బ్రహ్మావర్త సభ - మోక్షధర్మం

The Brahmavarta Assembly — Doctrine of Liberation

bhagavatam

శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలో, బ్రహ్మావర్త క్షేత్రంలో జరిగిన పవిత్రమైన సభలో మోక్షధర్మంపై గొప్ప వివేచన జరుగుతుంది. మహర్షులు మరియు జ్ఞానులు అక్కడ సమావేశమై మానవ జీవితపు పరమ లక్ష్యం గురించి లోతైన చర్చ చేస్తారు. ధర్మం, వైరాగ్యం మరియు భగవద్భక్తి ద్వారా ఆత్మ ముక్తిని పొందే మార్గాన్ని ఈ సభ స్పష్టంగా వెల్లడిస్తుంది.

In this sacred episode from Canto 5 of the Srimad Bhagavatham, the great assembly at Brahmavarta becomes the setting for a profound discourse on the doctrine of liberation. Sages and seers gather to deliberate on the ultimate purpose of human existence and the paths through which the soul may attain moksha. The teachings shared in this assembly illuminate the relationship between dharma, detachment, and the unwavering devotion that leads the seeker toward the Supreme.

← Prev Next →
The Brahmavarta Assembly — Doctrine of Liberation bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానా వాదానురోధాయ వాచ్య వాచక శక్తయే నీవు అంతము లేని వాడవు, సూక్ష్ముడవు, నిర్వికారుడవు, సర్వజ్ఞుడవు. నీవు పలు వాదములను అనుసరించి ఆ వాదులను ఆ రూపములలోనే అనుగ్రహించెదవు. నామశక్తి రూపములు నీవే నీకు నమస్కారము. టెన్త్ క్యాంటో సిక్స్టీన్త్ చాప్టర్ ఫోర్టీ సెకండ్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్ధన చరిత్రలో వృషభ దేవుడి యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. వృషభ దేవుడు. తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క విధి నిర్వహణను కుమారులకు అప్పగించి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ తరువాత తనకు ఎన్నో రకమైనటువంటి శక్తులు ప్రసాదించినవి అయినా వాటిని వాటిపైన ఇచ్చ లేకుండానే తను వీటిని కూడా స్వీకరించకుండా ఉన్నాడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత విషయాన్ని మనం అనుభవిద్దాం. ఆత్మ యందే సంతతము ఆనందము అనుభవించుచున్న వారులకు యోగముచే ఆత్మ దర్శనము చేసి భక్తి యోగముచే భగవత్ సాక్షాత్కారమునంది జ్ఞానాగ్నిచే వాసనలు అనబడి కర్మ బీజములు దగ్ధమైన వారికి ఐశ్వర్యము ఉన్నను సిద్దులు ఉన్నను అవి వారికి బంధింప జాలవు. వారికి సంసారం అంటది కదా. అందుచే వృషభ దేవునకు సిద్దులను ఉపయోగించినను హాని లేదు కదా. ఎలా ఉపయోగించలేదని పరీక్షిత్తునకు సంశయము కలగగా శుకయోగి దానికి సమాధానం చెబుచున్నాడు.

ఓ రాజా, మీరు చెప్పినట్లు యోగముచే సిద్దులు లభించినను జ్ఞానము గలవారు వాటిని అంగికనిప్పరు. భగవంతుని యందే మనసు నిలిపి మనసు నిలిపిన వారికి సిద్దులు హాని కలిగింప చాలవని భావింపకుడు. మహామునులు. యోగముచే మనసు వశపరుచుకున్న వారలేనను మరల మనసులు చలించి భ్రష్టులగుచున్నారు. అందుచే వివేకము గలవారు మనసును నమ్మరు. వలపన్ని ఏమియు ఎరుగనట్లు దూరముగా కూర్చుని ఉన్న వేటగాని వంటిది మనసు. అది పట్టించుకోనట్లే ఉండి ఆత్మను వంచించి వశపరచుకొనును. అందుచే సిద్దులు లభించినవి కదా అని, యోగాభ్యాసము ఫలించునది కదా అని నమ్మి దేనిని ప్రేమించిననో మనసునకు దోషమంటదు కదా అని అనుకొనకూడదు. మనసు నిశ్చలముగా ఉండనిది. మనసును జయించిన యోగి కూడా మనసు నాకు లొంగినది కదా అది నాకు ఏమి అర్థము కలిగించును అని విషయములతో సంఘము కలిగి ఉండరాదు. మనస్సును నమ్మి విషయములతో సంఘము పెంచుకున్నచో భగవత్ ధ్యానము జారిపోవును. యోగము సిద్ధించినను మనస్సు ఎల్లప్పుడూ కోరికకు దారి వసంగుచునే ఉండును. కోరిక చేరినదో దాని వెంట క్రోధాదులు అన్నియు మనసులో దూరును. యోగము ఉన్నది కదా అని లౌకిక విషయములను ప్రేమించినచో వ్యభిచారిని అయిన భార్య భర్తను మోసగించినట్లు మనసు మోగించును మోసగించును. లౌకిక విషయమునందు గాని ద్రవ్యమునందు గాని స్నేహము కలిగి ఉన్నచో మనసులో ముందు ప్రవేశించునది కోరిక అనగా కామం. కామమును అనుసరించి పగ, మదము, లోభము, శోకము, మోహము, భయము మొదలగునవి అన్నియు మనసున ప్రవేశించును. దానిచే ఆత్మకు కర్మ బంధము కలుగును. కావున బుద్ధిమంతుడు ఎంత యోగి అయినను మనస్సును విశ్వసించి లౌకికములగు వస్తువులను ప్రేమించరాదు.

ఈ విధంగా వృషభ దేవుడు లోకుల కంటే భిన్నమైన వేషముతో మాటలతో నడువడితో జడుని వలె సంచరించుచుండెను. చివరకు తన శరీరమును విడవవలెనని కోరికతో యోగులు తమ శరీరమును ఎట్లు విడవవలెనో అందరికీ నేర్పుటకై అజ్ఞానం వదిలి. తన ఆత్మను పరమాత్మ యందు ఒకటిగా చేర్చి ప్రారబ్ధ కర్మ తొలగిన వాడై దేహాభిమానము వదలి యోగులకు యోగ నిష్ఠను ఉపదేశము చేతను తన ఆచరణ చేతను ఎరింగించిన వాడై ఉండెను. ఇట్లు శరీరము విడుచుట అనగా స్థూల శరీరము కాదు లింగ శరీరమును అనగా మనసులో దేహమే నేను అనిడి బుద్ధి తొలగి శరీరముతో ఉన్నను వేరుగా ఉన్నను తాను భావించుచు దేహమును ఆదరింపక సంచరించుడి స్థితి ఏర్పడును. ఇది శరీరము ఉండగానే ముక్తి పొందినట్లు ఆత్మ శరీరములో ఉండియు శరీరమును అంటక ఉండును. ఈ విధముగా వృషభుడు శరీర సంబంధమును వీడిన వాడైనను మాయా వాసనచే శరీరము అనవర్తించుచుండెను. ఈ శరీరము నేను అని గాని నాది అని గాని అభిమానము లేకుండెను. శరీరము దక్షిణ కర్ణాటక దేశములను యధేచ్ఛగా సంచరించుచుండెను. కుటకాచలము యొక్క ఉపవనములో నోటిలో రాళ్ళనే కబళముగా పెట్టుకొని పిచ్చి వాని వలె జుత్తు విప్పుకొని నగ్నుడై సంచరించుచుండెను. అట్లు సంచరించుచుండగా ఆ వనములో గాలి దేగముచో కదిలిన గాలి వేగముచే కదిలిన వెదురు చెట్లు రాసుకునుటచే అగ్ని బయలుదేరును. ఆ అగ్ని ఆ వనమును ఆ వనముతో పాటు వృషభ దేవుని శరీరమును కూడా దహించి వేసెను. ఇట్లు స్థూల శరీరము కూడా వీడిపోయెను. ఇట్లు వృషభదేవుడు ఆశ్రమ ధర్మములను కూడా అతిక్రమించి అవధూత స్థితిలో సంచరించుచు దహింపబడిన వృత్తాంతమును ఆ దేశమునకు రాజగు అర్హన్ అనే పేరు గలవాడు వినెను. ఆ రాజు వృషభుడు కొండచిలువ వలె గోవుల వలె మృగం వలె సంచరించుచు చేసిన వ్రతములు అశాస్త్రీయములు అని ఎనంగక రాబోయేటి దైవ నిర్ణయమును అనుసరించి అవి ధర్మములని పాషండ పద్ధతిలో ఉన్న ఈ ధర్మములు తన బుద్ధిని అనుసరించి అర్హతము అనేటి అర్హిత ధర్మమునందు మనుషులను ప్రవర్తింపచేసెను. ఆ అర్హత సిద్ధాంతమును అనుసరించి కలియుగములో

కొంతమంది సంస్కారహీనులగు మనుష్యులు దేవమాయచే మోహము నందిన వారై తమ శౌచమును చారిత్రమును విడిన వారైరి. స్నానాదులు సంధ్యావందనాదులు వాని వారి వారి దేవతలను తిరస్కరించుచు ధర్మము కాని వానిని ధర్మములుగా స్వీకరించుచు వివేకహీనులై చెడు వ్రతములను చేయుదురు. వారు వేదములను, వేదాధ్యయనము చేయువారలను, యజ్ఞములను, యజ్ఞ పురుషుడగు భగవానుని, భగవద్భక్తులను దూషించుచుందురు. ఈ విధముగా వేద ప్రమాణము వీడి అప్రామాణికముగా స్వేచ్ఛగా ప్రవర్తించుందురు. అంధ పరంపరగా ఆచరణములు చేయుచుందురు. వారు అంధ తమస్సు అనడి నరకమునందు పడుదురు. ఈ వృషభ దేవుని అవతారము రజోగుణము అధికముగా గల వారలను వేద విరుద్ధమగు మార్గమును శిక్షించినది. వృషభ దేవుని చరిత్రమును ఆర్యులట్లు కీర్తించుందురు. సప్త సముద్రములచే ఆవరింపబడిన ద్వీపములలో జంబూద్వీపం ఉత్కృష్టమైనది. అందలి తొమ్మిది వర్షములలో భారత వర్షము అధికమైనది. భారతములో ఉన్నవారు వృషభ దేవుడు ఉపదేశించిన భాగవత ధర్మములను శ్రేయస్సాధనములుగా భావింతురు. ఈ ప్రియవ్రతుని వంశము చాలా విశాలమైనది. ఆ వంశమునందే భగవానుడు వృషభుడుగా అవతరించినాడు. అతడే కర్మ రాహిత్యమును మోక్ష మార్గమును ఉపదేశించెను. లోకములో ఏ యోగియు ఆచరింపలేకపోవుటయే కాదు, కోరుటకు కూడా శక్యము కాదు. ఆ ఋషభుడు తనకు సిద్ధించిన యోగమాయలను ఉన్నను లేనివానిగా భావించి అనాదరింప సమర్ధుడైనాడు. ఇంతవరకు సకల వేద లోక దేవ బ్రాహ్మణులకు గోవులకు పరమ గురువగు భగవానుడగు వృషభదేవుని చరిత్రము ఇందు వర్ణింపబడినది. ఇది సమస్త దుశ్చరిత్రను తొలగించును. మహా మంగళము కలిగించును. దీనిని శ్రద్ధతో వినినను వినిపించినను భగవానుడగు వాసుదేవుని యందు భక్తి కలుగును. భగవత్ అనుభవ సుధారసముచే వివేకము గలవారు ఈ సంసారమునందలి పాపములను తాపములను భగవత్ అనుభవ ప్రవాహములో స్నానము చేసి తొలగించుకొందురు. భగవత్ అనుభవ రూపమగు భక్తి గలవారు పరమ పురుషార్థము స్వయముగా లభించినను దానిని ఆదరింపరు.

ఓ పరీక్షిణ్ మహారాజా, భగవానుడగు వాసుదేవుడు బ్రాహ్మణులకును యదువులకును స్వామి గురువు. దైవము, దైవము, ప్రియుడు, కులపతి. అంతే కాదు వారికి కింకరుడుగా సేవ చేసినాడు. అట్టి భగవానుడు తనను భజించు వారలకు ముక్తిని వసంగునే గాని భక్తిని వసంగడు. మీ భాగ్యముచే మీకు భక్తి లభించినది. వృషభ దేవుడు బ్రహ్మాత్మకమగు స్వస్వరూపమును అనుభవించుటయే లాభముగా భావించినాడు. ఇతర పురుషార్ధముల యందు తృష్ణ లేనివాడు పాప కర్మల విషయమున అతని బుద్ధి ప్రసరించదు. అట్టి ఋషభ దేవుడు లోకులకు దయతో అభయ స్వరూపమగు ఆత్మ స్వరూపమును ఉపదేశించెను. అట్టి ఋషభ దేవునకు నమస్కారము. ఇంతటితో ఋషభ దేవుని చరిత్రం మనం పూర్తి చేసుకున్నాం. తరువాత భరతుడి యొక్క వృత్తాంతాన్ని భరతోపాఖ్యానముగా మనం అందరం అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Nantaya, the subtle one, the one who is situated, the one who is in discourse, the one who is in opposition, the one who is in speech and non-speech, you are without end, subtle, without attributes, omniscient. You follow many arguments and grant those arguments in those forms. You are the forms of name power, salutations to you. Tenth Canto Sixteenth Chapter Forty Second Prayer. Devotees of God, welcome to the seventh podcast of the fifth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, in the history of Priyavardhana, we are learning about the matter of the bull god. The bull. He entrusted his kingdom and his duty to his sons and went into penance. After that, even though he was blessed with many kinds of powers, we learned that he did not accept them without giving them to them. We will experience it later. Those who are constantly experiencing bliss in the soul, through yoga, having a vision of the soul, through devotion yoga, God Those who are burnt by the fire of knowledge, which is the fire of realization, and whose karmic seeds are burnt, even if they have wealth and accomplishments, they cannot be bound by them. They have families, you know. Therefore, even if you use the Siddhas for Vrishabha Deva, there is no harm, right? When Parikshit doubted how it was not used, Shuka Yogi explained it to him.

Oh king, as you said, even if perfections are attained through yoga, those who have knowledge do not accept them. Do not think that the siddhis (spiritual powers) will not harm those who focus their minds on God. Great sages. Even those who have controlled their minds through yoga, their minds still waver, and they become fallen. Therefore, those who have wisdom do not trust the mind. The mind is like a hunter sitting far away, as if he knows nothing about the trap. It is as if it does not care and will twist the soul and subdue it. Therefore, one should not think that just because one has attained success and believes that yoga practice yields results, one should not consider what one loves as a fault in one's mind. The mind is not stable. Even the yogi who conquered the mind, the mind is submissive to me, right? What does that mean to me? One should not associate with such matters. If we trust our mind and associate with worldly matters, then the meditation on God will slip away. Even if yoga is perfected, the mind always leads to desire. When a desire is fulfilled, all the emotions of anger and desire enter the mind. Yoga is there, right And if one loves worldly things, the adulterous wife will deceive her husband, and the mind will be disheartened, will deceive. If there is friendship in worldly matters or in wealth, what enters the mind first is desire, that is, lust. Following lust, anger, pride, greed, sorrow, delusion, fear, etc., all enter the mind. It causes karmic bondage to the soul. Therefore, no matter how wise or yogi one is, one should not trust the mind and love worldly things.

In this way, the bull god, with a different disguise than the people, was wandering around like a madman with words and actions. Finally, with the desire to release their bodies, the yogis left ignorance to teach everyone how to release their bodies. Having united his soul with the Supreme Soul, having removed the karmic residue, having abandoned body-consciousness, having instructed the yogis in the practice of yoga, and having made them practice, he was. Thus, to abandon the body means not the gross body, but the subtle body. That is, in the mind, the intellect that says, 'I am the body,' is removed, and even though the body exists, whether it is separate or not, one should not consider the body as oneself, but should wander without adoring the body. Such a state is established. It is as if one attains liberation while still in the body, the soul remains in the body and clings to it. In this way, even though Vrishabha had abandoned bodily relations, the body was being controlled by a magical fragrance. This body, neither mine nor mine, had no affection. The body was freely roaming the southern Karnataka regions. In the sub-vana of Kutakachalamu, he kept stones in his mouth like a kabalamu and shaved his hair like a madman He was wandering around naked. While wandering like that, in that forest, the wind, due to the speed of the wind blowing, the bamboo trees that were moved, and the fire that was ignited. That fire burned that forest, along with the body of the bull god. Thus, even the gross body is left behind. Thus, Vrishabhadeva, transgressing the duties of the hermitage, wandering in the state of an Avadhuta, heard the story of the burnt one, the one named Arjuna, who was the king of that country. That king, like a bull, like a python, like cows, like an animal, wandering, without saying that the rituals performed are unscientific, following the divine decree that is to come, those are righteousness, these righteousnesses that are in the Pashanda method, according to his intellect The qualification made people act in the Dharma of the Arhats. Following the principle of eligibility, in Kaliyuga

Some uncultured men, deluded by the illusion of divinity, have abandoned their purity and history. Those who reject their respective gods in bathing and evening prayers, and accept what is not dharma as dharma, and are ignorant, perform bad vows. They insult the Vedas, those who study the Vedas, sacrifices, the Lord who is the sacrificer, and the devotees of the Lord. In this way, abandoning the Vedic standard, they act freely without authenticity. They practice blindly. They will fall into the hell of darkness and ignorance. This incarnation of the bull god punished those with a predominance of the Rajasic quality, those who followed a path contrary to the Vedas. They praise the history of the bull god in the same way as the Aryans. Among the islands that are surrounded by seven seas, Jambudvipa is the most excellent. Of the nine rainy seasons, the Indian rainy season is the longest. Those in India consider the Bhagavata Dharma preached by the Vrishabha God as auspicious. The lineage of Priyavrata is very illustrious. In that lineage, the Lord is Vrishabha He appeared. He taught liberation from karma and the path to liberation. It is not only that no yogi in the world can practice it, but it is also not possible to desire it. That Rishabhudu, considering the yogamayas prepared for him as if they existed or did not exist, became capable of neglecting them. Until now, the story of Lord Vrishabhadeva, who is the supreme guru to all Vedas, the world, gods, and Brahmins, and to cows, is described here. It takes away all the bad character. It will bring great blessings. Even if one listens to this with devotion, one will have devotion to Lord Vasudeva. Those who have wisdom through the nectar of divine experience will bathe and remove the sins and afflictions in this world by bathing in the flow of divine experience. Those who have devotion, which is the form of experiencing God, even if the ultimate goal is attained by themselves, they do not respect it.

Oh, King Parikshit, Lord Vasudeva is the guru of Brahmins and Yadus. God, God, beloved, master. That's not all, he served them as a servant. Such a God, if he grants salvation to those who worship him, but does not grant devotion. Devotion has come to you by your own good fortune. The bull god considered experiencing the Brahmanical self-form as the benefit. He who is without thirst for other objects of enjoyment, his intellect does not pervade the matter of sinful deeds. Thus, Lord Rishabha, with kindness, taught the people the form of the soul, which is the form of fearlessness. Salutations to Lord Rishabha. With this, we have completed the history of Rishabhadeva. After that, let us all experience Bharata's story as Bharataopakhyanam. Jai Srimannarayana. Salutations to the Asmadgurus