణుని వలె మా ఆరాధనను స్వీకరించుటకు మా ఎదురు దర్శనము సంగితివి. ఓ మహానుభావా, నీవు మా రాజు అగు నాభికి. అభిమతములను వసంగుటకే ఆవిర్భవించితివి. అయినను నీవు ఈ వరమును అనుగ్రహించుము. సమస్త కళ్యాణ గుణములతో విలసిల్లెడి నీవు నిన్ను ప్రేమించడి మహా భక్తులకు దర్శనమొసంగిదవు. సమస్త మాలిన్యములు తొలగి ఆత్మానందులై ప్రకృతి కంటే వేరుగా ఆత్మ స్వరూపమును బ్రహ్మాత్మకముగా దర్శింపగల వారికే సంతతము నీ గుణములను ధ్యానించి పరమ మంగళకరములుగా భావించి చెప్పెడి వారికే నీ దర్శనము లభించును. అట్టి నీవు ఈనాడు మా నేత్రములకు గోచరమైతివి. దుర్లభము నీ దర్శనము లభించుటచే పొందజాలనిది లభింపరానిది ఏదీయు ఉండదు. అయినను మేము కోరునది ఒక్కటే. ఆవలించినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, జారినప్పుడు గానీ, ఏ అవస్థలో అయినను, ఎట్లయినను, జ్వరములో అయినను.
మరణ సమయములో అయినను పరవశులమై ఉన్నను మేము సకల పాపములు తొలగింపజాలిన నీ గుణములను ప్రతిపాదించి నామములను పలకగలవారము అగుదుము గాక. ఇదియే మాకు వసంగవలసిన వరము. మా రాజర్షియగు నాభి సంతానములు కోరి ఉన్నాడు. మీతో సమానము సంతానము కావలని కోరుచున్నాడు. నీవు పురుషార్ధములను, స్వర్గమును, మోక్షమును కూడా వసంగ గలవాడవు. బల, ఐశ్వర్య, జ్ఞాన, శక్తి, వీర్య, తేజస్సులెనడి షాడ్గుణ్యములతో పరిపూర్ణుడవు. ఈతడు సంతానమును పరమ పురుషార్ధమని నేడు కోరుచున్నాడు. దరిద్రుడు ఇచ్చెడివాడు కుబేరుడని గుర్తింపక పనికిరాని ఊకను కోరినట్లు నేనుండి సంతానమును కోరుచున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. మహాపురుషుల పాద సేవనము చేసి కర్మవశతను తొలగించుకున్న వారులు కానీ ఎవ్వరి చేతును జయింప శక్యము గాని నీ మాయను జయింపలేరు. మాయ సన్మార్గమును మరుగుపరుచును. మాయచే ఆవరింపబడిన బుద్ధి గలవారు లోకములో ఉండరు. మాయచే విషయ విషతీవ్రత ఆక్రమించును. అందుచేత మాయకు వశుడై ఇతడు నిన్ను సంతానమును కోరుచున్నాడు. సకల కార్య సంపాదకుడవు నీవు. నీకు చేయు వ్యాపారములు ఉదారములు. సత్య సంకల్పుడవు. క్షుద్రమైన ప్రయోజనమునకు యజ్ఞము ద్వారా నిన్ను ఆహ్వానించితిమి. సంతానమే పురుషార్ధమనటి బుద్ధిచే అంధులమైనాము. ఆహ్వానము అవమానము. అవమానమును క్షమింపుము. దీని తరువాత మరొకరి చరిత్రను తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations, supreme auspiciousness, supreme auspiciousness, salutations to the son of Yadu, the peaceful one, salutations to the one with auspiciousness. Oh Krishna, all the best means of accomplishment, the supreme auspiciousness, even the supreme auspiciousness of salvation is your form. Oh son of Vasudeva, you are peaceful. Many salutations to you, the lord of the Yadavas. 10th Canto 10th Chapter 36th Prayer. Dear devotees, welcome to the third podcast of the fifth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, in this Skandam, we are starting the story of Priyavruthuni, and after Agnihridrudu, the son of Pravevruthuni, who was the king of Jambudvipa, had a union with a maiden, his love for her. We discussed the business matters. And now we'll move on to the next bit. Thus, seeing the apsara, Agniradh was overcome with emotion. He described the various organs in a picture and pleased her. The expert, being charmed by her mind, who was skilled in the petty trades, he made her agree to his liking. The former thinker is the best Agnindrudu's intellect, character, beauty, wealth, and generosity are all subject to him. The bride's name is Poorvachiti. Agnidhru, the lord of Jambudvipa, was enjoying the pleasures of heaven, along with many years of life. He had nine sons named Nabhi, Kimpurushudu, Harivarshudu, Ilavarthudu, Ramyakudu, Hiranmayudu, Kuruvu, Bhadrasayudu, Ketumaludu.
Thus, nine sons, one each year, a total of nine, but Agnidhruva left the forest and went to Brahmaloka. These children, by the grace of their mother, naturally acquired a strong body, strength, and ability. Agnendrudu distributed nine rains to the nine villages. The rains are described with their names. It is part of the Jambudvipa, which is made up of nine parts. These are the Jambudvipa rains. Bharata Varshamunaku Nabhi, with that, with that name, Ajanabhamu is named. Later, Bharat ruled this, which came to be known as Bharatavarsha. Agnidhrudu, not satisfied with the pleasures of lust he experienced with her, performed the sacrifices mentioned in the Shrutis and reached her world. In that world, the ancestors were in bliss. Agnidhra. After the body departed, the nine brothers from the navel to the top, the daughters of Meru, Merudevi, Pratirupa, Ugradamshtra, Lata, Ramya, Shyama, Nari. It is the marriage of the three women, named Bhadra, Devavati. The navel has no children. With his wife, Merudevi He worshipped the Lord with reverence. Then, with devotion and purity, while performing the Yagnya (sacrificial fire), the offerings and sacrifices were going on. In that Yagam, the seven types of elements namely wealth, country, time, mantras, priests, Dakshina method, without any deficiency, to attain immortality, the Lord became pleased. Sacrificial materials must be pure in the Yajna. The country wants a cleaner world. It should be done during the spring and summer seasons. The method of practice that has been done should be without any flaws. Even if done that way, it is difficult for God to bestow grace, but being compassionate towards the devotees, with the desire to fulfill the wishes of those who serve, with that desire, resolve.
He showed his divine form to the mind and eyes in a way that brings joy. Thus, all the Ritvikas, Sadasyus, the master, and others present in the Yagnya, having seen the idol that has appeared, as if those without wealth have received wealth and are happy. With much love and respect, they bowed their heads and paid their respects. It is impossible to describe the form of that God. Those arms are shining like gold. The green cloth is draped in the spring. The bird's nest was worn out. He is holding a conch and a discus in his hands. He is wearing a garland of flowers around his neck. Koustubhamu, Koustubhamu also shines in the heart region. With pearls, with jewels, with makara kundalam, bangles, and earrings. Ornaments, earrings, and nose rings, etc., were shining. Having served such a divine auspicious idol, everyone rejoiced greatly and gathered closely, praising thus. Oh, my Lord, You are omnipotent. However, you yourself should accept our worship that has been entrusted to you. It is necessary for you Even if it is not so, by accepting our worship to bless us, you will not be inferior. We can say the words that were taught when elders said, 'We praise you, salutations'. It is not in our power to speak of your perfect qualities. Your forms and natures are infinite. Nobody can fully describe it. The qualities of nature are not to be used. You manage everything with a simple rule. You have no one to call upon. Nature is not for men. Names and forms are formed by the nature of the object. But your form and appearance are not created by nature. You created and manifested them. We cannot describe him with words that are beyond our reach. Therefore, except for saying Namo Namah, nothing else is possible for us. Your virtues can remove the sin of the entire living community. The most sacred and auspicious.
He can only say something about it to some extent. But nobody can tell everything. May thou cause thy people to prosper. Devotees, seeing the devotion of those who offered hymns made with affection and with choked sounds, and the holy water, and the basil, and the doorman's sprout, you will be pleased. But they are not unattainable, they are not unearned. Having acquired many instruments, we do not know that there is no benefit for you to be fulfilled by this worship that we do for you. All the Purusharthas are always attainable for you. Those things will not be available to you one day, from one person, by one action. You don't understand what you want to give. But to make us happy. You are the supreme benefactor; even if we offer you worship that is not befitting you, you will be pleased. Oh, supreme being, we are fools who do not know what is best for us. Even though I could not offer you adequate worship, you are the one who has desired to grant us greatness, wealth, and salvation through immense compassion. Being complete, like the perfect one, you have appeared before us to accept our worship. Oh Oh! my king, you are my king. You were born to impress. But you grant me this boon. You, who shine with all auspicious qualities, grant a vision to the great devotees who love you. Those who, having removed all impurities, become one with the self, and who can distinctly perceive the self-form as Brahman, will always have your qualities meditated upon, and will attain your vision only by those who consider you as the most auspicious. Oh, you are visible to our eyes today. It is rare to attain your darshan (vision); there is nothing that cannot be attained. But all we want is this. Whether it is when yawning, sneezing, or drooling, or in any condition, or in any way, or in fever.
Even if we are ecstatic at the time of death, may we be able to proclaim and utter the names of Your virtues, which cannot remove all sins, and may we become such. This is the boon we are destined to receive. My royal sage desires offspring. He desires that you have children. You are the one who has established Purusharthas, heaven, and also liberation. You are complete with six virtues: strength, wealth, knowledge, power, energy, and splendor. He desires children today, considering it the ultimate goal. He who is poor, he who gives, without recognizing him as Kubera, desires useless fuel, and I am asking for offspring. No surprise to us. Those who have served the feet of great men and have removed the karmic bondage, but cannot be conquered by anyone, cannot be conquered by your illusion. May the illusion hide the right way. Those who are covered by illusion do not exist in the world. The intensity of the subject is very high. Therefore, being subject to Maya, he desires offspring for you. You are the organizer of all affairs. Your business ventures are generous. You are true to yourself. We have invited you through a sacrifice for a base purpose. We have become blind because of the intellect that considers progeny as the ultimate goal. Invitation and Insult. Forgive me of my shame. After this, let's learn about another person's history. Jai Shri Srimannarayana.