జ్యోతిర్మండల వర్ణన - సూర్య రథ గమనం (భాగం 1)

Description of the Luminaries — Movement of the Sun's Chariot (Part 1)

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు జ్యోతిర్మండలం యొక్క దివ్యమైన వర్ణనను వివరించిన ఘట్టాన్ని ఈ ఎపిసోడ్‌లో చర్చిస్తున్నాం. సూర్య భగవానుని రథం యొక్క అద్భుతమైన నిర్మాణం, దాని ఏకచక్రం సంవత్సరాన్ని సూచించే విధానం, మరియు బ్రహ్మాండమంతటా అది సంచరించే మార్గాన్ని ఇక్కడ విపులంగా వివరించడమైంది. పరమాత్మ యొక్క నేత్రస్వరూపుడైన సూర్యుడు కాలాన్ని నిర్వహిస్తూ, సమస్త జీవకోటిని పోషిస్తూ, విశ్వ నియమాన్ని సదా కాపాడుతున్నాడని ఈ శ్లోకాలు మనకు బోధిస్తున్నాయి.

In this episode of our Srimad Bhagavatham podcast, we explore the magnificent description of the luminaries as revealed in Canto 5, where the sage Shukadeva imparts the sacred cosmological knowledge to King Parikshit. The episode delves into the wondrous details of the Sun's chariot — its divine construction, its single wheel representing the year, and the celestial path it traverses across the universe. We reflect on how the Sun, as the eye of the Supreme Lord, governs time, sustains life, and serves as a vehicle of cosmic order through its eternal movement.

← Prev Next →
Description of the Luminaries — Movement of the Sun's Chariot (Part 1) bhagavatam

జై శ్రీమన్నారాయణ నమస్తే దేవ దేవేశ ప్రపన్నార్తి హరావ్యయా ప్రపన్నాన్ పాహినః కృష్ణా నిర్విన్నాన్ ఘోర సంస్రుతేః ఓ కృష్ణా, అవినాశివగు నీవు దేవనాయకులగు బ్రహ్మాదులను కూడా శాసించెదవు. శరణుజొచ్చిన వారిని వారి ఇడుముల బాపే నీకు నమస్కారం. మేము భయంకరమగు సంసారం వలన విరక్తులమై నిన్ను శరణుజొచ్చినాము, మమ్ములను కాపాడుము. 10th క్యాంటో 73rd చాప్టర్ 8th ప్రేయర్. భవత్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపికా పంచమ స్కంధం 24వ. పాడ్కాస్ట్ లోకి స్వాగతం. ఇంతవరకు మనం భూగోళ వర్ణనము, ప్రియవరద చరిత్రము, దీపాల వర్ణనము అన్నీ కూడా మనం అనుభవించాం. ఇప్పుడు జ్యోతిర్మండల వర్ణనం మనం తెలుసుకుందాం. భూమండలం యొక్క సన్నివేశము పరిమాణము వర్ణించబడినది. ఈ భూమండల పరిణామం పరిమాణము చేత నక్షత్రాది గ్రహములు ఉండెడి జ్యోతిర్మండలము కూడా అంతే పరిమాణము కలిగి ఉండునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. తిరుగలి రెండు భాగములుగా ఉన్నప్పుడు పైది ఎంత ఉండునో అడుగుది కూడా అంతే పరిమాణం కలిగి ఉండును. అట్లే భూమండలము, ద్యుమండలము తిరుగలిపై క్రింది రాళ్ళ వలె ఉన్నవని భావించినచో క్రిందిది ఎంత పరిమాణం ఉండునో మీదది కూడా అంతే పరిమాణం కలిగి ఉండును. ఈ భూమండలమునకు ద్విమండలమునకు మధ్య ఉండునది అంతరిక్షము అందురు. అంతరిక్షమునకు పైన ద్విమండలము క్రిందది భూమండలము. అంతరిక్షమునకు మధ్య భాగమున సూర్యుడు ఉండును. అతని ప్రకాశముచే భూహు, భూవః, సువః అనేటి మూడు లోకములు ప్రకాశించుచుండును.

అతడే ఆయా కర్మల యందు ప్రవర్తింప చేయుచుండును. అంతరిక్ష మధ్యమందున్న సూర్యుడు ఉత్తరాయణము, దక్షిణాయనము అను పేర్లతో వ్యవహరించబడుచుండును. ఆరోహణ అవరోహణములచే శీఘ్రముగా మందముగా సంచరించుచుండును. గ్రహములు, నక్షత్రములు సూర్యగమనమున అనుసరించి శించుమార చక్రములో సంచరించుచుండును. 8000 యోజనముల వలయాకారము గల రేఖలు మూడు ఉండును. అందు శించుమార చక్రము మధ్య వలయములో నుండును. అంతర్వలయములో బాహ్య వలయములో గ్రహాదులు సంచరించుచుండును. ఆ సంచారముచే ఉత్తరాయణద దక్షిణాయనములు ఏర్పడుచున్నవి. బహిర్వలయము నుండి అంతర్వలయమునకు వచ్చుట, అంతర్వలయము నుండి మధ్యమ వలయమునకు వచ్చుట జరుగుచుండును. ఈ గమనముచే రాత్రింబ వళ్ళు సమానముగా ఉండును. మేష రాశిలో, తులా రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు రాత్రింబ రోజులు సమానముగా ఉండును. వృషభము, మిధునము, కర్కాటకము, సింహము కన్యా రాశులలో సంచరించుచున్నప్పుడు పగళ్ళు పెరుగుచుండును. రాత్రి నెలకు ఒక్కొక్క ఘటిక తగ్గుచుండును. వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అను రాశులలో సూర్యుడు ఉన్నప్పుడు రాత్రిళ్ళు పెరుగును. పగళ్ళు తగ్గుచుండును. దక్షిణాయనములో పగళ్ళు పెరుగుచుండును రాత్రిళ్ళు తగ్గుచుండును ఉత్తరాయణములో పగళ్ళు పెరుగుచుండును రాత్రిళ్ళు తగ్గుచుండును ఇది కరెక్షన్ చేసుకోవాలి. ఉత్తరాయణములో పగళ్ళు పెరుగుచుండును, రాత్రిళ్ళు తగ్గుచుండును. దక్షిణాయనములో పగళ్ళు తగ్గుచుండును, రాత్రిళ్ళు పెరుగుచుండును. సూర్యుడు మకరమును చేరినప్పుడు ఉత్తరాయణం ఆరంభము, మకరము, కుంభము, మీనము దాటి మేషములో సూర్యుడు ప్రవేశించినప్పుడు విశువత్తు అందురు. అప్పుడు రాత్రింబ వాళ్ళు. సమానముగా ఉండును. తరువాత రాత్రి తగ్గుచుండును. పగలు పెరుగుచుండును. మిథునము దాటి కర్కటమున ప్రవేశించినప్పుడు దక్షిణాయనమగును. అది దాటి సింహము

కన్యా దాటి సూర్యుడు తులను ప్రవేశించినప్పుడు క్రమముగా రాత్రి పెరుగుచు పగలు తగ్గుచుండును. మానసోత్తరగిరి తూర్పు వైపు ఇంద్రుని పట్టణము. దానిని దేవధాని అని అందురు. దక్షిణం వైపు యముని పట్టణం దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుని పట్టణం ఉన్నది దాని పేరు నిమ్లోచని. ఉత్తరం వైపు కుబేరుని పట్టణం అది విభావరి. మేరు పర్వతమునకు దక్షిణం వైపు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశించుతూనే ఉండును. జ్యోతిష్ చక్రము భ్రమించుచుండుటచే భూమియందు సూర్యుడు కనపడుట ఉదయము. ఆకాశమునందు కనపడుట మధ్యాహ్నము. భూమిలోకి చొచ్చినట్లు కనపడుట అస్తమించుట. దూరముగా ఉండుట అర్ధరాత్రి. తూర్పు వైపు ఉన్న ఇంద్రుని పట్టణము నుండి పడమర వైపు సమానముగా రేఖ గీసినచో తూర్పు వైపు సూర్యుడు వచ్చినట్లు కనపడినప్పుడు పడమటి వైపు కనపడకుండా పోవును. దక్షిణ ఉత్తరముల సూర్యుడు సమాన అంతరములలో ఉన్నట్లు కనపడిన మధ్యాహ్నము. తూర్పు వైపున ఉన్న ఇంద్రపురి నుండి కదలినది మొదలు 15 ఘటికలలో దక్షిణం వైపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల యోజనములను పండున్నర లక్షల యోజనములను నడుచును. సూర్యుడే గాక గ్రహములన్నియు నక్షత్రములతో కూడా జ్యోతిష్ చక్రమునందు కనపడుచుండును. మరుగుపడుచుండును. సూర్యరథము వేద స్వరూపమైనది. సూర్యరథము వేద స్వరూపమైనది. అది ఒక ఘడియలో 34 లక్షల 800 యోజనములను నాలుగు పట్టణములందు పరిభ్రమించుచుండును. సూర్య రథమునకు చక్రం ఒక్కటే అని చెప్పుదురు. దాని పేరు సంవత్సరము. దానికి 12 మాసములు 12 చక్రముల వలె ఉండును. ఆరు ఋతువులు ఆరు నేముల వలె ఉండును. మూడు చాతుర్మాస్యములు మూడు నాభుల వలె ఉండును. ఇట్టి సూర్యరథమును ఉపాసించుచుందురు. ఈ రథచక్రము మానసోత్తరగిరి చుట్టూను పరిభ్రమించుచుండును.

ఈ రథము రథికుడు కూర్చుండు స్థానము 36 లక్షల యోజనముల పొడవు అందు నాలుగవ భాగము వైశాల్యము కలిగి ఉండును. ఈ రథమునకు గాయత్రి మొదలు ఏడు ఛందస్సులు గుర్రములుగా అరుణుడిచే పూన్చబడి ఉండును. ఈ గుర్రములు రథమును మోయుచుండును. సూర్యుడు ప్రాగభిముఖముగా అరుణుడు పశ్చిమాభిముఖముగా ఉండును. వాలఖిల్యుడు మొదలగు ఋషులు అంగుష్టములో పైభాగమంత పరిమాణము గలవారై 60,000 మంది సూర్యులకు సూర్యునికి ముందుగా రథమునందు నిలిచి ఆయా సూక్తములను ఉచ్చరించుచు స్తుతించుచుందురు. అట్లే ఇతర ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, గ్రామణులు, యాతుధానులు మొదలగు ఏడు గుణములు. ఏడు గణములు ఆ సూర్య భగవానుని నెలకొక పేరుతో వేరు వేరు పేర్లు గలవారై ఉపాసింతురు. భూమండలము యొక్క అత్యధికమగు భాగమును ఒక్క క్షణములో ఆక్రమించుచుండును. అట్లే నక్షత్రములు రాశులు అనునవి అన్నియు కులాల చక్రమున వంటి శింశుమార చక్రముపై ఆశ్రయము గలవై సంచరించుచుండును. ఈ సించుమార చక్రములో మేరువునకు, ధ్రువునకు ప్రదక్షిణముగా సంచరించును. సూర్యాదులు, గ్రహములు నక్షత్రాభిముఖముగా ఆయా రాశులలో సంచరించుచు కనపడుచుండును. మిగతా భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో అనుభవిద్దాం. ఈ విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని మళ్ళీ మరొక పాడ్కాస్ట్ లో. కలుసుకోవడానికి సిద్ధమవుతారని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the God of Gods, protector of those who are devoted, Krishna, destroyer of the terrible sounds of the unending. Oh Krishna, you are imperishable, and you also govern the gods and leaders, Brahma and others. Salutations to you, who take refuge in those who take refuge in you. We, being disgusted by the terrible family, have surrendered to you, protect us. 10th Canto 73rd Chapter 8th Prayer. Oh, devotees, Srimad Bhagavata Tattva Deepika, Fifth Canto, 24th. Welcome to the podcast. Until now, we have experienced geographical descriptions, the story of Priyavarada, and the description of lamps. Now, let's learn about the description of the Jyotirmandala. The size of the Earth's scene is described. Scientists say that the universe, including the stars and planets, has the same size as the Earth's evolutionary scale. When the Tirugali is divided into two parts, the height will be the same as the base. Similarly, the earth and the heavens are like the lower stones on the Tirugali If you assume that the bottom one has a certain size, then the top one will also have the same size. Space is what separates the Earth and the universe. Above the universe is the dwarf planet, below is the Earth. The Sun is located in the middle of the space. By his light, the three worlds, namely Bhuva, Bhuva, and Suva, are illuminated.

He himself is acting in those actions. The sun in the middle of space is known by the names Uttarayanam and Dakshinayanam. It is moving quickly and slowly through ascents and descents. Planets and stars move in the zodiac according to the movement of the sun. There will be three lines with a circular pattern of 8000 yojanas. And the Chakra in the middle of the ring is in the middle of the sound. In the inner ring, in the outer ring, planets are moving. By that movement, the Uttarayanam and Dakshinayanam are being formed. Coming from the outer ring to the inner ring, and from the inner ring to the middle ring is happening. By this movement, the nights and days will be equal. When the Sun is in Aries and Libra, the days and nights are equal. When Taurus, Gemini, Cancer, and Leo are moving in the Virgo zodiac, the days will be increasing. The night decreases by one hour each month. When the Sun is in the zodiac signs Scorpio, Sagittarius, Capricorn, Aquarius, and Pisces, it increases at night. Pagal It decreases. In Dakshinayanam, days increase, and nights decrease. In Uttarayanam, days increase, and nights decrease. This needs to be corrected. In Uttarayanam, the days increase, and the nights decrease. In the southern hemisphere, the days are shorter and the nights are longer. When the sun reaches Capricorn, it is called Uttarayanam. When the sun enters Aries after crossing Capricorn, Aquarius, and Pisces, it is called Vishuvathu. And then it's night and day. It will be equal. The night will pass. The day is getting longer. When it crosses Gemini and enters Cancer, it becomes Dakshinayanam. That crossed the lion

When the sun crosses the horizon, the night gradually increases and the day gradually decreases. Indra's town is to the east of Manasotharagiri. It is called Devadhani. The town of Yamuna on the south is called Syamantaka. On the west is the town of Varuna, whose name is Nimlauchani. The city of Kubera, on the north is Vibhava. The sun always shines on the south side of Mount Meru. Because the astrological wheel is rotating, the sun is visible on earth, it is dawn. The appearance of the sky is midday. Appearing to descend into the earth and setting. It's a long sleep. If a line is drawn equally from Indra's city on the east side to the west side, when the sun appears to have come to the east, it will disappear from the west side. The afternoon when the sun appears to be in equal intervals in the south and north. Starting from Indrapuri on the east side, it will run for two crore twenty-five lakh yojanas and two and a half lakh yojanas towards the south in 15 ghatikas. Besides the sun All the planets are visible in the astrological wheel along with the stars. It is shining. The chariot of the Sun is the form of the Vedas. The chariot of the sun is in the form of Vedas. That is, in one day, 34 lakh 800 yojanas will be circumambulated in four cities. The wheel is said to be the only common element in the Sun chariot. It's called the year. It has 12 months, like 12 chakras. The six seasons are like six names. Three Chaturmasyas are like three navels. They worship this chariot of the sun. This chariot wheel revolves around Manasottara hill.

This chariot, the place where the charioteer sits, is 36 lakh yojanas in length, and the fourth part of it has area. This chariot is adorned with seven horses, starting from Gayatri meter, by Arun. These horses will carry the chariot. The Sun is east-facing and Arun is west-facing. Valakhilyudu and other sages, being as large as the top of an angushta, stand in the chariot before the sun, 60,000 suns, and utter and praise those hymns. Similarly, other sages, gods, Gandharvas, Apsaras, Nagas, Graminas, and Yatudhanas, etc., are seven qualities. The seven Ganas worship the Sun God with different names, each having a different name. It occupies the largest part of the earth's surface in a single moment. Similarly, the stars and constellations, all of them, like the wheel of castes, are dependent on the wheel of the Shimshurama and move. In this circular wheel, it travels as a circumambulation to the sun and the moon. The sun, planets, and constellations are in their respective zodiac signs It appears to be moving. We'll take the rest of the episode off to explore the rest of the podcasts.. In another podcast, everyone will try to understand this matter properly. Praying that they will be ready to meet, Jai Srimannarayana Asmatgurubhyo Namaha