రాజు వైరాగ్య హృదయము - గంగానదీ తీర ప్రాయోపవేశ వ్రతము
The King's Renunciation & Fast Unto Death on the Ganges Bank
ఈ భక్తిపూర్వకమైన ఎపిసోడ్లో, మహారాజు పరీక్షిత్తు సప్తదిన మరణశాపమును పొందిన అనంతరం తన విశాల సామ్రాజ్యమును వైరాగ్యముతో త్యజించి, అసాధారణమైన స్థిరచిత్తముతో సర్వమును భగవంతునికి అర్పించిన మహత్తర ఘట్టమును దర్శిస్తాము. మృత్యువు నిశ్చయమైన ఆ క్షణమున దివ్యజ్ఞానముచే ప్రకాశితుడైన పరీక్షిత్తు, పావన గంగానదీ తీరమున ప్రాయోపవేశ వ్రతమును ఆచరించుటకు సంకల్పించుకొనెను. ఈ పవిత్రమైన సందర్భముగా సర్వలోకముల నుండి మహర్షులు, సాధువులు, మహాత్ములు గంగాతీరమునకు తరలివచ్చి, రాజర్షి పరీక్షిత్తు యొక్క అచంచల భక్తిని పూజించుచు, శ్రీమద్భాగవత మహాపురాణ ప్రవచనమునకు దివ్యవేదికను సిద్ధమొనర్చిరి.
In this profound episode, we witness the great King Parikshit renouncing his vast kingdom after receiving the curse of death within seven days, surrendering all earthly attachments with remarkable equanimity. Touched by divine grace and the clarity that comes with impending death, he makes his way to the sacred banks of the Ganges to observe Prayopavesha, a fast unto death, as the ultimate act of spiritual surrender. Sages, saints, and great souls from across the universe gather at this holy site, honoring the king's unwavering devotion and creating the divine setting from which the Srimad Bhagavatham will be spoken.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యస్మాద్బిభేమ్యహమపి దిపరార్ధదిష్ణ్యం అధ్యాసితస్సకల లోక నమస్కృతం యత్ తేపే తపో బహువసో వరుత్సమానః తస్మై నమో భగవతే ధిమఖాయ తుభ్యం బ్రహ్మలోకమును ఇతర లోకములోని జీవులందరు నమస్కరింతురు అది రెండు పరార్థముల కాలము. వెయ్యి మహాయుగములు ఒక పగలు అనే లెక్కలో వెయ్యి సంవత్సరములు పరార్థమగును. ఆ రెండు పరార్థముల కాలం వరకు నిలిచి ఉండును. ఆ బ్రహ్మలోకమును అదీశ్వరుడినగు నేను కూడా. కాలమునకు భయపడుచుందును. నేను నిన్ను పొందగోరి అనేకములకు యజ్ఞములను చేసి అనేక సంవత్సర కాలము తపస్సు సలిపితిని. అట్టి యజ్ఞములకు అధిష్టానముకు పురుషుడవు నీవే. ఆ కాలము భగవానుడు నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారం. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 27వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతకు ముందు భాగంలో పరీక్షిత్తు ధర్మదేవతను భూమిని ఓదార్చి కలికి ఏ స్థానంలో ఉండాలో తెలిపి తిరిగి మళ్ళీ వారికి జీవనాన్ని కలిగించాడు. ఆ తర్వాత జరిగే కథని తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అశ్వద్ధామ అస్త్రాగ్నిచే తల్లి కడుపులో మరణించినట్లు. అయిన పరీక్షిత్తు అద్భుత శక్తిమయుడవు శ్రీకృష్ణుని అనుగ్రహం వలన మరల జీవించిన వాడాయను. భగవదనుగ్రహ పాత్రకుడ చేతని బ్రాహ్మణుని శాపం వలన తక్షకుడు తన ప్రాణములను తీయునని ఎరింగియు ధైర్యమును వీడి మోహమునందలేదు. దేహమునందును దేహ సంబంధుల యందును సంఘమును వీడి శుకునకు శిష్యుడై భగవానుని యందే మనసు నిలిపిన వాడై తన శరీరమును గంగలో పరిత్యజించెను. భగవత్ కీర్తిని, భవత్ గుణములను వినుచు ఆ భగవానుని కథామృతమే శవించు వారలకు ప్రాణావసాన కాలమందు కూడా తొట్రుపాతు కలగదు.
కలి ఈ భూమియందు అంతను ప్రవేశించినను పరీక్షిత్తు రాజ్య పరిపాలనము చేయునంత కాలము అతని శాసనము ఎదురులేక సాగుచున్నంత కాలము కలి లోకమును ఆక్రమింపజాలదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిని వీడి ఏనాడు ఏగినాడో. ఆనాడే అధర్మం పుట్టించడి కలి లోకమును ఆక్రమించినది. పరీక్షిత్తుని కలిని నాశమొందించువాడే అయినను అతడు కలిని ద్వేషించలేదు. కలియుగములో కొన్ని యోగ్యతలు ఉన్నవి. భగవన్నామ సంకీర్తన మొదలు పుణ్య కర్మలు ఈ కలియుగమున శీఘ్రముగా ఫలమునిచ్చును. పాప కర్మలు వేగముగా ఫలమునియ్యవు. చెడ్డ వస్తువైనను సారమును గ్రహించు స్వభావము గలవాడు అగుటచే కలియుగమునందలి మంచిని గ్రహించి దానిని ద్వేషించలేదు. కలి ధైర్యము గలవారై వివేకముతో ప్రవర్తించు వారి వద్దకు చేరుటకు భయపడును. అవివేకులను పరాకుగా ఉన్న జంతువులను తోడెలు వచ్చి కంబళించినట్లు హింసించును. అని సూతుడు చెప్పుచు వాసుదేవ కథను వినవలెని మీరు కోరినారు కనుక వాసుదేవ కథతో సంబంధం గల పరీక్షిత చరిత్ర మీకు వివరించితిని. తన శ్రేయస్సు తాను కోరుకొనడి మానవుడు భగవత్ కథలను భగవత్ లీలను తప్పక విని ఆనందించవలెను అని పలికెను. సూతుని మాటలు విని ఋషులకు శ్రీకృష్ణ కథయందు ఆసక్తి మరింత పెరిగెను. మరణశీలుడగు మాకు అమృతం వంటి శ్రీకృష్ణ కథను విశదముగా ఎరింగించు, నీవు చిరకాలము జీవింపుము. విశ్వసించుటకు వీలుగాని ఈ కర్మలెందు శ్రద్ధ కలిగి ఆ యజ్ఞ ధూమములచే శరీరము మనస్సు పొగబారియున్న కర్మ జడములగు జడులమగు మాకు నీవు గోవింద పాదపద్మ మకరందమును పానము చేయుచున్నావు. భగవాను యందు ప్రేమ గల నీ వంటి వారితో కూడి ఉండుట కంటే స్వర్గము గాని మోక్షము గాని గొప్పదని మేము భావింపము. జీవులకు ప్రాప్యుడు, ప్రాపకుడు, ఆధారభూతుడు అగువాడు భగవానుడు. అట్టి భగవాన్ని కథలలోని రుచిని ఎరింగిన వారకు బ్రహ్మ రుద్రాదులు కూడా విని తృప్తి పొందరు. ఎంత కాలం విన్నను ఆ గుణములకు అంతము లేదు. ఎంత కాలము విన్నను రుచి మారనివి భగవన్ నామములు. శ్రీహరి ఉదారముగు చరిత్రమును వినువారులకు చెప్పువారులకు శుద్ధి కలుగును. అట్టి భగవానుడే ప్రధానమని భావించిన వాడవు నీవు. భగవద్గుణములను వినవలెనని కోరిక గల మాకు నీవే ఆ చరిత్రమును విస్తారముగా చెప్పుదువు కాక.
మహా భాగవతుడగు పరీక్షిత్తు వ్యాసపుత్రుడగు శుకుడు చెప్పిన భాగవత ప్రతిపాదితమగు జ్ఞానముచే గరుడధ్వజుని పాదమూలమును చేరినాడు. ఆ భాగవతము నిరతిశయముగు పుణ్యమును కలిగించునది. మోక్షమందు కోరిక గలవారు ఎరుంగదగిన శాస్త్రార్థములను ప్రతిపాదించును. అపరిచ్ఛిన్నమగు స్వరూపము స్వభావము గల భగవాన్ లీలలు అందు ప్రతిపాదించును. ఆ పురాణమే భాగవతులకు మనోహరమైనది. దానినే పరీక్షిత్తు విని తరించినాడు. దాన్ని నీకు నేను చెప్పవలెనని ప్రార్థించుచున్నాను, నీవు చెప్పవలెనని ప్రార్థించుచున్నాము అని ఋషులు ప్రార్థించగా సూతుడు ఇట్ట చెబుతున్నాడు. ఓహో. జన్మనెత్తిన మేము ధన్యులము. మేము జన్మచే తక్కువ వారము అయినను పెద్దలను సేవించి ప్రశస్తిని పొందినాము. అంతేకాదు మీ వంటి మహాపురుషులు మమ్ములను చెప్పమని అడుగుట. మీకు చెప్పగలుగుట నా దోషములెంటిని తొలగించి నాకు ఉత్తమాత్మమును ప్రసాదించునది. మహాపురుషులు పొందదగినవాడు పరమపురుషుడు. అతడు భగవానుడు. అతడు జ్ఞానశక్తి మొదలగు ఆరు గుణములతో పూర్ణుడు. అగ్నికి దహించే శక్తి సహజముగా ఉన్నట్లే ఆ భగవానుడి నామమునకు తనను ఉచ్చరించిన వారి దోషములను పాపమును పోగొట్టు శక్తి ఉన్నది. భగవానుడు స్వరూపము చేత పరిచ్ఛేదము లేనివాడు. ఇట్టివాడు అని గానీ, ఇక్కడ ఉన్నవాడని కానీ, ఇప్పుడు ఉన్నాడని కానీ ఎవ్వరును వారిని నిర్దేశింపలేరు. అతని గుణములు కూడా అనంతములే. అందుచేతనే వేదం వాన్ని సత్యము, జ్ఞానము, అనంతము అని కీర్తించినది. ఆ భగవానుని గుణములతో సమానముల గుణములు గాని అంతకంటే అధికము గుణములు కానీ కలవాడు ఎవ్వరునూ లేరు. సాక్షాత్తు లక్ష్మీదేవి. తనను ప్రార్థించెడు బ్రహ్మాదులందరినీ వదిలి తనను కోరకపోయినను ఆ భగవాని పాదరేణువుని సేవించుండును. ఆ మహానుభావుని ఎడమ కాలి బొటనువేల నుండి బయలు విడినదై బ్రహ్మచే స్వామి ఆరాధనకు వినియోగింపబడిన గంగాజలమును పరమశివునితో ఆ ఈ లోకమునంతను పవిత్రము చేయుచున్నది.
అట్టి ముకుందుని కంటే వేరొకడు ఎవడును భగవానుని పదముచే చెప్పదగిన వాడు లేడు. ఆ భగవానుని యందు అనురాగం గల ధీరులు ఇంద్రియ జయం గలవారై. దేహమునందు దేహ సంబంధుల యందు పాతుకొని పోయిన సంఘమును తెచ్చుకొని పరమహంసాశ్రయమును పొందుచున్నారు. ఆ ఆశ్రమం స్వీకరించిన వారికి సహజముగా అహింస, శాంతి, విషయ విరక్తి, దయ మొదలగు ధర్మములు ఆవిర్భవించును. మీరు జ్ఞానాధికులు, మీరు వేదమూర్తులు, మీరు కోరిన భగవద్వైభవమును నా బుద్ధి ప్రసరించినంత మేర ఎరింగి మీకు తెలిపెదను. ఆకాశమున పక్షులు తమ బలమును అనుసరించి ఎగరగలవు కానీ అంతకన్నా పైకి ఎగరలేవుగా. ఆకాశము ఎట్లు అనంతమో భగవద్గుణములను అట్లు అనంతములే. పండితుడనైనను తన బుద్ధిని అనుసరించి భగవన్ మహిమ నిరంగజాలును. చివరి వరకు పక్షులు ఎట్లు ఎరుగలేవో అట్లనే భగవాన్ మహిమను ఎరుంగలేరు. ఒకనాడు పరీక్షిత్తు వేటకు బయలుదేరెను. ధనస్సు ఎక్కుపెట్టి మృగములను వేటాడుచు బడులు తప్పికొని ఆకలిగొన్నవాడాయను. అచ్చట ఎచ్చటను నీటి పట్టుకు కనబడలేదు. అంగిరసుని ఆశ్రమం కనిపించెను. అందు ప్రవేశించెను. అంగిరస మునిని చూచెను. శాంత ప్రసన్న ప్రసన్న రూపముతో నేత్రములు మూసుకొని అతడు కూర్చొని ఉండెను. వాని ఇంద్రియ వ్యాపారము విషయములపై ప్రసన్నించుట లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను దాటి ఆత్మ దానికి ఆత్మగానున్న బ్రహ్మను భావించుచు ఏ వికారము లేక ఉండగా అతను నిశ్చలముగా ఉండెను. అతని జటలు ఇటునటు చెదిరి ఉండెను. రురువు అను మృగం యొక్క చర్మమును అతను ఆచ్ఛాదించుకొని ఉండెను. ఆకలిచే దాహముచే నోరు ఎండిపోవుచున్న పరీక్షిత్తు అతనిని చేరి నీరు అడిగెను. అతడు బాహ్యస్మృతిలో లేడు. ఇతని మాట తనకి వినబడలేదు. పరీక్షిత్తు తాను కూర్చునుటకు ఆసనము గాని మధురమైన మాటలతో స్వాగతము గాని అర్ఘ్యము గాని అర్పించక ఆ మౌని తనను అవమానించడని భావించి కోపము గలవాడాయను. ఆకలి దప్పులచే పీడింపబడుచున్న ఆ రాజునకు ఇంతకుముందు ఎన్నడును కలిగినంతటి కోపం కలిగెను. ఆశ్చర్యం కలిగెను. ఆ మునికి ఏదో ఒక అపకారము చేయవలెనని బుద్ధి జనించెను. కోపముతో మరలిపోవుచు ఆ బ్రహ్మర్షి 30 ధనము ధనుస్సు చివరతో చనిపోయిన పామును పడవైచి వెడలిపోయెను. ఇతడు నిజముగా ధ్యానంలో ఉన్నాడా లేక ఈ రాజులు మనని ఏమి చేయగలరు అని సమాధిని నటించుచున్నాడా?
అని కనులు మూసుకునుట వాస్తవమా, కృత్రిమమా? చూడవలెనని పామును పడవేచినను అతడు చలింపలేదు. పరీక్షిత్తు వెడలిపోయెను. ఆ ముని కుమారుడు చాలా తేజశ్శాలి. చిన్న పిల్లలతో ఆడుకొనుచుండెను. తండ్రి మెడలో ఒక రాజు వచ్చి పామును పడవైచి వెలిగిపోయాడని వినినాడు. ఓహో పాలకులు ఎంతటి అధర్మపరులు. ఇంగిలి మెతుకులు తిని బలిసిన కాకులు. కాకుల తమకు పెట్టువారి తలలపై తన్నినట్లు, తమను పోషించు స్వామినే కుక్కలు కరిచినట్లు, తమ తపస్సుచే లోకమునకు రక్షణ కలిగించు మునులపై ఇట్టి పాప పని చేసిన ఆ రాజు ఎంతటి అధార్మికుడు. ఈ తర నీచ క్షత్రియుడు. ద్వారం వద్ద కాపలాకు పెట్టిన కుక్క తనను పోషించెడి బ్రాహ్మణుల ఇంటి పాత్రల్లో కలియబడి తినుట ఎంతటి సాహసము. భగవానుడు శ్రీకృష్ణుడు ఈ లోకమును విడి వెళ్ళినాడు. ధర్మం మార్గమును తప్పి ప్రవర్తించెడి వారిని శాసించెడి వారు లేరు. కట్టుబాటు ఉల్లంఘించి ప్రవర్తించెది వారిని నేను ఇప్పుడే శిక్షించెదను. నా బలమును చూడు అని కోపముతో జేవురించిన కనులు గలవాడై తన తోడి బాలకులతో తీవ్రముగా మాట్లాడుచు కౌశికీ నదిలోని జలములను తీసి ఇట్లు శపించెను. కట్టుబాటు మీరి నా తండ్రి మెడలో పామును వేసిన ఈ మర్యాదహీనుని నేటికి ఏడవ రోజున తక్షకుడని సర్పము కాటు వేయుగాక. ఇట్లు శాపమిచ్చి ఆశ్రమమునకు వచ్చెను. మెడలో వేలాడుచున్న సర్పముతో తన తండ్రిని చూచెను. దుఃఖార్థుడై ఎలుగెత్తి ఏడ్చెను. ఈ ఏడుపు విని అంగిరసుడు కనులు మెల్లగా విప్పి చూచెను. తన భుజములపై నుండి పామును వేలాడుచుండెను. ఆ పామును తీసి క్రింద పడవేచెను. నాయనా, ఏల ఏడుచున్నావు? ఎవరు నీకు అపకారం అనుచ్చినారు అని కుమారుని అడిగినాడు. అతడు జరిగిన దానిని తెలియజేసెను. రాజునకు శాపమిచ్చుట తగదని తండ్రి కుమారుని అభినందన చేయలేక చాలా బాధపడెను. నీవు తెలివి తక్కువ వాడివి. సల్పమైన అపరాధమునకు చాలా తీవ్రమైన దండమును నీవు వసంగితివి. నీకు బుద్ధి పరిపాకము లేదు. మనసు అపకారము చేసినను రాజును ఎదిరింపరాదు, అపకారము చేయరాదు. అతడు రాజు కాడు సాక్షాత్తు భగవానుడు. అతనిని గౌరవింపబలేను గాని బాధింపరాదు. అతడు శత్రువులను హింసింపబడకుండా ప్రజలకు బాధలు కలగకుండా శుభములను కలిగించనివాడు.
లోకమునకు సుఖమును కలిగించడి వారిని హింసించుట తగదు. శ్రీ మహావిష్ణువే రాజుగా లోకమును రక్షించుచున్నాడు. అతడు లేనిచో లోకమును రక్షణ లేదు. గొర్రెల మందును కాపాడువాడు లేనిచో దొంగచాటు తోడేలు వచ్చి కవళించుచుండగా ప్రజలెందరూ హింసింతురు. ప్రజలను ఎందరు హింసిందురు. రక్షకుడగు రాజు లేనిచో జనులు దొంగలై ఒకరిని ఒకరు హింసించుకొందురు. ఒకరి ధనమును ఇంకొకరు దోచుకొందురు. రాజు లేనిచో వే ధర్మములు వర్ణాసిన ధర్మములు నశించును. ధర్మము నశించుటచే అర్ధకామములే ప్రధానమని భావించి ప్రజలు చెడిపోవుదురు. ఇట్లు సామాన్యులకు రాజులే లోక రక్షకుల గుటచే పూజింపదగిన వారై ఉండగా పరీక్షిణ మహారాజు వరుణాసన ధర్మములను పాలించు విశాలము కీర్తి గల మహా భాగవతుడు రాజర్షి అశ్వయ్యమేధ యాగమును చేసినాడు. ఆకలి దప్పులచే కూడిన వాడై దీనుడై వచ్చినాడు. అతనికి శాపమిచ్చుట తగదు అని కుమారునితో పలికి అజ్ఞానముచే నా కుమారుడు చేసిన పాపమును క్షమించమని సర్వాంతరాత్మ యగు భగవానుని ప్రార్థించెను. భగవత్భక్తులు తమను ఎవరైనా అవమానించినను, వంచించినను, నిందించినను, కొట్టినను వారికి ప్రత్యుపకారం చేయు శక్తి కలిగియుండియు వారికి అపకారం చేయరు. ఇది సాధువుల స్వభావమని తన కుమారుడు చేసిన పాపమునకు బాధపడి ముని రాజు తనకు అపకారం చేసినాడని అతని తప్పును ఆలోచించి బాధపడలేదు. తన కుమారుడు చేసిన తప్పునకే చాలా ఖేదము నందెను. సాధువులు ఇతరులు తమకు సుఖ దుఃఖములు కలిగించినను సంతోషింపరు, బాధపడరు. కేవలము సత్తరజస్తమో గుణముల ఫలముగానే రాగద్వేషములు కలుగును. కానీ ఆత్మకు రాగద్వేషములు సహజములు కావని వారు ఎరింగినారు. ముందు భాగాన్ని తర్వాత మనం తెలుసుకుందాం. సద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Asmadgurus. By whom I was deluded, but I have understood the other meaning, the all-pervading one, the one who is meditated upon, the one who is worshiped by all the worlds, who is like Varuna, to him be salutations. O Lord, to you, the foremost, the Brahmalaoka and all the beings in other worlds They are greeting, that is the time of two meanings. A thousand great ages are equivalent to a single day in the calculation. Those two things will last until the time. I am also the Adiyogi in Brahmaloka. Afraid of the clock. I, desiring to obtain you, performed sacrifices to many and spent many years in penance. You are the lord of such sacrifices and the presiding deity. The Lord is your Storm. Greetings to you. Devotees of God, welcome to the 27th podcast of Srimad Bhagavata Tatva Deepika, the first volume. In the previous part, Parikshit consoled the goddess of Dharma, the earth, and told her in which position Kalki should be, and then again gave them life. We'll see how that goes and maybe branch out. Ashwatthama, by the fire of the arrow, in the mother's womb As if dead. However, Parikshit, with his wonderful power, by the grace of Sri Krishna, he came back to life. Due to the curse of the Brahmin by the one worthy of God's grace, Takshakudu, abandoning his courage and desires, did not give up his life. Having abandoned the body and all the associates, and having become a disciple of Sukuna, having fixed his mind on the Lord, he abandoned his body in the Ganges. Those who listen to the glory of God and the virtues of God, and drink the nectar of the Lord's story, will not falter even at the time of their death.
Even if Kali enters this earth, as long as Parikshitu rules the kingdom, as long as his edict continues without being opposed, Kali cannot conquer the world. When did Lord Krishna leave this earth? That very day, unrighteousness was born and conquered the world. Even though he is the one who destroyed Kali, he did not hate Kali. In Kali Yuga, there are some qualifications. The beginning of chanting the name of God and performing good deeds will quickly bear fruit in this Kali Yuga. Sinful deeds do not quickly bear fruit. Because he has the nature of grasping the essence even from bad things, he did not hate the good in Kali Yuga. Those who have courage and wisdom, fear to reach them. The foolish animals are beaten and tormented like animals that are in a state of panic. And thus, saying, since you requested to listen to the story of Vasudeva, I have explained to you the story of Parikshita, which is related to the story of Vasudeva. A human being who desires his own well-being must listen to the stories of God and the plays of God He said, let's rejoice. Hearing the words of Suta, the interest of the sages in the story of Sri Krishna increased further. Oh, Srikrishna, who is like nectar to us, who is death-struck, explain the story to us in detail, may you live long. O Govinda, you are offering the nectar of the lotus feet to us, who are inert and dull, with our bodies and minds filled with smoke from the smoke of those sacrifices, and who are inert and dull. We do not think that heaven or salvation is greater than being with those like you who have love for God. The Lord is the giver, the provider, and the sustainer of all beings. Those who have tasted the stories of such a God will not be satisfied even by hearing the names of Brahma, Rudra, etc. No matter how long I listen, those qualities never end. Even after listening for a long time, the names of the Lord do not change in taste. Those who listen to and tell the story of Srihari's generosity will be purified. You are the one who considered that the Lord is supreme. Oh, you are the one who has a desire to hear the virtues of the Lord, you tell that story in detail, don't you?
The great Bhagavata, Parikshit, and Vyasa's son, Shuka, having attained the knowledge propounded by the Bhagavata, reached the lotus feet of Garuda. That Bhagavatam is infinitely virtuous. Those who desire liberation will propose scriptural arguments that are understandable. The unbroken form and nature of God's plays are presented there. The legend is quite interesting and quite captivating. He tested it and was satisfied. I am praying that I should tell you that, we are praying that you should tell, as the sages prayed, Sutudu is saying this. Oh. We are blessed to have taken birth. Although we are born as lowly people, we have gained fame by serving the elders. That's not all, great men like you ask us to tell. It is my fault that I cannot tell you, remove all my faults and grant me the best soul. The Supreme Being is the one and only Supreme Personality of God. He is God. He is complete with six qualities like wisdom and power. Just as fire has the natural power to burn, so too does one's own self to the name of that Lord It has the power to remove the sins and errors of those who utter it. The Lord is unborn. Neither this person, nor the one who is here, nor the one who is now, no one can determine them. His virtues are infinite too. Therefore, the Veda praised him as truth, knowledge, and infinity. There is no one who has qualities equal to the virtues of that God, or more virtues than that. The Goddess Lakshmi herself. He who serves the lotus feet of that Lord, even if he does not leave all the Brahmins who pray to him, he serves. That great man's left foot, having emerged from the lotus, the Ganges water used for the worship of the Lord by Brahma, is sanctifying this entire world with Parama Shiva.
There is no one else who can be said to be worthy of the feet of the Lord, other than Mukunda. Those who are endowed with courage and conquer their senses, who are devoted to that God. They are bringing the church that is entrusted to them in the body and in the blood of the covenant, and are receiving the refuge of the Most High. Those who accept that ashram will naturally have the virtues of non-violence, peace, detachment from worldly matters, and compassion. You are the knowers, you are the embodiment of the Vedas, I will tell you the divine glory you desired as far as my intellect can spread it. Birds in the sky can fly according to their strength, but they cannot fly higher than that. Just as the sky is infinite, so too are the virtues of God infinite. Even though he is a scholar, he follows his intellect and contemplates the glory of God. Just as birds do not know how to fly until the end, similarly, they cannot understand the glory of God. Once, Parikshit set out on a hunt. He is a hunter who hunts animals, avoids the laborers, and is hungry. Nowhere was the water seen. Angiras's hermitage was seen. He entered. Angiras saw the sage. Shanta With a cheerful appearance, he sat with his eyes closed. His senses are not engaged in worldly matters. Being careful, transcending the states of dream and deep sleep, the soul, considering Brahma as the soul, remained without any distortion. His hair was disheveled. He had covered himself with the skin of his own animal. Parikshit, his mouth was drying up due to hunger and thirst, and he approached him and asked for water. He is not in his outer consciousness. His own words were not convincing. Parikshit, not offering a seat for him to sit, or a welcome with sweet words, or an offering, that silent man, thinking that he would not insult him, he was angry. The king, afflicted by hunger and thirst, became as angry as he had ever been before. I'm surprised. The sage had a mind to do some mischief. That Brahmarshi, returning with anger, defeated the snake that had died at the end of the 30-mound of wealth and left. Is he really in meditation or are these kings doing something to us Is he pretending to be a samadhi?
Is it real or artificial, closing eyes? Even though he threw the snake away thinking it should be seen, he did not move. Parikshit left. The sage's son is very radiant. She was playing with small children. He heard that a king came to the father's neck and defeated the snake, and he shone. Oh, what unjust rulers! The roasted grains of indigestible matter that had been eaten by the crows. Like crows kicking the heads of their masters, like dogs biting the masters who nourish them, how much of a sinner is that king who committed such a sin on the sages who protect the world through their penance. This is a low-class Kshatriya. How daring is it for a dog, kept guarding the door, to mix and eat in the vessels of the Brahmins who feed it? Lord Krishna left this world. There is no one to govern those who deviate from the path of righteousness. I will punish those who violate the agreement and behave in a way that is not in accordance with it. He, with eyes filled with anger, said, "Look at my strength." Then, speaking harshly to his companions, he took the water from the Kaushiki river Thus cursed. May the serpent bite Takshakudu, the wicked one who broke his promise and put a snake around my father's neck, on the seventh day of today. Thus cursing, he came to the hermitage. He saw his father with a serpent hanging around his neck. He cried, overwhelmed by grief. Hearing this cry, Angirasu slowly opened his eyes and looked. He was dangling the snake from his shoulders. He pulled the snake out and threw it down. Why are you crying, my dear? He asked his son who had done you wrong. He told what had happened. The father, unable to congratulate his son for not giving the curse to the king, was very saddened. You're a fuckin' loser. You have imposed a very severe punishment on a minor offense. You have no sense of right or wrong. Even if the mind has done evil, one should not oppose the king, one should not do evil. He is not a king, but God himself. I can't honor him, but I can hurt him. He is the one who does not inflict suffering on enemies, does not cause suffering to people, and does not cause good things.
It is not right to persecute those who do not cause happiness to the world. Sri Maha Vishnu as Raja is the preserver of the world. Without him, there is no salvation for the world. If there is no one to protect the sheep's medicine, the thief will come stealthily, and while the sheep are being attacked, all the people will be tormented. How many people are being oppressed? If there is no king to protect, the people will become thieves and will harm each other. One person's gain is another person's loss. If there is no king, then the dharmas, the dharmas that are ordained, will perish. People are ruined by the belief that only lust and desire are important because of the destruction of dharma. Thus, while kings are worshiped as kings to the common people, and protectors of the world, Parikshita, the great devotee of the glorious Ashwamedha Yaga, who upholds the virtues of Varunasana, is a great devotee of the glorious fame. He came, afflicted with hunger. It is not right to curse him, she said to her son, and prayed to the all-pervading Lord to forgive the sin committed by my son due to ignorance. Devotees of God, if anyone insults, deceives, blames, or beats them, then for them Even though they have the power to do good, they do not do them harm. This is the nature of sages, and the sage, grieved by the sin committed by his son, did not grieve thinking about his mistake that the king had harmed him. He was very sad because of his son's mistake. Saints and others do not rejoice or suffer even when others cause them happiness or sorrow. Only the fruits of the qualities of Sattarajasthamo are attained, and only then are there feelings of attachment and aversion. But they thought that attachment and aversion to the soul are not natural. We will learn about the front part later. Salute to the Sadguru. Jai Shri Mannarayana.