భక్తి యోగ సాధన - పరమాత్మ సాక్షాత్కార సాఫల్యత
Practice of Bhakti-Yoga & Supreme Enlightenment
శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ పవిత్ర ఎపిసోడ్లో, మహర్షి వ్యాసుడు పరమాత్మను సాక్షాత్కరించుకొనుటకు భక్తియోగమే సర్వోత్కృష్టమైన మార్గమని బోధిస్తారు. శ్రీహరి పాదారవిందములపై అచంచలమైన భక్తితో, నిరంతర స్మరణతో, మరియు శరణాగతితో సాధకుడు మనసును శుద్ధి చేసుకొని జనన మరణ చక్రమును అధిగమించగలడు. నిష్కళంకమైన భక్తి సాధన చివరకు సమస్త సృష్టిలో వెలుగొందే పరమాత్మ సాక్షాత్కారంలో పరిసమాప్తమవుతుందని ఈ ఎపిసోడ్ అద్భుతంగా వివరిస్తుంది.
In this sacred episode from Canto 1 of the Srimad Bhagavatham, the great sage Vyasa reveals the profound path of Bhakti-Yoga as the highest means of attaining direct realization of the Supreme Lord. Through heartfelt devotion, constant remembrance, and surrender unto the lotus feet of Sri Hari, the seeker gradually purifies the mind and transcends the cycle of birth and death. The episode beautifully illuminates how sincere practice of Bhakti ultimately culminates in the blessed vision of Paramatma, the Supreme Soul dwelling within all creation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నతా స్మృతే నాధ సదాంగ్రి పంకజం విరించి వైరించ్య సురేంద్ర వందితం పరాయణం క్షేమమిహిచ్చతాం పరం నయత్ర కాలః ప్రభవేత్ పరః ప్రభుహు ఓ ప్రభు బ్రహ్మాదులను కూడా కవళింపవేసే కాలము యొక్క నీడ అయినను నీపై పడదు. నీ పాదపద్మమును బ్రహ్మ సనకాదులు ఇందుడు నమస్కరించెదరు. ఈ లోకంలో క్షేమమును గోరువారికి సర్వోత్కృష్టమగు ఆశ్రయమైన నీ పాదపద్మమును మేము నమస్కరించుచున్నాము. ఫస్ట్ క్యాంటు, 11th చాప్టర్, సిక్స్త్ ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఎనిమిదవ అవతారము వృషభుడు. మను యొక్క పౌత్రుడు నాభి, అతని భార్య మేరుదేవి. వారిద్దరికీ వృషభుడు అని పేరుతో భగవానుడు అవతరించెను. యోగీశ్వరులు అనుష్టింపదగిన ధర్మ మార్గమును అతడు ప్రదర్శించెను. సర్వాశ్రమముల వారు అతని గౌరవముతో నమస్కరించి ఉండడివారు. తొమ్మిదవ అవతారము వృధువు ఋషులు అధర్మముగా పరిపాలించుచున్న వేణుని చంపిన తర్వాత జగత్తును పరిపాలించుటకు ఒక పాలకుని అనుగ్రహించమని భగవాన్ని ప్రార్థించిరి. అప్పుడు భగవానుడు పృధువు అను పేరు గల జీవుని అనుప్రవేశించి పృధు శరీరమును స్వీకరించి లోకమును పరిపాలించెను. అప్పుడు ఆ పృధువు గోవు రూపమును స్వీకరించి భూమి నుండి ఔషధులను పెండెను. ఆ కారణముచే పృధువు అందరికీ ఇష్టుడై గౌరవింపదగిన వాడాయను. పదవ అవతారం మత్స్యం. చాక్షుష మన్వంతరము తరువాత వచ్చిన ప్రళయంలో స్వామి మత్స్య రూపం ధరించి తన కొమ్ముకు కట్టిన పడవ రూపమున ఉన్న భూమిపై కూర్చుండ చేసి వైవసుత మనువుగా జన్మించబో సత్యవ్రతును రక్షించినాడు. మత్స్యావతారము 10వ అవతారం. ఇక 11వ అవతారం కూర్మావతారం. అమృతం కొరకు దేవతలు, రాక్షసులు సముద్రమును మధించినప్పుడు మందర పర్వతము ఇటునటు కదలకుండా కూర్మమై తన పృష్టభాగమును ధరించినాడు.
12వ అవతారము ధన్వంతరి. ధన్వంతరిని పేరు గల శరీరములోని జీవునిలో అనుప్రవేశించి భగవానుడు సకల జీవకోటికి స్వస్థతను చేకూరుచు శాస్త్రమును లోకమునకు అందించెను. 13వ అవతారము మోహిని రూపం. సముద్రము నుండి వెలికి వచ్చిన అమృతము లోక విద్రోహకరమగు అసుర శక్తులకు అందకుండా లోక పోషకములగు దేవతలకును శాశ్వతముగా నిలుపుటకు అసురులను మోహింపచేసి అమృతమును దేవతలకు అందింపజేసెను. 14వ అవతారము నారసింహము. భగవానుడు అస్తిత్వము అంటే ఉనికి లేకుండా చేయవలెనని ప్రయత్నించిన హిరణ్యకశిపుని తన గోళ్ళతో చాపలు అల్లువాడు వెదుళ్ళు చీల్చినట్లు తొడలపై పరుండ పెట్టుకొని చీల్చి భగవానుడు సర్వ పదార్థములయందు ఉన్నాడని ప్రహ్లాదుడు చేసిన ప్రతిజ్ఞను సత్యమని రుజువు చేసినాడు. 15 అవతారము వామన అవతారం. మూడు లోకములను ఆక్రమించి తనవే అను అభిమానముతో దానము చేయుచు యజ్ఞములను చేయుచు ధర్మాచరణను చేయుచున్నట్లు నటించు. నటించుచు అహంకార మమకారములు వీడక ఉన్న బలిచక్రవర్తి నుండి లోకములను స్వీకరించి ఇంద్రుడు కుసంగిన అవతారం. అహంకార మమకారములతో చేసిన ధర్మము ధర్మము కాదు. ధర్మం వలె కనపడును. నా మాత్రముగా నేనను ధర్మం ఆచరించుటచే భగవానుడు బలిని హింసింపక తానే వామనుడై యాచించి భూమిని స్వీకరించి అతని అహంకార మమకారములకు ప్రతీకారమునర్చెను. అతని నుండి యాచించి ఇంద్రునకు స్వర్గమును త్రైలోక్య సామ్రాజ్యమును లభింపజేసెను. 16వ అవతారము పరశురామావతారం. బ్రహ్మ కులమునకు ద్రోహము చేసిన కార్తవీర్యార్జునుడు మొదలగు రాజులు రాజసము తగ్గింపచేయుటకు 21 సార్లు రాజులను చంపి భూమియందు రాజస తత్వమును నిర్మూలింపజేసెను.
17వ అవతారము బాదరాయణుడు. పరశుర పరాశరునకు సత్యవతికి కుమారుడై అల్పబుద్ధులగు పురుషులకు సులభముగా ఉండుటకు వేదమును శాఖలుగా విభజించినాడు. 18వ అవతారము శ్రీ రామావతారం. రావణ వధ చేసి దేవ కార్యము నెరవేర్చుటకు నరదేవునిగా జన్మించి సముద్రుని నిగ్రహించుట మొదలకు అనేక విధముల అతి మానుష చేష్టతలను చేసినాడు. 19, 20 అవతారములు బలరామకృష్ణులు. యాదవులలో జన్మించి బలరాముడు, శ్రీకృష్ణుడు అనేటి నామములతో భూభారమును తొలగించెను. 21వ అవతారము బుద్ధావతారం. కలియుగం ప్రారంభము కాగా దేవతలను ద్వేషించెడి అసురుల సమ్మోహము కొరకు భగవానుడు కీకటము అనే దేశమున బుద్ధుడు అనే పేరుతో అవతరించెను. 22వ అవతారము కలికి అవతారం. కలియుగం అంతమై తరువాత యుగం ప్రవేశించు సమయమున యుగ సంధ్యలో రాజులు చోరుల వలె అధర్మము నిండిన వారై లోకమును వంచించుడు చూచి వారిని అంతమొందించుటకు కలికి అను పేరుతో విష్ణు యశస్సునకు పుత్రుడుగా అవతరించును. ఈ విధముగా 22 అవతారములు చెప్పితినే గానీ అవతారములు అనంతములు. శ్రీహరి సత్వగుణం ప్రధానముగా గల కొన్ని రూపములను స్వయంగా ధరించియు కొందరు జీవులలో తాను అనుప్రవేశించియు ఆవేశించియు సాధు పరిత్రాణము ధర్మ సంస్థాపనము చేసినాడు. ఇట్టి అవతారములు అనంతములు. ఎన్నడూ ఇంకని సరస్సు నుండి వేలకొలది కాలువలు పారినట్లు శుద్ధ సత్వమూర్తియగు శ్రీహరి నుండి అనేక అవతారములు బయలు వెళ్ళినవి. మంత్ర దష్టులగు ఋషులు, ఆత్మ, పరమాత్మ యాధాత్మ మననము చేయు వశిష్టాదులగు మునులు, భగవత్ అనుభవ నిష్టులగు సుఖాదులు, ఇంద్రాది దేవతలు, ప్రియవ్రతాది ముని కుమారులు, మహా ప్రభావశాలురగు దక్షాది ప్రజాపతులు మొదలగు వారందరు. భగవానుడి యొక్క శ్రీహరి యొక్క అంశచే జన్మించిన వారే ఈ విధంగా భగవానుడే స్వయంగా అవతరించిన అవతారములు కొన్ని కొందరి జీవులలో అనుప్రవేశించి లోకమున సాధు పరిత్రాణమున నడిచిన అనుప్రవేశావతారములు కొన్ని తన ఆవేశముచో
ఆవేశముచే కొందరిని ప్రభావితులను చేసి ధర్మ సంస్థాపన చేయించిన ఆవేశావతారములు కొన్ని. భగవత్ అంశలచే జన్మించి లోకమున ధర్మ స్థాపన స్థాపించిన అవతారములు కొన్నియు కలవు. కానీ శ్రీకృష్ణావతారము, పూర్ణావతారము. మిగిలిన అవతారములన్నియు అంశావతారములు. అనుప్రవేశావతారములు మాత్రమే. జ్ఞాన, బల, శక్తి, ఐశ్వర్య, వీర్య, తేజస్సు అను ఆరు గుణములు, మిగిలిన కళ్యాణ గుణములు, దివ్య మంగళ విగ్రహ గుణములు పూర్ణముగా ప్రకాశించిన తరువాత వచ్చిన అవతారము కృష్ణావతారము. వరాహ, నారాయణ, మత్స్య, కూర్మ, నరసింహ, వామన, శ్రీరామ అవతారములు కూడా పూర్ణావతారములే. కానీ అన్నింటికంటే శ్రీకృష్ణావతారమున గుణప్రకాశము అధికమగుటచే ఇది పరిపూర్ణావతారము. ఇందుచే కృష్ణస్తు భగవాన్ స్వయం ఒక్కొక్క గుణమును మాత్రము ప్రకాశింపజేయు అవతారములు పరిపూర్ణావతారములు కావు. గుణప్రకాశమును బట్టి పూర్ణత్వము, పరిపూర్ణత్వము ఎరుంగబడును. తరువాత మిగతా భాగాన్ని మరో పాడ్కాస్ట్లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Gurus. Natha, the one with the lotus feet, the one who is always present, the one who is adorned with the lotus, the one who is worshiped by Indra, the one who is devoted to me, may I attain well-being. May the supreme time not prevail there. O Lord, the time that even Brahma and others are afraid of Though a shadow of it, it will not fall on you. Brahma, Sanaka, and others will bow to your lotus feet. In this world, we bow down to your lotus feet, which is the most excellent refuge for those who seek well-being. First Canto, Eleventh Chapter, Sixth Prayer. Dear relatives, welcome to the eighth podcast of the first book of Srimad Bhagavata Tattva Deepika. The eighth incarnation is Vrishabha. Nabhi was the son of Manu and the wife of Merudevi. The Lord came in the name of Vrishabha for both of them. He demonstrated the path of righteousness that yogis should follow. All the householders would bow to him. The ninth incarnation, the Vriddhu Rishis, after killing the Venu who was ruling unjustly, prayed to Bhagavan to grant them a ruler to govern the world. Then the Lord entered a being named Pruthuvu, accepted Pruthu's body, and ruled the world. Then that Prithu accepted the form of a cow and from the earth, he poured out the medicines. For that reason, Prithu is loved by everyone and is worthy of being respected. The tenth incarnation is the fish. In the deluge that came after the Chakshusha Manvantara, the Swami, assuming the form of a fish, made Vaivasvata Manu, who was about to be born as a boat tied to his horn, sit on the earth and protected Satyavrata. Matsya was the 10th avatar. The 11th incarnation is the tortoise. When the gods and demons churned the ocean for nectar, Mandara Parvata remained still, becoming a tortoise and holding its hips.
Dhanvantari is the 12th avatar. The Lord entered into the being with the name Dhanvantari, bestowing healing upon all living beings, and delivered the scriptures to the world. The 13th avatar is Mohini avatar. The nectar that emerged from the ocean, to prevent it from reaching the demonic forces that are destructive to the world, and to keep it eternally for the nourishing gods, he enchanted the demons and made the nectar available to the gods. Narasimha is the 14th avatar of the Hindu god. Bhagavanu, meaning the existence of God, tried to make Hiranyakashipu, who wanted to eliminate existence, like a weaver tearing mats with his nails, Prahlada, who lay down on his thighs, tearing and saying that Bhagavanu is in all substances He proved the vow he had made to be true. 15 The Vamana avatar. Conquering three worlds, with the pride that they are his, giving donations, performing sacrifices, and acting as if he is practicing righteousness. Acting, without shedding the ego and attachment, Indra took the worlds from the mighty king, the incarnation of Kusungina. Dharma done with ego and attachment is not dharma. Like dharma It is visible. As for me, because I practice dharma, the Lord, without harming Bali, became Vamana himself, begged, accepted the earth, and avenged his ego and possessiveness. He begged from him and granted Indra heaven and the empire of the three worlds. The 16th avatar is Parashurama. Kartaviryarjuna and other kings who betrayed the Brahma clan killed kings 21 times to reduce their royal nature and eradicate the royal element in the earth.
The 17th avatar is Badarayana. Parashurama, having a son to Satyavati, divided the Vedas into branches so that it would be easy for the men of low intellect. The 18th avatar is Lord Rama. Having killed Ravana and to fulfill the divine task, he was born as a human being and, to subdue the ocean, he performed many kinds of extremely human-like acts. Balarama and Krishna are 19th and 20th avatars of the Lord. Born among the Yadavas, Balarama and Srikrishna, with their names, removed the burden of the earth. The 21st avatar is Buddha. When the Kali Yuga began, for the delusion of the demons who hate the gods, the Lord incarnated in the country called Kikatamu with the name Buddha. The 22nd incarnation is Kali's incarnation. After the end of Kali Yuga, at the time of the entry of the next era, in the twilight of the era, kings, like thieves, filled with unrighteousness, seeing them deceive the world, to destroy them, in the name of Kalki, as the son of Vishnu's glory, he will incarnate. In this way, even if I tell 22 incarnations, the incarnations are infinite. Some people, having adopted certain forms that are primarily of the Sattva Guna (quality of goodness), He entered into living beings, he agitated, and he saved the sages and established Dharma. Such incarnations are endless. From the lake, countless canals flowed innumerable times, and many incarnations emerged from the pure, virtuous form of Srihari. Sages who are mantra-blind, the self, the supreme self, the sages who contemplate the self, the gods like Indra, the sons of the sage Priyavrata, All the great influential people like Daksha and others. Those who are born from the aspect of the Lord, Srihari, in this way, the incarnations that the Lord himself incarnated, some entered the lives of some beings, and some incarnations that walked in the world for the salvation of the saints, his passion
Some are the incarnations of passion who influenced some people and established righteousness. Born from the aspects of the divine, there are some incarnations who established dharma in the world. But the incarnation of Lord Krishna, the complete incarnation. The other avatars are all part avatars. The only ones that are entering are the ones that are supposed to be. Knowledge, strength, power, wealth, virility, radiance, these six qualities, the remaining auspicious qualities, divine auspicious idol qualities, the incarnation that came after shining fully is Krishna Avatar. Varaha, Narayana, Matsya, Kurma, Narasimha, Vamana, and Srirama avatars are also complete incarnations. But above all, because the manifestation of virtues is greater in the incarnation of Sri Krishna, this is a complete incarnation. Therefore, Krishna is the Lord himself, and the incarnations that illuminate each and every quality are not complete incarnations. Based on the manifestation of virtues, completeness, and perfection are understood. We'll hear the rest of the episode on another podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.